ఒట్టావా:ఈ ఏడాది ముగుస్తుందనగా వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మరో రెండు రోజుల్లో 2024కు వీడ్కోలు పలకనున్న సమయంలో శనివారం(డిసెంబర్28) రాత్రి దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు తప్ప మొత్తం 179 మరణించినట్లు తెలుస్తోంది. ల్యాండిగ్ గేర్ విఫలమవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు.
ఇదే తరహా భారీ విమాన ప్రమాదం కెనడాలో శనివారం రాత్రి తృటిలో తప్పింది. ఎయిర్‌కెనడాకు చెందిన విమానం హలిఫాక్స్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ గేర్ విఫలమై అత్యవసరంగా ల్యాండయింది. ల్యాండయ్యే సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పింది. దీంతో విమానం రెక్క రన్‌వేకు రాసుకుంటూ పోయి మంటలు లేచాయి.
🚨MOMENTS AGO: PLANE FULL OF PASSENGERS CRASH LANDS IN CANADA ⚠️ pic.twitter.com/AaEYJKDoyk
— Matt Wallace (@MattWallace888) December 29, 2024
అయితే ఎమర్జెన్సీ బృందాలు సత్వరమే స్పందించి మంటలార్పాయి. దీంతో ప్రాణ నష్టం తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే పెద్ద శబ్దం వచ్చిందని, భారీ ప్రమాదం జరిగి ఉంటుందనుకున్నామని ఓ ప్రయాణికుడు తెలిపారు.
కాగా, కొద్ది రోజుల క్రితమే కజకిస్తాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలి అందులోని ప్రయాణికుల్లో చాలా మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ జరిపిన కాల్పులే కారణమని ప్రచారం జరిగింది. తాజాగా పుతిన్ ఈ విషయమై క్షమాపణ కూడా చెప్పారు. అయితే విమాన ప్రమాదానికి తామే కారణమని రష్యా స్పష్టంగా ఎక్కడా ఒప్పుకోకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: ద.కొరియాలో విషాదం..179 మంది దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment