Sharmistha Mukherjee
-
కేజ్రీవాల్ అరెస్టుపై 'శర్మిష్ట ముఖర్జీ' కీలక వ్యాఖ్యలు
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్'ను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె 'శర్మిష్ట ముఖర్జీ' స్పందించారు. గతంలో కేజ్రీవాల్, అన్నా హజారే బృందం ఢిల్లీ మాజీ సీఎం కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్‌పై బాధ్యతారహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆరోపించారు. దీక్షిత్‌కు వ్యతిరేకంగా ట్రంక్ లోడ్ సాక్ష్యాలు ఉన్నాయని తమ వాదనలు వినిపించారు. అయితే అలాంటి సాక్ష్యాలను ప్రజలకు అందించలేదని ఆమె తెలిపారు. గతంలో వారు చేసిన విపరీత చర్యలే వారిని కర్మగా వెంటాడుతోందని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. He & Anna Hazare gang were responsible for making most irresponsible, baseless & wild allegations against Congress including Sheila Dikshit ji saying he had ‘trunk loads’ of evidence against her. No one has seen the ‘trunk’ so far. Karma catches up! #KejriwalArrested https://t.co/9W1sbFlEDo — Sharmistha Mukherjee (@Sharmistha_GK) March 21, 2024 -
రాహుల్‌పై ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా అంటే అవుననే అంటున్నారు ప్రణబ్ కూతురు షర్మిష్ట ముఖర్జీ. ‘ప్రణబ్ మై ఫాదర్..ఎ డాటర్ రిమెంబర్స్’ అనే పేరుతో తన తండ్రితో జ్ఞాపకాలపై బుక్‌ను షర్మిష్ట లాంచ్ చేశారు. ఈసందర్భంగా ఆమె ప్రణబ్,రాహుల్‌గాంధీలకు సంబంధించిన ఆసక్తిర విషయం ఒకటి వెల్లడించారు. ‘యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏదైనా క్రిమినల్ కేసులో 2 ఏళ్లు, అంతకుపైగా శిక్ష పడితే వారిని పదవి నుంచి అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పును అమలు కాకుండా అప్పటి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆ ఆర్డినెన్స్ కాపీని 2013 సెప్టెంబర్‌లో ఎంపీ రాహుల్ గాంధీ మీడియా ఎదుటే చించి వేశారు. ఈ ఘటనను ముందుగా ప్రణబ్‌కు చెప్పింది నేనే. రాహుల్ ఆర్డినెన్స్ కాపీని చించివేయడంపై ప్రణబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆర్డినెన్స్‌పై పార్లమెంటులో చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి రాహుల్ అలా ఆర్డినెన్స్ కాపీని చించివేయడం ఆయన మూర్ఖత్వం అని చాలా మంది అంటుంటారు. వారిలాగే మా నాన్న కూడా రాహుల్ చర్యను వ్యతిరేకించారు. రాహుల్ ప్రభుత్వ క్యాబినెట్లో కూడా లేరు. ఆయనెవరు ఆర్డినెన్స్‌ను చింపివేయడానికి అని ప్రణబ్ అన్నారు’ అని షర్మిష్ట అప్పటి జ్ఞాపకాలను వివరించారు. ఇదీచదవండి..ప్రధానిపై కథనం..సంజయ్ రౌత్‌పై కేసు -
PRANAB, MY FATHER: రాహల్‌కు పరిణతి లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలో చరిష్మా గానీ, రాజకీయ పరిణతి, అవగాహన గానీ లేవని దివంగత రాష్ట్రపతి, ఆ పార్టీ దిగ్గజ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. అది కాంగ్రెస్ కు చాలా సమస్యగా పరిణమించిందని ఆవేదన పడ్డారట. అంతేకాదు, గాంధీ–నెహ్రూ కుటుంబ అహంకారమైతే రాహుల్ కు వచ్చింది గానీ వారి రాజకీయ చతురత మాత్రం అబ్బలేదు‘ అని కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. ‘కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని రాహుల్ తీసుకురాగలడా? ప్రజల్లో స్ఫూర్తి నింపగలరా? ఏమో! నాకైతే తెలియదు‘ అంటూ అనుమానాలు వెలిబుచ్చారట. ’ప్రణబ్: మై ఫాదర్’ పేరిట రాసిన తాజా పుస్తకంలో ఆయన కూతురు శర్మిష్ఠ ముఖర్జీ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇలాంటి చాలా విషయాలను ఆమె పంచుకున్నారు. ముఖ్యంగా రాహుల్ కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు చించివేశారని తెలిసి ప్రణబ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని చెప్పారు. ‘అలా చేయడానికి ఆయన ఎవరసలు? కనీసం కేబినెట్ సభ్యుడు కాదు. పైగా అప్పుడు ప్రధాని (మన్మోహన్ సింగ్) విదేశాల్లో ఉన్నారు. తన చర్య పార్టీపై, ప్రభుత్వం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆలోచించరా? సొంత ప్రభుత్వ ఉత్తర్వులను అలా మీడియా ముందు ముక్కలు చేయడం 2014లో యూపీఏ కూటమి ఓటమికి కూడా ఒక కారణమైంది‘ అని ప్రణబ్ మండిపడ్డారట. ‘రాహుల్ హుందాగానే ప్రవర్తిస్తారు. కానీ దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. బహుశా ఆయనకు అన్నీ చాలా సులువుగా లభించడమే కారణం కావచ్చు. రాహుల్ మాత్రం అత్యంత కీలక సమయాలు, సందర్భాల్లో కూడా చీటికీమాటికీ దేశం విడిచి ఎటో మాయమవుతారు. ఇది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తప్పుడు సందేశమే ఇచ్చింది‘ అని ప్రణబ్ అభిప్రాయపడ్డట్టు శర్మిష్ఠ తెలిపారు. -
కొడుకుగా అది నా హక్కు: మాజీ ఎంపీ
న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ప్రచురణ అంశంపై చెలరేగిన వివాదంపై ఆయన తనయుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ స్పందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో తనకేమీ అభ్యంతరం లేదని, అయితే తాను ఆ బుక్‌ను పూర్తిగా చదివిన తర్వాతే పబ్లిష్ చేయాలని బుధవారం పునరుద్ఘాటించారు. ఈ మేరకు.. ‘‘కొందరు భావిస్తున్నట్లుగా, మా నాన్న చివరి జ్ఞాపకానికి సంబంధించిన అంశానికి నేనెంత మాత్రం వ్యతిరేకం కాదు. అయితే ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ గురించి తెలుసుకోవడం ఒక కొడుకుగా నాకున్న హక్కు. ఒకవేళ నాన్న బతికుండి ఉంటే, పుస్తకం పూర్తైన తర్వాత ఆయన కూడా ఇదే చేసేవారు. ఫైనల్ అవుట్‌పుట్ చూసేవారు. గతంలో కూడా అలాగే చేశారు. ఇప్పుడు కూడా నేను అదే చేయాలనుకుంటున్నా. ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నా. నేను ఆ పుస్తకం చదివేంత వరకు ప్రచురణ ఆపేయండి. చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడవద్దు’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పేరిట ప్రణబ్ ముఖర్జీ రాసిన రూపా పబ్లికేషన్స్ విడుదల చేయనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇటీవల బయటకి వచ్చాయి. ఈ క్రమంలో జనవరిలో బుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు పబ్లికేషన్స్ ప్రకటించగా.. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని అప్పటి వరకు పుస్తక విడుదలని నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పినట్టుగా అభిజిత్ ముఖర్జీ వెల్లడించగా, ఆయన సోదరి శర్మిష్ట మాత్రం చీప్ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అక్కాతమ్ముళ్ల తలెత్తిన భేదాభిప్రాయాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ఈ మేరకు స్పందించడం గమనార్హం.(చదవండి: ప్రణబ్ పుస్తకం.. ఇంట్లోనే వైరం) 1/2 Contrary to the opinion of some , I am not against the publishing of my father's Memoir but I have requested D publisher to allow me to go through it's contents before final roll out & I believe my request is quite legitimate & within my rights as his Son . — Abhijit Mukherjee (@ABHIJIT_LS) December 16, 2020 -
‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ శనివారం భావోద్వేగ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రణబ్ ముఖర్జీ కచ్చితంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించారు. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. ఈ కారణంగా ఆయన శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రణబ్ హాజరు కాకపోవడంతో.. ఆయన కూతురు షర్మిష్ట ముఖర్జీ తన తండ్రి జ్ఞాపకాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. (చదవండి : వెంటిలేటర్‌పైనే ప్రణబ్) ‘చిన్నప్పటి నుంచి నాన్నా, బాబాయ్ కలిసి మా గ్రామంలోని పూర్వీకుల ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా నాన్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మిస్ చేసుకోలేదు. ఈ ఏడాది మాత్రం ఆయన హాజరు కాలేకపోయారు. వచ్చే ఏడాది మళ్లీ నాన్న జెండా ఆవిష్కరిస్తారనే నమ్మకం నాకుంది’అంటూ గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్ ఫోటోలను ఆమె షేర్ చేశారు. In his childhood, my dad & my uncle would hoist National Flag at our ancestral home in village. Since then, he never missed a year to hoist tri-colour on Independence Day. Sharing some memories from last years celebration at home. I’m sure he’ll do the same next year. Jai Hind 🇮🇳 pic.twitter.com/SX0CVO8lW6 — Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 15, 2020 -
వెంటిలేటర్‌పైనే ప్రణబ్
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. అయితే, పరిస్థితి దిగజారలేదనీ, ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే పనిచేస్తున్నాయని కుమార్తె శర్మిష్ఠ శుక్రవారం చెప్పారు. ‘వైద్యపరమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. రెండు రోజులుగా మా నాన్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే, నిలకడగా మాత్రం ఉంది. ఆయన నేత్రాలు వెలుతురుకు కాస్తంత స్పందించడం కనిపిస్తోంది’అని ట్విట్టర్లో శర్మిష్ఠ ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రణబ్ ముఖర్జీ బాహ్య స్పర్శకు, చికిత్సకు స్పందిస్తున్నారు. 96 గంటల అబ్జర్వేషన్ సమయం నేటితో పూర్తవుతోంది’అని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్లో తెలిపారు. ‘దేశ ప్రజల నుంచి నేను ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగానే పొందాను..అని మా నాన్న ప్రణబ్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. దయచేసి ఆయన కోసం ప్రార్థించండి’అని అభిజిత్ కోరారు. -
ఆ వార్తలను నమ్మొద్దు.. ప్రణబ్ కోలుకుంటున్నారు
-
ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి. వాటిని ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని తెలిపారు. ఆ వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, తమ తండ్రి కోలుకుంటున్నారని ట్విటర్లో వెల్లడించారు. సోషల్ మీడియాలో తమ తండ్రి అనారోగ్యంపై వచ్చే వార్తలు ఆసత్యమని, ముఖ్యంగా మీడియా గమనించాలని తెలిపారు. Rumours about my father is false. Request, esp’ly to media, NOT to call me as I need to keep my phone free for any updates from the hospital🙏 — Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 13, 2020 ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. My Father Shri Pranab Mukherjee is still alive & haemodynamically stable ! Speculations & fake news being circulated by reputed Journalists on social media clearly reflects that Media in India has become a factory of Fake News . — Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 13, 2020 -
విషమంగా ప్రణబ్ ఆరోగ్యం: షర్మిష్ట
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ఆర్) హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని కూతురు షర్మిష్టా ముఖర్జీ ప్రార్ధించారు. తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘గతేడాది ఆగష్టు 8న నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ రోజు మా నాన్న భారత రత్న అవార్డును అందుకున్నారు. కానీ సరిగ్గా సంవత్సరానికి ఆగష్టు 10న ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ సమయంలో దేవుడు ఆయనకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. మా తండ్రికి ధైర్యాన్ని, బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మా నాన్న ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నవారందరికీ ధన్యవాదాలు’ అని షర్మిష్టా బుధవారం ట్వీట్ చేశారు. (విషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) సోమవారం ప్రణబ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడంతో ఆపరేషన్ చేసిన ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ డాకర్లు దానిని తొలగించారు. బ్రెయిన్ సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుల చూపించలేదని, అంతేగాక ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని మంగళవారం సాయంత్రం వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్రణబ్ పూర్వీకుల గ్రామంలో గ్రామస్తులు మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకునేందుకు మంగళవారం మహా మృత్యుంజయ యజ్ఞాన్ని ప్రారంభించారు. కాగా ప్రణబ్ కోవిడ్ బారిన పడిన విషయాన్ని ఆయన కార్యాలయం సోమవారం ట్విటర్లో వెల్లడించిన విషయం తెలిసిందే. 2012-2017 మధ్యకాలంలో ప్రణబ్‌ముఖర్జీ భారత 13వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
ఘోర ఓటమి: ఖుష్బూ, షర్మిష్ట ఫైర్!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దేశ రాజధాని ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ.. కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ భారీ ఓటమిపై కాంగ్రెస్ మహిళా నాయకులు షర్మిష్టా ముఖర్జీ, ఖుష్బూ సుందర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి .. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఈ మేరకు... ‘‘ ఢిల్లీలో మరోసారి మనం నాశనం అయిపోయాం. ఆత్మశోధన చేసుకున్నది చాలు. ఇది కార్యాచరణ మొదలుపెట్టాల్సిన సమయం. ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం చాలా ఆలస్యమైంది. ఒక వ్యూహం లేదు. రాష్ట్ర స్థాయిలో సమన్వయం లేదు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు లేరు. మూలాలే సరిగ్గా లేవు. ఈ వ్యవస్థలో భాగమైన నేను కూడా ఈ వైఫల్యానికి నా వంతు బాధ్యత వహిస్తా’’అని షర్మిష్ట ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: థాంక్యూ ఢిల్లీ.. షాక్ తగిలిందా: ప్రకాశ్ రాజ్ అదే విధంగా ఖుష్బూ కూడా పార్టీ కార్యకర్తల తీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘ఢిల్లీలో ఏదో అద్భుతం జరుగుతుందని ఊహించలేదు. మరోసారి ఘోరంగా విఫలమయ్యాం. మనం అసలు సరిగ్గా పనిచేస్తున్నామా? మనం చేసేది సరైందేనా? అసలు సరైన దారిలోనే ఉన్నామా? వీటన్నింటికీ.. ‘నో’ అనే కదా సమాధానం. కనీసం ఇప్పటి నుంచైనా పనిచేయడం మొదలుపెట్టాలి. క్షేత్రస్థాయిలో, మధ్య స్థాయిలో, ఉన్నత స్థాయిలో పరిస్థితులను చక్కబెట్టాలి’’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా మంగళవారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాల్లో ఆప్ 62 సీట్లు గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఇది ఢిల్లీ ప్రజల విజయం : కేజ్రీవాల్ We r again decimated in Delhi.Enuf of introspection, time 4 action now. Inordinate delay in decision making at the top, lack of strategy & unity at state level, demotivated workers, no grassroots connect-all r factors.Being part of d system, I too take my share of responsibility — Sharmistha Mukherjee (@Sharmistha_GK) February 11, 2020 Wasnt expecting magic in Delhi for #Congress Decimated yet again. Are we doing enough? Are we doing it right? Are we on the right track? NO is the big answer. We need to start working now. Its now or never. Ground level,middle level n top level. Things need to be set right. — KhushbuSundar ❤️ (@khushsundar) February 11, 2020 -
ప్రణబ్ కుమార్తెకు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాదనను బలంగా వినిపించేదుకు ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధులుగా శర్మిష్ట ముఖర్జీ, అన్షుల్ మీరా కుమార్‌లను నియమించింది. వీరి నియామకానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోద ముద్ర వేశారు. వీరిలో షర్మిష్ట మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె కాగా, అన్షుల్ లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు అన్న సంగతి విదితమే. కాగా, తొలుత ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న షర్మిష్ట.. ఆ తర్వాత ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తాజాగా తనను కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే సోనియాకు కృతజ్ఞతలు తెలిపిన శర్మిష్ట.. అన్షుల్‌కు అభినందనలు తెలియజేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత పలువురు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధులు తమ పదవుల నుంచి వైదొలగారు. అలాగే లోక్‌సభ ఫలితాలు వెలువడిన తరువాత.. నెల రోజులపాటు తమ పార్టీ నుంచి టీవీ డిబెట్లకు ఎవరిని పంపడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో పలు కీలక నియామకాలు చేపడుతున్నారు. ఇటీవలే హర్యానా కాంగ్రెస్‌కు కొత్త సారథిగా కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జాను నియమించిన సంగతి తెలిసిందే. INC COMMUNIQUE Appointment of following persons as National Spokesperson, AICC. pic.twitter.com/fg0UGRFjp1 — INC Sandesh (@INCSandesh) September 9, 2019 -
ప్రధానిగా ప్రణబ్.. లేదు మా నాన్న మళ్లీ రారు!
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆరెస్సెస్ ప్రకటించే అవకాశముందని శివసేన చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ స్పందించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మళ్లీ రాజకీయాల్లో వచ్చే అవకాశమే లేదని ఆమె తేల్చి చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ అనూహ్యంగా ఆరెస్సెస్ సదస్సులో పాల్గొని.. జాతీయవాదం, దేశభక్తి, జాతి గురించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోతే.. ప్రణబ్‌ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తెచ్చి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఆరెస్సెస్ రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. బీజేపీకి గత ఎన్నికల్లో కంటే 110 సీట్లు తక్కువ వచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శర్మిష్ట.. ‘మిస్టర్ రౌత్.. రాష్ట్రపతిగా రిటైరైన తర్వాత మా నాన్న రాజకీయాల్లోకి మళ్లి వచ్చే అవకాశమే లేదు’ అని ట్వీట్ చేశారు. -
చరిత్రలో నిలిచిపోతుంది
న్యూఢిల్లీ: ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సందర్శించటం, భారత జాతీయవాదంపై ఆయన చేసిన ప్రసంగం భారతదేశ సమకాలీన చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచిపోతుందని బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ పేర్కొన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ మోహన్ భాగవత్ ఆహ్వానాన్ని మన్నించిన ప్రణబ్ ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరవడాన్ని అడ్వాణీ ప్రశంసించారు. ‘సిద్ధాంతపరమైన విభేదాలున్నా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ ప్రణబ్, భాగవత్‌లు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అమూల్యమైనవి. వీరిద్దరూ భిన్నత్వం, ఐకమత్యం, భిన్నమైన విశ్వాసాల గురించి పేర్కొనడాన్ని జీవితకాల స్వయంసేవక్‌గా అభినందిస్తున్నాను’ అని అడ్వాణీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ఫొటో విద్రోహశక్తుల పనే: సంఘ్ ఆరెస్సెస్ కూడా ప్రణబ్ ప్రసంగాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. మాజీ రాష్ట్రపతి భారత వైభవోపేతమైన చరిత్రను, భారత మూలసూత్రాలైన బహుళత్వం, ఐకమత్యం, భిన్నత్వం గురించి మరోసారి గుర్తుచేశారని పేర్కొంది. ‘మా కార్యక్రమానికి వచ్చి జాతీయత, దేశభక్తి భావాలను బలోపేతం చేసుకునే అంశాలపై మార్గదర్శనం చేసినందుకు ప్రణబ్‌కు కృతజ్ఞతలు’ అని ఆరెస్సెస్ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ తెలిపారు. కాగా, గురువారం వేదికపై ప్రణబ్ ధ్వజప్రణామ్ (ఆరెస్సెస్ తరహాలో నమస్కారం) చేస్తున్నట్లుగా మార్ఫ్డ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఫొటోలో మార్పు సంఘ విద్రోహశక్తుల పనేనని.. వారే ఫొటోలను మార్ఫింగ్ చేసి ఉంటారని ఆరెసెస్స్ సహ ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య మండిపడ్డారు. ఈ శక్తులే మొదట ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ రాకుండా అడ్డుపడ్డాయని.. ఆ తర్వాత ఆరెస్సెస్ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని సంఘ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అనుకున్నట్లే జరిగింది: శర్మిష్ట తమది ‘ప్రజాస్వామ్యయుత, వివిధ అంశాలపై స్వేచ్ఛగా చర్చించే కుటుంబ’మని ప్రణబ్ కూతురు శర్మిష్ట పేర్కొన్నారు. తన తండ్రి అభిప్రాయాలతో విభేదించడంలో ఎవరికీ ఇబ్బంది లేదని ఆమె తెలిపారు. అంతా తను భయపడినట్లే జరిగిందని ప్రణబ్ ఫొటోల మార్ఫింగ్‌పై శర్మిష్ట ఆందోళన వ్యక్తం చేశారు. సంఘ్‌కు ప్రణబ్ బహుళత్వం గురించి చెప్పి తన గొప్పదనాన్ని చాటుకున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అసలైన కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ఆరెస్సెస్‌కు నేర్పించారని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ప్రశంసించారు. ఒక మనిషిని ఆయనకు వచ్చిన ఆహ్వానం ఆధారంగా గుర్తించొద్దని.. ఆయన ప్రసంగాన్ని బట్టే నిర్ణయించాలని మరో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. అయితే ప్రణబ్ తన ప్రసంగంలో.. హెడ్గేవార్, సావర్కర్లు చెప్పిన జాతీయవాదం గురించి పేర్కొనలేదని వీహెచ్‌పీ మాజీ నేత ప్రవీణ్ తొగాడియా ఇండోర్‌లో పేర్కొన్నారు. అప్పుడెందుకలా చెప్పారు? ప్రణబ్‌కు మనీశ్ తివారీ ప్రశ్న న్యూఢిల్లీ: ఆరెస్సెస్ కార్యాలయానికి ప్రణబ్ వెళ్లడంపై కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయవాదంపై ప్రసంగించేందుకు ఆరెస్సెస్ వేదికపైకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రణబ్‌ను ప్రశ్నించారు. ఎన్ఎస్యూఐలో ఉన్నప్పుడు తనలాంటి వందలాది కార్యకర్తలకు ఆరెస్సెస్ గురించి ఎందుకు చెడుగా చెప్పారని, ఇప్పుడు వారిలో ఏం ధర్మంగా, గొప్పగా కనిపించిందో స్పష్టంచేయాలన్నారు. ‘సంఘ్‌ను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రణబ్ ప్రయత్నిస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు. ప్రణబ్ నాగ్‌పూర్ వెళ్లేందుకు కారణాలేమైనా.. అవన్నీ సంఘ్‌ను లౌకికవాద, బహుళత్వ సమాజంలోకి తీసుకొచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నంగానే చూస్తామన్నారు. ‘ఆరెస్సెస్ వేదికద్వారానే జాతీయవాదంపై ప్రసంగించాలని ఎందుకు అనుకున్నారు? పార్టీ కార్యకర్తలుగా మాకు 1980, 90ల్లో శిక్షణ ఇస్తున్నప్పుడు మీ తరం నేతలు ఆరెస్సెస్ ఉద్దేశాలు, లక్ష్యాలపై జాగ్రత్తగా ఉండమన్నారు. 1975, 1992ల్లో ఆరెస్సెస్‌పై నిషేధం సమయంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు ఆరెస్సెస్ ఎందుకు తప్పనిపించింది? ఇప్పుడెందుకు గొప్ప అనిపించింది? అని ప్రశ్నించారు. -
ప్రణబ్ కూతురు భయపడ్డట్టే..!
న్యూఢిల్లీ: ‘‘నాన్న(ప్రణబ్) ఏం మాట్లాడుతారనేది ఆర్ఎస్ఎస్ పట్టించుకోదు, ఆయన వచనాలేవీ వాళ్లకు గుర్తుండవు.. కొన్ని విజువల్స్ తప్ప!!’’ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్లడానికి కొద్ది గంటల ముందు ఆయన కూతురు షర్మిష్ట ముఖర్జీ చేసిన వ్యాఖ్యలివి. శుక్రవారం తాజాగా ఆమె మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.. ‘‘దేనిగురించైతే నేను భయపడ్డానో అదే జరిగింది. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే హెచ్చరించా. కార్యక్రమం ముగిసి కొన్ని గంటలు కూడా గడవక ముందే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నీచమైన చర్యలకు పాల్పడుతున్నాయి..’’ అని షర్మిష్ట పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగింది?: ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి ప్రసంగించిన ప్రణబ్.. ‘‘భారతదేశమంటే హిందువులు, సిక్కులు, ముస్లింలు తదితర మతాలు, కులాల, ప్రాంతాలు, భాషల సమాహారం. ఇది మాత్రమే జాతీయవాదం. అంతేగానీ ఒకే దేశం-ఒకే మతం-ఒకే ప్రాంతం అన్న భావనే మనకు వర్తించదు..’’ అని ఉద్ఘాటించారు. ప్రసంగానికి ముందు వేదికపైనున్న నేతలంతా నిలబడి ‘ఆర్ఎస్ఎస్ సెల్యూట్’ చేయగా, ప్రణబ్‌దా మాత్రం అటెన్షన్లో ఉన్నారే తప్ప ఆర్ఎస్ఎస్ సెల్యూట్ చేయలేదు. సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ప్రణబ్ ఫొటో ఒకటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సర్కిళ్ళలో విపరీతంగా షేర్ అయింది. అందులో ప్రణబ్ ఆర్ఎస్ఎస్ తరహాలో నలుపు టోపీ ధరించి, సేవక్ స్టైల్లో సెల్యూట్ చేస్తున్నట్లుగా మార్ఫింగ్ చేశారు. సదరు ఫొటో వైరల్ కావడంతో షర్మిష్ట మళ్లీ స్పందించారు. తాను హెచ్చరించినట్లే జరిగిందని వ్యాఖ్యానించారు. బర్నల్ అమ్మకాలు హై జంప్!: కరడుగట్టిన కాంగ్రెస్ వాది, రాహుల్ గాంధీకి రాజగురువు అయిన ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్లడంపై సొంతపార్టీ నేతలే ఘాటుగా స్పందించడం తెలిసిందే. ఇక గురు, శుక్రవారాల్లో సోషల్ మీడియా అంతటా ప్రణబ్‌ను గురించిన చర్చే ఎక్కువగా నడిచింది. పెద్దాయన చర్యతో ఒళ్లుమండిన కాంగ్రెస్ నేతలు బర్నల్(గాయాలకు పూసుకోడానికి) కోసం వెతుకులాడుతున్నారని బీజేపీ శిబిరం జోకులు పేల్చింది. దుకాణాల్లో బర్నల్ దొరకట్లేదని, బర్నల్ తయారీ కంపెనీల షేర్లు విపరీతంగా దూసుకెళుతున్నాయని సెటైర్లు వేసింది. అయితే, ప్రణబ్, ఆర్ఎస్ఎస్ అగ్రనేతల సమక్షంలో వారి మౌలిక సిద్ధాంతాలపై సున్నిత విమర్శలు చేయడంతో సీన్ రివర్స్ అయింది. ‘‘ఇప్పుడా బర్నల్ కావలసింది మీకే..’’ అంటూ కాంగ్రెస్ శిబిరం కౌంటర్ విసిరింది. (ఆర్ఎస్ఎస్ కేంద్రంలో ప్రణబ్ ఏం మాట్లాడారు?) -
రాష్ట్రపతి కుమార్తెకు వేధింపులు: కేసులో మరో మలుపు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి కుమార్తె, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షర్మిష్ఠ ముఖర్జీ తాను ఎదుర్కొన్న ఆన్ లైన్ వేధింపులపై మరోసారి స్పందించారు. ఈ కేసులో నిందితుడైన పార్థ మండల్ తండ్రి.. ఫేస్ బుక్ ద్వారా తనకు క్షమాపణలు చెప్పారని, మానసిక వ్యాధిగ్రస్తుడైనందున తన కొడుకును మన్నించాల్సిందిగా అభ్యర్థించారని షర్మిష్ఠ మంగళవారం వెల్లడించారు. అన్నిటికంటే ముందు అతణ్ని(పార్థాను) పోలీసులకు లొంగిపోవాల్సిందిగా సూచించానని ఆమె తెలిపారు. (చదవండి:రాష్ట్రపతి కుమార్తెకు ఆన్లైన్ వేధింపులు) 'నన్ను వేధింపులకు గురిచేసిన పార్థా మండల్ తండ్రిగారు నాకొక సందేశం పంపారు. 'నా కుమారుడి మానసిక పరిస్థితి బాగోలేనందున అతనికి చికిత్స చేయిస్తున్నాం. మా వాడి తరఫున నేను క్షమాపణలు చెబుతున్నా. దయచేసి మన్నించండి' అని ఆ తండ్రి నాకు మెసేజ్ చేశారు. అందుకు నేను.. 'వెంటనే మీ కుమారుణ్ని పోలీసులకు అప్పగించి, వైద్యపరీక్షలు చేయించండి. అప్పుడు నిజానిజాలు అవే తెలుస్తాయి' అని సమాధానం ఇచ్చినట్లు షర్మిష్ఠ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన పార్థా మండల్.. గత శుక్ర, శనివారాల్లో షర్మిష్ఠకు అసభ్య మెసేజ్ లు పంపిన విషయాన్ని స్వయంగా ఆమె వెలుగులోకి తెచ్చారు. తాము ఎదుర్కొటున్న అకృత్యాలను మహిళలు నిర్భయంగా ఎదుర్కోవాలని, అందుకే తాను ఫిర్యాదు చేశానని, ఇలాంటి కేసుల్లో 'నేమింగ్ అండ్ షేమింగ్' (వేధింపులకు పాల్పడ్డవారి పేరు వెల్లడించడం, చేసిన పనికి సిగ్గుపడేలా చేయడం) అవసరమని షర్మిష్ఠ అన్నారు. -
రాష్ట్రపతి కుమార్తెకు ఆన్లైన్ వేధింపులు
శర్మిష్ట ఫేస్బుక్ పేజీకి అసభ్య సందేశాలు న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధికార ప్రతినిధి శర్మిష్టా ముఖర్జీ ఆన్లైన్ వేధింపులకు గురయ్యారు. ఆమె ఫేస్బుక్ పేజీకి పశ్చిమబెంగాల్లోని హుగ్లీ దగ్గర్లోని నౌహతికి చెందిన పార్థా మండల్ అనే ప్రబుద్ధుడు శుక్రవారం రాత్రి అసభ్య సందేశాలు పంపాడు. అయితే ఆ ఆకతాయి చేష్టలపై శర్మిష్ట తీవ్రంగా స్పందించారు. అత ని పేరుతోపాటు అతను పంపిన సందేశాలను ఫేస్బుక్ ద్వారా బహిర్గతపరిచి, ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదుచేశారు. ‘‘ఇలాంటి వ్యక్తులను బయటపెట్టి బహిరంగంగా అవమానించాలనుకుంటున్నా. అందుకే అతని ప్రొఫైల్ స్క్రీన్ షాట్స్, అతను పంపిన సందేశాలను పోస్టు చేసి అతన్ని ‘ట్యాగ్’ చేస్తున్నా. దయచేసి ఈ పోస్టును ‘షేర్’ చేయడంతోపాటు ఈ దుర్మార్గుడిని ‘ట్యాగ్’ చేయండి. విపరీతబుద్ధిగల వారి ఇలాంటి చేష్టలను తేలిగ్గా తీసుకోబోమనే సందేశానివ్వండి’’ అని శర్మిష్ట శనివారం తన ఫేస్బుక్ పేజీలో కోరారు. ‘‘నాకు ఏమాత్రం తెలియని వ్యక్తి శుక్రవారం రాత్రి నాకు అసభ్య సందేశాలు పంపాడు. తొలుత అతణ్ని పట్టించుకోకూడనుకున్నా. కానీ నా మౌనం వల్ల అతను రెచ్చిపోయి ఇతరులనూ వేధిస్తాడని గ్రహించా. అందుకే ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదుచేశా’’ అని శర్మిష్ట తెలిపారు. అయితే పోలీసులకు ఇటువంటి వేలాది కేసులు ఎదురయ్యే అవకాశం ఉందన్న శర్మిష్ట...ఈ వ్యవహారంలో సాధారణ మహిళగానే పోరాడాలనుకుంటున్నానని, రాష్ట్రపతి కుమార్తెను అయినందుకు తన విషయంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసులన్నింటినీ పోలీసులు సమ దృష్టితో చూడాలన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తునకు ఆదేశిస్తామని డీసీపీ(సైబర్ నేరాలు) ఆయశ్ రాయ్ తెలిపారు. -
'అవన్నీ రాజకీయ జిమ్మిక్కులే'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జిమ్మిక్కు రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు. ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా కల్పించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ(రిఫరెండం) జరపడమనేది రాజ్యాంగ విరుద్ధమైన చర్యమాత్రమే కాకుండా జాతి వ్యతిరేక చర్య అని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా కల్పించే అంశాన్ని డిమాండ్ చేస్తూ దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ప్రతిసారి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్రంతో తగువులు పెట్టుకుంటున్నారని శర్మిష్ఠ ఆరోపించారు. ఇది కేవలం రాష్ట్రం అనే సమస్య కాదని, ఢిల్లీ అంటే దేశ రాజధాని అయినందున దీని విషయంలో అందరితో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ పరంగా అది సాధ్యమా కాదా అనే విషయం తెలుసుకోకుండా నలుగురుని అడగకుండా ప్రతిసారి రాష్ట్రహోదా అంటూ ఆప్ ముందుకు రావడం రాజకీయంగా జిమ్మిక్కులకు పాల్పడటం తప్ప మరొకటి కాదని ఆరోపించారు. -
'ముందు మీ నాయకుడిని వెదుక్కోండి'
బెంగళూరు: తమ ప్రభుత్వంలో తప్పులు వెదకడం మానేసి రాహుల్ గాంధీ ఎక్కడున్నారో తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సలహాయిచ్చారు. శుక్రవారం బెంగళూరులో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సులో ఆయన మాట్లాడారు. 'ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పులు వెదకడం మానండి. అసలు తప్పులే లేనప్పుడు వాటిని వెదికి ప్రయోజనం ఉండదు. ప్రతిపక్ష పార్టీ ముందుగా తమ నాయకుడిని వెతుక్కుంటే మంచిది' అని అమిత్ షా అన్నారు. రాహుల్ వ్యవహారంలో బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షర్మిష్టా ముఖర్జీ విమర్శించారు. రాహుల్ గురించి కలవరపడడం మానేసి, పాలనపై దృష్టి పెట్టాలని మోదీ ప్రభుత్వానికి సూచించారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా హంగామా సృష్టించిన రాష్ట్ర విధానసభ ఎన్నికలు శనివారం ముగియడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమ విశ్రాంతి సమయాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. కొంత మంది అభ్యర్థులు తమ కుటుంబసభ్యులతో, పెంపుడు జంతువులతో గడపగా, మరి కొంతమంది తమ నియోజకవర్గ ప్రజలతో సమావేశమయ్యారు. ప్రశాంతంగా గడుపుతున్నా: శర్మిష్టా ముఖర్జీ ‘ఎన్నికల ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించదలచుకోలేదు. ప్రస్తుతం నా ఆలోచనల్లో ఆ అంశానిది చివరి స్థానం. నా విశ్రాంత సమయాన్ని పెంపుడు కుక్కతో ఆడుకుంటూ ప్రశాంతంగా గడుపుతున్నా. అంతేగాక నా ఇల్లు మొత్తం ఎన్నికల హడావుడితో చిందరవందరగా తయారైంది. దానిని శుభ్రం చేసి మళ్లీ పూర్వ స్థాయిని తీసుకురావాలి. సాయంత్ర సమయంలో నా తల్లిదండ్రుల వద్దకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి కొంతసేపు గడిపి వస్తున్నా. నా బాధ్యతను పూర్తిగా నెరవేర్చా. ప్రస్తుతం నా భవిష్యత్తు ప్రజల చేతిలో ఉంది’అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శర్మిష్టా ముఖర్జీ పేర్కొన్నారు. ప్రచార విశేషాలకు పుస్తక రూపం: నూపుర్ శర్మ ‘మా నాన్న ఈ రోజు జర్మనీ వెళుతున్నారు. ఆ తర్వాత నాకు విశ్రాంతి లభిస్తుందేమో! మాది ఉమ్మడి కుటుంబం, వారి మధ్యలో ఉండటాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతా. నాకు రాయడం ఇష్టం, అందుకే ప్రచార విశేషాలను రాయాలనుకుంటున్నాను. ప్రస్తుతం టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకోలేదు. అయినా ఎన్నికల ఫలితాల గురించి నేను ఆతృతగా లేను. నా ఆధీనంలో లేని దాని గురించి నేనెందుకు బాధపడాలి. నేను ఒక ఆశయంతో బాధ్యతగా రాజకీయాల్లోకి వచ్చాను. గత ఏడేళ్లలో కొంత వరకు నా బాధ్యతను నెరవేర్చాను. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మదలచుకోలేదు, ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం’అని బీజేపీ అభ్యర్థి నూపుర్ శర్మ పేర్కొన్నారు. ఈ 29 ఏళ్ల రాజకీయ నాయకురాలు తన విశ్రాంత సమయాన్ని కూడా కార్యకర్తలకే కేటాయించారు. పోలింగ్ తర్వాతి పరిణామాలపై వారితో చర్చించారు. చాలినంత నిద్ర పోయా: రాఖీ బిర్లా ‘ఇన్ని రోజులు ప్రచారంలో తీరిక లేకుండా గడపడం వల్ల చాలినంత నిద్రను కోల్పోయాను. దీంతో నేను ఈ రోజు ఉదయం 10 గంటలకు నిద్ర లేచాను. ఫలితాల గురించి ఆతృతగా లేను. ఇవి ప్రజల ఎన్నికలు, చాలా మంది పోటీ పడితే అందులోంచి వాళ్లు ఒకరిని మాత్రమే గెలిపిస్తారు. అందువల్ల నేను బాధపడాల్సిన అవసరం లేదు. దాని బదులు నేను నా నియోజకవర్గ మహిళలతో మాట్లాడుతూ వారి సమస్యలు వింటూ గడుపుతున్నాను’ అని మంగోల్‌పురి నియోజకవర్గ ఆప్ అభ్యర్థి రాఖీ బిర్లా తెలిపారు. -
నాన్న మాటే నా బాట
న్యూఢిల్లీ: తొలిసారిగా విధానసభ ఎన్నికల బరిలోకి దిగిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె శర్మిష్టముఖర్జీ... తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. కఠోర పరిశ్రమ చేయాలని, ఎంతో సహనంతో ఉండాలంటూ తండ్రి ఇచ్చిన సలహా ప్రకారమే ఆమె ముందుకు సాగుతున్నారు. ‘రాజకీయాల్లో నువ్వు చేరిన తరుణంలో గతుకులరహదారి ముందుంది. కఠోరంగా శ్రమించడంతోపాటు ఎంతో సహనంతో ఉండాలి అని మా నాన్న చెప్పారు. ఈ మాటలను నా మనసులో ఉంచుకున్నా’ అని అన్నారు. ప్రధాన పోటీ బీజేపీతోనే... ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి, తమ పార్టీకి మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతోందని శర్మిష్ట పేర్కొన్నారు. ‘ఓట్లు అడిగేందుకు ప్రజల దగ్గరకు వెళ్లినపుడు వాళ్లు నన్ను ఒకే ప్రశ్న అడుగుతున్నారు. మోదీ ప్రభంజనాన్ని ఎలా తట్టుకుంటారనేదే వాళ్ల ప్రశ్న. అంతేకానీ సౌరవ్ గురించి ఎవరూ అడగడం లేదు. ఆదినుంచి ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. ఇందులో మొత్తం నాలుగు వార్డులు ఉన్నాయి. అందులో మూడింటిలో బీజేపీదే పెత్తనం. కేవలం గత ఎన్నికల్లోనే ఆప్ గెలిచింది. అందువల్ల నా వ్యక్తిగత అభిప్రాయమేమిటంటే ఈసారి తమకు, బీజేపీకి మధ్యనే ప్రధాన పోటీ జరుగుతుంది’ అని అన్నారు. కాంగ్రెస్‌ను నమ్మాల్సిన తరుణమిదే.. కాంగ్రెస్‌లోకి ఎందుకు చేరారని మీడియా ప్రశ్నించగా ఆ పార్టీని నమ్మాల్సిన తరుణమిదేననారు. అధికారంలో ఉన్న సమయంలోనే తాను చేరవచ్చని, అయితే ఎంతోకొంత పార్టీకి చేయగలిగేదిప్పుడేనన్నారు.కాగా 49 ఏళ్ల శర్మిష్ట నగరంలోని గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన సంగతి విదితమే. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి మొత్తం ముగ్గురు సంతానం కాగా శర్మిష్ట ద్వితీయ పుత్రిక. ఆమె ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2013లో జరిగిన విధానసభ ఎన్నికల్లో గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి సౌరవ్ భరద్వాజ్ విజయకేతనం ఎగురవేశారు. సౌరవ్‌కు మొత్తం 43,907 ఓట్లు రాగా బీజేపీకి 30.005, కాంగ్రెస్‌కు 19,641 ఓట్లు లభించాయి. -
ఎన్నికల బరిలో ప్రణబ్ కుమార్తె
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలువనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. 2008లో ఈ స్థానం నుంచి చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్రపతి కుమార్తె అయినప్పటీకి శర్మిష్ట తన తండ్రి ప్రభావం ఏమీ లేకుండా ఆమె సాదాసీదాగా ప్రచారం చేసుకుంటున్నారు. 'తన తండ్రి రాష్టపతిగా కాకుండా ప్రజల మనిషిగా నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సుపరిచితుడు ఆమె తెలిపారు. దేశాధినేత కుమార్తె కావటంతో తన గెలుపుపై ఎక్కవ అంచనాలు ఉన్నాయన్న సంగతిని ఆమె అంగీకరించారు. కైలాష్ ఒక అసెంబ్లీ స్థానం మాత్రమే కాదు... 1986 నుంచి అది మాకు సొంత ఇంటితో సమానమని' శర్మిష్ట వివరించారు. -
బరిలోకి ప్రణబ్, షీలాల తనయులు
ఎన్నికల అరంగేట్రం సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమార్తె లతికా దీక్షిత్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శర్మిష్ట ముఖర్జీ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి, లతికా దీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. గ్రేటర్ కైలాష్ నుంచి..శర్మిష్ట ముఖర్జీ గ్రేటర్ కైలాష్ నుంచి పార్టీ తనకు టికెట్ ఇచ్చినట్లయితే పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ట ముఖర్జీ అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మరొకరికి టికెట్ ఇచ్చినా తాను ఆ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమని కూడా ఆమె చెప్పారు. పార్టీకి గ్రేటర్ కైలాష్ సీటు గెలిచిపెట్టడమే తన ఉద్దేశమని ఆమె అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ గెలిచారు. ఆయన బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ మల్హోత్రా తనయుడు అజయ్ మల్హోత్రాను ఓడించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి నుంచి మాజీ మేయర్లు ఆర్తీ మెహ్రాకు గానీ, సరితా చౌదరికి గానీ టికెట్ ఇవ్వవచ్చు. సౌరభ్ భరద్వాజ్‌కే మళ్లీ టికెట్ ఇవ్వనున్నట్లు ఆప్ ఇదివరకే ప్రకటించింది. పలు ఉద్యమాల్లో .. శర్మిష్ట ముఖర్జీ ఈ సంవత్సరమే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేస్తున్న ధర్నాలు, ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అలంకరణ కోసం కేటాయించిన పార్కులలో తమకు ఆడుకునే హక్కు ఉందని డిమాండ్ చేస్తూ దక్షిణ ఢిల్లీలోని పిల్లలు ప్రారంభించిన గివ్ బ్యాక్ అవర్ ప్లేగ్రౌండ్స్ ఉద్యమానికి కూడా ఆమె చేయూత నందిస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి లతికా దీక్షిత్.. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ నియోజకవర్గం నుంచి షీలాదీక్షిత్ కుమార్తె లతికా దీక్షిత్ సయ్యద్‌ను నిలబెట్టాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న లతికా దీక్షిత్‌ను ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆమె సోదరుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ఒప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం కూడా ఈ నియోజకవర్గం నుంచి లతికా దీక్షిత్‌ను నిలబెట్టడానికి సముఖంగా ఉందని అంటున్నారు. లతికా పిన్న వయస్కురాలు అయినప్పటికీ షీలాదీక్షిత్‌కు కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న సత్సంబంధాల కారణంగా న్యూఢిల్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపే అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి మళ్లీ పోటీ చేస్తారని ఆప్ అంటుండగా, తాను కూడా న్యూఢిల్లీ నుంచే పోటీ చేస్తానని ఆప్ తిరుగుబాటు నేత, లక్ష్మీనగర్ మాజీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ ప్రకటించారు. -
నట్వర్ సింగ్ పద్దతి బాలేదు: షర్మిష్టా ముఖర్జీ
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విదేశాంగ మాజీ మంత్రి నట్వర్ సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్టా ముఖర్జీ తప్పుబట్టారు. ఈవిధంగా వ్యవహరించడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. నట్వర్ వ్యవహారం ఏమీ బాలేదని అన్నారు. నట్వర్ ను నమ్మి ఆయనతో రాజీవ్ గాంధీ పంచుకున్న విషయాలను బహిర్గతం చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఇంట్లో తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ రాజకీయాల గురించి మాట్లాడరని చెప్పారు. ఓసారి కేబినెట్ లో చర్చించిన విషయం గురించి తాను అడిగినా తన తండ్రి చెప్పలేదని షర్మిష్టా గుర్తు చేసుకున్నారు. -
రాజకీయాల్లోకి రాష్ట్రపతి తనయ?
న్యూఢిల్లీ: మరో రాజకీయ వారసురాలు రాజకీయ రంగ ప్రవేశం చేయనుంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున చురుగ్గా పాల్గొంటున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, ప్రముఖ నర్తకి శర్మిష్ట ముఖర్జీ(47) రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆమె క్రియాశీల రాజకీయాల్లో చేరే అవకాశాలను కొట్టిపారేయలేమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ‘మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. రాజకీయాలంటే నాకు వ్యతిరేకత ఎందుకుంటుంది?’ అని ఆమె ప్రశ్నించటం వీటిని బలపరుస్తోంది.