Air Canada flight
-
‘ఎయిర్ కెనడా’ విమానానికి తప్పిన ముప్పు
టొరంటో: ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. జూన్ 5న కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్ఆఫ్ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో చిన్న పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా విమానం రెక్కల వద్ద మంటలు లేచాయి. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్లు గాల్లోకి లేచిన 30 నిమిసాల్లోనే విమానాన్ని పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. పేలుడు జరిగి మంటలంటుకున్న సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 400 మంది దాకా ఉన్నారు. ఘటన జరిగినపుడు విమానంలో ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయి. మరోపక్క వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య విమానాన్ని సురక్షితంగా వెనక్కు మళ్లించి ల్యాండ్ చేసిన పైలట్లను అందరూ అభినందిస్తున్నారు. Superb work by the pilots and their air traffic controllers, dealing with a backfiring engine on takeoff. Heavy plane full of fuel, low cloud thunderstorms, repeated compressor stalls. Calm, competent, professional - well done!Details: https://t.co/VaJeEdpzcn @AirCanada pic.twitter.com/7aOHyFsR29— Chris Hadfield (@Cmdr_Hadfield) June 7, 2024 -
అన్నింటికీ చాట్‌బాట్ అంటే ఇలాగే ఉంటుంది.. తిక్క కుదిరిందిగా!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇప్పుడు చాలా కంపెనీలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లతో సంభాషించడానికి మానవ ప్రమేయం లేకుండా చాట్బాట్లను ( chatbot )ఉపయోగిస్తున్నాయి. అంటే కస్టమర్లు ఆయా కంపెనీలతో తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు చాట్బాట్లు సమాధానమిస్తాయి. ఇక్కడే చిక్కంతా వస్తోంది. చాట్‌బాట్ చేసిన తప్పునకు కెనడాకు ( Air Canada ) చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ కెనడా పరిహారం చెల్లించాల్సి వచ్చింది. సీబీసీ న్యూస్ కథనం ప్రకారం.. 2022లో జేక్ మోఫాట్ అనే వ్యక్తి టొరంటోలో తన అమ్మమ్మ మరణించినప్పుడు అంత్య క్రియలకు వెళ్లేందుకు విమోచన ఛార్జీలకు తనకు అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ఎయిర్ కెనడా విమానయాన సంస్థను సంప్రదించాడు. ఎయిర్ కెనడా సపోర్ట్ చాట్‌బాట్‌తో సంప్రదిస్తున్నప్పుడు, మోఫాట్ కూడా బీవ్మెంట్ ఛార్జీలను ముందస్తుగా మంజూరు చేస్తారా అని అడిగారు. ఆన్లైన్ ఫారమ్‌ను పూరించడం ద్వారా "మీ టిక్కెట్‌ను జారీ చేసిన తేదీ నుంచి 90 రోజులలోపు" వాపసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చాట్‌బాట్ మోఫాట్కి తెలిపింది. దీంతో బ్రిటిష్ కొలంబియా నివాసి అయిన మోఫాట్ టొరంటోలో తన అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేశాడు. అయితే ఆ తర్వాత అతను బీవ్మెంట్ ఛార్జీ, సాధారణ ఛార్జీల మధ్య వ్యత్యాసం వాపసు కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఎయిర్ కెనడా అతనికి పూర్తి ప్రయాణానికి బీవ్మెంట్ రేట్లు వర్తించవని తెలియజేసింది. దీనికి తాను తీసుకున్న చాట్‌బాట్ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను మోఫాట్ ఎయిర్ కెనడాకు షేర్ చేశారు. దీంతో నాలుక కరుచుకున్న ఎయిర్ కెనడా తమ చాట్‌బాట్ "తప్పుదోవ పట్టించే పదాలను" ఉపయోగించినట్లు అంగీకరించింది. సరైన సమాచారంతో బాట్‌ను అప్డేట్ చేస్తామని చెప్పింది. దీంతో మోఫాట్ ఎయిర్ కెనడాపై దావా వేశారు. దీంతో బాధితుడికి రావాల్సిన ఛార్జీల వ్యత్యాసం 650.88 కెనేడియన్ డాలర్లు (సుమారు రూ.40 వేలు)తోపాటు వడ్డీ 36.14 కెనేడియన్ డాలర్లు, ఫీజు 125 కెనేడియన్ డాలర్లు చెల్లించాలని ఎయిర్ కెనడాను సివిల్ రిజల్యూషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే చాట్‌బాట్ ప్రత్యేక చట్టపరమైన సంస్థ అని, దాని చర్యలతో తమకు సంబంధం లేదని ఎయిర్ కెనడా వాదిస్తోంది. -
Air Canada: కుటుంబీకున్ని కొట్టిన బాలుడు... దారి మళ్లిన విమానం
విన్నీపెగ్: ఎయిర్ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబసభ్యుడిని కొట్టడం ఆ విమానాన్ని దారి మళ్లించేందుకు దారితీసింది. విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయలుదేరాక గ్రాండ్ ప్రయరీస్కు చెందిన 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబానికే చెందిన ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. వారి గొడవను విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. గాయపడిన వ్యక్తికి సిబ్బంది చికిత్స అందించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. అనంతరం విమానాన్ని విన్నీపెగ్కు అధికారులు దారి మళ్లించి, ఆ బాలుడిని అధికారులకు అప్పగించారు. ఇదంతా పూర్తయ్యేవరకు దాదాపు మూడు గంటలపాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచి్చంది. అనంతరం ఆ విమానం గమ్య స్థానం వైపు బయలుదేరిందని ఎయిర్ కెనడా తెలిపింది. -
విమానంలో వికలాంగుడి పట్ల అమానుషం: కన్నీటి పర్యంతమైన జంట
న్యూఢిల్లీ: వికాలాంగుడన్న కనీస కనికరం లేకుండా విమానంలో దారుణంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. తమకు జరిగిన అవమానాన్ని తడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్న వివాహ వార్షికోత్సవ వేడుకల్లో తీరని మానసిక వేదనకు గురయ్యమాంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో చివరకు ఎయిర్ కెనడా క్షమాపణ చెప్పింది. బ్రిటిష్ కొలంబియాకు చెందిన హార్డ్‌వేర్ సేల్స్‌మ్యాన్ రోడ్నీ హాడ్జిన్స్ స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ బాధితుడు. వీల్ చెయిర్ లేనిదే కదలలేని స్థితి. అయితే ఆగస్టులో వివాహ వార్షికోత్సవ వేడుకుల కోసం ఎయిర్ కెనడాలో భార్య డీనాతో కలిసి లాస్ వెగాస్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా విమానం ల్యాండ్ అయినప్పుడు మోటరైజ్డ్ వీల్‌చైర్ కావాలని అడిగాడు. అయితే విమానం మళ్లీ టేకాఫ్‌కు సిద్ధం కావడానికి ముందు వీల్‌చైర్‌ను ఎక్కించుకోవడానికి సమయం లేదని ఫ్లైట్ అటెండెంట్ దంపతులకు ఖరాఖండీగా చెప్పేశారు. పైగా దిగాలంటూ తొందరపెట్టారు. దీంతో రోడ్నీ భార్య అతడిని బలవంతంగా రెండు కాళ్లు పట్టి ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. రోడ్నీ హాడ్జిన్స్ దంపతులు(ఫైల్ ఫోటో) ఈ విషయాన్ని డీన్నా హాడ్జిన్స్ ఇటీవలి ఫేస్బుక్ పోస్ట్ చేశారు. అందరూ చూస్తూ ఉండగానే దాదాపు 12 లైన్లకు వరకూ భర్త వీపుమీద జరుగుతూ ఉంటే, తాను రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటా వెళ్లాల్సి వచ్చిందని, దీంతో అతనికి వీపుపైన, కాళ్లకు గాయాలని చెప్పుకొచ్చారు. తనకూ వెన్నులో నొప్పి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో శారీరక బాధలతో పోలిస్తే.. తన భర్త హక్కులకు భంగం కలగడమే కాకుండా, తమకు తీరని మానసిక వ్యధను మిగిల్చిందంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. ఎనిమిదినెలలకు ప్లాన్ చేస్తున్న టూర్ అవమానకరంగా సాగిందని పేర్కొన్నారు. ఈ అమానుష ఘటనపై సోషల్ మీడియాలోఆగ్రహం వ్యక్త మైంది. దీంతో వెంటనే స్పందించిన ఎయిర్ కెనడా వారు హాడ్గిన్స్ దంపతులు క్షమాపణలు చెప్పి, తగిన నష్టపరిహారాన్ని కూడా అందించారు. పరిహారంతో సరా...?: రోడ్నీ హాడ్జిన్స్ పరిహారంతో సమస్య పరిష్కారం కాదంటూ వికలాంగ ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థ వ్యవహరించిన తీరుపై రోడ్నీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనేదే తన తాపత్రయమని చెప్పారు. -
5,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన..
టొరంటో : మహమ్మారి కరోనావైరస్ ప్రభావంతో ఎయిర్ కెనడా 5,000 మంది సిబ్బందిని తాత్కాలికంగా పనుల నుంచి తొలగించింది. ఏప్రిల్ 30 వరకూ లేఆఫ్స్ అమల్లో ఉంటాయని ఎయిర్ కెనడా పేర్కొంది. కాగా, పెద్దసంఖ్యలో ఎయిర్ కెనడా ఉద్యోగులను తొలగించడం విచారకరమని కెనడా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (సీయూపీఈ) ఆందోళన వ్యక్తం చేసింది. యూనియన్లతో చర్చించే ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్టు కంపెనీ పేర్కొంది. ఇక పరిస్థితులు మెరుగుపడిన అనంతరం తమ నెట్వర్క్ షెడ్యూల్‌ను ముమ్మరం చేసిన తర్వాత ఉద్యోగులు తిరిగి చురుకుగా తమ విధుల్లో పాల్గొంటారని తెలిపింది. డెడ్లీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 31 వరకూ దశలవారీగా రద్దు చేస్తామని అంతకుముందు ఎయిర్ కెనడా వెల్లడించింది. చదవండి : ఉద్యోగులకు వాల్‌మార్ట్ ఇండియా షాక్ -
విమానంలో మహిళను టాయిలెట్‌కు వెళ్లనీయకుండా..
బొగటా : కొలంబియాలో దారుణం జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళను ఘోరమైన వేధింపులకు గురి చేశారు సిబ్బంది. మూత్ర విసర్జన కోసం టాయిలెట్లోకి అనుమతి ఇవ్వలేదు. రెండు గంటల పాటు ప్రాధేయపడినా కనికరించలేదు. చివరకు తన సీటులోనే మూత్ర విసర్జన చేశారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆదే సీటులో ఆమెను కూర్చోబెట్టి 7 గంటల ప్రయాణం చేయించారు. ఈ దారుణ ఘటన కొలంబియాలోని బొగటాలో జరిగింది. గత నెలలో ఐర్లాండ్‌లోని డబ్లిన్ వెళ్లేందుకు ఓ 26 ఏళ్ల మహిళ కొలంబియా విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం ఎక్కారు. అయితే సాంకేతిక లోపం వల్ల ఆ విమానం రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో విమానంలో ఉన్న మహిళ మూత్ర విసర్జన కోసం టాయిలెట్‌కు వెళ్లబోయారు. విమాన సిబ్బంది టాయిలెట్లోకి అనుమతించలేదు. తనకు ఇబ్బందిగా ఉందని, త్వరగా టాయిలెట్‌కు వెళ్లాలని సిబ్బందిని ప్రాధేయపడినా కనికరించలేదు. టాయిలెట్లోకి వెళ్లేందుకు వెళ్లిన ప్రతిసారి ఆమెను అడ్డుకున్నారు. దీంతో చేసేది ఏమిలేక తాను కూర్చున సీటులోనే మూత్ర విసర్జన చేశారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆమెను అదే సిటులో కూర్చొబెట్టి 7గంటల ప్రయాణం చేయించారు. ఆమె కెనాడియన్ సీటీకి వెళ్లాక ఓ హోటల్‌కి వెళ్లి స్నానం చేసి దుస్తులు మార్చుకున్నారు. అనంతరం విమానాశ్రయానికి వెళ్లి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. తనను ఘోరంగా వేధించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు
వాంకోవర్ నుంచి సిడ్నీకి 296 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఒక్కసారిగా కొద్దిసెకన్లు కిందకు దూసుకెళ్లింది. దీంతో పెద్ద కుదుపులొచ్చాయి. సీటు బెల్టులు పెట్టుకోని ప్రయాణికులు పైకెగిరారు. వారి తలలు సీలింగ్‌కు కొట్టుకున్నాయి. మరికొందరు గాల్లో గింగిరాలు తిరిగారు. రెప్పపాటులో అంతా సద్దుమణిగింది. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి హొనలూలూకు తీసుకొచ్చారు. విమానం కుదుపులకు 35 మంది గాయపడ్డారు. ఎయిర్ కెనడాకు చెందిన ఏసీ33(బోయింగ్ 777–200) విమాన ప్రయాణికులకు గురువారం ఎదురయిందీ భయానక అనుభవం. ‘సీట్లలో కూర్చున్న వాళ్లం పైకెగిరి విమానం టాప్కు కొట్టుకున్నాం’ అని అనుభవాన్ని వివరించాడు జెస్ స్మిత్ అనే ప్రయాణీకుడు. విమానం 10,973 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఇది జరిగిందని ఫెడరల్ ఏవియేషన్ ప్రతినిధి తెలిపారు. -
