క్రిస్టమస్ రేసు నుంచి 'రాబిన్ హుడ్' సినిమా తప్పుకుంది. ఈమేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
‘రాబిన్‌హుడ్’ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఆ సంస్థ మరో ప్రకటన చేసింది. రాబిన్ హుడ్ చిత్రాన్ని అనుకున్న తేదీలో విడుదల చేయడం లేదంటూ తెలిపింది. కానీ, కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మైత్రీ మూవీస్ నుంచి తెరకెక్కిన పుష్ప2 ఇంకా థియేటర్‌లో రన్ అవుతూనే ఉంది. మరోవైపు మోహన్‌లాల్ బరోజ్ తెలుగు వర్షన్‌ను ఇదే సంస్థ డిసెంబర్ 25న విడుదల చేస్తుంది. ఆపై ఈ క్రిస్టమస్ రేసులో సుమారు 10కి పైగా చిత్రాలు రేసులో ఉన్నాయి. దీంతో థియేటర్స్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని రాబిన్ హుడ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
రాబిన్ హుడ్‌లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది.
Comments
Please login to add a commentAdd a comment