సూర్యతో మరోసారి రొమాన్స్
సూర్యతో శ్రుతిహాసన్ మరోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. శ్రుతి కోలీవుడ్‌లో తన పయనాన్ని సూర్య తోనే మొదలెట్టారన్న సంగతి విదితమే. అయితే వీరి తొలి కలయికలో రూపొందిన 7 ఆమ్ అరివు అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఈ జంట మాస్ చిత్రంలో మరోసారి కలవాల్సి ఉన్నా చివరి నిమిషంలో అది మిస్ అయ్యింది. తాజాగా సింగం -3 చిత్రంలో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. సింగం, సింగం-2 చిత్రాలు విజయాన్ని సాధించిన నేపథ్యంలో సింగం -3ను తెరకెక్కించడానికి రంగం సిద్ధమైంది.
సింగం సీక్వెల్‌ను తెరపై ఆవిష్కరించిన హరినే ఈ సింగం -3ని సెల్యులాయిడ్‌పై కెక్కించనున్నారు. సింగంలో అనుష్క హీరోయిన్. సింగం-2లో అనుష్కతో పాటు అదనంగా హన్సిక వచ్చి చేరారు. తాజాగా సింగం-2 అనుష్కతో శ్రుతిహాసన్ నటించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు హరి స్పష్టం చేశారు. తాజా వివరాలను ఆయన తెలుపుతూ సింగం -3లో సూర్య రెండు డైమన్షన్లలో కనిపిస్తాడన్నారు. సూర్య పోలీస్ పాత్రలో నటిస్తున్న ఐదవ చిత్రం ఇది. చిత్ర షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. తూత్తుకుడి, కారైకుడి ప్రాంతాల్లో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించి ఆ తరువాతే గోవా, ఫ్రాన్స్, ప్యారిస్‌లలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.