విమానంలో సీలింగ్‌ను గుద్దుకున్న ప్రయాణీకులు
-
విమానంలో సీలింగ్‌ను గుద్దుకున్న ప్రయాణీకులు
మోన్‌ట్రియల్(కెనడా): ఎయిర్ కెనడా విమానంలో ఆస్ట్రేలియాకు వెళుతున్న ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపంతో విమానం కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు గాల్లోకి ఎగిరి పైకప్పును ఢీకొట్టారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దించాల్సి వచ్చింది. వివరాలు.. కెనడా నుంచి 269 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బందితో గురువారం సిడ్నీ వెళ్తున్న బోయింగ్ విమానంలో హవాయి రాష్ట్రం దాటిన తర్వాత సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు పై కప్పును గుద్దుకున్నారు. పైకెగిరి కింద పడటంతో 35 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. విమానం సీలింగ్ అక్కడక్కడా దెబ్బతిని వైర్లు బయటకు వచ్చాయి. ఊహించని పరిణామంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించి హోనోలులు విమానాశ్రయంలో సురక్షితంగా దింపారు. తదుపరి విమానం వచ్చేంతవరకు ప్రయాణికులందరికి ఎయిర్ కెనడా వసతి, భోజన సదుపాయాలను కల్పించింది. -
దింపినందుకు రూ.35 లక్షల జరిమానా
చండీగఢ్: ఓ మహిళను తన ఇద్దరు పిల్లలతో సహా విమానం దిగిపొమ్మన్నందుకు రెండు విమానయాన సంస్థలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రూ.35 లక్షలు చెల్లించాల్సిందిగా పంజాబ్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ జెట్ ఎయిర్వేస్, ఎయిర్ కెనడా సంస్థలను ఆదేశించింది. గత ఏడాది నవంబర్‌లో మినాలీ మిట్టల్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు, మూడేళ్ల కొడుకుతో కలసి కెనడాలోని టొరంటోకు బయల్దేరారు. తొలుత ఢిల్లీ వెళ్లేందుకు మొహాలీలోని చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్ ఎయిర్వేస్ విమానమెక్కారు. తర్వాత ఢిల్లీలో ఎయిర్ కెనడా విమానమెక్కారు. ఆ సమయంలో మినాలీ కూతురు తీషా తాళంవేసి ఉన్న వాష్‌రూం వద్ద చాలాసేపు ఆగి చివరకు వాంతి చేసుకుంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది అంటూ కేకలువేస్తూ మినాలీ, ఆమె కుమార్తె, కొడుకును విమానం నుంచి బలవంతంగా విమాన సిబ్బంది దింపేశారు. వారి లగేజీని ఢిల్లీ విమానాశ్రయంలో దించకుండా టొరంటోకు తీసుకెళ్లారు. -
విమానంలో పేలిన స్మార్ట్‌ఫోన్
ఒట్టావా: అంతర్జాతీయ విమానంలో స్మార్ట్‌ఫోన్ పేలిన సంఘటన ఆందోళన రేపింది. ఎయిర్ కెనడా విమానంలో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 266 మంది ప్రయాణీకులతో బోయింగ్ 787 జెట్ విమానం టొరంటోనుంచి వాంకోవర్ వెళ్లాన్సిన విమానంలో అకస్మాత్తుగా సెల్‌ఫోన్ పేలిపోయింది. అయితే సిబ్బంది అప్రమత్తతో తృటిలో పెద్ద ప్రమాదంనుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయం నుంచి మరికొద్దిసేపట్లో బయలుదేరుతుందనగా ఒక ప్రయాణీకురాలి సెల్‌ఫోన్ పేలింది. దీంతో విమానంలో మంటలు, నల్లని పొగలు వ్యాపించాయి. అయితే వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ కారణంగా విమానం రెండుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. విమానం గాలిలో ఉండగా పేలి ఉంటే పరిస్థితి ఏంటనే భయాందోళన తోటి ప్రయాణికుల్లో నెలకొంది. అరుపులు, కేకలు, పొగలు ఆసమయంలో తీవ్ర భయాందోళన నెలకొందంటూ సోషల్‌మీడియాలో తమ అనుభవాన్ని జో క్రెస్సీ షేర్ చేశారు. మరోవైపు గాయపడిన ప్రయాణికురాలిని ఆసుపత్రికి తరలించామని ఎయిర్ కెనడా అధికార ప్రతినిధి పీటర్ ఫిట్జ్ పాట్రిక్ చెప్పారు విమానానికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అయితే పేలిన ఫోన్ బ్రాండ్ తదితర వివరాలు మాత్రం వెల్లడికాలేదు. I happened to be on the @AirCanada flight this morning where the cell phone fire incident occurred. The Air Canada staff were quick and professional in their response and the Pearson Fire crew were excellent. Thanks all around. — Joe Cressy (@joe_cressy) March 1, 2018 -
సమయస్ఫూర్తి... ప్రాణాలు కాపాడింది!
న్యూయార్క్: వైద్యో నారాయణ హరి అన్న నానుడికి సార్థకత చేకూర్చాడో ఎన్నారై వైద్యుడు. సమయస్ఫూర్తితో రెండేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడాడు. సెప్టెంబర్ 18న స్పెయిన్ నుంచి అమెరికా వెళుతున్న ఎయిర్ కెనడా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్తమాతో బాధపడుతున్న రెండేళ్ల బాలుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఇన్ హేలర్ చెక్డ్ లాగేజీలో ఉండిపోవడంతో ఏం చేయాలో తల్లిదండ్రులకు పాలుపోలేదు. అదే విమానంలో ఉన్న డాక్టర్ ఖుర్షిద్ గురు సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుడు ప్రాణాలు కాపాడారు. వాటర్ బాటిల్, కప్పుతో అప్పటికప్పుడు ఇన్ హేలర్ తయారుచేసి బాలుడికి శ్వాస అందించారు. విమానంలో ఇన్ హేలర్ ఉన్నప్పటికీ అది పెద్దవాళ్లకు మాత్రమే పనికొస్తుంది. ఈ విషయం గ్రహించిన డాక్టర్ ఖుర్షిద్.. వాటర్ బాటిల్ ను ఒకవైపు కత్తిరించారు. మరోవైపు చిన్న రంధ్రం చేసి ఇన్ హేలర్ లోని ఆక్సిజన్ ను బాటిల్ లోకి ఎక్కించారు. దీన్ని బాలుడికి అందించారు. కత్తిరించిన భాగం నుంచి బాలుడికి ఆక్సిజన్ అందించారు. దాదాపు అరగంటపాటు ఈ ప్రక్రియ కొనసాగించి చిన్నారికి ఉపశమనం కలిగించారు. సమయస్ఫూర్తితో బాలుడిని కాపాడిన డాక్టర్ ఖుర్షిద్ ను అందరూ ప్రశంసించారు. జమ్మూకశ్మీర్ కు చెందిన డాక్టర్ ఖుర్షిద్.. న్యూయార్క్ లోని రాస్ వెల్ పార్క్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ లో రొబొటిక్ సర్జరీ విభాగంలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.