'పుష్ప' కోసం శ్రీలీల రెమ్యునరేషన్‌.. ఒక్క పాట కోసం అన్ని కోట్లా..! | Sreeleela Remuneration For Allu Arjun Pushpa 2 The Rule Kissik Special Song, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Sreeleela Pushpa 2 Remuneration: 'పుష్ప' కోసం శ్రీలీల రెమ్యునరేషన్‌.. ఒక్క పాట కోసం అన్ని కోట్లా..!

Published Sat, Nov 16 2024 12:37 PM | Last Updated on Sat, Nov 16 2024 1:10 PM

Sreeleela Remuneration For Pushpa 2 Special Song

పుష్ప చిత్రంలో శ్రీలీల భాగమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్‌ అవుతుంది. ఈ చిత్రానికి ఆమె తీసుకున్న రెమ్యునరేషన్‌ గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. డ్యాన్స్ విషయంలో అల్లు అర్జున్‌, శ్రీలీల.. ఇద్దరూ ఏమాత్రం తగ్గరు. అలాంటిది పుష్ప కోసం ఒక సాంగ్‌లో కనిపిస్తే.. ఆ క్రేజ్‌ గురించి చెప్పాల్సిన పని ఉండదు. 'పుష్ప2' చిత్రంలో 'కిస్సిక్‌..' అంటూ సాగే ఒక పాటలో  ఈ ఇద్దరి డ్యాన్స్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

శ్రీలీల రెమ్యునరేషన్‌
పుష్ప చిత్రంలో 'ఊ అంటామా మావ.. ఊ ఊ అంటావా' అని సమంత ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండో భాగంలో కూడా అదే రేంజ్‌ కొనసాగాలంటే సరైన హీరోయిన్‌ కావాల్సిందే. అందుకే శ్రీలీలను మేకర్స్‌ ఎంపిక చేసుకున్నారు. అయితే, పుష్ప2 స్పెషల్‌ సాంగ్‌ కోసం సుమారు రూ. 2 కోట్ల రెమ్యునరేషన్‌ శ్రీలీల తీసుకుందట. ఈ పాట కోసం 5రోజులు ఆమె కేటాయించారని టాక్‌. సుకుమార్‌-దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ఐటమ్‌ సాంగ్‌లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు 'పుష్ప2'లోనూ  అదిరిపోయేలా 'కిస్సిక్‌..' ఐటమ్‌ సాంగ్‌ను మేకర్స్‌ సిద్ధం చేశారని తెలుస్తోంది.

ఒక సినిమాకు తీసుకునేంత రెమ్యునరేషన్‌ అడిగిన శ్రద్ధా కపూర్‌
పుష్ప-2 ఐటెం సాంగ్ కోసం తొలుత శ్రీలీలను మేకర్స్‌ ఎంపిక చేయలేదట. బాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ను అనుకున్నారట. అయితే, స్త్రీ 2 సినిమాకి రూ.5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రద్ధా.. ఈ చిత్రంలోని ఐటెం సాంగ్‌ కోసం సుమారు రూ. 7 కోట్ల వరకు పారితోషికం అడిగినట్లు తెలుస్తోంది. దీంతో అనూహ్యంగా ‍శ్రీలీల పుష్ప ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబరు 5న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement