విశాల్‌తో రొమాన్స్‌కు శ్రుతి సిద్ధం | Shruti Hassan Romance with Vishal | Sakshi
Sakshi News home page

విశాల్‌తో రొమాన్స్‌కు శ్రుతి సిద్ధం

Published Sun, Feb 9 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM

విశాల్‌తో రొమాన్స్‌కు  శ్రుతి సిద్ధం

విశాల్‌తో రొమాన్స్‌కు శ్రుతి సిద్ధం

 విశాల్‌తో రొమాన్స్ చేసేందుకు నటి శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరి కాంబినేషన్‌లో చిత్రం గురించి ఇంతకుముందు రకరకాల వదంతులు ప్రచారమయ్యాయి. విశాల్ సరసన నటించడానికి ముం దు అంగీకరించిన శ్రుతిహాసన్ ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అదంతా వదంతేనని తేలిపోయింది. విశాల్, శ్రుతిహాసన్ జంటగా చిత్రం ప్రారంభం కానుంది. దీనికి కమర్షియల్ దర్శకుడు హరి దర్శకత్వం వహించనున్నారు. 
 
 విశాల్, హరి కాంబి నేషన్‌లో ఇంతకుముందు తామ్రభర ణి వంటి హిట్ చిత్రం వచ్చిన విష యం తెలిసిందే. ఆ చిత్రానికి సంగీత బాణీలు అందించిన యువన్ శంకర్ రాజా ఈ తాజా చిత్రానికీ పనిచేయనున్నారు. చిత్రం ఏప్రిల్‌లో సెట్‌పైకి రానుంది. దీపావళికి తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం. తమిళంలో ‘3’ తర్వాత శ్రుతి హాసన్ నటించనున్న చిత్రం ఇదే. తన తండ్రి కమలహాసన్ కోరిన కాల్‌షీట్స్ లేవని చెప్పిన శ్రుతి ఇప్పుడు విశాల్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement