అల్లు స్నేహా అ‍ట్లతద్ది పూజ.. ఇది ఎందుకు చేస్తారంటే? | Allu Arjun Wife Allu Sneha Atla Taddi 2024 Pooja Photos Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Allu Sneha Atla Taddi Photos: అట్లతద్ది చేసిన బన్నీ భార్య.. ఫొటోలు వైరల్

Published Sun, Oct 20 2024 10:25 AM | Last Updated on Sun, Oct 20 2024 11:53 AM

Allu Arjun Wife Allu Sneha Atla Tadde Pooja

ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే కొందరు ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తుంటారు. అల్లు అర్జున్ స్నేహా కూడా ప్రతి పండగని వదలకుండా జరుపుతూ ఉంటుంది. సంక్రాంతి, ఉగాది, వరలక్ష‍్మి వ్రతం.. ఇలా ఎప్పటికప్పుడు వాటిని చేస్తూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అట్లతద్ది చేసుకుంది.

(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)

తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది అశ్విని మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే తదియ, చతుర్థి నాడు 'అట్ల తద్ది'ని జరుపుకొంటారు. ఉత్తరాదిలో అయితే దీన్ని 'కర్వా చౌత్' అంటారు. పెళ్లి కానీ అమ్మాయిలు.. మంచివాడు భర్తగా రావాలని దేవుడికి ఈ పూజ చేస్తారు. ఇక పెళ్లయిన వాళ్లయితే భర్త ఆయురారోగ్యలతో ఉండాలని ప్రార్థిస్తారు.

అల్లు స్నేహా కూడా వేకువజామునే లేచి అట్లతద్ది చేసుకుంది. ఎర్ర చీరలో అందంగా ముస్తాబై మరీ భర్త బాగోగులు కోసం పూజ చేసింది. ఆ ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement