న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ(Pranab Mukherjee) స్మృతి వననానికి కేంద్రం స్థలం కేటాయించింది. రాజ్‌ఘాట్ కాంప్లెక్స్‌లోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లోనే ప్రణబ్ ముఖర్జీ స్మారక వనానికి స్థలం కేటాయించారు. ఈ విషయమై కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన లేఖను ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ విడుదల చేశారు.
తన తండ్రి స్మారకానికి స్థలం కేటాయించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీని(Narendra Modi) ప్రత్యేకంగా కలిసిన షర్మిష్ట ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక ఊహించని,గొప్ప నిర్ణయమని కొనియాడారు.కాగా, ఇటీవల మాజీ ప్రధాని స్మారక చిహ్నం నిర్మాణానికి స్థలం కేటాయించడంపై వివాదం సందర్భంగా షర్మిష్ట కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు.
తన తండ్రి ప్రణబ్ మరణించినపుడు కాంగ్రెస్(Congress) చేసిన అన్యాయాన్ని బయటపెట్టారు. ఇంతలోనే ప్రణబ్‌ముఖర్జీ స్మారక సమాధికి కేంద్రం స్థలం కేటాయించడం గమనార్హం. కాగా, ప్రణబ్‌ముఖర్జీ భారత రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు పనిచేశారు. 2020 ఆగస్టులో ఆయన తుదిశ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment