
గఘనం
► అబ్బురపరిచిన విన్యాసాలు
► రాష్ట్రపతి ప్రశంసల జల్లు
► అవార్డుల పరంపర
చెన్నై లోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కు చెందిన వైమానిక దళాలు ఆకాశంలో అద్భుతాలను సృష్టించాయి. సైనిక వీరులు వివిధ రకాల విన్యాసాలతో ఆహూతులను అబ్బురపరిచారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారత వైమానిక దళంలో భాగవైున తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సాధించిన కీర్తికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ స్టాండర్డ్ అండ్ కలర్స్ అవార్డును బహూకరించేందుకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం వచ్చారు. 125 హెలికాప్టర్ స్వాకడ్రన్ గ్రూపు కెప్టెన్ వీడీ బదోనీ విశిష్టసేవా మెడల్, మెకానికల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (ఎంటీఐ) గ్రూపు కెప్టెన్ ఏ అరుణాచలేశ్వరన్ ప్రెసిడెంట్స్ స్టాండర్డ్ అండ్ కలర్స్ అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు.
తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో హెలికాప్టర్ విభాగం, మెకానికల్ తదితర ఆరు విభాగాలకు చెందిన సైనికులకు శిక్షణనిస్తారు. ప్రస్తుతం ఈ శిక్షణ కేంద్రంలో 3,500 మంది సైనికులు శిక్షణ పొందుతున్నారు. వీరిలో 20 మంది విదేశీ సైనికులు ఉన్నారు. వైమానిక దళంలో ఉంటూ దేశానికి విశేషవైున సేవలు అందించే వారిని అవారు్డలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా పఠాన్ కోట్ విమాన స్థావరానికి చెందిన 125 హెలికాప్టర్ దళ విభాగానికి చెనై్నలో రాష్ట్రపతి అవారు్డలను అందజేసే కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం రాత్రే చెనైకి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ రాజ్‌భవన్ లో బస చేశారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు స్వాగతం పలికారు. వైమానికదళాల ఫొటో ప్రదర్శనను రాష్ట్రపతి తిలకించారు. అనంతరం సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. ఆ తరువాత సైనిక వీరులు తుపాకులతో చేసిన విన్యాసాలు గుండెలను గుబిల్లుమనేలా చేశాయి. కత్తులను అమర్చిన తుపాకులను గాలో్లకి వేసి పట్టుకోవడం, కతు్తలు తిప్పుతుండగా వాటి మధ్య నుంచి ఒక సైనిక వీరుడు నడుచుకుంటూ ముందుకు రావడం చూపరులను గగుర్పాటుకు గురి చేసింది. ఆ తరువాత రెండు జతలుగా పన్నెండు విమానాలు గాల్లో చక్కర్లు కొడుతూ ఆకర్షించాయి. జాతీయ పతాకాన్ని అలంకరించుకున్న మూడు హెలికాప్టర్లు ఆకాశంలో విహరించి ఆహూతులను అలరించాయి. చెన్నై ఎయిర్‌ఫోర్స్ పనితీరుపై రాష్ట్రపతి ప్రణబ్ తన ప్రసంగంలో ప్రశంసల జల్లు కురిపించారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.