రాబిన్‌హుడ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. అది దా డేవిడ్ వార్నర్‌ సర్‌ప్రైజ్‌! | David Warner Dance Pushpa Song At Robinhood Pre Release Event | Sakshi
Sakshi News home page

David Warner: పుష్ప సాంగ్‌ హుక్‌ స్టెప్‌.. వారెవ్వా వార్నర్‌!

Published Sun, Mar 23 2025 9:25 PM | Last Updated on Mon, Mar 24 2025 9:26 AM

David Warner Dance Pushpa Song At Robinhood Pre Release Event

నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'రాబిన్‌హుడ్‌'.'భీష్మ' హిట్‌ ఫిల్మ్‌ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తాజాగా రాబిన్‌హుడ్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథి డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్నర్‌ తన డ్యాన్స్‌తో ఆడియన్స్‌ను అలరించారు. పుష్ప చిత్రంలో చూపే బంగారమాయమే శ్రీవల్లి.. అనే పాటకు అల్లు అర్జున్ స్టైల్లో హుక్‌ స్టెప్‌కు కాలు కదిపారు. అంతేకాకుండా రాబిన్ హుడ్‌ మూవీలో అది దా సర్‌ప్రైజ్‌ అంటూ సాగే కేతిక శర్మ పాటకు సైతం డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement