
'ముందు మీ నాయకుడిని వెదుక్కోండి'
బెంగళూరు: తమ ప్రభుత్వంలో తప్పులు వెదకడం మానేసి రాహుల్ గాంధీ ఎక్కడున్నారో తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సలహాయిచ్చారు. శుక్రవారం బెంగళూరులో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సులో ఆయన మాట్లాడారు.
'ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పులు వెదకడం మానండి. అసలు తప్పులే లేనప్పుడు వాటిని వెదికి ప్రయోజనం ఉండదు. ప్రతిపక్ష పార్టీ ముందుగా తమ నాయకుడిని వెతుక్కుంటే మంచిది' అని అమిత్ షా అన్నారు. రాహుల్ వ్యవహారంలో బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షర్మిష్టా ముఖర్జీ విమర్శించారు. రాహుల్ గురించి కలవరపడడం మానేసి, పాలనపై దృష్టి పెట్టాలని మోదీ ప్రభుత్వానికి సూచించారు.