నితిన్ రాబిన్‌హుడ్‌.. అది దా సర్‌ప్రైజ్ అంటోన్న కేతిక శర్మ | Nithiin Latest Movie Robinhood Third Single Out Now | Sakshi
Sakshi News home page

Robinhood Movie: నితిన్ రాబిన్‌ హుడ్‌.. కేతిక శర్మ ఐటమ్ సాంగ్‌ రిలీజ్

Published Mon, Mar 10 2025 6:08 PM | Last Updated on Mon, Mar 10 2025 6:13 PM

 Nithiin Latest Movie Robinhood Third Single Out Now

నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ రాబిన్‌హుడ్‌.'భీష్మ' వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్‌ పాటను మేకర్స్ విడుదల చేశారు. 'అది దా సర్‌ప్రైజ్' అంటూ సాగే ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ కేతిక శర్మ తన డ్యాన్స్‌తో అలరించింది. ముఖ్యంగా కేతిక శర్మ అందాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ పాట రాబిన్‌ హుడ్‌లో మూవీలో ప్రత్యేకమైన ‍క్రేజ్‌ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. అంతుకుముందే కేతిక శర్మ తెలుగులో రంగరంగ వైభవంగా, లక్ష్య లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్‌ అందించారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement