
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ రాబిన్‌హుడ్.'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రాబిన్‌హుడ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే నితిన్ పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. వెన్నెల కిశోర్, నితిన్ మధ్య వచ్చే సన్నివేశాలతో థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఓ రేంజ్‌లో అదిరిపోయింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment