అక్కినేని హీరో నాగచైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కలిసి కనిపించలేదు. ఇప్పుడు మాత్రం స్టైలిష్ లుక్స్‌తో జంటగా అదరగొట్టేశారు. ఇందుకు సంబంధించి చైతూ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)
గతంలో సమంతని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న చైతూ.. కొన్నాళ్ల పాటు సింగిల్‌గానే ఉన్నాడు. శోభితతో డేటింగ్ అనే రూమర్స్ వచ్చాయి. కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ ఏడాది ఎంగేజ్‌మెంట్ ఆ పుకార్లకు పుల్‌స్టాప్ పడినట్లయింది. బహుశా ఏదైనా యాడ్ షూట్ కోసమో ఏమో గానీ ఇద్దరు జంటగా కనిపించారు.
చైతూ 'తండేల‍్' సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. శోభిత కూడా పలు బాలీవుడ్, ఓటీటీ మూవీస్ చేస్తూ కాస్త బిజీగా ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్ల పెళ్లి ఉండొచ్చు. మరి వివాహం తర్వాత శోభిత యాక్టింగ్ పక్కనబెట్టేస్తుందా? లేదా అనేది చూడాలి.
(ఇదీ చదవండి: చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ)
Comments
Please login to add a commentAdd a comment