కోలీవుడ్ 'బాహుబలి'గా ప్రచారం చేసిన సూర్య 'కంగువ'.. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చింది. మంచి హైప్‌తో రిలీజైన ఈ సినిమాకు మొదటి సీన్ తర్వాత నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. మూవీలో ప్లస్సులు కంటే మైనస్సులు ఎక్కువైపోవడమే దీనికి కారణం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూర్య భార్య జ్యోతిక ఇప్పుడు 'కంగువ'పై కుట్ర జరుగుతోందని ఆరోపించింది. కావాలనే మా మూవీని తొక్కేస్తున్నారని అంటోంది.
(ఇదీ చదవండి: తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్)
జ్యోతిక ఏమంది?
'నటుడు సూర్య భార్యగా కాదు నేను ఈ నోట్‌ని జ్యోతికగా, ఓ సినీ ప్రేక్షకురాలిగా రాస్తున్నాను. కంగువ- ఓ అద్భుతమైన సినిమా. సూర్యని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటి సాహసం చేయాలంటే చాలా ధైర్యముండాలి. తొలి అరగంట సినిమా బాగోలేదు. మ్యూజిక్ కూడా లౌడ్‌గా అనిపించింది. మన సినిమాల్లో తప్పులు సహజమే. మరీ ముఖ్యంగా ఇలాంటి మూవీస్‌లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. మళ్లీ చెబుతున్నా మూడు గంటల సినిమాలో తొలి అరగంట మాత్రమే బాగోలేదు.'
'మీడియా, పలువురు సినీ ప్రముఖుల నుంచి నెగిటివ్ రివ్యూస్ రావడం చూసి ఆశ్చర్యపోయా. వీళ్లెవరు కూడా అవే పాత స్టోరీలతో తీసిన సినిమాలకు, అమ్మాయిల వెంటపడే, డబుల్ మీనింగ్స్ ఉండే, ఓవర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటే మూవీస్‌కి ఇలా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం చూడలేదు. మరి 'కంగువ' పాజిటివ్ అంశాల సంగతేంటి? సెకండాఫ్‌లో అమ్మాయిల ఫైట్ సీక్వెన్స్, పిల్లాడి ట్రాక్.. రివ్యూ రాసేటప్పుడు ఇవేవి మీకు కనిపించలేదా?'
(ఇదీ చదవండి: గన్నులు కాల్చి స్వాగతిస్తాం.. బిహార్‌లో 'పుష్ప 2' క్రేజ్)
'తొలిరోజే 'కంగువ'పై నెగిటివిటీ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. తొలి షో పూర్తవకముందే ఇలా చేశారు. ఇదంతా చూస్తుంటే సినిమాని కావాలని తొక్కేస్తున్నారా అనిపిస్తుంది. కాన్సెప్ట్, కష్టానికి కనీసం ప్రశంసలు దక్కాలని నాకు అనిపిస్తుంది. నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లకు అలా చేయడం మాత్రమే తెలుసు' అని జ్యోతిక ఇన్ స్టాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది.
నవంబర్ 14న పాన్ ఇండియా లెవల్లో రిలీజైన 'కంగువ'సినిమాకు 2 రోజుల్లో రూ.89.32 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఈ చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా రూ.2000 కోట్ల వసూళ్లు వస్తాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్)
Comments
Please login to add a commentAdd a comment