రాజకీయాల్లోకి రాష్ట్రపతి తనయ?
న్యూఢిల్లీ: మరో రాజకీయ వారసురాలు రాజకీయ రంగ ప్రవేశం చేయనుంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున చురుగ్గా పాల్గొంటున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, ప్రముఖ నర్తకి శర్మిష్ట ముఖర్జీ(47) రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆమె క్రియాశీల రాజకీయాల్లో చేరే అవకాశాలను కొట్టిపారేయలేమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ‘మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. రాజకీయాలంటే నాకు వ్యతిరేకత ఎందుకుంటుంది?’ అని ఆమె ప్రశ్నించటం వీటిని బలపరుస్తోంది.