Sreeleela
-
ఏకంగా కరణ్ జోహర్ బ్యానర్ లో సినిమా..
-
బాలీవుడ్లో బడా బేనర్లో...
సౌత్‌లో దూసుకెళుతున్న శ్రీలీల(Sreeleela) బాలీవుడ్ ఎంట్రీ(Bollywood entry) గురించి కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ప్రచారంలో ఉన్న వార్త విషయానికొస్తే... బాలీవుడ్లో ఓ బడా బేనర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్( Dharma Productions) ద్వారా శ్రీలీల హిందీ చిత్రపరిశ్రమ అరంగేట్రం జరగనుందట. ఈ సంస్థ అధినేత కరణ్ జోహార్ ‘తూ మేరీ మై తేరా... మై తేరా తూ మేరీ’ అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan) హీరోగా నటించనున్నారు. ఈ హీరో సరసన శ్రీలీలను హీరోయిన్గా ఫిక్స్ చేశారని సమాచారం. ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది మధ్యలో ఈ చిత్రం షూట్ ఆరంభం అవుతుందట. ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించనున్నారు. మరి... బడా బేనర్ ద్వారా శ్రీలీల(Sreeleela) బాలీవుడ్ ఎంట్రీ (Bollywood entry) జరుగుతుందా? అంటే... వేచి చూడాల్సిందే. -
హైదరాబాద్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..శ్రీలీల,దక్ష నాగర్కర్ డ్యాన్స్ అదుర్స్ (ఫోటోలు)
-
2025లో టాలీవుడ్ ని శాసించనున్న రష్మిక, శ్రీలీల, మీనాక్షి
-
ఈ ఏడాది టాప్ సాంగ్స్ లిస్ట్ ప్రకటించిన యూట్యూబ్.. తెలుగు పాటకు చోటు
తెలుగు సాంగ్ గ్లోబల్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 2024లో విడుదలైన సాంగ్స్‌లలో టాప్-10 లిస్ట్‌ను యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. అందులో ఇండియా నుంచి ఒక సాంగ్ మాత్రమే ఉంది. అయితే, అది తెలుగు సినిమాకు సంబంధించిన పాట కావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో సందడి చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సాంగ్‌తో లెక్కలేనన్నీ రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది.'కుర్చీ మడతపెట్టి' సాంగ్ విడుదలైనప్పటి నుంచే యూట్యూబ్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. 527+ మిలియన్ వ్యూస్‌తో ఇప్పటికి కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దీంతో 2024 యూట్యూబ్ టాప్ సాంగ్స్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక ఇండియన్ పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 7 టాప్ హిట్ సాంగ్స్‌ను యూట్యూబ్ ప్రకటించింది. అందులో భారత్ నుంచి ఎంపికైన ఏకైక పాట 'కుర్చీ మడతపెట్టి' అనే సాంగ్ ఉండటం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు పాట సత్తా చాటడంతో మహేష్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న విడుదలైంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హారికా అండ్ హసిని బ్యానర్స్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, మహేష్ వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లాయి. -
లీలా వినోదం..
ఎప్పటిలానే మన గ్లామర్ సిటీ నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు వేదికలు రెడీ అయ్యాయి. ఇందులో లైవ్ మ్యూజిక్ సెటప్‌లు, సెలిబ్రిటీ గెస్టులు వంటి ఇతర వినోద కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి. నగర యువత ఈ వేడుకలను ఎక్కడెక్కడ చేసుకోవాలో ఇప్పటి నుంచే ప్లాన్లు చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఇప్పటికే పలువురు బుక్ మై షోలో పాస్‌లు రిజిష్టర్ చేసేసుకున్నారు. వీరి ఆసక్తి, ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నిర్వాహకులు సైతం తమ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దీని గురించిన మరిన్ని విశేషాలు.. ఇప్పటికే నగరంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు, ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు యువత సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కొన్ని థీమ్స్‌ను సైతం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లు. ముఖ్యంగా సినీ తారలు, ప్రముఖ సింగర్స్, డ్యాన్సర్స్.. ఎవరు ఎక్కడ హాజరవుతున్నారనే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న డీజే స్పెషలిస్టులు, లైవ్ మ్యూజిక్ స్పెషలిస్టులు వారి ప్రోమోలను వదులుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలో లైవ్ బ్యాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ ఈవెంట్లకు బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు కొన్నింటికి ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టడం విశేషం. స్టార్ గ్లామర్ ఈవెంట్స్.. వేడుకలు ఏవైనా సరే... అందులో గ్లామర్ ఉంటేనే వినోదమైనా, ఉల్లాసమైనా. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్ వేడుకల నిర్వహణలో సెలిబ్రిటీలను భాగం చేస్తున్నారు నిర్వాహకులు. సాధారణంగా ఇటువంటి ఈవెంట్స్‌లో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే నగరంలో పలు వేదికల్లో గ్రాండ్‌గా నిర్వహించే లైవ్‌మ్యూజిక్ కాన్సర్ట్‌లు, పబ్, రిసార్ట్, ఓపెన్ ఏరియా ఈవెంట్లలో పలువురు సినీతారలు, సింగర్లు తళుక్కున మెరవనున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ నటి శ్రీలీల, గాయకులు సునీత, రాకింగ్ సింగర్ రామ్ మిరియాల, తదితర టాలీవుడ్, బాలీవుడ్ సింగర్స్ నగరంలో ప్రేక్షకులకు తమ గాత్రంతో అలరించనున్నారు. డీజేల సందడి.. నూతన సంవత్సర వేడుకలకు సినిమా గ్లామర్ తోడైతే ఆ కిక్కేవేరబ్బా అంటోంది నగర యువత. తమకు నచి్చన భాష, హీరోల సినిమా పాటలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో శోధిస్తున్నారు. తెలుగు లైవ్ కాన్సర్ట్స్‌కు ఎక్కువ మంది మొగ్గుచూపుతుండగా, ఉత్తర భారతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నవారు మాత్రం హిందీ, ఇంగ్లి‹Ùకార్యక్రమాలను కోరుకుంటున్నారు. దీంతో ఈవెంట్ నిర్వాహకులు సైతం అందుకు అనుగుణంగానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిపుణులైన డీజే ఆర్టిస్టులకు డిమాండ్ నెలకొంది. సాయంత్రం 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు.‘నై’ వేడుకల్లో శ్రీలీల... సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు అప్పుడే గ్లామర్ వచ్చేసింది. ఆల్వేస్ ఈవెంట్స్, ఎస్వీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నగరంలోని నోవోటెల్ వేదికగా నిర్వహించనున్న నై (ఎన్‌వైఈ) 2025 వేడుకల్లో టాలీవుడ్ గ్లామర్ క్వీన్ శ్రీలీల తన స్టెప్పులతో అలరించనున్నారు. ఈ ఈవెంట్ పోస్టర్‌ను శుక్రవారం నోవాటెల్ వేదికగా ఆవిష్కరించారు. ఇందులో ప్రముఖ యాంకర్ రవి, నటి సౌమ్య జాను పాల్గొని సందడి చేశారు. నిర్వాహకులు సుమంత్ మాట్లాడుతూ.. బాలీవుడ్ లైవ్ మ్యూజిక్, కలర్‌ఫుల్ వేదికతో పాటు టాప్ మోడల్స్‌తో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోతో నై (ఎన్‌వైఈ) 2025 వేదిక కానుందన్నారు. నిరావల్ లైవ్ బ్యాండ్ నగరానికి ప్రత్యేకంగా రానుందని, వేడుకల్లో ప్రముఖ సినీతార శ్రీలీల పాల్గొని అలరించనున్నారని తెలిపారు. ప్రత్యేకమైన ఎస్ఎఫ్ఎక్స్ ప్రదర్శనలతో, న్యూ ఇయర్ కౌంట్ డౌన్‌తో పాటు విభిన్న రుచుల ఆహారం, ప్రీమియం డ్రింక్స్, టాటూ, ఫొటో బూత్‌లు అందుబాటులో ఉంటాయని సహ నిర్వాహకులు వినోద్ పేర్కొన్నారు. అంతేకాకుండా పలువురు సెలిబ్రిటీలు ఇందులో భాగం కానున్నారని అన్నారు. నగరంలో పలు కార్యక్రమాలు..⇒ హెచ్ఐసీసీ నోవోటెల్లో నూతన సంవత్సర వేడుకలకు ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరుకానున్నారు. లైవ్ బ్యాండ్, డ్యాన్స్, బాలీవుడ్ డీజే, మ్యాజిక్‌షో, కిడ్స్ జోన్, ఫ్యాషన్ షో, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ‘న్యూ ఇయర్ ఈవ్’ పేరిట రాత్రి 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇంగ్లిష్, తెలుగు, హిందీ పాటలు ఉంటాయి. ⇒ ప్రిజమ్ క్లబ్ అండ్ కిచెన్‌లో రామ్ మిరియాల బ్యాండ్ అమృతం ‘ది ప్రిజమ్ సర్కస్ 4.0’ కార్యక్రమన్ని ఏర్పాటు చేస్తున్నారు. ⇒ ఎల్బి నగర్ ఇండోర్ స్టేడియంలో యూబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాండ్ కాప్రిసియోని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తుంది. సంగీతం, ఎనర్జీ, ఉత్సాహంతో కూడిన విద్యుత్ వెలుగుల్లో నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. చార్ట్–టాపింగ్ హిట్లు, హై–ఎనర్జీ పెర్ఫార్మెన్స్ల మిక్సింగ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ⇒ బోల్డర్ హిల్స్‌లోని ప్రిజమ్ ఔట్ డోర్స్‌లో ప్రముఖ సింగర్స్ కార్తీక్, సునీత హాజరవుతున్నారు. ⇒ హైటెక్స్ ఎరీనాలో హైదరాబాద్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2025 (ఓపెన్ ఎయిర్) కార్యక్రమానికి నేహ ఆర్ గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. -
కొత్తపేటలో హీరోయిన్ శ్రీలీల సందడి
-
ఫ్రెండ్లీ స్టయిలిస్ట్ శరణ్యారావు
ఫ్యాషన్ వరల్డ్‌లో తెలుగువాళ్లు తక్కువగా కనిపిస్తారు.కానీ క్రియేటివ్ స్కిల్స్‌తో గట్టిగా నిలబడతారు!వాళ్లలో శరణ్యారావు పేరును చెప్పుకోవచ్చు గొప్పగా!శరణ్య స్వస్థలం విశాఖపట్నం. ముస్తాబు చేయడంలో ముందుండేది చిన్నప్పటి నుంచీ! శరణ్య అలంకరణ, స్టయిలింగ్కి తొలి మోడల్ ఆమె చెల్లెలే! ఇంటి పనుల్లో అమ్మ బిజీగా ఉండి, చెల్లిని రెడీ చేయలేకపోతే ఆ బాధ్యత తను తీసుకునేది! అది క్రమంగా అభిరుచిగా మారింది. తన పాకెట్ మనీతో మేకప్ వస్తువులు కొనేది. ఏ చిన్న ఫంక్షన్ అయినా చెల్లిని చక్కగా ముస్తాబు చేసి మురిసిపోయేది. ఆ అలంకరణను కొన్నిసార్లు అందరూ మెచ్చుకున్నా, చెల్లికి నచ్చేది కాదు. మరికొన్నిసార్లు ఎవ్వరికీ నచ్చకపోయినా, చెల్లికి మాత్రం తెగ నచ్చేది. ఇష్టాయిష్టాల్లో ఒకొక్కరిదీ ఒక్కో టేస్ట్ అని అర్థంచేసుకుంది శరణ్య. వాటిని బ్యాలెన్స్ చేస్తూ అందరూ మెచ్చే స్టయిలింగ్‌ని చూపించొచ్చు అని తెలుసుకుంది. రానురాను అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఫ్యాషన్ మీదున్న మక్కువతో బెంగళూరులో ఫ్యాషన్ కోర్సుచేసి, పేరున్న డిజైనర్ దగ్గర కొంతకాలం పనిచేసింది. తర్వాత హైదరాబాద్ వచ్చి స్టయిలింగ్ స్టార్ట్ చేసింది. పర్ఫెక్ట్ బాడీ, బ్రాండెడ్ దుస్తులతోనే స్టయిలింగ్ అనే ప్రాక్టీస్‌ని మార్చేసింది. పర్సనాలిటీ, బాడీ టైప్, బాడీ టోన్, కంఫర్ట్ వంటివాటిని దృష్టిలో పెట్టుకుని స్ట్రీట్ షాపింగ్ దుస్తులతో స్టయిలింVŠ చేస్తూ పర్ఫెక్ట్ అనిపించుకోవడం మొదలుపెట్టింది. అలా శరణ్య స్టయిలింగ్కి ఫిదా అయ్యి, ఆమె స్టయిలింగ్‌తో గార్జస్ అనిపించుకున్న వారిలో శ్రీలీల, ఐశ్వర్యా మీనన్, కావ్యా థాపర్, దక్షా నాగర్కర్, అదితీ గౌతమి, మాళవికా నాయర్, మిర్నా మీనన్ ఉన్నారు. రామ్ పోతినేని, సుశాంత్, సత్యదేవ్ లాంటి మేల్ యాక్టర్స్‌కూ శరణ్య స్టయిలింగ్ చేసింది. ‘తిమ్మరుసు’, ‘స్కంద’, ‘భోళా శంకర్’ వంటి సినిమాలకు స్టయిలిస్ట్‌గా పనిచేసింది. సినిమా కలర్ పాలెట్‌ను ఫాలో అవుతూ.. లెవెన్త్ అవర్‌లో కూడా కూల్‌గా స్టయిలింగ్ అందించే డైరెక్టర్స్ ఫ్రెండ్లీ స్టయిలిస్ట్‌గా శరణ్యకు మంచి పేరుంది. అలా బోయపాటి, మెహర్ రమేశ్ వంటి డైరెక్టర్లకు ఆమె ఫేవరిట్ స్టయిలిస్ట్ అయింది. -
శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)
-
బలగం బ్యూటీ బోల్డ్ లుక్.. మరింత హాట్‌గా పూనమ్ బజ్వా!
బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ బోల్డ్ లుక్..!హాట్‌నెస్‌తో పూనమ్ బజ్వా స్టన్నింగ్ పిక్స్..!ఇయర్ ఎండ్ మూడ్‌లో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి..!సితార వింటర్ వేకేషన్ పిక్స్..కిస్సిక్ సాంగ్ ఫోటోలు షేర్ చేసిన శ్రీలీల..స్మైలీ లుక్స్‌తో అనికా సురేంద్రన్..బాత్ టబ్‌లో కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
'కిస్ కిస్ కిస్ కిస్సిక్'.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను ఊర్రూతలూగించిన సాంగ్ 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా'. పుష్ప చిత్రంలోని ఈ సాంగ్‌లో హీరోయిన్ సమంత తన డ్యాన్స్, గ్లామర్‌తో అదరగొట్టేసింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప-2లోనూ ఇలాంటి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ తీసుకొచ్చారు. కిస్సిక్ పేరుతో వచ్చిన ఐటమ్ సాంగ్ థియేటర్లలో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు.తాజాగా ఈ కిస్సిక్ ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియోను పుష్ప టీమ్ రిలీజ్ చేసింది. ఈ పాటకు హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది. 'దెబ్బలు పడతాయిరో రాజా' అంటూ ఐటమ్ సాంగ్‌తో శ్రీలీల అలరించింది. కాగా.. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. సుభాషిణి ఆలపించారు. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పుష్పరాజ్..ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. రిలీజ్ రోజున మొదలైన వసూళ్లు ఊచకోత ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కలెక్షన్స్ పరంగా ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రెండు వేల కోట్ల మార్కును చేరుకునే ఛాన్స్ ఉంది. -
విజయనగరంలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
-
పండుగ రేసు నుంచి తప్పకున్న నితిన్ 'రాబిన్‌హుడ్'
క్రిస్టమస్ రేసు నుంచి 'రాబిన్ హుడ్' సినిమా తప్పుకుంది. ఈమేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.‘రాబిన్‌హుడ్’ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఆ సంస్థ మరో ప్రకటన చేసింది. రాబిన్ హుడ్ చిత్రాన్ని అనుకున్న తేదీలో విడుదల చేయడం లేదంటూ తెలిపింది. కానీ, కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మైత్రీ మూవీస్ నుంచి తెరకెక్కిన పుష్ప2 ఇంకా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. మరోవైపు మోహన్‌లాల్ బరోజ్ తెలుగు వర్షన్‌ను ఇదే సంస్థ డిసెంబర్ 25న విడుదల చేస్తుంది. ఆపై ఈ క్రిస్టమస్ రేసులో సుమారు 10కి పైగా చిత్రాలు రేసులో ఉన్నాయి. దీంతో థియేటర్స్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని రాబిన్ హుడ్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.రాబిన్ హుడ్‌లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది. -
చుడీదార్లో అనసూయ ఇలా.. చీరలో శ్రీలీల అలా
చీరలో అందాల బొమ్మలా ముద్దుగుమ్మ శ్రీలీలచుడీదార్లో కొంటెచూపులతో కిక్కిస్తున్న అనసూయగౌనులో యాంకర్ శ్రీముఖి క్యూట్ పోజులుహాట్నెస్ పెంచేస్తున్న బబ్లీ బ్యూటీ రాశీఖన్నాబీచ్ ఒడ్డున చిల్ అవుతున్న మెరుపుతీగ మౌనీరాయ్పొట్టి నిక్కర్లో కేక పుట్టించేలా పూనమ్ బజ్వా View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Niti Taylor (@nititaylor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
రూ.150 కోట్ల బడ్జెట్ సినిమా.. ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివ కార్తికేయన్. ఈయన ఇటీవల రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో హీరోగా నటించిన అమరన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సాయి పల్లవి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించారు. ప్రస్తుతం శివకార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటి శ్రీలీల నాయకిగా నటించనున్నారు. ఇదే ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం. పుష్ప సినిమా తర్వాత ఆమెకు భారీగా ఛాన్స్‌లు పెరుగుతున్నాయి. అయితే, ఆమె సెలక్టెడ్ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందకు వెళ్తుంది. ఇందులో ప్రముఖ నటుడు జయం రవి కూడా ప్రధాన పాత్రను పోషించనున్నారు. మరో ముఖ్య పాత్రలో నటుడు అధర్వ పోషించనున్నారు. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఆయనకు 100వ చిత్రం కావడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రానికి రవి కె.చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీని గురించి నిర్మాత అధికారిక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో ఈ ఎస్.కె 25 చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని నిర్మాత ఆకాష్ భాస్కరన్ వ్యక్తం చేశారు. ఇది పీరియడ్ కాల కథాంశంతో రూపొందుతున్న చిత్రం. దీనికి పురనానూరు అనే టైటిల్ ఇంతకుముందే ఖరారు చేశారు అన్నది గమనార్హం. ఈ చిత్రం రూ.150 కోట్ల బడ్జెట్లో రూపొందుతున్నట్లు సమాచారం. మల్టీ స్టార్స్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. -
విశాఖలో సందడి చేసిన సినీ నటి శ్రీలీల (ఫొటోలు)
-
అల్లు అర్జున్ విషయంలో ప్రభాస్, శ్రీలీల రియాక్షన్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మద్ధతుగా చిత్ర పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు ఇప్పటికే స్పందించారు. ఈ క్రమంలో కొందరు బన్నీ ఇంటికే కూడా వెళ్లి ఆయన్ను కలిసి వచ్చారు. తాజాగా ప్రభాస్ తన స్నేహితుడు అల్లు అర్జున్‌తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. కన్నడ హీరో ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. వీరిద్దరూ 'S/O సత్యమూర్తి' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈరోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆయన సినిమా షూటింగ్ పనుల వల్ల హైదరాబాద్‌లో లేరని తెలుస్తోంది. దీంతో బన్నీకి ఫోన్ చేసి తన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ఉదయం నుంచి బన్నీ ఇంటికి చాలామంది సెలబ్రిటీలు క్యూ కట్టారు. ముఖ్యంగా చిరంజీవి సతీమణి సురేఖ, డైరెక్టర్ సుకుమార్ కంటతడి పెట్టడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.అల్లు అర్జున్ తప్పు చేయరు: శ్రీలీలఅల్లు అర్జున్ అరెస్టుపై నటి 'శ్రీలీల' కూడా రియాక్ట్ అయింది. ఆయన్ను అరెస్టు చేయడం బాధాకరమని ఆమె చెప్పారు. ఈ ఘటనతో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆయన ఎప్పుడు తప్పు చేయరు. న్యాయవ్యస్థను ఆయన గౌరవిస్తారు. కాబట్టి అల్లు అర్జున్‌కు మంచి జరిగింది. ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ భారత పౌరుడిగా మన వ్యవస్థలోని రూల్స్‌ను అందరిలాగే పాటించారు.' అని శ్రీలీల పేర్కొంది. -
పుష్ప-2 బ్లాక్ బస్టర్ తో మళ్లీ శ్రీలీల డేట్స్ కు క్రేజ్
-
రాజమండ్రిలో సందడి చేసిన సినీనటి శ్రీలీల (ఫొటోలు)
-
రాజమండ్రిలో సందడి చేసిన సినీ హీరోయిన్ శ్రీలీల
-
'కిస్సిక్' పాటకు బామ్మలు అదిరిపోయే డ్యాన్స్
'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ 'కిస్సిక్'.. బాగానే ఫేమస్ అయింది. రిలీజైనప్పుడు బాగాలేదన్నారు గానీ ఇప్పుడు అందరూ తెగ డ్యాన్సులు చేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఎవరూ తగ్గట్లేదు. మిగతా వాళ్ల సంగతేమో గానీ ఓ అనాథశ్రమంలో బామ్మలు ఈ పాటకు డ్యాన్స్ చేయడం మాత్రం తెగ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కర్ణాటక బెల్గం ఊరిలో శాంతాయ్ వృద్ధాశ్రమం ఉంది. ఇందులో ఉంటే బామ్మలు ట్రెండీ గీతాలకు ఎప్పటికప్పుడు డ్యాన్స్ చేస్తూ బాగానే ఫేమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్లలో ఓ నలుగురు.. 'దెబ్బలు పడతయ్రోయ్' అంటూ 'పుష్ప 2' పాటకు భలే స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు తెలుగు నెటిజన్లకు తెగ నచ్చేస్తోంది. 'కిస్సిక్' పాటలో కనిపించిన శ్రీలీల కూడా వీళ్ల డ్యాన్స్‌కి ఫిదా అయిపోయింది. వీడియోకి లైక్ కొట్టింది.'పుష్ప 2' కలెక్షన్స్ విషయానికొస్తే మూడు రోజుల్లో రూ.621 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి.. భారత బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం హిందీలోనూ రూ.200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. ఆదివారం కూడా భారీగానే టికెట్ సేల్స్ అయ్యింటాయి. టోటల్ వీకెండ్ వసూళ్ల రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్) View this post on Instagram A post shared by Shantai Vruddashram (Old Age Home) (@shantai_second_childhood) -
కాకినాడలో నటి శ్రీలీల సందడి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. ఆదివారం స్థానిక మెయిన్ రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన జేసీ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మూడంతస్తులు తిరిగి వివిధ రకాల చీరలు, ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాకినాడకు రావడం చాలా సంతోషంగా ఉందని, గతంలో కూడా ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. షాపింగ్ మాల్లో రకరకాల ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. సరసమైన ధరలు అందిస్తున్న షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేయాలని అన్నారు. మాల్ అధినేతలు ఎం.వెంకటరెడ్డి, జమున మాట్లాడుతూ జేసీ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా కాంబో ఆఫర్లు ఇస్తున్నామన్నారు. తక్కువ ధరలో నాణ్యమైన వస్త్రాలు అమ్మడమే తమ సక్సెస్‌కు కారణమన్నారు. మహిళలు మెచ్చే ఎన్నో రకాల చీరలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. శ్రీలీలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. -
పుష్ప-2 ఐటమ్ సాంగ్ ఎఫెక్ట్.. శ్రీలీల షాకింగ్ డిసిషన్!
ప్రస్తుతం సినీప్రియులను పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా అలరిస్తోంది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో సినీ ప్రియులను అలరించింది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. కిస్సిక్ అంటూ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం రాబిన్‌హుడ్‌లో నటిస్తోన్న శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో మరింత క్రేజ్ దక్కించుకుంది.అయితే కిస్సిక్ సాంగ్ తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే అవీ హీరోయిన్గా కాదట. ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయట. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ భయంతోనే వరుస ఆఫర్లు శ్రీలీల తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.(ఇది చదవండి: పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)శ్రీలీల షాకింగ్ నిర్ణయం..అయితే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు ఆ తర్వాత కొద్దిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ నితిన్ సరసన రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కావడన్నే పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పింది శ్రీలీల. ఈ సాంగ్ చేయడానికి ప్రత్యేక కారణముందని కూడా వెల్లడించింది.అయితే తనపై ఐటమ్ సాంగ్ హీరోయిన్గా ముద్రపడుతుందేమో అన్న భయం పట్టుకుందన్న వార్త వైరలవుతోంది. అందువల్లే ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయకూడదని శ్రీలీల నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐటమ్ సాంగ్ కోసం చాలామంది నిర్మాతలు శ్రీలీలను సంప్రదించేందుకు యత్నిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఏదేమైనా కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. -
అరకులో ‘మాస్ జాతర’... రవితేజతో భారీ యాక్షన్ సీక్వెన్స్!
అరుకులో మాస్ జాతర చేయనున్నారు హీరో రవితేజ. ఆయన కెరీర్లో రూపొందుతున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్‌లైన్. హిట్ ఫిల్మ్ ‘సామజవరగమన’కు ఓ రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ డిసెంబరు మూడో వారంలో అరకులో ప్రారంభం కానుందని సమాచారం. ముఖ్యంగా అరకు, ఆ తర్వాత పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు లొకేషన్స్‌లో ‘మాస్ జాతర’ చిత్రీకరణ జరగనుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొంటారు. కొంత టాకీ పార్టుతో పాటు, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు మేకర్స్. రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 09న విడుదల కానుంది. -
శివ కార్తికేయన్ తో జోడి కట్టనున్న శ్రీలీల..