సూర్యతో మీరామిథున్‌ రొమాన్స్‌ | meera mithun romance to surya | Sakshi
Sakshi News home page

సూర్యతో మీరామిథున్‌ రొమాన్స్‌

Published Thu, Nov 16 2017 7:25 AM | Last Updated on Thu, Nov 16 2017 8:33 AM

meera mithun romance to surya - Sakshi

తమిళసినిమా: సూర్యతో రొమాన్స్‌ చేసే లక్కీఛాన్స్‌ను నటి మీరామిథున్‌ కొట్టేసింది. మిస్‌ ఫెమీనా సౌత్‌ కిరీటాన్ని గెలుచుకున్న ఆ బ్యూటీ, మోడలింగ్‌ రంగంలో వెలిగి ప్రస్తుతం వెండి తెరపై రాణించే పనిలో పడింది. అలా 8 తూట్టాకల్‌ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఆ తమిళ చిన్నది తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత అవకాశాలేవనుకుంటున్న సమయంలో స్టార్‌ నటుడు సూర్యతో జతకట్టే అవకాశం తలుపు తట్టిందట. ప్రస్తుతం ఆయనతో తానాసేర్న్‌ద కూటం చిత్రంలో నటిస్తోంది. అదేమిటీ ఈ చిత్రంలో కథానాయకి కీర్తీసురేశ్‌ కదా అని ఆశ్యర్యపోతున్నారా? మరేంలేదు కీర్తీతో పాటు మీరా మిథున్‌ను తానాసేర్న్‌దకూటం చిత్రంలో చూడవచ్చు.

ఈ చిత్రంలో నటించడం గురించి మీరామిథున్‌ చెబుతూ సూర్యకు జంటగా ఇందులో నటించే అవకాశం రావడానికి కారణం 8 తూట్టాకల్‌ చిత్రమేనని పేర్కొంది. చాలా రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌ తనను అప్రోచ్‌ అయ్యారని చెప్పింది. ఇందులో తన పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి చెప్పను గానీ, పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందని చెప్పింది. తానా సేర్న్‌దకూటం చిత్రంలో సూర్యతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉందని అంది. నటి నయనతార లవర్‌గా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య చిత్ర నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దింపడానికి  సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement