ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పెద్దలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు మీరేం చేశారని కాంగ్రెస్ హైకమాండ్‌ను ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రత్యేక స్మారకం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు లేఖ రాయడంపై ఆమె మండిపడ్డారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రత్యేక స్మారకం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. ఈ అంశంపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు మీరేం చేశారని కాంగ్రెస్‌ను శర్మిష్ఠా ముఖర్జీ ప్రశ్నించారు.
తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోతే నివాళులర్పించడానికి కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తనకు చెప్పారని ఆమె అన్నారు. అయితే, తర్వాత అది నిజం కాదని ప్రణబ్ రాసుకున్న డైరీ ద్వారా తనకు తెలిసిందని శర్మిష్ఠ వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతల తీరుపై ఆమె మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. 92 ఏళ్ల మన్మోహన్ అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మన్మోహన్ పార్థివదేహాన్ని శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అక్కడ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పిస్తారని, అనంతరం 9:30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉదయం 11:45 గంటలకు స్థానిక నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివదేహాన్ని శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంచారు.
When baba passed away, Congress didnt even bother 2 call CWC 4 condolence meeting. A senior leader told me it’s not done 4 Presidents. Thats utter rubbish as I learned later from baba’s diaries that on KR Narayanan’s death, CWC was called & condolence msg was drafted by baba only https://t.co/nbYCF7NsMB
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) December 27, 2024
Comments
Please login to add a commentAdd a comment