Air Force
-
‘రక్షణ’లో సంస్కరణలు
న్యూఢిల్లీ: 2025ను రక్షణ సంస్కరణల ఏడాదిగా కేంద్రం ప్రకటించింది. త్రివిధ దళాల ఆధునీకరణ, మెరుగైన సమన్వయం, నిరంతర యుద్ధ సన్నద్ధతతో పాటు ఆధునిక పరిజ్ఞానాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం తదితరాలే లక్ష్యంగా నూతన సంవత్సరంలో రక్షణ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం 9 సూత్రాలతో కూడిన సమగ్ర రక్షణ సంస్కరణల ప్రణాళికను రూపొందించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర పడింది. త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ దేశ భద్రతకు, సార్వ భౌమత్వ పరిరక్షణకు పెద్దపీట వేసేలా కనీవినీ ఎరగని రీతిలో త్రివిధ దళాలను సన్నద్ధం చేసేందుకు ఈ సంస్కరణలు బలమైన పునాదులు వేస్తాయని రాజ్‌నాథ్ వెల్లడించారు. త్రివిధ దళాల సంయుక్త కమాండ్ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ సామర్థ్యాలను మరింతగా ఏకీకృతం చేయడం ద్వారా యుద్ధ సమయాల్లో, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో రక్షణ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని రక్షణ శాఖ భేటీ అభిప్రాయపడింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సంయుక్త సైనిక కమాండ్లు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కమాండ్లోనూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో కూడిన యూనిట్లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లోని భద్రతాపరమైన సవాళ్లు తదితరాలను తిప్పికొట్టేందుకు పూర్తి సమన్వయంతో సాగుతాయి. ఈ త్రివిధ దళాలు ఇప్పటిదాకా విడివిడిగా కమాండ్ల కింద వేటికవే స్వతంత్రంగా పని చేస్తూ వస్తున్నాయి. అవి పరస్పరం మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం చాలా ఉందని భేటీ అభిప్రాయపడింది. 9 సూత్రాల రక్షణ సంస్కరణ ప్రణాళికలో ముఖ్యాంశాలు...→ దేశీయ రక్షణ సామర్థ్యం ప్రపంచ స్థాయి ప్రమా ణాలను అధిగమించే దిశగా నిరంతర కృషి. అందుకోసం బలగాల అవసరాలను ఎప్పటి కప్పు డు గుర్తించడం, వాటిని యుద్ధ ప్రాతిపది కన తీర్చడం.→ ఇందుకోసం రక్షణ సంబంధిత కొనుగోళ్లు, ఆయుధ సేకరణ ప్రక్రియలను వీలైనంతగా సరళతరం చేయడం, వాటిలో అనవసర జాప్యాలను నివారించడం.→ ప్రపంచవ్యాప్తంగా పలు ఆధునిక సైనిక శక్తుల్లోని అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం, వాటిని మన పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడం→ భారతీయ సంస్కృతి, ఆలోచనా ధోరణులను గర్వకారణంగా చర్యలు చేపట్టడం→ సైబర్, స్పేస్‌తో పాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్, హైపర్సోనిక్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలకు పెద్దపీట→ రక్షణ రంగంలో భావి సంస్కరణలకు మరింతగా ఊతం. తద్వారా భద్రతా దళాలను మరింత శక్తిమంతంగా, సాంకేతికంగా సాటి లేని శక్తిగా మార్చడం. భిన్నమైన డొమైన్లలో సమగ్ర కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహించగలిగేలా తీర్చిది ద్దడం.→ రక్షణ, పౌర, ప్రైవేటు రంగాల మధ్య మరింతగా పరిజ్ఞాన బదిలీకి వీలు కల్పించడం. వ్యాపార సరళీకరణ కోసం ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వా మ్యాలకు ప్రోత్సాహం.→ రాబోయే కొన్నేళ్లలో రక్షణ ఎగుమతుల్లో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చి దిద్దడం. విదేశీ తయారీదారులతో భారత రక్షణ పరిశ్రమ సంయుక్తంగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు చేయూత.→ మాజీ సైనికుల సంక్షేమంపై మరింత దృష్టి. వారి అనుభవానికి పెద్దపీట. -
తుర్కియే వైమానిక సంస్థపై ఉగ్ర దాడి
అంకారా: తుర్కియే రాజధాని అంకారా నగర శివారులోని ఒక వైమానిక, రక్షణ రంగ సంస్థపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని తుర్కియే అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. 14 మంది గాయపడ్డారు. అయితే ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు? అనే వివరాలను బయటపెట్టలేదు. టుటాస్ అనే సంస్థ ప్రాంగణంలో దాడి జరిగినట్లు మంత్రి అలీ యెర్లికాయా చెప్పారు. తుర్కియేలో గతంలో కుర్ద్ మిలిటెంట్లు, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, వామపక్ష ఉగ్రవాదులు దాడులు జరిపారు. సంస్థలో భద్రతా సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో కొందరు ఆగంతకులు హఠాత్తుగా వచ్చి బాంబులు వేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రైవేట్ ఎన్టీవీ చానెల్ తన కథనంలో పేర్కొంది. అయితే ఆగంతకులు పారిపోలేదని లోపలి సిబ్బందిని బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నారని, ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తొలుత కేవలం బాంబు పేలుడు జరిగినట్లు వార్తలొచ్చాయి. సంస్థలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని హబర్‌టర్క్ టెలివిజన్ పేర్కొంది. -
శుభాన్షు శుక్లా... ఎంటర్ ద ‘డ్రాగన్’
ప్రతిష్టాత్మక ఆక్సియం స్పేస్ ఏఎక్స్–4 మిషన్‌కు ఎంపికైన భారత వ్యోమగామి, వైమానిక దళ గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా తాము ప్రయాణించబోయే అత్యాధునిక డ్రాగన్ వ్యోమనౌకను తొలిసారి సందర్శించారు. అమెరికాలో హూస్టన్‌లోని స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిగతా ముగ్గురు సిబ్బందిని ముఖాముఖి కలుసుకున్నారు. వారంతా కలిసి వ్యోమనౌకలో కాసేపు గడిపారు. స్పేస్సూట్కు కొలతలివ్వడంతో పాటు ప్రెజరైజేషన్ తదితర తప్పనిసరి పరీక్షల్లో వారంతా పాల్గొన్నారు. దీంతో వారందరికీ శిక్షణ ప్రక్రియ లాంఛనంగా మొదలైనట్టయింది. ఈ మిషన్‌కు నాసా వ్యోమగామి పెగీ వాట్సన్ సారథ్యం వహించనున్నారు. ఇందులో భాగంగా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 10 రోజుల పాటు పలు ప్రయోగాలు, పరిశోధనల్లో గడుపుతారు. ప్రైవేట్ వ్యక్తులు, పరిశోధకులకు ఐఎస్ఎస్ సందర్శనకు వీలు కలి్పచేందుకు స్పేస్ ఎక్స్ తలపెట్టిన నవతరం వాణిజ్య అంతరిక్ష యాత్రల్లో ఆక్సియం స్పేస్ మిషన్ నాలుగోది. ఆక్సియం స్పేస్, స్పేస్ ఎక్స్, నాసా భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరుగుతోంది. -
15 వేల అడుగుల ఎత్తు నుంచి.. పోర్టబుల్ ఆస్పత్రి పారా–డ్రాప్
న్యూఢిల్లీ: భారత ఆర్మీ, వైమానిక దళం కలిసి అరుదైన ఘనతను సాధించాయి. పోర్టబుల్ ఆస్పత్రి ‘ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్’ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా లక్షిత ప్రాంతంలో నేలపైకి దింపాయి. అత్యంత ఎత్తులో నుంచి విజయవంతంగా పూర్తి చేసిన ఈ పారా–డ్రాప్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిదని రక్షణ శాఖ తెలిపింది. ఇందులోని క్రిటికల్ ట్రామాకేర్ క్యూబ్‌లను భీష్మ(భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి)ప్రాజెక్టులో భాగంగా దేశీయంగానే రూపొందించినట్లు వెల్లడించింది. మారుమూల, అటవీ కొండ ప్రాంతాల్లో వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో బాధితులకు అత్యంత వేగంగా, సమర్థమైన వైద్యసేవలను అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పోర్టబుల్ ఆస్పత్రికి రూపకల్పన జరిగిందని వివరించింది. ఇందులోనున్న వసతులతో 200 మందికి వైద్య సేవలందించొచ్చని తెలిపింది. ఈ క్యూబ్‌ను అధునాతన రవాణా విమానం సీ–130జే సూపర్ హెర్క్యులస్ ద్వారా అనుకున్న చోట అనుకున్న విధంగా నేలపైకి సురక్షితంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఆర్మీ ఇందుకోసం అత్యాధునిక ప్రెసిషన్ డ్రాప్ సాంకేతికతను వినియోగించుకుందని తెలిపింది. -
భారత్ ‘తరంగ్ శక్తి’ యుద్ధవిన్యాసాలు (ఫోటోలు)
-
ఆయుధ వ్యవస్థల ప్రదర్శనకు ‘తరంగ్ శక్తి’
రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ వరుస విన్యాసాలకు వేదికగా నిలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల ఆరో తేదీ నుంచి తమిళనాడులోని సూలూరులో ప్రారంభమైన ‘తరంగ్ శక్తి 2024’ మొదటిదశ యుద్ధవిన్యాసాలు రేపటితో ముగియనున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విన్యాసాల్లో 30 దేశాలకు పైగా పాల్గొన్నట్లు తెలిసింది. దేశీయంగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించేందుకు ‘తరంగ్ శక్తి’ మంచి వేదికని మంగళవారం డీఆర్డీఓ ఛైర్పర్సన్ సమీర్ వి కామత్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘భారత వైమానిక దళం ఆధ్వర్యంలో జరుగుతున్న తరంగ్ శక్తి ఎక్సర్సైజ్ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శించేందుకు మంచి వేదిక. అవసరమైనప్పుడు దేశాన్ని రక్షించగల సామర్థ్యం ఉందని భారత ప్రజలకు తెలియజేసే అవకాశంగా ఈ కార్యక్రమం నిలిచింది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఏఎంసీఏ ఫైటర్ జెట్(స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్) డిజైన్ పూర్తయింది. అభివృద్ధి ట్రయల్స్‌ను త్వరలో నిర్వహించి 2034 నాటికి దాన్ని సైన్యానికి అందిస్తాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అభివృద్ధి చేసే అతికొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి’ అని అన్నారు.ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!తరంగ్ శక్తి యుద్ధ విన్యాసాలు రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకూ తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్‌స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ విన్యాసాలకు ఈసారి రష్యా, ఇజ్రాయిల్ దూరంగా ఉంటున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్–18, బంగ్లాదేశ్‌కు చెందిన సీ–130, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్, జర్మనీకి చెందిన టైఫూన్, గ్రీస్‌కు చెందిన ఎఫ్–16, స్పెయిన్‌కు చెందిన టైపూన్, యూఏఈకి చెందిన ఎఫ్–16, యూకేకి చెందిన టైపూన్, యూఎస్ఏకి చెందిన ఏ–10, ఎఫ్–16, ఎఫ్ఆర్ఏ, సింగపూర్‌కు చెందిన సీ–130 యుద్ధ విమానాలు, బలగాలు విన్యాసాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. -
Telangana: రెండు రోజులు వర్షాలే.. వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం వాయుగుండం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి గురువారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ రెడ్అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ... మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచి్చంది. శుక్రవారం రాష్ట్రంలో సగటున 2.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 25.76 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 31.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో ఒకరి గల్లంతు ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం తానిçపర్తికి చెందిన బానారి రాజు (45) గోదావరిలో గల్లంతయ్యాడు. చేపల వేటకని గురువారం వెళ్లిన రాజు శుక్రవారం ఉదయం వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మహదేవపూర్ మండలం అన్నారం వైపు నుంచి దామెరకుంట వైపుగా ట్రాలీ ఆటో గుండ్రాత్‌పల్లి సమీపంలో గల అలుగువాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తమై ఆటో ఎక్కి అరవడంతో గమనించిన స్థానికులు రక్షించారు. -
ఆకాశమే హద్దుగా..
దేవరకొండ : శ్రమ నీ ఆయుధం అయితే.. విజయం నీ బానిస అవుతుందన్న మాటను వంట బట్టిచ్చుకున్నాడు ఆ యువకుడు. అందరిలా కాకుండా తాను తనలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చిన్నప్పుడే తన తండ్రి దూరమైనా ఏ మాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా 24 ఏళ్ల వయస్సులోనే లెఫ్టినెంట్ పైలెట్ హోదా దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దేవరకొండ మండలం ఉమ్మడి ముదిగొండ గ్రామం సీతారాంతండాకు చెందిన కొర్ర కుమార్–బుజ్జి దంపతుల మొదటి కుమారుడు అరవింద్ చౌహాన్. శనివారం హైదరాబాద్ దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఫ్లయింగ్ ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో అరవింద్ చౌహాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ విఆర్.చౌదరి చేతుల మీదుగా ఆయన లెఫ్టినెంట్ పైలెట్ హోదా పొందారు. దీంతో గ్రామస్తులు అరవింద్‌ను అభినందిస్తున్నారు.అంచెలంచెలుగా ఎదిగి..అరవింద్ చౌహాన్ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దేవరకొండలో పూర్తి చేశారు. 2013లో కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు సంపాదించాడు. 2016లో యూపీఎస్సీ ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీయే) పరీక్షలో 175వ ర్యాంకు సాధించాడు. అనంతరం మూడేళ్లు పూణేలో శిక్షణ పొందుతూనే బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం నావల్ అకాడమీలో శిక్షణ తీసుకొని 2021మేలో ఇండియన్ నేవీలో సబ్ లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యాడు. అనంతరం ఇటీవల ఇండియన్ ఏవియేషన్ బ్రాంచిలో నిర్వహించిన పరీక్షలో ఆయన పైలెట్‌గా ఎంపికై లెఫ్టినెంట్ హోదా పొందారు. అరవింద్‌కు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి దూరమైనా తల్లి అన్నీ తానై చదివించింది. వారికి కుటుంబ సభ్యులైన బాబాయి విజయ్, మేనమామలు నేనావత్ రంగానాయక్, నేనావత్ జైపాల్ తోడ్పాటు అందించారు.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చుయువత పట్టుదలతో సాధించలేనిది ఏమిలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నేడు నేను ఈ స్థాయిలో నిలబడ్డాను. ఇందుకు నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎనలేనిది. దేవరకొండ ప్రాంతానికి చెందిన యువత ఇండియన్ ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాలపై దృష్టి సారించాలి. దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్న తలంపుతో యువత ముందుకు రావాలి. – అరవింద్ చౌహాన్ -
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ (ఫొటోలు)
-
తుపానుగా మారిన వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 12 కి.మీ. వేగంతో ఉత్తరం వైపు కదులుతూ ఉత్తర బంగాళాఖాతం మీదుగా శనివారం రాత్రి సమయంలో తుపానుగా మారింది. దీనికి రెమల్ అని నామకరణం చేశారు. రెమల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. తుపాను క్రమంగా ముందుకు కదులుతూ ఆదివారం ఉదయానికి ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ని ఆనుకుని ఉన్న పశి్చమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 135 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.పలుచోట్ల జల్లులు.. అక్కడక్కడా వర్షాలుమన రాష్ట్రంపై తుపాను ప్రభావం లేకపోయినా.. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసి పడుతున్నాయి. తీరంలో చీకట్లు కమ్ముకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. కవిటి మండలంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంత ఇళ్లలో నీరు చేరింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు పడ్డాయి. తెనాలిలో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో అత్యధికంగా 86.4 మి.మీ. భారీ వర్షం కురిసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని 18 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిర మండలంలో 72.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 41.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోనూ జోరు వాన కురిసింది. పల్నాడు జిల్లాలో శనివారం అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి. జిల్లా మొత్తం చల్లటి వాతావరణం ఏర్పడింది. నరసరావుపేటలో తెల్లవారుజామున మోస్తరు వర్షం కురిసింది.చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి పట్టణం, గ్రామాల్లో జల్లులు పడ్డాయి. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, ఏజెన్సీ ప్రాంతం, నూజివీడు, కైకలూరు, ఆచంట, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో తుంపర్ల వర్ష కురిసింది. కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దేవనకొండలో 62.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు వెళ్లి 26వ తేదీ ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుని తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది.నేడు, రేపు కొన్నిచోట్ల వడగాడ్పులుమరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు వడగాడ్పులు వీయనున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 11, పార్వతీపురం మన్యం 11, కాకినాడ 1, తూర్పు గోదావరి 1 మండలం చొప్పున 33 మండలాల్లోను, శనివారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 7, పార్వతీపురం మన్యం 5, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, బాపట్ల జిల్లాలో రెండు చొప్పున 24 మండలాల్లోనూ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
త్రివిధ దళాల హోలీ వేడుకలు.. (ఫోటోలు)
-
Begumpet: గంటసేపు ఉత్కంఠ.. ఐఏఎఫ్ విమానం సేఫ్ ల్యాండ్
-
kargil: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సరికొత్త రికార్డు
లడాఖ్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. హిమాలయాల్లో ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌పై సి-130జె విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ తొలిసారిగా నైట్‌ల్యాండింగ్ చేసింది. ‘ఇటీవలే ఐఏఎఫ్ సి-130ని కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌లో తొలిసారి విజయవంతంగా రాత్రివేళ ల్యాండ్ చేశాం’అని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఏఎఫ్ ప్రత్యేక బలగాల యూనిట్ ద గార్డ్స్ శిక్షణను కూడా ఈ ఫీట్లో భాగంగా ఐఏఎఫ్ కలిపి నిర్వహించడం విశేషం. నైట్ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ఐఏఎఫ్ వెల్లడించలేదు. హిమాలయాల్లో 8800 మీటర్ల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌లో విమానాలను ల్యాండ్ చేయడం పైలట్లకు సవాళ్లతో కూడుకున్న టాస్క్.అత్యంత ఎత్తుతో పాటు ప్రతికూల వాతావరణంలో విమానాలను ల్యాండ్ చేయాలంటే పైలట్లకు ప్రత్యేక నైపుణ్యాలు ఉండాల్సిందే. గత ఏడాది నవంబర్లోనూ ఐఏఎఫ్ ఉత్తరాఖండ్‌లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్‌పై లాక్హిడ్ మార్టిన్‌కు చెందిన సూపర్ హెర్క్యులస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాన్ని విజయవంతంగా నైట్ ల్యాడింగ్ చేసింది. ఉత్తర కాశీ టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకుగాను ఈ విమానాలు భారీ ఇంజినీరింగ్ పరికరాలను మోసుకెళ్లాయి. ఇదీచదవండి.. ప్రతి శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం -
‘గగన’ విజయం
సాక్షి, హైదరాబాద్: కలలు కన్నారు.. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడ్డారు.. వ చ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ గగనతలంలో విజయబావుటా ఎగురవేశారు ఈ యువ ఫ్లయింగ్ కేడెట్లు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం అయినా..అంతిమ లక్ష్యం మాత్రం భరతమాత సేవలో తాము ఉండాలన్నదే. ఆదివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొని భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా యువ అధికారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. దేశ సేవలో నేను మూడో తరం.. దేశ సేవలో మా కుటుంబ నుంచి మూడో తరం అధికారిగా నేను ఎయిర్‌ఫోర్స్‌లో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. మా తాతగారు పోలీస్ అఫీసర్‌గా చేశారు. మా నాన్న కర్నల్ రాజేశ్ రాజస్థాన్‌లో పనిచేస్తున్నారు. నేను ఇప్పుడు ఎయిర్ ఫోర్స్‌లో నావిగేషన్ బ్రాంచ్‌లో సెలక్ట్ అయ్యాను. వెపన్సిస్టం ఆపరేటర్‌గా నాకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇది ఎంతో చాలెంజింగ్ జాబ్. శిక్షణ సమయంలో ఎన్నో కఠిన పరిస్థితులను దాటిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి బాధ్యత అయినా నిర్వర్తించగలనన్న నమ్మకం పెరిగింది. మా స్వస్థలం జైపూర్. నేను బీటెక్ ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టం అమేథీలో చేశాను. – ఫ్లయింగ్ కేడెట్ థాన్యాసింగ్, జైపూర్ నాన్నే నాకు స్ఫూర్తి... మాది వికారాబాద్ జిల్లా చీమల్‌దరి గ్రామం. నాన్నపేరు శేఖర్. ప్రైవేటు ఉద్యోగి, అమ్మ బాలమణి టైలర్. చిన్నప్పటి నుంచి నాన్న స్ఫూర్తితోనే నేను డిఫెన్స్ వైపు రాగలిగాను. కార్గిల్ యుద్ధంలో సూర్యకిరణ్ పైలెట్ బృందం ఎంతో కీలకంగా పనిచేసిందన్న వార్తలను చూసి మా నాన్న నాకు సూర్యకిరణ్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే నన్ను డిఫెన్స్‌కు వెళ్లేలా ప్రోత్స హించారు. అలా నేను ఏడో తరగతిలో డెహ్రాడూన్‌లోని రాష్ట్రాయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌కు ప్రవేశ పరీక్ష రాసి 8వ తరగతిలో చేరాను. అందులో రాష్ట్రానికి ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తారు. అంత పోటీలోనూ నేను సీటు సాధించాను. అక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదివాను. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రెండేళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సెలక్ట్ అయ్యాను. – సూర్యకిరణ్, చీమల్‌దరి, వికారాబాద్ జిల్లా భారత సైన్యంలో చేరడం నా కల.. నా పేరు లతా కౌషిక్. మాది హరియాణా రాష్ట్రంలోని జజ్జర్ జిల్లా దుబల్దాన్ గ్రామం. మానాన్న రైతు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలోని మిరండా కాలేజీలో బీఎస్సీ హానర్స్, మ్యాథ్స్ చదివాను. డిఫెన్స్ ఫోర్స్‌లో చేరడం ద్వారా దేశానికి, ప్రజల రక్షణకు పనిచేయవచ్చని నా కోరిక. ఆడపిల్ల డిఫెన్స్‌లోకి ఎందుకు అని ఏనాడు మా ఇంట్లో వాళ్లు అనలేదు. మా నాన్నతో సహా కుటుంబం అంతా నన్ను ప్రోత్సహించడంతోనే నేను ఎయిర్‌ఫోర్స్‌కి వచ్చాను. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదీ మనల్ని అడ్డుకోలేదు. అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. – లతా కౌషిక్, ఫ్లయింగ్ ఆఫీసర్, హరియాణా ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కని నేను ఫైటర్ పైలట్ అయ్యాను.. నాపేరు జోసెఫ్. నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఫైటర్ పైలెట్ కావడం సంతోషంగా ఉంది. మా సొంత ప్రాంతం గుంటూరు. నేను టెన్త్ వరకు గుంటూరులో చదివాను. ఎయిర్‌ఫోర్స్‌కి రావాలని అనుకోలేదు. ఇంటర్మిడియెట్ తర్వాత ఎన్డీఏ గురించి తెలుసుకుని ఈ కెరీర్‌ని ఎంచుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాను. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లగలిగాను. అక్కడ నుంచి భారత వాయుసేనలో సెలక్ట్ అయ్యాను. మా తల్లిదండ్రు ల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరాను. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పిల్లలు ఏదీ సాధించలేరు. తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తేనే పిల్లలు వారి కలలు నిజం చేసుకోగలుగుతారు. – జోసెఫ్, ఫైటర్ పైలట్, గుంటూరు -
సాయుధ దళాలు.. వినూత్నంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సాయుధ దళాలలో సంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే.. కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలు తేవాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. కొత్త ఆలోచనలు చేయకుండా చాలా కాలం ఒకే తరహా సంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. యువ అధికారులు తమలో నూతనత్వానికి, వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ( ఇఎ్క) జరిగింది. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 213 ఫ్లైట్ కేడెట్లు (వీరిలో 25 మంది మహిళలు) పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించి.. పరేడ్‌కు సమీక్ష అధికారిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యువ కేడెట్లు భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లోకి చేరడానికి సూచికగా వారందరికీ అధికారిక హోదా కల్పిస్తూ రాష్ట్రపతి కమిషన్ (అధికారిక బ్యాడ్జ్‌లను)ను ప్రదానం చేశారు. తర్వాత రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించారు. ‘‘నిరంతరం అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలు, ఆవిష్కర ణల మధ్య సమతుల్యత సాధించండి. సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తే.. మనం ఎండిపోయిన సరస్సులా మారిపోతాం. మనం ప్రవహించే నదిలా ఉండాలి. ఇందుకు సంప్రదాయంతోపాటు కొత్తదనాన్ని తీసుకురావాలి. వాయుసేన అధికారులుగా మీరు ఆకాశంలో ఎగురుతూ ఉండండి. ఎక్కు వ ఎత్తును తాకండి, కానీ నేలతో మీ సంబంధాన్ని కొనసాగించండి’’అని పిలుపునిచ్చారు. అకాడమీలో భారత వాయుసేనకు చెందిన అధికారులతోపాటు నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నుంచి 9 మంది, స్నేహపూర్వక దేశమైన వియత్నాం నుంచి ఇద్దరు అధికారులు కూడా ఫ్లయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నుంచి అవార్డులు అందుకున్నారు. శిక్షణలో టాపర్‌గా నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ రాష్ట్రపతి ఫలకాన్ని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్‌ను రాజ్‌నాథ్ చేతులమీదుగా అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లలో మెరిట్లో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అమరీందర్ జీత్ సింగ్‌కు రాష్ట్రపతి ఫలకం లభించింది. అంతకుముందు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, యువ కేడెట్లతో ప్రమాణం చేయించారు. ఆకట్టుకున్న కవాతు శిక్షణలో ప్రథమస్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ ఆదివారం నాటి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువ ఫ్లయింగ్ కేడెట్లు చేసిన కవాతు ఆకట్టుకుంది. పరేడ్ అనంతరం భారత వాయుసేన నిర్వహించిన వైమానిక ప్రదర్శన అలరించింది. సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృంద విన్యాసాలు, సుఖోయ్–30 ఎంకేఐ గగనతల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులతోపాటు యువ ఫ్లయింగ్ ఆఫీసర్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. -
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్
-
మత్స్యకారులకు దొరికిన వాయుసేన మిస్సైల్
వేటపాలెం: మత్స్యకారుల వలకు మిలిటరీ వాయుసేనకు చెందిన చిన్నపాటి మిస్సైల్ దొరికింది. ఈ ఘటన శుక్రవారం బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో చోటుచేసుకుంది. దాన్ని మత్స్యకారులు బోటులో ఒడ్డుకు తీసుకొచ్చారు. మెరైన్ ఎస్ఐ సుబ్బారావు బాపట్ల సూర్యలంకకు చెందిన ఎయిర్‌ఫోర్సు మిలిటరీ అధికారులకు సమాచారం అందించారు. ఏం జరిగిందంటే... సూర్యలంకకు చెందిన మిలటరీ అధికారులు ఏటా ఎయిర్‌ఫోర్సుకు చెందిన రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. ఈనెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సముద్ర గగనతలంలో అడ్వాన్స్డ్ మిస్సైల్ సిస్టంపై రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. చిన్నపాటి యుద్ధ మిస్సైల్‌ను ప్రయోగించి అది లక్ష్యం చేరుకోక ముందే సూర్యలంక కేంద్రం నుంచి పేట్రియాట్ మిస్సైల్‌తో దాన్ని పేల్చివేసే రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీన్లో భాగంగా ప్రయోగించిన ఈ మిస్సైల్ సముద్రంలో మత్స్యకారులకు దొరికింది. దాన్ని మెరైన్ అధికారుల సమక్షంలో ఎయిర్‌ఫోర్సు అధికారులకు అప్పగించారు. -
ఇంఫాల్ గగనతలంలో కలకలం.. రంగంలోకి రఫెల్
ఇంఫాల్: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై గుర్తు తెలియని వస్తువు(యూఎఫ్ఓ)ను గాలించేందుకు భారత వాయుసేన రఫెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. హసిమారా నుంచి రెండు రఫెల్ విమానాలను ప్రయోగించింది. కానీ రఫెల్ విమానాలు ఆ అనుమానిత వస్తువును గుర్తించలేకపోయాయి. ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో తిరిగొచ్చాయని అధికారులు తెలిపారు. గగనతలంలో గుర్తుతెలియని వస్తువులు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కనిపించినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత ఆ వస్తువు కనిపించకుండా పోయిందని తెలిపారు. గుర్తు తెలియని వస్తువులను పసిగట్టడానికి వాయు సేన హషిమార నుంచి రఫెల్ యుద్ధ విమానాన్ని పంపించింది. అత్యాధునిక సెన్సార్లు కలిగిన ఈ విమానం అత్యంత ఎత్తులో గాలించినప్పటికీ ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో వెనక్కి వచ్చింది. కాసేపటికీ మరో రఫెల్‌ను అధికారులు పంపించారు. అప్పుడు కూడా ఎలాంటి వస్తువు కనిపించకలేదని అధికారులు తెలిపారు. యూఎఫ్‌వో కారణంగా మూడు గంటల పాటు విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు -
హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ హతం? అక్టోబరు 7 దాడుల మాస్టర్‌మైండ్?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 22వ రోజున ఇజ్రాయెల్ సైన్యం తాము భారీ విజయాన్ని సాధించినట్లు ప్రకటించింది. హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అబు రకాబాను సైన్యం హతమార్చిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడికి రకాబా ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, దాని అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్లో ఒక పోస్ట్ చేస్తూ, హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అబు రకాబా హత్యను ధృవీకరించింది. అక్టోబరు 7న జరిగిన మారణకాండను ప్లాన్ చేయడంలో రకాబా కీలక పాత్ర పోషించాడని, అతను పారాగ్లైడర్లపై ఇజ్రాయెల్‌లోకి చొరబడి, ఉగ్రవాదులకు ఆజ్ఞలు జారీ చేశాడని, డ్రోన్ దాడులకు బాధ్యుడని ఇజ్రాయెల్ పేర్కొంది. అక్టోబర్ 7 న హమాస్ జరిపిన దాడిలో 1400 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చేతిలో బందీలుగా మారారు. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించి, హమాస్ స్థానాలపై దాడి చేస్తూ వస్తోంది. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించిన తర్వాతే ఊపిరి పీల్చుకుంటామని ఇజ్రాయెల్ మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ మాట్లాడుతూ హమాస్‌ను అంతమొందించాలని ఇజ్రాయెల్ భావిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: జైలులో రావణ దహనం.. నలుగురు అధికారులు సస్పెండ్! Overnight, IDF fighter jets struck Asem Abu Rakaba, the Head of Hamas' Aerial Array. Abu Rakaba was responsible for Hamas' UAVs, drones, paragliders, aerial detection and defense. He took part in planning the October 7 massacre and commanded the terrorists who infiltrated… — Israel Defense Forces (@IDF) October 28, 2023 -
యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది!
ఇటీవలే చంద్రముఖి-2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం తేజస్. వైమానిక దళం పైలట్‌గా ఈ చిత్రంలో కంగనా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తాజాగా తేజస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇవాళ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. (ఇది చదవండి: యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా.. ‘తేజస్’ వచ్చేస్తుంది!) ట్రైలర్ చూస్తే ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ ట్రైలర్లో కంగనా రనౌత్‌ని శక్తివంతమైన వైమానిక దళ పైలట్‌గా కనిపించారు. ఈ చిత్రంలో దేశం కోసం పోరాడుతూ వైమానిక దళంలో పని చేస్తున్న కంగనా వైమానిక యుద్ధ విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రవాదంపై పోరాడే కథనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ చిత్రాన్ని సర్వేశ్ మెవారా దర్శకత్వంలో రూపొందించగా.. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర, ఆశిష్ విద్యార్థి, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 27, 2023న థియేటర్లలో సందడి చేయనుంది. -
President Draupadi Murmu: కంబైన్డ్ గ్యాడ్యుయేషన్ పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ఫొటోలు)
-
సవాళ్లు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: భూమి, సముద్రం, గగనతల రక్షణలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ దళాలకు చెందిన ప్రతి అధికారి సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. భారత వాయుసేనలో మహిళల సంఖ్య పెరుగుతుండటం, ఫైటర్ జెట్ పైలట్లలోనూ మహిళలు ఉండటం సంతోషకరమన్నారు. శనివారం హైదరాబాద్ శివారులోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ‘కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్’కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. మొత్తం 119 ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీ, 75మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ కేడెట్లు, నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన మరో ఎనిమిది మంది అధికారులు, వియత్నాంకు చెందిన ఇద్దరు అధికారులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో రాష్ట్రపతి రివ్యూయింగ్ ఆఫీసర్‌గా పాల్గొనడం వాయుసేన చరిత్రలో తొలిసారి కావడం విశేషం. కేడెట్ల నుంచి రాష్ట్రపతి ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని అవార్డులతో సత్కరించారు. వైమానిక దళం ఎంతో సేవ చేసింది భారత వాయుసేనలో ఉద్యోగ జీవితం సవాళ్లతో కూడుకోవడంతోపాటు ఎంతో గౌరవప్రదమైందని రాష్ట్రపతి చెప్పారు. దేశ సేవకోసం తమ పిల్లలను పంపిన తల్లిదండ్రులకు, కేడెట్లను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన అకాడమీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సుఖోయ్ యుద్ధ విమానంలో భూమి నుంచి 2 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ‘1948, 1965, 1971లలో జరిగిన యుద్ధాల్లో దేశాన్ని రక్షించడంలో భారత వైమానిక దళానికి చెందిన వీరులు పోషించిన గొప్ప పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది. కార్గిల్ పోరాటంలో, బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాన్ని నాశనం చేయడంలో అదే సంకల్పాన్ని, నైపుణ్యాన్ని చూపారు. అందుకే భారత వైమానిక దళానికి వృత్తి నైపుణ్యం, అంకితభావానికి మారుపేరన్న ఖ్యాతి ఉంది. విపత్తుల సమయంలో మానవత్వంతో సాయం చేయడంలోనూ భారత వాయుసేనకు గొప్ప పేరుంది’ అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. భవిష్యత్ యుద్ధరంగంలో అత్యాధునిక సాంకేతికత ముఖ్య భూమిక పోషిస్తుందని. ఈ నేపథ్యంలో రఫెల్ యుద్ధ విమానాలు, చినోక్ హెవీ లిఫ్ట్ చాపర్ల వంటి సాధన సంపత్తిని వాయుసేన సమకూర్చుకుంటోందని చెప్పారు. ఆకట్టుకున్న ఎయిర్ షో పరేడ్ అనంతరం నిర్వహించిన ఎయిర్‌షో ఆకట్టుకుంది. పిలాటస్ పీసీ–7 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్ ఎస్‌యూ–30, సారంగ్ హెలికాప్టర్లు, సూర్యకిరణ్ ఎరోబాటిక్ బృందాల గగనతల ప్రదర్శనలు అలరించాయి. గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. -
నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: రాష్ట్రపతి ముర్ము
సాక్షి, హైదరాబాద్: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రామానికి రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. గ్రాడ్యుయేట్స్ నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని చెప్పారు. టర్కీలో జరిగిన భూకంపంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని కొనియాడారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏప్రిల్‌లో సుఖాయ్ జెట్‌లో ప్రయణించడం తనకు చాలా గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చారు. ఫైటర్ జెట్ ఫైలెట్లలో మహిళలు సైతం అధికంగా ఉండటం సంతోషదాయకంగా ఉందన్నారు. చదవండి: అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ -
ప్రపంచంలోని టాప్ 10 మిలటరీ ఎయిర్ ఫోర్స్స్స్