సూర్యతో నిత్యామీనన్ రొమాన్స్ | Surya to romance with Nithya Menon | Sakshi
Sakshi News home page

సూర్యతో నిత్యామీనన్ రొమాన్స్

Published Fri, Jul 31 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

సూర్యతో నిత్యామీనన్  రొమాన్స్

సూర్యతో నిత్యామీనన్ రొమాన్స్

 నటి నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించిందంటే ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్లే. ఎందుకంటే ఈ కేరళ ఏ పాత్రకు ఒక పట్టాన ఒప్పుకోరనే పేరుంది. అంతేకాదు ఈ మధ్య హీరోయిజం ఉన్న పాత్రలనే అంగీకరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది నటుడు సూర్య చిత్రంలో రెండవ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం 24 అనే చిత్రాన్ని తన సొంత సంస్థ 2డీ బ్యానర్‌లో నిర్మిస్తూ నటిస్తున్నారు. మలయాళం దర్శకుడు విక్రమ్‌కుమార్ ద ర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే నటి సమంత ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఇందులో సూర్య త్రిపాత్రాభిన యం చేస్తున్నారని తెలిసింది.
 
  ఆయన మ రో పాత్రతో నటి నిత్యామీనన్ రొమాన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమెతో చర్చలు జరుగుతున్నట్లు అయితే నిత్యామీనన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే పాత్రకు ప్రాధాన్యత ఉండటం, దర్శకుడు విక్రమ్‌కుమార్ కావడంతో నిత్యామీనన్ న టించడానికి పచ్చజెండా ఊపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా కాంచన-2 లో పాత్ర పరిధి తక్కువే అయినా అది నచ్చడంతో నటించిన విషయం గమనార్హం. షూటింగ్ జరుపుకుంటున్న 24 చిత్రానికి ఎ ఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. కాలం ఇతివృత్తంగా సాగే సోషియా ఫాంటసీ కథా చిత్రాన్ని దీపావళికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement