
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. ఇప్పుడీ పేరు యావత్ సినీ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ గుర్తింపు కోసం బన్నీ చాలా కష్ట పడ్డాడు.వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనదైన నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘ఐకాన్ స్టార్’ స్థాయికి వచ్చాడు. సినిమాల రికార్డులను బద్దలు కొట్టడమే కాదు.. సోషల్ మీడియాలోనూ బన్నీ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య 28.5 మిలియన్స్‌కి చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు.
(చదవండి: మెగా వర్సెస్ అల్లు.. అసలేం జరుగుతుంది?)
ఒక్కే ఒక్కరు
ఇన్‌స్టాలో బన్నీకి 28.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే.. ఆయన మాత్రం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. ఆ ఒక్కరు ఎవరంటే అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డినే. ఆమెను మాత్రమే బన్నీ ఫాలో అవుతున్నాడు. ఇన్‌స్టాలో స్నేహరెడ్డికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆమెకు 9.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. బన్నీతో పాటు రామ్ చరణ్, చిరంజీవి, ఉపాసనలను కూడా స్నేహా రెడ్డి ఫాలో అవుతోంది. బన్నీ మాత్రం మొదటి నుంచి ఎవరిని ఫాలో అవ్వడం లేదు. కానీ రామ్ చరణ్ మొన్నటి వరకు అల్లు అర్జున్‌ని ఫాలో అయ్యాడు. సడెన్‌గా ఏం జరిగిందో కానీ.. తాజాగా చరణ్ కూడా బన్నీని అన్ ఫాలో చేశాడు. ప్రస్తుతం చరణ్‌కి ఇన్‌స్టాలో 26 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. ఆయన 38 మందిని ఫాలో అవుతున్నారు. అందులో అల్లు శిరీష్,చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఉన్నారు.
బయటపడ్డ విభేధాలు
అల్లు అర్జున్‌ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో స్నేహంగా ఉండే బన్నీ, చరణ్‌ల మధ్య ఏం జరిగింది? ఎందుకు అన్ ఫాలో చేశారనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఇరు కుటుంబాల విభేదాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన పని.. ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.