
photo credit: HINDUSTAN TIMES
లడాఖ్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. హిమాలయాల్లో ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌పై సి-130జె విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ తొలిసారిగా నైట్‌ల్యాండింగ్ చేసింది. ‘ఇటీవలే ఐఏఎఫ్ సి-130ని కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌లో తొలిసారి విజయవంతంగా రాత్రివేళ ల్యాండ్ చేశాం’అని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఐఏఎఫ్ ప్రత్యేక బలగాల యూనిట్ ద గార్డ్స్ శిక్షణను కూడా ఈ ఫీట్‌లో భాగంగా ఐఏఎఫ్ కలిపి నిర్వహించడం విశేషం. నైట్ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ఐఏఎఫ్ వెల్లడించలేదు. హిమాలయాల్లో 8800 మీటర్ల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌లో విమానాలను ల్యాండ్ చేయడం పైలట్లకు సవాళ్లతో కూడుకున్న టాస్క్.అత్యంత ఎత్తుతో పాటు ప్రతికూల వాతావరణంలో విమానాలను ల్యాండ్ చేయాలంటే పైలట్లకు ప్రత్యేక నైపుణ్యాలు ఉండాల్సిందే.
గత ఏడాది నవంబర్‌లోనూ ఐఏఎఫ్ ఉత్తరాఖండ్‌లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్‌పై లాక్‌హిడ్ మార్టిన్‌కు చెందిన సూపర్ హెర్క్యులస్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానాన్ని విజయవంతంగా నైట్ ల్యాడింగ్ చేసింది. ఉత్తర కాశీ టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకుగాను ఈ విమానాలు భారీ ఇంజినీరింగ్ పరికరాలను మోసుకెళ్లాయి.