అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు | Sexy star has been under pressure | Sakshi
Sakshi News home page

అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు

Published Mon, Jun 13 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు

అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు

ఒత్తిడి చేసిన మాట   నిజమే

అరకొర దుస్తులు ధరించాలంటూ తనపై ఒత్తిడి చేసిన మాట నిజమే నంటూ నటి ఆనంది స్పష్టం చేశారు.ఈ అమ్మడు త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర విడుదల సమయంలో ఆ చిత్ర దర్శకుడిపై విమర్శల వర్షం కురిపించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం తరువాత జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో రెండో సారి ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో రొమాన్స్ చేసిన నటి ఆనంది. ఈ చిత్రం ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతోంది.


ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆ బ్యూటీ ఏమన్నారో చూద్దాం. నేను అనుకోకుండానే నటినయ్యాను. చదువుకునే రోజుల్లో నటనపై ఎలాంటి ఆసక్తి లేదు. కయల్ చిత్రంలో కథానాయకిగా అవకాశం ఇచ్చి దర్శకుడు ప్రభుసాల్మన్ నాకు గుర్తింపు తెచ్చిపెట్టారు.ఆయనే నాకు నటనను నేర్పించారు. ఆ తరువాత త్రిష ఇల్లన్నా నయనతార, పొరియాళన్, చండీవీరన్ చిత్రాల్లో నటించాను. అదే విధంగా తెలుగులోనూ కొన్ని చిత్రాలు చేశాను.

 
అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు

ఇంతకు ముందు చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. కొన్ని చిత్రాల్లో అరకొర దుస్తులు ధరించి అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు. చాలా అసౌకర్యానికి గురయ్యాను. అయితే అలా నటించేదిలేదని, కాదంటే షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించాను. గ్లామరస్ దుస్తులు నా శరీరాకృతికి సరిపడవు. అందువల్ల అలాంటి దుస్తులు ధరించకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని చిత్రాన్ని అంగీకరించే ముందే దర్శక నిర్మాతలకు తెలియజేస్తాను. ఇప్పటీకీ కథ విన్నప్పుడే గ్లామరస్‌గా నటించను, టూపీస్ దుస్తులు ధరించను అని దర్శకుడితో చెప్పేస్తాను. అయితే ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో మంచి పాత్రలో నటించే అవకాశం లభించింది. ఇందులో దాదా కూతురిగా నటించాను. జీవీ.ప్రకాశ్‌కుమార్ నాకు సిఫార్సు చేశారనే ప్రచారం జరుగుతోంది. అందులో ఏమాత్రం నిజం లేదు. షూటింగ్‌లో యూనిట్ సభ్యులు నన్ను చక్కగా చూసుకున్నారు.చాలా సౌకర్యంగా అనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement