అల్లు స్నేహా అట్లతద్ది పూజ.. ఇది ఎందుకు చేస్తారంటే?
ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే కొందరు ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తుంటారు. అల్లు అర్జున్ స్నేహా కూడా ప్రతి పండగని వదలకుండా జరుపుతూ ఉంటుంది. సంక్రాంతి, ఉగాది, వరలక్ష్మి వ్రతం.. ఇలా ఎప్పటికప్పుడు వాటిని చేస్తూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అట్లతద్ది చేసుకుంది.(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది అశ్విని మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే తదియ, చతుర్థి నాడు 'అట్ల తద్ది'ని జరుపుకొంటారు. ఉత్తరాదిలో అయితే దీన్ని 'కర్వా చౌత్' అంటారు. పెళ్లి కానీ అమ్మాయిలు.. మంచివాడు భర్తగా రావాలని దేవుడికి ఈ పూజ చేస్తారు. ఇక పెళ్లయిన వాళ్లయితే భర్త ఆయురారోగ్యలతో ఉండాలని ప్రార్థిస్తారు.అల్లు స్నేహా కూడా వేకువజామునే లేచి అట్లతద్ది చేసుకుంది. ఎర్ర చీరలో అందంగా ముస్తాబై మరీ భర్త బాగోగులు కోసం పూజ చేసింది. ఆ ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)