ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పుష్ప' ఫీవర్ నడుస్తోంది. ఆదివారం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బిహార్‌లో ఎంత రచ్చ జరుగుతుందో ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. సగటు సినీ ప్రేక్షకుడు ఈ మూవీ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ టీమిండియా జట్టు వరకు చేరింది. లేటెస్ట్ సెన్సేషన్ హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ని టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన తిలక్ వర్మ హీరో అయిపోయాడు. దీంతో ఇతడిని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇంటర్వ్యూ చేశాడు. నిన్ను ఓ ప్రశ్న అడుగుతాను, నీ హెయిర్ స్టైల్ సీక్రెట్ ఏంటి? ఈ హెయిర్‌ను చూసి అందరు అల్లు అర్జున్.. అల్లు అర్జున్ అని అంటున్నారు.. ఏంటి అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నీవు అని సూర్య అడిగాడు.
(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ)
దీనికి సమాధానమిచ్చిన తిలక్ వర్మ.. ఏం లేదు, ఈ హెయిర్ స్టైల్‌ని ఇప్పుడే మొదలుపెట్టా. అప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అర్జున్ అని పిలుస్తున్నారు. చాలామంది ఆయనలానే కనిపిస్తున్నావ్ అని అంటున్నారు. నాకు లాంగ్ హెయిర్ బాగా అనిపించింది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మస్త్ అనిపిస్తుంది. అందుకే ఇలా పెంచాను అని చెప్పాడు.
ఏంటి మరి 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? అని సూర్య అడగ్గా.. అలాంటిది ఏం లేదు, నా పని బాల్, బ్యాట్తో ఆడటం మాత్రమే. గ్రౌండ్లో ఆడాలి.. బయటకెళ్లి ఎంజాయ్ చేయాలి. మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసి అటు క్రికెట్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
(ఇదీ చదవండి: 'పుష్ప' కోసం శ్రీలీల రెమ్యునరేషన్.. ఒక్క పాట కోసం అన్ని కోట్లా..!)
Nicee @alluarjun @TilakV9 🧡 pic.twitter.com/q708J77eiY
— Yash 🪓🐉 (@YashR066) November 16, 2024
Comments
Please login to add a commentAdd a comment