
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి (Allu Sneha Reddy)కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. సినిమాల్లో నటించకపోయినా ఓ స్టార్ హీరోయిన్‌కు ఉన్నంత ఫాలోవర్స్‌లో ఆమెకు ఉన్నారు. తరచు అల్లు అయాన్, అర్హ ఫోటోలను షేర్ చేయడంతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు హెల్త్ టిప్స్ కూడా ఇస్తుంటారు. అందుకే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పెద్ద ఎత్తున ఫాలో అవుతుంటారు.
తాజాగా స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఓ అమ్మాయికి బ్లడ్ ఎక్కిస్తున్నట్లుగా ఓ ఫోటో షేర్ చేశారు. ‘నాకు ప్రస్తుతం ఏం కావాలంటే’ అంటూ దీనికి క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ బ్లడ్ ప్యాకెట్‌పై ట్రావెల్ అని రాసుంది. దీనిని చూసిన అల్లు అభిమానులు అల్లు కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయ్యిందా అని ఆందోళన చెందుతున్నారు. ఆమెకే హెల్త్ బాగోలేక ఆస్పత్రిలో చేరిందని, ఈ విషయాన్ని చెప్పడానికే ఆ ఫోటోని షేర్ చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అల్లు స్నేహ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా,అల్లు అర్జున్-స్నేహల వివాహం 2011 మార్చి 6న జరిగింది. ఈ జంటకి 2014లో అయాన్ జన్మించగా.. 2016లో అర్హ పుట్టింది. అల్లు అర్జున్ సినిమాలు, షూటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉంటే..స్నేహ ఫ్యామిలీని చూసుకుంటూ భర్తకు తోడుగా ఉంటుంది.