ఎయిర్ కెనడా ఫైల్ ఫోటో
ఒట్టావా: అంతర్జాతీయ విమానంలో స్మార్ట్‌ఫోన్ పేలిన సంఘటన ఆందోళన రేపింది. ఎయిర్ కెనడా విమానంలో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 266 మంది ప్రయాణీకులతో బోయింగ్ 787 జెట్ విమానం టొరంటోనుంచి వాంకోవర్ వెళ్లాన్సిన విమానంలో అకస్మాత్తుగా సెల్‌ఫోన్ పేలిపోయింది. అయితే సిబ్బంది అప్రమత్తతో తృటిలో పెద్ద ప్రమాదంనుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విమానాశ్రయం నుంచి మరికొద్దిసేపట్లో బయలుదేరుతుందనగా ఒక ప్రయాణీకురాలి సెల్‌ఫోన్ పేలింది. దీంతో విమానంలో మంటలు, నల్లని పొగలు వ్యాపించాయి. అయితే వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ కారణంగా విమానం రెండుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. విమానం గాలిలో ఉండగా పేలి ఉంటే పరిస్థితి ఏంటనే భయాందోళన తోటి ప్రయాణికుల్లో నెలకొంది. అరుపులు, కేకలు, పొగలు ఆసమయంలో తీవ్ర భయాందోళన నెలకొందంటూ సోషల్‌మీడియాలో తమ అనుభవాన్ని జో క్రెస్సీ షేర్ చేశారు. మరోవైపు గాయపడిన ప్రయాణికురాలిని ఆసుపత్రికి తరలించామని ఎయిర్ కెనడా అధికార ప్రతినిధి పీటర్ ఫిట్జ్ పాట్రిక్ చెప్పారు విమానానికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అయితే పేలిన ఫోన్ బ్రాండ్ తదితర వివరాలు మాత్రం వెల్లడికాలేదు.
I happened to be on the @AirCanada flight this morning where the cell phone fire incident occurred. The Air Canada staff were quick and professional in their response and the Pearson Fire crew were excellent. Thanks all around.
— Joe Cressy (@joe_cressy) March 1, 2018
Comments
Please login to add a commentAdd a comment