Akkineni Family
-
పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత
శోభిత... అక్కినేని ఇంటి కోడలైంది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యని ఇటీవలే పెళ్లి చేసుకుంది. తర్వాత భర్త, మామతో కలిసి శ్రీశైల మల్లిఖార్జునుడిని కూడా దర్శించుకుంది. గత కొన్నిరోజులుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్న శోభిత.. కాస్త తీరిక దొరకడంతో భర్త, పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్)'చైతన్య.. నా జీవితంలోకి రావడం అదృష్టం. చైతూ సింప్లిసిటీ, అందరితో గౌరవంగా ఉండే విధంగా నాకు ఎంతో నచ్చేశాయి. ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనేది చైతూ నుంచి నేను నేర్చుకున్నాను. పెళ్లి తర్వాత శ్రీశైలం వెళ్లి శివుడిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతనిచ్చింది. చిన్నప్పటి నుంచి నా జీవితంలో దైవభక్తి భాగమే. టైమ్ దొరికినప్పుడల్లా కూచిపూడి, భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంటాను. వంట విషయంలోనూ ప్రాక్టీస్ ఉంది. ఆవకాయ, ముద్దపప్పు చేయడమంటే చాలా ఇంట్రెస్ట్' అని శోభిత చెప్పుకొచ్చింది.నాగచైతన్య హీరోగా నటించిన 'తండేల్'.. రాబోయే ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ నెల నుంచి 'విరూపాక్ష' దర్శకుడు తీసే కొత్త సినిమాలోనూ చైతూ నటించబోతున్నాడు. శోభిత విషయానికొస్తే ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లు ఏవి లేనట్లు కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు పెళ్లి జీవితాన్ని ఆస్వాదించి ఆ తర్వాత తిరిగి సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తుందేమో!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం
అక్కినేని ఫ్యామిలీలో మరికొన్ని గంటల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య.. బుధవారం రాత్రి 8:13 గంటల ముహూర్తానికి శోభిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని ఈ వేడుక జరగనుంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్)నాగార్జున-లక్ష్మిల కుమారుడైన నాగచైతన్య.. ధూళిపాళ శాంతకామాక్షి, వేణుగోపాలరావుల కుమార్తె అయిన శోభితతో ఏడడుగులు నడవబోతున్నాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగనుంది. టాలీవుడ్ నుంచి కూడా మెగా, దగ్గుబాటి కుటుంబాలు రాబోతున్నాయి. రాజమౌళి, మహేష్, ప్రభాస్ తదితర స్టార్ హీరోలు కూడా ఈ పెళ్లికి విచ్చేయనున్నారు.(ఇదీ చదవండి: నిఖిల్‌ని ఓడించిన ప్రేరణ.. సారీ చెప్పిన గౌతమ్) -
చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్
అక్కినేని కుటుంబంలో పెళ్లి భాజాలు మోగాయి. నాగచైతన్య-శోభిత డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. హల్దీ (పసుపు దంచడం) ఇప్పుడు జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)నాగచైతన్య-శోభిత పెళ్లి డిసెంబర్ 4న రాత్రి 8:13 గంటలకు జరగనుంది. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. టాలీవుడ్ నుంచి మెగా, దగ్గుబాటి ఫ్యామిలీలతో పాటు రాజమౌళి లాంటి స్టార్స్ విచ్చేయనున్నారు. చైతూ-శోభిత.. ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తుల్లోనే మెరిసిపోనున్నారు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే) -
చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే
హీరో నాగచైతన్య మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ శుభకార్యం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. సరిగ్గా ఈ టైంలో ఓ పుకారు బయటకొచ్చింది. చైతూ-శోభిత పెళ్లిని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.50 కోట్లకు డీల్ మాట్లాడుకుందని అన్నారు. కానీ అందులో నిజం లేదు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)చైతూ-శోభితకు సన్నిహితుడైన ఓ వ్యక్తి.. ఓటీటీ డీల్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని తేల్చేశారు. పెళ్లి.. చాలా ప్రైవేట్‌గా జరగనుందని క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్లు రావడానికి ఓ కారణముంది. రీసెంట్గా 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరిట ఈమె జీవితాన్ని డాక్యుమెంటరీగా తీసి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. దీనిపై నెగిటివ్ కామెంట్సే వినిపించాయి.ఇదే డాక్యుమెంటరీలో నయన పెళ్లి వీడియోని కూడా చూపించారు. ఈ క్రమంలోనే చైతూ-శోభిత పెళ్లిని కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓటీటీలో ప్రసారం చేయనుందనే రూమర్ పుట్టుకొచ్చింది. ఇదంతా అబద్ధమని తేలింది. ప్రస్తుతం చైతూ 'తండేల్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'విరూపాక్ష' దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
హీరో అఖిల్‌తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?
హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభితల పెళ్లి మరో వారం రోజుల్లో అంటే డిసెంబరు 4న జరగనుంది. ఇంతలోనే తన చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రకటించారు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయి తమ ఇంటికి కోడలు కాబోతుందని ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఎవరీ అమ్మాయి? సినిమా నటి లేదా మోడల్ అనేది ప్రశ్నగా మారింది.(ఇదీ చదవండి: హమ్మయ్యా.. 'పుష్ప 2' షూటింగ్ ఇన్నాళ్లకు పూర్తి)అఖిల్ చేసుకోబోయే అమ్మాయి పేరు జైనాబ్ రవ్జీ అని.. ఈమె ఓ ఆర్టిస్ అని మాత్రమే బయటపెట్టారు. అంతకు మించి ఒక్క డీటైల్ కూడా చెప్పలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈమెది హైదరాబాద్. కానీ లండన్, దుబాయిలో చదువంతా పూర్తి చేసిందట. హైదరాబాద్‌లోనే గతంలో రిఫ్లెక్షన్ పేరుతో ఆర్ట్ గ్యాలరీలో పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందులో ఈమె వేసిన మోడ్రన్, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ని కూడా ప్రదర్శించారట.జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇన్ స్టాలో ఈమెకు ఖాతా ఉంది గానీ అది ప్రైవేట్‌లో ఉంది. అఖిల్ ఈమెని చాలా ఏళ్లుగా ప్రేమించాడని చెప్పారు కానీ వీళ్లిద్దరూ ఎక్కడ ఎప్పుడు పరిచయమైంది ప్రస్తుతానికి సస్పెన్స్. బహుశా ఏదైనా పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వీళ్లిద్దరూ పరిచయమై, అది ప్రేమగా మారిందేమో? అలానే జైనాబ్.. అఖిల్ కంటే వయసులో పెద్దది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాలి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్
అక్కినేని ఫ్యామిలీలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఈ పాటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. కొన్నిరోజుల క్రితం శోభిత పోస్ట్ పెట్టడంతో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు శుభలేఖలు పంచే కార్యక్రమం కూడా షురూ అయిపోయింది. అమ్మాయి తరఫున వాళ్లు ఇచ్చే పెళ్లికార్డుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది.(ఇదీ చదవండి: 'కంగువ'ని తొక్కేస్తున్నారు.. ప్లాన్ చేసి ఇలా: జ్యోతిక)ఈ పెళ్లి కార్డులో శోభిత-నాగచైతన్యకు డిసెంబరు 4న పెళ్లి జరగనుందని, తామెల్లరూ విచ్చేసి ఆశీర్వదించాలని అని రాసుకొచ్చారు. అయితే కేవలం పెళ్లి కార్డు అనే కాకుండా వెదురు బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు.. వీటన్నింటిని కలిపి పెళ్లి కార్డ్‌గా ఆహ్వానం అందించినట్లు వైరల్ అయిన ఫొటో చూస్తుంటే తెలుస్తోంది.ఈ పెళ్లి కార్డులో 4వ తేదీ అని ఉంది గానీ వేదిక ఎక్కడనేది కనిపించలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు అక్కినేని ఫ్యామిలీ సొంతమైన అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేకంగా వేసే మండపం సెట్లో శుభకార్యం జరగనుంది. ఈ మేరకు త్వరలో ఏర్పాట్లు మొదలవుతాయి. ఆడపిల్ల తరఫున పెళ్లి పనులు ప్రారంభమయ్యాయంటే.. మరో రెండు మూడు రోజుల్లో అబ్బాయి తరఫు నుంచి కూడా పెళ్లి ఏర్పాటు షురూ అవుతాయని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్) -
కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!
అక్కినేని హీరో నాగచైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కలిసి కనిపించలేదు. ఇప్పుడు మాత్రం స్టైలిష్ లుక్స్‌తో జంటగా అదరగొట్టేశారు. ఇందుకు సంబంధించి చైతూ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)గతంలో సమంతని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న చైతూ.. కొన్నాళ్ల పాటు సింగిల్‌గానే ఉన్నాడు. శోభితతో డేటింగ్ అనే రూమర్స్ వచ్చాయి. కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ ఏడాది ఎంగేజ్మెంట్ ఆ పుకార్లకు పుల్‌స్టాప్ పడినట్లయింది. బహుశా ఏదైనా యాడ్ షూట్ కోసమో ఏమో గానీ ఇద్దరు జంటగా కనిపించారు.చైతూ 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. శోభిత కూడా పలు బాలీవుడ్, ఓటీటీ మూవీస్ చేస్తూ కాస్త బిజీగా ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్ల పెళ్లి ఉండొచ్చు. మరి వివాహం తర్వాత శోభిత యాక్టింగ్ పక్కనబెట్టేస్తుందా? లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
మతిపోయి, గతి తప్పి.. మంత్రిగారి గలీజు మాటలు..
-
మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు..
-
Tollywood: మేము సైతం
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల కేరళలో సంభవించిన వరదల సమయంలో తెలుగు నటులు కొందరు భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం తెలుగు హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు ‘మేము సైతం’ అంటూ విరాళాలు ప్రకటించారు.‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు కలచివేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో ΄ాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూ΄ాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షలు చొప్పున) విరాళంగా ప్రకటిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు చిరంజీవి.→ ‘‘అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుండేవారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి యాభై లక్షల రూ΄ాయల చొప్పున విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి’’ అని అక్కినేని కుటుంబం పేర్కొంది. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నాయి.→ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రూ. 6 కోట్ల విరాళం ప్రకటించారు నటుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఏపీ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడిన 400 పంచాయితీలకు రూ. 1 లక్ష చొప్పున రూ. 4 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఇలా మొత్తంగా రూ. ఆరు కోట్లను పవన్ కల్యాణ్ విరాళంగా అందించనున్నారు. → తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళాన్ని అందజేయనున్నట్లుగా ఆయన సిబ్బంది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూ΄ా యల చొప్పున విరాళం అందించనున్నట్లుగా ప్రభాస్ టీమ్ పేర్కొంది.→ ‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూ΄ాయలు విరాళంగా ప్రకటిస్తున్నా’’ అంటూ రామ్‌చరణ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.→ ‘‘తెలగు రాష్ట్రాల్లోని వరద పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది. నా వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూ΄ాయల విరాళం అందిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు అల్లు అర్జున్.→ తెలుగు రాష్ట్రాల్లోని వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రుల సహాయ నిధులకు రూ. 10 లక్షల చొప్పున 20 లక్షలు... అలాగే విజయవాడలోని అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ .5 లక్షలు.. ఇలా మొత్తంగా రూ. 25లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు సాయిదుర్గా తేజ్.→ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, తన సిబ్బంది వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా ΄ాల్గొంటున్నారని సోనూసూద్ తెలి΄ారు. బుధవారం పైన పేర్కొన్న నటులు విరాళం ప్రకటించగా, అంతకుముందు విరాళం ప్రకటించినవారి వివరాల్లోకి వెళితే... ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి రూ. 50 లక్షలు చొప్పున కోటి రూ΄ాయలు బాలకృష్ణ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్ విరాళంగా ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్– ఎస్. రాధాకృష్ణ–ఎస్. నాగవంశీ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లుగా తెలి΄ారు. తెలుగు రాష్ట్రాలకు 15 లక్షల రూ΄ాయల చొప్పున మొత్తంగా రూ. 30 లక్షలు విరాళంగా ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. విశ్వక్ సేన్, దర్శకుడు వెంకీ అట్లూరి మొత్తంగా పది లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల 5 లక్షలు (ఏపీ 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు) విరాళం ప్రకటించారు. దర్శకుడు–నటుడు తల్లాడ సాయికృష్ణ రూ. లక్షా యాభై వేలుని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు విరాళంగా ప్రకటించారు. -
యువ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?
హీరో అక్కినేని నాగార్జున 'బిగ్‌బాస్'తో పాటు ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అతడి సోదరి నాగసుశీలపై పోలీస్ కేసు నమోదైందనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే కొడుకుని హీరోగా పెట్టి పలు చిత్రాల్ని నిర్మించిన ఈమెపై ఎవరు కేసు పెట్టారు? అయినా ఎందుకు పెట్టారు? నాగార్జున చెల్లెలు నాగసుశీల. ఈమె కొడుకే నటుడు సుశాంత్. గతంలో తెలుగులో పలు సినిమాల్లో హీరోగా చేశాడు. కొన్నాళ్ల నుంచి మాత్రం అల వైకుంఠపురములో, రావణాసుర, భోళా శంకర్ తదితర చిత్రాల్లో కీలకపాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. గతంలో ఇతడిని హీరోగా పెట్టి.. తల్లి నాగసుశీల 'కరెంట్', 'అడ్డా', 'ఆటాడుకుందాం రా' తదితర చిత్రాల్ని నిర్మించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) ఈమె చింతలపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తితో కలిసి సినిమాలు నిర్మించారు. అలాంటిది 2019లో నాగసుశీలనే అతడిపై పోలీస్ కేసు పెట్టారు. అప్పట్లో వీళ్లిద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. తనకు తెలియకుండా శ్రీనివాసరావు.. భూముల్ని అమ్మేసుకుని, ఆ డబ్బు దుర్వినియోగం చేశాడని ఈమె ఆరోపణలు చేశారు. అలాంటిది ఇప్పుడు అదే శ్రీనివాసరావు.. నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఈమెతోపాటు మరో 12మంది కలిసి తనపై దాడి చేశారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత నాలుగేళ్లుగా వీళ్లిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదికాస్త మరోసారి కేసుల వరకు వెళ్లడం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా అయిపోయింది. (ఇదీ చదవండి: అసిస్టెంట్ పెళ్లిలో స్టార్ హీరో సందడి.. వీడియో వైరల్!) -
చై-సామ్ విడాకుల తర్వాత.. ఫస్ట్ గ్రూప్ ఫోటో ఇదే!
అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. ఏఎన్ఆర్ తర్వాత నాగార్జున, నాగచైతన్య,అఖిల్, సుశాంత్, సుమంత్ హీరోలుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో కనిపించి కనువిందు చేశారు. రీసెంట్గా నాగార్జున ఇంట్లో జరిగిన గెట్ టుగెదర్ పార్టీలో అక్కినేని వారసులంతా ఒకేచోట కనిపించారు.ఈ ఫోటోలను సుశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో ఆ ఫోటో వైరల్‌గా మారింది. అయితే ఇందులో అఖిల్ మాత్రం మిస్సయ్యాడు. మాల్దీవులకు వెళ్లిన అఖిల్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓల్డ్ పిక్ ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు సమంతను మిస్సవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీ వేడుకల్లో సమంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచేది. కానీ విడాకుల నేపథ్యంలో సమంత దూరమవడం అక్కినేని ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తుంది. ❤️ pic.twitter.com/QnIMBoaLkh — Sushanth A (@iamSushanthA) May 16, 2022 -
టీజర్: సుశాంత్‌కు ప్రభాస్ విషెస్
తన లైఫ్‌లో అమ్మకు.. అమ్మాయికి.. బైక్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉందంటూ యువ నటుడు సుశాంత్ చెబుతున్నాడు. డి.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా టీజర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. సుశాంత్‌కు, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ సినిమా టీజర్‌ను ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక చూస్కోండి అంటూ టీజర్‌ను వదిలాడు. ఈ సినిమా బైక్ పార్కింగ్ నేపథ్యంలో సినిమా కొనసాగుతుందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం కొనుగోలు చేయడం.. దానిపై హీరోయిన్ను ఎక్కించుకోవడం.. అనంతరం నో పార్కింగ్ స్థలంలో బండి నిలపడం ప్రధాన కథగా ఉండనుందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాణంలో ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుశాంత్‌కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా వెన్నెల కిశోర్, ప్రియదర్శి తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. -
అక్కినేని ఇంట నిశ్చితార్థ వేడుక..
అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. కింగ్ నాగార్జున సోదరుడు వెంకట్ కుమారుడు ఆదిత్య నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. ఆదిత్య, ఐశ్వర్యల నిశ్చితార్థం సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా కలిసి సందడి చేశారు. ఈ వేడుకకు నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల, సుమంత్, సుప్రియా, నాగసుశీల, సుశాంత్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే తన సోదరుడు ఆదిత్యకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫొటోలో నాగచైతన్య భార్య సమంత కనిపించకపోవడంతో.. సమంత ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అక్కినేని హీరో నాగచైతన్య, వెంకటేశ్‌తో కలిసి నటించిన మల్టీస్టారర్ ‘వెంకీ మామా’ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రానుంది. -
అక్కినేని హలిడే టూర్
ఫుల్‌గా పని చెయ్. ఆ తర్వాత తప్పకుండా హాలీడే చెయ్. ఇదే మా మంత్రం అంటున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. నాగచైతన్య, సమంతల ‘శైలజా రెడ్డి అల్లుడు, యు టర్న్’ రిలీజ్ కావడం, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ షూటింగ్‌కి గ్యాప్ దొరకడంతో సేద తీరడానికి హాలీడే వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత ‘దేవదాస్’ రిలీజ్ చూసుకొని అమలతో కలసి నాగార్జున కూడా వాళ్లతో జాయిన్ అయ్యారు. ఇలా కుటుంబమంతా సరదాగా హాలీడే మూడ్‌లోకి వెళ్లారు. ‘‘సక్సెస్ కూడా యాడ్ అయినప్పుడు హాలీడే ఇంకా అద్భుతంగా మారుతుంది’’ అని నాగార్జున ఈ ఫొటోను షేర్ చేశారు. -
అందరికీ ధన్యవాదాలు
ప్రస్తుతం అక్కినేని కుటుంబం హాలీడే మూడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య, ఆయన సతీమణి సమంత విదేశాలు వెళ్లారు. ఇద్దరు మాత్రమే కాదు.. వీళ్ల వెంట అఖిల్ కూడా స్పెయిన్ తీరప్రాంతంలోని ఇబిసా ప్రాంతానికి వెళ్లారు. అంతే కాదండోయ్.. నాగార్జున, ఆయన సతీమణి అమల కూడా ఈ సరదా ట్రిప్‌లో జాయిన్ అయ్యారు. ఈ హాలిడే ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సమంత. వీటిపై నెటిజన్లు కొందరు మండిపడుతున్నారు. ముఖ్యంగా సమంత వస్త్రధారణను విమర్శిస్తున్నారు. ఇలాంటి దుస్తుల ద్వారా సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావ్? అంటూ విమర్శించారు. ఈ విమర్శలకు సమంత ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో ఓ మేసేజ్ ఉంచారు. ‘‘నా పెళ్లి తర్వాత నేనెలా ఉండాలో చెబుతున్న వారందరికీ అంటూ... ఓ అసభ్యకరమైన సింబల్‌ని పోస్ట్ చేసి, ధన్యవాదాలు’’ అంటూ ముగించారు. అంటే.. పరోక్షంగా సమంత నా జీవితం.. నా ఇష్టం అనేలా చెబుతున్నట్లు ఉంది కదూ. ఇప్పుడు వీటిపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు అక్కినేని నాగచైతన్య, సమంతల పెళ్లి రోజు దగ్గర పడుతున్న (అక్టోబర్ 6) సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత చేయబోతున్న చిత్రం ఆ రోజు ప్రారంభం అవుతుందట. దీనికి ‘మజిలీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నారన్న వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇక నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా నవంబర్ 2న విడుదల కానుంది. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే -
‘స్వచ్ఛ భారత్’లో నాగార్జున కుటుంబం
హైదరాబాద్ : అక్కినేని కుటుంబం ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నాగచైతన్య, అఖిల్, సుశాంత్ తదితరులు బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో రోడ్లను శుభ్రం చేశారు. చీపుర్లు చేతపట్టి చెత్తను ఊడ్చారు. అక్కడ పేరుకుపోయిన మట్టిని కూడా తొలగించారు. ప్రత్యేకంగా ధరించిన దుస్తులతో అక్కినేని కుటుంబం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా హీరో నాగార్జునకు అభినందనలు తెలిపారు. -
ఆ సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యా: కమల్
అక్కినేని కుటుంబంలో ఉన్న నటులంతా కలిసి చేసిన 'మనం' సినిమా.. తనను తీవ్ర భావోద్వేగానికి గురిచేసిందని ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ అన్నారు. ఒక ప్రైవేటు స్క్రీనింగ్‌లో ఆయన ఈ సినిమా చూశారు. ఈ సినిమా దివంగత అక్కినేని నాగేశ్వరరావుకు మంచి నివాళి అవుతుందని చెబుతూ, సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు అభిమానినని, ఈ సినిమా మళ్లీ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసిందని కమల్ తెలిపారు. వెండితెరమీద ఏఎన్నార్‌ను చూడగానే ఒక్కసారిగా ఉద్వేగం ఆపుకోలేకపోయినట్లు చెప్పారు. ఆయనకు ఈ రకంగా నివాళులు అర్పించిన అక్కినేని కుటుంబానికి హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపారు. -
అక్కినేనికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, హైదరాబాద్: సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు భౌతికకాయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బుధవారం రాత్రి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తన సంతాపం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం’ యాత్రలో ఉన్న జగన్.. అక్కినేని మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయంత్రం 6.10 గంటలకు రేణిగుంట నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. రాత్రి 9.15 సమయంలో అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుని.. అక్కినేని భౌతికకాయంపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. అక్కినేని కుమారుడు నాగార్జున, మనవడు సుమంత్‌ను జగన్ కౌగిలించుకుని మనో నిబ్బరంతో ఉండాలంటూ ధైర్యం చెప్పారు. ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్ వెంట వైఎస్సార్సీపీ నాయకులు కె.రఘురామ కృష్ణంరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అక్కినేని మృతి పట్ల జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబసభ్యులకు తన సానుభూతిని తెలిపారు. అయితే, ‘సమైక్య శంఖారావం’ యాత్రలో ఉన్న జగన్... ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారం చిత్తూరు జిల్లాలోని రెండు మండలాల్లో యాత్ర నిర్వహించాల్సి ఉంది. అక్కినేనికి శ్రద్ధాంజలి ఘటించాలని నిర్ణయించుకున్న జగన్ ఎస్.ఆర్.పురం మండలంలోని గ్రామాల్లో మాత్రమే పర్యటించి.. హైదరాబాద్‌కు బయలుదేరారు. గంగాధర నెల్లూరు మండల పర్యటనను వాయిదా వేసుకున్నారు. గురువారం ఉదయం మళ్లీ తిరిగివెళ్లి జగన్ యాత్రను కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.