Landing
-
డిపోర్టేషన్‌కు అమృతసర్నే ఎందుకు?: పంజాబ్ సీఎం మాన్
చండీగఢ్: భారతీయ అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం కూడా అమృత్‌సర్‌లోనే ల్యాండవడంపై పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్ర నగరాన్ని డిపోర్ట్ సెంటర్‌గా మార్చవద్దని ఆయన కేంద్రాన్ని కోరారు. శనివారం రాత్రి అమెరికా నుంచి 119 మంది వలసదారులను తీసుకుని ప్రత్యేక విమానం రానున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశంలో వైమానిక కేంద్రాలు చాలానే ఉన్నాయని, వలసదారుల విమానాలను అక్కడికి కూడా పంపించ వచ్చని పేర్కొన్నారు. ఇక్కడి వారిని వాటికన్ సిటీకి పంపిస్తామంటే అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. మన వాళ్ల కోసం విమానాలను పంపుతామని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పాలని సూచించారు. ఇతన దేశాలు ఇలాగే చేస్తున్నాయన్నారు. -
స్విస్ విమానంలో పొగలు.. అత్యవసర ల్యాండింగ్
జ్యూరిచ్:గత వారం తమ సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇంజిన్‌లో లోపం కారణంగా విమానంలో పొగలు వచ్చాయని ఈ ఘనటనలో ఆస్పత్రి పాలైన విమాన సిబ్బంది ఒకరు మృతి చెందారని వెల్లడించింది. ఈమేరకు ఎయిర్‌లైన్స్ సీఈవో మీడియాతో మాట్లాడారు.‘బుకారెస్ట్ నుంచి జ్యూరిచ్ వెళుతుండగా మా ఎయిర్‌బస్ ఎ220 విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే విమానాన్ని గ్రాజ్ నగరంలో అత్యవసర ల్యాండింగ్ చేశాం. విమానంలో పొగలు రావడం వల్ల అస్వస్థతకు గురైన ప్రయాణికులు,సిబ్బందిని ఆస్పత్రిలో చేర్చాం. వీరిలో మా సిబ్బంది ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందడం షాక్‌కు గురిచేసింది’అని స్విస్ ఎయిర్‌లైన్స్ సీఈవో ఫెలింగర్ తెలిపారు. సాంకేతిక లోపం ఏర్పడినపుడు విమానంలో 74 మంది ప్రయాణిస్తున్నారు. పొగల కారణంగా సిబ్బంది సహా మొత్తం 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇదీ చదవండి: విమానంలో ఏ సీటు భద్రం -
ద.కొరియా: మరో విమానానికి తప్పిన ప్రమాదం
సియోల్:సౌత్‌కొరియాలో ఘోర విమాన ప్రమాదం మరువకముందే మరో విమానానికి పెద్ద గండం తప్పింది. ఈ విమానం కూడా ఆదివారం 179 మంది ప్రాణాలను బలిగొన్న జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందినదే కావడం గమనార్హం. జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన సోమవారం(డిసెంబర్30) ఉదయం సియోల్‌లోని గింపో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయింది.టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని పైలట్ వెంటనే గుర్తించాడు. దీంతో విమానాన్ని తిరిగి గింపో విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు. అయితే ఈ విమానానికి కూడా ల్యాండింగ్ గేర్ సమస్యనే వచ్చినట్లు తెలుస్తోంది.కాగా, ఆదివారం సౌత్కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో విమానం క్రాష్ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 181 మందిలో ఇద్దరు తప్ప అందరూ దుర్మరణం పాలయ్యారు. జెజు ఎయిర్‌లైన్స్‌కు సామాన్యులకు అందుబాటు ధరల్లో విమానాలు నడిపే బడ్జెట్ ఎయిర్‌లైన్ కంపెనీగా పేరుంది.ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు -
కెనడాలో విమాన ప్రమాదం..రన్‌వేపై మంటలు
ఒట్టావా:ఈ ఏడాది ముగుస్తుందనగా వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మరో రెండు రోజుల్లో 2024కు వీడ్కోలు పలకనున్న సమయంలో శనివారం(డిసెంబర్28) రాత్రి దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు తప్ప మొత్తం 179 మరణించినట్లు తెలుస్తోంది. ల్యాండిగ్ గేర్ విఫలమవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఇదే తరహా భారీ విమాన ప్రమాదం కెనడాలో శనివారం రాత్రి తృటిలో తప్పింది. ఎయిర్కెనడాకు చెందిన విమానం హలిఫాక్స్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ గేర్ విఫలమై అత్యవసరంగా ల్యాండయింది. ల్యాండయ్యే సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పింది. దీంతో విమానం రెక్క రన్‌వేకు రాసుకుంటూ పోయి మంటలు లేచాయి. 🚨MOMENTS AGO: PLANE FULL OF PASSENGERS CRASH LANDS IN CANADA ⚠️ pic.twitter.com/AaEYJKDoyk— Matt Wallace (@MattWallace888) December 29, 2024అయితే ఎమర్జెన్సీ బృందాలు సత్వరమే స్పందించి మంటలార్పాయి. దీంతో ప్రాణ నష్టం తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే పెద్ద శబ్దం వచ్చిందని, భారీ ప్రమాదం జరిగి ఉంటుందనుకున్నామని ఓ ప్రయాణికుడు తెలిపారు.కాగా, కొద్ది రోజుల క్రితమే కజకిస్తాన్‌లో అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలి అందులోని ప్రయాణికుల్లో చాలా మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ జరిపిన కాల్పులే కారణమని ప్రచారం జరిగింది. తాజాగా పుతిన్ ఈ విషయమై క్షమాపణ కూడా చెప్పారు. అయితే విమాన ప్రమాదానికి తామే కారణమని రష్యా స్పష్టంగా ఎక్కడా ఒప్పుకోకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: ద.కొరియాలో విషాదం..179 మంది దుర్మరణం -
స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు
పట్నా/చెన్నై: సాంకేతిక లోపాలు తలెత్తడంతో సోమవారం స్పైస్‌జెట్‌కు చెందిన రెండు విమానాలను అధికారులు దారి మళ్లించారు. వీటిలో ఒకటి ఢిల్లీ–షిల్లాంగ్ సరీ్వసు కాగా, మరోటి చెన్నై–కోచి విమానం. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి షిల్లాంగ్‌కు టేకాఫ్ తీసుకున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. అధికారుల సూచనల మేరకు ఉదయం8.52 గంటల సమయంలో పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. అదేవిధంగా, చెన్నై నుంచి కోచికి 117 మంది ప్రయాణికులతో టేకాఫ్ తీసుకున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, విమానాన్ని తిరిగి చెన్నై విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేశామని అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. -
చల్లని రాజా ఓ చందమామా
చందమామ రావే... జాబిల్లి రావే.. అని ఎంత పిలిచినా దగ్గరకు రాని చందమామ దగ్గరకు మనిషే వెళ్లాడు. జూలై 20, 1969 నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి పై కాలు మోపిన రోజు.అతడే చెప్పినట్టు అది ‘మానవ జాతి ముందంజ’.అయినా సరే... నేటికీ చందమామ ఒక నిగూఢ దీపం. రహస్యాల మయం.మానవజాతికి ఈ రేరాజు ఆత్మీయుడు,అందమైన స్నేహితుడు, ప్రియతముడు, మేనమామ. అతని చుట్టూ ఎన్నో కథలూ గాథలూ కల్పనలు. నేడు ‘ఇంటర్నేషనల్ మూన్ డే’. కాబట్టి శశికాంతుని సంగతులు కొన్ని...కుందేలు ఇలా వచ్చిందట!చంద్రుడిపై కుందేలు అనేది అందమైన అబద్ధమైనా అది మనకు అమితంగా ఇష్టమైన అబద్ధం! అసలు మన కుందేలు అక్కడెక్కడో ఉన్న చంద్రుడిపైకి ఎలా చేరింది? ప్రపంచ వ్యాప్తంగా పాచుర్యంలో ఉన్న ఒక నమ్మకం ప్రకారం.... బుద్ధుడు ఊరూరూ తిరిగి, బోధనలు చేసి అలిసిపోయాడు. ఆకలితో ఉన్నాడు. ఇది గమనించిన జంతువులు తమకు తోచిన పరిధిలో బుద్ధుడు తినడానికి రకరకాల పదార్థాలు తీసుకువచ్చాయి. పాపం! ఒక కుందేలు దగ్గర మాత్రం ఏమీ ఉండదు. ‘నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి’ అంటూ మంటల్లో దూకి చనిపోతుంది కుందేలు. కుందేలు ఆత్మత్యాగానికి చలించిన బుద్ధుడు దానికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. చంద్రుడిపై ఉండి కనువిందు చేసేలా వరమిస్తాడు.మూడుసార్లు పుట్టాడు...ఎవరైనా సరే ఒక్కసారే పుడతారు. పురాణాల ప్రకారం చంద్రుడు మాత్రం మూడుసార్లు పుట్టాడు. అందుకే చంద్రుడిని త్రిజన్మి అని కూడా అంటారు. చంద్రుణ్ణి మొదటిసారి బ్రహ్మ సృష్టించాడు. రెండోసారి అత్రి మహర్షి కన్నుల నుంచి ఉద్భవించాడు. రాక్షసులు, దేవతల క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు చంద్రుడు పునర్జన్మ పొందాడు.డస్ట్‌బిన్ కాదు...మనిషంటేనే నిరంతరం చెత్తను పారబోస్తుండే జీవి. అతడా చెత్త వేయడానికి భూగ్రహం సరి΄ోక చంద్రుని మీదా బోలెడంత ΄ారబోస్తున్నాడు. పనికి రాకుండా పోయిన రోవర్లూ, విఫలమైన రాకెట్లూ, పంపిన ఉపగ్రహాలూ, ఆస్ట్రొనాట్ల బూట్లూ, బ్లాంకెట్లూ ఇలాంటివెన్నో అక్కడ. అంతరిక్ష ప్రయాణికులు బ్యాగుల్లో ΄ోసి అక్కడ ΄ారబోసిన యూరిన్ బ్యాగులే 100కు పైగా ఉన్నాయక్కడ. ఇలా ఇప్పటివరకూ చంద్రుడి మీద మనిషి పారబోసిన చెత్త బరువు ఎంతో తెలుసా? అక్షరాలా 2,27,000 కిలోలు.చంద్రపాలుమనకు భూకంపాలలాగే చంద్రుడి మీదా చంద్రకం΄ాలు వస్తుంటాయి. ఇంగ్లిషులో మూన్‌క్వేక్స్. ఇవి మళ్లీ నాలుగు రకాలు. చాలా లోతుగా వచ్చేవి డీప్ క్వేక్స్, ఉల్కలేవైనా చంద్రుణ్ణి ఢీకొడితే వచ్చేవి మీటియోరైట్ ఇంపాక్ట్స్, సూర్యుడి ఉష్ణోగ్రతతో వచ్చేవి థర్మల్ క్వేక్స్... ఇవి మూడూ ఒకరకం. కానీ ‘షాలో మూన్ క్వేక్స్’ మాత్రం చాలా భయంకరం. భూకంపం సెకన్లపాటు కొనసాగితేనే మహా ఉత్పాతం కదా... కానీ చంద్రకంపం దాదాపు పదినిమిషాలు మొదలుకొని అరగంట ΄ాటూ అదేపనిగా వస్తుంది.లూనార్ స్మెల్...చంద్రునికో వాసన కూడా ఉంటుంది. దాన్నే ‘లూనార్ స్మెల్’ అంటారు. అక్కడ వాతావరణం ఉండదు. అప్పుడు స్మెల్ ఎలా అనే అనుమానం రావచ్చు. అ΄ోలో–11కు చెందిన ఆస్ట్రొనాట్స్అందరి స్పేస్ సూట్లకు అంటుకుపోయి ఒకేలాంటి వాసన కొట్టడంతో ఈ విషయం తెలిసొచ్చింది. ఘాటైన మెటాలిక్ స్మెల్లాగా. క్రాకర్స్ కాలిపోయాక బాగా మండిన గన్΄ûడర్లా ఉండే వాసన ఇదంటూ ఖచ్చితంగా తెలిపినవాడు హరిసన్ జాక్ స్మిత్ అనే అపోలో–17 కు చెందిన సైంటిస్ట్ ఆస్ట్రొనాట్.ఆఖరి మజిలీ...΄ాపం... అప్పుడప్పుడూ అతడు శశికాంతుడా శ్మశానమా అనే డౌటు కూడా వస్తుంటుంది. చంద్రుడి మీద తమ చితాభస్మం పడాలని చాలా మంది భూలోక వాసుల కోరిక. అందుకే 450 బీసీ కాలం నుంచే కొందరు తమ చితాభస్మాన్ని చంద్రుడి మీద పడేలా ఎత్తైన ప్రదేశం నుంచి ఆకాశంలోకి విసిరేయమని వీలునామా రాసేవారు. యూజీన్ షూమాకర్ అనే ఆస్ట్రొనాట్కు చంద్రుని మీదకు వెళ్లాలని కోరిక. అయితే అతడు ఓ శారీరక లోపం కారణంగా చంద్రుణ్ణి చేరలేక΄ోయాడు. కానీ ఏనాటికైనా చంద్రుణ్ణి చేరాలన్న అతడి కోరిక నెరవేరకుండానే కారు యాక్సిడెంట్‌కు గురై 1997 లో మరణించాడు. అతడి కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్న నాసా... అతడి భార్య, పరిశోధనల్లో సహచరి అయిన కరోలిన్ దగ్గర్నుంచి అనుమతి తీసుకుని లూనార్ ్రపాస్పెక్టర్ అనే ఉపగ్రహోపకరణంతో చంద్రుడిపైన దక్షిణ ధ్రువంలోని ఓ క్రేటర్‌లోకి సమాధయ్యేలా చితాభస్మాన్ని జల్లి 1998లో అతడి కోరిక తీర్చారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ లాంటివాళ్లు తమ స్పేస్ ఎక్స్‌తో 2019లో 152 మంది చితాభస్మాల్ని అంతరిక్ష వైతరణిలో నిమజ్జనం చేశారు.మూన్ డస్ట్ ఫీవర్ప్రస్తుతానికి ఎవరు పడితే వారు ఎప్పుడంటే అప్పుడు వెళ్లడానికి చంద్రుడేమీ పిక్నిక్ స్పాట్ కాదు. మామూలు వ్యక్తులు చంద్రుడి మీదకి వెళ్లడం సాధ్యం కాదు. అక్కడ ఉండే దుమ్మూధూళికి మూన్ డస్ట్ అని పేరు. అది పీల్చడం ఎంతో ప్రమాదకరం. స్పేస్ సూట్ తొడుక్కుని వెళ్లినా బట్టల్లోకి చేరిపోతుంది. అది ‘లూనార్ హే ఫీవర్’ అనే సమస్యకు దారితీస్తుంది. దీన్నే మూన్ డస్ట్ ఫీవర్ అని కూడా అంటారు.ధారాసింగ్ ముందే అడుగు పెట్టాడు‘ఇదెలా సాధ్యం!’ అనుకోవద్దు. సినిమాల్లో ఏదైనా సాధ్యమే కదా! విషయంలోకి వస్తే....1967లో హిందీలో ‘చాంద్ పర్ చడాయి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా లో ప్రఖ్యాత రెజ్లర్ ధారాసింగ్ వ్యోమగామి ఆనంద్ ΄ాత్రలో నటించాడు. తన అసిస్టెంట్ ‘భాగు’తో కలిసి చంద్రుడిపై అడుగు పెట్టిన ఆనంద్ అక్కడ మాన్స్టర్లతో వీరోచితంగా ΄ోరాడుతాడు. ఈ ఫైటింగ్ విషయం ఎలా ఉన్నా ‘చంద్రయాన్’ లాంటి సందర్భాలలో ఈ సినిమాలోని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో ΄ోస్ట్ చేస్తుంటాడు అతడి కుమారుడు విందు ధారాసింగ్. -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో భారీ వర్షం.. ల్యాండింగ్‌కు అంతరాయం
సాక్షి,కృష్ణాజిల్లా: గన్నవరం విమానాశ్రయంలో సోమవారం(జులై 15) భారీ వర్షం పడింది. వర్షం కారణంగా విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. వర్షం కారణంగా ల్యాండింగ్‌కు ఏటిసి అధికారులు అనుమతి ఇవ్వపోవడంతో పైలట్ విమానాన్ని కొద్దిసేపు గాల్లోనే తిప్పాల్సి వచ్చింది. -
పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/సాక్షి, బెంగళూరు: గతంతో పోలిస్తే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని వరసగా మూడోసారీ విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ఆదివారం ప్రకటించింది. రీ యూజబుల్ లాంఛ్ వెహికల్(ఆర్ఎల్వీ) అభివృద్ధిలో సంక్లిష్టమైన సాంకేతికతను ఇస్రో సముపార్జించిందని ఈ ప్రయోగం మరోసారి నిరూపించింది. ఆకాశం నుంచి కిందకు విడిచిపెట్టాక గమ్యం దిశగా రావడం, ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం, వేగంగా ల్యాండ్ అవడం వంటి పరామితులను పుష్పక్‌గా పిలుచుకునే ఈ ఆర్ఎల్వీ ఖచి్చతత్వంతో సాధించిందని ఇస్రో ఆదివారం పేర్కొంది. ల్యాండింగ్ ఎక్స్పరిమెంట్(ఎల్ఈఎక్స్–03) సిరీస్‌లో మూడోది, చివరిదైన ఈ ప్రయోగాన్ని ఆదివారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఇస్రో వారి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో జరిపారు. మొదట పుష్పక్‌ను భారత వాయుసేకు చెందిన చినూక్ హెలికాప్టర్లో రన్‌వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. అది సరిగ్గా రన్‌వే వైపు ఖచి్చతత్వంతో దూసుకొచ్చి అతి గాలులున్న ప్రతికూల వాతావరణంలోనూ సురక్షితంగా ల్యాండ్ అయింది. తక్కువ ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టడం వల్ల ల్యాండింగ్ సమయంలో దాని వేగం గంటకు 320 కి.మీ.లు పెరిగింది. సాధారణంగా ల్యాండింగ్ జరుగుతున్నపుడు వాణిజ్య విమానం గంటకు 260 కి.మీ.లు, యుద్ధవిమానమైతే గంటకు 280 కి.మీ.ల వేగంతో ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ కాగానే బ్రేక్ పారాచూట్ విచ్చుకోవడంతో పుష్పక్ వేగం గంటకు 100 కి.మీ.లకు తగ్గిపోయింది. ల్యాండింగ్ గేర్ బ్రేకులు వేయడంతో పుష్పక్ ఎట్టకేలకు స్థిరంగా ఆగింది. పుష్పక్ స్వయంచాలిత రడ్డర్, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థలను సరిగా వాడుకుందని ఇస్రో పేర్కొంది. -
ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
ఐదేళ్ల జగన్ పాలనలో 4 పోర్టులకు పునాది... ⇒ ప్రారంభానికి సిద్ధంగా రామాయపట్నం పోర్టు... ⇒మిగిలినవీ శరవేగంగా నిర్మాణం... ⇒10 ఫిషింగ్ హార్బర్లు... 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ⇒ వీటన్నిటికీ రూ.25,000 కోట్ల వ్యయం... ⇒పోర్టుల పక్కనే పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్ పార్కులు ⇒ 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది జాలరులకు లబ్ధి ⇒రూ.9000 కోట్ల మేర పెరగనున్న జీడీపీ -
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
చాలామంది తమకు ఇష్టమైన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగం పొందేందుకు ఎంతో కష్టపడతారు. ఆ క్రమంలో ఒక్కోసారి ఫెయిల్యూర్స్ వస్తుంటారు. తమ తోటి వాళ్లు సెలెక్ట్ అవుతున్న వీళ్లు మాత్రం పెయిల్ అవ్వుతూనే ఉండటంతో వెంటనే తమని తాము నిందించుకుంటూ ప్రయత్నాలు విరమించుకుంటుంటారు. అలాంటి వారికి గూగుల్‌లో పనిచేస్తున్న ఓ ఇంజినీర్ ఆసక్తికరమైన సలహాలు సూచనలు ఇస్తోంది. ఐతే ఇక్కడ ఆమె కూడా అంత ఈజీగా ఈ కంపెనీలో ఉద్యోగం పొందలేదట.ఆమె పేరు క్విన్గ్యూ వాంగ్. గూగుల్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఆమె కొత్తగా ఉద్యోగాల కోసం సర్చ్ చేయాలనుకునేవాళ్లు ముందు ఇలాంటి పనులు చేయకూడదంటూ..తన అనుభవాలను గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాన్వేషణలో మిమ్మల్ని తక్కువ చేసుకుని నిందించుకోవడం వంటివి చేస్తారు. ఇదే ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం అని అంటోంది. తాను కూడా ఉద్యోగ అన్వేషణలో ఇలానే చేసి ఒకటి రెండు కాదు ఏకంగా ఐదుసార్లే ఫెయిల్ అయినట్లు చెప్పుకొచ్చింది. తాను తొలిసారిగా 2018లో గూగుల్‌లో ఉద్యోగం కోసం ట్రై చేశానని, ఆ టైంలో ఆన్లైన్ అసాస్మెంట్ (ఓఏ) రౌండ్లోనే పోయిందని చెప్పింది. అయితే ఇంటర్వ్యూర్ నాకు మరో అవకాశం ఇచ్చారు గానీ దురదృష్టవశాత్తు ఆ అవకాశం కూడా వినయోగించుకోలేకపోయా. మళ్లీ మూడోసారి అదే కంపెనీలో తన ప్రయత్నం 2020లో ప్రారంభమయ్యింది. అందులో కూడా ఫోన్ స్క్రీన్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో సైట్ రిలయబిలిటీ ఇంజీనీర్ రిక్రూట్మెంట్కి దరఖాస్తు చేశా నాలుగో రౌండ్లో మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చినా..సరిగ్గా మహమ్మారి కావడంతో ఆ ఇంటర్వ్యూని క్యాన్సిల్ చేసింది. ఇక ఐదో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించడమే గాక టెక్ దిగ్గజం నుంచి అభినందనల తోపాటు ఉద్యోగం సంపాదించటం చాలా కష్టం అని వ్రాసిన పేపర్‌ను కూడా అందుకుంది వాంగ్. ఎట్టకేలకు వాంగ్ ఐదో ప్రయత్నంలో తాను కోరుకున్నట్లుగా సాప్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించింది. అందుకు సంబంధించిన కాగితాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ఉద్యోగాన్వేషణ ప్రక్రియ అంత సులువు కాదనీ, కష్టపడి లక్ష్యాన్ని అందుకోవాలని అంది. ఆ క్రమంలో ఓటమి ఎదురైనా ప్రతిసారి మిమ్మల్ని నిందించుకోవడం లేదా అవమానంగా భావించడం మానేయాలని చెబుతోంది. ఎన్ని తిరస్కరణలు ఎదురైనా.. ప్రయత్నం విరమించకుండా అనుకున్నది సాధించాలని అంటోంది వాంగ్. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమేగాక లక్షకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి.(చదవండి: అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!) -
విమానం ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలి?
ఈ రోజుల్లో చాలామంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో విమాన ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అయితే విమాన ప్రయాణం చేసేటప్పుడు పలు నిబంధనలు పాటించాలని ఎయిర్ హోస్టెస్‌లు చెబుతుంటారు. విమాన ప్రయాణంలో ధూమపానం చేయకూడదు, సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇలాంటి నిబంధనలలో ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్‌ను మూసివేయాలని కూడా చెబుతారు. అయితే ఇలా ఎందుకు చేయాలి? ట్రే టేబుల్ మూసివేయకపోతే ఏమైనా జరుగుతుందా? ఎయిర్ హోస్టోస్ హన్నా టెస్సన్(23) అమెరికాలోని కొలరాడోలో ఉంటున్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలనే విషయాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రయాణికులు తాము చెప్పే సూచనలను పాటించనప్పుడు కోపం వస్తుందని అన్నారు. ప్రయాణీకులు టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ మూసివేయాలని చెప్పినా, వెంటనే అమలు చేయరని ఆమె తెలిపారు. ఇలాంటి ఈ నిబంధనలను విమాన ప్రయాణికులు తప్పని సరిగా తెలుసుకోవాలని ఆమె అన్నారు. హన్నా తెలిపిన వివరాల ప్రకారం.. విమాన ప్రమాదాలు చాలావరకూ ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ఓపెన్ ట్రే టేబుల్ కారణంగా ప్రయాణికులు గాయపడే అవకాశముంది. అందుకే ట్రే టేబుళ్లను మూసి వేయాలని ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్‌లు చెబుతుంటారు. ఆహారం అందించడం ఒక్కటే తమ పని కాదని, ప్రయాణికుల భద్రతను చూడటం కూడా తమ పనే అని హన్నా తెలిపారు. విమానం టేకాఫ్ చేయడానికి ముందు విమానంలోని భద్రతా పరికరాలను తనిఖీ చేస్తామని, అంతే కాకుండా ప్రయాణికుల వింత ప్రవర్తనపై కూడా నిఘా ఉంచుతామన్నారు. ఎవరైనా ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
గన్నవరం: పొగమంచు ఎఫెక్ట్.. గాల్లోనే విమానాల చక్కర్లు
సాక్షి,కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు ఎఫెక్ట్‌తో విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం పది రౌండ్లు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించకపోవడంతో విమానం హైదరాబాద్ వైపు మళ్లింది. పొగమంచు కారణంగా రన్ వే కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు ఆలస్యం అవుతోంది. దీంతో విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తరచు అంతరాయం ఏర్పడుతోంది. ఇదీ చదవండి.. మిలాన్ విన్యాసాలు ప్రారంభం -
Moon Sniper: జపాన్ ల్యాండరుకు శ్రద్ధాంజలి
అవరోహణలో అదుపు తప్పి వేగంగా కిందికి దూసుకెళ్లలేదు. పట్టు తప్పి ధడేల్మని పడిపోలేదు. కూలిపోలేదు... ధ్వంసమవలేదు. చంద్రుడి ఉపరితలంపై దిగడానికైతే సాఫీగానే దిగింది ‘స్లిమ్’ ల్యాండర్. కానీ... తూలిపోయింది! తన ఐదు కాళ్లపై తాను సొంతంగా నిలబడలేకపోయింది. స్వతంత్రంగా నిలదొక్కుకోలేకపోయింది. షియోలీ బిలం వాలులో కిందికి దిగగానే దొర్లి తల కిందికి పెట్టి కాళ్లు పైకెత్తింది. శీర్షాసనం భంగిమలో ఉండిపోయింది. ‘మూన్ స్నైపర్’ దిగీ దిగగానే నెమ్మదిగా పూవు రెక్కల్లా విచ్చుకుని ఆకాశంలోని సూర్యుడిని చూస్తూ కరెంటు తయారుచేసి శక్తినివ్వాల్సిన ల్యాండర్ పై భాగంలోని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్).. ల్యాండర్ తలకిందులవటంతో జాబిలి నేలవైపు ఉండిపోయాయ్. సౌరశక్తి అందే మార్గం మూసుకుపోయింది. ఇక.. ‘స్లిమ్’ ల్యాండరులోని ఆన్‌బోర్డ్ (ఇన్ బిల్ట్) బ్యాటరీ కొన్ని గంటలు పనిచేసి ఈపాటికి ‘డెడ్’ అయివుంటుంది. ‘మూన్ స్నైపర్’ తనంతట తాను పైకి లేచి నిటారుగా నిలబడే ఏర్పాటు, అవకాశం లేవు. అంటే... పవర్ కోల్పోయిన ల్యాండర్ ఈసరికే మూగబోయి శాశ్వత నిద్రలోకి జారుకుని వుంటుంది. మిషన్ కథ ఇక ఇక్కడితో పరిసమాప్తం. జపాన్ సాధించింది పరిపూర్ణ విజయమా? పాక్షిక విజయమా? కనీస విజయమా? అని ప్రశ్న వేసుకుంటే... అది తన ప్రయత్నంలో విఫలం మాత్రం కాలేదనే చెప్పాలి. తమ ‘స్లిమ్’ వ్యోమనౌక అధ్యాయం ముగిసిందనే వార్తను జపాన్ అంతరిక్ష సంస్థ ఈ రోజు కాకపోతే రేపైనా, కొంచెం ఆలస్యంగానైనా అటు స్వదేశంలోనూ, ఇటు బాహ్య ప్రపంచానికి అధికారికంగా ప్రకటించాల్సివుంటుంది. సరిగ్గా తన ల్యాండింగ్ సమయంలో చంద్రుడి మీదికి ‘మూన్ స్నైపర్’ జారవిడిచిన రెండు (LEV-1 & 2) లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్స్... భూమికి ఏం సమాచారం ప్రసారం చేశాయో పరిశీలించాల్సివుంది. దిగేటప్పుడు ల్యాండరును ఈ జంట రోవర్లు తీసిన చిత్రాలు, వీడియో వెల్లడికావలసివుంది. జంట రోవర్లు పంపిన డేటాను ప్రాసెస్ చేశాక ‘జాక్సా’ ఏం చెబుతుందో వేచిచూద్దాం. -జమ్ముల శ్రీకాంత్ చదవండి: అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు! -
గురి తప్పని జపాన్. బుల్లెట్ దింపిన మూన్ ‘స్నైపర్’!
టోక్యో: తమ మానవరహిత అంతరిక్ష నౌక చంద్రమండలంపై దిగిందని జపాన్ అంతరిక్ష సంస్థ తెలిపింది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్(స్లిమ్) చంద్రుడి ఉపరితలంపై ఉదయం 12.20 గంటల సమయంలో దిగిందని పేర్కొంది. తాజా విజయంతో చంద్రుడిపైకి విజయవంతంగా అంతరిక్ష నౌకను పంపిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది. అయితే.. ఆపరేషన్ సక్సెస్... కానీ పేషెంట్ డెడ్? చంద్రుడిపై సాఫీగానే దిగిన జపాన్ ‘మూన్ స్నైపర్’. భూమ్మీది గ్రౌండ్ స్టేషనుతో సంబంధాలూ బాగానే ఉన్నాయ్. చావు కబురు చల్లగా తెలిసిందేమంటే... ల్యాండరులోని సౌరఘటాలు (సౌరఫలకాలు/సోలార్ ప్యానెల్స్) పనిచేయడం లేదట. అవి విద్యుదుత్పత్తి చేయడం లేదట. ప్రస్తుతం ‘స్లిమ్’ తన సొంత బ్యాటరీపైనే ఆధారపడుతోంది. ల్యాండర్ డేటా భూమికి ప్రసారమయ్యేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ‘జాక్సా’ సిబ్బంది. ‘స్లిమ్’ సొంత బ్యాటరీలో శక్తి అయిపోతే, ఈలోగా సౌరవిద్యుత్ అందుబాటులోకి రాకుంటే... ల్యాండర్ చెల్లుకున్నట్టే! మిషన్ సఫలమా? విఫలమా? అనే విషయం పక్కనపెడితే... ‘మూన్ స్నైపర్’ ల్యాండింగులో జపాన్ వాడిని మెచ్చుకుని తీరాల్సిన అంశం ఒకటుంది. “రాజీపడి ఎక్కడపడితే అక్కడో, సులభంగా ఎక్కడో ఒకచోటనో దింపే టైపు కాదు జపాన్ వాడు. ఎక్కడ దిగాలనుకుంటాడో వాడు అక్కడే దిగుతాడు”. సాధారణంగా చంద్రుడిపై దిగే ల్యాండర్లు, రోవర్లు శాస్త్రవేత్తలు ముందుగా నిర్దేశించిన ప్రాంతంలో సుమారు 10 కిలోమీటర్ల వైశాల్యంలో వీలునుబట్టి, సురక్షితం అనుకున్న ఎక్కడో ఒకచోట దిగుతాయి. మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండరుకు సైతం ఇస్రో 4 కి.మీ. X 2.4 కి.మీ. విస్తీర్ణమున్న ప్రదేశాన్ని ఎంపిక చేసింది. అంటే... అంత పెద్ద ఏరియాలో అది ఎక్కడో ఒకచోట దిగిందన్నమాట. కానీ ఇప్పుడు జపాన్ అలా కాదు. చుక్కపెట్టి గురి తప్పకుండా కొట్టింది. చంద్రుడిపై జపాన్ కేవలం 100 మీటర్ల వ్యాసంతో ఓ గిరి గీసింది. కచ్చితంగా అదే గిరిలో ల్యాండరును క్షేమంగా దింపింది. ఇదే ప్రెసిషన్ ల్యాండింగ్. పిన్ పాయింట్ ల్యాండింగ్. అంతరిక్షంలో ఇలాంటివి అనితర సాధ్యం. ప్రపంచవ్యాప్త వార్తాసంస్థలు, ఇతర పత్రికలు మనకేల? తమ అంతరిక్ష విజయం గురించి అని పట్టించుకోకపోపయినా.. ‘The Japan Times’ పత్రిక ఏం రాసిందో చూద్దాం. చంద్రుడి ఉపరితలంపై దిగేటప్పుడు జపాన్ ‘మూన్ స్నైపర్’ (స్లిమ్) ల్యాండర్ ఏమీ దెబ్బతినలేదు. కనుక... బహుశా దాని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) సైతం పాడవకుండా భేషుగ్గానే ఉండి ఉంటాయి. కాకపోతే... తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల సౌరశక్తిని వ్యోమనౌక వినియోగించుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆన్‌బోర్డ్ బ్యాటరీపై అది ఆధారపడుతోంది. కొన్ని గంటలపాటు మాత్రమే ఆ బ్యాటరీ పవర్ అందించగలదు. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? ఓ ఆశ మిణుకుమిణుకుమంటోంది! ‘మూన్ స్నైపర్’ సౌర ఫలకాలు సూర్యుడి దిశగా లేవని ‘జాక్సా’ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో సూర్యుడి దిశ (కోణం) మారగానే అవి సౌర విద్యుత్ తయారు చేస్తాయనేది వారి వాదన. ఒకసారి సోలార్ ప్యానెల్స్ సరిగా పని చేయడమంటూ మొదలైతే ల్యాండర్ కొన్ని రోజులపాటు జీవించి అప్పగించిన విధులు నిర్వర్తిస్తుంది. అనంతరం కొన్ని రోజులకు సోలార్ ప్యానెల్స్ పాడవుతాయి. ఎందుకంటే... చంద్రుడిపై పగటి వేళలో నమోదయ్యే 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు అవి క్రమంగా నాశనమవుతాయి. ఏదేమైనా ఈ ల్యాండింగ్ జపాన్ అంతరిక్ష కార్యక్రమానికి గొప్ప ఊపు, ఉత్తేజాలనిచ్చింది. -జమ్ముల శ్రీకాంత్ -
క్రాష్ లాండింగ్ అంటే ఇలాగుంటుంది.!
-
kargil: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సరికొత్త రికార్డు
లడాఖ్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. హిమాలయాల్లో ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌పై సి-130జె విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ తొలిసారిగా నైట్‌ల్యాండింగ్ చేసింది. ‘ఇటీవలే ఐఏఎఫ్ సి-130ని కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌లో తొలిసారి విజయవంతంగా రాత్రివేళ ల్యాండ్ చేశాం’అని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఏఎఫ్ ప్రత్యేక బలగాల యూనిట్ ద గార్డ్స్ శిక్షణను కూడా ఈ ఫీట్లో భాగంగా ఐఏఎఫ్ కలిపి నిర్వహించడం విశేషం. నైట్ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ఐఏఎఫ్ వెల్లడించలేదు. హిమాలయాల్లో 8800 మీటర్ల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌లో విమానాలను ల్యాండ్ చేయడం పైలట్లకు సవాళ్లతో కూడుకున్న టాస్క్.అత్యంత ఎత్తుతో పాటు ప్రతికూల వాతావరణంలో విమానాలను ల్యాండ్ చేయాలంటే పైలట్లకు ప్రత్యేక నైపుణ్యాలు ఉండాల్సిందే. గత ఏడాది నవంబర్లోనూ ఐఏఎఫ్ ఉత్తరాఖండ్‌లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్‌పై లాక్హిడ్ మార్టిన్‌కు చెందిన సూపర్ హెర్క్యులస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాన్ని విజయవంతంగా నైట్ ల్యాడింగ్ చేసింది. ఉత్తర కాశీ టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకుగాను ఈ విమానాలు భారీ ఇంజినీరింగ్ పరికరాలను మోసుకెళ్లాయి. ఇదీచదవండి.. ప్రతి శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం -
నదిపైనే ల్యాండింగ్ !
మాస్కో: రన్‌వేపై ల్యాండ్ చేయడం మామూలే.. నది ఉపరితలంపై విమానాన్ని పరుగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో. రష్యాలో చిన్న విమానాన్ని ఒక పైలట్ నేరుగా నదిపైనే ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి. రష్యాలో తూర్పు సైబీరియా పరిధిలోని జిర్యాంకా విమానాశ్రయ సమీపంలో జరిగిందీ ఘటన. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతంలోని యాకుట్సŠక్ నగరం నుంచి 34 మంది ప్రయాణికులతో ఆంటోవ్ ఏఎన్–24 విమానం గురువారం ఉదయం జిర్యాంకా నగరానికి బయల్దేరింది. భారీగా మంచు కురుస్తుండటంతో జిర్యాంకా ఎయిర్పోర్ట్ రన్‌వే సరిగా కనబడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్‌చేశాడు. నగరంలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం రాజ్యమేలుతోంది. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత దెబ్బకు నది ఉపరితలం మొత్తం గడ్డకట్టింది. దీంతో దీనిపై ల్యాండ్ అయిన విమానం అలాగే కొన్ని మీటర్లు సర్రున జారుతూ ముందుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనకు కారకుడైన పైలట్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. సోవియట్ కాలంనాటి ఈ చిన్న విమానాన్ని పోలార్ ఎయిర్‌లైన్స్ నడుపుతోంది. -
ఐఎఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఐఎఎఫ్‌హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ భోపాల్ సమీపంలో ముందుజాగ్రత్తగా ల్యాండ్ అయ్యింది. ప్రాథమికంగా అందిన వార్తల ప్రకారం హెలికాప్టర్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అందులో ఆరుగురు సైనికులు ఉన్నారని ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ భోపాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని పొలంలో దిగాల్సి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆ హెలికాప్టర్ ఆనకట్టపై చాలా సేపు చెక్కర్లు కొట్టింది. అనంతరం కిందకు ల్యాండ్ అయ్యింది. బెరాసియాలోని డూమారియా గ్రామంలోని ఆనకట్ట సమీపంలో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ల్యాండింగ్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హెలికాప్టర్ ల్యాండ్ అయిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వీడియోలో హెలికాప్టర్ చుట్టూ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా కనిపిస్తున్నారు. కాగా ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ జవానులు సాంకేతిక నిపుణుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం #WATCH | Madhya Pradesh: An Indian Air Force ALH Dhruv helicopter made a precautionary landing near Bhopal. As per the initial reports, the crew is safe and a team is on the way to look into the technical issues: IAF sources pic.twitter.com/cQRxCrJjzK — ANI (@ANI) October 1, 2023 -
సీఎం వైఎస్ జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విజువల్స్
-
చంద్రయాన్-3 సక్సెస్: సోషల్‌మీడియాలో 45 ట్రిలియన్ డాలర్ల మోత
Chandrayaan-3 VS 45 Trillion చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండింగ్ అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటోంది. చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ తరువాత ఇస్రో ఇంజనీర్ల ఘనతను పలు దేశాలు అభినందించాయి. అయితే బ్రిటీష్ మీడియాలో జెలసీతో అనూహ్య వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. దీంతో ఇండియానుంచి బ్రిటిష్ వలసపాలకులు కొల్లగొట్టిన 45 ట్రిలియన్ డాలర్లు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. (చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్‌లో టాప్ రికార్డ్) సోషల్ మీడియాలో,ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. భారత ఘనతపై అక్కసు వెళ్లగక్కుతున్న జర్నలిస్టు పాట్రిక్ క్రిస్టీస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూన్ మిషనను అభినందిస్తూనే చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాలుగా యూకే నుంచి 2.5 బిలియన్డాలర్లను విదేశీ సహాయాన్ని వెనక్కి ఇవ్వాలంటూ పాట్రిక్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు న్యాయవాది శశాంక్ శంకర్ ఝా భారతీయులనుంచి దోచుకున్న45 ట్రిలియన్ డాలర్లను తిరిగి ఇవ్వాలంటూ కౌంటర్ ఇచ్చారు. India has become the first country to successfully land a spacecraft near the south pole of the moon so why did we send them £33.4 million in foreign aid which is set to rise to £57 million in 24/25 Time we get our money back. — Sophie Corcoran (@sophielouisecc) August 23, 2023 అలాగే అంతరిక్షంలోని రాకెట్లను పంపించేందుకు ఇక దేశాలకు యూకే సాయం అందించకూడదు అంటూ సోఫియా కోర్కోరన్ ట్వీట్ చేశారు. అంతేకాదు తమ డబ్బు తిరిగి తమకు కావాలని కూడా ఈమె పేర్కొన్నారు. దీంతో భారతీయ యూజర్లు మండిపడుతున్నారు. భారతదేశం నుండి దోచుకున్న సొమ్ము 45 ట్రిలియన్ డాలర్లు అని కమెంట్ చేస్తున్నారు. మా కొహినూర్ మాకిచ్చేయండి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు భారత్ 2015నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదంటూ పేర్కొన్నారు. ‘Britain, give us back our $44.997 TRILLION!’ Hi @PatrickChristys, @GBNEWS Thank you for reminding about the grant. Now ‘as a rule, salute us & return $45 TRILLION you’ve looted from us’ Britain gave, as you say, £2.3 BILLION i.e. $2.5 BILLION. Deduct it & return the… pic.twitter.com/9lSfwpvoWn — Shashank Shekhar Jha (@shashank_ssj) August 23, 2023 కాగా 1765 -1938 మధ్య కాలంలో బ్రిటన్ భారతదేశం నుండి దాదాపు 45 ట్రిలియన్డాలర్ల మొత్తాన్ని దోచుకుందని ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ కొలంబియా యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించిన పరిశోధన తర్వాత తొలుత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పట్నాయక్ పన్ను మరియు వాణిజ్యంపై దాదాపు రెండు శతాబ్దాల వివరణాత్మక డేటాను విశ్లేషించిన తర్వాత ఈ డేటాను వెల్లడించారు.అయితే ఈ ఏడాది మార్చిలో ది గార్డియన్ నివేదిక ప్రకారం, భారతదేశానికి యూకే సహాయం 2015లో ఆగిపోయింది. అయితే ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ఎయిడ్ ఇంపాక్ట్ సమీక్ష ప్రకారం సుమారు 2.3 బిలియన్లు పౌండ్లు (రూ. 23,000 కోట్లు) 2016 -2021 మధ్య భారతదేశానికి అందాయి. (చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు) బ్రిటీష్ వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహంలేదు. దశాబ్దాలు పాటు భారత్‌ను పాలించిన బ్రిటీషర్లుమనదేశంలోని ఎనలేని సంపదను దోచుకుపోయారు. బంగారం, వజ్ర వైడూర్యాలు లాంటి ఎంతోఘనమైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు. ఇండియా నుంచి బ్రిటీషర్లు తమ దేశానికి తరలించిన సంపద.. ప్రస్తుత విలువలో దాదాపుగా 45 ట్రిలియన్ డాలర్లకు సమానం. -
చంద్రయాన్ ల్యాండర్.. మెరిసేదంతా బంగారమేనా..
చంద్రయాన్ ల్యాండర్.. బంగారు రంగులో మెరిసి పోతూ ఉంటుంది. పైగా.. ఏదో గిఫ్ట్‌ప్యాక్ చుట్టిపెట్టి నట్లు గోల్డ్ ఫాయిల్లాగా ఉంటుంది. ఇంతకీ మెరిసేదంతా బంగారమేనా? అస్సలు కాదు.. ఇది మల్టీ లేయర్ ఇన్సులేషన్.. అనేక పొరలుగా ఉంటుంది. ఉష్ణ నిరోధకంగా దీన్ని ఉపయోగి స్తారు. అంతరిక్షంలోకి ఉపగ్రహం వెళ్లినప్పుడు అక్కడి ఉష్ణోగ్రతలు వాటిల్లోని పరికరాలపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల అవి సరిగా పనిచేయలేక పోవచ్చు. దాన్ని నివారించడానికి ఇలా కప్పి ఉంచుతారు. మూన్ గురించి.. మీకు తెలుసా? మనం అనుకు న్నట్లు.. చంద మామ గుండ్రంగా ఉండడు.. గుడ్డు ఆకారంలో ఉంటాడు.. అలాగే చల్లనయ్య.. తెల్లనయ్య కాదు.. దగ్గర్నుంచి చూస్తే.. ముదురు బూడిద రంగులో ఉంటాడు. మనం ఎప్పుడు చూసినా.. చంద్రునిలోని 59 శాతం మాత్రమే మనకు కనిపిస్తుందట. అంతేకాదు.. చంద్రుడిని దగ్గర నుంచి చూస్తే.. భారీ గుంతలులాంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ.. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఖగోళ వస్తువులు దాన్ని ఢీకొన్నప్పుడు ఏర్పడినవే.. చదవండి: చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర.. -
Chandrayaan 3 Success Viral Photos: నెట్టింట చంద్రయాన్-3 సక్సెస్ హల్చల్
-
ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్ మహీంద్ర
చంద్రయాన్-3 అఖండ విజయంపై సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ అద్బుత,చారిత్రక విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఈ నేపథ్యంలో బిలియనీర్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 మానవజాతి ప్రారంభమైనప్పటి నుండి మనం చంద్రుని వైపు చూశాం. మన మనస్సులో జాబిల్లి మాయాజాలం, స్వప్నాలు ఇక నిజం కాబోతున్నాయి. చంద్రుడిపై కలలు నేడు, మేజిక్ &సైన్స్ సమ్మిళిత కృషితో జాబిల్లి మన చేతికి చిక్కింది. ఇక 1.4 బిలియన్ల భారతీయుల మనస్సుల్లో జాబిల్లిపై సరికొత్త డ్రీమ్స్. జై హింద్! అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్‌చేశారు. (చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు) ఈ మిషన్ తప్పక విజయం సాధిస్తుందని ముందే బల్లగుద్ది మరీ చెప్పిన నటుడు మాధవన్ చంద్రయాన్3 సక్సెస్‌తో ఆయన సంతోషానికి అవధుల్లేవు అంటూ మరో ట్వీట్ చేశారు. ఐఆర్సీటీసీ కూడా చంద్రయాన్-3 విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. కాగా అంతరిక్ష పరిశోధనలో భారత్ తన దైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంత మైం. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ కావడంతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. From the dawn of humankind we have gazed at the moon and let it work its magic on our minds. The moon turned us into dreamers. Today, magic & science merge and having the moon in our grasp will spark new dreams in the minds of 1.4 billion Indians. Jai Hind. 🇮🇳… pic.twitter.com/I4I9vJD4WE — anand mahindra (@anandmahindra) August 23, 2023 Words are not enough to describe this achievement Jai Hind, my heart swells with pride. I hope I can stay sane.🤗🤗🙏🚀🚀🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/2rTFpHzEWn — Ranganathan Madhavan (@ActorMadhavan) August 23, 2023 Congratulations to the entire @ISRO team for making history by successfully reaching the moon, and to continuously aiming higher and farther! 🚀🌕 #ISRO #Chandrayaan3Mission #IndiaOnTheMoon #VikramLander pic.twitter.com/bQZX02sGDz — IRCTC (@IRCTCofficial) August 23, 2023 -
ఖండాంతరాలకు భారత్ ఖ్యాతి.. చంద్రయాన్ 3 ప్రాజెక్టు సాగిందిలా..
హైదరాబాద్: చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసి.. ల్యాండింగ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయా న్–3 మిషన్ ప్లానింగ్ షెడ్యూల్ ప్రకారం దశలవారీగా చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లే ఆపరేషన్‌ను విజయవంతంగా చేపట్టారు. చంద్రయాన్–3 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు ఐసారు, లూనార్ ఆర్బిట్‌లోకి చేరుకున్న తర్వాత మరో ఐసా ర్లు ఆర్బిట్ రైజింగ్ కార్యక్రమాన్ని బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమేట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) భూనియంత్రతి కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. ల్యాండర్, రోవర్ మాడ్యూల్‌ను తీసుకెళుతున్న ప్రపొల్షన్ మాడ్యూల్ మొత్తం బరువు 2,145 కిలోలు. ప్రపొల్షన్ మాడ్యూల్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి 1,696 కేజీల ఇంధనాన్ని నింపారు. మిగిలిన 449 కేజీలు పేలోడ్ ఇనుస్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఈ ప్రపొల్షన్ మాడ్యూల్‌కు అనుసంధానం చేసిన ల్యాండర్, అందులో ఉన్న రోవర్‌ను చంద్రుడి మీదకు విజయవంతంగా తీసుకెళ్లి వదిలిపెట్టింది. అప్పటికి రెండు ఘట్టాలను పూర్తిచేశారు. ప్రస్తుతం మిగిలిన మూడో ఘట్టం కూడా పూర్తి అయింది. బుధవారం సాయంత్రం 5.44 గంటలకు ప్రారంభించి 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి ఉపరితలంపైన దించారు. దశలవారీగా చూస్తే.. ► జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ► మొదటిగా చంద్రయాన్–3 మిషన్ భూమికి దగ్గరగా అంటే పెరిజీ 175 కిలోమీటర్లు, భూమికి దూరంగా అపోజి 36,500 కిలోమీటర్లు దూరంలోని భూ మధ్యంతర కక్ష్య (జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టారు. ► చంద్రయాన్–3 మిషన్ కక్ష్యలోకి ప్రవేశించగానే బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రం (ఉపగ్రహాల నియంత్రిత భూకేంద్రం) శాస్త్రవేత్తలు స్వాధీనం చేసుకున్నారు. ► గత నెల 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూ రంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► 17న రెండోసారి భూమికి దగ్గరగా 173 కిలోమీ టర్ల ఎత్తును 223 కిలోమీటర్లుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తును 42,000 కిలోమీటర్ల దూరానికి పెంచారు. ► 18న మూడో విడతలో 224 కిలోమీటర్లు, దూ రంగా 51,568 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► 22న నాలుగో విడతలో భూమికి దగ్గరగా 233, దూరంగా 71,351 కిలోమీటర్ల ఎత్తుకు పెంచారు. ► 25న ఐదోసారి భూమికి దగ్గరగా 236, భూమికి దూరంగా 1,27,609 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. 25 నుంచి ఆగస్టు 1 అర్ధరాత్రి దాకా చంద్రయాన్–3 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమించింది. ► ఈనెల 1న అర్ధరాత్రి చంద్రయాన్–3 మిషన్నుపెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్‌తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపునకు మళ్లించారు. ►5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 18074 ఎత్తుకు చేరింది. ► 6న ప్రపొల్షన్ మాడ్యూల్ లూనార్ ఆర్బిట్‌లో మొదటి సారిగా కక్ష్య దూరాన్ని తగించే ప్రక్రియను ప్రారంభించి 4,313 కిలోమీటర్లకు తగ్గించారు. ►9న రెండో సారి కక్ష్య దూరాన్ని తగ్గించి 1437 కిలోమీటర్లు చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చారు. ► 14ప మూడోసారి 179 కిలోమీటర్లకు తగ్గించారు. ► 16న నాలుగోసారి 163 కిలోమీటర్లకు తగ్గించారు. ► 17న చంద్రయాన్–3ని 127 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్‌ను విజయవంతంగా విడిచిపెట్టింది. ► 18న ల్యాండర్ మాడ్యూల్లో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది. ► 20న అంటే ఆదివారం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువగా 134 కిలోమీటర్లకు చేరుకుంది. ► 23 బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ల్యాండర్ మాడ్యూల్లో ఇంధనాన్ని 37 నిమిషాలపాటు మండించారు. ► షెడ్యూల్ ప్రకారం కంటే ముందే 5.44 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ► ఉత్కంఠభరితమై 17 నిమిషాల టెర్రర్ టైంలో ఇస్రో శాస్త్రవేత్తలు జాగ్రత్తగా ల్యాండర్‌ని కిందికి దించారు. ► 6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్.. విజయవంతగా చంద్రుని దక్షిణ ధృవంపై కిందికి దిగింది. అంతరిక్ష రంగంలో భారత్ చరిత్రను సృష్టించింది. ఇదీ చదవండి: శెభాష్ విక్రమ్.. చంద్రయాన్-3 ల్యాండింగ్ సక్సెస్.. చరిత్ర సృష్టించిన భారత్ -
చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం..ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఉత్కంఠ!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ నెల 17న చంద్రయాన్ -3 ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి దగ్గరగా విజయవంతంగా వదిలిపెట్టింది. చంద్రయాన్ 3లో ఇప్పటి వరకు ప్రతి ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఇక ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్నినేడు చేరుకోనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుదిఘట్టం బుధవారం జరగనుంది. చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ అడుగు పెట్టనుంది. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ అపూర్య ఘట్టాన్ని సాయంత్రం 5.20 నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. ల్యాండర్ మాడ్యుల్ చంద్రుని వీక్షించే క్షణం కోసం దేశంలోని ప్రజలు తోపాటు ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. దాయాది దేశం పాక్‌తో సహా ప్రపంచ దేశాలు భారత్ ఉక్కు సంకల్పానికి నివ్వెరపోయాయి. ప్రపంచ అగ్ర దేశాలకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను భారత్ సాధిస్తుండటంతో అందరీ దృష్టి ఇండియాలోని ఈ మిషన్ ఘట్టంపైనే ఉండటం విశేషం. సర్వత్రా ఈ విషయం ఓ హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజలైతే చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావాలంటూ పూజలు చేస్తున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న దేశంగా చంద్రుడిపై అడుగుపెట్టిన దేశాలైన యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా వంటి దేశాల సరసన ఇండియా నిలుస్తుంది. భారత్ వెలుపల ఉన్న ప్రజలే గాక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం "జయహో భారత్ జయహో ఇస్రో" అంటూ ఈ చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావాలంటూ పూజలు, హోమాలు చేస్తున్నారు. పెద్ద చిన్న తేడా లేకుండా భారత ఇస్రోకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కుల మత పర భేదాలు పక్కన పెట్టి అందరూ ఒకేతాటిపై భారత ఇస్రో దిగ్విజయంగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రకరకాలుగా వీడియోలు ట్వీట్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి. @chandrayaan_3 #AllTheBestChandrayaan3 ♥️♥️♥️All the very best Chandrayaan 3♥️♥️♥️ 🚀🇮🇳Jai Hind🇮🇳🚀🌛 pic.twitter.com/YXM76uHOoo — Aakash (@Aakash13294124) August 22, 2023 Let's join in prayer for the safe landing of chandrayaan-3. 🙏 Jai Shree Ram ❤️🔥#chandrayaan3 pic.twitter.com/ubq4iKZdLw — Bhagavad Gita 🪷 (@Geetashloks) August 23, 2023 #AllTheBestChandrayaan3 We love you, @isro All the best @chandrayaan_3 Nived, Svara, Punit, Vinee#NarendraModi @mygovindia @PMOIndia pic.twitter.com/6CKtXUnAsf — Vineetha Punit (@vineepun) August 21, 2023 Here's another set of greetings from people across India. We appreciate and extend our thanks to them. #AllTheBestChandrayaan3 #Chandrayaan_3 #Sivoham pic.twitter.com/CwRAWNaCUi — Chandan Yadav (@Chandan_YadavSP) August 22, 2023 #WATCH | Uttar Pradesh | People offer namaz at the Islamic Center of India in Lucknow for the successful landing of Chandrayaan-3, on August 23. pic.twitter.com/xpm98iQM9O — ANI (@ANI) August 22, 2023 (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!) -
చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో (ISRO) చేపట్టిన ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3 ) మిషన్ ఘన విజయం సాధించింది. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండయి చరిత్ర తిరగరాసింది. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను ప్రపంచమంతా కొనియాడుతోంది. ఈ నేపథ్యంలో లార్సెన్ & టూబ్రో (L&T), మిశ్ర ధాతు నిగమ్ (MIDHANI), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) తో సహా పలు కంపెనీలు ‘చంద్రయాన్-3’ మిషన్‌లో కీలక పాత్ర పోషించాయి. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థలు వివిధ దశల్లో మిషన్‌కు సహకరించాయి. ఎల్అండ్టీ పాత్ర ఎల్వీఎం3 ఎం4 చంద్రయాన్ మిషన్ ప్రయోగంలో ఎల్అండ్టీ కీలక పాత్ర పోషించింది. 3.2 మీటర్ల వ్యాసం కలిగిన హెడ్ ఎండ్ సెగ్మెంట్, మిడిల్ సెగ్మెంట్, నాజిల్ బకెట్ ఫ్లాంజ్ అనే క్లిష్టమైన బూస్టర్ భాగాలు పోవైలోని ఎల్అండ్టీ కర్మాగారంలో తయారయ్యాయి. ఇక్కడే వీటిని పరీక్షించారు. అలాగే కోయంబత్తూరులోని ఎల్అండ్టీ హై-టెక్ ఏరోస్పేస్ తయారీ కేంద్రంలో గ్రౌండ్, ఫ్లైట్ అంబిలికల్ ప్లేట్లు తయ్యారయ్యాయి. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం లాంచ్ వెహికల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్‌లో కూడా ఎల్అండ్టీ పాత్ర ఉంది. మిదాని నుంచి లోహ మిశ్రమాలు మిశ్ర ధాతు నిగమ్ విషయానికొస్తే కోబాల్ట్ చంద్రయాన్-3 మిషన్‌కు అవసరమైన నికెల్, టైటానియం లోహ మిశ్రమాలు, ప్రత్యేకమైన ఉక్కు, ఇతర క్లిష్టమైన పదార్థాలను అభివృద్ధి చేసి సరఫరా చేయడంలో కంపెనీ పాత్ర పోషించింది. ఈ సంస్థ భవిష్యత్తులో ఇస్రో జరిపే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌తోపాటు ఇతర మార్గదర్శక కార్యక్రమాలకు కూడా కీలక సహకారం అందించనుంది. బ్యాటరీలు సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ చంద్రయాన్-3కి సంబంధించిన బ్యాటరీలను బీహెచ్ఈఎల్ సరఫరా చేసింది. బీహెచ్ఈఎల్కు చెందిన వెల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (WRI) చంద్రయాన్-3 కోసం బై-మెటాలిక్ అడాప్టర్లు తయారీ చేసింది. మీడియా నివేదిక ప్రకారం.. ఎల్వీఎం3 ఎం4 ఫ్లైట్ చంద్రయాన్-3 క్రయోజెనిక్ దశలో ఉపయోగించిన భాగాలను తయారు చేసింది ఈ సంస్థే. చంద్రయాన్-3 మిషన్ విజయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా పాత్ర పోషించింది. గతేడాది హిందుస్థాన్ ఏరోనాటిక్స్- ఎల్అండ్టీ కన్సార్టియం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) నుంచి ఐదు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) రాకెట్లను తయారు చేయడానికి రూ. 860 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL)కి అనేక భాగాలు అందించడం ద్వారా చంద్రయాన్-3 మిషన్‌కు కీలకమైన సహాయాన్ని అందించినట్లు ఒక మీడియా రిపోర్ట్ పేర్కొంది. చంద్రయాన్ 3 మిషన్ ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో ఉపయోగించిన క్లిష్టమైన S200 బూస్టర్ విభాగాలను వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ తయారు చేసిందని ఆ సంస్థ సీఈవో, ఎండీ చిరాగ్ దోష్‌ను ఉటంకిస్తూ హిందూస్తాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ ట్యాంకేజీలు, S200 ఫ్లెక్స్ నాజిల్ వంటి ఇతర సబ్‌సిస్టమ్‌లు కూడా ఈ సంస్థ ఉత్పత్తేనని వివరించింది. ఇక బాలానగర్‌లోని ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థ చంద్రయాన్-3కి సంబంధించిన కీలక భాగాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించింది. -
చంద్రయాన్ 3.. 'టెర్రర్ టైం' గురించి తెలుసా?
చంద్రయాన్ 3లో భాగంగా చంద్రుడిపై ఇస్రో ల్యాండర్ అడుగుపెట్టే క్షణం కోసం భారత్‌తో పాటు యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. లక్ష్యం దిశగా దూసుకెళ్లిన చంద్రయాన్ 3 అడుగు దూరంలోనే ల్యాండింగ్ కోసం వేచి ఉంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపురూప ఘట్టం ఆవిషృతమౌతుందని ఇస్రో వర్గాలు ఇప్పటికే తెలిపారు. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో సఫలమైతే భారత్ అజేయంగా నిలుస్తుంది. సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 20 నిమిషాలు చాలా కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తల బృందం మాడ్యూల్‌లోని సాంకేతికతను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ప్రదేశంలో దిగడానికి సూర్యదయం కాగానే ప్రక్రియను ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 5.45 తర్వాత అసలైన ప్రక్రియ ప్రారంభమైతుందని అంచనా వేస్తున్నారు. ఒకసారి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చివరి '20 మినెట్ టెర్రర్'గా అభివర్ణించారు. Chandrayaan-3 Mission: The mission is on schedule. Systems are undergoing regular checks. Smooth sailing is continuing. The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement! The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY — ISRO (@isro) August 22, 2023 చంద్రుడి ఉపరితలానికి 30 కి.మీల దూరంలో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి నిమిషాలు కీలకం. చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ల్యాండర్ తన ఇంజన్లను మండించుకుంటుంది. ఆ తర్వాత 11 నిమిషాల పాటు రన్ బ్రేకింగ్ దశ ప్రారంభం అవుతుంది. ఈ దశలో ల్యాండర్ చంద్రునికి సమాంతరంగా ఉంటుంది. క్రమంగా ఫైన్ బ్రేకింగ్ దశలోకి వస్తుంది. అక్కడ ల్యాండర్ 90 డిగ్రీల వంపు తిరుగుతుంది. ఈ దశలోనే గతంలో చంద్రయాన్ 2 కూలిపోయింది. ఈ దశల అనంతరం చంద్రునికి కేవలం 800 మీటర్ల ఎత్తులో ల్యాండర్ వేగం సున్నాకు చేరుతుంది. చివరకు 150 మీటర్లకు చేరుకోగానే సరైన ప్రదేశం కోసం ల్యాండర్ వెతుకుతుంది. సరైన స్థలంలో సెకనుకు 3 మీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలాన్ని తాకుతుంది. ఈ విధంగా చివరి 20 నిమిషాల టెర్రర్ టైంకు తెరపడి మిషన్ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత చంద్రునిపై ల్యాండర్ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుందని ఇస్రో వెల్లడించింది. ఇదీ చదవండి: మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ.. -
రేపే చంద్రయాన్–3 సాఫ్ట్ ల్యాండింగ్
బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ల్యాండర్ కీలక ఘట్టానికి సమయం సమీపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బుధవారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు ల్యాండర్ ‘విక్రమ్’ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై కాలు మోపనుంది. సాయంత్రం 5.20 గంటల నుంచే ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కానుంది. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ల్యాండర్ క్షేమంగా చంద్రుడిపై దిగితే కేవలం భారతీయులకే కాదు, ప్రపంచానికి కూడా అదొక చిరస్మరణీయ ఘట్టమే అవుతుంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కుతుంది. అంతేకాదు చంద్రుడిపై భద్రంగా దిగిన నాలుగో దేశంగా రికార్డు సృష్టిస్తుంది. చంద్రయాన్–3 ల్యాండర్ మాడ్యూల్ ఇప్పటికే అక్కడ చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్–2 ఆర్బిటార్‌తో కమ్యూనికేషన్ ఏర్పర్చుకుందని ఇస్రో సైంటిస్టులు సోమవారం వెల్లడించారు. రెండూ పరస్పరం సంభాíÙంచుకుంటున్నాయని తెలిపారు. ‘వెల్కమ్, బడ్డీ!’ అంటూ ల్యాండర్ మాడ్యూల్‌కు ఆర్బిటార్ స్వాగతం పలకిందని చెప్పారు. ఆర్బిటార్‌తో అనుసంధానం వల్ల ల్యాండర్ మాడ్యూల్ గురించి మరింత ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి వీలవుతుందని అన్నారు. ల్యాండర్ మాడ్యూల్ ప్రస్తుతం చక్కగా పనిచేస్తోందని, ఇప్పటికైతే ఎలాంటి అవరోధాలు కనిపించడంలేదని వెల్లడించారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఢిల్లీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌తో సమావేశమయ్యారు. ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులను ఆయనకు వివరించారు. ఈ మొత్తం ప్రయోగానికి సంబంధించిన అన్ని వ్యవస్థలూ బాగా పని చేస్తున్నాయని తెలిపారు. లేదంటే 27వ తేదీన ల్యాండింగ్? సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ల్యాండింగ్ విషయంలో ఇస్రో కీలక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ల్యాండర్ మాడ్యూల్ ప్రస్తుతం చందమామకు అత్యంత సమీపానికి చేరుకుంది. ఇక ల్యాండింగే తరువాయి. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా దించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు ల్యాండర్లో ఉన్న సైంటిఫిక్ పరికరాలతో చంద్రుడి ఉపరితలంపై పరిస్థితిని మరోమారు క్షుణ్నంగా సమీక్షిస్తామని ఇస్రో ప్రకటించింది. పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటేనే ల్యాండ్ చేస్తామని వెల్లడించింది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయనున్నట్లు ఇస్రో అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. చంద్రయాన్–2, రష్యా లూనా–25 క్రాష్ ల్యాండింగ్ అయిన నేపథ్యంలో చంద్రయాన్–3 విషయంలో సైంటిస్టులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దక్షిణ ధ్రువం చిత్రాలు విడుదల ల్యాండర్ మాడ్యూల్‌లోని ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా(ఎల్‌హెచ్‌డీఏసీ) చిత్రీకరించిన చందమామ దక్షిణ ధ్రువం ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ క్షేమంగా కాలు మోపడానికి ఈ కెమెరా తోడ్పడనుంది. రాళ్లు, గుంతలను ఫొటో తీసి, అవి లేని చోట ల్యాండర్ దిగడానికి అనువైన ప్రదేశాన్ని ఈ కెమెరా గుర్తిస్తుంది. ప్రకాశ్‌రాజ్ పోస్టుపై రగడ ముంబై: చంద్రయాన్–3 ప్రయోగాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ‘ఎక్స్’లో ఆదివారం చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. చొక్కా లుంగీ ధరించిన ఓ వ్యక్తి టీ వడబోస్తున్న కార్టూన్ చిత్రాన్ని ప్రకాశ్‌రాజ్ పోస్టు చేశారు. కన్నడ భాషలో దీనికి వ్యాఖ్యను కూడా జతచేశారు. ‘‘ఇప్పుడే అందినవార్త. చంద్రయాన్ నుంచి మొదటి చిత్రం ఇప్పుడే వచి్చంది’’ అని పేర్కొన్నారు. అయితే, అందులో టీ వడబోస్తున్న చాయ్‌వాలా ఎవరన్నది ప్రకాశ్‌రాజ్ బయటపెట్టలేదు. ఇస్రో మాజీ చైర్మన్ కె.శివన్‌ను ఎద్దేవా చేస్తూ ఈ పోస్టు పెట్టారని ప్రకాశ్‌రాజ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని పోస్టు చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రయాన్-3.. అడుగు దూరంలో విక్రమ్
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3లో కీలకఘట్టాలు దాదాపు పూర్తయ్యాయి. రెండో, చివరి డీ-బూస్టింగ్ విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటాక అధికారిక ప్రకటన చేసింది. దీంతో చంద్రుడి అతిచేరువ కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది. చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25కి.మీ, అత్యధికంగా 134 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. అంటే.. ఈ కీలక ఘట్టం పూర్తికావడంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే మిగిలి ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలక, చివరిదశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై దృష్టి పెట్టారు. అన్నీ అనుకూలిస్తే ఇస్రో అనుకున్న తేదీనే చంద్రుడి దక్షిణధ్రువంపై ల్యాండ్ కానుంది. ‘‘ రెండో, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్‌తో ల్యాండర్ మాడ్యూల్ 25 కి.మీX 134కి.మీ కక్ష్యలోకి చేరింది. మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎంచుకున్న ల్యాండింగ్ సైట్లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం. చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుంది’’ అని ఇస్రో ఎక్స్(ట్విటర్)లో పేర్కొంది. Chandrayaan-3 Mission: The second and final deboosting operation has successfully reduced the LM orbit to 25 km x 134 km. The module would undergo internal checks and await the sun-rise at the designated landing site. The powered descent is expected to commence on August… pic.twitter.com/7ygrlW8GQ5 — ISRO (@isro) August 19, 2023 ఇదీ చదవండి: జాబిల్లిపై నీటి జాడ.. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే.. -
శిక్షణ విమానం క్రాష్ ల్యాండింగ్
కర్ణాటక: సాంకేతిక లోపం కారణంగా శిక్షణ విమానం అత్యవసరంగా దిగింది. ఈ సంఘటన బెళగావిలో జరిగింది. ఇద్దరు పైలట్లతో కలిసి బెళగావి సాంబ్రా విమానాశ్రయం నుంచి రెడ్‌బర్డ్ ఫ్లయింగ్ అకాడమీకి చెందిన చిన్నపాటి శిక్షణ విమానం మంగళవారం ఉదయం 9:30 గంటలకు టేకాఫ్ అయ్యింది. 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక మారిహళ సమీపంలో సాంకేతి లోపం తలెత్తింది. వెంటనే హొన్నిహళ సమీపంలోని రోడ్డు పక్కనున్న పొలంలో క్రాష్ ల్యాండింగ్ చేశారు. విమానం వేగంగా నేలను తాకడం వల్ల ముందు చక్రాలు, రెక్కలు ధ్వంసమయ్యాయి. ఓ పైలట్‌కు మాత్రం చిన్న గాయాలయ్యాయి. పైలట్‌ను వాయుసేన ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. మారిహళ పోలీసులు, పెద్దసంఖ్యలో జనం విమానం వద్దకు చేరుకున్నారు. -
షాకింగ్.. భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం.. 10 నిమిషాల పాటు..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ విమానం భారత్‌లో దాదాపు 10 నిమిషాల పాటు ప్రయాణించి 141 కిలోమీటర్లు చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. మే 4న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ మీడియా సంస్థ నివేదికలో వెల్లడించింది. పీకే248 అనే పీఐఏ విమానం మస్కట్ నుంచి తిరిగి పాకిస్తాన్‌కు మే4న రాత్రి 8 గంటల సమయంలో చేరుకుంది. అలామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. పైలట్ ల్యాండ్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో విమానాన్ని కొద్దిసేపు గాల్లో తిప్పాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్‌కు సూచించారు. అయితే భారీ వర్షం కారణంగా దారితప్పిన పైలట్ విమానాన్ని భారత గగనతలంలోకి తీసుకొచ్చాడు. ఈ సమయంలో గంటలకు 292 కిలీమీటర్ల వేగం, 13,500 అడుగల ఎత్తులో అది ప్రయాణించింది. బధానా పోలీస్ స్టేషన్ పరిధి గగనతలం మీదుగా భారత్‌లోకి వచ్చింది. భారత పంజాబ్‌లోని తరన్ సాహిబ్ , రసూల్పూర్ ప్రాంతాల్లో దాదాపు 140 కిలోమీటర్లు గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో విమానాన్ని 20వేల అడుగులకుపైగా ఎత్తులో ఉంచాడు పైలట్. ఏడు నిమిషాల పాటు అటు ఇటు తిప్పాడు. ఆ తర్వాత భారత పంజాబ్‌లోని జాగియాన్ నూర్ మహమ్మద్ గ్రామం మీదుగా విమానం తిరిగి పాకిస్తాన్ చేరుకుంది. ఆ తర్వాత పాక్ పంజాబ్‌లోని డొనా మబ్బోకి, ఛాంట్, ధుప్సారి కాసుర్, ఘఠి కలంజార్ ప్రాంతాల్లో ప్రయాణించి తిరిగి మళ్లీ భారత గగనతలంలోకి వచ్చింది. మళ్లీ మూడు నిమిషాలు చక్కర్లు కొట్టిన అనంతరం భారత పంజాబ్‌లోని లఖా సింఘ్వాలా హిథార్ గ్రామం మీదుగా తిరిగి పాక్ చేరుకుంది. ఈ సమయంలో విమానం 23,000 ఎత్తులో ప్రయాణించింది. అయితే ఈ ఘటనకు భారత అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు
ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూశాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కెయిర్న్స్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 20న కెయిర్న్స్ నుంచి నార్తర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మద్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్నది విమానం అన్న స్ప్రుహ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోని 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా.. విమానంలోని ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యేలా పోట్లాడుకున్నారు. విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్ల్యాండ్స్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించాల్సి వచ్చింది. చివరికి విమానం టేకాఫ్ అయినప్పుడూ కూడా ఆ గుంపు ఏ మాత్ర తగ్గలేదు. మరోసారి గొడవపడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికి అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సముహన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Departing Cairns today.. Just someone trying to glass someone. More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM — Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023 (చదవండి: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో) -
గాల్లో ఉండగానే పెద్ద శబ్దాలతో ఇంజన్లో మంటలు..ఆ తర్వాత విమానం..
విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన కొలంబస్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 విమానం 1958లో ఈ ప్రమాదం జరిగింది. కొలంబస్ నుంచి ఫీనిక్స్‌కి వెళ్తున్న ఆ విమానాన్ని ఓ పక్కుల మంద ఢీ కొట్టాయి. దీంతో విమానంలోని కుడి ఇంజన్లో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే పైలెట్ అత్యవసర ల్యాండింగ్‌ని ప్రకటించి కొలంబస్‌లోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొద్ది నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. ఐతే విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అత్యవసర సిబ్బింది కూడా వెంటనే స్పందించారని, ఆ సమయానికి ఎయిర్పోర్ట్ తెరిచే ఉందని జాన్‌గ్లెన్ విమానాశ్రయం ట్విట్టర్లో పేర్కొంది. ఐతే ఆ విమానం ఇంజన్లో కొద్దిపాటి సాంకేతిక సమస్యలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ..విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద పెద్ధ శబ్దాలు వినిపించాయని చెప్పాడు. ఆ తర్వాత పైలట్ పక్షుల ఢీకొట్టాయని చెబుతూ ప్రయాణికులను అప్రమత్తం చేశాడని అన్నారు. కొద్ది సేపటికే ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితం ల్యాండ్ అయ్యిందని, ఆ తర్వాత తమను వేరే విమానంలో గమ్యస్థానాలకు తరలించినట్లు వెల్లడించాడు. Taken from Upper Arlington, Ohio. AA1958. pic.twitter.com/yUSSMImaF7 — CBUS4LIFE (@Cbus4Life) April 23, 2023 (చదవండి: నైట్ షోలో అగ్ని ప్రమాదం..ఎగిసిపడ్డ అగ్నికీలలు) -
మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో
బెంగళూరు: కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. చివరకు పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. బీఎస్ యడియూరప్ప సోమవారం హెలికాప్టర్లో కలుబుర్గికి బయలుదేరారు. ఈ క్రమంలో జెవారీలో హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేసే సమయంలో హెలిప్యాడ్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, దుమ్ము, కాగితాలు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. దీంతో, పైలట్‌కు హెలికాప్టర్ ల్యాండింగ్ ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కొద్దిసేపు ల్యాండింగ్‌ను నిలిపి వేసి ఆకాశంలోనే చక్కర్లు కొట్టారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. హెలిప్యాడ్ అంతా క్లియర్ చేయడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Kalaburagi | A helicopter, carrying former Karnataka CM and senior leader BS Yediyurappa, faced difficulty in landing after the helipad ground filled with plastic sheets and waste around. pic.twitter.com/BJTAMT1lpr — ANI (@ANI) March 6, 2023 -
సగం దూరం వెళ్లి.. వెనక్కి వచ్చిన విమానం
దుబాయ్: సుమారు 13 గంటల పాటు గాల్లో ప్రయాణించిన విమానం.. చివరకు ఊహించని ల్యాండింగ్ అయ్యింది. ఎక్కడి నుంచి విమానం టేకాఫ్ అయ్యిందో.. చివరికి మళ్లీ అక్కడే విమానం దిగేసరికి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ అసాధారణమైన ఈ ఘటన గత శుక్రవారం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం ఒకటి 13 గంటలపాటు ప్రయాణించి.. చివరికి మళ్లీ వెనక్కి వచ్చేసింది. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.30 ప్రాంతంలో ఈకే 448 అనే ఎమిరేట్స్ విమానం టేకాఫ్ అయ్యింది. అయితే.. సగం దూరం వెళ్లాక వెనక్కి వచ్చేసి మళ్లీ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ అయ్యింది. అర్ధ రాత్రి జరిగిన ఈ పరిణామం.. అనౌన్స్‌మెంట్‌తో ప్రయాణికులంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. Auckland Airport has been assessing the damage to our international terminal and unfortunately determined that no international flights can operate today. We know this is extremely frustrating but the safety of passengers is our top priority. — Auckland Airport (@AKL_Airport) January 28, 2023 అక్లాండ్(న్యూజిలాండ్) ఎయిర్పోర్ట్ వరదలతో మునిగిపోవడంతో మూసేశారు నిర్వాహకులు. ఈ సమాచారం అందుకున్న పైలట్.. ఎమిరేట్స్ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 9వేల మైళ్ల దూరం ఉన్న ప్రయాణంలో అప్పటికే సగానికి పైగా దూరం విమానం ప్రయాణించేసింది కూడా. అయితే.. అక్లాండ్ ఎయిర్పోర్ట్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అయినప్పటికీ ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని ఒక ప్రకటన విడుదల చేసింది. Did you know the Auckland airport is the only airport in the world to have an immersive underwater experience in the terminal? Brilliant architecture! pic.twitter.com/2weSzlMSQd — STØNΞ | Roo Troop (@MorganStoneee) January 27, 2023 ఇదిలా ఉంటే తీవ్ర వరదలతో మునిగిపోయిన అక్లాండ్ను ఎయిర్‌పోర్ట్‌ను.. జనవరి 29 నుంచి తిరిగి కార్యకలాపాలను పునరుద్ధరించారు. -
Shamshabad Airport: విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం..
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం నెలకొంది. విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతూనే టేకాఫ్ తీసుకుంది. పైలట్ తీరుతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ల్యాండ్ కావాల్సిన విమానం మళ్లీ టేకాఫ్ కావడం చూసి షాక్ అయ్యారు. అయితే ఐదు నిమిషాల తర్వాత విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడు పైలట్. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రన్‌వేపై వెలుతురు సరిగా లేకపోవడంతోనే పైలట్ ఇలా చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ -
తప్పిన ప్రమాదం.. ముంబై విమానం అత్యవసర ల్యాండింగ్
లక్నో: దేశంలో వివిధ కారణాలతో విమానాలు దారి మళ్లించటం, అత్యవరంగా ల్యాండింగ్ చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా వారణాసి నుంచి ముంబయి వెళ్తున్న విస్తారా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టినట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతో విమాన్ని వెనక్కు మళ్లించి ల్యాండింగ్ చేసినట్లు తెలిపింది. ‘విస్తారా ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్ వీటీ-టీఎన్సీ ఆపరేట్ చేస్తున్న యూకే622 విమానం సురక్షితంగా వారణాసిలో ల్యాండింగ్ అయింది. విమానం దిగినట్లు విమానయాన సంస్థ స్పష్టం చేసింది. పక్షి ఢీకొట్టటంతో ఎయిర్‌క్రాఫ్ట్ ముందుభాగం దెబ్బతిన్నది.’ అని ట్విట్టర్లో వెల్లడించింది డీజీసీఏ. ఇదీ చదవండి: Go First Airlines: పక్షి ఢీ కొట్టడంతో విమానం అత్యవసర ల్యాండింగ్! -
స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఐతే స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించినట్లు ఎయిర్‌లైన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని విమానయాన సంస్థ పేర్కొంది. అంతేకాదు ప్రయాణీకులను దుబాయ్‌కి తీసుకువెళ్లే ప్రత్యామ్నాయ విమానాన్ని కరాచీకి పంపుతున్నామని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఐతే అసాధారణంగా ఇంధనం తగ్గుతున్నట్లుగా ఇండికేటర్‌ని చూపించడంతో, పైలట్లు ఇంధనం లీకేజ్ అవుతుందన్న అనుమానంతో విమానాన్ని దారి మళ్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంధనం లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏవియేషన్ రెగ్యులేటర్ పేర్కొంది. (చదవండి: నైట్ క్లబ్లో కాల్పుల కలకలం...ప్రమాదవశాత్తు స్నేహితుడిని కాల్చిన వ్యక్తి) -
Viral Video: గాల్లో ప్రాణాలు.. గగుర్పాటుకు గురిచేసిన వీడియో
Thousands tune in to watch pilots land in London: యూనిస్ తుపాను లండన్ నగరాన్ని వణికిస్తోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ భీకర గాలులు కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. ప్రజలను బయటకు రావద్దని హెచ్చరికలు జారి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే లండన్ వీచిన గాలలుకి ఒక విమానం విమానశ్రయంలో ల్యాండింగ్ అయిన విధానం చూస్తే కచ్చితంగా భయమేస్తుంది. ఆ ఈదురుగాలులకి విమానం ఒక్కసారిగా రోడ్డు మీద వెళ్లుతున్న వాహనాలను ఢీ కొడుతుందేమో అనే సందేహం కలుగుతుంది. ఆ విమానంలో ప్రయాణికలు సైతం భయంతో ఊపిరి బిగబిట్టుకుని చూస్తున్నారు. అంత భయంకరంగా ఆ విమానం రన్ వే పై ల్యాండ్ అయ్యింది. అయితే పైలెట్ చాకచక్యంగా ఆ విమానాన్ని చివరికి సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వొళ్లు గగ్గుర్పాటుకు గురిచేసిన ఈ వీడియోనీ మీరు ఒకసారి వీక్షించండి. (చదవండి: బస్తా చిల్లర పైసలతో షోరూంకి వెళ్లాడు.. ఆ తర్వాత) -
శంషాబాద్‌లో స్పైస్‌జెట్ అత్యవసర ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: స్పైస్ జెట్ విమానం తిరిగి శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శుక్రవారం ఉదయం తిరుపతి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం తిరుపతి విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌కు తిరుపతి ఎయిర్‌పోర్టు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. ఉదయం 7.45 నిమిషాలకు తిరుపతి బయలుదేరిన విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. -
వావ్! అద్భుతహ! ఇది కదా ల్యాండింగ్ అంటే
సాక్షి, హైదరాబాద్: గాల్లోకి ఎగిరే పక్షిని చూసే రైట్ బ్రదర్స్‌కి మనం కూడా గాల్లో ఎగరాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కదా అనంత దూరాలకు సైతం క్షణాల్లో రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేలా చేసింది. ఓర్విల్లే రైట్, విల్బర్ రైట్ సోదరులు అభివృద్ధి చేసిన విమానం ప్రపంచ విమానయాన రంగానికి పునాదులు వేసింది. రైట్ బ్రదర్స్ కృషికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ డేను నిర్వహించుకుంటాం. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఈ నెలలోనే రానున్న రైట్‌బ్రదర్స్ డే తరుణంలో యాదృచ్చికంగా ఎరిక్ సోలేం అనే యూజర్ షేర్ చేసిన వీడియో అద్భుతంగా నిలుస్తోంది. విమాన ప్రయాణానికి బాటలు వేసిన పక్షి అత్యంత సురక్షితంగా, అద్భుతంగా నీటిలోకి ల్యాండ్ అయిన తీరు విశేషం. దీంతో అద్భుతమంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేసుకోండి. విమానం నుంచి ల్యాండ్ అయిన గొప్ప అనుభూతిని సొంతం చేసుకోండి. Awesome! Look at this elegance and flight control! 🥰 pic.twitter.com/X9WsrrulUZ — Erik Solheim (@ErikSolheim) December 4, 2021 -
విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని.. 3 గంటల ప్రయాణం
విమాన ప్రయానం అంటే ప్రయాణికులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు క్షుణంగా పరిశీలిస్తారు. అయితే తాజాగా ఓ వ్యక్తి విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఏకంగా మూడు గంటల ప్రయాణం చేశాడు. విమానం మరో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా ఆ వ్యక్తిని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చదవండి: Thailand Monkey Festival: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ! అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ గేర్‌లో సదరు వ్యక్తి దాక్కున్నాడు. విమానం గాటిమాలా నుంచి మియామి ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అక్కడ విమానం ల్యాండైన అనంతరం అతన్ని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకొని ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. మూడు గంటలపాటు విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ప్రయాణించినా.. ఈ వ్యక్తికి ఎటువంటి గాయాలూ కాలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. This man arrived to MIA in the landing gear of plane from a Guatemala flight. The flight was about two hours and thirty minutes and witness says he was unharmed😳✈️| #ONLYinDADE pic.twitter.com/qMPP5jjDvb — ONLY in DADE (@ONLYinDADE) November 27, 2021 -
ల్యాండింగ్ ప్రాబ్లెమ్ తో క్రాష్ అయిన హెలికాప్టర్
-
Spectacular Video: హంసనావ
నిశ్చలంగా ఉన్న కొలను, అందులో చంద్రుడి ప్రతిబింబం, చుట్టూ పొగమంచు.. తెరలు తెరలుగా కమ్ముకు వస్తున్న చీకటి. ఆ చీకటిని చీల్చుకుంటూ వస్తున్న తెల్లని హంస... వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ తీసిన ఈ వీడియోకి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. 🦢 This is a spectacular shot. Wait for it. #wildlife #NaturePhotography #wildlifephotography via/follow @buitengebieden_ pic.twitter.com/1p04vTaWS4 — Alexander Verbeek 🌍 (@Alex_Verbeek) May 30, 2021 -
యూసూప్ ఆలీ కి తప్పిన పెను ప్రమాదం
-
రోవర్ ల్యాండింగ్ సైటు పేరెంటో తెలుసా..
లాస్ఎంజిల్స్: అంగారక గ్రహంపై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన పర్సెవరన్స్ రోవర్ దిగిన స్థలానికి నాసా పేరుపెట్టింది. రోవర్ దిగిన స్థలానికి ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత ‘ఆక్టేవియా ఇ బట్లర్ ’ పేరును పెట్టారు. అంగారక గ్రహంపై రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, నేరుగా మానవుడు ల్యాండ్ అవ్వడానికి అనువైన స్థలాన్ని వెతకడం పర్సెవరన్స్ విధి. గతంలో మార్స్‌పై దిగిన క్యూరియాసిటి రోవర్ ల్యాండింగ్ స్థలానికి ‘రే బ్రాడ్బరీ’ రచయిత పేరును 2012 ఆగస్టు 22న పెట్టారు. గత ఏడాది జూలై 30 న ఈ రోవర్‌ను నాసా ప్రయోగించిన విషయం తెలిసిందే . ఇది 203 రోజుల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18 న అంగారక గ్రహానికి చేరింది. (చదవండి:మార్స్‌పై రోవర్ అడుగులు షురూ!) -
పెర్సి ల్యాండింగ్ : అద్భుతం, తొలి ఆడియో
వాషింగ్టన్: మార్స్‌పై జరుగుతున్న పరిశోధనల క్రమంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అంగారక గ్రహంపై ‘పర్సవరన్స్’ రోవర్ ల్యాండ్ అవుతున్న అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. ‘‘రోవర్‌లోని మైక్రోఫోన్ మార్స్ నుండి వచ్చే శబ్దాలను ఆడియో రికార్డింగ్‌ను అందించింది. ఇలాంటి శబ్దాలను, వీడియోను సాధించడం ఇదే మొదటిసారి..ఇవి నిజంగా అద్భుతమైన వీడియోలు" అని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ మైఖేల్ వాట్కిన్స్ ఆనందంగా ప్రకటించారు. ఫిబ్రవరి 18న ఈ ల్యాండింగ్‌ను రికార్డు చేసేందుకు 7 కెమెరాలను ఆన్ చేశామని, రోవర్లో రెండు మైక్రోఫోన్లు, 25 కెమెరాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తామని నాసా సైన్స్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ వెల్లడించారు. (పెర్సి సక్సెస్.. మార్స్ ఫోటోలు షేర్ చేసిన నాసా) పర్సవరన్స్ రోవర్ శుక్రవారం అరుణగ్రహంపై ల్యాండ్ అయినసంగతి తెలిసిందే. ఇది రెడ్ ప్లానెట్‌లో ప్రవేశించిన, డీసెంట్ అండ్ ల్యాండింగ్ (ఇడీఎల్) చివరి నిమిషాల్లో ప్రధాన మైలురాళ్లను రికార్డు చేసింది. రోవర్ ల్యాండ్ కావడానికి ముందు పారాచూట్ విచ్చుకోవడంతో పాటు, అది కిందకి దిగుతున్న సమయంలో మూడు నిమిషాల 25 సెకన్ల పాటు కొనసాగే హై-డెఫినిషన్ వీడియో క్లిప్‌ను సాధించాం ఈ సందర్భంగా మార్స్ ఉపరితలం కూడా వీడియోలో కనిపించింది. గ్రహానికి దగ్గరవుతున్న కొద్దీ మరింత స్పష్టంగా కనిపించింది. అక్కడి నేలంతా ఎర్రగా ఉంది. రోవర్ అరుణగ్రహంపై దిగుతున్న సమయంలో లేచిన ధూళి మేఘం, పారాచూట్ సాయంతో వ్యోమనౌక నుంచి కిందకి దిగడం స్పష్టంగా కనిపించిందని నాసా ఇంజనీర్లు ప్రకటించారు. Your front-row seat to my Mars landing is here. Watch how we did it.#CountdownToMars pic.twitter.com/Avv13dSVmQ — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021 Now that you’ve seen Mars, hear it. Grab some headphones and listen to the first sounds captured by one of my microphones. 🎧https://t.co/JswvAWC2IP#CountdownToMars — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021 -
భూమిని చేరిన చంద్రుడి మట్టి నమూనాలు
బీజింగ్: చైనా ప్రయోగించిన ఛాంగీ – 5 సేకరించిన జాబిల్లి నమూనాలు గురువారం విజయవంతంగా భూమిని చేరాయి. ఛాంగీ–5 శోధక నౌక గురువారం తెల్లవారుజామున 1.59 గంటల సమయంలో చైనా ఉత్తర ప్రాంతంలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజన్‌లోని సిజీవాంగ్ బానర్లో ల్యాండ్ అయినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. ఛాంగీ–5 ప్రయోగం విజయవంతం కావడంతో జాబిల్లి కేంద్రంగా చైనా జరిపిన మూడు ప్రయోగాలు కాస్తా పూర్తయినట్లు అయింది. దాదాపు ఎనిమిది టన్నుల బరువున్న ఛాంగీ –5ను నవంబర్ 24న ప్రయోగించారు. జాబిల్లి నమూనాలతో కూడిన ఛాంగీ–5 భాగం అట్లాంటిక్ మహా సముద్రంపై సుమారు 5,000 కిలోమీటర్ల ఎత్తులో ప్రధాన నౌక నుంచి విడిపోయింది. సుమారు 120 కిలోమీటర్ల ఎత్తులో భూమి వాతావరణంలోకి ప్రవేశించిన ఈ భాగపు పారాచూట్ పది కిలోమీటర్ల ఎత్తులో తెరుచుకుంది. ఆ తరువాత ముందుగా నిర్ణయించిన ప్రాంతంలో నమూనాలతో కూడిన భాగం ల్యాండ్ అయ్యింది. నమూనాతో కూడిన క్యాప్సూల్‌ను బీజింగ్ తీసుకెళ్లి అక్కడే తెరుస్తారని సీఎన్ఎస్ఏ తెలిపింది. ఇతర దేశాల శాస్త్రవేత్తలకూ ఈ నమూనాల్లో కొన్నింటిని పరిశోధనలకు అందుబాటులో ఉంచుతామని సీఎన్ఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్ పీ ఝా యూ తెలిపారు. -
హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం
-
గంటన్నర టెన్షన్
కర్ణాటక, హుబ్లీ: ప్రతికూల వాతావరణం వల్ల హుబ్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ల్యాండింగ్‌కు ఆదివారం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆకాశం దట్టంగా మేఘావృతం కావడంతో పాటు వర్షం కురుస్తుండడంతో విమానాలను ల్యాండ్ చేయడానికి పైలట్లు తటపటాయించారు. బెంగళూరు నుంచి బయలుదేరిన ఇండిగో విమానం ఉదయం 8.55 గంటలకు హుబ్లీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే తీవ్రమైన వాతారణ ప్రతికూల పరిస్థితుల వల్ల దిగడానికి సిగ్నల్ దొరక్క ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ఒకవేళ ఇక్కడ సాధ్యం కాకపోతే మంగళూరు, లేదా గోవా విమానాశ్రయాలలో దించాలని అనుకున్నారు. చివరకు సిగ్నల్ లభించడంతో 10.25 గంటలకు సురక్షితంగా ల్యాండింగ్ సాధ్యమైంది. దీంతో సుమారు గంటన్నర పాటు విమానంలోను, విమానాశ్రయంలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ విమానంలో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ అనంతకుమార్ హెగ్డేతో పాటు 49 మంది ప్రయాణికులున్నారు. కాగా, మరో 2 విమానాలు దిగకుండానే బెంగళూరుకు వెనుదిరిగాయి. -
హైవేపై అత్యవసర ల్యాండింగ్
ఘజియాబాద్: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో పైలెట్ జాతీయరహదారిపై సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటన ఢిల్లీ సమీపంలో చోటుచేసుకుంది. ఎన్సీసీకి చెందిన రెండు సీట్ల శిక్షణ విమానం ఒకటి గురువారం మధ్యాహ్నం బరేలీ నుంచి హిండన్ ఎయిర్‌బేస్‌కు బయలుదేరింది. అరగంట తర్వాత ఇంజిన్‌లో లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్ అప్రమత్తమయ్యాడు. అధికారుల సూచనల మేరకు ఘజియాబాద్ జిల్లాలో రెండో నంబర్ జాతీయ రహదారిపై విమానాన్ని అత్యవసరంగా దింపాడు. అందులోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. విమానం రెక్క ఒకటి స్వల్పంగా దెబ్బతింది. -
యుద్ధనౌకపై తేజస్ ల్యాండింగ్ విజయవంతం
న్యూఢిల్లీ: భారత నేవీ కోసం సిద్ధమవుతున్న తేజస్ ‘ప్రయోగదశ’ విమానం.. యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది. దీంతో యుద్ధ విమాన వాహక నౌకలపై యుద్ధ విమానాలను దించగల అతికొన్ని దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ నావికాదళ తేజస్‌ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), ఏర్‌క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సీఎస్ఐఆర్ తదితర సంస్థలు కలసి అభివృద్ధి చేశాయి. తీర ప్రాంత పరీక్ష సౌకర్యాలపై పరీక్షించిన అనంతరం ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై శనివారం ఉదయం 10 గంటల 2 నిమిషాలకు తేజస్ యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయించినట్లు డీఆర్డీవో ప్రతినిధి తెలిపారు. నావికాదళానికే సంబంధించిన తేజస్ లైట్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. భారత యుద్ధ విమానాల అభివృద్ధి కార్యక్రమంలో ఇదో గొప్ప మెట్టు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. -
నేలకు దిగిన బోయింగ్ ఆశలు!
కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో నింగిలోకి దూసుకెళ్లిన బోయింగ్ కంపెనీ స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌక ఆదివారం న్యూమెక్సికోలోని ఎడారిలో సురక్షితంగా ల్యాండైంది. అయితే అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లకుండానే వెనుదిరిగి రావడంతో వచ్చే ఏడాది వ్యోమగాములతో చేయాల్సిన ప్రయోగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కిందకు దిగే క్రమంలో మూడు పారాచ్యూట్లు తెరుచుకోవడంతోపాటు ఎయిర్‌బ్యాగులు కూడా సరిగా పనిచేయడం వల్ల సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. వారం రోజులకు పైగా అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సిన నౌక.. కేవలం ప్రయోగించిన రెండు రోజులకే వెనుదిరగాల్సి వచ్చింది. సురక్షిత ల్యాండింగ్ కావడం కొంతమేర సానుకూల అంశం. నాసా భాగస్వామ్యంతో నిర్మించిన స్టార్‌లైనర్ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌకను మానవరహితంగా ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ప్రయోగించారు. అట్లాస్–5 రాకెట్‌తో నింగిలోకి ఎగిరిన స్టార్‌లైనర్ 15 నిమిషాలకు దాని నుంచి వేరుపడింది. అయితే ఆ తర్వాత కొన్ని నిమిషాలకు తమ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్య నుంచి దారి తప్పిందంటూ బోయింగ్ ట్వీట్ చేసింది. దాన్ని సరైన కక్ష్యలోకి తెచ్చే ప్రయత్నాల్లో తాము నిమగ్నమైనట్లు తెలిపింది. వచ్చే ఏడాది వ్యోమగాములను స్టార్‌లైనర్ ద్వారా అంతరిక్ష యాత్రకు పంపాలని సంకల్పించిన క్రమంలో తాజా వైఫల్యం తీవ్ర ఆందోళన కలిగించే అంశం కానుంది. వచ్చే ఏడాది స్టార్‌లైనర్ కాప్సూ్యల్లో ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు బోయింగ్ సన్నాహాలు చేస్తోంది. -
బేగంపేట్.. c\o వీఐపీ ఎయిర్పోర్ట్
ఈ ఎయిర్‌పోర్టులో విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు వీలుగా, భద్రతా అవసరాల నిమిత్తం ప్రాంగణానికి సమీపంలో అంటే.. 5నుంచి 6కి.మీ దూరంలోఉన్న 18 మీటర్లకంటే ఎత్తయిన భవనాలపై ‘ఎయిర్ క్రాఫ్ట్ అబ్ స్ట్రక్షన్ వార్నింగ్ లైట్స్’ ఏర్పాటు చేసుకోవాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ఈ లైట్ల ఏర్పాటుతో పైలెట్లు బేగంపేట్ విమానాశ్రయంలో ఫ్లైట్స్‌ను ల్యాండ్ చేసే సమయంలో వారికి అక్కడ అత్యంత ఎత్తయిన భవంతి ఉన్న విషయాన్ని పసిగట్టే అవకాశం ఉంటుందని, ఈ ఆదేశాలన్నీ భద్రతా కోణంలో జారీ చేసినవని విమానాశ్రయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ సిటీ నడిబొడ్డున ఉన్న బేగంపేట్ విమానాశ్రయానికి మరింత క్రేజ్ పెరుగుతోంది. వీఐపీలు, వీవీఐపీలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ వంటి ప్రముఖులు వినియోగించే చార్టర్ ఫ్లైట్స్ రాకపోకలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ప్రతినెలా ఈ విమానాశ్రయం నుంచి వందలాదిగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విమానాశ్రయం నగరంలోని ప్రధాన ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉండడంతో వీఐపీలు, వీవీఐపీలు ఇక్కడి నుంచి ఇతర దూరప్రాంతాలకు బయలుదేరి వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం. అయితే, ఈ విమానాశ్రయానికి సమీపం (5–6 కి.మీ)లో సుమారు 18 మీటర్ల కంటే ఎత్తున్న బహుళ అంతస్తుల భవనాల యజమానులు ‘ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా’(ఏఏఐ) నుంచి ఆన్లైన్లో ఎన్ఓసీలు(నిరభ్యంతర పత్రాలు) పొందాలని తాజాగా ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ ఆదేశాలిచ్చింది. రోజురోజుకు పెరుగుతోన్న రద్దీ బేగంపేట్ విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతితో పాటు పలు వురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలు రాకపోకలు సాగించేందుకు ఇది అనుకూలంగా ఉండడంతో వారంతా ఈ ఎయిర్‌పోర్టుపై ఆసక్తిచూపుతున్న నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో విమానాల రద్దీ పెరుగుతోంది. ఇక నగరానికి వచ్చే దేశ, విదేశీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు సైతం ఈ విమానాశ్రయంలోనే తమ చార్టర్ ఫ్లైట్స్‌ను ల్యాండ్ చేసేందుకు ఇష్టపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో నెలకు సుమా రు 300కు పైనే ప్రైవేట్ విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రైవేటు ఫ్లయింగ్ క్లబ్స్, డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను వినియోగించే రక్షణశాఖ సైతం ఈ విమానాశ్రయం సేవలను తరచూ వాడుకుంటుండడంతో రద్దీ పెరుగుతోంది. ఎన్ఓసీలకు దరఖాస్తు ఇలా.. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఎత్తయిన భవంతుల యజమానులు భవనం ఎత్తు క్లియరెన్స్‌కు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) పొందాల్సి ఉంటుంది. ఈ ఎన్ఓసీని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పదిరోజుల్లో ఆన్లైన్లోనే జారీ చేస్తారు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్ల వరకు ఉంటుంది. ఈఎన్ఓసీలను ఉచితంగానే జారీచేస్తామని ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఆయా భవనాల యజమానులు తమ భవవతుల పూర్తి వివరాలు, జీహెచ్ఎంసీ జారీ చేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ తదితర వివరాలను ఆన్లైన్లోనే పూరించాల్సి ఉంటుంది. ఇందుకోసం హెచ్‌టీటీపీఎస్://ఎన్‌ఓసీఏఎస్2.ఏఏఐ.ఏఈఆర్ఓ/ఎన్‌ఓసీఏఎస్ వెబ్సైట్లో సంప్రదించాలి. -
జెట్ నుంచి ఎజెక్ట్ అయితే.. ఎట్లుంటదో తెలుసా ?
అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు జెట్ విమానాల నుంచి దూకాల్సి వస్తుంది. అలా దూకడం అంత సులువేం కాదు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అలా దూకిన తర్వాత గాయాలపాలైన పైలట్లు కొన్ని సంవత్సరాల వరకు ఏ విమానాన్ని కూడా నడపలేరు. విమానం నుంచి సడన్‌గా సీటు విడిపోవడంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది. దూకే సమయంలో సాధారణ గురుత్వాకర్షణ శక్తి కన్నా 14 నుంచి 16 రెట్లు ఎక్కువగా సీటుపై శక్తి పనిచేస్తుంది. గాలి వేగంగా ఉన్న సమయంలో జెట్ నుంచి దూకడం వల్ల చేతులు విరుగుతుంటాయి. భుజం ఎముకకు గాయాలు అవుతుంటాయి. కాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే అవకాశ ఉంటుంది. మంటలు రావడంతో శరీరం కాలిపోయే ప్రమాదం ఉంది. -
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కోలకతా: ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 76మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఇండిగో విమానం కోలకతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం 8.30 గంటలకు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. గువహటికి వెళ్లాల్సిన విమానం టేకాఫ్ తీసుకున్నకొన్నినిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు. కాక్‌పిట్‌లో పొగ అలారం మోగడంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగానికి సమాచారం అందించారని తెలిపారు. పొగలను గుర్తించినట్టు చెప్పారు. అయితే పైలట్ అప్రతమత్తతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణీకులు, సిబ్బందితోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
శంషాబాద్‌లో నాలుగు విమానాలు అత్యవసర ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం నాలుగు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. ఉత్తరభారతంలో పొగమంచు విపరీతంగా ఉన్న కారణంగా ఈ అంతర్జాతీయ విమానాలను శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్‌కు ఎయిర్‌పోర్టు అధికారులు అవకాశం కల్పించారు. జెడ్డా-లక్నవూ, సౌది అరేబియా-ఢిల్లీ, దుబాయ్-బంగ్లాదేశ్, సింగపూర్- ఢిల్లీ విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. -
ప్రపంచ రికార్డు సృష్టించిన ముంబై ఎయిర్‌పోర్టు
సాక్షి, ముంబై: ముంబైలోని సహార్ ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ప్రపంచ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఇలా 24 గంటల్లో ఒకే రన్ వే పై ఏకంగా 969 విమానాల (టేకాఫ్, ల్యాండింగ్) రద్దీని నియంత్రించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అందుకు ప్రధాన కారణం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సిబ్బంది సమన్వయం, ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని ఎయిర్ పోర్టు అథారిటీ వర్గాలు తెలిపాయి. 2006 వరకు ముంబై విమానాశ్రయంలో గంటకు 30 విమానాల రాకపోకలు (టేకాఫ్, ల్యాండింగ్) ఏటీసీ సిబ్బంది నియంత్రించేవారు. ఆ తరువాత రెండేళ్లలో ప్రధాన రన్ వేలో మార్పులు, ఆధునిక రాడార్, ఇతర సాంకేతిక పరికరాలవల్ల ఈ సంఖ్య 52కు చేరింది. ఇదివరకు 24 గంటల్లో 852 విమనాలు రాకపోకలు సాగించినట్లు రికార్డులు ఉన్నాయి. ప్రతీరోజు రాకపోకలు సాగించే విమానాలకు తోడుగా ఎప్పుడైన అదనంగా విమానాల సంఖ్య పెరిగితే వాటిని నియంత్రించే సామర్ధ్యం తమ సిబ్బందికి ఉందని ఏటీసీ జనరల్ మేనేజరు ఆర్.కే.సక్సేనా పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మొదలుకుని శనివారం రాత్రి వరకు ఇలా 24 గంటల్లో మొత్తం 969 విమానాలను నియంత్రించినట్లు ఆయన చెప్పారు. అయితే ఏ సమయంలో ఎక్కువ విమానాలు టేకప్, ల్యాండింగ్ అయ్యాయనేది చెప్పడం కష్టమని తెలిపారు. కాగా నిర్వాహణ పనుల కోసం ప్రతీరోజు రన్ వే ను ఒక గంటసేపు మూసి ఉంచాలనేది నియమాలున్నాయి. ఆ ప్రకారం 23 గంటల్లోనే 969 విమనాలను నియంత్రించి రికార్డు సృష్టించినట్లు స్పష్టమైతోందని ఆయన అన్నారు. ఇదిలాఉండగా ముంబై విమానాశ్రయంలో ప్రధాన రన్ వేపై ఏ–380 లాంటి భారీ విమానాలు టేకాప్, ల్యాండింగ్ చేసే సామర్థ్యం ఉంది. దీంతో ఈ రన్ వే కు క్యాట్–3 గ్రేడ్ లభించింది. సాధ్యమైనంత వరకు రన్ వే ను ఖాళీ చేస్తే వెనక వచ్చే విమనాలకు అవకాశం లభిస్తుంది. పూర్వం ఒక్కో విమానం ల్యాండింగ్ లేదా టేకప్ చేయడానానికి 60 సెకండ్లకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు 47–48 సెకండ్లు మాత్రమే సమయం పడుతుంది. దీంతో విమానాలు రన్ వే మీదుగా టేకప్ లేదా ల్యాండింగ్ ఎక్కువ సంఖ్యలో చేయడానికి వీలుపడుతుందని సక్సేనా అన్నారు. -
మరో అడ్డగోలు సాహాసం
-
విమానం గాల్లో ఉండగా పేలిన ఇంజిన్..!
వాషింగ్టన్: విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిలైన ఘటన శనివారం అమెరికాలో చోటుచేసుకుంది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం న్యూ ఓర్లిన్స్ నుంచి ఒర్లాండోకు వెళ్తుండగా విమానం ఇంజన్లలో ఒకటి ఆకస్మికంగా విఫలమైంది. పెద్దశబ్దంతో ఇంజిన్‌లో పేలుడు సంభవించడంతో విమానం ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో అందులోని 99 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. విమానాన్ని అత్యవసరంగా పెన్సాకోలా విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. విమానంలో తన భర్తతో పాటు ముగ్గురు పిల్లలతో ప్రయాణించిన ఓ మహిళ మీడియాతో మాట్లాడుతూ.. తన విండో సీటు వెలుపల ఉన్న విమాన ఇంజిన్ ఒక్కసారిగా పేలిందని, అక్కడ నుంచి పొగ రావడం గమనించానని తెలిపింది. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైనట్లు వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ జరుపుతున్నట్లు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో విమానాలు నడిపే అతిపెద్ద విమాన సంస్థగా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు పేరుంది. -
చుక్కలు చూపించిన విమానం!
న్యూయార్క్ః విమాన ప్రయాణం అంటేనే ఇటీవల వణుకు పుట్టే పరిస్థితి వస్తోంది. సాంకేతిక లోపాలు ఏర్పడటం, పక్షులు అడ్డు పడటం, ల్యాండింగ్ లో పొరపాట్లు జరగడం వంటి సంఘటనలు మామూలైపోయింది. తాజాగా న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ విమానం ఒక్క ఉదుటున ఎగిరి పడటంతో ప్రయాణీకులు అదిరి పడ్డారు. ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ 767 ప్యాసింజర్ విమానం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. ల్యాండ్ అయ్యే ముందు పైలట్ మనసు మార్చుకోవడంతో రన్ వే పై బౌన్స్ కొట్టి, తిరిగి టేకాఫ్ అయ్యింది. పైలట్ రఫ్ రైడింగ్ తో విమానంలోని ప్యానెల్స్, మెకానికల్ బాక్స్ లు ఇతర చిన్న చిన్న వస్తువులు ప్రయాణీకులపై పడ్డాయి. హోస్టన్ నుంచి 214 మంది ప్రయాణీకులతో బయల్దేరిన 557 విమానం ల్యాండింగ్ విషయంలో ఏర్పడ్డ అస్థవ్యస్థ స్థితికి ప్రయాణీకులు వణికిపోయారు. ల్యాండ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన విమానం స్కిప్ అవ్వడంతో పైలట్ తిరిగి టేకాఫ్ చేశాడని, తిరిగి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా విమానం తిప్పలు పెట్టడంతో మరోసారి టేకాఫ్ చేశాడని ఇలా పలుమార్లు ల్యాండింగ్ కు ప్రయత్నించడం, టేకాఫ్ అవ్వడం ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఓ ప్రత్యక్ష సాక్షి... ప్రయాణీకుడు తెలిపాడు. చివరిసారి ల్యాండ్ అయ్యేందుకు ముందు ఆకాశంలో పైటట్ కనీసం 30 సార్లు చక్కర్లు కొట్టించినట్లు తెలిపిన ప్రయాణీకుడు.. ఎట్టకేలకు ల్యాండ్ చేయడంతో ప్రయాణీకుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసినట్లు చెప్పాడు. అయితే విమానం చివరికి సేఫ్ గా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు తగల్లేదని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అయితే అంతటి సందిగ్ధావస్థలోనూ ఓ వ్యక్తి వీడియోను తీసి సిబ్బందికి అందించడం విశేషం. -
విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్
బ్రిటీష్ ఎయిర్ వేస్‌కు చెందిన విమానాన్ని అనుమానిత డ్రోన్ ఢీకొట్టింది. యూరోప్‌లోనే చాలా రద్దీగా ఉండే విమానాశ్రయమైన హిత్రూ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు అధికారులు ఆదేశించారు. 137 మంది ప్రయాణికులు, విమానసిబ్బందితో ఎయిర్ బస్ ఏ320 విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్దంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో డ్రోన్, విమానాన్ని ఢీకొట్టినట్టు గమనించిన పైలెట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. విమానం జెనీవా నుంచి హిత్రూకు వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం సురక్షింతంగా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే సిబ్బంది తనిఖీ చేశారు. విమానానికి ఎలాంటి హాని జరగకపోవడంతో మరుసటి ప్రయాణానికి ఎయిర్ బస్ ఏ320 బయలుదేరింది. అయితే గడచిన మూడు నెలల్లో యూకేలోనే ఇలాంటివి 23 సంఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. విమానాలు, ఢ్రోన్లను ఢీకొంటే కలిగే తీవ్రపరిణామాల గురించి తెలియని వారే ఎదో సరదా కోసం ఇలా చేస్తున్నారని బ్రిటీష్ పైలట్స్ అసోసియేషన్ అధికారి స్టీవ్ లాండెల్స్ తెలిపారు. విమానానికి దగ్గరగా డ్రోన్లను తీసుకురావడం చట్ట పరంగా నేరమని పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి
భోపాల్ః మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ముంబై బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బుధవారం ఉదయం విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి ఢీకొట్టడంతో బయల్దేరిన కొద్ది సమయానికే ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఎఎల్ 634 విమానం... 129 మంది ప్రయాణీకులతో ఉదయం 8.30 నిమిషాలకు భోపాల్ నుంచి ముంబైకి బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాస్సేపటికే పక్షి ఢీకొట్టి ఇంజన్ లో ఇరుక్కుపోయింది. దీంతో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. విషయాన్ని గమనించిన పైలట్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వారి సలహా మేరకు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. -
రోడ్లపైనే యుద్ధవిమానాల ల్యాండింగ్
మీరు రోడ్డుపై వెళ్తుంటే.. అకస్మాత్తుగా ఓ యుద్ధవిమానం మీ ముందు ల్యాండ్ అవచ్చు. విమానాలు ల్యాండ్ కావడానికి ప్రత్యేక రన్ వే అవసరం కదా.. రోడ్డుపై ల్యాండ్ అవడం ఏంటీ అని అనుకోకండి. భారత వైమానిక దళం ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. విమానాల ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు వైమానిక దళం లేఖ రాసింది. అమెరికా, బ్రిటన్, రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే రోడ్లపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేస్తున్నాయి. హైవేలను విశాలంగా నిర్మించడం వలన మనం కూడా విమానాలను ల్యాండ్ చేయడం వీలవుతుందని రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి శంకర్ ప్రసాద్ తెలిపారు. దీనిలో భాగంగా మిరేజ్ 2000 రకానికి చెందిన విమానాన్ని గత మే నెలలో నోయిడా - ఆగ్రా రహదారిపై విజయవంతంగా ల్యాండ్ చేశారు. అత్యవసర సమయంలో విమానాల ల్యాండింగ్‌కు ఎక్కడో దూరంగా ఉన్న రన్ వే ల కోసం చూడకుండా ఈ విధానం ద్వారా తక్షణమే స్పందించడానికి వీలవుతుందని ఎయిర్ ఫోర్స్ భావిస్తుంది. పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలయిన గుజరాత్, రాజస్థాన్‌లలో ఇలా రోడ్లను రన్ వే లు గా ఉపయోగించుకోవడం వలన అత్యవసర సమయంలో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. విమానాలు ల్యాండ్ కావడానికి రహదారులు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు పొడవుతో తగినంత విశాలంగా, సమాంతరంగా ఉంటేనే వీలవుతుంది. -
'ఫ్రంట్ వీల్ లేకుండానే విమానం ల్యాండింగ్'
టెహ్రాన్: ఇరాన్‌కు చెందిన విమానం ఒకటి ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించకపోతే భారీ ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి కూడా వచ్చేది. అసలు ఈ విమానం ల్యాండ్ చేసిన తీరే అత్యద్భుతం. ఎందుకంటే ముందు చక్రాలు లేకుండానే ప్రధాన చక్రాల ద్వారా విమానాన్ని దించి పైలెట్లు ఔరా అనిపించారు. ఇరాన్ ఎయిర్ బోయింగ్ 727 విమానం ఒకటి మెహ్రాబాద్ విమానాశ్రయంలో దిగడానికి ముందు విమానం ముందు కొన భాగం గేర్లలో (ఎయిర్ నోస్ గేర్) సమస్య తలెత్తి ఆ చక్రాలు తెరుచుకోలేదు. దీంతో పైలెట్ ఎంతో పరిణితితో ఆలోచించి ముందు విమానాన్ని వీలయినంత ఎత్తులో ఎగిరేలా చేశారు. అనంతరం ప్రధాన చక్రాల ద్వారా రన్ వేను తాకించి వీలయినంత పైకి విమానం ముందు కొనభాగం పైకెత్తి పట్టుకొని వేగం తగ్గించారు. అలా ముందుకు కదిలిన విమానం ఓ సమయంలో బలంగా నేలను తాకి పల్టీ కొడుతుందా అనేంత భయం కూడా కలిగింది. కానీ నేర్పుతో విమానం బ్యాలెన్స్ మొత్తాన్ని ప్రధాన వీల్స్ పైనే ఉంచి మెల్లిగా నోస్ను తాకించి సురక్షితంగా విమానం ల్యాండ్ చేశారు. దీంతో 94 మంది ప్రయాణీకులు, 19 మంది విమానసిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. -
రోడ్లపైనే ల్యాండింగ్...
హైదరాబాద్: అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా ఉపయోగించుకునే ప్రయత్నంలో భాగంగా గురువారం మథుర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై మిరాజ్ 2000 రకం యుద్ధవిమానాన్ని ల్యాండ్చేస్తున్న దృశ్యం. భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధవిమానాన్ని ఇలా రహదారిపై విజయవంతంగా ల్యాండ్ చేయడం ఇదే తొలిసారి. -
సింగపూర్ విమానానికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళుతున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎంఐ 473 విమానం టేకాఫ్ అయిన గంట తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డారు. దాంతో అప్రమత్తమైన పైలల్ విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రమంలో సురక్షితంగా దించాడు. విమానంలో ప్రయాణిస్తున్న 120మంది ప్రయాణికులను హోటల్‌కు తరలించారు. -
బేగంపేటలో విమానం మోత మోగింది
హైదరాబాద్ : బేగంపేట విమానాశ్రయంలో శనివారం ఒక్కసారిగా విమానం మోత మోగింది. ఓ విమానం పదుల సార్లు ల్యాండింగ్‌కు రావడం.. తిరిగి పైకి ఎగిరిపోవటం .... ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం సికింద్రాబాద్ చుట్టూ 20సార్లు చక్కర్లు కొట్టింది. ఎయిర్‌పోర్టుకు రావడం ల్యాండింగ్ అవుతున్నట్లు కిందికి దిగడం.. మళ్లీ తిరిగి పైకి ఎగరడంతో చుట్టుపక్కలవారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సాంకేతిక సమస్యలు తలెత్తాయేమోనని హడలిపోయారు. తీరా ఎయిర్ పోర్టు అధారిటీని సంప్రదించగా... అసలు విషయం తెలిసింది. ఎయిర్ ఇండియా పైలెట్లు శిక్షణ నిమిత్తం ల్యాండింగ్ చేస్తున్నట్లు చెప్పడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. -
రెస్టారెంటుగా మారనున్న విమానం...
విమానం ర్యాంగ్ ల్యాండింగ్ కాలేదు.. అలాగని ఇది విమానం బొమ్మ కూడా కాదు.. ఇది నిజమైన విమానమే. ఇండోనేసియాలోని బాలీలో ఉంది. ఓ పాత బోయింగ్ 737ను కొన్న స్థానిక వ్యాపారి త్వరలో దీన్ని సినిమా థియేటర్ కమ్ రెస్టారెంట్‌గా మార్పు చేయిస్తాడట