
త్రివిధ దళాలు కలసి పనిచేస్తే విజయం తథ్యం: ప్రణబ్
విల్లింటన్: దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు కలసి పనిచేస్తే దేశం ఎటువంటి యుద్ధంలోనైనా అంతిమంగా విజయం సాధిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. గురువారం తమిళనాడులోని డి ఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలే జ్ (డీఎస్‌ఎస్‌సీ) 71వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు.
‘1971లో పాక్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఈ మూడు దళాలు కలసి పనిచేసి ఆ యుద్ధంలో భారత్‌కు విజయం చేకూర్చాయి. ఫలితంగా బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది’ అన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేశానికి ఉన్న అద్భుతమైన శక్తులని కొనియాడారు.