
అక్కినేని ఫ్యామిలీలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఈ పాటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. కొన్నిరోజుల క్రితం శోభిత పోస్ట్ పెట్టడంతో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు శుభలేఖలు పంచే కార్యక్రమం కూడా షురూ అయిపోయింది. అమ్మాయి తరఫున వాళ్లు ఇచ్చే పెళ్లికార్డుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది.
(ఇదీ చదవండి: 'కంగువ'ని తొక్కేస్తున్నారు.. ప్లాన్ చేసి ఇలా: జ్యోతిక)
ఈ పెళ్లి కార్డులో శోభిత-నాగచైతన్యకు డిసెంబరు 4న పెళ్లి జరగనుందని, తామెల్లరూ విచ్చేసి ఆశీర్వదించాలని అని రాసుకొచ్చారు. అయితే కేవలం పెళ్లి కార్డు అనే కాకుండా వెదురు బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు.. వీటన్నింటిని కలిపి పెళ్లి కార్డ్‌గా ఆహ్వానం అందించినట్లు వైరల్ అయిన ఫొటో చూస్తుంటే తెలుస్తోంది.
ఈ పెళ్లి కార్డులో 4వ తేదీ అని ఉంది గానీ వేదిక ఎక్కడనేది కనిపించలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు అక్కినేని ఫ్యామిలీ సొంతమైన అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేకంగా వేసే మండపం సెట్‌లో శుభకార్యం జరగనుంది. ఈ మేరకు త్వరలో ఏర్పాట్లు మొదలవుతాయి. ఆడపిల్ల తరఫున పెళ్లి పనులు ప్రారంభమయ్యాయంటే.. మరో రెండు మూడు రోజుల్లో అబ్బాయి తరఫు నుంచి కూడా పెళ్లి ఏర్పాటు షురూ అవుతాయని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్)


Comments
Please login to add a commentAdd a comment