ఈరోజు డిసెంబరు 11.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జన్మదినం. ఆయన 1935, డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా మిరాటి గ్రామంలో జన్మించారు. 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను కూడా చేపట్టారు. 2020 ఆగస్టులో కన్నుమూసిన ప్రణబ్ ముఖర్జీ జీవితంలో 13వ నంబరుకు ప్రత్యేక స్థానముంది.
చాలామంది 13వ నంబరును అశుభ సంఖ్యగా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో 13వ నంబరుపై ఉండే భయాన్ని ట్రిస్కైడెకాఫోబియా అంటారు. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలలోని ప్రజలు 13 సంఖ్యను అశుభ సూచికగా చెబుతారు. దీనివెనుక పలు కారణాలను కూడా చెబుతుంటారు. అయితే ఇదే 13వ సంబరు ప్రణబ్ ముఖర్జీ జీవితంలో అదృష్ట సంఖ్యగా మారింది. ఆయన జీవితంలోని అన్ని ముఖ్యమైన సంఘటనలు 13వ నంబర్‌తో ముడిపడి ఉన్నాయి.
ప్రణబ్ ముఖర్జీ వివాహం
దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వైవాహిక జీవితం 13వ సంఖ్యతో ప్రారంభమైంది. ఆయన 1957, జూలై 13న వివాహం చేసుకున్నారు.
రాజ్యసభకు..
ప్రణబ్ ముఖర్జీ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి సన్నిహితునిగా పేరొందారు. ఆమె ప్రణబ్ ముఖర్జీని 1969లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు పంపారు. ప్రణబ్ ముఖర్జీ మొదటిసారిగా 1969 జూలై 13న పార్లమెంటులో ప్రవేశించారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా..
యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ప్రణబ్ ముఖర్జీ పేరు తెరపైకి వచ్చిన తేదీ కూడా 13 కావడం విశేషం. 2012, జూన్ 13న యూపీఏ ముందుకు రెండు పేర్లు వచ్చాయి. ఒకరు ప్రణబ్ ముఖర్జీ. మరొకరు హమీద్ అన్సారీ. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ పేర్లను మమతా బెనర్జీ అందరి ముందుకు తీసుకువచ్చారు.
13వ రాష్ట్రపతిగా..
ప్రణబ్ ముఖర్జీ దేశ 13వ రాష్ట్రపతి అయ్యారు. ఈ సమయంలో ఆయనకు ప్రభుత్వం 13వ నంబరు బంగ్లాను కేటాయించింది. ప్రణబ్ ముఖర్జీ 1996 నుండి 2012 వరకు ఢిల్లీలోని తల్కటోరిలోని 13వ నంబర్ బంగ్లాలో నివసించారు. 13వ నంబర్‌తో ప్రణబ్ ముఖర్జీకి ఉన్న అనుబంధం ఆయన జీవితంలోని చిరస్మరణీయ క్షణాలుగా మారాయి.
ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment