G.V. Prakash Kumar
-
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రూ. 40 కోట్ల సినిమా
మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్ అయింది. ఈ సినిమాతో తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఆమె రేంజ్ మారిపోయింది. ప్రేమలు సినిమా తర్వాత కోలీవుడ్‌లో ఈ బ్యూటీ నటించిన రెబల్ మార్చి 22న విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్లో 'రెబెల్' అనే సినిమాను తమిళ్లో నిర్మించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‌గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'రెబల్' చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్‌కుమార్ జోడీగా నటించారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా రెబల్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమళ్, తెలుగులో ఈ సినిమా అందుబాటులో ఉంది. రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెబల్ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపించినప్పటికీ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కడంతో ఫర్వాలేదు అనిపించింది. ఈ వీకెండ్లో మంచి టైమ్‌పాస్ కలిగించే సినిమాగా రెబల్ ఉంటుందని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Studio Green (@studiogreen_official) -
చిన్నారి ఆపరేషన్ కోసం సాయం చేసిన ప్రముఖ హీరో
కోలీవుడ్‌లో జివి ప్రకాష్ కుమార్ తమిళ చిత్రసీమలో మల్టీటాలెంటెడ్‌గా గుర్తింపు పొందాడు. ఎ.ఆర్.రహమాన్ మేనళ్లుడిగా ఆయన ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత చిత్రసీమలో తనదైన ముద్ర వేశాడు. చిన్న వయస్సులోనే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, తన 25 ఏళ్లకే 25 చిత్రాలకు మ్యూజిక్ అందించి రికార్డు సాధించాడు. ఆ తర్వాత 'డార్లింగ్' మూవీతో హీరోగా సత్తా చాటి సింగర్, యాక్టర్,నిర్మాతగా కోలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', విక్రమ్ 'తంగళన్' సహా పలు చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. సినిమాలతో పాటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను జివి ప్రకాష్ కుమార్ షేర్ చేస్తాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై గొంతు విప్పి, సహాయం కోరిన వారికి చేతనైనంత సాయం చేస్తుంటాడు. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి తన సోదరి బిడ్డను ఎవరైనా కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఏడాది బిడ్డ ఇబ్బంది పడుతుందని తక్షణమే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో సహాయం కోరుతూ.. ఇలా పోస్ట్ చేశాడు. 'ఆన్లైన్లో ఇలా ఆర్థిక సహాయం అడగడానికి ఇబ్బందిగా ఉందని అయినా ఆ బిడ్డ ప్రాణాల కోసం ఎలాగైనా అడుగుతాను. నా సోదరి అబ్బాయి (1 సంవత్సరం) మెదడు వైపు కణితి ఉందని వైద్యులు చెప్పారు. ఇది కొంచెం భయంగా ఉంది. మధురై అపోలో ఆసుపత్రికి బాబును తీసుకెళ్తే అక్కడ వెంటనే ఆపరేషన్ అవసరం అన్నారు. రూ. 3.5 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారు. మా కుటుంబం నుంచి 2 లక్షల వరకు సిద్ధం చేశాను. మీరు నాకు కొంత సాయం చేసినా.. నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మీకు తోచినంత చేయండి మిత్రులారా.' అని ఆ యువకుడు తెలిపాడు. సినీనటుడు జివి ప్రకాష్ కుమార్ ఆ పోస్ట్‌కు రియాక్ట్ అయ్యాడు. ఆ చిన్నారి ఆపరేషన్ కోసం తన వంతుగా రూ.75 వేలు పంపారు. దీన్ని తన ఎక్స్ సైట్లో పోస్ట్ చేసి ' నా నుంచి ఇది చిరు సాయం' అని పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో జివి ప్రకాష్ చర్యను పలువురు అభినందిస్తున్నారు. దీంతో ఆ చిన్నారి ఆపరేషన్‌కు మరికొందరు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. -
నిర్మాతైన జీవీ తల్లి
యువ సంగీతదర్శకుడు, కథానాయకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ నిర్మాతగానూ మారి మదయానైకూట్టం అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తల్లి, ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ పెద్ద అక్క అయిన రెహైనా నిర్మాతగా అవతారమెత్తారు. ఈమెలో మంచి గాయనీ, సంగీత దర్శకురాలు ఉన్నారు. తొలుత తన సోదరుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతంలో కోరస్లో పాడిన రెహైనా ఆ తరువాత గాయనిగా కొన్ని పాటలు పాడారు.అదే విధంగా నటుడు దుశ్యంత్ హీరోగా నటించన మచ్చి చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా రంగప్రవేశం చేశారు. ఆపై ఆడాద ఆటమెల్లాం, ఎన్నై ఏదో చెయ్దు విట్టాయ్ తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించారు. కాగా తాజాగా నిర్మాతగా మారి యోగి అండ్ ఫ్రెండ్స్ పతాకంపై ఏండా తలైక్కు ఎన్నై తేయ్క్కలై అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆచార్ అనే నవ నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సంచింతాశెట్టి నాయకిగా నటిస్తున్నారు.ఈ చిత్రం ద్వార విఘ్నేశ్ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇది కామెడీతో కూడిన ఫాంటసీ కథా చిత్రం అట. ఈ చిత్రం తరువాత రెహైనా తన కొడుకు జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా ఒక చిత్రం చేయనున్నారట. -
అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు
ఒత్తిడి చేసిన మాట నిజమే అరకొర దుస్తులు ధరించాలంటూ తనపై ఒత్తిడి చేసిన మాట నిజమే నంటూ నటి ఆనంది స్పష్టం చేశారు.ఈ అమ్మడు త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర విడుదల సమయంలో ఆ చిత్ర దర్శకుడిపై విమర్శల వర్షం కురిపించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం తరువాత జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో రెండో సారి ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో రొమాన్స్ చేసిన నటి ఆనంది. ఈ చిత్రం ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆ బ్యూటీ ఏమన్నారో చూద్దాం. నేను అనుకోకుండానే నటినయ్యాను. చదువుకునే రోజుల్లో నటనపై ఎలాంటి ఆసక్తి లేదు. కయల్ చిత్రంలో కథానాయకిగా అవకాశం ఇచ్చి దర్శకుడు ప్రభుసాల్మన్ నాకు గుర్తింపు తెచ్చిపెట్టారు.ఆయనే నాకు నటనను నేర్పించారు. ఆ తరువాత త్రిష ఇల్లన్నా నయనతార, పొరియాళన్, చండీవీరన్ చిత్రాల్లో నటించాను. అదే విధంగా తెలుగులోనూ కొన్ని చిత్రాలు చేశాను. అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు ఇంతకు ముందు చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. కొన్ని చిత్రాల్లో అరకొర దుస్తులు ధరించి అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు. చాలా అసౌకర్యానికి గురయ్యాను. అయితే అలా నటించేదిలేదని, కాదంటే షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించాను. గ్లామరస్ దుస్తులు నా శరీరాకృతికి సరిపడవు. అందువల్ల అలాంటి దుస్తులు ధరించకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని చిత్రాన్ని అంగీకరించే ముందే దర్శక నిర్మాతలకు తెలియజేస్తాను. ఇప్పటీకీ కథ విన్నప్పుడే గ్లామరస్‌గా నటించను, టూపీస్ దుస్తులు ధరించను అని దర్శకుడితో చెప్పేస్తాను. అయితే ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో మంచి పాత్రలో నటించే అవకాశం లభించింది. ఇందులో దాదా కూతురిగా నటించాను. జీవీ.ప్రకాశ్‌కుమార్ నాకు సిఫార్సు చేశారనే ప్రచారం జరుగుతోంది. అందులో ఏమాత్రం నిజం లేదు. షూటింగ్లో యూనిట్ సభ్యులు నన్ను చక్కగా చూసుకున్నారు.చాలా సౌకర్యంగా అనిపించింది. -
ఆనందంలో జీవీ
అతి పిన్నవయసులోనే సంగీత దర్శకుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్న జి.వి.ప్రకాష్‌కుమార్ తాజాగా కథా నాయకుడిగా అవతారమెత్తి తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. ఈయన హీరోగా నటించిన చిత్రం డార్లింగ్. ఈయన సంగీత బాణీలు అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, స్టూడియో గ్రీన్ కె ఇ జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మించారు. నవదర్శకుడు శ్యామ్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిక్కి గర్లాణి నాయికిగా నటించారు. తెలుగు చిత్రం ప్రేమకథా చిత్రానికి రీమేక్ అయిన డార్లింగ్ అనూహ్యంగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఐ, పూర్తి కమర్షియల్ కథా చిత్రం ఆంబళ చిత్రాలకు పోటీలో సంక్రాంతి బరిలోకి దూకింది. అంతగా భారీ అంచనాలు నెలకొన్న భారీ చిత్రాల మధ్య తొలి చిత్ర హీరో జి.వి.ప్రకాష్‌కుమార్ చిత్రం విడుదలవుతోందనగానే కొందరు వారికేమైనా పిచ్చా అనుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఐ, ఆంబళ చిత్రాల మధ్య నలిగిపోకుండా డార్లింగ్ బాగుందనే టాక్‌తో ప్రజాదరణ పొందుతోంది. లవ్ హారర్, థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందిన డార్లింగ్ హిట్ టాక్ తెచ్చుకుంది. జి.వి.ప్రకాష్ నటుడిగా పాస్ అయ్యారు. చాలా మెచ్యూరిటీతో నటించారు. హారర్ కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు శ్యామ్ కొత్తవాడైనా చక్కని కథనంతో ఆసక్తిగా చిత్రాన్ని తెరకెక్కించారనే ప్రశంసలు అందుకుంటున్నారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు జి.వి.ప్రకాష్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి పెన్సిల్‌తో త్వరలోనే అలరించడానికి రెడీ అవుతున్నారు. -
అర్థం చేసుకునే అర్ధాంగి
అభిమతాలు, మన స్తత్వాలు వేరైనా అర్థం చేసుకునే అర్ధాంగి దొరికిందంటున్నారు యువ సంగీత తరంగం జి.వి.ప్రకాష్‌కుమార్. వెయిల్ చిత్రంతో దూసుకొచ్చిన ఈ యువ సంగీత దర్శకుడు అనతి కాలంలోనే అత్యధిక చిత్రాలు చేసి విజయాల బాటలో పయనిస్తున్నారు. ఈ యువ కెరటానికి గత ఏడాది చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈయన నిర్మాత అయ్యింది, హీరోగా తెరంగేట్రం చేసింది, ప్రేయసి సైంధవిని జీవిత భాగస్వామిగా చేసుకున్నది 2013లోనే. ఈ యువ సంగీత బాణి జి.వి.ప్రకాష్‌కుమార్‌తో ఇంటర్వ్యూ. సంగీత దర్శకుడి నుంచి నిర్మాతగా, నటుడిగా మారడానికి కారణం? దర్శకుడు విక్రమ్ సుకుమార్ నాకు మంచి మిత్రుడు. ఆయన చెప్పిన కథ, బడ్జెట్ నాకు నచ్చాయి. అందువల్లనే నిర్మాతగా మారి మదయానైకూటం చిత్రాన్ని చేశాను. ఊహించినట్లుగానే ఆ చిత్రం మంచి విజయాన్ని అందించింది. నటుడవడానికి కారణం దర్శకుడు మురుగదాస్. ఆయనే ముందుగా నన్ను నటించమని అడిగారు. ఎందుకనో ఆయన చిత్రంలో నటించలేకపోయూను. ఇది నన్ను నిరాశ పరచింది. అయితే ఈ విషయం బయటకి పొక్కడంతో పలువురు దర్శకులు నన్ను సంప్రదించడం ప్రారంభించారు. అలాంటి వారిలో దర్శకుడు మణి నాగరాజ్ ఒకరు. ఆయన పెన్సిల్ స్క్రిప్టుతో వచ్చారు. స్క్రిప్ట్ చదివాను నచ్చింది. అయినా కొంచెం సంశయం లేకపోలేదు. దాన్ని దర్శకుడు మణి నాగరాజ్ తొలగించి ప్రోత్సహించారు. అలా కథా నాయకుడిగా తెరంగేట్రం చేశాను. నటన కొనసాగిస్తారా? నటన విషయంలో నా భార్య చాలా షరతు లు విధించారు. అందువలన నటుడిగా పరిమి త చిత్రాలనే చేయాలని నిర్ణయించుకున్నాను. సంగీత దర్శకుడిగా, నిర్మాతగా నా పయనం కొనసాగుతుంది. మంచి కథా బలం ఉన్న నిర్మాతగా, ప్రేక్షకులకు ఆనందాన్ని అందించే చిత్రాలను నిర్మిస్తాను. ప్రతిభావంతులైన దర్శకులకు అవకాశాలు ఇస్తాను. మీకు సమయం సరిపోతోందా? నా వెనుక శక్తివంతమైన టీమ్ ఉంది. సంగీతం చిత్ర నిర్మాణానికి కార్యదక్షత గల నా మిత్ర బృందం నాతో వుంది. కాబట్టి చిత్ర నిర్మాణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాను. ఇష్టమైన సంగీత దర్శకుడు? చాలా పాటలు వింటుంటాను. ముఖ్యంగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ సంగీతం నచ్చుతుంది. మీ భార్యతో కలసి పాడిన పాటలున్నాయూ? నేను సంగీతాన్ని అందించిన తొలి 12 చిత్రాల్లో నా భార్య, నేను కలసి పాడలేదు. ఆ తరువాత దర్శకుడు విజయ్ అడగడంతో మదరాసు పట్టణం చిత్రంలో మేము తొలిసారిగా కలసి పాడాం. ఆపై మేము పాడిన పాటలన్నీ హిట్టే. ఇందుకు స్పెషల్ కేర్ అంటూ ఏమీ లేదు. మా పాటలు అంతగా సక్సెస్ అవడానికి మా పని మేము సక్రమంగా చేయడమే కారణం. మీ ప్రియమైన అర్ధాంగి గురించి? నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య సైంధవి గురించి చెప్పాలంటే నా జీవితంలో లభించిన అదృష్టం ఆమె. చాలా సహనశీలి. మావి భిన్న మనస్తత్వాలైనా ఒకరి కోసం ఒకరు సర్దుకుపోతుంటాం. అలా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మీకు బాగా నచ్చిన హీరోలు? కమలహాసన్, విక్రమ్ 2014లో మీ నూతన ప్రణాళికలు? కొత్తగా ప్రణాళికలంటూ ఏమీ లేవు. నేను కథా నాయకుడిగా పరిచయం అయిన పెన్సిల్ సక్సెస్ ఫుల్ చిత్రంగా అమరాలి. ఆ తరువాత చిత్ర నిర్మాణం, నటన అంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నూతన దర్శకులను పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాను.