జ్యూరిచ్:గత వారం తమ సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇంజిన్‌లో లోపం కారణంగా విమానంలో పొగలు వచ్చాయని ఈ ఘనటనలో ఆస్పత్రి పాలైన విమాన సిబ్బంది ఒకరు మృతి చెందారని వెల్లడించింది. ఈమేరకు ఎయిర్‌లైన్స్ సీఈవో మీడియాతో మాట్లాడారు.
‘బుకారెస్ట్ నుంచి జ్యూరిచ్ వెళుతుండగా మా ఎయిర్‌బస్ ఎ220 విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే విమానాన్ని గ్రాజ్ నగరంలో అత్యవసర ల్యాండింగ్ చేశాం. విమానంలో పొగలు రావడం వల్ల అస్వస్థతకు గురైన ప్రయాణికులు,సిబ్బందిని ఆస్పత్రిలో చేర్చాం.
వీరిలో మా సిబ్బంది ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందడం షాక్‌కు గురిచేసింది’అని స్విస్ ఎయిర్‌లైన్స్ సీఈవో ఫెలింగర్ తెలిపారు. సాంకేతిక లోపం ఏర్పడినపుడు విమానంలో 74 మంది ప్రయాణిస్తున్నారు. పొగల కారణంగా సిబ్బంది సహా మొత్తం 12 మంది అస్వస్థతకు గురయ్యారు.
ఇదీ చదవండి: విమానంలో ఏ సీటు భద్రం
Comments
Please login to add a commentAdd a comment