Romance
-
జాక్ ట్రైలర్ బీభత్సం..
-
5 మంది భామలతో రాకీ భాయ్ రొమాన్స్..
-
బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..
-
ఇక సినిమాల్లో చేయడానికి ఏమీ లేదు: హాలీవుడ్ దర్శకుడు
హాలీవుడ్ సినీ చరిత్రలో దర్శకుడు-నటుడు ఉడీ అలెన్‌ది ప్రముఖ స్థానం. ముఖ్యంగా రొమాంటిక్ జానర్లో ఆయన తెరకెక్కించిన ‘అన్నీహాల్, మాన్ హాట్టన్, మిడ్నైట్ ఇన్ ప్యారిస్, టు రోమ్ విత్ లవ్, ఏ రెయినీ డే ఇన్ న్యూయార్క్’ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పలు రొమాంటిక్ చిత్రాలు తెరకెక్కించిన ఉడీ అలెన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘రొమాన్స్ ఆఫ్ ఫిల్మ్‌మేకింగ్ ఈజ్ గాన్’ అన్నారు. ఇక సినిమాల పరంగా చేయడానికి ఏమీ లేదన్నట్లుగా మాట్లాడారు 88 ఏళ్ల ఉడీ. ఆయన తెరకెక్కించిన ‘కూప్ ది చాన్స్’ గత ఏడాది ఫ్రాన్స్‌లో విడుదలైంది. దర్శకుడిగా ఉడీకి ఇది 50వ చిత్రం. ఇదే చివరి చిత్రం అన్నట్లుగా పేర్కొన్నారు. ఈ చిత్రం రిలీజ్ నార్త్ అమెరికాలో లేట్ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఉడీ అలెన్ మాట్లాడుతూ..‘నేనొక సినిమా చేశాక దాని గురించి పట్టించుకోను. డిస్ట్రిబ్యూషన్ అనేది నా పని కాదు. ఇప్పుడు పంపిణీ అంటే ఏ మూవీ అయినా రెండు వారాలే. ఒకప్పుడు నా ‘అన్నీహాల్’ సినిమా న్యూయార్క్ థియేటర్లో ఏడాది ఆడింది. ఒక థియేటర్లో 6,7 నెలలు ఆడాక వేరేవాళ్లు తీసుకునేవారు. అక్కడ కొన్ని నెలలాడేది. కానీ ఇప్పుడు సినిమా వ్యాపారం మారిపోయింది.ఈ మార్పు ఆకర్షనీయంగా లేదు’ అన్నారు. -
Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్‌ఫ్రెండ్.. ఏం చేశారంటే?
Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేస్తుండగా తన తల్లిదండ్రులు ఒక్కసారిగా రావడంతో బిత్తరపోయిన ఓ యువతి ప్రియుడిని బాల్కనీ నుండి పారిపొమ్మని సలహా ఇచ్చింది. దాంతో గాల్లో తాడు పట్టుకుని వేలాడుతూ కిందకు దిగుతున్న ఆ ప్రియుడిని పట్టుకుని ఆమె తల్లి చీపురు తిరగేసి చితక్కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతొంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్చల్ చేస్తోంది. దొంగచాటుగా తన గర్ల్‌ఫ్రెండ్ గదిలోకి దూరిన ఓ యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తన గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తనని కాపాడేందుకు ప్రయత్నించి అతడి బట్టలను బాల్కనీ నుండి కిందకు విసిరేసింది. ఎలాగోలా తాడుని పట్టుకుని కిందకు జారుతున్న అతడిని కింది అంతస్తులో గర్ల్‌ఫ్రెండ్ తల్లి ఒక చీపురు పట్టుకుని చితక్కొట్టేసింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అప్లోడ్ చేసిన గంటల్లోనే మిలియన్ల వీక్షణలు వచ్చాయి. వీడియో చూస్తే ఎవ్వరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పాపం ప్రియుడు ఏ మాత్రం పట్టు తప్పినా అతడు కింద పడే లోపే ప్రాణాలు గాల్లోకి పోవడం ఖాయం. Every pleasure in life has a price pic.twitter.com/rtHwfFNjtr — Enezator (@Enezator) August 10, 2023 ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి -
Viral Video: వర్షంలో ఆదమరచి డాన్స్ చేసిన ప్రేమజంట
భోపాల్: రద్దీ రహదారిపై ఎవరి పనులు వారు చేసుకుంటుంటే ఒక లవ్ కపుల్ మాత్రం హాయిగా జోరువానలో తడుస్తూ రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై కామెంట్ల వెల్లువ వెల్లువెత్తింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. దైనందిన జీవితంలో దినవారి పనులు చేసుకునేవారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగులకి, విద్యార్ధులకి ఇలా కొన్ని వర్గాల వారికి వర్షాలు పెద్ద అడ్డంకనే చెప్పాలి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడే అనిపిస్తుంది ప్రేమికులకు మాత్రమే వర్షాకాలం అనుకూలమని కవులు ఎందుకు చెప్పారోనని. భోపాల్‌లో హోరున వర్షం పడుతుండగా ప్రధాన రహదారి మీద ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డు మీద దూసుకుపోతుంటే ఓ ప్రేమ జంట మాత్రం పరిసరాలను అసలేమాత్రం పట్టించుకోకుండా తన్మయత్వంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని హాయిగా డాన్స్ చేస్తూ కనిపించారు. పరిసరాలు కూడా వీరి రొమాన్స్ ని పట్టించుకోకపోవడం విశేషం. వీరు డాన్స్ చేస్తుంటే వెనుక విక్కీ కౌశల్, సారా ఆలీ ఖాన్ కలిసి నటించిన "జరా హట్కే జరా బచ్కే" చిత్రంలోని తూ హై తో ముఝే పాట వినిపిస్తోంది. ఈ సన్నివేశాన్నివీడియో తీసి సొషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్లో దీనిపై కామెంట్ల రూపంలో విశేష స్పందన లభిస్తోంది. A beautiful couple enjoying this #mansoon in #Bhopal.#IamPureVegetarian #Karba #BusAccident #Beast #ModiAgainin2024 pic.twitter.com/GveBVp815C — Aisha Bhat (@aishabhat02) July 29, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
ఆ సీన్లు లేకుండా చేస్తారా.. నాకు మీరే న్యాయం చేయండి: విజయ్ ఆంటోని
కోలివుడ్లో 'నాన్' అనే సీరియస్ కథా చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. ఆ తరువాత పలు సక్సెస్‌పుల్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన పిచ్చైక్కారన్– 2 తెలుగులో (బిచ్చగాడు-2) చిత్రంతో దర్శకుడిగానూ పరిచయం అయ్యి విజయం సాధించారు. తాజాగా విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన చిత్రం కొలై (హత్య). నటి రిత్వికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాలాజీ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: ఎవరూ నమ్మలేరు మన హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే) ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విజయ్ ఆంటోని మాట్లాడుతూ కథ చెప్పినప్పుడు ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని దర్శకుడు చెప్పారన్నారు. ఆ తరువాత ఇద్దరని అన్నారనీ, వారిలో నటి మీనాక్షీ వేరే నటుడికి పెయిర్ కాగా, నటి రిత్వికా సింగ్ తనకు సోదరిగా నటించినట్లు చెప్పారు. ఇందులో తనకు ఒకే ఒక్క భార్య ఉన్నారనీ, ఆమె కూడా కళ్ల ముందే కాలిపోతుందని చెప్పారు. అలా ఈ చిత్రంలో తనకు రొమాన్స్ లేకుండా చేశారని, ఇందుకు తనకు న్యాయం కావాలి అని సరదాగా అన్నారు. అయితే దర్శకుడు బాలాజీ కే.కుమార్ ఏడు ఏళ్ల తరువాత దర్శకత్వం వహంచిన చిత్రం ఇది అనీ, చాలా బాగా వచ్చిందని పేర్కొన్నారు. కాగా మళ్లీ సంగీత దర్శకుడిగా ఎప్పుడు పని చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ, ప్రస్తుతానికి కొంచెం గ్యాప్ ఇచ్చానని, తన కేరీర్ ముగిసేలోగా కనీసం 20 మంది కొత్త సంగీత దర్శకులను పరిచయం చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. అందుకే సంగీతదర్శకుడిగా కొంత కాలం తప్పుకుంటున్నట్లు చెప్పారు. -
బైక్‌పై లవర్స్ రొమాన్స్.. రహదారిపై అందరూ చూస్తుండగానే..!
ఢిల్లీ: ఈ మధ్య యువత రెచ్చిపోతున్నారు. పబ్లిసిటీ కోసం పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్‌గా ఫీల్ అయిపోయి అసభ్యకర చేష్టలతో వార్తల్లో కెక్కుతున్నారు. తాజాగా దేశ రాజధాని ప్రధాన రహదారిపై ఓ యువతీ యువకులు బైక్‌పై అభ్యంతకరంగా ప్రయాణించారు. Idiot's of Delhi Time - 7:15pm Day - Sunday 16-July Outer Ring Road flyover, Near Mangolpuri@dtptraffic pic.twitter.com/d0t6GKuZS5 — 𝖀𝖗𝖇𝖆𝖓 𝖀𝖙𝖘𝖆𝖛 🗨️🦂 (@Buntea) July 16, 2023 ఢిల్లీలోని అవుటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ మంగోల్పురీ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్పీడ్‌గా వెళ్తోన్న బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై యువకుడికి ఎదురుగా కూర్చున్న యువతి అతన్ని గట్టిగా కౌగిలించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. యువకునితో పాటు యువతి కూడా హెల్మెట్ పెట్టుకుని ఉంది. ఈ అంశంపై నెటిజన్లు ఫైరవుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని ఈ దృశ్యాలను వీడియో తీశారు. అనంతరం ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి: దారుణం.. తాజ్‌మహల్ చూసేందుకు వచ్చిన టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి -
Video: బైక్‌పై లవర్స్ రొమాన్స్.. రహదారిపై హగ్‌లతో రెచ్చిపోయిన జంట
ఈ మధ్య యువత రెచ్చిపోతున్నారు. పబ్లిసిటీ కోసం పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్‌గా ఫీల్ అయిపోయి అసభ్యకర చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తనతో వైరల్‌గా మారి పోలీసులకు దొరికినా కొంతమందిలో మార్పు రావడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఘాజియాబాదద్లో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై బైక్ మీద విచ్చలవిడి చేష్టలతో కనిపించారు. ఇందిరాపురం సమీపంలోని రద్దీగా ఉండే ఎన్‌హెచ్9 రహదారిపై ప్రమాకరంగా లవర్స్ రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. స్పీడ్‌గా వెళ్తోన్న బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై యువకుడికి ఎదురుగా కూర్చున్న యువతి అతన్ని గట్టిగా కౌగిలించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే ఇద్దరూ కనీసం హెల్మెట్ కూడా ధరించలేదు. చదవండి: బావా మరదలు సరదా ఆట! అసలు విషయం తెలియడంతో పెళ్లి క్యాన్సిల్ ఈ ఘటన జూన్ 20 మంగళవారం సాయంత్రం చోటు చేసుకోగా.. దీనిని అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని వీడియో తీశారు. అనంతరం ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పాపులారిటీ కోసం వాహనాలపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారని, బాధ్యత రహితంగా ప్రవర్తించిన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి, పోలీసులను కోరారు. మరోవైపు ఈ ఘటనపై ఘజియాబాద్ కమిషనరేట్ డీసీపీ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను పరిశీలించి.. సదరు జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందిరాపురం ఎస్సైని ఆదేశించారు. #गाजियाबाद में आशिक मिजाज बाइक सवार की वीडियो हुई वायरल इंदिरापुरम के NH 9 का बताया जा रहा है । वो कहते है ना - "हम तो मरेंगे सनम तुम्हे साथ लेके मरेंगे " पर नियम कानून ताक पर रख के ही सफर करेंगे ।@Gzbtrafficpol @uptrafficpolice @sacchayugnews pic.twitter.com/xPmSgzbfmO — Akash Kumar (@Akashkchoudhary) June 20, 2023 ट्विटर से प्राप्त शिकायत का संज्ञान लेते हुए, चालानी कार्यवाही की गई। pic.twitter.com/7HGAhqfkPF — Gzb Traffic police (@Gzbtrafficpol) June 21, 2023 -
రొమాన్స్‌కు వయసుతో పనేంటి?.. ట్రోల్స్‌పై హీరో స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ జంటగా నటించిన చిత్రం టిక్కు వెడ్స్ షేరు. ఈ చిత్రానికి సాయి కబీర్ దర్శకత్వం వహించగా.. కంగనా రనౌత్ నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ట్రైలర్లో హీరోయిన్ను నవాజుద్దీన్ కిస్ చేయడంపై విమర్శలొచ్చాయి. 50 ఏళ్ల నటుడితో 21 ఏళ్ల అమ్మాయికి రొమాంటిక్ సీన్స్ ఏంటని కొందరు ట్రోల్స్ చేశారు. తాజాగా ఆ సీన్‌పై వస్తున్న విమర్శలకు నవాజుద్దీన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవాజుద్దీన్ విమర్శలపై స్పందించారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి! ) నవాజుద్దీన్ మాట్లాడుతూ..'హీరో, హీరోయిన్లకి ఏజ్ గ్యాప్ అనేది పెద్ద సమస్య కాదు. రొమాన్స్‌కు వయసుతో సంబంధం లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్ రోల్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలు పనికిరాని వారు కాబట్టే. వారికేదో రొమాన్సే తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లవ్, బ్రేకప్ అన్నీ వాట్సాప్‌లోనే జరుగుతున్నాయి. దీని వెనుక ఓ కారణం ఉంది. జీవితంలో రొమాన్స్ ఎవరైతే చేస్తారో.. వాళ్లు మాత్రమే ఇలాంటి సీన్స్ చేయగలరు.' అని కాస్తా గట్టిగానే కౌంటరిచ్చారు. కాగా.. టికు వెడ్స్ షేరు మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23న విడుదల కానుంది. నవాజుద్దీన్ ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సైంధవ్‌లో విలన్‌గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వికాస్ మాలిక్‌గా కనిపించనున్నారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్ సంచలన నిర్ణయం.!) -
Rajinikanth: జైలర్‌కు షాక్ ఇచ్చిన తమన్నా
ఇప్పుడు కోలీవుడ్‌లో నటి తమన్నా గురించే చర్చ నడుస్తోంది. ఈ మిల్కీ బ్యూటీ తమన్నాకు ఏమైంది అంటూ పలువురు ఆమెను కార్నర్ చేస్తున్నారు. తమన్న గ్లామరస్ పాత్రలతోనే నటనను ప్రారంభించారు. ఇంతకుముందు గ్లామరస్ పాత్రలో నటించడానికి కొన్ని హద్దులు పెట్టుకున్న ఆమె ఇప్పుడు ఆ ఎల్లలను దాటేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు కారణం జీ కర్దా అనే వెబ్ సిరీస్‌లో ఆమె శృతిమించిన అర్ధనగ్న దుస్తులతో కూడిన నటనే. ఈ వెబ్ సిరీస్‌లో పలు ద్వంద్వ అర్థాలు, అశ్లీల సన్నివేశాలతో పాటు, తమన్నా బెడ్ రూమ్ శృంగార సన్నివేశాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. (ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రామ్ చరణ్- ఉపాసన దంపతులు) ప్రస్తుతం ఆమె తమిళంలో రజనీకాంత్ సరసన జైలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన తెరపైకి రానుంది. దీంతో జీ కర్దా వెబ్ సిరీస్‌లో ఆమె శృతిమించిన అందాల ఆరబోతకు తెరలేపింది. ఆపై విజయ్ వర్మతో ప్రేమ వ్యవహారం తెలిసిందే. లస్ట్ స్టోరీస్- 2లో కూడా మితిమీరిన రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. దీంతో జైలర్ చిత్ర యూనిట్ షాక్‌కు గురవుతోందని సమాచారం. ఆ ఎఫెక్ట్ తమ చిత్రంపై పడుతుందనే ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే నటీమణులు డబ్బు కోసం ఎలాగైనా నటించడానికి సిద్ధం అవుతున్నారని, గతంలో కూడా కొందరు హద్దులు మీరి అందాల ఆరబోతను చూశామని, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తున్న నటి తమన్న ఇలాంటి వెబ్ సిరీస్‌ల్లో నటించడం సబబు కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇలాంటి విమర్శలపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి. (ఇదీ చదవండి: నాకు ఫ్యామిలీ ఉంది.. అనవసర విషయాల్లోకి లాగొద్దు: అనసూయ) -
రోమ్ వీధుల్లో రొమాన్స్.. పబ్లిక్‌లో స్టార్ కపుల్ లిప్ లాక్!
ప్రియాంక చోప్రా బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె హాలీవుడ్లో బిజీగా ఉన్నారు. రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. తాజాగా లండన్‌లో నిర్వహించిన సిటాడెల్ ప్రీమియర్‌లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారు. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించారు. ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం తన భర్త, హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి రోమ్ వేకేషన్ వెళ్లింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందులో రోమ్ వీధుల్లో నడుస్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. ఆ వీడియోలో ప్రియాంక, నిక్ జోనాస్ లిప్ కిస్ చేస్తూ కనిపించారు. అక్కడే ఇద్దరూ కలిసి ఐస్‌క్రీం తింటూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018 డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చారు. వీరి కూతురికి మాల్టీ మేరీ అని పేటు పెట్టారు. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) -
హవ్వా! రోడ్డు మీద ఇదేం పని.. హద్దులు మీరిన ప్రేమ జంట
సమాజంలో నివసిస్తున్నప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ ప్రజలు జీవితం సాగించాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఇవేమి తమకు పట్టవంటూ విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ నలుగురిలో నవ్వులు పాలవతుంటారు. తాజాగా ఓ ప్రేమికులు బైక్‌పై ప్రయాణిస్తూ రోడ్డు మీద హద్దులు మీరి ప్రవర్తించిన వింత ఘటన రాజస్థాన్‌లో జైపూర్‌లో చోటచేసుకుంది. ఆ వీడియోలో.. హోలీ జరుపుకున్న అనంతరం ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొన్న లవర్.. ప్రేమికుడిని హగ్ చేసుకోని కూర్చుని రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంది. దీనంతటిని వెనుక కారులో ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేస్తున్నాడు. ఇదంతా తెలిసినా ఆ జంట ఏ మాత్రం భయపడకుండా వారి పనిలో వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. వాహనదారుడి నిర్లక్ష్యం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు మార్చి 7న మోటారు వాహనాల చట్టం 1988, రాజస్థాన్ మోటారు వాహనాల చట్టం 1990 ప్రకారం మోటారుబైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ జంటకు రూ. 5,000 జరిమానా కూడా విధించారు పోలీసులు. -
భర్త ముందే శృంగారపు సన్నివేశంలో నటించా : హీరోయిన్
భారతీయ సినిమాల్లో శృంగారపు సన్నివేశాలకు హద్దు ఉంటుంది కానీ హాలీవుడ్లో అలా కాదు. తెరపై రొమాంటిక్ సీన్స్ చూపించాలని డిసైడ్ అయితే.. వాళ్లకంటే బోల్డ్‌గా మరెవరూ చూపించరు. అయితే ఆ సీన్స్ చేసేటప్పుడు హీరో హీరోయిన్లు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ‘టైటానిక్’ హీరోయిన్ కేట్ విన్స్లేట్ కూడా అలాంటి సన్నివేశాలు చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారట. భర్త ముందే బోల్డ్ సీన్స్‌లో నటించడం..ఇబ్బందిగా, విచిత్రంగా అనిపించిందట. ‘టైటానిక్’ సినిమా తర్వాత లియోనార్డో డికాప్రియో, కేట్ కలిసి ‘రెవల్యూషనరీ రోడ్’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాకి కేట్ మాజీ భర్త సామ్ మెండిస్ దర్శకత్వం వహించారు. అందులో ఉన్న రొమాంటిక్ సీన్స్..అప్పట్లో సంచలనం సృష్టించాయి. భర్త డైరెక్షన్లో లియోనార్డో డికాప్రియోతో కలిసి కేట్ రొమాన్స్ చేసింది. తాజాగా కేట్ ఆ విషయం గురించి మాట్లాడుతూ.. ‘రివల్యూషనరీ రోడ్ మూవీ టైంలో రెండోసారి డికాప్రియోతో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. ఆ సినిమాకి డైరెక్టర్ నా భర్తే కాబట్టి.. డికాప్రియోతో శృంగారపు సన్నివేశాలలో నటించేటప్పుడు ఓవైపు ఇబ్బందిగా, మరోవైపు విచిత్రంగా ఫీలయ్యాను’ అని కేట్ తెలిపింది. ఆ సినిమాకి కేట్ బెస్ట్ యాక్ట్రెస్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. -
Video: రోడ్డుమీద రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పై రొమాన్స్..
ఈ మధ్య కొంతమంది ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్ అన్నట్లుగా అసభ్యకర చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల కాలంలోఇలాంటి ఘటనలు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్ వంటి చోట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. అజ్మీర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమ జంట బైక్ మీద విచ్చలవిడి చేష్టలతో కనిపించారు. రీజనల్ కాలేజ్ క్రాస్ రోడ్స్ – నౌసర్ వ్యాలీ రహదారిపై స్పీడ్‌గా వెళ్తున్న బైక్ మీద ఇద్దరు ప్రేమికులు రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా.. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని వీడియో తీశారు. ఇందులో ఓ యువకుడు ఫ్యూయల్ ట్యాంక్‌పై అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అంతా చూస్తుండగానే యువతి యువకుడిని కౌగిలించుకుకోవడం, ముద్దు పెట్టడం కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సదరు జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ పోలీసులను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన అజ్మీర్ పోలీసులు.. వీడియో ఆధారంగా బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రైడర్ ఫై సాగర్ రోడ్‌కు చెందిన సాహిల్‌గా గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు పేర్కొన్నారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట.. బేబీ ఫొటో వైరల్.. -
విశాఖలో రెచ్చిపోయిన ప్రేమ జంట
-
మ్యాచ్‌కు ముందు శృంగారంలో పాల్గొంటే మెరుగైన ప్రదర్శన!
''మ్యాచ్ కి ముందు క్రికెటర్లు శృంగారం చేస్తే మైదానంలో మెరుగైన ప్రదర్శన చేస్తారు''.. ఈ వ్యాఖ్యలు గుర్తున్నాయా. సరిగ్గా పదేళ్ల క్రితం టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ ఆడుతున్న సమయంలో అప్పటి మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు మరోసారి ప్యాడీ ఆప్టన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు శృంగారంలో పాల్గొంటే మైదానంలో మెరుగైన ప్రదర్శన ఇస్తారని ఒక భారతీయ డాక్టర్ ఇచ్చిన సలహా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ప్రముఖ ఇండియన్ సెక్సాలజిస్ట్ డాక్టర్ ప్రకాశ్ కొటారీ ఒక న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు సమాచారం. ఏ అథ్లెట్ అయినా తన మ్యాచ్‌కు ముందు శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితం వస్తుందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. సైంటిఫిక్‌గానూ ఇది ప్రూవ్ అయింది. నా స్నేహితుడు.. వరల్డ్ ఫేమస్ యూఎస్ సెక్సాలజిస్ట్ వార్డెల్ పోమొరాయ్ కూడా చాలా ఇంటర్య్వూల్లో ఇదే చెప్పాడు. కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు రోజు తమ జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నారని.. తెల్లావారితే జరిగిన మ్యాచ్‌ల్లో గోల్డ్ మెడల్స్ కైవసం చేసకున్నట్లు పేర్కొన్నాడు. శృంగారం అనేది ఒక పవర్ బూస్టర్ అని.. ఆటగాళ్లు ట్రై చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి ఆటపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని ప్రకాశ్ కొటారీ తెలిపాడు. ఇదే విషయమై మరో ఇండియన్ సెక్సాలజిస్ట్ డాక్టర్ సంజయ్ దేశ్‌పాండే మాత్రం మ్యాచ్‌కు ముందు శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితం ఉంటుందని క్షేత్రస్థాయిలో ఎలాంటి అధ్యయనం జరగలేదన్నారు. లైంగిక సంపర్కం తర్వాత క్రీడలలో ఆటగాళ్లు చూపించయిన పనితీరుపై ఎక్కడా ఎటువంటి పరిశోధనలు జరగలేదు అని తెలిపారు. పదేళ్ల క్రితమే ప్యాడీ ఆప్టన్ 2011లో ధోనీ నేతృత్వంలో భారత్ వరల్డ్ కప్ గెలుచుకున్న సమయంలోనే ఈ విషయాన్ని పేర్కొన్నాడు. మ్యాచ్ లో భయం పోవాలంటే ఇలా చేయొచ్చని ఆనాటి కోచ్ గ్యారీ కిర్ స్టెన్ కు చెప్పగా ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. ఈ విషయాన్ని ప్యాడీ తన ఆత్మకథ ‘ది బేర్ ఫూట్ కోచ్’ అనే పుస్తకంలో రాసుకొచ్చాడు. 2009 చాంపియన్స్ ట్రోఫీకి ముందు రెడీ చేసిన నోట్స్ లోనూ శృంగారం వల్ల లాభాల గురించి సవివరంగా రాసుకొచ్చినట్టు తెలిపాడు. కోచ్ గా ఉన్న సమయంలో తాను ఏమేం సలహాలిచ్చాడో అన్నింటినీ పుస్తకంలో వెల్లడించాడు. 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్, ధోనీ సహా.. టీమిండియా సమిష్టికృషితో ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియా ప్యాడీ ఆప్టన్‌ను ఈ ఏడాది వెస్టిండీస్ పర్యటనకు ముందు మరోసారి మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా తీసుకొచ్చింది. చదవండి: ఔట్ కాదనుకుంటా.. పాల్ స్టిర్లింగ్ మోసపోయాడు -
నాగ చైతన్యకు జోడిగా రష్మిక మందన్నా?
Naga Chaitanya To Romance Rashmika Mandanna: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావోస్తుంది. 2009లో 'జోష్' చిత్రంతో అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిచయమైన చైతూ ఇటీవల థ్యాంక్యూ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే హిందీలో డెబ్యూ ఇస్తూ తన మార్కెట్ పెంచుకునే దిశగా వెళ్తున్నాడు చైతూ. నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో చైతూ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్యకు సంబంధించిన ఒక కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాట. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టిన దర్శకనిర్మాతలు నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, రష్మికకు డైరెక్టర్ పరశురామ్ కథ వినిపించారా? లేదా? అన్నది స్పష్టత లేదు. ఒకవేళ ఇది ఓకే అయితే నాగ చైతన్య, రష్మిక మందన్నా తొలిసారిగా జోడి కట్టిన చిత్రం ఇదే అవుతుంది. కాగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం'లో రష్మిక హీరోయిన్గా చేసిన విషయం తెలిసిందే. -
శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీలా మారిపోయాడు!
లైమ్‌రిక్ (ఐర్లాండ్): ఐర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్యతో శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీగా మారిపోయాడు. ఒకట్రెండు రోజులుగా జరిగినవేవీ జ్ఞాపకానికి రాక కిందా మీదా పడ్డాడు. 66 ఏళ్ల ఆ వ్యక్తి భార్యతో గడిపిన 10 నిమిషాలకు మొబైల్లో తేదీ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ ముందు రోజే వాళ్ల పెళ్లి రోజు. అంత ముఖ్యమైన విషయం మర్చిపోయానే అంటూ బాధపడిపోయాడు. నిజానికతను భార్యతో, కూతురితో కలిసి ముందు రోజు సాయంత్రం పెళ్లి రోజును చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ అవేమీ అతనికి గుర్తు లేకుండా పోయాయి. దాంతో, పెళ్లి రోజున సరదాగా గడిపామని భార్య, కూతురు ఎంత చెప్పినా ఓ పట్టాన నమ్మలేదు. ‘‘నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? నేను ఏమేం చేశాను? ఒక్కటీ వదలకుండా చెప్పండి’’ అంటూ వారిని పదేపదే అడిగాడు. పోనీ జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందా అంటే తన పేరు, వయసు వంటి పాత విషయాలన్నీ మాత్రం భేషుగ్గా గుర్తున్నాయి. ఇక లాభం లేదని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలన్నీ చేయించినా సాధారణంగా మతిమరుపుకు దారితీసే నరాల సమస్య వంటివేమీ లేవని, అంతా మామూలుగానే ఉందని తేలింది. మరి ఈ తాత్కాలిక మరుపేమిటో అర్థం కాక డాక్టర్లు కూడా అయోమయానికి గురయ్యారు. కాసేపటికే ముందు రోజు జ్ఞాపకాలన్నీ తిరిగి రావడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఐరిష్ మెడికల్ జర్నల్ మే సంచికలో వ్యాసంగా పబ్లిషైంది. అతని సమస్యను ఒక రకమైన షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌గా గుర్తించినట్టు వ్యాసకర్త వివరించారు. ‘‘సాధారణంగా స్ట్రోక్ తదితరాల వల్ల తలెత్తే నరాల బలహీనత ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా (టీజీఏ)గా పేర్కొనే షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌కు కారణమవుతుంది. కానీ అలాంటివేవీ లేకుండానే కొందరిలో అరుదుగా ఈ సమస్య తలెత్తుతుంది. ప్రస్తుత కేసు అలాంటిదే’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇలా జరిగేందుకు ఆస్కారముంటుందన్నారు. ‘‘శారీరకంగా బాగా శ్రమ పడ్డా, అతి చల్లని, లేదా బాగా వేడి నీళ్లలో చాలాసేపు మునిగినా, ఎమోషనల్ స్ట్రెస్‌కు, బాధకు గురైనా, అరుదుగా కొన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నాక ఇలా స్వల్పకాలిక మతిమరుపు వచ్చి పడుతుంది. ఫలితంగా తాజా సంఘటనలు ఎవరో చెరిపేసినట్టుగా జ్ఞాపకాల్లోంచి మాయమైపోతాయి. కొందరేమో ఏడాది క్రితం జరిగినవి మర్చిపోతుంటారు. చాలామటుకు కొద్ది గంటల్లోనే ఆ జ్ఞాపకాలన్నీ తిరిగొచ్చి మళ్లీ మామూలైపోతారు’’ అని వివరించారు. కొసమెరుపు ఈ ఉదంతంలోని కథానాయకునికి 2015లోనూ ఇలాంటి తాత్కాలిక మతిమరుపు వచ్చిందట. అది కూడా ఎప్పుడో తెలుసా? భార్యతో సన్నిహితంగా గడిపిన 10 నిమిషాలకే! -
నీతో శృంగారం నాకిష్టం లేదు.. భర్త జననాంగాన్ని కోసేసిన భార్య
భోపాల్: శృంగారంలో పాల్గొనాలని బలవంతం పెట్టినందుకు ఓ భార్య తన భర్త జననాంగాన్ని కోసేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టికామ్‌ఘడ్ పట్టణానికి చెందిన ఓ మహిళకి 2019లో పెళ్లైంది. అయితే వివాహం జరిగిన కొంత కాలానికే ఆ మహిళకు తను భర్తతో తరచూ గొడవలు జరిగేవి. దీంతో కలిసి ఉండలేక వారివురు కొన్నాళ్లు వేరువేరుగా ఉన్నారు. కుటుంబసభ్యుల జోక్యంతో కొంతకాలంగా రాజీపడి కలిసే ఉంటున్నారు. ఇటీవల ఓ రోజు సదరు భర్త తన భార్యతో శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె ఏ మాత్రం అంగీకరించలేదు. దీంతో అతను తన భార్యను బలవంతం చేయగా కోపంతో ఆ మహిళ భర్త జననాగాన్ని కోసేసింది. చికిత్స అనంతరం కోలుకున్నాక ఆ వ్యక్తి .. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి తన భార్యపై ఫిర్యాదు చేశాడు. -
చనిపోయిన ప్రియుడికి కోపం తెప్పించిన ప్రియురాలు.. దెయ్యమై..
లండన్: సాధారణంగా తీరని కోరికలతో చనిపోయిన వారి మనసుకు ప్రశాంతత ఉండదని భావిస్తారు. అలాంటి వారు ఆత్మలుగా మారి.. తమకు నచ్చిన వారి చుట్టు తిరుగుతుంటారని భయపడుతుంటారు చాలా మంది. ఇలాంటి అనేక సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఇదే తరహా ఘటన ఒకటి ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. 38 ఏళ్ల బ్రోకార్డ్ ఆక్స్ఫర్డ్ షైర్‌కు గాయనిగా పనిచేస్తుంది. బ్రోకార్డ్, ఎడ్వర్డో ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, కొన్ని రోజుల తర్వాత.. ప్రియుడు ఎడ్వర్డ్ చనిపోయాడు. ఈ క్రమంలో బ్రోకార్డ్ .. తన ప్రియుడు చనిపోయిన కూడా అతనితో ఉన్న గడిపిన క్షణాలను ప్రతి క్షణం గుర్తుచేసుకుంటు ఉండేది. అతను తన చుట్టు ఉన్నట్లు భావించేది. ఒక రోజు బ్రోకార్డ్ తన ప్రియుడు ఎడ్వర్డోతో ఉన్న సంబంధాన్ని మీడియా సమావేశంలో పంచుకుంది. ప్రియుడితో గడిపిన ప్రత్యేక క్షణాలు, ప్రేమను పబ్లిగ్గా పంచుకుంది. ఆతర్వాత నుంచి బ్రోకార్డ్.. తన ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఎడ్వర్డ్ కోపంగా ఉన్నాడని నాకు అనిపిస్తోందని తెలిపింది. ఇంట్లో ఏదో రకమైన అలజడి నాకు వినిపిస్తుంది. అతను..నాపై కోపంగా ఉన్నట్లు తెలుస్తుందని బ్రోకార్డ్ బాధపడింది. మా రొమాన్స్ గురించి పబ్లిగ్గా పంచుకున్నందుకు చనిపోయిన నా ప్రియుడు కోపంగా ఉన్నాడని తెలిపింది. అయితే.. ఇంగ్లండ్‌లో హలోవిన్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. చనిపోయిన ఆత్మలు.. హలోవిన్ను వాలెంటైన్స్గా భావిస్తారని అక్కడి వారు నమ్ముతారని తెలిపింది. తన ప్రియుడికి కెండిల్స్ను వెలిగించి .. నచ్చిన పదార్థాలను వండి నా ప్రియుడి ముందు ఉంచుతానని తెలిపింది. అదే విధంగా.. ప్రతి ఒక్కరికి వ్యక్తి గత విషయాలు ఉంటాయి. అవి బహిరంగంగా పంచుకుంటే బాధ, కోపం వస్తుంది. ఈ విషయంలో.. నా ప్రియుడికి కూడా అలాగే కోపం వచ్చుంటుందని బ్రోకార్డ్ బాధపడింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
శృంగారంలో పాల్గొంటే మంచాలు విరుగుతాయా?
Tokyo olympics: జూలై నెల చివరి వారంలో ప్రారంభంకానున్న విశ్వ క్రీడలకు ప్రపంచ అథ్లెట్లు సంసిద్ధమవుతున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఒలింపిక్స్ నిర్వహణ కత్తి మీద సాములా మారిందని చెప్పాలి. ఈ క్రమంలో అథ్లెట్ల మధ్య శృంగార కట్టడికి నిర్వాహకులు వినూత్న ఆలోచనను అమలు చేశారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులు రొమాన్స్ లో పాల్గొనకుండా ఒలింపిక్ గ్రామంలోని వాళ్లు బస చేస్తున్న గదుల్లో విచిత్రమైన బెడ్లను ఏర్పాటు చేశారు. అట్టలతో తయారు చేసిన మంచాలను క్రీడాకారుల గదులో ఉంచారు. దీనివల్ల ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనే వీలుండదని అని వారి యోచన. ఒలింపిక్స్ ముగిశాక వీటిని రీసైక్లింగ్ చేసి కాగితపు ఉత్పత్తులుగా మార్చనున్నారు. క్రీడాకారుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు ఈ చర్యలు చేపట్టారు. జూలై 24న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్ల బస కోసం 18,000 పడకలు అవసరం కాగా, పారా ఒలింపిక్స్‌కు 8,000 పడకలు మాత్రమే అవసరం అయ్యాయి. ప్రస్తుతం ఈ బెడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారి హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇవి గరిష్టంగా 200 కిలోల బరువు వరకు ఆపగలవని, యాంటీ సెక్స్ బెడ్స్ కథనాలను తోసిపుచ్చుతున్నారు ఒలింపిక్ నిర్వాహకులు. Beds to be installed in Tokyo Olympic Village will be made of cardboard, this is aimed at avoiding intimacy among athletes Beds will be able to withstand the weight of a single person to avoid situations beyond sports. I see no problem for distance runners,even 4 of us can do😂 pic.twitter.com/J45wlxgtSo — Paul Chelimo🇺🇸🥈🥉 (@Paulchelimo) July 17, 2021 *looks up ‘sex during the games’ in #Tokyo2020 health and safety handbook https://t.co/m4UaAYMhNz — James Longman (@JamesAALongman) July 19, 2021 “Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB — Rhys Mcclenaghan (@McClenaghanRhys) July 18, 2021 -
జూమ్ కాల్లో ఫన్నీ రొమాన్స్ : వైరల్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ మన జీవితంలో చాలామార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా భౌతిక దూరం, ఫేస్‌మాస్క్, చేతులు శుభ్రంగా కడుక్కోవడం లాంటి మూడు సూత్రాలు కచ్చితంగా పాటించాల్సి పరిస్థతుల్లో జీవించాం. జీవిస్తున్నాం... కూడా. అదే సందర్భంలో భౌతిక దూరం పాటించేలా చాలావరకు సమావేశాలు, ఇంటర్వ్యూలు వర్చువల్‌గా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఒక జూమ్ కాల్లో చోటు చేసుకున్న ఈ చిలిపి ఘటన నెట్టింట్లో సందడి చేస్తోంది. ఒక ఎనలిస్టు, జూమ్ మీటింగ్‌లో దేశ జీడీపీపై చాలా సీరియస్‌గా విశ్లేషిస్తున్నారు. ఇంతలో ఆయన భార్యగా భావిస్తున్న మహిళ సడన్‌గా వచ్చి ఆయనను కిస్ చేయబోయింది. దీనికి హతాశుడైన భర్తగారు.. వాట్ నాన్సెన్స్.. కెమెరా ఆన్‌లో ఉంది అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. ఈ క్రమంలో మహిళ విసిరిన నవ్వుల పువ్వుల బాణానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నడివయసులో వీరి ఫన్నీ రొమాన్స్ ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే మరికొంతమంది నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. వాళ్ల ప్రైవసీ మాట ఏమిటి, ఇది చూస్తే వాళ్ల పిల్లలముందు పరువు పోదా అంటూ ఈ వీడియో క్లిప్పింగ్‌పై కొంతమంది కోపం ప్రదర్శిస్తుంటే.. వారి జీవితాల్లోని ఆప్యాయత, అనురాగాలకు ఇది నిదర్శనం. ప్రేమగల తల్లిదండ్రుల్ని చూసిన పిల్లలు సంతోషిస్తారని కొంతమంది కమెంట్ చేస్తున్నారు. భర్తగారి వ్యక్తీకరణ చాలా మొరటుగా ఉందని కొందరు కమెంట్ చేస్తే..బహుశా.. ఆవిడ ఆయన భార్య కాదేమో...అంటూ చిలిపి నెటిజన్లు వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
నెలకో నవల రాస్తారు ఈవిడ
సుందరి వెంకటరామన్ తన 53వ ఏట ఇంగ్లిష్‌లో కాలక్షేప నవలలు రాయడం మొదలుపెట్టారు. తనే స్వయంగా వాటిని పబ్లిష్ చేయడం మొదలెట్టారు. నెలకు ఒక నవల రాయడం ఆమె ప్రత్యేకత. ఇప్పటికి 50 నవలలు పబ్లిష్ అయ్యాయి. వాటిలో కొన్ని బెస్ట్ సెల్లెర్స్‌గా నిలిచాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. ‘వచ్చే సంవత్సరం నాకు అరవై నిండుతాయి. ఈలోపు అరవై నవలలు పూర్తి చేయాలనుకుంటున్నాను’ అంటున్నారు. ముంబైలో ఉండే ఈమెతో ఒక పది నిమిషాలు మాట్లాడటం కష్టమే. ఎందుకంటే నవల రాస్తుంటారు కదా బిజీగా. మనకు తెలుగులో యద్దనపూడి సులోచనారాణి, యండమూరి, మల్లాది లాంటి పాపులర్ రచయిత లు తెలుసు. కాని సుందరి వెంకటరామన్ వారిని మించినట్టుగా ఉన్నారు. వారి కంటే భిన్నమైన నేపథ్యం ఉన్నట్టుగా కనిపిస్తారు. ఎందుకంటే ఈమె మిగిలిన వారిలా చిన్న వయసు నుంచి రచనలు చేయడం మొదలు పెట్టలేదు. పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత 2001లో నవలలు రాద్దామని ప్రయత్నించారు. కాని ఆ రచనలను పబ్లిషర్లు రిజెక్ట్ చేశారు. దాంతో ఊరికే ఉండిపోయి తిరిగి 2014లో తన 53వ ఏట నుంచి తనే తన నవలలు ప్రచురించుకోవడం మొదలుపెట్టారు. ఆరేళ్లలో యాభై నవలలు రాశారు. అంటే సగటున నెలకు ఒక నవల రాసినట్టు. ఇలాంటి రికార్డు ఉన్న భారతీయ రచయిత్రులు చాలా అరుదు. ఉద్యోగపు విసుగు నుంచి సుందరి వెంకటరామన్ది చెన్నై. చిన్నప్పటి నుంచి బాలల కథలు చదివి ఆ లోకంలో విహరించేవారామె. టీనేజ్‌లో ఉండగా ఇంగ్లిష్‌లో కాలక్షేపంగా, రొమాంటిక్ సాహిత్యంగా ఉధృతంగా వచ్చిన మిల్స్ అండ్ బూన్స్ నవలలను విపరీతంగా చదివేవారు. ఏది చదివినా ముగింపు వాక్యం ‘ఆ తర్వాత వారు కలకాలం సుఖ సంతోషాలతో వర్థిల్లారు’ అని ఉన్న పుస్తకాలే చదివేవారు. ‘సుఖాంతమే అవ్వాలి పుస్తకాలు’ అంటారామె. ఆ తర్వాత పెళ్లి, పిల్లల పెంపకం, ముంబైలో స్థిరపడటంలో పడి నలభై ఏళ్లు వచ్చేశాయి. ఆమె అంతవరకూ చేస్తున్న స్కూల్ అడ్మిన్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఏదో అనిశ్చితి ఉండేది మనసులో ఆ సమయంలో. ఒకరోజు ఈవెనింగ్ వాక్ నుంచి ఇంటికొచ్చి కొన్ని కాగితాలు తీసుకొని రాయడం మొదలుపెట్టారు. అంతవరకూ చదివి చదివి ఉన్న పుస్తకాల ఫలితంగా ఏదో ఒక కథ ఆమె మనసులో గూడు కట్టుకొని అది ఒక్కసారిగా బయట కు వచ్చినట్టుగా వచ్చేసింది. ఆమె రాస్తూ వెళ్లారు. మొత్తం 92 వేల పదాల నవల రాశారు. దాని పేరు ‘ది మల్హోత్రా బ్రైడ్’. ఎంతో ఆశతో దానిని తీసుకుని ఒక పబ్లిషర్ దగ్గరకు వెళ్లారు. కాని ఆ పబ్లిషర్ దానిని చదివి పెదవి విరిచాడు. దానికి కారణం అందులో రొమాన్స్, స్త్రీ పురుష సంబంధాలు ఉండటం ‘ఈ సబ్జెక్ట్ ఇప్పుడు చదవరు’ అని అతను అన్నాడు. సుందరి నిరాశగా ఇంటికి చేరుకున్నారు. భర్త ఆమెతో ‘నిరాశ పడకు. రాస్తూ ఉండు’ అని ప్రోత్సహించాడు. అ³్పుడు ఆమె తిరిగి ‘ముంబై మిర్రర్’ పత్రికలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఐదేళ్లు ఆ పత్రికకు సంబంధించిన వెబ్సైట్ల కోసం పని చేశారు. మళ్లీ విసుగు వచ్చింది. 53 ఏళ్లు వచ్చేశాయి... ఇంకా నేను రైటర్‌గా లోకానికి తెలియలేదు అనుకుని మళ్లీ ఉద్యోగం మానేశారు. ఇప్పుడు నిజంగానే తన రైటింగ్ కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నారామె. సెల్ఫ్ పబ్లిషర్‌గా ఆ సమయంలో ఆమెకు అప్పటికే సెల్ఫ్ పబ్లిషింగ్కు అవకాశం కల్పిస్తూ పాఠకాదరణ పొందిన అమేజాన్ ‘కిండిల్’ ఈ–రీడర్ ఒక ఆశాకిరణంలా అనిపించింది. తను రాసిన నవలలను ఈ–బుక్స్‌గా పబ్లిష్ చేయాలనుకున్నారామె. 2014 లో తన తొలి ఈ నవలగా ‘ది మల్హోత్రా బ్రైడ్’ను విడుదల చేశారు. ఆ తర్వాత ఒక్కో నవలా జత చేస్తూ వెళ్లారు. సంవత్సరం తిరిగే సరికే ఇటు ఈ–బుక్స్‌తోపాటు పేపర్‌బ్యాక్స్ ప్రచురించడానికి పబ్లిషర్లు ముందుకు రాసాగారు. ‘ది మెడ్రాస్ ఎఫైర్’ అనే నవల ఆమె తొలి ప్రచురణ నవలగా వచ్చింది. ఇప్పుడు ఆమె నవలలు ఈ బుక్స్‌గా దొరుకుతున్నాయి. కోరిన పాఠకులకు పేపర్బ్యాక్స్గా కూడా దొరుకుతున్నాయి. అమెజాన్ ద్వారా అమ్ముడుపోయే కాలక్షేప నవలల్లో టాప్ 100లో సుందరి వెంకటరామన్ నవలలకూ స్థానం. యు.కె, కెనెడా, ఆస్ట్రేలియాల్లో కూడా ఆమె నవలలు బెస్ట్‌సెల్లర్స్‌గా నిలవడం విశేషం. రొమాన్సే వస్తువు ‘రొమాన్స్’ అనే మాటకు ‘ప్రేమకు సంబంధించిన ఉత్సుకత’ అనే డిక్షనరీ అర్థం చెబుతారు సుందరి వెంకటరామన్. ‘ఎరోటిజమ్’ అనే మాటలో ‘లైంగిక వాంఛ’ అర్థాన్ని చూపుతారు. స్త్రీ, పురుషుల సంబంధాల్లో రొమాన్స్ ఉంటుంది... ఎరోటిజమూ ఉంటాయి... ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.. నా నవలల్లో అదే ప్రధాన వస్తువు అంటారామె. ‘భారతదేశంలో రొమాంటిక్ సబ్జెక్ట్స్‌ను ఇష్టపడేవారు ముందు నుంచి ఉన్నారు. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే వంటి సినిమాలు అంత హిట్ కావడానికి కారణం మనవాళ్ల అలాంటి కంటెంట్‌ను ఇష్టపడటమే’ అంటారామె. ఆమె నవలల పేర్లు కూడా డెబ్బైల నాటి పల్ప్ ఫిక్షన్‌ను పోలినట్టు ఉంటాయి. ‘ది సీక్రెట్ హజ్బెండ్’, ‘ది కాసనోవాస్ వైఫ్’, ‘రోజ్ గార్డెన్’... ఇలా. వాటికి విస్తృతంగా పాఠకులున్నారు. ‘ప్రతిదానికీ పాఠకులుంటారు’ అంటారామె. ‘నా నవలలు చదివితే ఆ ఆకర్షణల వల్ల వచ్చే సమస్య ల నుంచి కూడా బయటపడొచ్చు’ అంటారు. రచనలు రెండు రకాలు. సమాజ హితాన్ని కోరేవి. సమాజానికి కాలక్షేపం అందించేవి. ఏది ఆసక్తి ఉంటే అందులో రాణించవచ్చు. స్వయంగా పబ్లిష్ చేసి గుర్తింపు పొందవచ్చు. మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచవచ్చు. ఏ వయసులో అయినా కొత్త ప్రయాణం మొదలెట్టొచ్చు అనడానికి సుందరి వెంకటరామన్ ఒక ఉదాహరణ. అతి వేగంగా రాసే రచయిత్రి సుందరి వెంకటరామన్ అతి వేగంగా రాస్తారు. ఒక్కో నవల సగటున 35 రోజుల్లో పూర్తి చేస్తారు. భూమి ఆకాశాల మధ్య ఏ వస్తువునైనా తీసుకొని కథ అల్లగలరామె. 2016లో పన్నెండు నెలలకు పన్నెండు నవలలు పబ్లిష్ చేశారామె ఈబుక్స్‌గా. కవర్ డిజైన్ ప్రూఫ్ తనే చూస్తారు. మార్కెటింగ్ తనే చేస్తారు. ప్రచారం కూడా. – సాక్షి ఫ్యామిలీ -
అలాంటివి చూసి బోర్ కొట్టేసింది!
సినిమా: రొమాన్స్ చిత్రాలు చూసి చూసి బోర్ కొట్టేసిందని నటి నమిత పేర్కొంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీజీ.ముత్తయ్య, ఎం.దీప కలిసి పీజీ.మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన చిత్రం కాక్టైల్. నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఇందులో ఆయనకు మిత్రులుగా రమేష్, మిథున్, విజయ్ టీవీ కలక్కుపోవదు యారు ఫేమ్ బాలా, ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు. వీరితో పాటు షియాజీ షిండే, మనోబాలా, మైమ్‌గోపి నటించారు. నవ దర్శకుడు ఆర్. విజయ్‌మురుగన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆర్జే.రవిన్ ఛాయాగ్రహణం, ఎస్.సాయిభాస్కర్ సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రంలో ఆస్ట్రేలియాకు చెందిన కాక్టైల్ అనే పక్షి ప్రధాన పాత్రలో నటించిందని, అలా ఒక పక్షి ప్రధాన పాత్రలో నటించడం ఇదే ప్రప్రథం అని నిర్మాతలు పేర్కొన్నారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలోని ఒక కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నమిత మాట్లాడుతూ రొమాన్స్ చిత్రాలు చూసి చూసి బోర్ కొట్టేసిందని పేర్కొంది. కాక్టైల్ లాంటి కామెడీ చిత్రాలను చూడడమే ఇష్టమని చెప్పింది. ఈ చిత్రాన్ని తాను థియేటర్‌కు వెళ్లి చూస్తానని నమిత చెప్పింది. మరో అతిథి ఎస్వీ.శేఖర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. అయితే మనకు మంచి జరగుతుందంటే అది ఏ రోజు అయినా మంచిదేనని అన్నారు. చిత్ర నిర్మాత పీజీ.ముత్తయ్య మాట్లాడుతూ సినిమా గురించి ఏమీ తెలియకుండానే చెన్నైకి వచ్చానన్నారు. ఎస్ఆర్ఎం కళాశాలలో చదువుతున్న సమయంలోనే సినిమా గురించి తెలుసుకున్నానని, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన అన్నారు. కార్యక్రమంలో నటుడు అశోక్‌సెల్వన్ పాల్గొన్నారు. -
ఇలాంటోళ్లు రొమాన్సులో పిచ్చోళ్లు!
‘ప్రియురాలి ముందు ధైర్యంగా మాట్లాడటానికి ఇబ్బందిపడేవాడే ప్రేమికుడు.’ అంటాడు ప్రముఖ ఆంగ్ల రచయిత టీఎస్ ఎలైట్. ఇది కొంతమంది ప్రేమికుల విషయంలో కచ్చితంగా వర్తిస్తుంది. కేవలం మాటల్లోనే కాదు! ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టే చిన్న చిన్న పనుల విషయంలోనూ కొంతమంది తడబడుతుంటారు. వీళ్లు రొమాన్స్‌లో ఏబీసీడీలు రాని పిచ్చోళ్లు. దీని వల్ల రిలేషన్షిప్ దెబ్బతింటుందని చెప్పలేము కానీ, ఇలాంటోళ్లు ఎదుటి వ్యక్తిని పూర్తిస్థాయిలో సంతోషపెట్టలేరన్నది నిజం. అయితే ఏ ఏ విషయాల్లో.. ముఖ్యంగా రొమాన్స్‌లో వెనుకబడి ఉన్నవాళ్లు ఎలా ఆలోచిస్తారో తెలుసుకుందాం! 1) ప్రాక్టికల్ ఆలోచన : ప్రియురాలి పుట్టిన రోజు నాడు రోజాపూలతో ఆమెను విష్ చేయకుండా.. రోజాపూలు ఎందుకు దండగ. వాటికోసం చేసే ఖర్చుతో వేరే అవసరమైన వస్తువు కొని ఇస్తే బాగుంటుంది కదా అని ఆలోచించటం. లేకపోతే పూల స్థానంలో పండ్లో, కూరగాయలో ఇద్దామనుకోవటం. 2) పబ్లిక్ స్పేస్ : రొమాంటిక్ కపుల్ ముఖ్య లక్షణం తమ చుట్టూ ఎంతమంది జనం ఉన్నా ధైర్యంగా కబుర్లు చెప్పుకోవటం, కాస్తంత సరదాగా ఉండటం. కానీ, కొంతమంది జనంలో ఉన్నప్పుడు మొహమాటపడుతుంటారు. అందరిలో ఎదుటివ్యక్తితో గట్టిగా మాట్లాడటానికి ఆలోచిస్తారు. కలిసి నవ్వటానికి కూడా జంకుతుంటారు. 3) సొంత కట్టుబాట్లు : ప్రతి మనిషికి కొన్ని కట్టుబాట్లు ఉండటం మామూలే. అయితే మనతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నపుడు కొద్దిగా వాటిలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ‘ఎవరికోసమూ నా కట్టుబాట్లలో మార్పులు చేసుకోను’ అనేవాళ్లు, భాగస్వామి సరదాగా ఎక్కడికైనా బయటకు వెళదామన్నపుడు టైం టేబుల్ చూసుకునేవాళ్లు రొమాన్స్‌కు చాలా దూరంగా ఉన్నట్లు అర్థం. ఇవే కాకుండా భాగస్వామి కౌగిలించుకోవటానికి లేదా ముద్దుపెట్టుకోవటానికి ట్రై చేస్తున్నపుడు భయపడుతూ కొంతమంది వారికి దూరంగా వెళుతుంటారు. అంటే దీనర్థం ఎదుటి వ్యక్తిమీద మీకు ప్రేమలేదని కాదు మీరు రొమాన్సులో వెనుకబడి ఉన్నారని అర్థం. మరికొందరు రిలేషన్లో ఉన్నపుడు తమ భాగస్వామిలో ఓ మంచి స్నేహితుడిని వెతుక్కుంటుంటారు. అలాంటి వారు రొమాంటిక్ పనులకు చాలా దూరంగా ఉంటారు. మీరు ఇలాంటి రొమాంటిక్ పనులకు దూరంగా ఉన్నారంటే బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు! మీరు మిగితా వారికంటే ప్రత్యేకమని గుర్తించండి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అనగనగా ఓ హిమజ
నా జీవితంలోని మధురమైన ఘట్టం.. డిగ్రీ ఫస్టియర్ లో ఉన్నప్పుడు వెళ్లిన ఎన్ఎస్ఎస్ క్యాంపు లోని పది రోజుల కాలం.. ఆ మధురానుభూతుల్ని తలచుకుని నా మనసు ఇప్పటికీ తుళ్ళి పడుతుంది. ఆ అనుభవాలు తలచుకుని ప్రతిక్షణం ఆనంద పారవశ్యంలో మునిగితేలుతుంది. ఆ పది రోజులు ఎంత తొందరగా అయిపోయాయా అనిపిస్తోంది తలుచుకున్నప్పుడు.. నిజ జీవితంలో సినిమా సంఘటనలు ఎదురైతే ఎంత థ్రిల్ ఫీల్ అవుతామో నిరూపించిన క్యాంపు అది.. హిమజ అని మా క్లాస్ మేట్. కొంచెం అందంగా ఉంటుంది. తానే అందగత్తెనని కొంచెం ఫీలింగ్ కూడా. తనను ఎవరైనా అదే పనిగా చూస్తే ప్రేమలో పడతారని ఆమె భయం. అలాంటి అమ్మాయి మా గ్రూప్‌లోనే ఉంది. (ఎన్నెస్సెస్ క్యాంపు వెళ్లిన మేము ఐదు గ్రూపులుగా విడిపోయి.. ఊళ్లో తలో భాగాన్ని పంచుకొని శ్రమదానం పనులు చేసేవాళ్లం.) మంచి అమ్మాయే కానీ అనుమానాలు ఎక్కువ. కొంచెం ఫ్రీగా ఉంటే అందరితో బాగానే మాట్లాడుతుంది. క్లాస్మేట్ కాబట్టి నాతో ఫ్రీగానే ఉంది. అట్లాగే తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను నాతో షేర్ చేసుకుంది. ఆమెతో నేను కొంచెం కామెడీగా ఉండేవాణ్ని. ఆమె మావయ్య అని ఒకతన్ని పిలిచేది. అతను నాతో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాడు. నేను అతన్ని బాబాయి అని పిలువడం మొదలెట్టాను. ఇలా పిలవడంలో ఎలాంటి దురుద్దేశమూ లేదు... అలా కొన్నిసార్లు పిలిచినా తను ఏం ఫీల్ కాలేదు. నా మంచితనం తెలుసు కాబట్టి. కానీ ఒక రోజు ఊరికి కొంచె దగ్గరగా చెలుకలో మట్టి తవ్వుతున్నప్పుడు.. తనను తేనేటీగ కరిచింది. తను బాగా ఏడుస్తుంటే నా మనస్సుకు చాలా బాధేసింది. వెంటనే ఊళ్లోకి పరిగెత్తుకెళ్లి ఓ పెద్దమ్మను అడిగాను. తేనేటీగ కుడితే మందు ఏం పెట్టాలని. ఆమె ఒక చెట్టు ఆకు పసురును పెడితే వెంటనే నొప్పి తగ్గిపోతుందని చెప్పింది. నేను వెంటనే ఆ ఆకు పసురును తీసుకొని తన దగ్గరకు పరిగెత్తుకు వెళ్లాను. తనను అప్పటికీ ఊర్లోని క్లినిక్‌కు తీసుకెళ్లారు. నేను పసురును తీసుకొని క్లినిక్‌కు వెళ్లాను. డాక్టర్ అన్నాడు మందు ఇచ్చాను పసురు లాంటివి అవసరం లేదని. నేను పసురు తీసుకెళ్లి ఇది పెట్టుకుంటే త్వరగా తగ్గుతుందని చెప్పాను. తన వెంట ఉన్న తోటి క్లాస్మేట్స్ (గర్ల్స్) నవ్వారు. పసురులాంటివి వొద్దు బాబు.. అయినా డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాం కదా.. నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాం కదా. నీ ఒక్కడికే అంత టెన్షన్ ఎందుకు అన్నట్టు చూశారు. తను నన్ను కోపంగా చూసింది. నొప్పి ఎలా ఉంది అని అడిగినా సమాధానం ఇవ్వలేదు. ఈ పసరు పెట్టుకుంటే తగ్గిపోతుందంట అని చెప్పినా వినిపించుకోలేదు. అమ్మాయిలతో కలిసి కోపంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత కనిపించినా మొఖం తిప్పుకోవడం మొదలుపెట్టింది. మాట లేదు. ముచ్చట లేదు. ఎందుకు మాట్లాడటం లేదని అడిగాను. నాతో నేరుగా మాట్లాడకుండా పక్కకు ఉన్నవారికి చెప్తున్నట్టుగా `ఓవరాక్షన్ చేసేవారితో నేను మాట్లాడాను` అని అంది. అందులోని ద్వంద్వార్థాన్ని గ్రహించాను. నేను తనతో ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నట్టు తను భావించేదేమో. కామెడీగా ఉంటూ సరదాగా మాట్లాడాను. తనకు తేనేటీగ కుడితే తను ఏడ్వడం చూడలేక ఒక మనిషిగా పరిగెత్తుకెళ్లి ఆకు పసరు తీసుకొచ్చాను. కానీ, నేను తను పట్ల స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు తను భావించింది. నేను తనను ప్రేమిస్తున్నానని అనుకుందేమో. తను దూరం పెట్టడం మొదలెట్టింది. నేనూ తనతో మాట్లాడటం మానేశాను. ఊరిలో శ్రమదానం పనులు ముగించుకొని ఓ రోజు పంపు ట్యాంక్ వద్దకు వచ్చాము. అప్పటి వరకు తన సబ్బుతోనే నేను మొఖం, కాళ్లు చేతులు కడుక్కొనే వాణ్ని. ఆ రోజు మాత్రం తన ఫేస్ వాష్ ఐపోగానే తన సబ్బు తీసుకొంది. నేను యథాలాపంగా సోప్ అడిగాను. ఇవ్వలేదు. పక్కన ఉన్న సీనియర్ అమ్మాయి.. అక్కడ బట్టలుతికే సబ్బు ఉంది కదా.. దానితో కడుక్కో అని టీజింగ్ చేస్తున్నట్టు అంది. హిమజ మీద కోపంతో ఆ సోపుతోనే మొఖం, కాళ్లు చేతులు కడుక్కున్నాను. తను మాత్రం పిల్లడ ఆ సబ్బుతో కడుక్కోకు. నా సోప్ ఇస్తా తీస్కో అంది. నేను కోపంతో తీసుకోలేదు. తను ఏమనుకుందో మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది. నేను మాట్లాడకపోయినా మాట్లాడేది. నాకు కోపం వచ్చింది. `నువ్వు ఓవరాక్షన్ చేసేవారితో మాట్లాడవు కదా` అని అడిగేశాను. `నువ్విప్పుడు ఓవరాక్షన్ చేస్తలేవు కదా` అని అంది. అంటే తనతో మాట్లాడకపోతే..తనను అవాయిడ్ చేస్తేనే మాట్లాడుతదా? తనతో మాట్లాడటం ఇష్టం అనిపించలేదు. అయినా.. కన్నా.. చిన్నా అంటూ పిలువడం మొదలుపెట్టింది. అవాయిడ్ చేసినకొద్ది మాట్లాడేది. ఓ రోజు నేను చాలా చిరాగ్గా కూచున్నాను. మా గ్రూప్‌లోనే నేను ఎంతో ఇంట్రస్ట్‌గా, శ్రద్ధగా శ్రమదానం పనులు చేసేవాడిని. ఊరికి మనవల్ల ఎంతోకొంత మేలు జరగాలి. మనం స్టూడెంట్స్ వచ్చి చేసిన పనిని ఊళ్లోవాళ్లు.. ఒక్కసారన్న జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్టుగా ఉండేది నా ధోరణి. కానీ, ఆ రోజు నాకు పనిచేయబుద్ధి కాలేదు. చాలా చిరాగ్గా ఉంది. ఏం పని చేయకుండా ఓ ఇంటి అరుగు మీద ముభావంగా కూచున్నా. అప్పటివరకు పిచ్చి గడ్డిమొక్కల్ని పీకి.. నా పక్కన కొంచెం దూరంగా కూచుంది హిమజ. నేను ముభావంగా ఉండటం గమనించిందో లేదో తెలియదు. కానీ ఉన్నట్టుండి `పిల్లోడా` అని ఒకింత ప్రేమగా పిలిచింది. నేను కోపంగా ముఖం తిప్పుకున్నాను. ఈసారి కొంత గోముగా, కొంత కోపంగా `ఓ పిల్లగా ఇటు చూడు` అంది. నాకు చుర్రుమంది. `ఏంటి.. ఏంటి అన్నావు` అని కోపంగా అడిగాను. తను బెదిరిపోయి.. అటూఇటూ బిత్తరచూపులు చూసి.. `తమ్ముడా` అని పిలిచానని మాట మార్చింది. లేదు నువ్వు తమ్ముడా అనలేదు అని నేను అడిగితే.. అంతే అన్నానని బుకాయించింది. నేను షాక్ తిన్నాను. నా గురించి తను చెండాలంగా ఊహించికున్నట్టు అనిపించింది. ఓ స్నేహితురాలిగా అభిమానించానేమో. ఓ క్లాస్మేట్గా స్నేహంగా ఉండాలనుకున్నా. తమ్ముడా అని ఎలా పిలుస్తుంది. ఒక్క క్లాస్‌లోని వాళ్లు స్నేహంగా ఉండకూడదా. స్నేహంగా ఉంటే కూడా అది ప్రేమ అవుతుందా? ప్రేమ అనేవాటికి తప్పించుకునేందుకు ఇలాంటి తమ్ముడా అనే ముసుగులు ధరించాలా? నాకు చాలా బాధేసింది. ఏదో దు:ఖం కూడా కమ్ముకున్నట్టు అనిపించింది. ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది. కొంచెం చనువుగా మసిలితే.. స్నేహంగా ఉంటే అది ఐ లవ్యూ వరకు వెళుతుందా? నేను చదువుతున్నప్పటి రోజులు అలా ఉన్నాయేమో.. తన అనుభవాల ప్రభావమో. ఎదుటివాణ్ని అలా హఠాత్తుగా తమ్ముడా అని అనడం తనకు తప్పు అనిపించలేదేమో. ఎదుటివారి హృదయంలో ఏ దురుద్దేశమూ లేకపోయినా.. అతన్ని తమ్ముడా అని ఒక భావానికి కుదించేసి.. మన మధ్య ఉన్న కనీస స్నేహ, మావన సంబంధాలకు కూడా అర్థం లేకుండా చేసింది తను అనిపించింది. తను నన్ను తమ్ముడా అన్నా ఫ్రెండ్ అన్నా మామూలు క్లాస్మేట్గా పరిగణించినా నేను ప్రత్యేకంగా ఏమీ బాధపడేవాణ్ని కాదు. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కొంత స్నేహం ఏర్పడిన తర్వాత అపార్థాలతో, అనుమానాలతో నన్ను తమ్ముడా అని పిలువడం బాధగా అనిపించింది. ఒక వ్యక్తిగా నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అనిపించింది. నేనే సరిగ్గా కమ్యూనికేట్ కాలేదేమోనని ఆత్మపరిశీలన చేసుకున్నా. కానీ నా మనస్సులో ఎలాంటి దురుద్దేశం లేదు. ఆ విషయం తనెప్పుడు తెలుసుకోలేకపోవచ్చు. ఆ తర్వాత మేం పెద్దగా మాట్లాడుకోలేదు. తన అపార్థాల నుంచి బయటపడే అవకాశం కూడా తనకు లేదేమో అనిపించింది. ఆ తర్వాత మరో రెండేళ్లు మేం కాలేజీ లైఫ్‌లో కలిసి చదివినప్పటికీ పెద్దగా మాట్లాడుకున్నది లేదు. కానీ ఓ రోజు హఠాత్తుగా తను నాతో మాట్లాడింది. క్లాస్ అయిపోయాక ఇద్దరం కలిసి బేకరీకి వెళ్లాం. తను రెండు ఎగ్పాప్స్ తిన్నది. నేను కూల్‌డ్రింక్ తాగాను. నా స్వభావం తనకు అర్థమైనా కాకపోయినా.. బుద్ధిపూర్వకంగానే నేను తనకు బాగా దూరంగా ఉండిపోయినట్టు అనిపిస్తుంది. - శ్రీకాంత్ కాంటేకర్ -
మళ్లీ పిలుపొచ్చింది
కోలీవుడ్ నుంచి హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌కి మళ్లీ కబురొచ్చింది. రెండేళ్ల క్రితం విశాల్ ‘తుప్పరివాలన్ (2017)’లో నటించిన అనూ ఇప్పుడు శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా నటించనున్నారు. ‘అజ్ఞాతవాసి (2018), నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018), శైలజారెడ్డి అల్లుడు’ (2018) చిత్రాల్లో నటించిన అనూ ఇమ్యాన్యుయేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తర్వాత తెలుగులో వేరే సినిమాలు సైన్ చేయలేదీ బ్యూటీ. అయితే తమిళంలో శివకార్తికేయన్ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా అంగీకరించారామె. ఇందులో ఐశ్వర్యా రాజేష్ మరో హీరోయిన్గా నటిస్తారు. భారతీరాజా, సముద్రఖని, నటరాజన్, ఆర్కే సురేశ్, యోగిబాబు, సూరి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తారు. రూరల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
బైక్‌పై వెళుతూ రొమాన్స్..
-
నడిరోడ్డుపై రొమాన్స్.. వైరల్ వీడియో
బైక్‌పై వెళుతున్నప్పుడు ప్రియురాలు వెనుకుంటే కుర్రాళ్లకు పట్టపగ్గాలుండవు. బైక్ ముందున్న ట్యాంక్‌పై గాల్ ఫ్రెండ్ కూచుని ప్రియుడి కళ్లలో కళ్లు పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో వీడియోకు చిక్కింది ఈ రొమాంచిత దృశ్యం. లోకంతో తమకు పనిలేదన్నట్టుగా బిజీ రోడ్డుపై ఓ ప్రేమ జంట చేసిన ఈ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డన్ క్రాస్ రోడ్డులో ప్రేమ పక్షులు బైక్‌పై దూసుకెళ్లిన ఈ వీడియోను ఐపీఎస్ అధికారి హెచ్జీఎస్ ధలివాల్ ట్వీట్ చేశారు. ‘మోటారు వాహనాల చట్టంలో కొత్త సెక్షన్ తేవాల్సిన అవసరం ఉంద’ని క్యాప్షన్ పెట్టారు. గులామ్ సినిమాలో ‘జాదూ హై తేరా హీ జాదూ’ పాటలో ఆమిర్‌ఖాన్, రాణిముఖర్జీ చేసినట్టుగా ఫీట్ చేసిన ఈ ప్రేమికులు ఎవరో ఇప్పటివరకు తెలియలేదు. యువకుడు బైక్ నడుపుతుండగా ముందున్న ప్యూయల్ ట్యాంక్‌పై కూర్చొని యువతి తన రెండు చేతులను అతడి భుజానికి చుట్టేసి ప్రియుడి కళ్లలోకి చూస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇద్దరూ హుషారుగా బైక్‌పై వెళ్లిపోవడం వీడియోలో కనిపించింది. చట్టప్రకారం ఇది నేరం కానప్పటికీ చాలా ప్రమాదకరం. రద్దీగా ఉన్న రోడ్డుపై ఇలాంటి విన్యాసాలతో ప్రమాదం కొనితెచ్చుకోవడం అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అయితే నడిరోడ్డుపై ఈ రొమాన్స్ ఏంటని నిలదీస్తున్నారు. -
వాంగ.. వాంగ!
ఏదైనా ఇండస్ట్రీలో హీరోయిన్ సూపర్ స్పీడ్ మీద ఉంటే మరో ఇండస్ట్రీ నుంచి ఆహ్వానాలు ఆఫర్స్ రూపంలో వస్తుంటాయి. కన్నడం, తెలుగు ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మికా మండన్నాను వణక్కం వణక్కం (స్వాగతం) అంటూ సాధరంగా ఆహ్వానిస్తోంది తమిళ పరిశ్రమ. ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. యస్.ఆర్ ఫ్రభు, ప్రకాశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా ‘వాంగ.. వాంగ’ (రండి.. రండి) అంటూ రష్మికను ఫిక్స్ చేశారు చిత్రబృందం. తమిళంలో రష్మికకు ఇది తొలి సినిమా. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’, నితిన్‌తో ‘భీష్మ’, కన్నడంలో రెండు చిత్రాలు చేస్తున్నారు. మరి ఈ లక్కీ చార్మ్ తమిళంలో కూడా తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తారా? లెటజ్ సీ. -
పాఠశాలలో రాసలీలలు
తమిళనాడు, టీ.నగర్: నాగర్‌కోవిల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు యువతితో రాసలీలలు జరుపుతూ పట్టుబడడంతో విద్యాశాఖ అతన్ని సస్పెండ్ చేసింది. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కోవిల్ సమీపంలోగల ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుదాంగన్ హెడ్మాస్టర్. ఇతని స్నేహితుడు సుబ్బు. ఇతనూ ఉపాధ్యాయుడే. వీరు సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతుల పేరిట పాఠశాలకు వచ్చేవారు. ఒక యువతిని పాఠశాలకు తమ వెంట తీసుకుని వచ్చి రాసలీలలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో మిగతా ఉపాధ్యాయులను పాఠశాలకు రావద్దని తామే చూసుకుంటామని చెప్పేవారని తెలిసింది. ఇలా ఒక రోజు తన కుమారుడితో మహిళ పాఠశాలకు రాగా హెడ్మాస్టర్తో గదిలో ఉంచి ఉపాధ్యాయుడు గది బయట తాళం వేశాడు. దీన్ని గమనించిన బాలుడు ఏడుపు లంకించుకోవడంతో స్థానికులు అక్కడికి చేరుకుని టీచర్ సుబ్బుతో గది తెరిపించారు. దీనిగురించి ఫిర్యాదు అందుకున్న జిల్లా విద్యాధికారి ప్రధానోపాధ్యాయుడు సుదాంగన్ను శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
ఆలయంలో పాడుపని
కర్ణాటక, మైసూరు: పవిత్రమైన దేవాలయాన్ని ఓ ప్రేమ జంట శృంగారానికి అడ్డాగా చేసుకుంది. కొన్నిరోజులుగా సాగుతున్న ఈ తంతు చివరకు గ్రామస్తుల చొరవతో బయటపడింది. ఈ సంఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా కృష్ణాపుర గ్రామంలో చోటు చేసుకుంది. కళ్లల గ్రామానికి చెందిన యువతీ యువకుడు ప్రేమలో మునిగారు. రోజూ దేవాలయం మూసి ఉన్న సమయంలో బైక్‌పై చేరుకునేవారు. మొదట్లో ఊరికే షికారు కోసం అలా వస్తున్నారేమో అని గ్రామస్తులు భావించారు. కానీ నిత్యం అదే సమయానికి దేవాలయానికి వస్తుండడంతో బుధవారం అనుమానంతో ఆ దేవాలయానికి దారితీశారు. అప్పటికే ఆ యువజంట ఆలయం ఆవరణలో కామకలాపాల్లో నిమగ్నమైంది. గ్రామస్థులు దగ్గరగా రావడాన్ని కూడా గమనించలేనంతగా యువజంట శృంగారంలో తలమునకలయ్యారు. కొద్దిసేపటికి గ్రామస్థులు తమను గమనిస్తున్నట్లు తెలుసుకున్న యువజోడి వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి యత్నించగా పట్టుకుని ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించి వదిలేశారు. కొందరు ఈ వ్యవహారాన్ని మొబైల్ఫోన్లలో బంధించడం గమనార్హం. -
హీరోలు చేస్తే ఒప్పా?
టాలీవుడ్లో కథానాయికగా అడుగుపెట్టడానికి ముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యారు కన్నడ నటి రష్మికా మండన్నా. రక్షిత్‌తో ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది. ‘ఛలో’ తర్వాత తెలుగులో ఆమె చేసిన చిత్రం ‘గీత గోవిందం’. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో ఆమె కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత సినిమాలో మితి మీరిన రొమాన్స్ అవసరమా? అంటూ కొందరు నెటిజన్స్ రష్మికపై కామెంట్స్ విసిరారు. ఈ కామెంట్స్ గురించి రష్మిక స్పందన ఇలా ఉంది. ‘‘గీత గోవిదం’ పోస్టర్స్ చూసి కొందరు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. యాక్టర్‌గా నా ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా? అనిపిస్తోంది. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆన్‌స్క్రీన్‌పై హీరోయిన్స్‌తో హీరోలు రొమాన్స్ చేస్తున్నారు కదా? అది తప్పు కాదా? పెళ్లి చేసుకున్న తర్వాత ఆన్‌స్క్రీన్‌పై హీరోయిన్స్ రొమాన్స్ చేస్తే మాత్రం వాళ్ల గౌరవం తగ్గిపోతుందా? ఈ ఆలోచనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. నేను రక్షిత్‌తో ఎంగేజ్ అయ్యానని, విజయ్ దేవర కొండతో యాక్ట్ చేస్తున్నానని అసూయ పడేవాళ్లే నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారే మో’’ అన్నారు రష్మిక. -
బిజీ బిజీ కాజల్
కాజల్ అగర్వాల్ ఏం చేస్తున్నారు? బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో రెండు సినిమాలు చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు అంటే? హిందీ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో నటిస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు.. కొత్త సినిమాలకు కమిట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంతకీ తాజాగా గ్రీన్ సిగ్నల్ సినిమా ఏంటీ? అంటే.. గోపీచంద్ సరసన ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి దర్శకుడు కుమార్ సాయి. తమిళ సూపర్ హిట్ ‘తని ఒరువన్’ చిత్రదర్శకుడు మోహన్‌రాజా వద్ద కో–డైరెక్టర్‌గా పనిచేశారు కుమార్ సాయి. గోపీచంద్, కాజల్‌తో చేయబోయేది దర్శకుడిగా ఆయనకు తొలి సినిమా. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం మీద కాజల్ బిజీ బిజీగా ఉన్నారు. అన్నట్లు.. ఈ బ్యూటీ హీరోయిన్ అయి దాదాపు పదేళ్లకు పైనే అవుతోంది. స్టిల్ బిజీ అంటే చిన్న విషయం కాదు సుమా. -
మాధవన్‌తో మరోసారి..
తమిళసినిమా: నటి శ్రద్ధా శ్రీనాథ్ నటుడు మాధవన్‌తో మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోంది. కన్నడ చిత్రం యూ టర్న్‌తో పాపులర్ అయిన ఈ కన్నడ భామ కోలీవుడ్‌కు విక్రమ్ వేదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నటుడు మాధవన్‌కు జంటగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. చిత్రం కూడా సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత రిచ్చి అనే ఒక తమిళ చిత్రంలోనే నటించిన శ్రద్ధా శ్రీనాథ్ మాతృభాషలో చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. అంతే కాదు ఒక హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. కాగా తాజాగా కోలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న మాధవన్‌కు జంటగా మరోసారి నటించడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి మార అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు దిలీప్‌కుమార్ పరిచయం కానున్నారు. ఈయన ఇంతకు ముందు కల్కీ అనే లఘు చిత్రాన్ని రూపొందించారన్నది గమనార్హం. త్వరలో కథనాన్ని బిపిన్, మాటలను నీలం అందిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు అరిందుమ్ అరియామలుమ్, పట్టియల్ చిత్రాలకు దర్శకుడు విష్ణువర్ధన్ వద్ద పనిచేశారు. అదేవిధంగా తాజాగా సమంత నాయకిగా నటిస్తున్న సూపర్ డీలక్స్ చిత్రంలో ఆమె పాత్రకు మాటలను రాశారు. మాధవన్, శ్రద్ధాశ్రీనా«థ్ జంటగా నటించనున్న తాజా చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావలసి ఉంది. సాధారణంగా కథలో కొత్తదనం లేకుంటే నటుడు మాధవన్ నటించడానికి అంగీకరించరు. మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్‌ల జంటతో మరోసారి హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారన్న మాట. -
ఏడడుగులేస్తారా?
ప్లేట్లో ఉన్న చాక్లెట్ పుడ్డింగ్ మరో సందర్భంలో అయితే టేస్టీ టేస్టీగా ఉంటుందేమో. ఎదుట ఉన్నది లవర్ అయితే చాక్లెట్ పుడ్డింగ్ కన్నా తన నోటి నుంచి వచ్చే మాటలే తియ్యగా ఉంటాయి. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, హాలీవుడ్ యాక్టర్ సింగర్ నిక్ జోనస్కీ వారి మాటలే తియ్య తియ్యగా అనిపించాయట. ఈ ఇద్దరూ లవ్‌లో పడ్డారని అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ కోడై కూస్తున్నాయి. ఇటీవల ఓ రెస్టారెంట్ కార్నర్ టేబుల్ దగ్గర సెటిలైన ఈ జంట బ్రెడ్ పుడ్డింగ్, కుక్కీస్ ఆర్డర్ చేసుకుని, మాటల మధ్యలో అవి తింటూ కాలక్షేపం చేశారట. రెస్టారెంట్‌కి వెళ్లి ఏమీ తినకపోతే బాగుండదు కాబట్టి, ఫుడ్ ఆర్డర్ చేశారు కానీ, అసలు దాని మీద ధ్యాసే లేనట్లుగా కనిపించారని హాలీవుడ్ మీడియా కథనం. ఆ సంగతలా ఉంచితే.. నిక్ కజిన్ పెళ్లికి ఈ ఇద్దరూ జాయింట్‌గా వెళ్లడం చర్చనీయాంశమైంది. పెళ్లికి వెళితే తప్పా అనుకుంటున్నారేమో? ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని మరీ పెళ్లికి హాజరయ్యారు. న్యూ జెర్సీలోని అట్లాంటిక్ సిటీలో జరిగిన ఈ పెళ్లిలో ఎంటైర్ జోనస్ ఫ్యామిలీ ప్రియాంకకు పరిచయమైందట. ఆ పరిచయాలు ఏర్పడడానికే ప్రియాంకను తమ ఇంటి పెళ్లికి నిక్ తీసుకెళ్లారని టాక్. అన్నట్లు.. ఈ పెళ్లికి చేతిలో చెయ్యేసుకుని ‘కపుల్’ అటెండ్ అయినట్లు అవ్వడం ద్వారా తమ మధ్య సమ్‌థింగ్ ఉందన్న విషయాన్ని ఈ ఇద్దరూ చెప్పదలిచారా? అనే ఊహాగానాలు లేకపోలేవు. మరి.. ప్రియాంక, నిక్ ఏడడుగులేస్తారా? ఈ ఇద్దరి కహానీ ఎందాకా వెళుతుందో చూద్దాం. -
ఏడేళ్ల తరువాత.. ఆ నటి మళ్లీ..!
సాక్షి, చెన్నై: ఏడేళ్ల తర్వాత నూతన ఉత్సాహంతో హీరోయిన్ మమతా మోహన్‌దాస్ మళ్లీ తెరపైకి రానుంది. ఆమె చాలా మంది యువతకు స్పూర్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ మహమ్మారిని జయించి నిలిచిన అతికొద్ది మందిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. పలు చిత్రాలో నటించిన ఈ నటి తాజాగా తన రీఎంట్రీని మొదలెట్టింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో రెండు అవకాశాలను దక్కించుకుంది ఈ బ్యూటీ. అందులో ఒకటి డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశం. ఆయన నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం నిర్మాణంలో ఉంది. కార్తీక్ సుబ్బారాజ్ దర్శకత్వంలో మెర్కురీ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఆయన మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా నటి మమతా మోహన్‌దాస్ నటిస్తోంది. ఆ చిత్రానికి ఊమై విళిగల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. మరో చిత్రాన్ని కూడా ఆమె అంగీకరించింది. పార్థిబన్ స్వీయ దర్శకత్వంలో నటించనున్న ఉళై వెళియో 2 చిత్రంలో ఆయనకు జంటగా నటించబోతుంది. ఈ చిత్రాల విడుదల తర్వాత ఈ అమ్మడిని మరిన్ని అవకాశాలు వరించే అవకాశం ఉందని చెప్పవచ్చు. -
ఆమె రూటే సెపరేటు..
సాక్షి, చెన్నై: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ రూటే సెపరేటు. ఆటైనా, పాటైనా, హీరోయిన్‌గానైనా, ఆ మాటకొస్తే అతిథి పాత్రలో మెరవడానికైనా, ప్రతినాయకిగా మారడానికి రెడీ అంటారీ భామ. హీరో శింబుతో కలిసి రొమాన్స్ చేసిన తొలి చిత్రం పోడాపోడీ పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. అందుకే రాశి లేని నటి అనే ముద్ర పడింది. అయినా డోంట్‌కేర్ అంటూ నటిగా ముందుకు సాగిన ఆమెకు బాలా చిత్రం తారైతప్పట్టేలో తన సత్తా చాటుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ చిత్రం ప్రేక్షకాదరణను అంతగా పొందకపోయినా వరలక్ష్మీ నటనకు మాత్రం కోలీవుడ్ ఫిద్యా అయ్యిపోయింది. ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఒక్క తమిళంలోనే మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి ధనుష్‌తో కలిసి నటిస్తున్న మారి-2 చిత్రం. ఈ సినిమాలో సాయిపల్లవి, టోవినో థామస్, వరలక్ష్మీ శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరిగింది. వీరిలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రతినాయకిగా కనిపించనున్నారట. ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఒకవైపు నచ్చిన పాత్రల్లో నటిస్తూ, మరోవైపు మహిళా హక్కుల కోసం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరుడుతున్నారు. అందుకు సేవ్ శక్తి పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి మహిళలకు నేనున్నానంటూ భరోసానిస్తున్నారు. ఇలా తన రూటే వేరు అంటూ సహ హీరోయిన్లలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. -
అజిత్‌తో రొమాన్సా?
తమిళసినిమా: నటుడు అజిత్‌తో రొమాన్సా? నేనా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది వర్థ్ధమాన నటి ఆద్మియ. ఈ బ్యూటీకి అజిత్ తాజా చిత్రం విశ్వాసంలో నటించే అవకాశం వచ్చిందని సోషల్‌మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. వివేకం తరువాత అజిత్, దర్శకుడు శివ నాలుగోసారి కలిసి పనిచేయనున్న విషయం తెలిసిందే. వివేకం నిర్మాత టీజీ.త్యాగరాజన్నే తన సత్యజ్యోతి ఫిలిం పతాకంపై విశ్వాసం చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫ్రీ పొడక్షన్స్ కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ చిత్రం ఈ నెల 22న సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. మరోసారి దాదాగా.. అజిత్ మరోసారి విశ్వాసం చిత్రంలో దాదాగా కనిపించనున్నారని సమాచారం.ఈసారి ఆయన ఉత్తర చెన్నై దాదాగా దుమ్మురేపనున్నారట. ఇందులో హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను చిత్ర యూనిట్ ఇంకా వెల్లడించలేదు.సోషల్‌మీడియాల్లో మాత్రం రకరకాల ప్రచారం జరుగుతోంది. అనుష్క నటించే అవకాశం ఉందని, విలన్‌గా విజయ్ ఏసుదాస్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అజిత్ చిత్రంలో తాను నటించడం లేదని ఏసుదాస్ స్పష్టం చేశారు. తాజాగా ఆద్మికను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. తమ అభిమాన హీరో సరసన ఆద్మిక లాంటి వర్థమాన నటిని వారు ఊహించుకోలేకపోతున్నారు. ఇలాఉండగా ఆద్మిక కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అజిత్‌తోనే? నేనా? ఎవరు చెప్పారు? నాకే తెలియదే? అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది. దీంతో విశ్వాసం చిత్రంలో హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే త్వరలోనే విశ్వాసం చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
సూర్యతో మీరామిథున్ రొమాన్స్
తమిళసినిమా: సూర్యతో రొమాన్స్ చేసే లక్కీఛాన్స్‌ను నటి మీరామిథున్ కొట్టేసింది. మిస్ ఫెమీనా సౌత్ కిరీటాన్ని గెలుచుకున్న ఆ బ్యూటీ, మోడలింగ్ రంగంలో వెలిగి ప్రస్తుతం వెండి తెరపై రాణించే పనిలో పడింది. అలా 8 తూట్టాకల్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఆ తమిళ చిన్నది తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత అవకాశాలేవనుకుంటున్న సమయంలో స్టార్ నటుడు సూర్యతో జతకట్టే అవకాశం తలుపు తట్టిందట. ప్రస్తుతం ఆయనతో తానాసేర్న్‌ద కూటం చిత్రంలో నటిస్తోంది. అదేమిటీ ఈ చిత్రంలో కథానాయకి కీర్తీసురేశ్ కదా అని ఆశ్యర్యపోతున్నారా? మరేంలేదు కీర్తీతో పాటు మీరా మిథున్‌ను తానాసేర్న్‌దకూటం చిత్రంలో చూడవచ్చు. ఈ చిత్రంలో నటించడం గురించి మీరామిథున్ చెబుతూ సూర్యకు జంటగా ఇందులో నటించే అవకాశం రావడానికి కారణం 8 తూట్టాకల్ చిత్రమేనని పేర్కొంది. చాలా రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్ తనను అప్రోచ్ అయ్యారని చెప్పింది. ఇందులో తన పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి చెప్పను గానీ, పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందని చెప్పింది. తానా సేర్న్‌దకూటం చిత్రంలో సూర్యతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉందని అంది. నటి నయనతార లవర్‌గా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య చిత్ర నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టెయిన్మెంట్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. -
డాన్సింగ్ కింగ్‌తో రొమాన్స్‌కు..
తమిళసినిమా: నృత్యదర్శకుడిగా దుమ్మురేపిన ప్రభుదేవా ఆ తరువాత దర్శకుడిగా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ వరకూ సంచలనం సృష్టించారు. తాజాగా కథానాయకుడిగా యమ బీజీ అయిపోయారు. రెండు మూడు చిత్రాలు షూటింగ్లో మరో రెండు మూడు చిత్రాలు కమిట్మెంట్లో ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చదరం 2 చిత్రం ఫేమ్ దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ తాజా చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటించనున్నారు. ఇందులో నివేదాపేతురాజ్ ఆయనతో రొమాన్స్ చేసే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రం ఒరునాళ్ కూత్తు చిత్రంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల నటించిన పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణను పొందలేకపోయింది. దీంతో జయం రవితో జత కడుతున్న టిక్ టిక్ టిక్ చిత్రంపైన చాలా అశలు పెట్టుకుంది. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అంతరిక్షంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కుతోంది. దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ ఇటీవల నటి నివేదాపేతురాజ్ను కలిసి కథను వినిపించారట. కథ నచ్చడంతో పాటు ప్రభుదేవాతో నటించడానికి ఈ అమ్మడు చాలా ఆసక్తిని కనబరచిందట. ఈ విషయాన్ని దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశాన్ని నివేదా పేతురాజ్ కొట్టేసిందన్నమాట. -
గీత రచయితతో ఓవియ
తమిళసినిమా: ప్రముఖ గీత రచయితతో రొమాన్స్ చేయడానికి నటి ఓవియ రెడీ అవుతోంది. ఒక మోస్తరు కథానాయకి ఓవియను బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో పెద్ద స్టార్‌ను చేసేసింది. ఇంతకు ముందు లేని మార్కెట్ ఒక్కసారిగా ఈ బ్యూటీ సొంతమైంది. ఇంకా చెప్పాలంటే దీపావళి వాణిజ్య ప్రకటనలో ఓవియనే ముందంజలో ఉంది. ఒక వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా అంగీకరించిన ఓవియ అందుకుగానూ ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం అందుకుందనే ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. ఇక బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో నుంచి బయటకొచ్చిన తరువాత నటి ఓవియకు సినీ అవకాశాలు వరుస కడుతున్నాయి. వాటిలో తాజాగా ఒక చిత్రం చేరింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో కథానాయకుడిగా బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో చివరి వరకూ పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రముఖ గీత రచయిత స్నేహన్ నటించనున్నారు.ç మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఎంగేయుమ్ ఎప్పోదుమ్, తీయవేలై చేయనుమ్ కుమారు, నెడుంశాలై, ఇవన్‌వేరమాదిరి వంటి పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సి.సత్య నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. -
మేము పబ్లిక్ సొత్తు కాదు.
తమిళసినిమా: మేము పబ్లిక్ సొత్తు కాదని అంటోంది నటి ఇలియానా. ఈ గోవా బ్యూటీ కోలీవుడ్‌లో కేడీ చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చినా హిట్ ఖాతాను ప్రారంభించింది మాత్రం టాలీవుడ్లోనే. అక్కడ దేవదాసు చిత్రంతో రంగప్రవేశం చేసిన ఇలియానాకు ఆ చిత్ర విజయం వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం కలిగించలేదు. టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో మళ్లీ కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా నన్భన్ చిత్రంలో నటించే అవకాశం తలుపుతట్టింది. అయితే అంతకుముందు పలు ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వచ్చినా ఇలియానా అంగీకరించలేదనే ప్రచారం జరిగింది. కారణాలేమైనా నన్బన్ చిత్రం తరువాత కూడా ఇలియానా కోలీవుడ్‌లో కనిపించలేదు. ఆ తరువాత టాలీవుడ్‌కు దూరమై బాలీవుడ్లో తెలింది. ఇప్పటికీ హిందీ చిత్రాలనే నమ్ముకున్న ఇలియానాపై బోలెడన్ని వదంతులు ప్రచారమై అవి సినీ జనాలకు చాలా ఎంటర్టెయిన్ ఇచ్చాయి. అందులో ఒకటి ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో జరుపుతున్న ప్రేమాయణం అంశం. చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు తన ప్రచారాల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుకుంటున్నారు. తమ గ్లామరస్ ఫొటోలను అందులో పోస్ట్ చేసి అభిమానుల దృష్టిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా నటి ఇలియానా కూడా తన లవర్ ఆండ్రూతో రొమాంటిక్‌గా ఉన్న ఫొటోలను ఇన్స్ట్ర్రాగాంలో పోస్ట్ చేసి ప్రచారం పొందే ప్రయత్నం చేసింది. అయితే అది బెడిసి కొట్టినట్లుంది. ఈ అమ్మడి గురించి వదంతుల పర్వం తీవ్రం అవడంతో తలనొప్పిగా మారిందట. దీంతో వదంతుల రాయుళ్లపై ఇలియానా ఆగ్రహంతో ఊగిపోతోందట. నిజమే హీరోయిన్లు సెలబ్రిటీలే. అయితే వారేమీ పబ్లిక్ సొత్తు కాదు. తామూ మనుషులమే. తమకు పర్సనల్ జీవితం అంటూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించరూ? స్త్రీలమన్న భావనతో తమకు కాస్త గౌరవం ఇవ్వండి అంటూ చిర్రుబుర్రులాడుతోందట. మరి లవర్‌తో ఉన్న రొమాంటిక్ ఫొటోలను ఇన్స్ట్ర్రాగాంలో పోస్ట్ చేసే ముందు ఈ విషయాల గురించి ఎందుకు ఆలోచించలేదు ఈ అమ్మడు అన్న అభిమానుల ప్రశ్నకు ఇలియానా వద్ద బదులు లేదట. మొత్తం మీద బాయ్‌ఫ్రెండ్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్ల డించిన ఇలియానా ప్రకటనతో తన నట జీవితానికి ఎఫెక్ట్ అవుతుందని భావించి ఆయనతో పెళ్లిని వాయిదా వేసుకుందట. -
విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై
తమిళసినిమా: విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయడానికి బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్ సై అందని తాజా సమాచారం. నటి సాయేషా ప్రయత్నాలు ఫలించాయి. వనమగన్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు ఆ చిత్రం మంచి ప్రశంసలనే అందించింది. అంతే కాదు ఆ చిత్ర విడుదలకు ముందే విశాల్, కార్తీ కలిసి నటించే మల్టీస్టారర్ చిత్రం కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రంలో నటించే అవకాశం రావడంతో తన లక్కుకు తెగ సంబరపడిపోయింది భామ. ఇక ఇక్కడ తన కెరీర్‌కు డోకాలేదే నిర్ణయానికి వచ్చేసింది. అయితే ఆ చిత్రం డ్రాప్ అవడంతో ఒక్కసారిగా నీరసించిపోయింది. కాగా ఇటీవల చెన్నైకి వచ్చిన సాయేషా తాను దర్శకుడు విజయ్‌ని కలవడానికే ప్రత్యేకంగా చెన్నైకి వచ్చానని, వనమగన్ చిత్రం సమయంలో ఆయ న తనను ఒక సహోదరుడిగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారని, అందుకే ఆయనకు రాఖీ కట్టడానికి వచ్చానంటూ చాలానే చెప్పేసింది. కాగా అసలు విషయం ఏమిటం టే సాయేషా సైగల్ చెన్నైకి అవకాశాల వేటలో భాగంగానే వచ్చిందన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. మొత్తం మీద తన ప్రయత్నం ఫలించింది. తాజా గా సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశాన్ని సాయేషా దక్కించుకుంది. ఇంతకు ముందు విజయ్‌సేతుపతి హీరోగా ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గోకుల్ తాజాగా అదే హీరోతో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో విజయ్‌సేతుపతి డాన్‌గా నటించనున్నారు. న టి సాయేషా ప్యారిస్‌లో పుట్టి పెరి గిన అమ్మాయిగా నటించనుందట. ఈ చిత్రానికి జంగా అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్ర కథ అధిక భాగం ప్యారిస్ నగరంలో జరుగుతుందట. ప్యారి స్ వెళ్లిన విజయ్‌సేతుపతికి సాయేషాకు ఎలా పరిచయమైంది, అది వారి మధ్య ప్రేమకు ఎలా కారణమైంది? అన్న పలు ఆసక్తికరమైన సన్నివేశాలు జంగా చిత్రంలో చోటు చేసుకుంటాయట. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. -
శ్రీకాంత్‌తో నికిషాపటేల్
నటి నికిషాపటేల్ నటుడు శ్రీకాంత్‌తో రొమాన్స్ చేస్తోంది. శ్రీకాంత్‌కు నటుడిగా చిన్న గ్యాప్ వచ్చింది.అదే విధంగా నికిషాపటేల్కు పెద్దగా అవకాశాలు లేవు.కాగా ఈ జంట తాజాగా ఒక హిందీ చిత్రానికి సీక్వెల్‌గా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కతున్న చిత్రంలో నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కేసీ.బొకాడియా 1985లో రూపొందించిన చిత్రం తెరి మెహర్బెనియన్. జాకీష్రాఫ్, పూనం దిల్లాన్ జంటగా నటించిన ఈ చిత్రంలో ఒక జాగిలం కూడా ముఖ్యపాత్రను పోషించింది. 32 ఏళ్ల తరువాత ఆ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. అదీ తమిళ, తెలుగు భాషల్లో. ఈ చిత్రం గురించి నటుడు శ్రీకాంత్ తెలుపుతూ ఈ చిత్ర షూటింగ్‌ను ఇప్పటికే చెన్నై, హైదరాబాద్‌లలో 20 శాతం పూర్తి చేశామని తెలిపారు. మర్డర్ మిస్టరీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలిపారు. నికిషాపటేల్ తెలుపుతూ మెరి మెహర్మెనియన్ చిత్రానికి ఇది సీక్వెల్ అయినా, ఆ చిత్రానికి తాము నటిస్తున్న చిత్రానికి సంబంధం ఉండదని అన్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో తన పాత్ర శ్రీకాంత్ పాత్రకు సమానంగా ఉంటుందని చెప్పారు. సాధారణంగా బొకాడియా చిత్రాల్లో హీరోహీరోయిన్ల మధ్య మంచి రొమాన్స్ సన్నివేశాలు ఉంటాయన్న విషయం తెలిసిందేనన్నారు. అలాంటివి ఈ చిత్రంలోనూ ఉంటాయని తెలిపారు. ఇందులో శ్రీకాంత్‌కు తనకు మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుందని నికిషాపటేల్ పేర్కొంది. -
షారుక్‌తో రొమాన్స్ ఈజీ: నటి
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌తో ఆన్ స్క్రీన్ రోమాన్స్ చేయడం సులభం అని బాలీవుడ్ నటి అనుష్కా శర్మ అభిప్రాయపడింది. అతని కళ్లలో నిజాయితీ కనబడుతుందని అది మనం స్క్రీన్‌పై చూడవచ్చని, షారుక్ చివరికి మైక్రోఫోన్‌తో కూడా రొమాన్స్ చేయగలడని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. దీనికి షారుక్ నువ్వు మైక్ పట్టుకున్నంత కాలం రొమాన్స్ చేయగలను డార్లింగ్ అని రిప్లే ఇచ్చాడు. రబ్ నే బనా దీ జోడీ(2008), జబ్ తక్ హై జాన్ (2012) చిత్రాల్లో నటీనటులుగా నటించిన షారుక్, అనుష్కా జంట అప్‌కమింగ్ చిత్రం ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ తో ఆగష్టు 4 న ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే. చిత్రంలోని హావాయిన్ సాంగ్‌ను షారుక్, అనుష్కలు విడుదల చేశారు. ఈ పాటలో హ్యారీ అండ్ సెజల్ మధ్య మంచి రొమాన్స్ ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు ఈ బాలీవుడ్ నటులు. షారుక్ తన ఇన్ స్ట్రాగ్రమ్‌లో పోస్టు చేయగా, అనుష్కా మ్యూజిక్ కంపోజర్ ప్రీతమ్‌తో రిలీజ్ చేసింది. తనను కేవలం ప్రేమకథా చిత్రాలకే అభిమాని అని అందరూ భావిస్తున్నారు. కానీ ప్రేమతో పాటు కామెడీ సినిమాలను కూడా ఇష్టపడుతానని షారుక్ చెప్పుకొచ్చాడు. -
ఆశలన్నీ ఆ రెండింటి పైనే..! : నటి
బహుభాషా నటీనటులుగా పేరుతెచ్చుకుంటే ఆ క్రేజే వేరు. ముఖ్యంగా అలాంటి హీరోయిన్లకు డిమాండ్ పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. నటి నయనతార, అనుష్క, తమన్నా, కాజల్‌అగర్వాల్, సమంత వంటి తారలింకా అగ్రనాయికలుగా రాణించడానికి ఇదే కారణం. ఒక భాషలో అవకాశాలు తగ్గు ముఖం పట్టినా మరో భాషలో చేతి నిండా చిత్రాలుంటాయి. ఇప్పుడు నటి రకుల్‌కు అందని స్థాయి ఇదే. తొలుత కోలీవుడ్‌కే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండు మూడు చిత్రాల్లో నటించినా ఆదరణ లభించలేదు. దీంతో పొరుగు భాష తెలుగులో దృష్టి సారించి అక్కడ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ నాయకిగా రాణిస్తున్నా, కోలీవుడ్‌లో గెలవలేక పోయాననే చింత వెంటాడుతూనే ఉందట. తాజాగా కోలీవుడ్‌లోనూ రకుల్‌ప్రీత్‌సింగ్‌కు అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఏఆర్.మురుగదాష్ దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో మహేశ్‌బాబుతో రొమాన్స్ చేస్తోంది. మధ్యలో విశాల్‌కు జంటగా మిష్కిన్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినా కాల్షీట్స్ సమస్య కారణంగా దాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఆ చిత్రం పోయిందన్న బాధను మరచిపోయేలా కార్తీతో ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంలో అవకాశం వరించింది. చతురంగవేట్టై చిత్రం ఫేమ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ పోలీస్ అధికారిగా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా పోలీస్ పాత్రలో కనిపించనుందట. కాగా ఈ రెండు చిత్రాలతోనే కోలీవుడ్‌లో తన భవిష్యత్ ఆధారపడి ఉందని రకుల్ ప్రీతిసింగ్ భావిస్తోందట. ఇక్కడ కూడా ఒక మంచి హిట్ వస్తే మరో కొన్నేళ్లు అగ్రనాయకిగా లాగించేయవచ్చన్నది ఈ అమ్మడు కలలు కంటోందట. -
ప్రభాస్‌తో పూజాహెగ్డే రొమాన్స్?
ప్రభాస్ ఈ పేరు ఇంతకు ముందు టాలీవుడ్‌కే పరిమితం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. అందుకు ఏకైక కారణం బాహుబలి. ముఖ్యంగా బాహుబలి– 2 చిత్రం తరువాత ప్రభాస్‌తో చిత్రాలు నిర్మించడానికి బాలీవుడ్ నిర్మాతలతో సహా పలువురు పోటీ పడుతున్నారు. ఇకపై ఆయన ఒక్క భాషకు చెందిన చిత్రంలో నటించరేమో. కాగా ప్రస్తుతం ప్రభాస్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మొదలగు నాలుగు భాషల్లో నిర్మాణం అవుతున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. సాహో పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజిత్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. కాగా ఈ చిత్రంలో ఇంకా కథానాయకి ఎంపిక కాలేదు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు వినిపించినా, తాజాగా ఆ అవకాశం నటి పూజా హెగ్డేను వరించినట్లు సమాచారం. ఈ ఉత్తరాది బ్యూటీ కోలీవుడ్‌లో ఇంతకు ముందు జీవాకు జంటగా ముగముడి చిత్రంతో దిగుమతి అయ్యింది. అదే విధంగా బాలీవుడ్లో హృతిక్‌రోషన్‌కు జంటగా మొహంజధారో చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు అమ్మడికి నిరాశనే మిగిల్చాయి. అయితే తెలుగులో నటిగా మంచి పేరునే సంపాదించుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం అక్కడ అల్లుఅర్జున్‌తో డీజే చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. తాజాగా ప్రభాస్‌తో డ్యూయెట్లు పాడటానికి సిద్ధం అవుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. సాహో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ఈ భాషలన్నింటిలోనూ పరిచయం ఉన్న నటి అయితే బాగుంటుందన్న చిత్ర వర్గాల భావన నటి పూజాహెగ్డేకు కలిసొచ్చి ఉండవచ్చుననే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని వెల్లడించలేదన్నది గమనార్హం. -
హుమ ఖురేషీకి సూపర్ చాన్స్
నటి హుమ ఖురేషీ సూపర్ చాన్స్ కొట్టేసిందా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఢిల్లీలో పుట్టి పెరిగి చదివిన ఈ అమ్మడు ముంబైలో మోడలింగ్ చేసింది. అలా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దృష్టిలో పడడంతో ఈ బ్యూటీ ఫ్యూచర్ రొట్టే విరిగి నేతిలో పడ్డ చందంగా మారిపోయింది.ఆయన దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రంలో నాయకిగా మారిపోయింది. ఆ తరువాత త్రిష్ణ, బదలాపూర్, జాలీ ఎల్ఎల్బీ 2 చిత్రాలతో పాపులర్ నాయకి అయ్యింది. ఆ మధ్య మమ్ముట్టికి జంటగా వైట్ అనే చిత్రం ద్వారా మాలీవుడ్‌కు పరిచయమైన హుమ ఖురేషీ అదృష్టం తేనెతుట్టెలా పట్టిందని చెప్పవచ్చు.కారణం త్వరలో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది.అదీ అలాంటి ఇలాంటి హీరోతో కాదు.స్టార్‌స్టార్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేసే లక్కీచాన్స్‌ను దక్కించుకున్నట్లు తాజా సమాచారం. 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ తాజాగా కబాలి 2కు రెడీ అవుతున్నారన్న విషయం తెలిసిందే. కబాలి చిత్రం ఫేమ్ రంజిత్‌నే ఈ చిత్రానికి దర్శకుడు.కాగా రజనీకాంత్ అల్లుడు, స్టార్ నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ ఇప్పటికే సంగీత బాణీలు కడుతున్నారు. చిత్రం ఈ నెల 28న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులో రజనీకాంత్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఇప్పటికే నయనతార, దీపికాపదుకోనే, విద్యాబాలన్ వంటి టాప్ నటీమణుల పేర్లు ప్రచారంలో హల్చల్ చేశాయి. చివరికి ఆ అదృష్టం నటి హుమ ఖురేషీకి దక్కినట్లు తాజా సమాచారం. ఇందులో బాహుబలి 2 చిత్రానికి పని చేసిన హాలీవుడ్ సాంకేతిక వర్గంలో పీటర్ డ్రపర్ బృందం వీఎఫ్ఎక్స్ను అందించనున్నట్ల తెలిసింది.ఇప్పటికే హాజీ మస్తాన్ ఇతివృత్తంతో తెరకెక్కనున్న చిత్రంగా కలకలం పుట్టిస్తున్న ఈ చిత్రం కోసం ముంబైలోని ధారవి ప్రాంతం సెట్‌ను చెన్నైలో రూపొందించారు. అందులో చిత్ర ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించడానికి కబాలి 2 చిత్ర యూనిట్ సిద్ధం అవుతునట్లు తాజా సమాచారం. -
96కి సిద్ధమవుతున్న త్రిష
చెన్నై చిన్నది త్రిష త్వరలో విజయ్‌సేతుపతితో 96కి సిద్ధం అవుతున్నారు. మోహిని, చదరంగవేటై్ట 2 చిత్రాలను పూర్తి చేసి వేసవి విడుపుకు అమెరికా చెక్కేసిన ఈ అమ్మడు తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. వరుస విజయాలతో మంచి జోరులో ఉన్న నటుడు విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయనున్నారు. వీరి చిత్రానికి 96 అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. ఇంతకు ముందు జయంరవి, హన్సిక నటించిన రోమియో జూలియట్, విశాల్, తమన్నా జంటగా నటించిన కత్తిసండై, విక్రమ్‌ప్రభు హీరోగా వీరశివాజీ వంటి చిత్రాలను నిర్మించిన మెడ్రాస్ ఎంటర్ ప్రైజస్ అధినేత ఎస్.నందగోపాల్ ప్రస్తుతం విశాల్ కథానాయకుడిగా మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావస్తున్న దశలో తాజాగా విజయ్‌సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా 96 చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రేమ్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన పసంగ, నడువుల కొంచెం పక్కత్తుకానోమ్, సుందరపాండియన్ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేశారన్నది గమనార్హం. ఈ 96 చిత్రం ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది విభిన్న కథాంశంతో కూడిన ప్యూర్ లవ్ స్టోరీగా ఉంటుందన్నారు. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందనీ, చిత్రం త్వరలో కుంభకోణంలో ప్రారంభం కానుం దని వెల్లడించారు. దీనికి షణ్ముగసుం దరం ఛాయాగ్రహణను, గోవిందమోహన్ అందించనున్నారు. -
పదేళ్ల తర్వాత మొదటి హీరోతో...
తెలుగులో కాజల్ అగర్వాల్ తొలి హీరో కల్యాణ్ రామ్. ఈ నందమూరి హీరో నటించిన ‘లక్ష్మీ కల్యాణం’ ద్వారా ఆమె కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత ఆమె మళ్లీ కల్యాణ్‌రామ్ సరసన హీరోయిన్గా నటించనున్నారని టాక్. ఉపేంద్ర మాధవ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘ఎమ్మెల్యే’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే టైటిల్ పరిశీలనలో ఉందట. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌కు జోడీగా కాజల్‌ను ఎంపిక చేశారట. ఇదిలా ఉంటే.. తొలి చిత్రదర్శకుడు తేజ దర్శకత్వంలో ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో కాజల్ నటిస్తున్నారు. ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమాలో నటించనున్నది నిజమే అయితే.. తొలి దర్శకుణ్ణే కాదు.. హీరోనూ రిపీట్ చేసినట్లవుతుంది. -
ఆ ఇద్దరితో సాయేషా రొమాన్స్
బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్‌కు కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు విజయ్ దర్వకత్వం వహిస్తున్న వనమగన్ చిత్రంలో జయంరవితో రొమాన్స్ చేస్తున్నారు. ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్‌కుమార్ మనవరాలు అయిన సాయేషా ఇప్పటికే తెలుగులో అఖిల్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. తాజాగా విశాల్, కార్తీలతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. విశాల్,కార్తీ కలిసి ఒక చిత్రం చేయనున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మల్టీస్టారర్ చిత్రానికి మరోస్టార్ నటుడు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న విషయం ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి త్వరలో ముహూర్తం కుదరనుంది. జూన్‌లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. దీనికి కరుప్పురాజా వెళ్లైరాజా అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఒక కథానాయకిగా నటి సాయేషా నటించనున్నారన్నది తాజా సమాచారం. గత ఏడాది దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో నెగ్గిన విశాల్ జట్టు సంఘ భవన నిర్మాణ నిధి కోసం ఒక చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అందులో విశాల్, కార్తీ కలిసి నటించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల సంఘ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంలో కూడా కార్యదర్శి విశాల్ తాను కార్తీ కలిసి రూ.10 కోట్ల నిధిని అందించనున్నట్లు ప్రకటించారు. తాము కలిసి నటించనున్న చిత్రాన్ని నడిగర్ సంఘం తరఫున నిర్మిస్తారా? లేక వేరే నిర్మాత చేస్తారా?అన్నది తెలియాల్సిఉంది.అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సిఉంది. -
మిల్కీబ్యూటీని కంటతడి పెట్టించిన స్కెచ్
కొన్ని సినిమా కథలు ఆర్టిఫిషియల్ అనిపిస్తే మరి కొన్ని హార్ట్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ రెండవ కోవకు చెందిన కథలో తాను నటిస్తున్నానంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. బాహుబలి చిత్రంతో బ్రహ్మాండమైన పాపులారిటీని పెంచుకున్న ఈ భామ ఆ తరువాత ఆ స్థాయి పాత్రల్లో నటించలేదు. తాజాగా విక్రమ్‌తో రొమాన్స్ చేస్తున్నారు. విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్కెచ్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో విక్రమ్ సంఘ విద్రోహుల్ని స్కెచ్ వేసి అంతం చేస్తారట. మదురై నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా ఉత్తరచెన్నై నేపథ్యంలో వరుసగా చిత్రాలు రూపొందుతున్నాయి. ధనుష్ హీరోగా వడచెన్నై, కృష్ణ నటిస్తున్న వీరా, శుశీంద్రన్ దర్శకత్వంలో శత్రు చిత్రాలు ఉత్తర చెన్నై నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాలే. విక్రమ్, తమన్నాల చిత్రానికి ఇదే నేపథ్యం అట. ఇంతకు ముందు గ్లామర్‌కు ప్రాముఖ్యతనిస్తూ నటించిన తమన్నా ఈ చిత్రంలో స్లమ్ ఏరియా యువతిగా చాలా సహజత్వంతో కూడిన పాత్రను పోషిస్తున్నారట. ఈ కథ విన్నప్పుడే అమ్మడు కళ్లు చమర్చాయట. బాహుబలి చిత్రం తరువాత అంతగా నటనకు అవకాశం ఉన్న పాత్రను ఈ స్కెచ్ చిత్రంలో చేస్తున్నారట. విక్రమ్‌కు జంటగా నటించడమే చాలా ఎగ్జైట్‌గా ఫీలైన ఈ మిల్కీబ్యూటీ ఇప్పుడు ఇంత మంచి పాత్రలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెగ మురిసిపోతుందట. ఇక సంచలన నటుడు శింబుతో నటిస్తున్న అన్బానవన్ అసరాదవన్ అడంగాదన్ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుందట.అలాగే బాహుబలి–2 ఏప్రిల్ 28న తెరపైకి రావడానికి బ్రహ్మాండంగా ముస్తాబవుతోంది. -
అవకాశమొస్తే ఆయనతో చేస్తా!
ఆ కథానాయకుడితో నటించడానికి ఏ మాత్రం సందేహించను అంటున్నారు నటి సోనాక్షిసిన్హా. దక్షిణాది భామలు బాలీవుడ్ మోహంలో పడుతుంటే. అక్కడి బ్యూటీస్ దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతుండడం విశేషం. నటి దీపికాపదుకునే, సోనాక్షి సిన్హా, ప్రియాంకాచోప్రా, కంగనారావత్ వంటి బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇప్పటికే కోలీవుడ్ చిత్రాల్లో నటించారన్నది తెలిసిందే. వీరంతా మళ్లీ తమిళ చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా వారసురాలైన సోనాక్షి సిన్హా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా లింగా చిత్రంలో నటించారు. ఇక దీపికాపదుకోనే కోచ్చడైయాన్ చిత్రంలో సూపర్‌స్టార్‌తో రొమాన్స్ చేశారు. వీరిద్దరిని మళ్లీ మళ్లీ కోలీవుడ్ చిత్రాల్లో నటించాలని ఇక్కడి దర్శక నిర్మాతలు కోరుకుంటున్నారు. ఇప్పటికే సంఘమిత్ర అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో జయంరవి, ఆర్యలకు జంటగా నటించజేయడానికి దర్శకుడు సుందర్.సీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటి సోనాక్షిసిన్హాను ఇళయదళపతి విజయ్ సరసన నటింపజేసే ఆలోచనలో దర్శకుడు ఏఆర్.మురుగదాస్ ఉన్నట్లు తాజాసమచారం. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన 61వ చిత్రం. దీని తరువాత ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇందులో సోనాక్షిసిన్హాను నాయకిగా ఎంపక చేసే పనిలో యూనిట్ వర్గాలు ఉన్నట్లు సమాచారం. దీని గురించి ఇటీవల చెన్నైకి వచ్చిన సోనాక్షిసిన్హాను అడగ్గా విజయ్‌కు జంటగా నటించడానికి తాను ఏ మాత్రం సంశయించను అన్నారు. అదీ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడం అంటే చాలా ఇష్టం అన్నారు. ఆయన దర్శకత్వంలో ఇప్పటికే హిందీలో అకిరా, హాలీడే చిత్రాల్లో నటించాను. తనను హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటింపజేసిన దర్శకుడాయన. ఇంకా చెప్పాలంటే తనకు తమిళ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి చాలా ఉందన్నారు. తమిళంలో తింగా చిత్రంలో నటించానని, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడం వల్ల తాను బాధ పడడం లేదని అన్నారు. కారణం అందులో కొందరు అద్భుత వ్యక్తులతో పని చేసే అవకాశం కలిగిందని అన్నారు. రజనీకాంత్‌తో నటించడం చాలా గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. రజనీకాంత్, ఏఆర్,.మురుగదాస్ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. తాను విజయ్ నటించిన తుపాకీ, కత్తి చిత్రాలను చూశానన్నారు. విజయ్ ఉత్తమ నటుడని పొగడ్తల్లో ముంచెత్తారు.ఆయనతో నటించే అవకాశం వస్తే ఏ మాత్రం సందేహించకుండా అంగీకరిస్తానని సోనాక్షిసిన్హా పేర్కొన్నారు. -
అది అత్యాచారం కాదు: హైకోర్టు
న్యూఢిల్లీ: వివాహానికి ముందే పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని, ఆ తర్వాత పురుషుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదని అతనిపై అత్యాచారం కేసు పెడితే అది చెల్లదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. శృంగారం తర్వాత ఎదురయ్యే పరిణామాలపై స్త్రీకి పూర్తి అవగాహన ఉంటుందనీ, ఆమెను పెళ్లి చేసుకోవచ్చు లేదా నిరాకరించవచ్చని తెలిసినా కలయికకు ఒప్పుకోవడం ఆమె తప్పే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిపై 26 ఏళ్ల మహిళ ఇలాంటి కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో రెండుసార్లు శృంగారం చేశాక, ఇప్పడు పెళ్లికి ఒప్పుకోవడం లేదనీ, ఫోన్ లో కూడా మాట్లాడటం లేదని ఆమె ఆరోపించింది. -
నాన్న ముందే రొమాన్స్ చేశా!
తన తండ్రి ముందే రొమాన్స్ సన్నివేశాల్లోనటించానని నటి ఐశ్వర్యా అర్జున్ తెలిపారు. యాక్షన్ కింగ్ అర్జున్ వారుసురాలైన ఈ బ్యూటీ విశాల్‌కు జంటగా పట్టత్తుయానై చిత్రం ద్వారా నాయకిగా రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఐశ్వర్యకు అవకాశాలు రాలేదు.అయితే తన తండ్రి చిత్రాల నిర్మాణ బాధ్యతల్లో పాలు పంచుకుంటూ వచ్చిన ఈ భామ మరో సారి హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు.అర్జున్ తన కూతురు హీరోయిన్ గా తమిళం,కన్నడం భాషల్లో స్వీయ దర్శకత్వంలో కాదలిన్ పొన్ వీధియిల్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ హీరోగా పేరు గాంచిన అర్జున్ ఈ చిత్రాన్ని ఫుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కించడం విశేషం.ఈ చిత్రం గురించి నటి ఐశ్వర్య మాట్లాడుతూ కాదలిన్ వీధియిల్ చిత్రం ప్యూర్ లవ్‌స్టోరీగా ఉంటుందన్నారు.ఇందులో తనకు నటుడు శాంతనుకు సమానంగా పాత్రలు ఉంటాయన్నారు. ముఖ్యంగా ఇందులో రొమాంటిక్ సన్నివేశాల్లో నాన్న ముందు నటించడానికి ముందు సంకటం అనిపించిందన్నారు.అయితే తాను షూటింగ్ స్పాట్లో నాన్నను ఒక దర్శకుడుగానే చూడడం వల్ల సంకంటం అన్నది ముందు కొంత సేపే ఉందని, ఆ తరువాత శాంతనుతో కలిసి సహజంగా నటించానని తెలిపారు. తమది నట కుటుంబం కావడం కూడా ఇందుకు ఒక కారణం అని నటి ఐశ్వర్యాఅర్జున్ పేర్కొన్నారు. -
మాధవన్ తో సాయిపల్లవి రొమాన్స్
తమిళ తెరకు నటి సాయిపల్లవి కొత్త కావచ్చు కానీ, ఈ మలయాళీ భామ పేరు మాత్రం ఇక్కడా పాపులరే. మలయాళం చిత్రం ప్రేమమ్ చూసిన వారికి సాయిపల్లవి గురించి ప్రత్కేకంగా చెప్పనక్కర్లేదు.అందులో మలర్ టీచర్ పాత్రల్లో అంతగా ఇమిడిపోయి నటించారు. అయితే కోలీవుడ్‌కు మాత్రం ఈ అమ్మడు ఊరిస్తూనే ఉన్నారు. ఆ మధ్య ఏస్ ఫిలింమ్ మేకర్ మణిరత్నం చిత్రంలో కార్తీకి జంటగా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.ఆ తరువాత విక్రమ్‌తో రొమాన్స్ కు రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది.అయితే అదీ ప్రచారానికే పరిమితమైంది. తాజాగా సాయిపల్లవి కోలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. అమ్మాయి మడ్డీ అని ముద్దుగా పిలుచుకునే నటుడు మాధవన్ కు జంటగా నటించడానికి ఈ బ్యూటీ సిద్ధం అవుతున్నారు. ఇరుదు చుట్రు చిత్రం తరువాత మాధవన్ ళ చిత్రం ఏదీ రాలేదు. ఒకటి రెండు చిత్రాలు కమిట్ అయిన మాధవన్ నటించనున్న తాజా చిత్రం ఇదే అవుతుంది.దీనికి విజయ్ దర్శకత్వం వహించనున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాలను హ్యాండిల్ చేసే ఈయన దేవి చిత్రం తరువాత మలయాళ సక్సెస్ఫుల్ చిత్రం చార్లీని రీమేక్ రెడీ అయ్యారు.ఈ రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంలో మాధవన్, సాయిపల్లవి రొమాన్స్ చేయనున్నారు. దీని గురించి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శ్రుతి నల్లప్ప తెలుపుతూ మలయాళ చిత్రం చార్లీని తమిళ నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. ఇందులో రొమాంటిక్ హీరో పాత్రకు మాధవన్ కరెక్ట్‌గా నప్పుతారని దర్శకుడు విజయ్, తాము కలిసి నిర్ణయించుకుని ఆయన్ని సంప్రందించామని చెప్పారు.మాధవన్ కూడా చిత్రం చూసి కచ్చితంగా నటిస్తానని అంగీకరించారని అన్నారు. ఇక సాయిపల్లవిని ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని, నిరవ్‌షా ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్రం షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. -
విక్రమ్‌ప్రభుతో మరోసారి..
యువ నటుడు విక్రమ్‌ప్రభుతో వరుసగా రొమాన్స్ చేయడానికి నటి నిక్కీగల్రాణి సై అన్నారు. చేతినిండా చిత్రాలన్న యువ నటీమణుల్లో నిక్కీగల్రాణి ఒకరు. యాగవరాయనుం నాకాక్క చిత్రం ద్వారా కోలీవుడ్ చిత్రంలో నటించడానికి ఎంపికైన ఈ ఉత్తరాది భామ తొలుత తెరపైకి కనిపించింది మాత్రం డార్లింగ్ చిత్రంతోనే. జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని చవి చూడడంతో అమ్మడికి అవకాశాలు వరుసగా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం మొట్టశివ కెట్టశివ, నెరుప్పుడా, కీ, మరగద నాణయం, హరహర మహాదేవిక చిత్రాల్లో నటిస్తున్న నిక్కీగల్రాణికి తాజాగా మరో అవకాశం వచ్చింది. నెరుప్పుడా చిత్రంలో విక్రమ్‌ప్రభుతో జత కడుతున్న ఈ అమ్మడు అదే హీరోతో మరో చిత్రంలో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. నవ దర్శకుడు సూర్య మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రానికి పక్కా అనే టైటిల్‌ను నిర్ణయించారు. విశేషం ఏమిటంటే ఇది నిక్కీగల్రాణికి 25వ చిత్రం అవుతుంది. ఇందులో ఆ బ్యూటీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమానిగా నటించనున్నారట. పక్కా చిత్రం పూర్తి ఎంటర్టెయిన్ మెంట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కనుందని సమాచారం. నెరుప్పుడా, పక్కా చిత్రాల్లో నటుడు విక్రమ్‌ప్రభుతో వరుసగా రొమాన్స్ చేస్తున్నారన్న మాట నిక్కీగల్రాణి. ఇక విక్రమ్‌ప్రభు నటిస్తున్న తాజా చిత్రం క్షత్రియన్ త్వరలో విడుదలకు ముస్తాబవుతోందన్నది గమనార్హం. -
మమ్ముట్టితో ఇద్దరు అంజలిలు
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టితో ఇద్దరు అంజలిలు రొమాన్స్ చేస్తున్నారన్నది తాజా సమాచారం. మమ్ముట్టి చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకు ముందు తంగమీన్‌గళ్ వంటి ఉత్తమ అవార్డులను అందుకున్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ తాజగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ఇది. వేసవి కాలం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి పేరంబు అనే పేరును నిర్ణయించారు. చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒక కథానాయకిగా అంజలి నటిస్తున్నారు. ఈ అమ్మడు చిన్న గ్యాప్ తరువాత నటిస్తున్న తమిళ చిత్రం ఇది. కాగా ఇందులో మరో అంజలి కూడా నాయకిగా నటిస్తుండటం విశేషం. కేరళాకు చెందిన ఈమె పేరు అంజలి అమీర్. తను హిజ్రా కావడం మరో విశేషం. హిజ్రాలు ఇంతకు ముందు పలు చిత్రాల్లో నటించినా మలయాళ చిత్ర పరిశ్రమలో నటించిన తొలి హిజ్రాగా అంజలి అమీర్ కీర్తి పొందనున్నారు. ఇప్పటికే పలు మలయాళ చిత్రాల్లో నటించిన అంజలి అమీర్‌కు పేరంబు తొలి తమిళ సినిమా. ఇందులో మమ్ముట్టి సరసన నటించడానికి అంజలి అమీర్ మొదట సంకోచించారట. చిత్ర యూనిట్ పాజిటీవ్ అప్రోచ్‌తో నటించడానికి ముందుకొచ్చారట. ఇప్పుడు మమ్ముట్టితో కలిసి నటించడం సరికొత్త అనుభవం అంటున్నారు. అంతే కాదు ఆయన ప్రోత్సాహం మరువలేనిదని అంజలి అమీర్ చెప్పుకొచ్చారు. కాగా పేరంబు చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
విశాల్‌తో డ్యూయెట్లకు సిద్ధమా?
నటుడు విశాల్‌తో మరోసారి డ్యూయెట్లు పాడడానికి సంచలన నటి నయనతార రెడీ అవుతున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉందనే సమాధానం కోలీవుడ్ నుంచి వస్తోంది. ఈ జంట ఇంతకు ముందు సత్యం అనే చిత్రంలో రొమాన్స్ చేశారు. కాగా సుమారు ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ జత కట్టడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య, శింబు, ధనుష్ అంటూ స్టార్ హీరోలందరితోనూ ఒక రౌండ్ కొట్టేసిన నటి నయనతార ఇప్పుడు టాప్ హీరోయిన్ స్థాయిని ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాదు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరుపొందారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలే. అందులో అరం, దోరా, కొలైయుధీర్ కాలం, నేర్‌వళి వంటి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలు చోటు చేసుకున్నాయి. కాగా పిచ్చ డిమాండ్‌లో ఉన్న నయనతారను మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి. మలయాళంలో యువ నటుడు నవీన్ పౌలీతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో తాజగా నటుడు విశాల్‌తో మరో సారి రొమాన్స్ కు ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల బోగట్టా. ఈ క్రేజీ చిత్రానికి సాక్రటీస్ దర్శకత్వం వహించనున్నారట. ఈయన ఇంతకు ముందు శశికుమార్ హీరోగా బ్రహ్మన్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన అధికార పూర్వక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా విశాల్ ప్రస్తుతం మిష్కన్ దర్వకత్వంలో తుప్పరివాలన్ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. తరువాత ఇరుంబు తిరై, సండైకోలి–2 చిత్రాల్లో నటించనున్నారు. ఆ తరువాతే నయనతారతో విశాల్ రొమాన్స్ చేసే అవకాశం ఉంది. -
త్రిష... 96
త్రిష 96. ఏమిటీ షాక్ అయ్యారా? చెన్నై చిన్నది త్రిషకు 96కు ఏమిటీ సంబంధం అనేగా మీ సందేహం. సంబంధం ఉంది. అయితే ఈ సంఖ్య ఆమె వయసుకు చెందినది మాత్రం కాదు. అలాగని అదృష్ట సంఖ్య అసలు కాదు. త్రిష కెరీర్ మధ్యలో కాస్త నిదానంగా సాగినా, ఇప్పుడు మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుందనే చెప్పాలి. ఒక పక్క లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలు, మరో పక్క ప్రముఖ హీరోలతో చిత్రాలు, ఇంకో పక్క యువ కథానాయకులతో రొమాన్స్ చేసే చిత్రాలంటూ అమ్మడి సినీ లైఫ్ మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతోంది. ఇటీవల ధనుష్‌కు ప్రతినాయకిగా కొడి చిత్రంలో నటించి శభాష్ అనిపించుకున్న ఈ బ్యూటీ చేతిలో మరో మూడు చిత్రాలకు పైగా ఉన్నాయి. త్రిష సెంటరిక్ పాత్రలో నటిస్తున్న మోహిని చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం అరవింద్స్వామికు జంటగా చతురంగవేట్టై–2 చిత్రంలో నటిస్తున్నారు. యువ నటుడు విజయ్‌సేతుపతి సరసన మరో చిత్రం చేయడానికి ఆల్రెడీ పచ్చజండా ఊపారు. నడువుల కొంచెం పక్కత్తు కానోం చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో త్రిష పాత్ర విజయ్‌సేతుపతి పాత్రకు దీటుగా ఉంటుందట.ఈ చిత్రం పేరే 96. స్క్రిప్ట్ డిమాండ్ మేరకే ఈ టైటిల్‌ను నిర్ణయించినట్లు దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెలిపారు. చిత్ర కథకు 1996 సంవత్సరానికి లింక్ ఉంటుందట.అయితే ఇది ప్రస్తుత టైటిల్నేనని, చిత్రానికి రాయితీల సమస్య తలెత్తితే ఆ టైటిల్ మారే అవకాశం లేకపోలేదని దర్శకుడు పేర్కొన్నారు. -
‘సల్మాన్‌కు నా ప్రేమనంతా ఇచ్చేస్తా’
ముంబయి: ‘ఆయన పుట్టిన రోజునాడు నా ప్రేమనంతా ఇవ్వడంతోపాటు, గౌరవాన్ని కూడా ఇచ్చేస్తాను’ అంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గర్ల్ప్రెండ్గా వార్తల్లో చెక్కర్లు కొడుతున్న రష్యన్ భామ లులియా వాంతుర్ చెప్పింది. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ సంబంధాన్ని గురించి సల్మాన్ ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ లులియా మాత్రం అప్పుడు సల్మాన్ పేరును నేరుగా ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది. సోమవారం రాత్రి సాన్ సూయి స్టార్ డస్ట్ అవార్డు కార్యక్రమానికి రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్న ఈ అమ్మడు సల్మాన్‌కు త్వరలోనే మంచి బహుమతి ఇస్తానని చెప్పింది. ఈ నెల (డిసెంబర్) 27న కండల వీరుడు సల్మాన్ 51 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా పుట్టిన రోజున సల్మాన్‌కు ఏ బహుమతి ఇస్తున్నారంటూ అక్కడి మీడియా ప్రశ్నించగా తొలుత కాస్తంత సిగ్గుపడినట్లు చేసిన ఈ భామ అనంతరం ‘ఆ రోజు నా మొత్తం ప్రేమను, గౌరవాన్ని సల్మాన్‌కు ఇచ్చేస్తాను’ అంటూ చెప్పింది. ఆ రోజు ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా.. చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ఆరోజు అందరం కలిసే వేడుక జరుపుకుంటామని కెమెరాకు పోజివ్వకుండానే వెళ్లిపోయింది. మరో విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమంలో సల్మాన్ కూడా ఉన్నాడు. ఆయన ముందే బాడీగార్డ్ చిత్రంలో తేరి మేరి ప్రేమ్ కహానీ అనే పాటను కూడా లులియా వినిపించి అబ్బురపరిచింది. -
రొట్టె విరిగి నేతిలో పడింది!
తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అంటారు. మంచి మంచి అవకాశాలు దక్కినప్పుడు ఆ మాట అనడం సహజం. ‘అఖిల్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన హిందీ భామ సాయేషా సైగల్‌కు ఇది వర్తిస్తుంది. ఈ చిత్రం తర్వాత హిందీలో ‘శివాయ్’లో నటించిన సాయేషా ఇప్పుడు ‘వనమగన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం రెండు రోజుల క్రితం చెన్నైలో ఉన్న ఈ పందొమ్మిదేళ్ల టీనేజ్ బ్యూటీ ‘వర్దా’ తుపాను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెన్నైలో కరెంటు కట్ చేశారనీ, తాను బస చేసిన హోటల్లో జనరేటర్ పాడైపోవడంతో చీకట్లో భయంగా గడిపాననీ ఆమె అన్నారు. చివరికి చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు. ఈ సినిమా షూటింగ్ వియత్నాంలో ప్లాన్ చేయడంతో అక్కడికి ప్రయాణమయ్యారు. కానీ, హైదరాబాద్‌లో ఆమె గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఏయం రత్నం నిర్మించనున్న చిత్రానికి సాయేషాను కథానాయికగా అనుకుంటున్నారట. ఆమెను సంప్రదించారని కూడా తెలిసింది. చేస్తున్న తమిళ సినిమాతో పాటు సాయేషా ఇప్పటికి మూడు సినిమాల్లో నటించినట్లు అవుతుంది. తక్కువ సమయంలో పవన్ కల్యాణ్ సరసన ఛాన్స్ అంటే... సాయేషా పంట పండినట్లే కదా! -
విజయ్‌కు గాలం వేస్తున్న యువనటి
విజయాలు ఎన్ని అందుకున్నా స్టార్డమ్ రావాలంటే స్టార్ హీరోలతో రొమాన్స్ చేయాల్సిందే. అదే తారక మంత్రం అని భావించిన వర్ధమాన నాయకి మంజిమామోహన్ ఆ ప్రయత్నాల్లో పడ్డట్టు కోడంబాక్కం వర్గాల మాట. మాలీవుడ్‌లో బాల తారగా పరిచయం అయిన, ఆ తరువాత కథానాయకిగా ఎదిగిన నటి మంజిమామోహన్. దర్శకుడు గౌతమ్ మీనన్ ద్వారా అచ్చయం ఎన్బదు మడమైయడా చిత్రంతో ఒకే సారి తమిళం, తెలుగు భాషలలో(తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో) పరిచయమైంది. ఈ చిత్రం రెండు భాషల్లోనూ ప్రేక్షకాదరణ పొందడంతో మంజిమామోహన్‌కు మంచి గుర్తింపే లభించింది. కాగా ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌ప్రభుకు జంటగా ముడిచూడ మన్నన్ చిత్రంలో నటిస్తోంది. తదుపరి గౌరవ్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇలా కోలీవుడ్‌లో పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో నటి కీర్తీసురేశ్‌కు పోటీగా మారాలన్న కోరుకుంటున్నట్లు సమాచారం. అంతే కాదు అందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. అందులో భాగంగా ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాల వేట మొదలెట్టినట్లు తెలిసింది. ఇటీవల ఒక భేటీలో తనకు నటుడు ఇళయదళపతి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనీ, తానాయన వీరాభిమానినని చెప్పి ఆయన దృష్టి తనపై పడే ప్రయత్నం చేసింది. అదే విధంగా ఆయనతో చిత్రం చేస్తున్న అట్లీ తదితర దర్శకులను కలిసి అవకాశాలు అడుగుతున్నారు. మరి ఈ మాలీవుడ్ భామ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. -
శృంగారం కన్నా వైఫైనే ఎక్కువ అవసరం!
లండన్: ప్రస్తుత కాలంలో వైఫై అతి ముఖ్యమైన నిత్యావసరమైంది. అమెరికా, ఐరోపాల్లోని 1,700 మంది ఉద్యోగులను సర్వే చేసిన ‘ఐపాస్’ అనే వైఫై కనెక్షన్ సరఫరాదారులు ఈ విషయం చెబుతున్నారు. శృంగారం, చాకొలేట్, మద్యం కన్నా తమకు వైఫైయే ముఖ్యమైన నిత్యావసరం అని సర్వేలో పాల్గొన్న 40 శాతం మంది చెప్పారు. 37 శాతం మంది తమకు శృంగారం అన్నింటికన్నా ముఖ్యం అని తీర్పునివ్వగా చాకొలేట్కు మూడో(14 శాతం), మద్యానికి నాల్గవ(9 శాతం) స్థానం దక్కారుు. వైఫై తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందని 75 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
రానాతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్
టాలీవుడ్ యువ నటుడు రానాతో బ్యూటీఫుల్ భామ క్యాథరిన్ ట్రెసా రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ చక్కర్లు కొడుతూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంటున్న నాయకి క్యాథరిన్ ట్రెసా. ఆ మధ్య కణిదన్ చిత్రంలో అధర్వకు జంటగా నటించి విజయాన్ని చవి చూసిన ఈ అమ్మడు విశాల్‌తో కథకళి చిత్రంలోనూ రొమాన్స చేశారు. ఇటీవల తెలుగులో అల్లుఅర్జున్‌తో సరైనోడులో మెరిశారు కూడా. ప్రస్తుతం ఆర్యతో కథంబన్, విష్ణువిశాల్‌కు జంటగా కథానాయకన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా రానాతో చిందులేయడానికి రెడీ అవుతున్నారు. రానా హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నానే రాజా నానే మంత్రి. టాలీవుడ్ దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానాతో ఇప్పటికే నటి కాజల్ఆగర్వాల్ డ్యూయెట్లు పాడుతున్నారు. మరో హీరోరుున్ పాత్రలో నటి శ్రుతిహాసన్ నటించనున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడా పాత్రలో నటించే అవకాశం నటి క్యాథరిన్ ట్రెసాను వరించింది. ఇందులో ఈమెకు కాజల్‌అగర్వాల్ పాత్రకు దీటుగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ కారైక్కుడి, కేరళ ప్రాంతాల్లో జరుపుకుంది. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న షూటింగ్లో క్యాథరిన్ ట్రెసా పాల్గొననున్నట్లు సమాచారం. -
కథానాయకన్‌గా విష్ణువిశాల్
యువ నటుడు విష్ణువిశాల్ హీరోగా చిత్ర చిత్రానికి తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సుశీంద్రన్ దర్శకత్వంలో మా వీరన్కిట్టు చిత్రంలో నటిస్తున్నారు. శ్రీదివ్య నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. కాగా విష్ణువిశాల్ ఇటీవల వేలైయన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రంతో నిర్మాతగా కూడా మారి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా తను హీరోగా నటిస్తూ రెండో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికి కథానాయకన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది 1988లో పాండిరాజన్ హీరోగా ముక్తా శ్రీనివాసన్ నిర్మించిన చిత్రం పేరు కావడం గమనార్హం. కాగా ఈ చిత్రానికి మురుగానందం దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విష్ణువిశాల్‌కు జంటగా నటి క్యాథరిన్ ట్రెసా నటించనున్నారు. ఇది మంచి ఎంటర్టెయిన్మెంట్తో సాగే జనరంజక కథా చిత్రంగా ఉంటుందని, నిర్మాతగా తొలి విజయం సాధించిన విష్ణువిశాల్ ఈ చిత్రంంతో మరో విజయాన్ని అందుకుంటారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. -
సిబిరాజ్‌తో రమ్యానంబీశన్ రొమాన్స్
యువ నటుడు సిబిరాజ్‌తో రొమాన్‌సకు సిద్ధం అవుతున్నారు నటి రమ్యానంబీశన్. ఈ మలయాళీ భామ నటించిన చిత్రాలు విజయం సాధిస్తున్నా కోలీవుడ్‌లో అవకాశాలు మాత్రం అడపాదడపానే వరించడం గమనార్హం. అయితే తమిళంతో పాటు మలయాళంలోనూ నటించడంతో రమ్యానంబీశన్ బిజీగానే ఉన్నారని చెప్పవచ్చు. ఆ అమ్మడు కోలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం సేతుపతి. ఇది మంచి విజయాన్నే అందుకుంది. కాగా సమీపకాలంలో మోహన్‌లాల్‌కు జంటగా నటించిన పులిమురుగన్ ఘన విజయాన్ని సాధించింది. ఇకపోతే యువ నటుడు సిబిరాజ్ కట్టప్పావ కానోం చిత్రాన్ని పూర్తి చేసి తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. తన తదుపరి చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తికి దర్శకత్వం అవకాశం కల్పించారు. ఈయన విజయ్ అంటోని హీరోగా నటించిన సైతాన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారన్నది గమనార్హం. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. సిబిరాజ్ హీరోగా నటించే చిత్రం తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన క్షణం చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కనుందన్నది గమనార్హం. ఇందులో సిబిరాజ్‌కు జంటగా నటి రమ్యానంబీశన్ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు సతీష్ ముఖ్య పాత్రను పోషించనున్నారు. దీన్ని నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. -
విజయ్‌సేతుపతితో మళ్లీ రొమాన్స్
సక్సెస్ఫుల్ జంట విజయ్‌సేతుపతి, రితికాసింగ్ మరోసారి కలిసి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. స్టార్ హీరోలతో రొమాన్స్ చేసి ప్రముఖ హీరోయిన్లుగా ఎదిగిన వారి సంఖ్య చిత్రపరిశ్రమలో అధికం. తొలి చిత్రంతోనే కథనంతా తన భుజాన మోసి విజయం సాధించిన హీరోయిన్లు చాలా తక్కువ మందే. అలాంటి వారి సరసన చేరిన నటి రితికాసింగ్. రియల్ లైఫ్‌లో బాక్సింగ్ రాణి అయిన రితికా రీల్ లైఫ్‌లోకీ అదే పాత్రతో ఎంటర్ అయి ఇరుదు చుట్రు అంటూ ఏక కాలంలో తమిళం, హిందీ ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఆ చిత్రంలో మాధవన్‌తో పోటీ పడి నటించిన రితికాసింగ్ తదుపరి కాక్కా ముట్టై చిత్రం ఫేమ్ మణికంఠన్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్ కట్టళై చిత్రంలో నటించే అవకాశాన్ని పొంది దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో పత్రికా విలేకరిగా వైవిధ్యమైన నటనతో పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఇలా వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న రితికాకు తాజాగా మరో అవకాశం వచ్చింది. రేణిగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వం దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు జంటగా ముందు నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఆమె కాల్షీట్స్ లేకపోవడంతో మరోనటి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. రెమో చిత్ర విజయంతో కీర్తీసురేశ్ అధిక పారితోషికం డిమాండ్ చేశారనే మరో టాక్ కోడంబాక్కం వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైతేనేం కీర్తీసురేశ్ నటించాల్సిన పాత్ర నటి రితికాసింగ్‌ను వరించింది. దీంతో ఆండవన్ కట్టళై చిత్రం తరువాత విజయ్‌సేతుపతితో మరో సారి రొమాన్స్ చేయడానికి రితిక రెడీ అవుతున్నారన్నమాట. -
ముగ్గురు ముద్దుగుమ్మలతో ధనుష్
ఈ తరం హీరోయిన్లు ఒక్కరుంటేనే ఆ చిత్రంలో గ్లామర్‌కు కొరత ఉండదు. అలాంటిది ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు ఒకే చిత్రంలో పోటీపడితే, అదీ యువ స్టార్ నటుడు ధనుష్‌తో ఆ ముగ్గురూ రొమాన్స్ చేస్తే ఆ చిత్రానికి ఏర్పడే క్రేజే వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఆసక్తికరమైన చిత్రమే బుధవారం చాలా నిరాడంబరంగా షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకుంది. ఇంతకీ ఈ చిత్రంలో నటించే హీరోహీరోయిన్లు ఎవరన్నది చెప్పలేదు కదూ చిన్న క్లూ ఇస్తే మీకే అర్థమైపోతుంది. అదేమిటంటే ఈ చిత్రానికి కెప్టెన్సీ బాధ్యతల్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ వారసురాలు సౌందర్య నిర్వహిస్తున్నారు. అర్థమైపోయింది కదూ’ ఎస్ ఈ క్రేజీ చిత్రం హీరో ధనుష్. ఇక ఆయనకు జంటగా నటిస్తున్న బ్యూటీస్ బాలీవుడ్ భామ సోనంకపూర్, కాజల్‌అగర్వాల్, మంజిమామోహన్. కాగా వీరిలో సోనంకపూర్ రాంజనా అనే హిందీ చిత్రంలోనూ, కాజల్‌అగర్వాల్ మారి చిత్రంలోనూ ధనుష్ సరసన నటించారు. ఇక నటి మంజిమా మోహన్ తొలిసారిగా ఆయనతో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిలవుక్కు ఎన్మేల్ ఎన్నడీ కోపం అనే టైటిల్‌ను నిర్ణయించారు. మరో విశేషం ఏమిటంటే దీనికి కథ, కథనం, మాటలను ధనుష్ సమకూర్చారు. మరో విశేషం రజనీకాంత్ కథానాయకుడిగా కబాలి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని తన వి.క్రియేషన్ పతాకంపై నిర్మించడం. రొమాంటిక్ లవ్ ఎంటర్టెయినర్గా తెరకకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. -
సంతానంతో సాయిపల్లవి రొమాన్స్?
తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. అన్న జీవిత సత్యాన్ని ఒక పాటలో చెప్పారో మహాకవి. అలాగే చేతి వరకూ వచ్చి నోటి దాకా రాలేదంటారు. నటి సాయి పల్లవి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే కోలీవుడ్‌లో ఎదుర్కొంటున్నారు. మలయాళ చిత్రం ప్రేమమ్ ఘన విజయం అందులో నటించిన కథానాయికలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. అందులో ముఖ్యంగా మలర్ పాత్రలో టీచర్‌గా నటించిన సాయి పల్లవి నటనకు ప్రశంసలు వర్షం కురిపించారు. దీంతో సహజంగానే ఆ చిత్ర హీరోయిన్లు ముగ్గురిపై కోలీవుడ్ దృష్టి పడింది. అయితే సాయిపల్లవి మినహా ఇతర భామలు మంజిమామోహన్, మడోనా సెబాస్టియన్లకు ఇప్పటికే కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కట్టాయి. ఇక సాయి పల్లవికి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. కార్తీకి జంటగా కాట్రు వెలియిడై చిత్రంలో నటించాల్సింది. చివరి క్షణంలో బాలీవుడ్ భామ అతిథిరావు వచ్చి చేరింది. మణిరత్నం చిత్రం మిస్ అవ్వడం సాయిపల్లవికి పెద్ద దెబ్బే. చాలా నిరాశకు గురైనట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో అవకాశం తలుపు తట్టిందన్నది కోలీవుడ్ టాక్. సంచలన దర్శకుడుగా పేరొందిన సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానంతో రొమాన్స్ చేయడానికి సాయి పల్లవి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సెల్వరాఘవన్ తదుపరి సంతానం హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో నాయకిగా సాయి పల్లవిని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ సారి అయినా సాయి పల్లవికి కోలీవుడ్‌కు లైన్ క్లియర్ అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. సంతానం ప్రస్తుతం వీటీవీ ప్రొడక్షన్స్ పతాకంపై సేతురామన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం కూడా ఆయన తాజా చిత్రానికి సమాంతరంగా చిత్రీకరణ జరుపుకోనున్నట్లు సమాచారం. -
సూపర్‌స్టార్ టైటిల్లో చెన్నై చిన్నది
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేసే అవకాశం చెన్నై చిన్నది త్రిషకు ఇంత వరకూ రాలేదు. అలాంటి అవ కాశం వస్తుందని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా రజనీకాంత్ చిత్ర టైటిల్‌తో నటించే అవకాశం వ రించినట్లు తాజా సమాచారం. త్రిషను ఇప్పుడు స్టార్ హీరోలకు జంటగా నటించే అవకాశాల కంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా పాత్రలే అధికంగా తలుపు తడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న మోహిని అనే హారర్ కథా చిత్రంలో నటిస్తున్న త్రిష త్వరలో అరవిందస్వామికి జంటగా చదరంగవేట్టై-2లో నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్ర రీమేక్‌లోనూ నటి రేవతి దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో బాలీవుడ్ సంచలన చిత్రం ఎన్‌హెచ్10 తమిళ రీమేక్‌లో నటించే అవకాశం త్రిషనే వరించినట్లు సమాచారం. హిందీలో నవదీప్‌సింగ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంలో అనుష్కశర్మ నాయకిగా నటించారు. ఆ చిత్రం ఇప్పుడు తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ కానుంది. ఇందులో నటి త్రిషను నాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.దీని గురించి త్రిష కూడా పాజిటివ్‌గానే స్పందించడం గమనార్హం. తనను బాగా ఆకట్టుకున్న చిత్రం ఎన్‌హెచ్ 10 అని, ఈ హిందీ రీమేక్‌లో నటిస్తారా? అని తనను అడిగారని, తానూ అందుకు సమ్మతించినట్లు తెలిపారు.అయితే ఈ విషయం ఇంకా చర్చల్లోనే ఉందని,తానింకా ఒప్పంద పత్రాలపై సంతకం చేయలేదని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచీ కాశ్మీర్ సరిహద్దుల వరకూ సాగే జాతీయ రహదారిని ఎన్‌హెచ్ 10 అంటారు. ఈ రోడ్డు పయనంలో జరిగే యాక్షన్ థ్రిల్లర్ క థే ఎన్‌హెచ్ 10 చిత్ర సింగిల్ లైన్ కథ. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి గర్జనై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం.ఇదే టైటిల్‌తో ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం వచ్చిందన్నది గమనార్హం. -
గౌతమ్ కార్తీక్‌తో శ్రద్ధాశ్రీకాంత్ రొమాన్స్
కథానాయికలకు పుట్టినిల్లుగా మారిన కేరళ రాష్ట్రం నుంచి మరో నాయకి కోలీవుడ్‌కు దిగుమతి అవుతోంది. ఆమె పేరు శ్రద్ధాశ్రీకాంత్. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే యూటర్న్ చిత్రంలో హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ మాలీవుడ్ బ్యూటీ కోలీవుడ్‌లో యువ నటుడు గౌతమ్‌కార్తీక్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతోంది. కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన గౌతమ్ కార్తీక్ సీనియర్ నటుడు కార్తీక్ వారసుడన్న విషయం తెలిసిందే. మణిరత్నం చిత్రం కడల్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న గౌతమ్ కార్తీక్‌కు ఆ చిత్రం చాలా నిరాశ పరచిందన్నది తెలిసిందే. ఆ తరువాత నటించిన ఎన్నమో ఏదో చిత్రం ఆయనకు విజయాన్ని అందించలేకపోయింది. దీంతో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న గౌతమ్‌కార్తీక్ తాజాగా ఆర్.కన్నన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఆయనకు జంటగా శ్రద్ధాశ్రీకాంత్ను నాయకిగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ఇవన్ తందిరన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు దర్శకుడు వెల్లడించారు. అభిరా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆషాశ్రీ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ఆర్.కన్నన్ తెలుపుతూ ఇది ప్రేమ, యాక్షన్ అంశాలు కలిపిన జనరంజక కథతో తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. ఇందులో హీరో, హీరోయన్లతో పాటు వర్షం ముఖ్య పాత్రగా ఉంటుందన్నారు. అందుకే ఇంతకు ముందే ప్రారంభించాల్సిన షూటింగ్‌ను వర్షం సీజన్ కోసం అక్టోబర్, నవంబర్‌లో షూటింగ్ నిర్వహించాలని ఎనిమిది నెలలు వేచి ఉన్నామన్నారు. ఈ నెల 12న చెన్నైలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. హీరోగా గౌతమ్ కార్తీక్‌ను అనుకున్న తరువాత హీరోయిన్ కోసం చాలా మందిని పరిశీలించామన్నారు. వారిలో ఒక్కరూ సెట్ కాకపోవడంతో మలయాళ చిత్రం యూటర్న్ నాయకి శ్రద్ధాశ్రీకాంత్ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. -
శశికుమార్‌కు జంటగా తాన్యా
నటుడు శశికుమార్‌కు జంటగా నాటి సూపర్‌స్టార్ రవిచంద్రన్ మనవరాలు తాన్యా నటించనున్నారని తాజా సమాచారం. 1960-70 దశకంలో తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన నటుడు రవిచంద్రన్. ఈయన వారసుడు హంసవర్దన్ హీరోగా తెరంగేట్రం చేసినా నిలదొక్కుకోలేకపోయారు. కాగా తాజాగా రవిచంద్రన్ మనవరాలు తాన్యా నాయకిగా రంగప్రవేశం చేశారు. ఇప్పటికే రెండు చిత్రాల్లో నాయకిగా నటిస్తున్నారు. రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బృందావనం చిత్రంలో అరుళ్‌నిధికి జంటగా తాన్యా నటిస్తున్నారు. అదే విధంగా మిష్కిన్ దర్శకత్వంలో విశాల్ సరసన నాయకిగా నటిస్తున్నారు. తాజాగా శశికుమార్‌తో జత కట్టడానికి సిద్ధమవుతున్నారు. కిడారి వంటి విజయవంతమైన చిత్రం తరువాత శశికుమార్ తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. తన సొంత సంస్థ కంపెనీ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు ప్రకాశ్ పరిచయం కానున్నారు. ఇందులో శశికుమార్‌కు జంటగా తాన్యాను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. పూర్తి వినోదభరిత చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నటి కోవైసరళ, సంగిలి మురుగన్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. దీనికి అలప్పారై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. -
విశాల్‌తో సమంత
సమంత, నటుడు విశాల్ తాజా హీరోయిన్లతో నటించాలని కోరుకుంటున్నట్లున్నారు. ఈ మధ్య ఒక చిత్రంలో నటించిన నాయకితో మరో చిత్రంలో నటించడం లేదు. ఇటీవల మరుదు చిత్రంలో నటి శ్రీదివ్యతో రొమాన్స్ చేశారు. ప్రస్తుతం నటిస్తున్న కత్తిసండై చిత్రంలో మిల్కీబ్యూటీ తమన్నాతో డ్యూయెట్లు పాడుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో తప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దివంగత ప్రఖ్యాత నటుడు ఎస్ఎస్.రవిచంద్రన్ మనవరాలు తాన్యాను నాయకిగా ఎంచుకున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. అదే విధంగా విశాల్ తదుపరి చిత్రానికి కూడా రంగం సిద్ధమైందన్నది తాజా సమాచారం. నవ దర్శకుడు పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ఇరుంబుతిరై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ చిత్రానికి తెరి చిత్రం ఫేమ్ జార్జ్ సి.విలియమ్స్ చాయాగ్రహణం, రుబీన్ కూర్పు బాధ్యతల్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇందులో విశాల్‌కు జతగా నటి సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం. సమంత త్వరలో శివకార్తికేయన్‌కు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారక పూర్వక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. విశేషం ఏమిటంటే వచ్చే ఏడాది లవర్ నాగచైతన్యతో పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతూ తెలుగులో చిత్రాలను అంగీకరించని ఈ చెన్నై చిన్నది కోలీవుడ్‌లో మరోసారి ఒక రౌండ్ కొట్టడానికి రెడీ అవుతున్నారనిపిస్తోంది. -
సూర్యతో మరో చాన్స్?
సూర్యతో హిట్ పెయిర్ లిస్ట్‌లో అందాల భామ హన్సిక కూడా ఉన్నారు. మాస్ ఎంటర్టెయినర్ సింగం-2లో అనుష్కతో పాటు హన్సిక కూడా నాయకిగా నటించిన విషయం తెలిసిందే. హన్సికకు సక్సెస్ఫుల్ నాయకి అనే పేరే ఉంది. అయినా ఎందుకనో ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం జయంరవితో నటిస్తున్న బోగన్ చిత్రం ఒకటే ఈ అమ్మడి చేతిలో ఉంది. తాజాగా సూర్యతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం వచ్చినట్లు సమాచారం. సూర్య ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. నటి నయనతార లవర్‌గా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి తానా సేర్న్ద కూటం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నటి నయనతార నాయకిగా నటించే అవకాశాలు ఉన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ దర్శకుడు విఘ్నేశ్‌శివతో కలిపి బోలెడు గ్యాసిప్స్ హల్చల్ చేస్తుండడంతో సూర్యతో నటించడానికి సుముఖత వ్యక్తం చేయనట్లు కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం. ఈ చిత్రంలో సూర్యకు జంటగా నటించే అవకాశాన్ని కీర్తీసురేశ్ కొట్టేశారు. ఇందులో మరో నాయకి ఉన్నారట. ఆ అవకాశం నటి హన్సికను వరించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ బ్యూటీ ఇంతకు ముందు సింగం-2లో నటి అనుష్కతో కలిసి సూర్యతో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ తానా సేర్న్ద కూటం చిత్రంతో మరోసారి ఆయనతో జత కట్టనున్నారన్న మాట. అయితే ఈ విషయాన్ని హన్సిక వర్గం ధ్రువీకరించలేదన్నది గమనార్హం. ఇకపోతే ఈ చిత్రంలో దర్శకుడు కేఎస్.రవికుమార్, సతీష్, శరణ్య పొన్వన్నన్, ముట్టై రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. -
మళ్లీ జాతీయ అవార్డు అందుకుంటా!
చిత్రంపై ఎంతో నమ్మకం ఉంటేగానీ విజయంపై గానీ, అవార్డులపైగానీ అచచంలమైన నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకాన్ని దర్శకుడు సుశీంద్రన్, నటుడ సముద్రకని వ్యక్తం చేస్తున్నారు.వెన్నెల కబడ్డి కుళు, జీవా వంటి విజయవంతమైన చిత్రాల తరువాత దర్శకుడు సుశీంద్రన్, నటుడు విష్ణువిశాల్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం మా వీరన్ కిట్టు. శ్రీదివ్య నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రను నటుడు పార్తిబన్ పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలోని లయోలా కళాశాలలో నిర్వహించారు.చిత్ర ఫస్ట్‌లుక్‌ను నటుడు, దర్శకుడు సముద్రకని, టీజర్‌ను దర్శకుడు రంజిత్ ఆవిష్కరించారు. చిత్ర దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ అళగర్సామి కుదురై చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నానన్నారు. ఈ మావీరన్‌కిట్టు చిత్రానికిగానూ మరోసారి జాతీయ అవార్డును అందుకోవడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్ర కథానాయకుడు విష్ణువిశాల్ మాట్లాడుతూ తాను దర్శకుడు సుశీంద్రన్‌తో కలిసి చేస్తున్న మూడో చిత్రం ఇదన్నారు. ఇది కూడా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని, ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ చిత్ర టీజర్ చూడగానే దర్శకుడు సమాజానికి ఏదో చెప్పబోతున్నారని, కథానాయకుడు సమాజ సమస్య కోసం పోరాడే కథా చిత్రం ఇదని తెలుస్తోందన్నారు.ఇక న టుడు పార్తిబన్ మాట్లాడుతూ ఆయిరత్తిల్ ఒరువన్, అళగి చిత్రాల తరువాత తనకు అంత మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం మా వీరన్ కుట్టి అని పేర్కొన్నారు. కారణం ఇందులో తనది అంత వైవిధ్యభరిత పాత్ర అని తెలిపారు. హౌస్‌ఫుల్ చిత్రం తరువాత ఈ చిత్రం తనకు పలు అవార్డులను అందిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
శాంతనుకు జంటగా పార్వతినాయర్
యువ నటుడు శాంతనుకు జంటగా నటి పార్వతీనాయర్ నటించనున్నారు. సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ కొడుకు శాంతను అన్న విషయం తెలిసిందే. ఈయన కథానాయకుడిగా పలు చిత్రాలలో నటించారు. ఇటీవల తన తల్లిదండ్రులతో కలిసి వాయ్‌మై అనే చిత్రంలోనూ నటించారు. అయినా హీరోగా తనకంటూ ఒక స్థానాన్ని అందుకోలేకపోయారు. కాగా కె.భాగ్యరాజ్ శిష్యులలో ఒకరు పార్తీపన్. దర్శకుడిగా, కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాలను చేసిన పార్తీపన్ కథై, తిరైకథై వచనం, ఇయక్కం చిత్రం తరువాత దర్శకుడు మరో చిత్రం చేయలేదు. చాలా గ్యాప్ తరువాత తాజాగా కొడిట్ట ఇడంగలై నిరప్పుగా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తన గురువు వారసుడు శాంతనుని కథానాయకుడిగా ఎంచుకున్నారు. ఇక కథానాయకిగా చాలా మందిని పరిశీలించిన పార్తీపన్ చివరికి నటి పార్వతినాయర్ను ఎంపిక చేశారు. మొదట ఈ చిత్రంలో కొత్త నటిని నాయకిగా పరిచయం చేయాలని భావించినా పార్వతినాయర్ తన కథలోని నాయకి పాత్రకు చక్కగా నప్పుతారని ఆమెను ఎంపిక చేసినట్లు పార్తీపన్ స్పష్టం చేశారు. ఇక నటుడు శాంతనును హీరోగా ఎంపిక చేయడంపై వివరిస్తూ శాంతను విజయం కోసం చాలా సిన్సియర్‌గా కృషి చేస్తున్నారన్నారు.అయినా ఎందుకనో అది ఆయనకు దూరం అవుతూనే ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే శాంతను విజయం వెనుక తాను ఉండాలని భావించానన్నారు. గురువుకి శిష్యుడిగా అది తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం చాలా బ్లాంక్లను పూర్తి చేస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు పార్తీపన్ వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిందన్నది గమనార్హం. -
ఇళయదళపతితో మూడోసారి?
ఇళయదళపతి విజయ్‌తో ముచ్చటగా మూడోసారి రొమాన్స్‌కు అందాలభామ కాజల్‌అగర్వాల్ రెడీ అవుతున్నారా? అలాంటి అవకాశం లేకపోలేదంటున్నారు కోలీవుడ్ వర్గాలు. నిన్నటి వరకూ టాలీవుడ్లో బిజీగా ఉన్న కాజల్ ఇప్పుడు అంతకంటే బిజీగా కోలీవుడ్‌లో ఉన్నారు. ఈ బ్యూటీ జీవాతో నటించిన కవలైవేండామ్ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అజిత్ 57వ చిత్రంలో నటిస్తున్నారు. దీనితో పాటు దర్శకుడు సోక్రటీస్ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఇక తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఇళయదళపతికి జంటగా నటించే అవకాశం కాజల్‌అగర్వాల్‌ను వరించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. నిజం చెప్పాలంటే విజయ్‌తో నటించిన తుపాకీ చిత్రంతోనే కాజల్ కోలీవుడ్‌లో కమర్శియల్ సక్సెస్‌ను అందుకున్నారని చెప్పవచ్చు.ఆ తరువాత మరోసారి జిల్లా చిత్రంలో విజయ్‌తో జత కట్టారు. ఆ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. దీంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట మరోసారి తెరపైకి రానున్నట్లు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం తన 60వ చిత్రం భైరవాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం.విజయ్, అట్లీల కాంభినేషన్లో ఇంతకు ముందు తెరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి వీరి కలయికలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ తేనాండాళ్ ఫిలింస్ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌తో కాజల్ రొమాన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి బాహుబలి చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
విజయ్‌సేతుపతితో కీర్తిసురేశ్
పేరులోనే కీర్తిని పొదుగుకున్న నటి కీర్తీసురేశ్. ఇక వృత్తి పరంగానూ అలాంటి పయనం వైపే అడుగులు వేస్తున్నారీ సగం తమిళం, సగం మలయాళం బ్యూటీ. కీర్తీసురేశ్ తల్లి నటి మేనక తమిళియన్ అన్న సంగతి, తండ్రి సురేశ్ మలయాళీ అన్నది తెలిసిందే. అయితే కీర్తీసురేశ్ మాత్రం అటు మలయాళం, ఇటు తమిళంతోపాటు తెలుగు నటిగానూ మారిపోయారు. తమిళంలో నటించిన రజనీమురగున్ సంచలన విజయం సాధించింది. అదే విధంగా తెలుగులో నటించిన నేను శైలజా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ చక్కనమ్మ త మిళంలో ఇప్పటికి నటించింది రెండు చిత్రాలే. అందులో ఒకటి యావరేజ్‌గా ఆడిన చిత్రమే. అయితే అమ్మడి క్రేజ్ మాత్రం జెట్ స్పీడ్‌లో పెరిగిపోతోంది. రెండో సారి శివకార్తికేయన్‌తో జత కట్టిన రెమో చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఇళయదళపతితో భైరవ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులోనూ మరో చిత్రం చేస్తున్నారు. తాజాగా విజయ్‌సేతుపతితో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. వరుస విజయాలతో ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్న విజయ్‌సేతుపతి నటించిన ధర్మదురై విజయాన్ని సాధించింది. తాజాగా కాక్కాముట్టై చిత్ర ఫేమ్ మణికంఠన్ దర్శకత్వంలో నటించిన ఆండవన్ కట్టళై చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇందులో బాక్సింగ్ భామ రితికాసింగ్ నాయకిగా నటించారు. విజయ్‌సేతుపతి ప్రస్తుతం కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో మడోనా సెబాస్టియన్ నాయకిగా నటిస్తున్నారు. విజయ్‌సేతుపతి మరో చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం. రేణుగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వం దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా లవ్లీ నటి కీర్తీసురేశ్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రాన్నీ భారీ చిత్రాల నిర్మాత ఏఎం.రత్నం నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక వార్త వెలువడలేదన్నది గమనార్హం. -
అరవిందస్వామితో రొమాన్స్‌కు సై
అరవిందస్వామితో రొమాన్స్‌కు త్రిష సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రోజా చిత్రం తరువాత ఆ చిత్ర హీరో అరవిందస్వామికి యువత ఫాలోయింగ్ ముఖ్యంగా అమ్మాయిల మధ్య ఎంతగా క్రేజ్ పెరిగిందో తెలిసిందే.అలాంటి అరవిందస్వామి కొంత కాలం సినిమాలకు దూరం కావడం చాలా మంది తట్టుకోలేక పోయారు. అయితే కడల్ చిత్రంతో రీఎంట్రీ అయిన ఈ చార్మింగ్ నటుడు ఇటీవల తనీఒరవన్ చిత్రంలో జయం రవికి విలన్‌గా మారి తనదైన స్టైల్ నటనతో మెప్పించారు.కాగా తాజాగా మరో సారి హీరోగా అవతారమెత్తనున్నట్లు సమాచారం.2014లో తరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రం చదురంగ వేట్టై.ఈ చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ తాజాగా దానికి సీక్వెల్‌ను రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు. చదురంగ వేట్టై చిత్రాన్ని నిర్మించిన నటుడు,దర్శకుడు మనోబాలానే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.కాగా తొలి భాగంలో హీరోగా నటించిన నట్టి(నటరాజ్) కు బదులు దాని సీక్వెల్లో అరవిందస్వామి నటించనున్నారని తెలిసింది. చదురంగ వేట్టై చిత్రం కంటే మరింత భారీగా తెరకెక్కించనున్న ఈ సీక్వెల్లో టాప్ నటిని హీరోయిన్గా ఎంపిక చేయాలని భావించిన దర్శక నిర్మాతలు నటి త్రిషను నటింపజేసే పనిలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం త్రిష చేతిలో మోహినీ చిత్రం మాత్రమే ఉంది. దీంతో అరవిందస్వామితో రొమాన్స్ సై అంటారనే టాక్ వినిపిస్తోంది.కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన త్వరలో వెలువడనుంది. -
విష్ణు విశాల్‌తో క్యాథరిన్ రొమాన్స్
నటి క్యాథరిన్ ట్రెసా యువ నటుడు విష్ణువిశాల్‌తో రొమాన్స్ చేస్తున్నారు. మెడ్రాస్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ చిత్ర విజయాన్ని పెద్దగా క్యాష్ చేసుకోలేక పోయారనే చెప్పాలి. విషయం ఏమిటంటే క్యాథరిన్ ట్రెసా ఆ తరువాత విశాల్‌కు జంటగా నటించిన కథకలి, అధర్వ సరసన నటించిన కణిధన్ చిత్రాలు విజయ బాటలోనే న డిచాయి. అయినా ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం ఇక్కడ అంతంత మాత్రమే. అటు టాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. ఒక రకంగా తమిళంలోనే కాస్త బెటర్. ప్రస్తుతం ఆర్యతో కంభన్ అనే చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా నటుడు విష్ణు విశాల్‌కు జంటగా నటించే అవకాశం వరించింది. నిజానికి ఇంతకు ముందే విష్ణు విశాల్‌తో క్యాథరిన్ ట్రెసా ఒక చిత్రం కమిట్ అయ్యారు. వీర ధీర శూరన్ పేరుతో గత ఏడాదే ప్రారంభమైన ఈ చిత్రానికి శకుని చిత్రం ఫేమ్ శంకర్ దయాళ్ దర్శకుడు. అయితే కొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఆగిపోయింది. ఆ చిత్ర కాల్షీట్స్ను విష్ణు విశాల్ తన తాజా చిత్రానికి వాడుకుంటున్నారట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని ఈయన తన సొంత నిర్మాణ సంస్థ డ బ్ల్యూ స్టూడియో స్ పతాకంపై నిర్మిస్తున్నారన్నది గమనార్హం. ఇంతకు ముందు వేలైన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న విష్ణు విశాల్‌కు ఇది నిర్మాతగా రెండో చిత్రం. యోగానందం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తనను హీరోగా పరిచయం చేసిన సుశీంద్రన్ దర్వకత్వంలో మావీరన్ కుట్టి చిత్రాన్ని పూర్తి చేసిన విష్ణువిశాల్ తాజాగా తన సొంత చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. -
యంగ్ హీరోయిన్లపై కన్నేసిన ఉదయనిధి
యువ నటుడు ఉదమనిధి స్టాలిన్ ఆరంభంలో టాప్ హీరోయిన్లతో నటించిన విషయం తెలిసిందే. తొలి చిత్రం ఒరుకల్ ఒరుకన్నాడి చిత్రంలో బొద్దుగుమ్మ హన్సికను తనకు జతగా ఎంచుకున్నారు. ఆ తరువాత వరుసగా నయనతార, ఎమీజాక్సన్ వంటి టాప్ హీరోయిన్లతో నటించారు. ఇటీవల మంచి విజయాన్ని సాధించిన మనిదన్ చిత్రంలో నాయకి హన్సికనే నన్నది గమనార్హం. ఇలా క్రేజీ హీరోయిన్లతోనే నటించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్న ఉదయనిధి స్టాలిన్ నిర్ణయంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రాల్లో యంగ్ నాయికలతో రొమాన్స్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఎళిల్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో నటి రెజీనా నాయకిగా నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న మరో చిత్రానికి గౌరవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు ఉదయనిధి తాజాగా మరో చిత్రానికి సైన్ చేశారు. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా నటించనున్నారు. దళపతి ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఒరునాళ్ కూత్తు చిత్రం ఫేమ్ నివేదా పేతురాజ్ ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఉదయనిధి ఇలా టాప్ నాయికలను పక్కన పెట్టి యువ నాయికలపై కన్నేయడానికి కారణం ఏమిటబ్బా అని ఆరా తీసేపనిలో పడింది కోలీవుడ్. -
ఆ భావన కలిగినపుడే పెళ్లి
ఎప్పుడైతే నాకు అలాంటి భావన కలుగుతుందే అప్పుడే పెళ్లి చేసుకుంటాను అంటున్నారు నటి కాజల్‌అగర్వాల్. ఈ బ్యూటీకిప్పుడు గుడ్టైమ్ నడుస్తోంది. ఈ మాట తనే అన్నారు. ఒక రకంగా అది నిజమే కావచ్చు. ఎందుకంటే కాజల్ ఇప్పుడు కోలీవుడ్‌లో బిజీ హీరోయిన్. జీవాతో నటిస్తున్న కవలైవేండామ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. త్వరలో విక్రమ్‌కు జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే విక్రమ్‌తో నటించే అవకాశం రెండు సార్లు వచ్చి మిస్ అయ్యింది. తాజాగా గరుడా అనే చిత్రం కూడా వాయిదా పడినట్లు కోలీవుడ్‌లో టాక్ హల్చల్ చేస్తోంది. అయితే విక్రమ్ తదుపరి చిత్రంలో హీరోయిన్ కాజల్నేననే టాక్ వినిపిస్తోంది. కాజల్ పెళ్లికి రెడీ అవుతున్నారనే ప్రచారం మరో పక్క సాగుతోంది. దీని గురించి కాజల్‌అగర్వాల్ స్పందన ఏమిటో చూద్దాం. పెళ్లి అన్నది ప్రతి స్త్రీ జీవితంలోనూ ఒక ముఖ్య అంశంగా పేర్కొన్నారు. ఆ సమయం ఆసన్నమైనప్పుడు అది తప్పక జరుగుతుందని అన్నారు. పెళ్లి తరువాత నటనను కంటిన్యూ చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారన్నారు. చాలా మంది వివాహానంతరం నటనను కొనసాగిస్తున్నారనీ, మరి కొందరు కొన్నేళ్ల తరువాత మళ్లీ నటించడానికి వస్తున్నారని అన్నారు. అయితే తన వరకూ తాను వివాహానంతరం నటనకు స్వస్తి చెబుతానని అన్నారు. కారణం పెళ్లి తరువాత బాధ్యతలు పెరుగుతాయన్నారు. భర్త, పిల్లల యోగక్షేమాలు, భర్త కుటుంబానికి సాయపడేలా వారి అవసరాలను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పెద్దలను గౌరవిస్తూ వారికి మర్యాద ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒక ఇంటి కోడలిగా బాధ్యతలు వస్తాయన్నారు. దీంతో దినచర్యలోనూ మార్పు వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాంటప్పుడు రెండు పడవలపై ప్రయాణం చేయడం సాధ్యం కాదని అన్నారు. అందుకే నాకు నచ్చిన పాత్రలన్నీ చేసేస్తున్నాననీ చెప్పారు. ప్రస్తుతం తనకు మంచి టైమ్ న డుస్తోందనీ, నటనకు అవకాశం ఉన్న పాత్రలు అమరుతున్నాయనీ తెలిపారు. అవకాశాలు తలుపుతడుతున్నాయనీ, ఎప్పుడైతే నచ్చిన పాత్రలన్నీ చేశాననే భావన తనకు కలుగుతుందో అప్పుడే పెళ్లికి సిద్ధం అవుతాననీ కాజల్ తన మనసులోని మాటను వెల్లడించారు. -
సంతానంపై పొగడ్తల వర్షం
నటుడు సంతానంను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు నటి రెజీనా. సాధారణంగా ఏ రంగంలోనైనా ప్రతిభ ముఖ్యం అన్నది ఎవరూ కాదనలేని విషయం. అలాంటిది సినిమా రంగంలో ప్రతిభను గుర్తిస్తున్నారో లేదోగానీ సక్సెస్‌ను మాత్రం ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక్కడ లక్కే ప్రధాన పాత్రను పోషిస్తోందని చెప్పక తప్పదు. ఒక భాషలో నిరాదరణకు గురైన వారు మరో భాషలో ఆదరణను పొందితే వారిని మళ్లీ పిలిచి మరీ అవకాశాలివ్వడం పరిపాటిగా మారింది. ఉదాహరణకు నటి అనుష్క, ఇలియానా, హన్సిక లాంటి వాళ్లంతా ఆదిలో కోలీవుడ్‌లో నిరాదరణకు గురైన వారే. అనుష్క రెండు అనే చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోశారు. అయినా ఆ చిత్రం తరువాత ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌నే నమ్ముకున్నారు. అక్కడ సక్సెస్ఫుల్ నాయకిగా పేరు తెచ్చుకున్న తరువాత మళ్లీ కోలీవుడ్ ఆహ్వానించింది. ఇలా పలు సంఘటనలు ఉన్నాయి. నటి రెజీనా కథా ఇంతే. మొదట్లో తమిళంలో కేడీబిల్లా కిల్లాడిరంగా తదితర కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ఆమెను దూరంగా పెట్టేశారు. టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రెజీనా అక్కడ విజయాలను అందుకున్నారు. ఫలితం కోలీవుడ్ ఇప్పుడు వరుసగా అవకాశాలందిస్తోంది. దీంతో ఈ సారి ఎలాగైనా ఇక్కడ నిలదొక్కుకోవాలన్న పట్టుదలతో ఉన్న రెజీనా తాను నటించనున్న హీరోలను పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అధర్వకు జంటగా జెమినీగణేశనుమ్ సురళిరాజానుమ్, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజమ్ మరప్పదిల్లై తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. సెల్వరాఘవన్ ఈ భామకు మరో అవకాశం కల్పించినట్లు తాజా సమాచారం. సంతానం హీరోగా తాను చేస్తున్న తదుపరి చిత్రంలోనూ రెజీనానే నాయకి అట. హాస్య పాత్రల్లో నటించి కథానాయకుడైన సంతానంతో నటించనున్నారేమిటన్న ప్రశ్నకు ఈ బ్యూటీ చాంతాడంత కారణానే చెప్పేస్తున్నారు. అదేమిటో చూద్దాం. నాకు సంతానం హాస్యనటుడిగానూ, కథానాయకుడిగానూ నచ్చుతారు. అంతగా ఆయన ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతారు. ముఖ్యంగా హీరోగా అవతారమెత్తిన తరువాత తన బాడీలాంగ్వేజ్‌ను పక్కాగా మార్చుకున్నారు. డాన్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ ఇతర హీరోలు ఆశ్చర్యపోయేలా సూపర్‌గా నటిస్తున్నారు. అందుకే ఆయనతో నటించనుండడం సంతోషంగా ఉంది. -
శింబుకు జతగా మిల్కీ బ్యూటీ
నటి తమన్నా ప్రస్తుతం కోలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అవకాశాలు తలుపు తడుతున్నాయి. బాహుబలి చిత్రం తరువాత తమన్నా తమిళంలోనే అధిక చిత్రాలు చేస్తున్నారు. ఇందుకు ఇక్కడ వరుస విజయాలు ఒక కారణం కావచ్చు. బాహుబలి, తోళా, ఇటీవల తెరపైకి వచ్చిన ధర్మదురై చిత్రాలు తమన్నా మార్కెట్‌ను పెంచాయి. ప్రస్తుతం విశాల్‌కు జంటగా కత్తిసండై చిత్రం లో నటిస్తున్నారు. తాజాగా సంచలన నటుడు శింబుతో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. శింబు ప్రస్తుతం అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు.త్రిష ఇల్ల న్నా నయనతార చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇక పాత్ర 90 కాలఘట్టానికి చెందిందిగా ఉంటుందట. ఈ పాత్రకు జోడిగా నటి శ్రీయ ఇప్పటికే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఇద్దరు హీరోయిన్లు చిత్రంలో ఉంటారని చిత్ర యూనిట్ ఇంతకు ముందే పేర్కొంది.అందులో ఒకరిగా నటి తమన్నాను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. అయితే ఈ పాత్ర కోసం చాలా మంది నటీమణులను సంప్రదించారు. నటి హన్సిక నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే చాలా మంది శింబుతో నటించడానికి నిరాకరించినట్లు ప్రచారం జరి గింది. ఏదేమైతేనేం చివరికి నటి తమన్నా శింబుతో నటించడానికి సై అన్నారు. ఇప్పటికే శింబు,శ్రీయలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారట. ఇక శింబు, తమన్నాల సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోందని సమాచారం. ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో మహత్, వీటీవీ.గణేశ్, వైజీ.మహేంద్రన్ నటిస్తున్నారు. గ్లోబల్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మాత మైఖేల్‌రాయప్పన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. శింబు,శ్రీయలపై చిత్రీకరించిన గీతం సింగిల్ ట్రాక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. అంతకు ముందు విజయ్, సూర్య, కార్తీ అంటూ స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన మిల్కీబ్యూటీ తాజాగా ఇంతకు ముందెప్పుడూ జత కట్టని హీరోతో నటించడం గమనార్హం. ధర్మదురై చిత్రంలో తొలిసారిగా విజయ్‌సేతుపతితో జత కట్టారు.ఆ తరువాత విశాల్‌తో ఫస్ట్‌టైమ్ నటిస్తున్నారు. ఇక శింబు కలయికలోనూ ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. అదే విధంగా నటి శ్రీయతో కలిసి నటిస్తున్న తొలి చిత్రం అన్భానవన్ అసరాదన్ అడంగాదవన్నే అవుతుంది. -
మన్మథుడికి జోడీగా తమన్నా
మన్మథుడితో తమన్నా జోడీ కడుతున్నారు. మన్మథుడు అంటే నాగార్జున అనుకునేరు. తమిళ హీరో శింబు. ఆన్‌స్క్రీన్ ‘మన్మథ’, ‘వల్లభ’ సినిమా లతో పాటు ఆఫ్‌స్క్రీన్ నయనతార, హన్సిక వంటి హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపిన శింబు మన్మథుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడీ హీరోకి జంటగా ‘అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్’ (ఎఎఎ) సినిమాలో తమన్నా నటిస్తున్నారు. ఆమెకు శింబుతో తొలి సినిమా ఇది. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆల్రెడీ శ్రీయా ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పుడు తమన్నాని నాయికగా తీసుకున్నారు. ఈ ఇద్దరూ కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంటారట. ముగ్గురు నాయికలు నటిస్తున్న సినిమాలో తమన్నా ఎందుకు నటిస్తున్నారంటే కథే కారణం అంటున్నారు దర్శకుడు. ‘‘సినిమాలో మెయిన్ ట్విస్ట్‌కి తమన్నా క్యారెక్టరే కారణం. వెరీ ఇంపార్టెంట్ రోల్’’ అని దర్శకుడు తెలిపారు. కథ విని తమిళ సినిమాల్లో ఇప్పటివరకూ ఇంత డిఫరెంట్, ఫ్రెష్, కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ రాలేదని తమన్నా అప్రిషియేట్ చేశారని దర్శకుడు పేర్కొన్నారు. -
నలుగురు బ్యూటీస్‌తో అధర్వ
యువ నటుడు అధర్వ నలుగురు భామలతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. కనిదన్ చిత్రం తరువాత నటుడు అధర్వ నటిస్తున్న చిత్రం జెమినీగణేశనుమ్ సురుళిరాజనుమ్. ఇందులో ఆయన సరసన రెజీనా, ప్రణీత, ఐశ్వర్య రాజేశ్, ఆనంది నాయికలుగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సూరి, నాన్‌కడవుల్ రాజేంద్రన్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాత టీ.శివ అమ్మా క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది. కాగా ఓడమ్ ఇళవరసు కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది రొమాంటిక్ లవ్, కామెడీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. అమ్మాయిల తొలి ప్రేమ వారి జీవితాల్లో ఎంత ప్రభావం చూపుతుందో అన్నది చాలా అందంగా చెప్పనున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను మధురైలో పూర్తి చేసినట్లు చెప్పారు. రెండో షెడ్యూల్‌ను ప్రస్తుతం ఊటీలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. చిత్రాన్ని డిసెంబర్లో తెరపై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాత టీ.శివ తెలిపారు. ఆయన ఈ చిత్రాన్ని 2ఎంబీ సంస్థ అధినేతలు రఘునందన్, పీఎస్ఆర్.చంద్రశేఖర్, ఆర్.శరవణన్‌లతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేతలు ఐబీ.కార్తీకేయదిలీపన్ సంగోటయ్య, డీ.పరంజ్యోతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
మరోసారి విక్రమ్‌తో..
విక్రమ్, త్రిషలది సూపర్‌హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. సామి చిత్రం వీరిద్దరితో పాటు దర్శకుడు హరి కెరీర్లోనూ చాలా కీలకమైనది. విక్రంను కమర్షియల్ హీరోగా స్థాయిని పెంచిన చిత్రం సామి. ఇక త్రిషకు తొలి సూపర్‌హిట్ చిత్రం ఇదే. ఈ చిత్రం బాలకృష్ణ హీరోగా లక్ష్మీనరసింహ పేరుతో రూపొంది మంచి విజయాన్ని సాధించింది. 2002లో తెరపైకి వచ్చిన సామి చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు హరి ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతున్నాయని సమాచారం. ప్రస్తుతం హరి నటుడు సూర్య కథానాయకుడిగా ఎస్-3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావొచ్చింది. దీంతో హరి విక్రమ్‌తో సామి-2 చిత్రానికి సిద్ధమవుతున్నారు. కాగా సామి చిత్రంలో నటించిన త్రిషనే సీక్వెల్లోనూ నటించనున్నట్లు దర్శకుడి వర్గం తెలిపారు. అయితే ఆమె ఇందులో హీరోయిన్గా నటిస్తారా? లేక వేరే ముఖ్య పాత్రలో కనిపించనున్నారా? అన్నది సస్పెన్స్ అని అంటున్నారు. ఇందులో ఒక అగ్రనటి హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. అయితే నటి నయనతార సామి-2లో నాయకిగా నటించే అవకాశం ఉన్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. విక్రమ్‌తో ఇరుముగన్ చిత్రంలో నటిస్తున్న నయనతార వెంటనే మళ్లీ ఆయనతో జత కట్టడానికి రెడీ అవుతారా? అన్నది చర్చనీయాంశమైన విషయం. సామి-2 చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే వరకూ ఇలాంటి ఊహాగానాలు ప్రసారం అవుతూనే ఉంటాయి. -
షారుక్‌కి అమ్మాయిలంటే పిచ్చి!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కి కింగ్ ఆఫ్ రొమాన్స్ అని ముద్దుపేరు. ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌లో అతడి తర్వాతే మిగతా బాలీవుడ్ హీరోలు ఎవరైనా అని విశ్లేషకులు అంటుంటారు. షారూక్ అంటే అమ్మాయిలకు అంత పిచ్చి అభిమానం. అటువంటిది ఈ రొమాంటిక్ హీరో అమ్మాయిలంటే పడి చచ్చే పాత్రలో నటిస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ! దర్శకుడు ఇంతియాజ్ అలీకి ఆ ఆలోచనే వచ్చింది. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సరిగ్గా అలాంటి పాత్రనే చేస్తున్నారు షారుక్. ఈ సినిమాలో హీరోది గైడ్ క్యారెక్టర్ అనే వార్త ఎప్పుడో బయటకొచ్చింది. లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే.. షారుక్ వుమనైజర్గా కనిపించనున్నారట. ఈ చిత్రానికి ‘ది రింగ్’ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. -
నిక్కీగల్రాణితో రొమాన్స్‌కి సై అంటున్న జీవా
నటుడు జీవాతో తొలిసారిగా రొమాన్స్‌కు సిద్ధమయ్యారు నటి నిక్కీగల్రాణి. వీరిద్దరూ కలిసి నటించే చిత్రానికి కీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. ఇంతకు ముందు నాడోడిగళ్, ఈటీ, మిరుదన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గ్లోబల్ ఇన్ఫోటెయిన్మెంట్ సంస్థ అధినేత మైఖేల్‌రాయప్పన్ ప్రస్తుతం శింబు హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా జీవా, నిక్కీగల్రాణి జంటగా కీ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. మరో నాయకిగా అనైక సోటీ నటిస్తున్నారు. నూతన దర్శకుడు కలీస్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడన్నది గమనార్హం. ఈ కీ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో ఆర్జే.బాలాజీ, మలయాళ నటుడు పద్మసూర్య, రాజేంద్రప్రసాద్, సుహాసిని, మీరాకృష్ణన్, మనోబాలా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఆ చిత్రం పూజాకార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. స్నేహితుని స్నేహితుడు తనకూ స్నేహితుడే అన్న కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో ఏకధాటిగా షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు. -
సంతానంతో రొమాన్స్‌కు రెజీనా రెడీ
హాస్యనటుడు సంతానంతో రొమాన్స్ చేసేందుకు నటి రెజీనా సిద్ధమవుతోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తదుపరి చిత్రంలో సంతానం హీరోగా నటించనున్నాడు. ఆయనకు జంటగా నటి రెజీనాను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ సమాచారం. దర్శకుడు సెల్వరాఘవన్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ బిజీ అవుతున్నారు. అలాగే దిల్లుకు దుడ్డు చిత్ర విజయంతో ఖుషీగా ఉన్న సంతానం ప్రస్తుతం సర్వర్ సుందరం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాగా నటి రెజీనా తమిళ చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్గా మారారు. ప్రస్తుతం ఎళిల్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా రెజీనా నటిస్తోంది. అదే విధంగా నటుడు రానా దగ్గుబాటితో ద్విభాషా చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నెంజం మరప్పదిలై్ల అనే చిత్రాన్ని తీస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
చైతూ కల్యాణంలో తమన్నా?
సమంత పోయె రకుల్ వచ్చె.. రకుల్ పోయె తమన్నా వచ్చె డుమ్ డుమ్ డుమ్. ఇది చదవగానే ఈ ముద్దుగుమ్మలు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి పోయారు? అని ఆలోచనలో పడ్డారా? మరేం లేదు. నాగచైతన్య హీరోగా నటించనున్న తాజా చిత్రంలో ముందుగా సమంతను నాయికగా తీసుకున్నారనే వార్త వినిపించింది. ఆ తర్వాత రకుల్ పేరు సీన్లోకొచ్చింది. ఇప్పుడు తమన్నా పేరు వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించినంతవరకూ మరో కథానాయిక పేరు వినిపించదనీ, తమన్నాని ఫైనలైజ్ చేసేశారని సమాచారం. ‘100% లవ్’, ‘తడాఖా’ చిత్రాల్లో చైతు, తమన్నా జోడీ చూడచక్కగా ఉంటుంది. ఈ రెండూ హిట్ సినిమాలే. ఒకవేళ మూడోసారి కూడా జతకట్టి, ఆ సినిమా హిట్ అయితే అప్పుడు ఈ ఇద్దరూ ‘హ్యాట్రిక్’ సాధించినట్లవుతుంది. నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. దీనికి ‘కల్యాణం’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. -
నాతో ఆయన చాలా చెప్పారు
శింబు చాలా టిప్స్ చెప్పారని అంటోంది నటి మంజిమామోహన్. ఇటీవల కోలీవుడ్‌కు దిగుమతి అయిన మాలీవుడ్ బ్యూటీ ఆ అమ్మడు. అంతే కాదు ఒకే దెబ్బకు రెండు కాయలు అన్న సామెత మాదిరి ఒకే చిత్రంతో తమిళం, తెలుగు భాషల్లో పరిచయం అవుతోంది. అలాగే ఇద్దరు ప్రముఖ యువ హీరోలతో ఏకకాలంలో రొమాన్స్ చేసే లక్కీచాన్స్‌ను కొట్టేసిన నటి మంజిమామోహన్. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించే అవకాశాన్ని కొద్దిలో మిస్ అయిన ఈ బ్యూటీ దాన్ని చాలా ఈజీగా తీసుకుంది. శింబుతో అచ్చంమంబదు మడమయడా చిత్రంలో నటించిన మంజిమాతో చిన్న భేటీ.. ప్ర: మీ గురించి చెప్పండి? జ: నేను బాలతారగానే చిత్ర రంగప్రవేశం చేశాను. అలా మల యాళంలో చాలా చిత్రాల్లో నటించి పలు అవార్డులను అందుకున్నాను. ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రం ద్వారా కథానాయకిగా పరి చయం అయ్యాను. ఈ చిత్ర ట్రైలర్ చూసి దర్శకుడు గౌతమ్‌మీనన్ అచ్చంయంబదు మడమయడా చిత్రంలో అవకాశం ఇచ్చారు. ప్రశ్న: ఈ చిత్రంలో మీ పాత్ర గురించి? జ: నా పాత్ర గురించి ఇప్పుడు చెప్పలేను. అయినా చెబుతున్నాను. అచ్చంయంబదు మడమయడా చిత్రంలో నా పాత్ర పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. అయినా మోడ్రన్‌గా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పను. ప్ర: మలయాళంలో మీరు చాలా స్వీటీ అమ్మాయటగా మరి తమిళంలో? జ: నాన్న నితిన్మీనన్ చాయాగ్రహకుడు.ఆయనతో చిన్నతనంలోనే షూటింగ్‌లకు వెళ్లేదానిని. అమ్మ డాన్సర్.మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్‌గోపి, దిలీప్ ఇలా అందరు హీరోలతోనూ పరిచయం ఉంది. వారందరితోనూ బాల నటిగా నటించాను. అందుకే అక్కడ నేను ముద్దుల అమ్మాయిని. కోలీవుడ్‌కు ఇప్పుడేగా పరిచయం అవుతున్నాను. కొంచెం సమయం పడుతుంది. ప్ర: శింబుతో నటించిన అనుభవం? జ: శింబు చాలా ప్రతిభావంతుడైన నటుడు.కెమెరా యాంగిల్స్ నుంచి లై ట్స్ వరకూ అన్ని తెలిసిన నటుడు. నాకు చాలా టిప్స్ చెప్పారు. శింబుతో నటించడం మంచి అనుభవం.అదే విధంగా నాగచైతన్యతో కూడా. ప్ర: ఎలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు? జ: నటన విషయంలో నేనెలాంటి హద్దులు పెట్టుకోలేదు. చాలెంజింగ్ పాత్రలు చేయాలని ఆశపడుతున్నాను. తమిళ ప్రేక్షకులు ప్రతిభావంతులైన వారిని ఆదరిస్తారు. వారికి నచ్చే పాత్రల్లో నటించి మెప్పించాలని కోరుకుంటున్నాను. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రం? జ: విక్రమ్‌ప్రభుకు జంటగా మడిచూడ మన్నన్ చిత్రంలో నటిస్తున్నాను. దీనికి ప్రభాకరన్ దర్శకుడు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ప్ర: సరే మంజిమా అంటే అర్థం? జ: అది బెంగాళీ పదం.మంజిమా అంటే అందాలరాశి అని అర్థం -
స్వచ్ఛమైన ప్రేమ
భిన్నమైన నేపథ్యాలు, వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ప్రిన్ ్స, వ్యోమనంది, పూజా రామచంద్రన్ ప్రధానపాత్రల్లో వాణి యం. కొసరాజు దర్శకత్వంలో శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలవుతోంది. దర్శకురాలు మాట్లాడుతూ- ‘‘ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. ఈ తరంలో అమ్మాయిలు కూడా ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారని అంటున్నారు. అవసరమైతే ప్రేమ కోసం అమ్మాయిలు త్యాగాలు చేస్తారు. ఇదే విషయాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.సురేశ్‌బాబు, శ్రీనివాస్ వూడిగ. -
లక్కు మారుతుందా?
ఆశలు, కోరికలు మనిషికి సహజం. అయితే అవి తీరడానికి చేసే ప్రయత్నమే ప్రధానం. అదృష్టం కూడా తోడవ్వాలి. ఈ రెండోదే కలిసి రాని నటిగా మారారు ప్రణీత. ఈ కన్నడ భామ మంచి అందగత్తే. నటిగా కూడా పెద్దగా కొరతలూ లేవు. లేనిదల్లా లక్కే...ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇది అస్సలు లేదు ప్రణీతకు. ఉదయన్ చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమలో ఏన్నో ఆశలతో రంగప్రవేశం చేసిన నటి ప్రణీత. అరుళ్‌నిధి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ప్రణీతకు బోలెడంత నిరాశ. చిన్న గ్యాప్ తరువాత కార్తీతో శకుని చిత్రంలో రొమాన్స్ చేసి అవకాశం రావడంతో ప్రణీతలో మరోసారి ఆశలు చిగురించాయి. అయితే శకుని అపజయంతో ఈ బ్యూటీ ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. మళ్లీ అవకాశాలు నిల్. కొంతగ్యాప్ తరువాత మాస్ చిత్రంలో సూర్యతో నటించే అవకాశం వచ్చింది. రెండో నాయకి పాత్ర అయినా టాప్ హీరో సరసన కావడంతో మంచి ప్రచారం వస్తుంది. తద్వారా అవకాశాలు రాబట్టుకోవచ్చన్న చిన్న ఆశతో ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. నిజానికి ఆ పాత్రను శ్రుతీహాసన్ చేయాల్సింది. ప్రాధాన్యత లేదని తను ఆ చిత్రం నుంచే వైదొలగారు. మాస్ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. మళ్లీ ప్రణీత కథ మొదటికి వచ్చింది. అంతే కాదు లక్కు లేని నటి అనే ముద్రకు గురయ్యారు. అయితే తాజాగా నటుడు జై తో నటించే అవకాశం వచ్చింది. ఎనక్కు వాయ్oద అడిమైగళ్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇంతకు ముందు చిత్రాలలో అందాల ఆరబోత విషయంలో హద్దులు చెరిపేసిన ప్రణీత ఈ చిత్రంలో కాస్త డోస్ తగ్గించి నటిస్తున్నారట. అభినయానికి ప్రాధాన్యతనిస్తూ, సంభాషణలు బట్టీ పట్టి, రిహార్సల్ చేసి మరీ కెమెరా ముందుకు వెళుతున్నారట. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు ఓకే అన్నా తనకు తృప్తి కలగలేదంటూ మరో టేక్ తీసుకుని మరీ నటిస్తున్నారట. ఈ చిత్రంతో లక్కు లేని నటి అన్న ముద్రను తుడిచేస్తుందని, తానూ కోలీవుడ్‌లో ప్రముఖ నాయకిగా పేరు తెచ్చుకుంటాననే ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
చైతూ జోడీ సమంత కాదా?
టాలీవుడ్లో రకుల్ ప్రీత్‌సింగ్ స్టార్ డమ్‌కు ఇప్పట్లో ఢోకా లేనట్లే. అనుకున్న అవకాశాలతో పాటు.. అనుకోని ఆఫర్లూ ఈ బ్యూటీని వెతుక్కుంటూ వస్తున్నాయి. మహేష్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో రకుల్ నాయికగా ఎంపికయ్యారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గురువారం మురుగదాస్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే నాగచైతన్య కొత్త సినిమాలోనూ రకుల్ ప్రీత్ సింగ్నే హీరోయిన్గా తీసుకున్నారట! సమంత ఈ సినిమాలో నాయికగా ఉంటుందని ముందు అనుకున్నా... ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారని సమాచారం. ఈ మధ్య సమంత, నాగచైతన్య మధ్య రిలేషన్ ఎక్కువగా వార్తల్లో ఉండటమే సమంతను ప్రాజెక్ట్ నుంచి తప్పించడానికి కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. -
విష్ణువిశాల్‌తో మరోసారి శ్రీదివ్య
సక్సెస్ఫుల్ చిత్ర జంట కాంబినేషన్లో మరో చిత్రం అంటే దానికి తప్పకుండా క్రేజ్ ఉంటుంది. జీవా చిత్రంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణువిశాల్, శ్రీదివ్య తాజాగా మరోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. జీవా చిత్ర షూటింగ్ సమయంలో ఈ జంట గురించి పలు వదంతులు ప్రచారం అయ్యాయి. కాగా నటుడు విష్ణువిశాల్, దర్శకుడు సుశీంద్రన్‌లది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంతో విష్ణువిశాల్ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు సుశీంద్రన్ ఆ తరువాత ఆయనే హీరోగా జీవా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ కాంబినేషన్ మరో విజయానికి రెడీ అవుతోంది. నిజానికి సుశీంద్రన్ నటుడు ఉదయనిధి హీరోగా చిత్రం చేయాల్సింది. ఆ చిత్రం వాయిదా పడటంతో విష్ణువిశాల్‌తో చిత్రం ప్రారంభిస్తున్నారు. ఇందులో నాయకిగా ముందు మంజిమా మోహన్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి ఈ అవకాశం నటి శ్రీదివ్యను వరించింది. ఇది రొమాంటిక్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలంటున్నాయి. ఇందులో నటుడు పార్తీబన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 15న ప్రారంభం కానుంది. వేల్లైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత విష్ణువిశాల్ నటిస్తున్న చిత్రం ఇదే. -
అప్పటివరకూ ఈ కష్టాలు తప్పవ్!
‘‘ప్రేమకథా చిత్రాల్లో క్యూట్ అండ్ బబ్లీ పాత్రల్లో నటించడానికి హిందీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ప్రస్తుతానికి నా దృష్టంతా నటనకు ఆస్కారమున్న పాత్రల మీదే. ముందు నటిగా నిరూపించుకోవాలి. ఆ తర్వాతే గ్లామరస్ క్యారెక్టర్స్ గురించి ఆలోచిస్తా’’ అని తాప్సీ స్పష్టం చేశారు. తెలుగు చిత్రం ‘ఝమ్మంది నాదం’తో తాప్సీ కథానాయికగా ప్రయాణం ప్రారంభించారు. కెరీర్ ఆరంభంలో రెగ్యులర్ హీరోయిన్ పాత్రల్లో నటించారామె. ఆ తర్వాత కథలు, చిత్రాల ఎంపికలో తాప్సీ దృక్పథంలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది. ముఖ్యంగా హిందీ చిత్రం ‘బేబీ’ తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలపైనా, హిందీ చిత్రాలపైనా దృష్టి పెట్టారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ‘పింక్’, ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో ‘తడ్కా’, రానా దగ్గుబాటి సరసన హిందీ, తెలుగు ద్విభాషా చిత్రం ‘ఘాజి’లో నటిస్తున్నారు. పాత్రల ఎంపిక విషయంలో తనలో వచ్చిన మార్పు గురించి తాప్సీ మాట్లాడుతూ - ‘‘తెలుగులో గ్లామరస్ రోల్స్‌తో పాటు పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్నవి చేశాను. వాస్తవానికి తెలుగులో ముందు చేసింది గ్లామరస్ రోల్సే. కానీ, హిందీలో మాత్రం ముందు టిపికల్ రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయాలనుకోలేదు. మంచి నటిగా పేరు తెచ్చుకున్నాక రెగ్యులర్ క్యారెక్టర్స్‌పై దృష్టి పెడ్తా. ఇమేజ్, మార్కెట్ పరంగా హిందీ చిత్ర పరిశ్రమలో నాకంటే పెద్ద హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అందుకని హిందీ ప్రేక్షకులకు దగ్గర కావాలంటే భిన్నమైన రూట్లో వెళ్లాలి. నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటించడం ఒక్కటే మార్గం అని నాకనిపించింది. ఇప్పటికే ‘బేబి’ నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు చేస్తున్నవి కూడా మంచి పాత్రలే. వీటి ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైపోతాను. ఆ తర్వాత టిపికల్ హీరోయిన్గా కనిపించినా వారు ఆదరిస్తారు. అప్పటివరకూ ఈ కష్టాలు తప్పవ్’’ అని వ్యాఖ్యా నించారు. -
విజయ్‌తో రొమాన్స్‌కు కీర్తీ రెడీ
కాలేజ్ కుర్రాడిలా నటి కీర్తీసురేశ్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారట ఇళయదళపతి విజయ్. ఈయన నటిస్తున్న తాజా చిత్రాన్ని ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ విజయాప్రొడక్షన్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ 60వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరతన్ దర్శకుడు. ఇందులో విజయ్ ద్విపాత్రాభియనం చేస్తున్నారు. ఇంతకు ముందు ఇదే దర్శకుడి చిత్రం అళగీయ తమిళ్ మగన్ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారన్నది గమనార్హం. తాజా చిత్రం ఇంతకు ముందు ఎమ్జీఆర్ నటించిన ఎంగవీటి పిళ్లై చిత్రాన్ని మోడరేట్ చేసి రీమేక్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రం షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ పేరు నిర్ణయించని చిత్రం తదుపరి షూటింగ్‌కు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ విజయ్ నటించే ఒక పాత్ర సన్నివేశాలనే చిత్రీకరించిన చిత్ర యూనిట్ ఇప్పుడు రెండో పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనుందట. ఈ పాత్రలో విజయ్ కళాశాల విద్యార్థిగా కనిపించనున్నారని తెలిసింది. ఈ పాత్ర కోసం తన శారీరక భాషను పూర్తిగా మార్చనున్నారట. అంతే కాదు 10 కిలోల బరువును తగ్గి చాలా యంగ్‌గా కొత్త గెటప్‌కు సిద్ధమవుతున్నారట. ఇంతకు ముందు తన చిత్రాల్లో గెటప్ కోసం పెద్దమార్పులు చేయని విజయ్ తాజా చిత్రం కోసం చాలా శ్రద్ధతీసుకుని నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్రలో నటి కీర్తీసురేశ్‌తో రొమాన్స్ చేసే సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు చిత్ర వర్గాలు. ఇందులో టాలీవుడ్ స్టార్ నటుడు జగపతిబాబు, సతీష్, డేనియల్ బాలాజీ, సుదన్సు పాండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
జీవాతో రొమాన్స్‌కు నిక్కీ సై
మధ్య స్థాయి కథానాయకులకు లక్కీ నాయకిగా మారిన నటి నిక్కీగల్రాణి అని చెప్పవచ్చు. డార్లింగ్ చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత యాగవరాయన్ నాకాక్క చిత్రాల్లో నటించారు. ఇటీవల విష్ణువిశాల్‌తో రొమాన్స్ చేసిన వేల్లైన్ను వందుట్టా వెల్లైక్కారన్ చిత్రం అనూహ్య విజయంతో అమ్మడి క్రేజ్ అదే స్థాయిలో పెరిగిపోయింది. ప్రస్తుతం నాలుగు చిత్రాల వరకూ చేతిలో ఉన్నాయి. మరిన్ని కొత్త అవకాశాలు నిక్కీ కోసం ఎదురు చూస్తున్నాయి.విజయ్, అజిత్, విక్రమ్ వంటి స్టార్ హీరోల తరువాత స్థాయిలో రాణిస్తున్న జీవా, జీవీ.ప్రకాశ్, విక్రమ్‌ప్రభు లాంటి హీరోలకు నిక్కీగల్రాణి లక్కీ హీరోయిన్గా మారారని చెప్పవచ్చు. ప్రస్తుతం లారెన్స్ సరసన మొట్టశివ కెట్టశివ, జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రాల్లో నటిస్తున్న నిక్కీగల్రాణి త్వరలో విక్రమ్‌ప్రభుకు జంటగా నటించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా మరో అవకాశం నిక్కీని వరించింది. నటుడు జీవాతో డ్యూయెట్లు పాడే చాన్స్‌ను దక్కించుకుంది. నిజానికి కవలై వేండామ్ చిత్రంలోనే జీవాతో నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం మిస్ అయ్యింది. అందులో నటి కాజల్‌అగర్వాల్ నటిస్తున్నారు. జీవా మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ చిత్రానికి కీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నిక్కీగల్రాణి ఆయనకు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. దీనికి దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడు కాళీష్ దర్శకత్వం వహించనున్నారు. ఆర్జే.బాలాజీ ముఖ్య పాత్రను పోషించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నట్లు సమాచారం. -
టీవీలో సంచలనం: అమ్మాయితో గొరిల్లా రొమాన్స్
ఇప్పటికే ఆమె జీవితంలో ఇద్దరు మగాళ్లున్నారు. ఒకడు నిశ్చితార్థం ముందు ఆమెను కాదని, మళ్లీ వెంటపడేవాడు. మరొకడు.. ఆమె పనిచేస్తోన్న టీవీ చానెల్ ఓనర్. రెండో వాడంటే ఆమెకూ ఇష్టమే. కానీ ఆ డబ్బున్న మారాజు తల్లిదండ్రులకు మాత్రం అతడు ఈమెను పెళ్లిచేసుకోవడం ఇష్టంఉండదు. స్వతంత్ర భావాలున్న ఆమె.. ప్రేమలో వరుస వైఫల్యాల కారణంగా కుంగిపోతుంది. దీంతో జీవితం కాస్త భారంగా మారిపోతుంది.. అదే సమయంలో ప్రేమైక జీవనం కోసం తపన పెరుగుతుంది. తనవాడి కోసం ఎదురుచూస్తోన్న ఆమె దగ్గరకు అనుకోని పరిస్థితుల్లో ఓ మనసున్న(!) గొరిల్లా వస్తుంది. కాలక్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు(!). గొరిల్లాకు ఆ అమ్మాయిపట్ల ప్రేమ పుడుతుంది. పిచ్చిచేష్టలతో గుండెల్లో నిండుగా ఉన్న ప్రేమను ప్రదర్శిస్తుందా గొరిల్లా. భారతీయ బుల్లితెర చరిత్రలో ఇదొక సంచలనం. మొట్టమొదటిసారి ఓ టీవీ సీరియల్ లో భారీ జంతువు.. అది కూడా ఫుల్ లెంత్ పాత్రలో కనిపించనుంది. ఏడాది కాలంగా కలర్స్ చానెల్ లో ప్రసారం అవుతూ, మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోన్న 'థప్ కీ ప్యార్ కి' సీరియల్ లో ఈ అరుదైన దృశ్యాలు చోటుచేసుకోనున్నాయి. బిగ్ బ్రదర్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న జిగ్యాస్ సింగ్ 'థప్ కీ' షోలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. గొరిల్లా ఆమె వద్దకు చేరుకునే, ఇంట్లో నానా యాగీ చేసి, ఆమెను మెప్పించే ఎపిసొడ్లు జూన్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. జిగ్యాస- గరిల్లాల మధ్య సాగే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఏమేరకు రంజింపజేస్తాయో చూడాలి! -
అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు
ఒత్తిడి చేసిన మాట నిజమే అరకొర దుస్తులు ధరించాలంటూ తనపై ఒత్తిడి చేసిన మాట నిజమే నంటూ నటి ఆనంది స్పష్టం చేశారు.ఈ అమ్మడు త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర విడుదల సమయంలో ఆ చిత్ర దర్శకుడిపై విమర్శల వర్షం కురిపించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం తరువాత జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో రెండో సారి ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో రొమాన్స్ చేసిన నటి ఆనంది. ఈ చిత్రం ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆ బ్యూటీ ఏమన్నారో చూద్దాం. నేను అనుకోకుండానే నటినయ్యాను. చదువుకునే రోజుల్లో నటనపై ఎలాంటి ఆసక్తి లేదు. కయల్ చిత్రంలో కథానాయకిగా అవకాశం ఇచ్చి దర్శకుడు ప్రభుసాల్మన్ నాకు గుర్తింపు తెచ్చిపెట్టారు.ఆయనే నాకు నటనను నేర్పించారు. ఆ తరువాత త్రిష ఇల్లన్నా నయనతార, పొరియాళన్, చండీవీరన్ చిత్రాల్లో నటించాను. అదే విధంగా తెలుగులోనూ కొన్ని చిత్రాలు చేశాను. అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు ఇంతకు ముందు చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. కొన్ని చిత్రాల్లో అరకొర దుస్తులు ధరించి అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు. చాలా అసౌకర్యానికి గురయ్యాను. అయితే అలా నటించేదిలేదని, కాదంటే షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించాను. గ్లామరస్ దుస్తులు నా శరీరాకృతికి సరిపడవు. అందువల్ల అలాంటి దుస్తులు ధరించకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని చిత్రాన్ని అంగీకరించే ముందే దర్శక నిర్మాతలకు తెలియజేస్తాను. ఇప్పటీకీ కథ విన్నప్పుడే గ్లామరస్‌గా నటించను, టూపీస్ దుస్తులు ధరించను అని దర్శకుడితో చెప్పేస్తాను. అయితే ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో మంచి పాత్రలో నటించే అవకాశం లభించింది. ఇందులో దాదా కూతురిగా నటించాను. జీవీ.ప్రకాశ్‌కుమార్ నాకు సిఫార్సు చేశారనే ప్రచారం జరుగుతోంది. అందులో ఏమాత్రం నిజం లేదు. షూటింగ్లో యూనిట్ సభ్యులు నన్ను చక్కగా చూసుకున్నారు.చాలా సౌకర్యంగా అనిపించింది. -
ఏమో మళ్లీ స్టేజీ ఎక్కవచ్చునేమో
చక్కని నటి కమలినీ ముఖర్జీ. తెలుగులో ఆనంద్ చిత్రంతో అందరినీ అలరించిన బ్యూటీ ఈమె. బహుభాషా నటిగా గుర్తింపు పొందినా ఎందు చేతనో క్రేజీ నాయకి స్థాయికి చేరుకోలేదు. ఇంతకు ముందు తమిళంలో వేట్టైయాడు విళైయాడు చిత్రంలో కమలహాసన్‌తో రొమాన్స్ చేసిన కమలిని ముఖర్జి.. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఇరైవి చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.ఈ సందర్భంగా కమలిని ముఖర్జీ తన అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారు. వేట్టైయాడు విళైయాడు చిత్రంలో కమలహాసన్‌కు జంటగా చిన్న పాత్రనే పోషించినా నాకు తమిళ ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ మరువలేనిది. నేను ఇక్కడ అధిక చిత్రాలు చేయకపోయినా ఇంకా గుర్తు పెట్టుకున్నారు. అలాంటి వైవిధ్యభరిత పాత్రల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇరైవి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో కుటుంబం, ఉద్యోగం రెండింటిని మేనేజ్ చేసుకుంటూ జీవించే పాత్ర. ఇప్పటి వరకూ నేను నటించిన పాత్రలకు భిన్నమైనది. ఈ పాత్రతో మరోసారి తమిళ ప్రేక్షకులకు దగ్గరవుతాననే నమ్మకం ఉంది. భాష నాకు సమస్య కాదు. నాకు నచ్చిన హీరో ఎవరని అడుగుతున్నారు. నటనకే నేను అభిమానిని. తదుపరి చిత్రం ఏమిటన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రస్తుతం మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నాను. ఇక రచన,ప్రయాణం, పాకశాస్త్రం కళలపై ఆసక్తి చూపుతున్నాను. భవిష్యత్‌లో పలు కథలు రాస్తాను. నేను రంగస్థలంపై నటించాను. ఏమో మళ్లీ స్టేజీ ఎక్కవచ్చునేమో. -
అజిత్‌తో ఆ ఇద్దరు
సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్‌ల తరువాత హీరోయిన్స్ జత కట్టాలని ఆశ పడేది అజిత్‌తోనే. ఆయనతో ఒక్క చిత్రంలోనైనా నటించాలని కోరుకోని హీరోయిన్ ఉంటారని అనుకోలేం. ప్రస్తుత ప్రముఖ నటీమణుల్లో నయనతార, అనుష్క, త్రిష లాంటి వారందరూ అజిత్‌తో రొమాన్స్ చేసినవారే. ఇప్పటికీ అలాంటి అవకాశం రాని వారిలో నటి కాజల్ అగర్వాల్ ఒకరు. ఆమెకు తాజాగా ఆ అవకాశం వచ్చిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. వేదాళం చిత్రం తరువాత కాలుకు శస్త్ర చికిత్స, ఫ్యామిలీతో విహార యాత్ర అంటూ చిన్న విరామం తరువాత అజిత్ తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. తన 57వ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించడానికి సిద్ధం అయ్యింది. వీరం, వేదాళం చిత్రాల దర్శకుడు శివ మూడోసారి అజిత్‌ను డెరైక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో అజిత్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలిసింది. అందులో ఒకరు అందాలభామ అనుష్క అని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కాగా మరో హీరోయిన్గా నటించే అవకాశం నటి కాజల్ అగర్వాల్‌కు దక్కిందని తెలిసింది. ఈ బ్యూటీ కూడా ఇటీవల ఒక భేటీలో త్వరలో అజిత్‌కు జంటగా నటించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో అజిత్ తాజా చిత్రంలో అనుష్క, కాజల్‌అగర్వాల్ డ్యూయెట్లు పాడడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మంచి కమర్షియల్ అంశాలతో భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ 60 శాతం విదేశాలలో జరుపుకోనుందని సమాచారం. చిత్రం షూటింగ్ ఈ జూన్ నెలలో ప్రారంభం కానుంది. -
జీవీతో సాయిపల్లవి రొమాన్స్
జీవీ ప్రకాశ్‌కుమార్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది నటి సాయిపల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్‌తో ఒక్క సారిగా పాపులరైన ముగ్గురు హీరోయిన్లలో నటి సాయిపల్లవి ఒకరని చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా ఇద్దరిలో మడోన్నా సెబాస్టియన్ ఇప్పటికే కోలీవుడ్‌కు పరిచయమై కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రంతో విజయాల ఖాతా ఓపెన్ చేసుకున్నారు. ఇక మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్లో అవకాశాలను అందుకుంటున్నారు. ఆమె నటించిన తెలుగు చిత్రం అఆ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా సాయిపల్లవి మాత్రం ఇతర భాషల్లోకి రంగప్రవేశం చేయలేదు. అయితే అవకాశాలు మాత్రం వస్తున్నాయి. ఇటీవల ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో కార్తీకి జంటగా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అది ఈ బ్యూటీని నిరాశపరచే సంఘటనే అయినా తాజాగా లక్కీ ఛాన్స్ సాయిపల్లవిని వరించింది. సక్సెస్ఫుల్ యువనటుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌తో జతకట్టే అవకాశం అభించింది. డార్లింగ్ అంటూ కథానాయకుడిగా తెరపైకి వచ్చిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్. ఆ చిత్రంతో పాటు, ఆ తరువాత విడుదలైన త్రిష ఇల్లన్నా నయనతార, పెన్సిల్ చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆయనకు హీరోగానూ పలు అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం జీవీ నటించిన బ్రూస్లీ, ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రాలు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. తాజాగా జీవీ మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి రాజీవ్‌మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు మిన్సారకనవు, కండుకొండేన్ కండుకొండేన్ చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సాయిపల్లవి నాయకిగా ఎంపికైనట్లు తాజా సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని తెలిసింది. -
అవకాశం వస్తే ఆయనతో..
కోలీవుడ్‌లో నంబర్‌ఒన్ హీరోయిన్గా వెలుగొందుతున్న నటి నయనతార. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆమెను వరుస విజయాలు టాప్ రేంజ్లో నిలబెట్టాయి. విశేషం ఏమిటంటే ఇటీవల ప్రముఖ నటుల కంటే యువ హీరోలతోనే నయనతార నటించిన చిత్రాలే మంచి విజయాన్ని సాధిం చాయి. దీంతో తను కూడా చిన్నా పెద్ద హీరోలని చూడకుండా కథా పాత్రలకే ప్రాముఖ్యత నిస్తున్నారు. మాయ చిత్రం నయనను లేడీఓరి యెంటెడ్ హీరోయిన్న చేసింది. ఇటీవల ఆమె ప్రముఖ కథానాయకుడి సరసన చిత్రాలు చేయలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేసి చాలా కాలమైంది. విల్లు చిత్రంలో తొలిసారిగా విజయ్ తో జత కట్టారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత శివకాశి చిత్రంలో ఇళయదళపతితో సింగల్ సాంగ్‌లో లెగ్ షేక్ చేశారు.ఆ తరువాత విజయ్‌తో నటించే అవకాశాలు వచ్చినా తను ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం తో వాటిని నయనతార అంగీకరించలేని పరిస్థితి. దీంతో వీరిద్దరు కలి సి నటిస్తే చూడాలన్న ఆకాంక్ష ప్రేక్షకుల్లో నెలకొంది. కరెక్ట్‌గా అలాం టి కోరికనే నయనతార ఇటీవల వెల్లడించడం విశేషం. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించడానికి మంచి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అని నయనతార తన మనసులోని మాటను వ్యక్తం చేశారు. మరి దర్శక నిర్మాతలు ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ జంట కోసం కథలు రెడీ చేసుకోండి. -
వాస్తవ సంఘటన ఆధారంగా...
హైదరాబాద్‌లో 1957లో జరిగిన వాస్తవ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘వసుదైక 1957’. బ్రహ్మాజీ, ‘సత్యం’ రాజేష్, అదుర్స్ రఘు, షాని, బేబి యోధ ముఖ్య పాత్రధారులు. బాల దర్శకత్వంలో అరుణ సమర్పణలో నిడమలూరి శ్రీనివాసులు నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఐదేళ్ల పాప జీవితంలో 1957లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. సస్పెన్స్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత శ్రీనివాసులు తెలిపారు. -
అలాంటి చిత్రాల్లో నటించను
నటి తమన్నాకిది సెకెండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కంటే ఇప్పుడే నటిగా తనకంటూ ఇక సార్థకతను ఏర్పరచుకుంటున్నారని చెప్పవచ్చు. అంతేకాదు బాహుబలికి ముందు ఆ తరువాత అని కూడా తమన్నా నట జీవితాన్ని విభజించి చూడాల్సి ఉంటుంది. తొలి ఇన్నింగ్‌లో అందాలారబోతకే పరిమితమైన ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త నటనకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పడం కంటే అలాంటి అవకాశాలు వరిస్తున్నాయనే అనాలి. బాహుబలి, తోళా వంటి ద్విభాషా చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో తమన్నాకు మరిన్ని అవకాశాలు తలుపుతడుతున్నాయి. దీంతో ఈ అమ్మడి ధోరణిలోను మార్పు కనిపిస్తోంది. పారితోషికాన్ని అమాంతం పెంచేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇకపోతే చెత్త చిత్రాల్లో నటించేదిలేదంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లను ఇచ్చేస్తున్నారి ముంబై భామ. ముఖ్యంగా శోక పాత్రల్లో నటించేది లేదని అంటున్నారు. దీని గురించి తమన్నా ఏమంటున్నారో చూద్దాం. చిత్రాలు చూసే విషయంలో ఎవరి ఇష్టాలు వారికుంటాయి. కొందరికి ఉత్కంఠ భరితంగా సాగే హారర్ థ్రిల్లర్ కథా చిత్రాలు నచ్చుతాయి. మరి కొందరికి అవి నచ్చవి. వారు ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడతారు. భావోద్రేకాలతో కూడిన కంట తడిపెట్టించే కథా చిత్రాలను చూసే వారు ఉంటారు. నాకు మాత్రం శోక భరిత కథా చిత్రాలంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి చిత్రాలు చూడడానికి ఎవరైనా పిలిచినా రానని పారిపోతాను. అయితే అలాంటి చిత్రాల్లో నటించడంతో మంచి నటనను ప్రదర్శించే అవకాశం ఉంటుందంటారు. అందులో నిజం ఉండవచ్చు. సినీ అభిమానులు సంతోషంగా గడపడానికే థియేటర్లకు వస్తుంటారు. వారిని బాధాతప్త శోక కథలతో ఎందుకు కన్నీళ్లు పెట్టించాలి. అలా కంటతడి పెట్టించే చిత్రాల్లో నేను నటించను. ఒక వేళ నటించాల్సిన పరిస్థితులు ఏర్పడినా వాటిని నేను చూడను. ఇప్పటి వరకూ జాలీగా ఉండే చిత్రాల్లోనే నటించాను. ఇకపై కూడా ఆ తరహా చిత్రాలనే చేస్తాను అంటున్నారు తమన్నా. ప్రస్తుతం బాహుబలి-2, తమిళంలో విజయసేతుపతికి జంటగా ధర్మదురై చిత్రాల్లో నటిస్తున్న తమన్నా విశాల్‌తో రొమాన్స్ చేసే కత్తిసండై చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. త్వరలో అజిత్‌కు జంట గా నటించే అవకాశం కూడా కొట్టేసే ప్రయత్నంలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
సూపర్‌స్టార్‌కు జంటగా దీపికాపదుకొనే
షారూక్‌ఖాన్, రణ్‌బీర్‌కపూర్ లాంటి బాలీవుడ్ బడా హీరోలతో నటిస్తున్న ఉత్తరాది క్రే జీ హీరోయిన్ దీపికాపదుకొనే దక్షిణాదిలో ఒకే ఒక్క చిత్రంలో నటించారు. అదీ దక్షణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా కోచ్చయడైయాన్ అనే 3డీ యానిమేషన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ ముద్దుగుమ్మ మరోసారి దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు తమిళంలో సూపర్‌స్టార్ సరసన నటించిన దీపికాపదుకొనే ఈ సారి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో రొమాన్స్‌కు సై అన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అసలు విషయం ఏమిటంటే మహేశ్‌బాబు, దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌ల కలయికలలో ఒక భారీ చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ హీరోగా కత్తి చిత్రాన్ని రూపొందించిన ఏఆర్.మురుగదాస్ ఆ తరువాత బాలీవుడ్‌కు వెళ్లి అకిరా అనే హిందీ చిత్రాన్ని తెరకెక్కించారు. సోనాక్షీసిన్హా కథానాయకిగా నటించిన ఆ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబరులో విడుదలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తదుపరి మురుగదాస్ అజిత్ హీరోగా చిత్రం చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి.అలాంటిది తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో చిత్రం ముందుకు రావడం విశేషం. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్న అంశం గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది.ఇంతకు ముందు నటి కీర్తీసురేశ్ నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనే పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఈ భామ తెలుగులోకి అడుగు పెట్టే చిత్రం ఇదే అవుతుంది. మహేశ్‌బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రాన్ని పూర్తి చేసేపనిలో ఉన్నారు.ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించే తాజా చిత్రం వచ్చే నెల ప్రారంభం కానుందని సమాచారం. -
లారెన్స్‌తో నయన్?
అగ్ర కథానాయకిగా నటి నయనతార హవా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పరిస్థితి వద్దంటే అవకాశాలు అన్నట్టుగా ఉంది. ప్రముఖ నటుల నుంచి యువ హీరోల వరకు నయనతారతో జత కట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారన్నది నిజం. విక్రమ్‌తో ఇరుముగం, కార్తీ కాష్మోరా లాంటి భారీ చిత్రాలతో పాటు జీవాతో తిరునాళ్, శివకార్తికేయన్‌తో నూతన చిత్రంతోపాటు ఈ కేరళ కుట్టి చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు తెలుగులో బాలకృష్ణ శత చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణితో హీరోయిన్ చాన్స్ నయనతారదేననే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మరిన్ని నూతన అవకాశాల ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. తాజాగా ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌తో రొమాన్స్ చేసే అవకాశం నయనతార తలుపు తట్టిందన్నది కోలీవుడ్ వర్గాల టాక్. ఒక ప్రముఖ దర్శకుడు ఈ క్రేజీ జంట కలయికలో చిత్రం చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆయన దర్శకత్వంలో నటించడానికి వీరిద్దరూ సుముఖం వ్యక్తం చేశారట. అయితే నయనతార చిన్న నిబంధన విధించారని ఆ చిత్రం కాంచన చిత్రం తరహాలో హార్రర్ నేపథ్యం కలిగి ఉంటే బాగుంటుందని ఆ దర్శకుడి కి చెప్పినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్పుడు గాని ఎవరా ప్రముఖ దర్శకుడు, ఏమా కథ అన్న విషయాలు తెలుస్తాయన్నమాట. -
విశాల్‌తో మొదటిసారి..
బాహుబలి చిత్రం చాలా మందికి చాలా మేలు చేసింది. ముఖ్యంగా ఇక పనైపోయింది అనే ప్రచారం ముమ్మరంగా జరుగున్న నటి తమన్నాకు నటిగా పునర్జన్మ నిచ్చిందనే చెప్పాలి. ఆమె నట జీవితం బాహుబలికి ముందు ఆ తరువాత అని చెప్పుకునేంతగా మారి పోయింది. ప్రస్తుతం తమన్నా యమ బిజీ హీరోయిన్గా మారిపోయారు. ఇప్పుడు వరుసగా అవకాశాలు ఈ మిల్కీబ్యూటీ తలుపు తడుతున్నాయి. విశేషం ఏమిటంటే తెలుగుతో పాటు తమిళంలోనూ తను క్రేజీ కథానాయకి అయిపోయారు.ప్రస్తుతం తెలుగు,తమిళ్, హిందీ మొదలగు మూడు భాషల్లో నటిస్తూ పుల్‌జోష్‌లో ఉన్నారు. ఇటీవల ద్విభాషా చిత్రం ఊపిరితో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న తమన్నా ఇప్పుడు బాహుబలి-2, తమిళంలో విజయ్‌సేతుపతితో ధర్మదురై చిత్రాల్లో నటిస్తున్న తమన్నా హిందీలో ఒక చిత్రం చేస్తున్నారు. త్వరలో ఏఎల్.విజయ్ దర్శకత్వంలో అభినేత్రి అను త్రిభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. అజిత్ తాజా చిత్రంలోనూ తమన్నానే నాయకి అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో స్టార్ హీరో విశాల్‌తో రొమాన్స్ చేసే అవకాశం తమన్నాను వరించింది. ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎస్.నందగోపాల్ ఈ క్రేజీ కాంబినేషన్లో చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సురాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే చాలా కాలంగా హీరో పాత్రలే చేస్తానంటూ మొండి పట్టుతో ఉన్న హాస్య నటుడు వడివేలు ఈ చిత్రంలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు సూరి, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు, సంపత్ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. వినోదం మేళవించిన కమర్షియల్ అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రం మే నెల రెండో తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
ధనుష్‌తో రొమాన్స్‌కు లక్ష్మీమీనన్ రెడీ
ఎంత క్రేజీ తారలైనా ఎప్పుడూ ఒకే జంట కలిసి నటిస్తే వారికే కాదు చిత్రం చూసేవారికీ బోర్ కొడుతుంది. రేర్ జంట కలయికలో అయితే ఆ చిత్రం చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అలాంటి ఒక కొత్త కలయికలో చిత్రం రాబోతోందన్నది తాజా సమాచారం. యువ నటుడు ధనుష్, వరుస విసయాలను కైవసం చేసుకుంటున్న నటి లక్ష్మీమీనన్‌ల కలయికలో ఒక చిత్రం తెరకెక్కనుందన్నదే తాజా సమాచారం. నటుడు ధనుష్ ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తొడరి, దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో కొడి చిత్రాలను పూర్తి చేశారు. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోకి పాయుమ్ తూట చిత్రంలో నటిస్తున్నారు. నటి లక్ష్మీమీనన్ ప్రస్తుతం విజయ్‌సేతుపతి సరసన రెక్క చిత్రంతో పాటు జీవాకు జంటగా జెమినీగణేశన్ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ధనుష్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్.దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇరైవి చిత్రాన్ని పూర్తి చేసిన కార్తీక్‌సుబ్బరాజ్ ప్రస్తుతం ధనుష్, లక్ష్మీమీనన్‌లతో చేయనున్న చిత్ర స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
ప్రేమకు టూ వీక్స్ నోటీస్...
హాలీవుడ్/రొమాంటిక్ కామెడీ ప్రేమకథల్లో అలకలు, దాగుడుమూతలు, విరహాలు, వేదనలు ఎప్పుడూ బాగుంటాయి. అందులోనూ ఆ ప్రేమికులకు ఆత్మాభిమానం కాస్త ఎక్కువ ఉంటే ఇక చెప్పనక్కర్లేదు. ఆనాటి యద్దనపూడి సులోచనారాణి నవలల నుంచి మొన్నటి ‘ఖుషి’ వరకూ ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా. ఈ ఫార్ములాని హాలీవుడ్ కూడా వదిలిపెట్టలేదు. వందలాది కోట్ల రూపాయల వ్యయంతో భారీ యాక్షన్, ఫాంటసీ చిత్రాలు తీస్తూనే ఉన్నా... రొమాంటిక్ కామెడీలను ఎప్పటికప్పుడూ తీస్తూనే ఉంటుంది. బాక్సాఫీస్‌ను కొల్లగొడుతూనే ఉంటుంది. 2015లో ‘పీపుల్స్’ అనే పాపులర్ పత్రిక శాండ్రా బుల్లక్‌ని ప్రపంచ సౌందర్యరాశుల్లో ఒకరిగా పేర్కొంది. హాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ కూడా శాండ్రా బుల్లక్కే. శాండ్రా బుల్లక్కి, దర్శకుడు మార్క్ లారెన్స్‌కి మధ్య చక్కటి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉంది. 1999లో వచ్చిన ‘ఫోర్సెస్ ఆఫ్ నేచర్’కు వారిద్దరూ కలిసి పనిచేశారు. ఆ సినిమా హిట్. దాంతో శాండ్రా బుల్లక్ నిర్మాతగా మారి 2000లో ‘మిస్ కన్జీనియాలిటీ’ సినిమా నిర్మించింది. ఆ సినిమా సక్సెస్ అయి, దాని సీక్వెల్ కూడా వచ్చింది. మార్క్ లారెన్స్ ఓ బాస్‌కి, సెక్రటరీకి మధ్య రొమాంటిక్ కామెడీ కథ రాశాడు. సహజంగానే హీరోయిన్‌కి ప్రాధాన్యత ఉన్న ఆ కథ శాండ్రా బుల్లక్కి తెగ నచ్చేసింది. ఆ కథని తనే నిర్మించడానికి ముందుకొచ్చింది. అలాగే హీరో హ్యూగ్రాంట్కి - దర్శకుడు మార్క్ లారెన్స్‌కి మధ్య నుంచి సక్సెస్ఫుల్ రిలేషన్ ఉంది ‘టూ వీక్స్ నోటీస్’తో ప్రారంభమైన వాళ్ల కాంబినేషన్ ఆ తర్వాత నాలుగు సక్సెస్ఫుల్ సినిమాలు అందించింది. అలాగే యాక్షన్ చిత్రాల దర్శకుడు క్వెంటీన్ టొరంటినోకి మార్క్ లారెన్స్ అంటే చాలా అభిమానం. టొరంటినోకి విపరీతంగా నచ్చిన సినిమాల్లో ‘టూ వీక్స్ నోటీస్’ ఒకటి. 60 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 199 మిలియన్ డాలర్ల పైన వసూలు చేసింది. ఇక కథ విషయానికొస్తే... లూసీ కెల్సన్ (శాండ్రా బుల్లక్) ఓ లాయర్. న్యూయార్క్‌లో పర్యావరణ సమతుల్యతని కాపాడటం కోసం పోరాడుతుంటుంది. కోటీశ్వరుడు అయిన జార్జి వేడ్ (హ్యూగ్రాంట్) మహా పొగరుబోతు. తనకి తెలిసిందే లోకం, తను చెప్పిందే ధర్మం అనుకుంటూ ఉంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విపరీతంగా సంపాదిస్తుంటాడు. లూసీ బాల్యం ‘కోనీ ఐలాండ్ కమ్యూనిటీ సెంటర్’లో నడుస్తుంది. ఇప్పుడా కమ్యూనిటీ సెంటర్‌ని కూల్చేసి, ఆ స్థానంలో వేరే వెంచర్ ప్రారంభిద్దామనుకుంటాడు జార్జి. ఆ కమ్యూనిటీ సెంటర్‌ని కాపాడుకునే ప్రయత్నంలో జార్జిని కలిసి, రిక్వెస్ట్ చేస్తుంది లూసీ. తన సలహాదారు స్థానంలో పనిచేస్తే కమ్యూనిటీ సెంటర్ జోలికి రానంటాడు జార్జి. అతను జల్సారాయుడని, అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడుపుతుంటాడని తెలిసి కూడా లూసీ జార్జి దగ్గర చేరుతుంది. జార్జికి ఏమీ తెలియదని, బిజినెస్ వ్యవహారాల్లోనే కాదు.. వ్యక్తిగత అలంకరణ, అలవాట్లలో కూడా అతనికి గెడైన్స్ అవసరమని చేరిన కొద్దిరోజులకే లూసీకి తెలుస్తుంది. ఇద్దరి మధ్య తెలియకుండానే ఓ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మనసులో ఉన్న ప్రేమ బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో లూసీ ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తుంది. జార్జి దగ్గర నుంచి అర్జెంట్‌గా రమ్మని మెసేజ్ వస్తుంది. ఏమిటా అని హడావుడిగా పరుగులు తీసి వెళ్లేటప్పటికి తీరా.. ఏ సూట్ వేసుకోవాలో తెలియక సలహా కోసం పిలిపిస్తాడు జార్జి. ఇలా ప్రతి చిన్న విషయానికి, అడ్డమైన విషయానికి తనమీద ఆధారపడటం లూసీకి చిర్రెత్తుకొస్తుంది. ఉద్యోగం మానెయ్యాలని నిర్ణయించుకుని రెండు వారాల నోటీస్ ఇస్తుంది. జాబ్ మానెయ్యవద్దని జార్జి బతిమిలాడతాడు. వేరే చోట లూసీకి ఉద్యోగం రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి లూసీ ఉద్యోగం మానెయ్యాలంటే, ఆమె స్థానంలో మరొకరిని నియమించమంటాడు జార్జి. జునె కర్వర్ (అల్సియా విట్)ని తన ప్లేస్‌లో పెడుతుంది లూసీ. జునె అందంగా ఉండటమే కాదు, జార్జిని కవ్విస్తుంటుంది. జునె ప్రవర్తన లూసీలో చిన్నపాటి అసూయని, కలవరాన్ని రేకెత్తిస్తుంది. లూసీ తన దారిన తాను వెళ్లిపోతుంది. ఆమె దూరమయ్యాకే ఆమె విలువ తెలుసుకుంటాడు జార్జి. మరోవైపు లూసీ పరిస్థితి అదే! జార్జినే అనుక్షణం తల్చుకుంటుంది. ఉద్యోగానికి రెండు వారాల నోటీస్ ఇవ్వవచ్చు కాని ప్రేమకి నోటీస్ ఇవ్వలేరు కదా! చివరికి అలకలు, విరహాన్ని దాటుకుని ఇద్దరు ప్రేమికులు కలుస్తారు. పక్కా తెలుగు సినిమా కథలా ఉండటం వల్ల ఏమో ఈ ‘టూ వీక్స్ నోటీస్’ ‘బాస్’ సినిమాకి స్ఫూర్తి అయింది. నాగార్జున, నయనతార నటించిన ‘బాస్’ సినిమాలో ‘టూ వీక్స్ నోటీస్’ ప్రభావం బాగా కనబడుతుంటుంది. - తోట ప్రసాద్ -
అజిత్‌తో మరోసారి
నటుడు అజిత్‌తో మరో సారి రొమాన్స్‌కు మిల్కీబ్యూటీ తమన్న సిద్ధం అవుతున్నారన్నది తాజా వార్త. వరుసగా విజయాలను అందుకుంటున్న నటులలో అజిత్ ముందున్నారని చెప్పవచ్చు. ఆరంభం, వీరం, ఎన్నై అదిరిందాళ్, వేదాళం అంటూ విజయ పథంలో దూసుకు పోతున్న అజిత్ తాజాగా తన 57వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు.చేసిన నిర్మాతకే వరుసగా చిత్రాలు చేయడం, ఒకే దర్శకుడికి వరుసగా అవకాశం ఇవ్వడం అన్నది అజిత్‌కే చెందుతుంది. ఆరంభం, ఎన్నైఅరిందాళ్, వేదాళం చిత్రాలను నిర్మాత ఏఎం.రత్నంకు చేసిన అజిత్ అదే విధంగా శివ దర్శకత్వంలో వీరం, వేదాళం చిత్రాల్లో నటించారు. తాజాగా మరో సారి అదే దర్శకుడితో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. వే దాళం చిత్రం తరువాత కాలికి శస్త్ర చికిత్స, ఆపై విదేశీయానం అంటూ విశ్రాంతి తీసుకుని రీచార్జ్ అయ్యి తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి.త్యాగరాజన్ భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రం మే నెల చివరి వారంలో గానీ జూన్ మొదటి వారంలో గానీ ప్రారంభం కానున్నట్లు నిర్మాత ఇటీవల వెల్లడించారు. కాగా ఇందులో అజిత్‌తో రొమాన్స్ చేసే ముద్దుగుమ్మలు ఎవరన్నది ఇప్పటి వరకూ గోప్యంగానే ఉంది. అయితే నటి అనుష్క, త్రిషలు నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అలాంటి ప్రచారానికి బ్రేక్ చేస్తూ ఇంకా పేరు నిర్ణయించని తమ చిత్రంలో తమన్న, సృష్టి డాంగే నటించనున్నట్లు స్పష్టం చేశారు. విశేషం ఏమిటంటే ఇటీవల నటి తమన్న మరోసారి అజిత్‌తో నటించే అవకాశాన్ని సాధించుకుంటానని చాలా కాన్ఫిడెంట్‌గా ప్రకటించారు. అప్పుడు ఆ విషయాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఈ మిల్కీబ్యూటీ మాత్రం అనుకున్నది సాధించారన్నమాట. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయన్నది గమనార్హం. -
అధర్వతో ఇద్దరు ముద్దుగుమ్మల రొమాన్స్
ఈ మధ్య ఇద్దరు హీరోయిన్ల చిత్రాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పవచ్చు. అది కమర్షియల్ చిత్రం అయినా క్లాసికల్ చిత్రం అయినా, హారర్ చిత్రం అయినా, టైమ్ మిషన్ చిత్రం అయినా కావచ్చు. ఇప్పటి వరకూ సింగిల్ హీరోయిన్‌తో సరిపుచ్చుకుంటూ వచ్చిన యువ నటుడు అధర్వ తాజాగా ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తుండడం విశేషం. దివంగత సీనియర్ నటుడు మురళి వారసుడిగా బానాకాత్తాడి చిత్రంలో కథానాయకుడిగా పరిచయం అయిన అధర్వకు ఆ చిత్రం ఆశించిన రిజల్ట్‌ను ఇవ్వకపోయినా వరుసగా అవకాశాలు రాబట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో బాలా దర్శకత్వంలో నటించిన పరదేశీ చిత్రం నటుడిగా అధర్వకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కాస్త వెనకబడినా ఇటీ వల ఈటీ, కణిదన్ చిత్రాలు ఆయనకు మంచి విజయాలను అందించాయి. ప్రస్తుతం రుక్మిణి వండి వరుదు చిత్రాన్ని పూర్తి చేసిన అధర్వ తాజాగా చాలా మంది కథానాయకుల మాదిరిగానే సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చమ బోద ఆగదా అనే చిత్రాన్ని నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇద్దరు నాయికలు ఉండే ఇందులో ప్రముక నటీమణుల్ని నటింపజేయాలని మొదట భావించినా, బడ్జెట్ ఎగిరి కూర్చోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఉత్తరాది భామలు అనైక, మిష్టిలను ఎంపిక చేశారు. వీరిలో అనైక దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చిత్రం సత్య-2 ద్వారా పరిచయం అయ్యిందన్నది గమనార్హం. తమిళంలోనూ వసంతబాలన్ దర్శకత్వం వహించిన కావయతలైవన్ చిత్రంలో నటించింది.ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించకుండా పోయిన అనైక ఇప్పుడు అధర్వ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుందన్న మాట. మరో హీరోయిన్ మిష్టి హిందీలో సుభాష్‌ఘాయ్ దర్శకత్వం వహించిన కాంచీ చిత్రం ద్వారా పరిచయమైంది.అయితే తమిళంలో ఆమెకిదే తొలి చిత్రం అవుతుంది. ఇకపోతే అధర్వ తొలి చిత్రం బానాకాత్తాడి చిత్రానికి దర్శకత్వం వహించిన బద్రి ఈ చమ బోద ఆగదా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్ర షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది కమర్షియల్ అంశాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. ఇందులో అధర్వకు జంటగా మిష్టి నటిస్తుండగా ఎవరూ నటించడానికి సాహసించని ఒక బోల్డ్ పాత్రలో అనైక నటిస్తోందని తెలిపారు. ఆ పాత్రకు సంబంధించి ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదన్నారు.అయితే ఇద్దరు హీరోయిన్లకు చిత్రంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. -
ఆర్యతో, నయన మూడోసారి..
ఒక్కోసారి హీరోహీరోయిన్ల వలన కూడా ఆ చిత్రానికి క్రేజ్ వచ్చేస్తుంది. కోలీవుడ్‌లో అలాంటి జంటే ఆర్య, నయనతారలు. రీల్‌లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఈ ఇద్దరిపై పలు సెటైర్లు వినిపిస్తుంటాయి. ఆర్య, నయనతారల మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు కూడా వదంతులు జోరుగా సాగుతుంటాయి. ఇక నటన పరంగా చూస్తే వీరిది హిట్ పెయిరే. ఇంతకు ముందు ఆర్య, నయనతార కలసి నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్, రాజారాణి చిత్రాలు మంచి విజయం సాధించాయి. తాజాగా ముచ్చటగా మూడోసారి తెరపై రొమాన్స్ చేయడానికి ఈ క్రేజీ జంట సిద్ధమవుతున్నాని సమాచారం. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న నయనతారకు ఇప్పుడు అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం కార్తీతో కాష్మోరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ఆ భామ కోసం చాలా చిత్రాలు ఎదురు చూస్తున్నాయి. స్నేహితురాలు త్రిషతో కలసి తన ప్రేమికుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో ఏఎం.రత్నం నిర్మించనున్న భారీ చిత్రంలో నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. అదే విధంగా మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. తాజాగా సుందర్.సీ దర్శకత్వంలో ఆర్యతో రొమాన్స్‌కు రెడీ అన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అరణ్మణై-2 చిత్రం తరువాత సుందర్.సీ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు.ఈయన ఇంతకు ముందు విమల్, మిర్చిశివ, అంజలి, ఓవియలతో రూపొందించిన కలగలప్పు చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆర్య,నయనతార హీరో హీరోయిన్లుగా నటించనున్నట్లు సమాచారం. -
అప్పట్నుంచీ మావారికి దగ్గర అవ్వలేదు
చాకొలెట్ సిస్ట్... వదిలేస్తే ప్రమాదమా! సందేహం నా వయసు 44. సంవత్సరం క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. అప్పట్నుంచీ మావారికి దగ్గర అవ్వలేదు. గుండె ఆపరేషన్ అయినవాళ్లు శృంగారంలో పాల్గొనవచ్చా? దానివల్ల ఏమైనా అవుతుందా? డాక్టర్ని అడగాలంటే సిగ్గుగా ఉంది. దయచేసి మీరు చెబుతారా? - ఓ సోదరి బైపాస్ సర్జరీ అయినా కూడా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండి, ఆయాసం లేకుండా ఉంటే శృంగారంలో పాల్గొన వచ్చు. 2డీ ఎకో, ఈసీజీ, స్ట్రెస్ టెస్ట్ అన్నీ చేయించుకోవాలి. ఫలితాలు నార్మల్‌గానే ఉంటే శృంగారంలో పాల్గొనవచ్చు. అయితే ఛాతి మీద ఎక్కువ ఒత్తిడి పడ కుండా చూసుకోవాలి. ఆపరేషన్ తర్వాత పని చేసుకుంటున్నప్పుడు ఆయాసం వస్తుందా, వాకింగ్ చేసుకుంటే ఆయాసం వస్తుందా అన్నది చూసుకోవాలి. ఏం లేకపోతే మూడు నెలల తర్వాతి నుంచే పాల్గొనవచ్చు. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం రెండు మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకుని పాల్గొనడం మంచిది. మీరు రెండు అంతస్తుల మెట్లు ఆయాస పడకుండా ఎక్కగలిగి ఉంటే, ఇరవై నిమిషాల్లో 2.5 మైళ్లు నడవ గలిగితే శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బంది ఉండదు. నిజానికి కలయిక కూడా ఒక వ్యాయామం లాంటిదే. మీకు ఆపరేషన్ అయ్యి సంవత్సరం దాటింది కాబట్టి మీరు భయపడకుండా పైన చెప్పిన అంశాలు పాటిస్తూ, శృంగార జీవితాన్ని ఆస్వాదించవచ్చు. కాకపోతే ఓసారి మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ని సంప్రదించి, మీ గుండె పనితీరు ఎలా ఉంది, ఒత్తిడిని తట్టుకోగలుగుతుందా లేదా అనేది తప్పక పరీక్ష చేయించుకోవడం మంచిది. వీలయితే మీ సిగ్గు, బిడియం వదిలి మీ డాక్టర్ని అడిగేయండి. ఎందుకంటే మీ ఆరోగ్య పరిస్థితి పట్ల వారికే పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి. నా వయసు 29. ఏడాదిన్నర క్రితం పెళ్లయ్యింది. గర్భం వచ్చింది కానీ కుడివైపు ట్యూబులో వచ్చింది. అది పగిలిపోవడంతో ఆపరేషన్ చేసి ట్యూబ్ తీసేశారు. అప్పుడే రెండో ట్యూబునూ పరీక్షించారు. దానిలో వాపు ఉంది, మళ్లీ గర్భం దాల్చినా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అది నిజమేనా? అలా రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? గతంలో టీబీ వస్తే మందులు వాడాను. దానివల్లే ఇలా అవుతోందా? - మాధవి, ఉండ్రాజవరం గర్భం గర్భాశయంలో కాకుండా మిగతా భాగాల్లో... అంటే ట్యూబ్స్, అండాశయాలు, పొత్తి కడుపులో రావ డాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది 95 శాతం ట్యూబ్స్‌లో వస్తుంది. సాధార ణంగా ట్యూబ్స్‌లో ఏర్పడిన పిండం ట్యూబ్ కదలిక ద్వారా గర్భాశయంలోకి వచ్చి, అక్కడ పాతుకుని గర్భం మొదలవు తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల, ట్యూబ్స్ పాడవడం వల్ల లేదా పాక్షికంగా మూసుకు పోవడం వల్ల, వాటి పనితీరు మందగిం చడం వల్ల, ఇతరత్రా కారణాల వల్ల పిండం ట్యూబ్‌లో నుంచి గర్భాశయంలోకి వెళ్లలేక, అక్కడే పాతుకుని పెరగడం మొదలవుతుంది. పిండం ఎదుగుదలకు సరిపడేలా గర్భాశయం సాగినట్టు ట్యూబులు సాగలేవు. కాబట్టి పిండం పెరిగేకొద్దీ ట్యూబు పగిలి, విపరీతమైన నొప్పి రావడంతో పాటు పొత్తి కడుపులో రక్తస్రావం జరుగుతుంది. దీన్ని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. మీకు ఇప్పుడు ఒక్క ట్యూబ్ ఉంది. అది కూడా సరిగ్గా లేదు. అంటే ఈసారి కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టే. ఇదివరకు టీబీ కూడా వచ్చిందన్నారు. టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కొందరిలో టీబీ బ్యాక్టీరియా ట్యూబ్స్‌ని దెబ్బతీస్తుంది. దాంతో టీబీ చికిత్స తీసుకున్నా ట్యూబ్స్ బాగయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. డాక్టర్ని మరోసారి సంప్రదించి, ఇన్ఫెక్షన్కి సంబంధించిన మందులు వాడండి. కొంత కాలం తర్వాత మళ్లీ గర్భానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నెల తప్పితే అప్పటి నుంచీ డాక్టర్ పర్యవేక్షణలో ట్రాన్స్ వెజైనల్ స్కానింగ్ క్రమం తప్పకుండా చేయించుకుంటూ గర్భం గర్భాశయంలో వచ్చిందా ట్యూబ్స్‌లో వచ్చిందా అనేది త్వరగా నిర్ధారించుకోవడం మంచిది. ఒకవేళ అదృష్టం బాగుండి గర్భాశయంలో వస్తే మంచిదే. కానీ ట్యూబ్స్‌లో వస్తే మాత్రం వెంటనే తీయించేసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడే అయితే ఆపరేషన్ అవసరం లేకుండా మెథోట్రెక్సేమియా అనే ఇంజెక్షన్ ద్వారా కరిగించేయడానికి ప్రయత్నం చేయవచ్చు. తర్వాత గర్భం కోసం టెస్ట్ ట్యూబ్ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. నా వయసు 25. గత కొన్ని నెలలుగా నాకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి వస్తోంది. నడుము కూడా బాగా లాగేస్తోంది. డాక్టర్ స్కాన్ చేసి, చాకొలెట్ సిస్టులు ఉన్నాయి అన్నారు. మందులు వాడితే సరిపోతుంది అన్నారు. అది నిజమేనా? అసలు చాకొలెట్ సిస్టులంటే ఏంటి? ఎందుకు వస్తాయి? వాటివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా - పి.సుబ్బలక్ష్మి, తణుకు చాకొలెట్ సిస్టులనేవి అండాశయాల్లో ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి వల్ల ఏర్పడతాయి. గర్భాశయం లోపల ఉండే ఎండోమెట్రియమ్ పొర ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ద్వారా కొద్దికొద్దిగా యోని ద్వారా బయటకు వచ్చేస్తుంది. కొద్దిమందిలో మాత్రం అలా రాకుండా గర్భాశయం నుంచి ట్యూబు ద్వారా పొత్తి కడుపులోకి చేరి... అక్కడ అండాశయాల మీద, పేగుల మీద, గర్భాశయం బయట అతుక్కుంటుంది. అలా అతుక్కున్న పొరలో ప్రతినెలా బ్లీడింగ్ అయినట్టే అయ్యి, ఆ రక్తం గడ్డకట్టి ఎండో మెట్రియాసిస్ సమస్య ఏర్పడు తుంది. అండాశయాల మీద అతుక్కున్న పొరలో గడ్డకట్టిన బ్లీడింగ్ రంగు మారి చాకొలెట్లాగా మారుతుంది. దీన్నే చాకొ లెట్ సిస్ట్ అంటారు. ఈ సిస్టులు మెల్లమెల్లగా సైజు పెరుగుతూ పోతాయి. ఎండోమెట్రి యాసిస్ వల్ల చాకొలెట్ సిస్టులతో పాటు చుట్టుపక్కలున్న పేగులు, గర్భాశయ ట్యూబులు అన్నీ దగ్గర దగ్గరకు వచ్చి అంటుకుపోవడం జరుగుతుంది. దీనివల్ల పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, నడుం నొప్పి, కలయికలో నొప్పి వంటి సమ స్యలు మొదలవుతాయి. వ్యాధి తీవ్రతను బట్టి అవి పెరుగుతూ ఉంటాయి. చాకొలెట్ సిస్టులు 2 సెం.మీ. నుంచి 10 సెం.మీ. వరకూ పెరిగే అవకాశాలు ఉంటాయి. 2-3 సెం.మీ. ఉంటే కనుక ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొన్ని రకాల హార్మోన్ మందులతో కరిగిపో తాయి. మీరు మీ సిస్టుల సైజు రాయ లేదు. కాబట్టి నేను చెప్పలేను. సైజు చిన్నగా ఉంటే మందులతో ప్రయత్నిం చండి. లేదంటే ఓపెన్ ఆపరేషన్ ద్వారానో, ల్యాపరోస్కోపీ ద్వారానో తొలగించాల్సి ఉంటుంది. అశ్రద్ధ చేస్తే గర్భం దాల్చడంలో ఇబ్బందులు రావచ్చు. నా వయసు 22. నేను చిన్నప్పట్నుంచీ చాలా బలహీనంగా ఉండేదాన్ని. కొందరు పిల్లలు అలాగే ఉంటారు అని డాక్టర్లు అనడంతో మావాళ్లు నిర్లక్ష్యం చేశారు. కానీ పెద్దయ్యేకొద్దీ ఊపిరి తీసుకోవడంలో సమస్యలు వస్తూ ఉండటంతో సిటీలోని డాక్టర్‌కి చూపించారు. ఊపిరితిత్తుల్లో నీరు ఉందని చెప్పారు. మందులు వాడాను. కొన్నాళ్లు బానేవుంది, మళ్లీ సమస్య మొదలైంది. అలా మందులు వాడటం, తగ్గడం, మళ్లీ రావడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే బానేవుంది. కాకపోతే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అసలు నేను పెళ్లి చేసుకోవచ్చా, రేపు ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్నదే నా భయం. ఒకవేళ మళ్లీ సమస్య మొదలైతే... కలయికలో కానీ, పిల్లలు పుట్టడంలో కానీ, డెలివరీ సమయంలో కానీ ఏమైనా ఇబ్బందులు వస్తాయా? నేను పెళ్లి చేసుకోవాలా వద్దా? - ప్రత్యూష, టేకుమట్ల, ఆదిలాబాద్ రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటం, రక్తహీనత వల్ల బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ రావడం జరుగుతుంది. దానివల్ల న్యుమోనియా, టీబీ వంటి వ్యాధులు త్వరగా దాడి చేస్తాయి. ఇవి బలహీనంగా ఉన్నా, ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోయినా మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కాబట్టి మంచి పోషకాహారం తీసుకుంటూ ఆర్యోగంగా ఉండండి. దానివల్ల వ్యాధి మళ్లీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ఓసారి డాక్టర్ని కలిసి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది పరీక్ష చేయించుకోండి. దాంతో పాటు టీబీ టెస్ట్, సీబీపీ వంటి పరీక్షలు చేయించుకుని మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవడం మంచిది. సమస్య ఏమీ లేనప్పుడు నిశ్చింతగా పెళ్లి చేసుకుని, మీ సంసార జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తూ, పండంటి బిడ్డను కనవచ్చు. ఒకవేళ సమస్య మళ్లీ వచ్చినా దానికి తగ్గ చికిత్స తీసుకుంటూ సాధారణ జీవితాన్ని గడపవచ్చు. నా వయసు 26. నెలన్నర క్రితం పాప పుట్టింది. అంతకు ముందే బాబు ఉన్నాడు. బాబు పుట్టినప్పుడు పాలు తాగకుండా ఏడ్చే వాడు. డాక్టర్‌కి చెబితే పాలు టెస్ట్ చేశారు. చేదుగా ఉన్నాయని, బ్రెస్ట్‌లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని, తల్లిపాలు వద్దని చెప్పారు. ఇప్పుడు కూడా అదే సమస్య వచ్చింది. పాపకు కూడా పోతపాలే ఇవ్వాల్సి వస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? బిడ్డకు పాలు కూడా ఇవ్వలేక పోతున్నానని చాలా బాధ కలుగుతోంది. అసలు ఇలా జరుగుతుందా? డాక్టర్ చెప్పింది నిజమేనా? దీనికి పరిష్కారం లేదా? - సి.కవిత, గుత్తి బ్రెస్ట్‌లో ఏదో ఇన్ఫెక్షన్ వల్ల పాలు చేదుగా ఉన్నాయన్నారు. ఇన్ఫెక్షన్ అయితే కొద్దిరోజుల పాటు యాంటి బయొటిక్స్ వాడితే సరిపోతుంది. అంతేకానీ మొత్తానికే పాలు ఇవ్వకుండా ఉండాలని లేదు. తల్లి తినే ఆహారాన్ని బట్టి కూడా పాలకు రుచి ఏర్పడుతుంది. మీరు మరో సారి డాక్టర్ని సంప్రదించి రొమ్ములు, పాలు పరీక్ష చేయించుకోండి. కారణాన్ని బట్టి యాంటి బయొటిక్స్ వాడండి. పోషకాహారం తీసుకుంటూ, బిడ్డకు పాలివ్వడానికి ప్రయత్నం చేయవచ్చు. కాకపోతే ఒకటిన్నర నెల నుంచి బిడ్డకు పోతపాలు అలవాటైపోయాయి. కాబట్టి మీ పాలు బాగున్నా వాటిని తాగాలంటే బిడ్డ సుముఖత చూపించకపోవచ్చు. అదే పోతపాలు అలవాటు కాకముందే మొదట్లోనే అయితే బాగుండేది. అదీ కాక ఇన్ని రోజుల తర్వాత పాలు కూడా అంత ఎక్కువగా రాకపోవచ్చు. అండాశయాల మీద అతుక్కున్న పొరలో గడ్డకట్టిన బ్లీడింగ్ రంగు మారి చాకొలెట్లాగా మారుతుంది. దీన్నే చాకొ లెట్ సిస్ట్ అంటారు. ఈ సిస్టులు మెల్లమెల్లగా సైజు పెరుగుతూ పోతాయి. డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
నేడు భోగం ప్రారంభం
జయంరవి, హన్సికల భోగం చిత్రం గురువారం నుంచి ప్రారంభం కానుంది. తనీఒరవన్,రోమియో జూలియెట్, భూలోకం, మిరుదన్ అంటూ వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాలతో మంచి రైజింగ్‌లో ఉన్న నటుడు జయంరవి. తాజాగా భోగం చిత్రంలో నటించనున్నారు. ఎంగేయుమ్ కాదల్, రోమియో జూలియెట్ చిత్రాల్లో జయంరవితో జత కట్టిన క్రేజీ నటి హన్సిక ముచ్చటగా మూడోసారి ఈ భోగం చిత్రంలో రొమాన్స్ చేయనున్నారు. ఈ భారీ క్రేజీ చిత్రాన్ని ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా తన స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. రోమియో జూలియెట్ చిత్రంతో దర్శకుడిగా హిట్ కొట్టిన లక్ష్మణ్ ఈ భోగం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.రోమియో జూలియెట్ చిత్రానికి పనిచేసిన యూనిట్ సభ్యులు సంగీత దర్శకుడు డి.ఇమాన్, చాయాగ్రాహకుడు సౌందర్‌రాజన్, కళాదర్శకుడు మిలన్, ఎడిటర్ ఆంటోని, స్టంట్‌మాస్టర్ దిలీప్సుబ్బరాజన్, మాటల రచయిత చంద్రు, గీతరచయితలు మదన్‌కార్గీ, తామరై, రాఖేష్ ఈ చిత్రంలోనూ భాగం పంచుకోనున్నారు. ఇక తనీఒరువన్ చిత్రంలో జయంరవితో ఢీకొన్న అరవిందస్వామి ఈ భోగం చిత్రంలోనూ ఆయనతో పోటీ పడనున్నారు.చిత్ర షూటింగ్ గురువారం చెన్నై, పెరంబూర్‌లో గల బిన్నీమిల్లులో ప్రారంభం కానుంది. రోమియో జూలియెట్ చిత్రంలో డండణకా పాట సూపర్‌హిట్ అయ్యి ఎలాగైతే వాడవాడలా మారు మోగిందో అదే తరహాలో డమాల్ డిమీల్ అనే పాట భోగం చిత్రంలో చోటు చేసుకోనుంది. ఆ పాట చిత్రీకరణతోనే చిత్రం భోగం జయంరవి, హన్సికల భోగం మొదలవడం విశేషం. -
ముగ్గురు భామలతో శశికుమార్ రొమాన్స్
వెట్రివేల్ చిత్రంలో నటుడు శశికుమార్ మియాజార్జ్, నిఖిల, వర్ష ముగ్గురు భామలతో యుగళ గీతాలు పాడుకున్నారు. ఇక ఈ చిత్ర వివరాల్లోకెళితే తారై తప్పట్టై చిత్రం తరువాత శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వెట్రివేల్. ఇంతకు ముందు 500 చిత్రాలకుపైగా వివిధ ఏరియాలకు పంపిణీ చేసిన ట్రైటెండ్ ఆర్ట్స్ సంస్థ అధినేత ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రభు, తంబిరామయ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంతమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన జిల్లా చిత్ర దర్శకుడు నేశన్ శిష్యుడన్నది గమనార్హం. ఎస్ఆర్.కదిర్ చాయాగ్రహణం, డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ వెట్రివేలన్ కుటుంబనేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథా చిత్రం అని తెలిపారు. హాస్యం,యాక్షన్ అంటూ చిత్రం జనరంజకంగా ఉంటుందన్నారు. ఇందులో శశికుమార్ సరసన మియాజార్జ్, నిఖిల, వర్ష ముగ్గురు కథానాయికలు నటించారని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని 18న నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. -
ధనుష్‌తో మేఘా ఆకాష్ రొమాన్స్
వర్ధమాన నటి మేఘా ఆకాష్‌కు నటుడు ధనుష్‌తో రొమాన్స్ చేసే లక్కీఛాన్స్ వరించింది. ధనుష్ ప్రభుసాలమన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేశారు. తదుపరి వెట్ట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే ఆ చిత్రాన్ని వెనక్కు నెట్టి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యారు ధనుష్. దర్శకుడు గౌతమ్‌మీనన్, నటుడు ధనుష్‌ల రేర్ కాంబినేషన్లో ఇక చిత్రం తెరకెక్కనుందన్న విషయం ఇప్పటికే ప్రకటించారు. దీనికి ఎన్నై నోక్కి పాయుమ్ తూటా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం చెన్నైలో నిరాడంబరంగా ప్రారంభమైంది. ఇందులో వర్ధమాన నటి మేఘా ఆకాష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమె బాలాజీ ధరణీధరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక పక్క కథై చిత్రం ద్వారా కథానాయికగా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారన్నది గమనార్హం. ఆ చిత్రం ఇంకా విడుదల కాకుండానే స్టార్ హీరో ధనుష్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషమే. ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రం కోసం దర్శకుడు గౌతమ్‌మీనన్ చెన్నై శివారు ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ధనుష్, మేఘా ఆకాష్‌లపై ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. -
జయంరవితో అక్షరగౌడ రొమాన్స్
హీరోయిన్లలో అందం, అభినయం ఎంత ఉన్నా అదృష్టం ఉండాలి. దాని కోసం పోరాడుతోంది నటి అక్షరగౌడ. ఈ కన్నడ భామ చాలా కాలం క్రితం గీత రచయిత స్నేహన్ హీరోగా నటించిన తురు 420 చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు రాలేదు. ఆ తరువాత తుపాకీ, ఆరంభం చిత్రాల్లో చిన్న గ్లామరస్ పాత్రల్లో మెరిసి పోయింది. అవీ అక్షరగౌడకు కేరీర్‌కు ఉపయోగపడలేదు.అప్పటి నుంచి హీరోయిన్ అవకాశాల కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఇప్పటికి ఒక మంచి అవకాశాన్ని దక్కించుకుంది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న జయంరవితో రొమాన్స్ చేయనుంది. మిరుదన్ చిత్రం తరువాత జయంరవి నటిస్తున్న చిత్రం భోగం. ఇందులో హన్సిక ఒక హీరోయిన్గా నటిస్తున్నారు. ఇంతకు ముందు వీరిద్దరు కలిసి నటించిన రోమియోజూలియెట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణన్ ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోమియోజూలియెట్ చిత్రంలో జయంరవితో హన్సికతో పాటు మరో పాత్రలో నటి పూనంబాజ్వా నటించిన తరహాలో ఈ చిత్రంలో నటి అక్షరగౌడ నటిస్తోందట. ఇందులో తన అందాలారబోతకు కొరత ఉండదట.అయితే ఈ భోగం చిత్రంతో నైనా ఈ కన్నడ బ్యూటీకి కోలీవుడ్‌లో యోగం వస్తుందా? అన్నదే వేచి చూడాలి. -
ఇప్పుడు నాకన్నీ తెలుసు!
ఎంత అనుభవజ్ఞులైనా నాకు తెలిసింది ఇసుమంతే నేర్చుకోవలసింది ఎంతో ఉంది అంటుంటారు విజ్ఞులు. అలాంటిది నటి కాజల్‌అగర్వాల్ మాత్రం నాకన్నీ తెలుసు అంటున్నారు. ఇది కాస్త అతి అనిపించినా ఈ బ్యూటీ భావనేమిటన్నది ఒక సారిచూస్తే పోలా.దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు యువ హీరోలందరితోనూ జోడీ కట్టేసిన కాజల్‌అగర్వాల్ ఉత్తరాదిలోనూ తన స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఈమెకు కోలీవుడ్‌లోనే పరిస్థితి బెటర్‌గా ఉందని చెప్పవచ్చు. ద్విభాషా(తెలుగు,తమిళం)చిత్రం బ్రహ్మోత్సవంతోపాటు జీవాతో కవలైవేండామ్ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా శింబుతో రొమాన్స్ చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తెలుగు చిత్రం టెంపర్ రీమేక్‌లో శింబు నటించనున్నారన్న విషయం తెలిసిందే.ఇందులో ఆయనకు జంటగా కాజల్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా కోలీవుడ్‌లో అవకాశాలు పెంచుకుంటున్న కాజల్‌అగర్వాల్ తన గురించి ఏమంటున్నారో చూద్దాం. నటీనటుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరికి డాన్స్‌లో ప్రావీణ్యం ఉంటే, మరొకరికి ప్రేమ సన్నివేశాల్లో చక్కగా నటించే నేర్పరితనం ఉంటుంది. ఇంకొందరికి శోక సన్నివేశాల్లో జీవించే ప్రతిభ ఉంటుంది. అయితే నాకు మాత్రం అన్నీ తెలుసు. ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేయగలను. నిజం చెప్పాలంటే తొలి రోజుల్లో నాకూ ఏమీ తెలియదు. ముఖ్యంగా ఏడవడం అస్సలు తెలియదు. చిన్నతనం నుంచీ నేను ఏడ్చిన సందర్భాలు లేవు.అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడేదాన్ని. కన్నీరు వచ్చేవి కానీ అందులో జీవం ఉండేదికాదు. ఇప్పుడు ఏడవడంతో పాటు అన్నీ నేర్చుకున్నాను. కెమెరా ముందుకు రాగానే దర్శకుడు యాక్షన్ అనగానే ముఖంలో శోకాన్ని నింపుకుని ఏడుపు సన్నివేశంలో జీవించేస్తాను. ఇప్పుడీ తరహా నటనను చూసి నా స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు. కథ, పాత్రలను అవగాహన చేసుకుని అందులో లీనమై నటించే పరిణితిని సాధించాను. అందుకే నటిగా తానీ స్థాయికి చేరుకోగలిగాను. -
ఆర్యతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్
క్యాథరిన్‌ట్రెసా ఆర్యతో రొమాన్స్‌కు సిద్ధమవుతోంది. ఈ కేరళా కుట్టి తమిళ చిత్ర పరిశ్రమలో తన గ్రాఫ్‌ను పెంచుకుంటోందని చెప్పవచ్చు. ఇక్కడ మెడ్రాస్ చిత్రంతో తన కెరీర్‌ను మొదలెట్టిన క్యాథరిన్‌ట్రెసా ఆ చిత్ర విజయం బాగానే హెల్ప్ అయ్యింది. ఇటీవల విశాల్‌తో నటించిన కథకళి చిత్రం కమర్షియల్‌గా హిట్ అనిపించుకోవడంతో క్మాథరిన్ ట్రెసాకి కోలీవుడ్‌లో గిరాకీ పెరిగిందనే చెప్పాలి. అధర్వతో జతకట్టిన కణిదన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో పాటు క్యాథరిన్ అందాలు చిత్రానికి ఆకర్షణ అయ్యాయి. తాజాగా హీరోయిన్ల హీరోగా ప్రచారంలో ఉన్న నటుడు ఆర్యతో డ్యూయెట్లు పాడడానికి ఈ మలయాళీ బ్యూటీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాఘవ లారెన్స్‌తో మొట్టశివ కెట్టశివ చిత్రాన్ని నిర్మిస్తున్న సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్బీ.చౌదరి ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆర్య హీరోగా నటించనున్నారు. ఆయనకు జంట గా నటించే లక్కీచాన్స్ నటి క్యాథరిన్ ట్రెసాను వరించింది. ఇంతకు ముందు మంజాపై వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చిత్రం షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు క్యాథరిన్ ట్రెసా ఇప్పటికే వీర ధీర శూరన్, ముత్తురామలింగన్ చిత్రాలతో పాటు తెలుగులో సరైనోడు చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉందని కోలీవుడ్ టాక్. -
మరోసారి జయంరవితో హన్సిక..
కోలీవుడ్‌లో సక్సెస్ రేట్‌ను పెంచుకుంటూ హీరోయిన్గా తన స్థానాన్ని పదిలపరచుకుంటున్న ప్రముఖ నటీమణుల్లో హన్సిక ఒకరు. ఇటీవల అరణ్మణై, రోమియో జూలియెట్, అరణ్మణై-2 చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న హన్నికకు మధ్యలో నటించిన పులి చిత్ర అపజయ ప్రభావం పెద్దగా పడలేదు. ఇప్పటికీ పలు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. జీవాతో నటించిన పోకిరిరాజా చిత్రం మార్చి నాల్గవ తేదీన తెరపైకి రానుంది. నటి జయప్రద నిర్మించిన ఉయిరే ఉయిరే చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా మరోసారి జయంరవితో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన రోమియో జూలియెట్ మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం దర్శకుడు లక్ష్మణ్‌నే మళ్లీ ఈ క్రేజీ జంటతో చిత్రం చేయనున్నారు. దీనికి బోగన్ అనే పేరును నిర్ణయించారు. తనీఒరువన్ చిత్రంలో జయంరవికి ప్రతినాయకుడు అయిన నటుడు అరవింద్‌సామి ఈ బోగన్ చిత్రంలోనూ ముఖ్య పాత్రను పోషించనున్నారు. ఇది సూపర్ యాక్షన్ కథా చిత్రం అంటున్నారు దర్శకుడు లక్ష్మణ్. ఈ చిత్రం కోసం వచ్చే వారం జయంరవి, హన్సికలతో ఫొటో షూట్ నిర్వహించనున్నారట. మార్చిలో చిత్రం సెట్ పైకి వెళ్లనుందని చిత్ర వర్గాల సమాచారం. చిత్ర ప్రధాన సన్నివేశాలను చెన్నై, పాండిచ్చేరి ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారట. -
ఇద్దరమ్మాయిలతో జీవీ రొమాన్స్
మళ్లీ ఇద్దరమ్మాయిలతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు జీవీ.ప్రకాశ్‌కుమార్. ఇంతకు ముందు మనీషాయాదవ్, ఆనందిలతో ఈయన డ్యూయెట్లు పాడిన త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం కమర్షియల్‌గా హిట్ అయి కాసుల వర్షం కురిపించిదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇటు హీరోగానూ,అటు సంగీతదర్శకుడిగానూ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న జీవీ తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు.కడవుళ్ ఉరుకిరాన్ కుమారు చిత్రంలో నటించి సంగీతం అందించడానికి రెడీ అవుతున్నారు.ఇంతకు ముందు శివ మనసుల శక్తి, ఒరుకల్ ఒరుకన్నాడీ, బాస్‌ఎన్గిర భాస్కరన్, వాసువుమ్,శరవణనుమ్ ఒన్నా పడిచవంగ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన ఎం.రాజేశ్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ఇది. దైవవాక్కు, చిన్నమాప్లే, రాసయ్య, అరవిందన్ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అమ్మా క్రియేషన్స్ శివ చిన్న గ్యాప్ తరువాత నిర్మించనున్న చిత్రం కడవుళ్ ఇరుక్కిరాన్ కుమారు. ఇందులో జీవీ ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్నారు. అందులో ఒకరు నిక్కీగల్రాణి కాగా ఇంకో బ్యూటీ అవిక గోర్. ఈ గుజరాతి చిన్నది చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ ద్వారా మంచి ప్రాచుర్యం పొందింది. అంతే కాదు తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా హీరోయిన్గా తెరంగేట్రం చేసి అక్కడి అక్కడి అభిమానుల మనసుల్ని దోచుకుంది. తాజాగా కేర్ ఆఫ్ ఫుట్‌పాత్ అనే కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్న అవికగోర్ ఇప్పుడు జీవీతో కలిసి తమిళ చిత్రపరిశ్రమకు దిగుమతి కానుందన్న మాట. లవ్, రొమాంటిక్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో అందే వేసిన దర్శకుడు రాజేశ్ ఈ చిత్రాన్ని ఆ తరహాలోనే జనరంజకంగా తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారట. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని విశాఖపట్టణం.గోవా ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించారు. -
సమంతతో రొమాన్స్ చేయాలని...
‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్’తో ఫస్ట్ హ్యాట్రిక్ సాధించారు రాజ్ తరుణ్. ఇప్పుడు చేసిన ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ రెండో హ్యాట్రిక్‌కి నాంది అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీమతి పూర్ణిమ ఎస్. బాబు సమర్పణలో ఎస్. శైలేంద్రబాబు, కేవీ శ్రీధర్ రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ చెప్పిన ముచ్చట్లు... ► ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ ఐడియా నచ్చింది. శ్రీనివాస్ గవిరెడ్డి మంచి స్నేహితుడు. నా గత చిత్రాలకు భిన్నంగా, ఆ చిత్రాల తర్వాత నేనెలాంటి సినిమా చేస్తే బాగుంటుందో ఆలోచించి నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు ఈ కథ చేశాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథా చిత్రం ఇది. సీతమ్మ కోసం రాముడు అనే కుర్రాడేం చేశాడనేది కథ. ► వాస్తవానికి సోలో రిలీజైతే బాగానే ఉంటుంది. కానీ, అలా ఎప్పుడో ఒక్కసారే కుదురుతుంది. మొన్న సంక్రాంతికి 4 సినిమాలు విడుదలైతే, నాలుగూ ఆడాయి. సినిమాలో విషయం ఉంటే, అన్నీ ఆడతాయి. ఈరోజు విడుదలవుతున్న సినిమాలన్నీ ఆడాలని కోరుకుంటాను. ► నాకు సినిమా తప్ప వేరే ధ్యాస లేదు. అవకాశం ఉంటే 365 రోజులూ పని చేయాలనుకుంటాను. ఒక్కసారి సెట్లోకి అడుగుపెట్టానంటే ప్రపంచం మర్చిపోతాను. కనీసం ఫోన్ కూడా నా దగ్గర పెట్టుకోను. ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ చేయను. పూర్తి దృష్టి షూటింగ్ పైనే ఉంటుంది. ► మాస్ హీరో అనిపించుకోవాలనే కోరిక లేదు. రెచ్చిపోయి ఫైట్స్ చేయాలనీ లేదు. మంచి నటుడు అనిపించుకోవాలన్నది నా ఆకాంక్ష. ప్రేమకథా చిత్రాలకన్నా మాస్ మూవీస్ చేస్తే కమర్షియల్‌గా డెవలప్ అవ్వొచ్చని అంటారు. కానీ, నా దృష్టిలో ప్రేక్షకులకు ఏది నచ్చితే అది కమర్షియల్ సినిమా అవుతుంది. ఉదాహరణకు ‘బొమ్మరిల్లు’, ‘కొత్త బంగారు లోకం’ వంటి ప్రేమకథా చిత్రాలను చెప్పుకోవచ్చు. అవి ప్రేక్షకులకు నచ్చడంవల్ల కమర్షియల్ మూవీస్ అయ్యాయి. ► నేను షూటింగ్స్‌కి ఆలస్యంగా వస్తాననే వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్తలో ఎంత నిజం ఉందో నా దర్శక-నిర్మాతలను అడిగితే తెలుస్తుంది. ఇలాంటి రూమర్స్ వస్తున్నాయంటే.. నా గురించి ఏదో రకంగా అందరూ మాట్లాడుకుంటున్నారనే కదా అర్థం. సో.. రూమర్స్ వస్తే హ్యాపీనే. ► ఇప్పుడు నాకంటూ గుర్తింపు వచ్చింది కాబట్టి, పేరున్న హీరోయిన్ల సరసన నటించవచ్చు. నాకు సమంత అంటే చాలా ఇష్టం. ఏదైనా సినిమాలో ఆమెతో రొమాన్స్ చేసే ఛాన్సొస్తే, ఆనందపడతా. సమంతకు తమ్ముడిగా చేయమని ఎవరైనా కథ తీసుకొస్తే, వాళ్లను చంపేస్తా (నవ్వుతూ). ► ప్రస్తుతం మంచు విష్ణుతో ఓ పంజాబీ రీమేక్‌లో నటిస్తున్నా. విష్ణుని నా బ్రదర్‌లా భావిస్తున్నాను. ఈ సినిమా కాకుండా మరికొన్ని అవకాశాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్‌లో, ‘దిల్’ రాజుగారి బ్యానర్లో సినిమాలు ఒప్పుకున్నా. -
జీవీతో మరోసారి ఆనంది రొమాన్స్
యువ కథానాయకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో నటి ఆనంది మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోంది. వీరిద్దరూ ఇంతకు ముందు త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో నటించారు. ఆ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అంతే కాదు శ్రుతిమించిన గ్లామర్ సన్నివేశాలతో కూడుకున్న చిత్రంగా విమర్శలను బాగాను మూటగట్టుకుంది. మరో విషయం ఏమిటంటే అందులో నన్ను అశ్లీల సన్నివేశాల్లో నటింపజేశారంటూ నటి ఆనంది దర్శకుడిపై ఆరోపణలు గుప్పించింది. దీంతో ఆమెకు కోలీవుడ్‌లో అవకాశాలు రావడం కష్టమే అనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆనందికి మరోసారి జీవీతో రొమాన్స్ చేసే అవకాశం రావడం విశేషమే అవుతుంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి నటిస్తున్న తాజా చిత్రానికి ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇది బాషా చిత్రంలో రజినీకాంతో ఒక సన్నివేశంలో చెప్పే డైలాగ్ అన్నది గమనార్హం. ఇక పోతే ఇంతకు ముందు జీవీతో డార్లింగ్ వంటి హిట్ చిత్రాన్నిచ్చిన దర్శకుడు శ్యామ్ ఆంటోన్ ఈ చిత్రానికి మోగాఫోన్ పట్టారు. రజినీకాంత్ హీరోగా ఎందిరన్-2 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం ఇటీవలే సెట్‌పైకి వెళ్లింది. ఇందులో నటి ఆనందికి అభినయానికి అవకాశం ఉన్న పాత్ర అట. చిత్రాన్ని అధిక భాగాన్ని పాండిచ్చేరి, చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. -
అజిత్‌తో రొమాన్స్ చేయాలి
అవకాశాలనే కాదు వరుస విజయాలను అందుకుంటున్న యువ నాయకి శ్రీదివ్య. ఈ పదహారణాల తెలుగు అమ్మాయి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని పక్కన పెట్టి తమిళ చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ నాయకిగా కొనసాగుతోంది. వరుత్తపడాద వాలిబర్సంఘం చిత్రంతో విజయాలను నాంది పలికిన ఈ బ్యూటీ తాజాగా విడుదలైన ఈటీ చిత్రం వరకు వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా ఆర్య, రానా, బాబీసింహలతో కలిసి నటించిన బెంగళూర్ నాట్కళ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కార్తీకి జంటగా కాష్మోరా చిత్రంలో నటిస్తోంది. శ్రీదివ్యను ఏక కాలంలో విజయ్, అజిత్‌లతో నటించే అవకావమం వస్తే తొలి చాయిస్ ఎవరికి ఇస్తారూ? అన్న ప్రశ్నకు ఏలాగోలా ఇద్దరితో నటించాలని కోరుకుంటాను అని తెలివిగా బదులిచ్చింది. ఇంకా మాట్లాడుతూ అజిత్‌కు తాను సెట్ అవుతానా అన్నది తెలియదనీ, ఇంతకు ముందే వేదాళం చిత్రంలో ఆయనకు చెల్లెలిగా నటించే అవకాశం వచ్చిందని తెలిపింది. అయితే అజిత్‌తో హీరోయిన్గా రొమాన్స్ చేయాలని ఆశపడే తాను ఆయనకు చెల్లెలిగా నటించడానికి ఎలా ఒప్పుకుంటానని, అందుకే ఆ అవకాశాన్ని తిరస్కరించినట్లు శ్రీదివ్య చెప్పింది. -
కాజల్ పనయిపోయిందా?
చిత్ర పరిశ్రమలో ఒక అనారోగ్యకరమైన అంశం ఏమిటంటే ఒకటి రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోతే ఇక ఆ చిత్ర కథానాయకుడు లేదా కథానాయకి పనయిపోయిందనే అనే ప్రచారం జోరందుకుంటుంది. నిజానికి ఒక చిత్ర విజయానికైనా, అపజయానికైనా ఏ ఒక్కరో కారణం కాజాలరు. పలువురి సమష్టి కృషితోనే చిత్రం రూపొందగలదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల చిత్ర అపజయానికి హీరోనో, హిరోయిన్నో బలి చేయడం సరైంది కాదు. ఈ ఉపోద్ఘాతానికి కారణం లేక పోలేదు. నటి కాజల్ అగర్వాల్ విషయానికే వస్తే ఇటీవల ఆమె ధనుష్ సరసన నటించిన మారి చిత్రం కమర్షియల్‌గా ఓకే అనిపించుకుంది. అయితే ఆ తరువాత విశాల్‌కు జంటగా నటించిన పాయుంపులి చిత్రం నిరాశపరచింది. దీంతో కాజల్ పని అయిపోయిందనే ప్రచారానికి తెరలేపేశారు. అదే సమయంలో విక్రమ్‌తో రొమాన్స్ చేయాల్సిన చిత్రం కాజల్‌కు దూరం కావడం, అలాగే లారెన్స్‌తో నటించాల్సిన మొట్టశివ కెట్టశివ చిత్ర షూటింగ్ వాయిదా పడటం ఆ ప్రచారానికి ఇంకా దోహద పడిందని చెప్పవచ్చు. అయితే జయాపజయాలు సర్వసాధారణం అనే విషయాన్ని మరచిపోరాదు. ఏదేమైనా కాజల్ కోలీవుడ్‌లో మరో రౌండ్‌కు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. విక్రమ్‌కు జంటగా ఒక చిత్రం మిస్ అయినా మరో చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. తిరు దర్శకత్వంలో విక్రమ్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు తెలిసింది. తాజాగా ఈ బ్యూటీకి మరో భారీ అవకాశం వరించనున్నట్లు సమాచారం. ఇళయదళపతి విజయ్ 60 వ చిత్రంలో నాయకిగా కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసే పనిలో ఆ చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలిసింది. విజయ్‌తో కాజల్ ఇంతకు ముందు తుపాకీ, జిల్లా చిత్రాల్లో నటించారు. ఆ రెండు ఘన విజయాలు సాధించాయి. దీంతో కాజల్ ముచ్చటగా మూడోసారి ఇళయదళపతితో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించనుంది. విజయ్ ప్రస్తుతం తెరి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సమంత, ఎమీజాక్సన్ నాయికలుగా నటిస్తున్నారు. విజయ్ 60వ చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన వివరాలను యూనిట్ వర్గాలు సంక్రాంతి సందర్భంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
సల్మాన్ సరసన అనుష్క
ముంబై: ఎట్టకేలకు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'సుల్తాన్' కు హీరోయిన్ కన్ఫాం అయింది . బాలీవుడ్ లో ఉత్కంఠను రేపిన ఆ పాత్రను చివరకు పీకే స్టార్ అనుష్క శర్మ ఎగరేసుకుపోయింది. ఈ విషయాన్ని యష్ రాజ్ ఫిలింస్ అధికారిక ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించారు. దీంతోపాటు సల్మాన్ అనుష్కల ఫోటోను కూడా షేర్ చేశారు. దీనికి దబాంగ్ హీరో సల్మాన్,(50) పీకే భామ అనుష్క(27) రీ ట్విట్ చేశారు. దీంతో సల్మాన్ జోడీగా ఎవరు నటించనున్నారనే ఊహాగానాలకు తెరపడింది. దాదాపు సగం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీకి ఇంతవరకు కథానాయిక ఫైనల్ కాకపోవడం బీ టౌన్ లో ఆసక్తికరంగా మారింది. ఈ క్యారెక్టర్ కోసం పరిణితీ చోప్రా, కంగనారనౌత్, క్రితి సనన్ ,దీపికాపదుకొనే కత్రినా లాంటి టాప్ హీరోయిన్ల పేర్లతో పాటు, టీవీ నటి మృణాల్ పేరు కూడా హల్చల్ చేసినా ఫైనల్ కాలేదు. . చివరికి తాజా ట్విట్‌తో క్లారిటీ వచ్చినట్టయింది. కాగా హరియాణాకు చెందిన 40 ఏళ్ల రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ''సుల్తాన్''. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై, అబ్బాస్ ఆలీ జఫర్ దర్శకత్వంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2016 ఈద్‌కు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 2008 లో యశ్ రాజ్ ఫిలింస్ మూవీ రబ్ నే బనా దీ జోడీ తో బాలీవుడ్ రంగప్రవేశం చేసిందీ అనుష్మ శర్మ. జబ్ తక్ హై జాన్ , ఎన్ హెచ్ 10, బాంబే వెల్వెట్, పీకే తదితర సినిమాల్లో నటనతో విమర్శకుల ప్రశంసలందుకుంది. గత ఏడాది ఈ అమ్మడు నిర్మాతగా తొలి అడుగులు వేసింది. పెటా సంస్థ హాటెస్ట్ విజెటేరియన్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డునందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ కొత్త ఏడాదిలో ఎలాంటి మెరుపులు మెరిపించనుందో చూడాలి. Meet Sultan's Leading Lady! #SultanLeadingLady pic.twitter.com/M4GevELrLS — Sultan Official (@SultanTheMovie) January 8, 2016 -
ఒకే సారి ఇద్దరితో జీవీ రొమాన్స్
చెన్నై : యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా యమ జోష్‌లో ఉన్నారు. విజయాలతో పాటు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటి వరకూ డార్లింగ్, త్రిష ఇల్లన్నా నయనతార చిత్రాలు విడుదలవ్వగా రెండు చిత్రాలు విజయం సాధించడం విశేషం.కాగా ప్రస్తుతం బ్రూస్లీ చిత్రంలో నటిస్తున్న జీవీ.ప్రకాశ్‌కుమార్ ఇంద కార్తీ కొట్టవన్,తదితర రెండు చిత్రాలలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా మరో చిత్ర అవకాశం ఆయన ఇంటి తలుపు తట్టింది. ఒరు కల్ ఒరు కన్నాడి, శివ మనసుల శక్తి, ఇటీవల వాసు శరవణన్ ఇన్నా పడిచవంగ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజేశ్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు.దీనికి కడవుల్ ఇరుకాన్ కుమారు అనే టైటిల్ నిర్ణయించారు.ఈ చిత్రంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించనున్నారన్నది తాజా సమాచారం. కాగా జీవీ ఇటీవల తన చిత్రాలలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడం ప్రారంభించారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో ఆనంది,మనీషాయాదవ్లతో డ్యూయెట్లు పాడిన జీవీ కడవుల్ ఇరుకాన్ కుమారు చిత్రంలో నటి కీర్తీసురేశ్,ప్రియాఆనంద్లతో రొమాన్స్ చేయనున్నారని తెలిసింది.ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. -
'దుల్కర్‌సల్మాన్‌తో హన్సిక రొమాన్స్?
దుల్కర్ సల్మాన్ మలయాళ సూపర్‌స్టార్ మమ్ముటి వారసుడన్న విషయం తెలిసిందే. వాయైమూడి పేసువుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ మాలీవుడ్ యువ నటుడు మలి చిత్రంతోనే ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో (ఓ కాదల్ కణ్మణి)నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ రెండు చిత్రాలు విజయం సాధించడంతో దుల్కర్సల్మాన్ తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశాన్ని వదులుకున్న దుల్కర్ తాజాగా ఒక తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విశేషమేమిటంటే ఇందులో దుల్కర్‌సల్మాన్‌తో క్రేజీ నటి హన్సిక జత కట్టనున్నారని తెలిసింది. ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దర్శక ద్వయం హరిశంకర్, హరీష్నారాయణన్ దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ క్రేజీ చిత్రాన్ని ఇంతకు ముందు అరణ్మణి వంటి సూపర్ హార్రర్ చిత్రాన్ని నిర్మించిన విజన్ ఐ మీడియా సంస్థ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. -
పెళ్లికి ముందు ఎమీ... పెళ్లి తర్వాత సమంత
పెళ్లికి ముందు ఎమిజాక్సన్ పెళ్లి తరువాత సమంత బాగా నటించారని నటుడు ధనుష్ పేర్కొన్నారు. కథానాయకుడిగా విజయపథంలో సాగుతున్న ఈయన తాజాగా సుందరీమణులు సమంత, ఎమిజాక్సన్లతో రొమాన్స్ చేసిన చిత్రం తంగ మగన్. ధనుష్ దీన్ని తన ఉండర్ బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు. వేల ఇల్ల పట్టాదారి వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత వేల్రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం తంగమగన్. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రం విడుదల హక్కుల్ని గోపురం ఫిలింస్ జి ఎన్ అన్భుసెళియన్ పొందారు. తంగమగన్ చిత్రం ఈ నెల18న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు ధనుష్ శనివారం ఉదయం పత్రికల వారితో భేటీ అయ్యారు.ఆమాటా మంతి చూద్దాం. ప్రశ్న: తంగమగన్ చిత్రం గురించి చెప్పండి? జవాబు: ముందుగా ఈ చిత్రం గురించి చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. తంగమగన్ చిత్రం వేల ఇల్లా పట్టాదారికి సీక్వెల్ కాదు. ఇది వేరే కథతో తెరకెక్కిన చిత్రం. తంగమగన్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేమ, హాస్యం, యాక్షన్ మొదలగు అంశాలతో కూడిన జనరంజకమైన కథా చిత్రం. ప్రశ్న: చిత్రంలో మీకు తండ్రిగా నటించినదర్శకుడు కేఎస్ రవికుమార్ గురించి? జవాబు: నా చిత్రం అనిచెప్పడం కాదు గాని తంగమగన్ చిత్రంలో కేఎస్ రవికుమార్ చాలా కీలక పాత్ర. ఆయన కూడా తాను పెద్ద దర్శకుడినన్న భావం లేకుండా చిత్ర దర్శకుడి సూచనల మేరకు చాలా బాగా నటించారు. ఇక నా తల్లిగా నటించిన రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె సెట్లో ఉంటే అంతా సందడే. అంత జాలీగా ఉంటారు. ప్రశ్న: కథానాయికలు సమంత, ఎమిజాక్సన్ల నటన గురించి? జవాబు: పెళ్లికి ముందు ఎమిజాక్సన్, పెళ్లి తరువాత సమంత వారివారిపాత్రల్లో జీవించారు. అందుకే అంత కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నాను తంగమగన్ అన్నివర్గాల ప్రేక్షకులను, అదే సమయంలో నా అభిమానులను అలరిస్తుంది. ప్రశ్న: మీరు రజనీకాంత్ చిత్రాల టైటిల్స్‌పై ఆసక్తి చూపుతున్నట్లున్నారు? జవాబు: నేనే కాదు చాలా మంది రజనీ కాంత్ చిత్రాల టైటిల్స్‌ను వాడుకుంటున్నా రు. నిజం చెప్పాలంటే నా చిత్రాలకు కావాలని రజనీకాంత్ చిత్రాల పేర్లు పెట్టడంలేదు. అవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి తమిళమగన్ అనే పేరు పెట్టాలనుకున్నారు. అయితే చిత్ర నిర్మాత తంగమగన్ పేరును కోరుకున్నారు. నిర్మాతగా ఆయన ఆశను నెరవేర్చడం మాధర్మం కాబట్టి తంగమగన్ టైటిల్‌ను ఖాయం చేశాం. ప్రశ్న: తంగమగన్లో కొత్తగా ఏమి చెప్పదలచుకున్నారు? జవాబు: చిత్ర కథ కొత్తగా ఉంటుందని మేం చెప్పడంలేదు. అయితే చాలా హంబుల్‌గా ఉంటుంది. చిత్ర కథా నాయకుడి పెళ్లికి ముందు, పెళ్లి తరువాత జీవితమే తంగమగన్ చిత్రం. ప్రశ్న: చిత్రంలో మీసం లేకుండా నటించినట్లున్నారు? జవాబు: నిజానికి నా ఈ ఆకారానికి మీసం లేకుంటే బాగుండదు. అయినా యూత్‌గా కనిపించాలి కనుక మీసం లేకుండా నటించాల్సి వచ్చింది. ప్రశ్న: ఉండర్‌బార్ ఫిలింస్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పడానికి కారణం? జవాబు: ప్రతిభావంతులైన నూతన కళాకారుల్ని ప్రోత్సహించాలన్నదే ప్రధాన ఉద్దేశం. నాసంస్థలో నిర్మించే ప్రతి చిత్రంలోనూ కనీసం ఒక్క శాఖలో నైనా కొత్త వారికి అవకాశం కల్పిస్తాను. నా ప్రయత్నంలో సఫలీకృతం అయ్యాననే అనుకుంటున్నాను. ప్రశ్న: కాక్కముట్టై లాంటి చిత్రం మళ్లీ ఎప్పుడు నిర్మిస్తారు? జవాబు: త్వరలోనే చేయనున్నాను. హిందీ చిత్ర రీమేక్‌లో అశ్విని అయ్యర్ దర్శకత్వంలో నటించనున్నాను. ఇందులో అమలాపాల్ నాయకిగా నటించనున్నారు. మరో విషయం ఏమిటంటే త్వరలో విడుదల కానున్న తాను నిర్మించిన విచారణై చిత్రం కాక్కముట్టై చిత్రం తరహాలో గొప్ప కథా చిత్రం. నాచిత్రం అని సగౌరవంగా చెప్పుకునే చిత్రంగా ఉంటుంది. ప్రశ్న: మీ విజయం వెనుక ఉన్న ముగ్గురు పేర్లు చెప్పమంటే ఎవరని అంటారు? జవాబు: నా తల్లిదండ్రుల ప్రార్థన, ఆ తరువాత నాభార్య, ఆపై దైవం. దైవానుగ్రహం లేనిదే ఎవరు ఏమీ సాధించలేరు. ప్రశ్న: ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? జవాబు: నెగటివ్ పాత్రలో నటించాలన్న కోరిక ఇటీవల బలంగా కలుగుతోంది.అది ఎలాంటి దైనా సరే ప్రేక్షకులు చప్పట్లు కొట్టేలా ఉండాలి. నటన పరంగా నేను ఆడుకోవాలి. ప్రశ్న : మీరు నటించే చిత్రాల గురించి మీ అన్నయ్య సెల్వరాఘవన్‌తో చర్చిస్తారా? జవాబు: ఇద్దరం చర్చించుకుంటాం. అయితే ఒకరి చిత్రం విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు. ప్రశ్న: మీ చిత్రాల ప్రభావం యువతపై చాలా ఉంటుంది. వారికి చక్కని సందేశం ఇచ్చే చిత్రాలు చేయవచ్చు? జవాబు: పెద్దగా సందేశాలతో కూడిన చిత్రాలు చేయను గాని, నా స్థాయిలో చిన్న చిన్న మెసేజ్‌లతో కూడిన చిత్రాలు తప్పకుండా చేస్తాను. -
గ్లామర్ పాత్రలు రావడం లేదు
తమిళసినిమా : గ్లామర్‌తోనే మనుగడ అనే నిర్ణయానికి మన హీరోయిన్లు వచ్చేసినట్లు ఉన్నారు. ఇంతకు ముందు నటనకు అవకాశం ఉన్న పాత్రల కోసం ఎంత కాలం అయినా వేసి చూస్తామనే మాటలు విన్న వారి నోటి నుంచి ఇప్పుడు అందాలారబోతకు నేను వ్యతిరేకం కాదు అనే వ్యాఖ్యలు వినాల్సి వస్తోంది. అంతగా ఈతరం హీరోయిన్లు మైండ్ సెట్‌ను మార్చుకుంటున్నారు. ఆ మధ్య యువనటి రెజీనా గ్లామర్‌కు నేను దూరం అంటూ మడి కట్టుకు కూర్చుంది. దీంతో చిత్ర పరిశ్రమ అమ్మడిని పక్కన పెట్టేశాయి. ఇది గ్రహించిన రెజీనా అందాలారబోతకు నేను సైతం సిద్ధమంటూ గేటులెత్తేసింది. తాజాగా నటి స్వాతికి జ్ఞానోదయం అయినట్లుంది. ఈ తెలుగింటి ఆడపడుచుకు ఇప్పటి వరకూ కాస్త మంచి ఇమేజే ఉంది. అయితే అది ఆఫర్లను రాబట్టడం లేదు. స్వాతి చాలా కాలంగా నటిగా కొనసాగుతున్నా ప్రముఖ స్థానాన్ని అందుకోలేకపోయింది. చిన్న చిన్న నాయకులతోనే రొమాన్స్ చేయాల్సి వస్తోంది. అదీ అడపాదడపానే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. స్వాతి నటించిన తెలుగు చిత్రం త్రిపుర శుక్రవారం తెరపైకి రానుంది. కొత్త చిత్రం ఏదీ లేదు. తమిళంలో సుబ్రమణిపురం, వడకర్రి, యట్చన్ లాంటి చిత్రాల్లో నటించినా ఇక్కడా ప్రస్తుతం అవకాశాలు నిల్.దీంతో స్వాతి కొత్తరాగం అందుకుంది. నాకు గ్లామర్ పాత్రల అవకాశాలు రావడం లేదు అన్నదే ఆమె తాజా ఆరోపణ. మరీ అసభ్య సన్నివేశాల్లో నటించకూడదన్నది తన పాలసీ. అందుకు తనను ఇప్పటి వరకూ గ్రామీణ యువతి పాత్రలకు పక్కింటి అమ్మాయి ఇమేజ్ పాత్రలకు పరిమితం చేశారు. నవ నాగరీక అమ్మాయి పాత్రలో నటించాలని ఆశగా ఉంది. అందాలారబోతకు తాను వ్యతిరేకిని కాదు. అయితే హద్దులు దాటేవిగా ఉండే గ్లామర్ పాత్రలకు దూరం అని చెప్పింది. -
విశాల్‌తో రొమాన్స్‌కు సై
తమిళసినిమా: నటి శ్రీదివ్య వరుస సక్సెస్‌లతో దూసుకెళుతోంది. వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రంతో విజయబాట పట్టిన ఈమె ఈ మధ్య విడుదలైన కాక్కిసట్టై చిత్రం వరకు విజయాలు అందుకుంది. ప్రస్తుతం కార్తీ వంటి స్టార్ హీరోతో కాస్మోరా చిత్రంలో నటిస్తోంది. ఈ తెలుగింటి ఆడపడుచు తాజాగా విశాల్‌తో నటించే లక్కీఛాన్స్‌ను కొట్టేసింది. కథాకళి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో విశాల్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కొంబన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ముత్తయ్య ఇప్పుడు విశాల్‌ను డెరైక్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి మరుదు అనే పేరును ఖరారు చేశారు. దర్శకుడు ముత్తయ్య ఇంతకు ముందు చేసిన కుట్టిపులి, కొంబన్ చిత్రాలలో హీరోయిన్గా నటించిన లక్ష్మిమీనన్‌నే ఈ మరుదు చిత్రంలో నాయకిగా నటింపజేయాలని భావించినట్లు సమాచారం. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా నటి శ్రీదివ్యను ఆ అవకాశం వరించింది. మరో విషయం ఏమిటంటే ఇటీవల జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో కార్యదర్శి పదవికి పోటీ పడి ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకున్న విశాల్, రాధారవి ఈ చిత్రంలో నాయకుడు, ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మరుదు చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. -
తమన్నా కావాలనే ఆ పని చేస్తోందా ?
-
లవ్లీ ఎంటర్టైనర్
ప్రేమకథ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘రా..రమ్మని’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. దీపక్, లోవే సాసన్, మధుర ముఖ్య తారలుగా దాసరి బ్రహ్మానందం దర్శకత్వంలో మిద్దె సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత మిద్దె పద్మశ్రీ కెమెరా స్విచాన్ చేయగా, నటుడు సీనియర్ నరేశ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ కీలక పాత్రలో ప్రముఖ నటుడు నటించనున్నారు. నవంబర్ 5న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: రాము పినిశెట్టి. -
విజయ్‌సేతుపతితో జత కడుతుందా?
యువ కథానాయకులు క్రేజీ కథానాయికలతో నటించాలని ఆశ పడుతున్నారు.అదే విధంగా ప్రముఖ కథానాయికలూ వర్ధమాన కథానాయకులతో నటించడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఆ మధ్య శివకార్తీకేయన్‌తో క్రేజీ నటి హన్సిక మాన్‌కరాటే చిత్రంలో నటించి, ఆ చిత్ర విజయానికి ఒక కారణం అయ్యారు. అదే విధంగా లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార మాయ చిత్రంలో వర్ధమాన నటుడు ఆరితో నటించి ఆ చిత్ర విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మరో యువ నటుడు విజయ్‌సేతుపతితో ఈ సంచలన భామ నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్రం ఇటీవలే తెరపైకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇలా ప్రముఖ నటీమణులతో యువనటులు నటించిన చిత్రాల ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో దర్శక నిర్మాతలు అలాంటి ప్రయత్నాలతో ముందుకు సాగుతున్నారు. నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నయనతారతో నటించిన విజయ్‌సేతుపతి తదుపరి సొట్ట బుగ్గల సుందరి హన్సికతో రొమాన్స్ చెయ్యాలని ఆశ పడుతున్నారు. వరుస ఫ్లాప్‌ల తో సతమతమవుతున్న ఈ యువ హీరోకు నానుమ్ రౌడీదాన్ చిత్ర విజయం కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఆ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఆరెంజ్మిఠాయ్ చిత్రం తరువాత కామన్‌మాన్ పతాకంపై పి.గణేశ్ నిర్మించనున్న తాజా చిత్రంలో విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్నారు. ఇంతకు ముందు అరుణ్‌విజయ్ హీరోగా వాడీల్ చిత్రాన్ని తెరకెక్కించిన రత్నశివ దర్శకత్వం వహించనున్న రెండో చిత్రం ఇది. లవ్, యాక్షన్, కామెడీ అంశాలతో కూడిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటి హన్సికను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ ముద్దుగుమ్మ విజయ్‌సేతుపతితో నటించడానికి అంగీకరిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్ర షూటింగ్‌ను మధురై, కోవై, కుంభకోణం తదితర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. -
అలా అయితే... నేను పెళ్లికి పనికిరానా?
సందేహం నా వయసు 33. ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ నేను, మావారు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటాం. ఆ సమయంలో అంగచూషణను బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఒక్కోసారి నేను వీర్యం మింగేస్తుంటాను. దానివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? - సుజీ, ప్రకాశం జిల్లా అంగచూషణ చేసేటప్పుడు ఒక్కోసారి మగవారి అంగం మీద ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే... అది మీ నోటి ద్వారా లోనికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే మీ నోటిలో, దంతాల్లో, చిగుళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే... అది మీవారికి సోకే అవకాశమూ ఉంది. సాధారణంగా వీర్యంలో కొద్దిగా చీము కణాలు ఉంటాయి. కొందరిలో హర్పిస్, గనోరియల్, సిఫిలిస్, ఫంగల్ ఇంకా ఇతరత్రా సుఖవ్యాధులకు సంబంధించిన క్రిములు కూడా ఉండవచ్చు. ఆడవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు.... నోటిలో పుండ్లు, పగుళ్లు వంటివి ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్లు వారికి కూడా సోకే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు పై కారణాలు లేకుండా కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. దాంతో నోటిలో పొక్కులు, కురుపులు, పుండ్లు ఏర్పడతాయి. జ్వరంతో పాటు మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒకవేళ మగవారిలో హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా సోకవచ్చు. అందువల్ల అంగచూషణ పూర్తిగా సురక్షితమని చెప్పడానికి లేదు. మీరిద్దరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, కండోమ్ వాడుకోవడం ఇద్దరికీ మంచిది. నా వయసు 24. ఈమధ్యనే పెళ్లి కుదిరింది. అప్పట్నుంచీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. అది చేసే సమయంలో కొన్ని రకాల వస్తువులు కూడా వాడేదాన్ని. దానివల్ల నా యోని వదులైపోయి ఉంటుందేమో, కన్నెపొర చిరిగిపోయిందేమో అని అనుమానంగా ఉంది. మొదటి రాత్రి నా భర్తతో కలిసినప్పుడు రక్తం రాకపోతే అతడు నన్ను అనుమానిస్తాడేమోనని కంగారుగా ఉంది. ఇప్పుడేం చేయాలి? - వందన, హైదరాబాద్ హస్తప్రయోగం వల్ల యోని వదులైపోవడం అనేది ఉండదు. కాకపోతే కొన్ని వస్తువులు వాడారు కాబట్టి కన్నెపొర చిరిగే అవకాశం ఉంది. సాధారణంగా కొందరిలో కన్నెపొర చిన్నతనంలో ఆటలాడేటప్పుడు, సైకిల్ తొక్కడం లాంటివి చేసినప్పుడు చిరిగిపోతుంది. మరికొందరి కన్నెపొరకు సాగే గుణం ఉంటుంది. అలాంటివారికి మొదటిసారి కలిసినప్పుడు రక్త రావడం జరగదు. అయినా మొదటిరాత్రి అందరికీ రక్తం రావాలన్న నియమం ఏమీ లేదు. కాబట్టి మీరు అనవసరంగా కంగారు పడకండి. పెళ్లి చేసుకోబోతున్న ఆనందాన్ని హాయిగా ఆస్వాదిస్తూ, సంతోషంగా ఉండండి. నా వయసు 20. ఇంకా పెళ్లి కాలేదు. నాకు మొదట్నుంచీ నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఎడమకాలు కూడా బాగా లాగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవారికి పెళ్లయ్యాక చాలా ఇబ్బందులు వస్తాయని, పిల్లలు కూడా సరిగ్గా పుట్టరని నా ఫ్రెండ్ అంటోంది. అది నిజమేనా? నేను పెళ్లి చేసుకోవడానికి పనికిరానా? - పూర్ణిమ, డోర్నకల్ కొంతమందికి నెలసరి సమయంలో ఎలాంటి సమస్యా లేకపోయినా కూడా నొప్పి వస్తుంది. ఆ సమయంలో ప్రొస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఎక్కువ మోతాదులో విడుదలవడం వల్ల, బ్లీడింగ్ బయటకు రావడానికి గర్భాశయంలోని కండరాలు కుదించుకున్నట్లు అయ్యి... పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, వికారం వంటివి కలుగుతాయి. ఇవి ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉండవచ్చు. ఇలాంటి వారిలో పెళ్లయ్యాక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. వేరే ఏ సమస్యలూ లేనప్పుడు పిల్లలు పుట్టడంలోనూ సమస్యలు ఏర్పడవు. అయితే కొందరిలో మాత్రం గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియాసిస్, అడినోమయోసిస్ వంటి కొన్ని సమస్యల కారణంగా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే కొన్నిసార్లు పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరోసారి గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్‌తో పాటు అవసరమైన పరీక్షలన్నీ చేయించుకోండి. సమస్య ఏంటో తెలిశాక తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏ సమస్యా లేకపోతే కనుక, నొప్పి తగ్గడానికి పీరియడ్స్ సమయంలో రెండు నుంచి మూడు రోజులు మందులు వాడితే సరిపోతుంది. నా వయసు 29. ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ నార్మల్ డెలివరీయే. కాకపోతే యోని దగ్గర కుట్లు పడ్డాయి. అప్పట్నుంచీ నా యోని వదులుగా అయిపోయింది. కలయిక సమయంలో అంగప్రవేశం జరిగినట్టు కూడా తెలియడం లేదు. మావారు కూడా విసుక్కుంటున్నారు. మళ్లీ నా యోని బిగుతుగా అవ్వాలంటే ఏం చేయాలి? - సునీత, చాదర్‌ఘాట్ కొందరి శరీర తత్వాన్ని బట్టి... సాధారణ కాన్పు సమయంలో బిడ్డ బరువు, సైజును బట్టి యోని కండరాలు సాగి, బిడ్డను బయటకు నెట్టుతాయి. కొందరిలో మాత్రం యోని కింది భాగంలో కొద్దిగా కట్ చేసి, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కుట్లు వేయడం జరుగుతుంది. కొందరికి కాన్పు తర్వాత యోని కండరాలు పూర్తిగా కాకపోయినా, చాలావరకు సాధారణ స్థితికి వచ్చేస్తాయి. కానీ కొందరిలో, సాగిన యోని కండరాలు వాటి పటుత్వాన్ని కోల్పోతాయి. దానివల్ల యోని వదులవుతుంది. మీకు కలయిక సమయంలో మరీ ఇబ్బందిగా ఉంటే కనుక ఓసారి గైనకాలజిస్టును కలవండి. పెరినియోరఫీ అనే ఆపరేషన్ ద్వారా కండరాలను దగ్గరగా లాగి కుట్టేస్తారు. తద్వారా యోని మళ్లీ బిగుతుగా అయిపోతుంది. నా వయసు 32. పెళ్లై అయిదేళ్లు అయ్యింది. మూడు నెలల క్రితం మావారు అనారోగ్యం బారినపడితే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. హెచ్ఐవీ పాజిటివ్ అని వచ్చింది. ఆయన చెడ్డవారు కాదు. కాకపోతే కాలేజీలో చదువు కున్నప్పుడు ఎవరో అమ్మాయికి దగ్గరయ్యారట. అలా వచ్చిందేమో అంటున్నారు. ఇన్నాళ్లూ కాపురం చేశాను కాబట్టి నాకూ ఎయిడ్స్ వచ్చి ఉంటుందా? వెంటనే తెలియాలంటే ఏ పరీక్ష చేయించుకోవాలి? ఒకవేళ నాకు వచ్చి ఉండక పోతే ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - పార్వతి, విజయనగరం మీవారికి హెచ్ఐవీ పాజిటివ్ ఉంది అంటే, ఆయన రక్తంలో హెచ్ఐవీ వైరస్ ఉందన్నమాట. ఈ వైరస్ రక్తం ద్వారా లేదా కలయిక ద్వారా మీకు వచ్చివుండే అవకాశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే హెచ్ఐవీ రక్తపరీక్ష చేయించుకోండి. దానివల్ల మీకు హెచ్ఐవీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అదృష్టం కొద్దీ లేకపోతే... కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్ఐవీకి మందులు అందుబాటులో ఉంటున్నాయి. మీవారికి ఆ మందులు ఇప్పించండి. కలయిక సమయంలో మాత్రం తప్పనిసరిగా కండోమ్ వాడండి. అలాగే ఈ పరీక్షలో హెచ్ఐవీ లేదని తేలినా... ఆరు నెలల తర్వాత మరోసారి హెచ్ఐవీ పరీక్ష తప్పకుండా చేయించుకోండి. నా వయసు 18. చదువుకుంటున్నాను. ఎందుకో మొదట్నుంచీ నా వక్షోజాలు చాలా వదులుగా ఉంటాయి. మొన్నీమధ్య ఫ్రెండ్సందరం మాట్లాడుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకమ్మాయి ఒక మాట అంది. జారిపోయినట్టుగా ఉండే వక్షోజాలను చూస్తే మగవాళ్లకు అనుమానం వస్తుందట. అంతకుముందే ఎవరితోనో సంబంధం ఉందని అనుకుంటారట. అది నిజమేనా? రేపు నా భర్త కూడా నన్ను అలానే అనుమానిస్తే నా పరిస్థితి ఏమిటి? పరిష్కారం చెప్పండి. - మీనా, విజయవాడ మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. వక్షోజాలు వారి వారి శరీర తత్వాన్ని బట్టి కొందరికి బిగుతుగాను, బలహీనత వల్ల కొందరిలో వదులుగాను ఉంటాయి. అంతేకానీ ఎవరితోనో సంబంధం ఉండటం వల్ల అవి వదులు కావు. అనవసరమైన మాటలు విని కంగారు పడకుండా చదువు మీద శ్రద్ధ పెట్టండి. వక్షోజాల్లో పాలగ్రంథులు, కనెక్టివ్ టిష్యూ, కొవ్వు ఉంటాయి. కొవ్వు సరిపడినంత లేకపోవడం వల్ల కూడా పటుత్వం లేక వక్షోజాలు వదులుగా ఉండ వచ్చు. ఒకవేళ మీరు బరువు తక్కువగా ఉంటే... పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, డ్రైఫ్రూట్స్, పండ్లతో కూడిన పౌష్టికాహారం తీసుకోండి. దానివల్ల అవి మళ్లీ బిగుతుగా తయారయ్యే అవకాశం ఉంది. నా వయసు 25. రెండేళ్లక్రితం పెళ్లయ్యింది. ఇంతవరకూ గర్భం దాల్చలేదు. ఈ మధ్యనే డాక్టర్‌కి చూపిస్తే... నా గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయన్నారు. ఏవో మందులు వాడమంటే వాడుతున్నాను. అయితే ఎన్నాళ్లు ఇలా వాడాలి, ఎప్పటివి అవి తగ్గుతాయి అని అడిగితే డాక్టర్ కచ్చితంగా చెప్పడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. అసలు నాకు పిల్లలు పుడతారా? - వనజ, గుంటూరు గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన మార్పులు... ఇలా ఎన్నో కారణాల వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ (నీటి తిత్తులు) ఏర్పడతాయి. ఇవి పదేళ్ల వయసు నుంచి నలభయ్యేళ్ల వయసు వారి వరకు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. వాటి వల్ల ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అవాంఛిత రోమాలు, గర్భం దాల్చడంలో ఇబ్బంది, అబార్షన్ అయిపోవడం వంటి సమస్యలు రావొచ్చు. సమస్యను బట్టి చికిత్స ఎంతకాలం అవసరం అనేది తెలుస్తుంది. ఎవరికీ కూడా మందుల వల్ల నీటి బుడగలు తగ్గిపోవు. కాకపోతే ఆరు నెలల పైన వాడటం వల్ల అవి ఇంకా పెరగకుండా చూడొచ్చు. వాటివల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యత కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. నీటి బుడగల వల్ల కొందరిలో అండం సక్రమంగా పెరగదు. కాబట్టి మీరు వ్యాయామం చేస్తూ, నీటి బుడగలు పెరగకుండా మందులు వాడుతూ ఉండాలి. అండం తయారవడానికి మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ ఆరు నుంచి పన్నెండు నెలల వరకూ ప్రయత్నించవచ్చు. అయినా కూడా గర్భం రాకపోతే... లాపరోస్కోపి అనే చిన్న ఆపరేషన్ ద్వారా నీటి బుడగలను తొలగించుకుని, తర్వాత మందులు వాడితే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. - డా॥వేనాటి శోభ -
శివకార్తికేయన్‌తో శ్రుతి సై అంటుందా?
శ్రుతిహాసన్ స్మార్టే కాదు చాలా హాట్ కూడా. ఈ క్రేజీ హీరోయిన్‌తో జత కట్టాలని స్టార్ హీరోలే కోరుకుంటున్నారు. ఇక శివకార్తికేయన్ లాంటి యువ హీరోలు ఆశ పడడంలో ఆశ్చర్యం ఏముంటుంది. ఉంటే గింటే ఈ బ్యూటీ వీళ్లతో జత కట్టడారికి సై అంటేనే. అవును శ్రుతిహాసన్ ఇప్పుడు ఏ ఒక్క భాషకో పరిమితమైన నటి కాదు. తమిళం,తెలుగు,హింది అంటూ బహు భాషల్లో టాప్ హీరోయిన్గా విరాజిల్లుతున్నారు. ప్రస్తుతం భారీ అంచనాలతో విడుదలకు సిద్ధం అవుతున్న విజయ్‌తో నటించిన పులి చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.అలాగే మరో స్టార్ హీరో అజిత్‌కు జంటగా నటిస్తున్నారు. త్వరలో ఇంకో స్టార్ హీరో సూర్య సరసన సింగం-3లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. హిందీలోనూ జాన్ అబ్రహంతో రాఖీ హ్యండ్సమ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇలా మూడు భాషల్లోనూ నటిస్తూ యమ బిజీగా ఉన్న ఈ క్రేజీ బ్యూటీతో జత కట్టాలని యువ నటుడు శివకార్తికేయన్ ఆశ పడుతున్నారు. వరుస విజయాలతో కథానాయకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న శివకార్తికేయన్ రజనీ మురుగన్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శక కెప్టెన్సీ బాధ్యతల్ని చేపడుతున్న ఈ చితానికి సాంకేతిక పరంగా ప్రముఖ నిపుణుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. చాయాగ్రహణం పీసీ.శీరామ్.సంగీతాన్ని అనిరుద్, మేకప్ బాధ్యతల్ని హాలీవుడ్ మేకప్‌మ్యాన్ సీన్ ఫూట్ నిర్వహించనున్నారు. ఇక పోతే కథానాయకి పాత్రకు కూడా స్టార్ ఇమేజ్ ఉన్న నటిని ఎంపిక చెయ్యాలని భావిస్తున్నారు. ఇంతకు ముందు సమంత, షామిలి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.తాజాగా గ్లామరస్ ప్లస్ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్‌పై దృష్టి మళ్లించారు. ఈ బ్యూటీతో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి. శ్రుతి సై అనడమే తరువాయి షూటింగ్ స్టార్ట్ అన్నట్లుగా చిత్ర యూనిట్ పరిస్థితి. అయితే ఆమె ఓకే అంటారా? అన్నదే ఆసక్తిగా మారింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని శివకార్తికేయన్ మిత్రుడు ఆర్డి.రాజా భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఎమీ శివకార్తికేయన్‌తో ఓకే అంటుందా?
ఐ చిత్రంతో నటి ఎమిజాక్సన్ పాపులారిటీ బాగా పెరిగి పోయింది. అప్పటి వరకూ ఒక్కో చిత్రం చేసుకుంటూ వచ్చిన ఈ విదేశీ భామ ఇప్పుడు వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే సింగ్ ఈజ్ బ్లింగ్ హిందీ చిత్రంతో పాటు తమిళంలో ధనుష్ సరసన వీఐపీ-2, ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా గెంతు చిత్రాల్లో నటిస్తున్నారు. తదుపరి విజయ్ 59వ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా ఎమీకి యువనటుడు శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చిందన్నది కోలీవుడ్ సమాచారం. శివకార్తికేయన్ నటించిన రజనీమురుగన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్‌తో టీమ్ అప్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. 24 ఏవీఎం స్టూడియోస్ పతాకంపై నిర్మాత రాజా నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని, పీసీ.శ్రీరామ్ సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్నదే ఇంకా నిర్ణయం కాలేదు. మొద ట ఇందులో సమంత నటించే అవకా శం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఆమెను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయట. అయితే ఆమె కాల్షీట్స్ చిక్కే అ వకాశం లేదో ఏమో గానీ మరో పక్క ఎమిజాక్సన్ను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. మరి ఎమీ శివకార్తికేయన్‌తో డ్యూయెట్లు పాడడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. -
రైజింగ్ కాజల్
ఎవరు?ఎప్పుడు? రైజింగ్‌గా మారతారో ఎవరికీ తెలియదు. ఇక నటి కాజల్ అగర్వాల్ గురించి చెప్పాలంటే దక్షిణాదిలో ఆమె పయనం తమిళ చిత్ర పరిశ్రమ నుంచే మొదలైంది. రెండు మూడు చిత్రాలు చేసినా కాజల్‌కు ఇక్కడ అపజయాలు నిరాశనే మిగిల్చాయి. అలాంటి నటిలోని టాలెంట్‌ను తెలుగు చిత్రపరిశ్రమ గుర్తించింది. అది గ్రహించడానికి తమిళసినిమాకు చాలా ఏళ్లే పట్టింది. కార్తీ సరసన నటించిన నాన్ మహాన్ అల్ల చిత్రం కాజల్‌కు ఉత్సాహానిచ్చినా, విజయ్‌తో నటించిన తుపాకీ చిత్రం ఆమెను విజయం బాట పట్టించింది. ఆ తరువాత వెంటనే అదే ఇళయదళపతితో జిల్లా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. మళ్లీ చిన్న గ్యాప్. ఇప్పుడు కోలీవుడ్‌లో చేతినిండా చిత్రాలు. ఇటీవలే ధనష్తో రొమాన్స్ చేసిన మారి చిత్రం కమర్షియల్‌గా హిట్ అనిపించుకుంది.ప్రస్తుతం విశాల్ సరసన నటించిన పాయుమ్ పులి త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.ఇక విక్రమ్‌కు జంటగా మర్మమనిదన్ చిత్రంలో నటించడానికి కాజల్ రెడీ అవుతున్నారు.అదే విధంగా లారెన్స్‌తో మొట్ట శివ కెట్ట శివ చిత్రాన్ని అంగీకరించారు.వీటితో పాటు మహేశ్‌బాబుకు జంట గా తమిళం,తెలుగు భాషల్లో తెరకెక్కనున్న బ్రహ్మోత్సవం చిత్రం, పవన్‌కల్యాణ్‌తో సర్దార్ గబ్బర్ సింగ్, ఒక హిందీ చిత్రం కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో జీవాతో జత క ట్టే మరో అవకాశం ఈ భామను వరించింది. ఇంతకు ముందు కో, యామిరుక్క భయమే వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఆర్ఎస్.ఇన్ఫోటెయిన్మెంట్ సంస్థ అధినేత ఎల్ రెడ్ కుమార్ తాజాగా రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు.అందులో ఒకటి కో-2.ఇందులో బాబిసింహా నిక్కీగల్రాణి జంటగా నటిస్తున్నారు. రెండవ చిత్రం కవలైవేండామ్.ఇందులో జీవా కథానాయకుడిగా జీవా నటిస్తున్నారు.ఆయనకు జంటగా కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారు.యామిరుక్క భయమే చిత్రం ఫేమ్ డీకే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.ఈ విషయం గురించి దర్శకుడు తెలుపుతూ తాను కో, మాట్రాన్ చిత్రాలకు కేవీ.ఆనంద్ వద్ద సహాయదర్శకుడిగా పని చేసినప్పుడే జీవా,కాజల్ అగర్వాల్‌లతో మంచి పరిచయం ఉందన్నారు. ఈ కథను తయారు చేసినప్పుడే హీరో జీవా అని నిర్ణయించుకున్నానని తెలిపారు.ఇక ఇందులో హీరోయిన్ పాత్రా హీరో పాత్రకు ధీటుగా ఉంటుందన్నారు.ఈ పాత్రకు చాలా మంది నటీమణుల పేర్లు పరిశీలించినట్లు చెప్పారు. అభినయానికి స్కోప్ ఉన్న ఈ పాత్రకు కాజల్ అగర్వాల్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించగా వెంటనే అంగీకరించినట్లు తెలిపారు.కాగా ఈ చిత్రంలో ముందుగా నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేసినట్లు ఆమెతో ఫొటో షూట్ కూడా నిర్వహించినట్లు తెలిసింది.ఆ తరువాత ఆమె కాల్షీట్స్ కేటాయించక పోవడంతో ఇప్పుడు కాజల్‌ను ఆ పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. -
జీవీకి నయన గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
నయనతార ఈ పేరు చాలా కాలం నుంచీ ఒక సంచలనం. టాప్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకూ ఆమెతో జత కట్టాలని కోరుకుంటారు. నయనతార కూడా ఈ విషయంలో కాస్త ఉదార ధోరణినే అవలంభిస్తున్నారని చెప్పవచ్చు. ఇవాళ ప్రముఖ కథానాయికల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక నటి నయనతార. అలాంటి నాయకి స్టార్ హీరోలతోనే, ప్రముఖ దర్శకులతోనే, పెద్ద నిర్మాణ సంస్థల్లోనే నటిస్తారని చెప్పవచ్చు. కానీ నయనతార అలాంటి భేదాబిప్రాయాలకు తావివ్వడంలేదు. వర్ధమాన హీరోలతోనూ నటించడానికి సై అంటున్నారు. అయితే ఆమె కొన్ని కట్టుబాట్లను విధించుకున్నారు. తనకిష్టం అయితేనే ఎవరయినా ఆమెను కలవడానికి అనుమతిస్తారు. అలాగే కథ, తన పాత్ర నచ్చితేనే ఆ చిత్రంలో నటించడానికి అంగీకరిస్తారు. ప్రస్తుతం ఆ విధంగానే వర్ధమాన నటుడు ఆరితో మాయ చిత్రం యువ నటుడు విజయ్‌సేతుపతి సరసన నానుమ్ రౌడీదాన్ తరితర చిత్రాల్లో నటించడానికి సమ్మతించారు.ఆ ధైర్యంతోనే నటుడు జీవీ.ప్రకాష్‌కుమార్ సరసన ఆమెను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నూతన దర్శకుడు ప్రసాద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి బ్రూస్లీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నాయకి పాత్రకు నయనతార అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.అంతే కదు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలెట్టారు. నయనతార జీవీ సరసన నటించడానికి పచ్చజండా ఊపుతారా? అన్నదే ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఎందుకంటే పర్శనాలిటీ పరంగా చూస్తే జీవీకి నయనతారకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. కథ అందుకు తగ్గట్టుగా ఉంటే నయనతార అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇక ఈ విషయం ఆమె నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
గబ్బర్‌సింగ్-2లో ఛాన్స్ కొట్టేసిన కాజల్?
-
సూర్యతో నిత్యామీనన్ రొమాన్స్
నటి నిత్యామీనన్ హీరోయిన్గా నటించడానికి అంగీకరించిందంటే ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్లే. ఎందుకంటే ఈ కేరళ ఏ పాత్రకు ఒక పట్టాన ఒప్పుకోరనే పేరుంది. అంతేకాదు ఈ మధ్య హీరోయిజం ఉన్న పాత్రలనే అంగీకరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది నటుడు సూర్య చిత్రంలో రెండవ హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం 24 అనే చిత్రాన్ని తన సొంత సంస్థ 2డీ బ్యానర్లో నిర్మిస్తూ నటిస్తున్నారు. మలయాళం దర్శకుడు విక్రమ్‌కుమార్ ద ర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే నటి సమంత ఒక హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఇందులో సూర్య త్రిపాత్రాభిన యం చేస్తున్నారని తెలిసింది. ఆయన మ రో పాత్రతో నటి నిత్యామీనన్ రొమాన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమెతో చర్చలు జరుగుతున్నట్లు అయితే నిత్యామీనన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే పాత్రకు ప్రాధాన్యత ఉండటం, దర్శకుడు విక్రమ్‌కుమార్ కావడంతో నిత్యామీనన్ న టించడానికి పచ్చజెండా ఊపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా కాంచన-2 లో పాత్ర పరిధి తక్కువే అయినా అది నచ్చడంతో నటించిన విషయం గమనార్హం. షూటింగ్ జరుపుకుంటున్న 24 చిత్రానికి ఎ ఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. కాలం ఇతివృత్తంగా సాగే సోషియా ఫాంటసీ కథా చిత్రాన్ని దీపావళికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
విశాల్‌కు జంటగా షామిలి
తమిళసినిమా: నటుడు విశాల్ నూతన చిత్రంలో ఆయనకు జంటగా నటుడు అజిత్ మరదలు, షాలిని చెల్లెలు షామిలి నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విశాల్ ప్రస్తుతం పాయుమ్ పులి చిత్రాన్ని పూర్తి చేసి దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. తదుపరి లింగసామి దర్శకత్వంలో సండైకోలి 2 చిత్రంతో నటించనున్నారు. ఇందులో హీరోయిన్గా తమన్న, నయనతార పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా నటి షామిలి పేరు తెరపైకి వచ్చింది. ఆమె విదేశాల్లో సినిమాకు సంబంధించిన కోర్స్ చదివి ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారు. మళ్లీ నటించడానికి సిద్ధమై మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. షామిలి ఫొటోలను నెట్లో చూసిన దర్శకుడు లింగుసామి తన సండైకోళి చిత్రంలో హీరోయిన్ పాత్రకు సరిగ్గా నప్పుతారని భావించి ఆమెను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. సండైకోళి చిత్రంలో నటించిన నటి మీరాజాస్మిన్, నటుడు రాజ్‌కిరణ్ ఈ చిత్రంలోనూ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. డి ఇమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. -
భార్య ఎదుటే రొమాన్స్ చేశా
సినిమా వాళ్లంటే చులకన భావం, ఒక రకమైన అభద్రత ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. అదిప్పుడు పూర్తిగా పోయిందని కచ్చితంగా చెప్పలేం. నటుడు విష్ణువిశాల్ ప్రేమ కథ వింటే సినిమా వాళ్లపై అపోహలు పూర్తిగా తొలగిపోలేదన్నది సుస్పష్టం అవుతుంది. విష్ణువిశాల్ ఈయన అసలు పేరు విష్ణు. నటుడైన తరువాత విష్ణువిశాల్గా మార్చుకున్నారు. ఈయన ఒక పోలీస్అధికారి కొడుకు. సినిమా, క్రికెట్ అంటే పిచ్చి.అందులో శిక్షణ కూడా పొందారు. ఈయనకో ప్రేయసి ఉంది.పేరు రజిని. వరుసకు మామ కూతురే. విష్ణువిశాల్‌కు సినిమాలో నటించాలని మక్కువ. అవకాశాల కోసం ప్రయత్నించి నిరాశ చెందారు. దాంతో వేరే జాబు చేసుకుంటున్నారు. విష్ణు ప్రియురాలి తండ్రి ఒక్క సినిమా వాళ్లను మినహా ఎవరిని పెళ్లి చేసుకో అని కండిషన్ పెట్టారట. ఈ కుటుంబం సినిమాకు వ్యతిరేకం కాదు గానీ సినిమా వాళ్లతో పెళ్లి సంబంధాలకు ససేమిరా అంగీకరించరు. మొత్తం మీద విష్ణువిశాల్, రజినీల పెళ్లి జరిగిపోయింది. భార్య కళ్లెదుటే రొమాన్స్ ఆ తరువాతే అసలు కథ మొదలైంది. విష్ణువిశాల్‌కు దర్శకుడు సుశీంద్రన్ నుంచి పిలుపొచ్చింది. వెన్నెల కబడీ కుళు చిత్రంలో కథానాయకుడిగా అవకాశం. కలలు కన్న జీవితం. ఇటు సినిమా వాళ్లంటే పడని భార్య వర్గం. ఏదో తంటాలు పడి భార్యను ఒప్పించగలిగారు. మరి మామ గారి విషయం. ఆ భాధ్యతల్ని ఆయన భార్య తీసుకున్నారు. నేను వద్దని గోల చేస్తాను మీరు దాన్ని భరించండి. అలా కొంత కాలం తరువాత అంతా సర్దుకుంటుంది. అన్న అర్ధాంగి సూచనను విష్ణువిశాల్ తూచ తప్పకుండా పాటించి సినిమా హీరో అయిపోయారు.ఆ తరువాత నీర్పరవై చిత్రంలో భార్య కళ్లెదుటే హీరోయిన్ సునైనను కౌగిలించుకుంటే ఆమె ఇందుకే సినిమాలు వద్దన్నాను అంటూ కాసేపు రాద్దాంతం చేసింది, ఆ తరువాత నటనే కదా అని సర్దుకుంది అన్న విష్ణువిశాల్ ప్రస్తుతం యువ హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఇటీవల జీవా, ముండాసుపట్టి,నేట్రు ఇండ్రు నాళై వరుసగా మూడు చిత్రాల విజయాలు సొంతం చేసుకున్నారు. ఈ విజయోత్సాహంతో శుక్రవారం తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. ఈ ఆనందాన్ని విలేకరులతో పంచుకుంటూ ఈ రోజు తానీస్థాయిలో ఉండడానికి చాలా మంది కారణం. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. తొలి చిత్ర అవకాశం ఇచ్చిన సుశీంద్రన్, నీర్పరవై చిత్ర దర్శకుడు శీనురామసామి, కష్టకాలలో ఉన్న తనను ప్రోత్సహించిన విత్రులు విశాల్, ఆర్యలకు కృతజ్ఞతలు అన్నారు. స్నేహితులంటే వారే నిజమైన స్నేహితులంటే విశాల్, ఆర్యలేనని అన్నారు. సాధారణంగా ఒక హీరో చిత్రాన్ని మరొకరు పట్టించుకోరన్నారు. అలాంటిది తాను నటించిన జీవా చిత్రాన్ని విశాల్, ఆర్య విడుదల చేశారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం ఇదం పొరుళ్ ఎవల్, వీర ధీర శూరన్, కలక్కరాయ్మాప్పిళే, పోడా ఆండవనే ఎన్ పక్కమ్ చిత్రాల్లో నటిస్తునట్లు విష్ణువిశాల్ వెల్లడించారు. -
రొమాన్స్‌లో ఆర్యకు సాటి లేరు
రొమాన్స్‌లో ఆర్యను మించిన వారు లేరంటున్నారు నటి త్రిష. 32 ఏళ్ల త్రిష నేటికీ బిజీగా నటిస్తున్నారు. 31 ఏళ్ల నయనతార సెకండ్ ఇన్నింగ్‌లో దుమ్ము రేపుతుంటే త్రిష బ్రేక్ లేకుండానే తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. త్రిష తొలిసారిగా మైనం పేసియదే చిత్రంలో నటుడు సూర్యతో డ్యూయెట్ పాడారు. ఆ లక్ ఇప్పటికీ కొనసాగుతోంది. విజయ్, అజిత్, విక్రమ్, శింబు, జయం రవి, ఆర్య అంటూ అందరి తోను ఒక రౌండ్ కొట్టిన త్రిష తెలుగులోను ప్రముఖ హీరోల నుంచి యువ నటుల వరకు జోడి కట్టారు. ఇలా ఇందరితో నటించినా ఆర్య మాత్రమే తనకు స్పెషల్ అని పేర్కొనడం చర్చనీయాం శంగా మారింది. ఆర్య తనకు మంచి స్నేహితుడు.రొమాన్స్ సన్నివేశాల్లో ఆయనతో నటిం చడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇం కా చెప్పాలంటే రొమాన్స్‌లో ఆర్యను మించిన వారు లేరు అంటూ త్రిష ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం చాలామందిని విస్మయంలో పడేసింది.