
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు అని ముద్దుగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సైతం అయాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
అయాన్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ప్రత్యేకంగా వీడియోను షేర్ చేసింది. అయాన్‌తో సంతోషంగా ఉన్న క్షణాలను వీడియో రూపంలో పంచుకుంది. నువ్వు మా జీవితంలో భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ స్నేహా రెడ్డి పోస్ట్ చేసింది.
ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
Many many happy returns of the day to the love of my life … Happy Birthday my Chinni Babu #AlluAyaan 😘😘😘 pic.twitter.com/1r6fn7xXdc
— Allu Arjun (@alluarjun) April 3, 2025