Shruti Hassan
-
ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ దాకా.. (ఫోటోలు)
-
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
ఫ్రెండ్‌ను కోల్పోయా, నాన్న కోలుకున్నారు: శ్రుతి హాసన్
‘కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గలేదు కాబట్టి ఎవరూ తేలికగా తీసుకోవద్దు’ అని హీరోయిన్ శ్రుతీహాసన్ అన్నారు. తన తండ్రి కమల్‌హాసన్ కోవిడ్ నుంచి కోలుకుని తిరిగి ‘విక్రమ్’ షూటింగ్లో జాయిన్ కావడం పట్ల శ్రుతీహాసన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ– ‘‘సరైన చికిత్స అనంతరం నాన్నగారు కోవిడ్ నుంచి కోలుకున్నారని తెలిసి హ్యాపీ ఫీలయ్యాం. అయినా కరోనాను తేలికగా తీసుకోవద్దు. కరోనా కారణంగా నా ఫ్రెండ్‌ని కోల్పోయినప్పుడు చాలా బాధ కలిగింది. కరోనా ఎలా సోకుతుందో చెప్పడానికి స్పష్టమైన అంశాలు లేవు. మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా సోకినా దాని ప్రభావం తక్కువగా ఉంటుందని నమ్ముతున్నాను.. అందుకే అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నాను’’ అన్నారు. -
పాత చీరలో నివేదా, బర్త్‌డే పార్టీలో హన్సిక రచ్చ రంబోలా!
► నిండు సూరీడులా తాను కూడా ప్రకాశిస్తానంటోన్న సాక్షి అగర్వాల్ ► తల్లి బర్త్‌డే దగ్గరుండి కేక్ కట్ చేయించిన అల్లు అర్జున్ ► జిమ్‌లో అల్లు శిరీష్ కసరత్తులు ► సోదరి బర్త్‌డే పార్టీలో హన్సిక రచ్చ ► పాత చీర కట్టానంటోన్న నివేదా థామస్ ► పైకి నవ్వుతున్నామంటే అంతా కరెక్ట్‌గా ఉన్నట్లు కాదంటోంది చైత్రా రెడ్డి ► గ్యాంగ్ ఈజ్ బ్యాక్ అంటోన్న జాన్వీ కపూర్ ► కరోనాకు ముందు, తర్వాత అంటూ ఫన్నీ వీడియోను షేర్ చేసిన సుమ కనకాల ► దళపతి పాటకు వీర లెవల్లో స్టెప్పులేసిన కీర్తి సురేశ్ ► వ్యాక్సిన్ వేయించుకున్న శృతీ హాసన్ ► గోవాను మిస్ అవుతున్న అమీషా పటేల్ View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Chaitra Latha (@chaitrareddy_official) View this post on Instagram A post shared by Chaitra Latha (@chaitrareddy_official) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Sandeepa Dhar (@iamsandeepadhar) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Yami Gautam (@yamigautam) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్నా సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్నారు. ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రభుత్వాలు నెత్తీ నోరు ముత్తుకుంటున్నా కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు మాత్రం అది చెవికెక్కడం లేదు. ఇటీవలె బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్, దిషా పటాని-టైగర్ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే ట్రిప్పై నెటిజనులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై హీరోయిన్ శృతి హాసన్ సైతం స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'వారికి హాలిడే దొరికినందుకు సంతోషం, వారు దానికి అర్హులు కూడా. అయితే విహారయాత్రలకు ఇది సరైన సమయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం ఎంతోమంది కష్టకాలంలో ఉన్నారు. ఇలాంటి పాండమిక్ సమయంలో వెకేషన్ ట్రిప్పులకు వెళ్లడం కరెక్ట్ కాదు' అని పేర్కొంది. శృతి సహాన్ పాటు రోహిణి అయ్యర్, కాలమిస్ట్ శోభా దే సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సెలబ్రిటీల విహారయాత్రలను తప్పుబడుతున్నారు. చదవండి: ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే -
పోలింగ్ బూత్‌లోకి శృతి.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
నిన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో హీరోయిన్ శృతి హాసన్ చేసిన పొరపాటు ఆమెను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. మంగళవారం తమిళనాడుతో పాటు కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోలు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు హీరోయిన్స్ శృతి హాసన్, అక్షరా హాసస్‌లు కూడా తండ్రి కమల్ హాసన్‌తో కలిసి చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కమల్ హాసన్ ఈ ఎన్నికల్లో కోమంబత్తూర్ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒటు వేసిన అనంతరం కమల్ ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలోని పోలీంగ్ బూతులోకి వెళ్లాడు. అయితే ఆయనతో పాటు శృతి హాసన్ కూడా లోపలికి వెళ్లింది. ఈ సంఘటన ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికల నియమావళికి విరుద్దంగా ప్రవర్తించిన శృతి తీరుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. శృతి హాసన్.. తన తండ్రి పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేదు. పైగా ఆమె పోలింగ్ ఏజెంట్ కూడా కాదు. మీడియా పర్సన్ అంతకన్న కాదు. మరెందుకు పోలీంగ్ బూతులోకి అనమతించారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ బూతులోకి ఆమెను ఎలా అనుమతించారంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంతేగాక శృతి పోలింగ్ తర్వాత ఓటు వేసినట్టు చెప్పడమే కాకుండ.. ట్విట్టర్లో తన తండ్రి పార్టీ అయిన ‘మక్కల్ నీది మయ్యంకు(ఎమ్ఎన్ఎమ్) ఓటు వేయమని చెప్పడం కూడా కమిషన్ నిబంధనలకు విరుద్దమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్‌తో పాటు బీజేపీ జాతీయ మహిళ నేత వానతి శ్రీనివాస్ కూడా శృతిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటికి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ స్పందించడం కానీ చేయలేదు. మరి ఎన్నికల కమిషన్ శృతిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు.. -
‘సలార్’ స్పెషల్ సాంగ్‌లో ప్రియాంక చోప్రా!
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సలార్’. ప్రస్తుతం ఈ సినిమా గోదావరిఖని సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రభాస్ ఏంట్రీ సీన్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమచారం. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సలార్‌లో మాస్ మసాలతో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాట కోసం గ్లోబల్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను దర్శకుడు సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రియాంక ఇంతవరకు స్పందించలేదని, దర్శకుడు ఆమె గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా ప్రియాంక ఇదివరకు బాలీవుడ్లో ‘అగ్నిపత్’, ‘రావన్’ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికన్ సింగర్ నిక్‌జోనస్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం ప్రియాంక ఎక్కువుగా హాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. కాగా సలార్ స్పెషల్ సాంగ్ కోసం ప్రియాంకకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రియాంక దీనిపై సమాధానం ఇవ్వాలని.. త్వరలోనే దీనిపై క్లారిటి ఇవ్వనున్నట్లు సమచారం. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో విలన్‌గా మొదట తమిళ నటుడు విజయ్ సేతుపతి పేరు వినిపించగా.. తాజాగా మరో నటుడు మధు గురుస్వామి నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. చదవండి: పెళ్లికి ముందు ఆ ఒప్పందం పెట్టుకున్నాం: ప్రియాంక చదవండి: ప్రభాస్‌తో తలపడనున్న కన్నడ నటుడు! చదవండి: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్లో భారీ అగ్ని ప్రమాదం -
పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు..
నాలుగు విభిన్న కథాంశాలతో రూపొందించిన పిట్ట కథలు వెబ్ సిరీస్ తెలుగులో ఈనెల 19 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఎంతగానో ఎదురుచూస్తున్న సిరీస్ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. పిట్టకథలు.. పేరుకు తగ్గట్లే నలుగురు మహిళలకు చెందిన నాలుగు చిన్న కథల సమూహారంగా తెరకెక్కించారు. ఇందులో శ్రుతీ హాసన్, ఈషా రెబ్బా, అమలాపాల్, సాన్వే మేఘన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నలుగురు అవార్డ్ విన్నింగ్ తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, లక్ష్మీ మంచు, సంజిత్ హెగ్డే, సత్యదేవ్, అశ్విన్ కాకుమను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాలుగు కథలు వేరే అయినప్పటికీ వీటిని నడిపించేది మాత్రం ప్రేమ, కామం, ద్రోహం, కన్నీళ్లు వంటి భావోద్వేగాలే. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. బోల్డ్ కథాంశంతో సాగుతున్న ట్రైలర్ రొమాంటిక్, కన్నీళ్లు, సీరియస్ సన్నివేశాల మేళవింపుతో కూడుకొని ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ల పాత్రలు చాలా మేరకు ఎమోషనల్, బోల్డ్, రొమాంటిక్ కనిపిస్తున్నాయి. మొత్తానికి రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ ఆధ్యంతం అద్భుతంగా, ఉత్కంఠంగా సాగింది. తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా ఈ పిట్ట కథలు ఓ కొత్త అనుభూతి ఇస్తుందన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. టేకింగ్‌లో.. మనం కొన్ని అడుగులు ముందుకేసి ‘నెట్ ఫ్లిక్స్’ స్థాయిని అందుకున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. నలుగురు దర్శకులు తొలిసారి పలు కథల సమాహారంతో తీస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. ఆర్ఎస్వీపీ, ఫ్లైయింగ్ యూనికార్న్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న పిట్టకథలు నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న ప్రీమియర్ కానుంది. చదవండి: వీరిలో నా డార్లింగ్ ఎవరబ్బా: కాజల్ భర్త ఈ ట్రైలర్‌ను ట్విట్టర్లో మంచు లక్ష్మీ షేర్ చేశారు. ‘సమాజ నిబంధనలను సవాలు చేస్తూ నలుగురు విభిన్న మహిళల నాలుగు అసాధారణ ప్రయాణాలను తీసుకు వస్తోంది. ఈ సినిమాలో నేనూ భాగం అవ్వడం ఆనందంగా ఉంది. ‘స్వరూపక్క’ గా మీ ముందుకు రావడనికి ఇక ఆలస్యం చేయలేను.’ అంటూ ట్వీట్ చేశారు. మరి ఈ నాలుగు కథలూ ఎలా ఉంటాయో? నాలుగు కథల్లో ఏది అమితంగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే.. 19 వరకూ ఆగాల్సిందే. Love, betrayal and holograms? VR signing up for this right now.#PittaKathalu@TharunBhasckerD @LakshmiManchu @SaanveMegghana @bethiganti_ @nandureddy4u @IamJagguBhai @Amala_ams #AshwinKakamanu @nagashwin7 @shrutihaasan @TheSanjithhegde #SangeethShoban @anishkuruvilla pic.twitter.com/BfO0gItRr1 — Netflix India (@NetflixIndia) February 5, 2021 -
టీజర్: నలుగురు హీరోయిన్ల ‘పిట్ట కథలు’
హిందీలో సూపర్ హిట్ అయిన ‘లస్ట్ సోరీస్’ వెబ్ సిరీస్ తెలుగులో ‘పిట్ట కథలు’పేరుతో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. మొత్తం నాలుగు కథలుగా ఉన్న ఈ సీరిస్‌ని నలుగు దర్శకులు తెలుగులో రీమేక్ చేశారు. తరుణ్ భాస్కర్(పెళ్లి చూపులు ఫేమ్), నందిని రెడ్డి(‘ఓ బేబీ’ఫేమ్), నాగ్ అశ్విన్ (‘మహానటి’ఫేమ్), సంకల్ప్ రెడ్డి(‘ఘాజీ’ఫేమ్)లు తెరకెక్కించిన ఈ పిట్టకథలు సిరీస్ టీజర్ బుధవారం విడుదలైంది. మంచు లక్ష్మి, ఈషారెబ్బా, శృతిహాసన్, అమలా పాల్, జగపతిబాబు, సత్యదేవ్, మేఘన, సంజిత్ హెగ్డే నటించిన ఈ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సిరీస్ కథాంశమే బోల్డ్ కాబట్టి, టీజర్ లో అది ఏ లెవెల్లో ఉంటుందో చూపించారు. నాలుగు విభిన్న కథలు కలిగిన మహిళలు వారి జీవితానికి చెందిన ప్రేమ, ఎమోషన్స్ వాటికి వారి నలుగురికి ఉన్న కామన్ కనెక్షన్ ఏమిటి అన్నదే ఈ సిరీస్ కథాంశం. ఆర్ఎస్వీపీ మూవీస్, ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ ‘పిట్ట కథలు’ సినిమా ఫిబ్రవరి 19వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమ్ కానుంది. మరి హిందీలో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ తెలుగులో ఎలా అలరిస్తుందో చూడాలి. -
అందుకే షూటింగ్ మధ్యలో వెళ్లిపోయా
సాక్షి, చెన్నై: విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్‌లు ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జననాథన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లాభం’. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్స్ ఇటీవల ప్రారంభం కావడంతో ఈ సినిమా తిరిగి సెట్స్‌లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ‘లాభం’ షూటింగ్లో పాల్గొన్న శ్రుతిహాసన్ అర్థంతరంగా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారు. దీంతో దీనిపై పలు రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై స్పందిస్తూ ట్విటర్ వేదికగా శ్రుతీ సోమవారం వివరణ ఇచ్చారు. షూటింగ్ స్పాట్‌కు పెద్ద ఎత్తున చుట్టూ పక్కల ప్రజలు తరలి వచ్చినందున తాను షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ‘దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు షూటింగ్ స్పాట్‌కు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మహమ్మారి కాలంలో అందరికి ప్రమాదమే. ప్రతి ఒక్కరూ ప్రాటోకాల్ పాటించాల్సిందే. ఒక మహిళగా, సినీ నటిగా కరోనా ప్రొటోకాల్ దృష్ట్యా పలు నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది. అందుకే షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయాను’ అంటూ శ్రుతీ వివరించారు. (చదవండి: వకీల్ సాబ్ సెట్లో అడుగుపెట్టనున్న శృతి) కాగా ప్రస్తుతం ‘లాభం’ షెడ్యూల్ చివరి దశకు చేరుకుంది. స్క్రిప్ట్‌లో భాగంగా ఈ క్రైమాక్స్ సీన్స్‌ను తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతంలో షూటింగ్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు విజయ్ సేతుపతిని, శ్రుతిహాసన్‌ను చేసేందుకు భారీగా తరలివచ్చారు. ఇక ఇది ఊహించని చిత్ర యూనిట్ ముందుగా ఎలాంటి భద్రత చర్యలు ఏర్పాటు చేసుకోకపోవడంతో అక్కడ రద్దీ పెరగడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా లాభం చిత్రంలో జగపతిబాబు, కలైరసన్, సాయి ధన్షిక, రమేష్ తిలక్, పృథ్వీ, తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అభించింది. ఇక సినిమా విడుదల తేదీని కూడా దర్శక నిర్మాతలు త్వరలోనే ప్రకటించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. (చదవండి: మానసిక ఆందోళనతో బాధపడ్డా: శ్రుతిహాసన్) COVID is a serious health risk everyone ! The pandemic is not over ! I as a person and an actor have the right to prioritise my safety and health if protocols are not followed ! Just saying — shruti haasan (@shrutihaasan) November 19, 2020 -
సైలెంట్ మోడ్
రవితేజ, శ్రుతీహాసన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. మలినేని గోíపీచంద్ దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. గత వారం ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో ‘క్రాక్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సోమవారం ‘క్రాక్’ చిత్రబృందం ఒక వర్కింగ్ వీడియోను విడుదల చేసింది. ‘స్టేషన్లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి....’ అని రవితేజ చెప్పే డైలాగ్ సీన్‌ను ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు, మాస్ ఎలిమెంట్స్‌తో కనిపించిన టీజర్‌కు చక్కని స్పందన వచ్చిందన్నారు నిర్మాత. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, సుధాకర్ కొమాకుల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
అవి నాకు సూపర్ స్పెషల్
‘‘నిన్ను నిన్నులా ఉంచే నీలోని ప్రతి విషయం ప్రత్యేకమైనదే’’ అని అంటున్నారు శ్రుతీహాసన్. సెల్ఫ్‌లవ్ (మనల్ని మనం ఇష్టపడటం) గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘మనం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం స్వీకరించుకోవాలి. నా కళ్లను గమనిస్తే నల్లని మచ్చలు కనబడతాయి. అవును.. నా కళ్లలో పుట్టుమచ్చలు ఉన్నాయి. దానికి నేనేం బాధపడటంలేదు. ఇది జబ్బు కూడా కాదు. ఆ మచ్చలు నా కళ్లలో ఎప్పటినుంచో ఉన్నాయి. అవి నాకు సూపర్ స్పెషల్. మనల్ని మనలా గుర్తించే ప్రతి అంశం మనకు గొప్పదే’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. అలాగే తన కంటిలో ఉన్న పుట్టుమచ్చలు కనిపించేలా ఓ ఫొటోను షేర్ చేశారామె. ఇక సినిమాల విషయానికి వస్తే... తెలుగులో రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’, తమిళంలో విజయ్‌సేతుపతి నటిస్తున్న ‘లాభం’ చిత్రాల్లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
పవన్‌తో సినిమా.. శృతి క్లారిటీ
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. పింక్ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘మగువా మగువా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. రెండేళ్ల తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇస్తుండటం, ఫస్ట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ‘వకీల్ సాబ్’ అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం అంజలి, నివేదా థామస్‌లను చిత్ర బృందం ఇప్పటికే ఎంపిక చేసింది. అయితే మరో కీలక పాత్రలో శృతిహాసన్ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో అనేక వార్తల వస్తున్నాయి. అయితే ఇటీవలే తన సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. ప్రస్తుతం తను తెలుగులో క్రాక్ చిత్రంలో మాత్రమే నటిస్తున్నాని, ఏ రీమేక్ చిత్రంలో నటించడం లేదని పేర్కొంది. అంతేకాకుండా తనను ఎవరూ కూడా సంప్రదించలేదని తేల్చిచెప్పడంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది. గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రంలో పవన్, శృతిహాసన్‌ల కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ‘వకీల్ సాబ్’ కోసం దర్శకనిర్మాతలు ఈ ముద్దుగుమ్మను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: తమన్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్‌పై వర్మ ట్వీట్ -
‘కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’
మాస్ మహారాజ రవితేజ, బ్యూటీ శృతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బి. మధు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోబోతుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ ఫోస్టర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూవీ టీజర్‌ను చిత్ర బృందం విడుదలచేసింది. ‘ఒంగోలులో రాత్రి 8గంటలకు కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’అంటూ మొదలైన టీజర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకుంది. అంతేకాకుండా మధ్యలో శృతిహాసన్‌తో రవితేజ లవ్ సీన్లు హైలైట్‌గా నిలిచాయి. ‘ఒరేయ్ అప్పిగా సుప్పిగా నువ్వెడైతేనాకేంట్రా నా డొప్పిగా’అంటూ రవితేజ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. పోలీస్ గెటప్‌లో రవితేజ ‘విక్రమార్కుడు’ను గుర్తుచేస్తున్నాడు. అన్ని వర్గాలను ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను ఈ టీజర్ తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే రెండు మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ‘డాన్ శీను, బలుపు’ తర్వాత వస్తున్న మూడో చిత్రం ‘క్రాక్’ భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. మే8న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘శ్రుతి’ పెంచిన ప్రచారం
పెరంబూరు: నటుడు కమల్‌హాసన్ మక్కళ్‌నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తన అభ్యర్థును గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. రాజకీయాల్లోకి తన వారసులెవరూ రారని ముందుగానే ప్రకటించారు. ఇటీవల తన తండ్రిని చూస్తుంటే తనకూ రాజకీయాలపై ఆసక్తి కలుగుతోందని ఆయన కూతురు, ప్రముఖ కథానాయకి శ్రుతిహాసన్ ఒక భేటీలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టం చేసిన శ్రుతి.. ఇప్పుడు తండ్రి రాజకీయ జీవితానికి ఏదో విధంగా తోడ్పడాలని భావించినట్లున్నారు. ట్విట్టర్ ద్వారా తన తండ్రికి మద్దతుగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నటి శ్రుతిహాసన్ శుక్రవారం రాత్రి ట్విట్టర్లో పేర్కొంటూ నాన్నను చూసి గర్వపడుతున్నాను. భావితరాన్ని మెరుగుపరచడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా ఉత్తమమైనవన్నారు. ఆయన చర్యల్లో అది స్పష్టంగా తెలుస్తోందన్నారు. నాన్న పార్టీ అభ్యర్థులందరూ టార్చలైట్ గుర్తు ద్వారా వెలుగులోకి వస్తున్నారన్నారు. వారందరూ ఖచ్చితంగా విజయం సాధిస్తారని శ్రుతి పేర్కొన్నారు. అదే విధంగా ఆమె అభిమానుల భావాలను శ్రుతి ట్విట్టర్లో పేర్కొంటూ తండ్రికి ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఈ సంచలన నటినీ రాజకీయనాయకురాలిగా చూడవచ్చునేమో! -
లక్ కరెక్ట్ కాదు
సౌత్ కథానాయికలు ఎవరైనా బాలీవుడ్లో సత్తా చాటాలని ఆశపడుతుంటారు. ఆల్రెడీ జయప్రద, శ్రీదేవి, రేఖ వంటి ప్రముఖ కథానాయికలు దక్షిణాది నుంచి వెళ్లి అక్కడ హీరోయిన్లుగా అగ్రస్థాయికి ఎదిగారు. అయితే బాలీవుడ్ చాన్స్ అందరికీ వెంటనే రాదు. కానీ కమల్‌హాసన్ పెద్ద కుమార్తె శ్రుతీహాసన్ సినీ ప్రస్థానం ‘లక్’ (2009) అనే హిందీ చిత్రంతోనే ఆరంభం అయ్యింది. కానీ ఆమె అక్కడ పెద్ద ఫేమస్ కాలేదు. ‘లక్’ చిత్రం సరిగ్గా ఆడకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆ సినిమాని శ్రుతి గుర్తు చేసుకుంటూ– ‘‘అప్పటికి సినిమాల గురించి నాకు పూర్తి అవగాహన లేదు. కథానాయికగా నటించడానికి సిద్ధంగా లేను. అకస్మాత్తుగా సంగీత ప్రపంచం నుంచి వచ్చి హీరోయిన్గా కెమెరా ముందుకు వచ్చాను. ‘లక్’ చిత్ర ప్రయాణంలో సినిమా అంటే ఏంటో నాకు అర్థం అయ్యింది. ఓ సినిమా వెనక ఉండే కష్టం, విలువ నాకు తెలిసొచ్చాయి. ‘లక్’కు మేము ఊహించిన స్పందన రాలేదు. సినిమా సక్సెస్ కావొచ్చు. ఫెయిల్ కావొచ్చు. నేను తీసుకున్న నిర్ణయం అది. వేరే వారిని కారణంగా చెప్పలేను. కానీ ఆ తర్వాత ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదనిపించింది. ఆ అనుభవాన్ని మాత్రం ఓ పాఠంలా అనుకుని కెరీర్లో ముందుకు వెళుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు శ్రుతీహాసన్. ప్రస్తుతం శ్రుతి బాలీవుడ్లో మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విద్యుత్ జమాల్ ఇందులో హీరో. -
తమన్నాకు తాళి కడతా!
హెడ్డింగ్ చదివి ఈ మాట అన్నది తమన్నా అంటే బాగా ఇష్టపడే అబ్బాయి అనుకునేరు. అయితే ఈ మాట అన్నది కథానాయిక శ్రుతీహాసన్. అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా! ఏం లేదండీ. ఇటీవల ఓ చాట్ షోలో శ్రుతి పాల్గొన్నారు. ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఎవర్ని డేట్‌కు తీసుకెళ్లేవారు? అన్న ప్రశ్నను శ్రుతీహాసన్ ముందు ఉంచితే... ‘‘నేను అబ్బాయిని అయితే తమన్నాను డేట్‌కు తీసుకెళ్లేదాన్ని. ఆమెను పెళ్లి చేసుకునేదాన్ని’’ అని చెప్పారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్సలేతో శ్రుతీహాసన్ లవ్‌లో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలను కుంటున్నారనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయం గురించి శ్రుతీహాసన్ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. ‘మైఖేల్ నా లైఫ్‌లో చాలా స్పెషల్ పర్సన్’ అని మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు. -
అప్పుడే జీవితానికో అర్థం!
‘‘ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి’’ అంటున్నారు శ్రుతీహాసన్. ఈ విషయం గురించి వివరంగా మాట్లాడుతూ– ‘‘మన అమ్మానాన్నలను, తోడబుట్టినవాళ్లను, స్నేహితులను, జీవిత భాగస్వామిని.. ఇలా లైఫ్‌టైమ్‌లో చాలామందిని ప్రేమిస్తాం. మరి మనల్ని మనం ప్రేమిస్తున్నామా? అని ఎవరైనా ఒక్కక్షణం ఆలోచించాలి. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే ఓకే. లేకపోతే ఈ క్షణం నుంచి మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. మీ తొలి ప్రాధాన్యత మీరే అవ్వాలి. ఆ తర్వాతే వేరే ఎవరైనా. వాళ్లేదో అనుకుంటారు.. వీళ్లేదో అనుకుంటారని ఆలోచించొద్దు. ఎవరేం అనుకున్నా ఫర్వాలేదు. మీకు నచ్చినట్లుగా మీరు ఉండండి. అప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది. ఇతరుల కోసం బతికితే మన జీవితం మనది కానట్లే’’ అన్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తున్న శ్రుతి ఇటీవల తమిళంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. -
కొంచెం వ్యత్యాసంగా తల్లికి రాఖీ కట్టింది..
తమిళసినిమా: దాని గురించి పట్టించుకోను అంటోంది నటి శ్రుతీహాసన్. తనకు నచ్చింది, మనసుకు అనిపించింది చేసుకుపోయే నటి శ్రుతీహాసన్. కమలహాసన్, సారికల నటవారసత్వాన్ని అనుకోకుండానే భుజాల మీద మోస్తున్న శ్రుతీహాసన్ క్రేజీ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ముంబైలో ఉంటే తల్లి సారికతో, చెన్నైలో ఉంటే తండ్రి కమలహాసన్‌తోనూ తన అనుబంధాన్ని పంచుకునే శ్రుతీహాసన్ ప్రియుడిని కలవాలంటే లండన్‌కు వెళ్లొస్తుంటుంది. అలా సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన ఈ బ్యూటీ తనకు తాను తీసుకున్న చిన్న గ్యాప్ తరువాత తాజాగా ఒక హింది చిత్రంలో నటిస్తోంది. ఇక పోతే రక్షాబంధన్ పండుగ అంటే అన్నాచెల్లెల్ల అనుబంధానికి చిహ్నం. ఆదివారం ఈ వేడుకను అందరూ సంతోషంగా జరుపుకున్నారు. నటి శ్రుతీహాసన్ కూడా రాఖీ పండుగను జరుపుకుంది. అదేమిటీ శ్రుతీహాసన్‌కు సోదరులు లేరు కదా! అనే సందేహం కలుగుతోందా? యువతులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీసులు అందుకుంటే నటి శ్రుతీహాసన్ కొంచెం వ్యత్యాసంగా తన తల్లికి రాఖీ కట్టి ఆశీసులు అందుకుంది. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆ సందర్భంగా శ్రుతీహాసన్ పేర్కొంటూ అమ్మ సారికతో కలిసి నటించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మేమిద్ద రం కలిసి ఒక చిత్ర నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాం. నాన్నతో కలిసి ఇప్పటికే పని చేశాను. అయితే అమ్మతో కలిసి నటించాలని ఆశగా ఉంది. అమ్మా,నాన్నలు నటనలో ప్రతి భావంతులు కావడంతో నేను నటిగా ప్రతిభను చాటుకోవాలన్న ఒత్తిడి లేదు. ఇది నా జీవితం. అమ్మా నాన్న నాలుగేళ్ల వయసు నుంచే నటిస్తున్నారు. వారితో నేను పోటీ పడలేను. నా తల్లిదండ్రులతో నన్ను పోల్చుకుంటారన్న విషయం తెలుసు. అదంతా నేను పట్టించుకోను. అయితే నేను అమ్మానాన్నలు గర్వించేలా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా ను. అందుకు నా కఠిన శ్రమ చూసి వారు కచ్చి తంగా గర్వపడతారు. నాకూ అదే ముఖ్యం. సినీ పరిశ్రమ చాలా సహనాన్ని నేర్పుతుం ది. మరో విషయం ఏమిటంటే నేను కావా లని కోరుకుని నటిని కాలేదు. ఆ విధంగా నేను అదృష్టవంతురాలిని. -
తాను స్వయంగా రాసిన ఓ కవితను..
టీ.నగర్: మినిమం గ్యారెంటీ గాయనిగా చిత్ర సీమలోకి ఎంట్రీ అయిన బ్యూటీ శ్రుతిహాసన్. ఆ వెంటనే తండ్రి కమల్‌హాసన్ నటించిన ఉన్నైపోల్ ఒరువన్ చిత్రంలో సంగీత దర్శకురాలిగా అవతారమెత్తి సత్తా చాటుకుంది. అంతలోనే అందాల ఆరబోతకు అవకాశాలు రావడంతో నటనపై దృష్టి సారించింది. ఈ అమ్మడు తమిళం, తెలుగు, హింది భాషాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. దీంతో శ్రుతి సంగీతానికి తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ప్రస్తుతం శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్న శ్రుతి, హిందీలో మహేష్ మంజ్రేకర్ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతి కొన్ని సూపర్‌హిట్ పాటలను ఆలపించి ఆహుతులను మైమరపించింది. ఆ సమయంలో అమ్మడు మాట్లాడుతూ తాను మళ్లీ సంగీతం వైపు చూపు మరలించనున్నట్టు తెలిపింది. ఎక్కువ పాటలను పాడడమే కాదు, పాటల రచనపై కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెపింది. అదే సమయంలో తాను స్వయంగా రాసిన ఓ కవితను కూడా వినిపించింది. తన కవితలను ఇప్పటి వరకూ ఎవరికీ చూపలేదు, ఎక్కడా చదవలేదని తెలిపింది. చాలా కవితలనే రాశానని శ్రుతి వెల్లడించింది. -
సెల్ఫ్‌చెక్ చేసుకో అన్నారు
మనలో చాలామందికి నిద్రపోయే ముందు ఆ రోజు చేసిన పనులన్నింటినీ నెమరేసుకునే అలవాటు ఉంటుంది. ఆ రోజు ఎదైనా తప్పు చేసినా, ఎవరినైనా బాధపెట్టినా లేదా మనకు నచ్చని పని ఏదైనా చేసినా ప్రశాంతంగా నిద్రపోలేం. హీరోయిన్ శ్రుతీహాసన్‌కి కూడా ఇదే అలవాటు ఉందట. నిద్రకు ఉపక్రమించే ముందు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ తను చేసిన పనులను ఒక్కసారి గుర్తు చేసుకుంటారట. అలా గుర్తు చేసుకోవడమే కాదు ఆరోజు తను ఏదైనా పనిని అయిష్టంగా చేస్తే, అకారణంగా ఎవరినైనా బాధపెడితే జీవితంలో మళ్లీ అలా చేయరట. ఈ అలవాటు ఎక్కడ నుంచి వచ్చింది? అని అడిగితే.. ‘‘ఇదంతా మా నాన్నగారే నేర్పారు. ‘ఏ రోజైనా నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేకపోతే ఆ రోజు నువ్వు ఏదో చేయకూడని పని చేసి ఉంటావ్. జీవితంలో ఆ పని మళ్లీ చేయొద్దు’ అనే సూత్రాన్ని చెప్పి, ‘ఎప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోవద్దు’ అన్నారు. అంతే.. నాన్నగారి మాటను ఆరోజు నుంచి ఇప్పటికీ ఓ జీవన సూత్రంలాగా పాటిస్తున్నా. ప్రతిరోజూ సెల్ఫ్‌చెక్ చేసుకుంటే వ్యక్తిగా మనం రోజు రోజుకీ బెటర్ అవుతామని నా నమ్మకం’’ అన్నారు శ్రుతీహాసన్. -
శ్రుతి రహస్య వివాహం..?
సాక్షి , సినిమా: నటుడు కమలహాసన్ వారసురాలు, నటి శ్రుతీహాసన్ తాజాగా మరోసారి వార్తల్లో కెక్కారు. శ్రుతికి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్న సంగతి తెలిసిందే. లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సెల్‌తో శ్రుతీహాసన్ చాలా కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు ప్రచారం హోరెత్తుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ముంబైలో శ్రుతి తన బాయ్‌ఫ్రెండ్‌ను తల్లి సారికకు పరిచయం చేశారు. వీరు ముగ్గురు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా శ్రుతీహాసన్, తన బాయ్ ఫ్రెండ్‌ను రహస్య వివాహం చేసుకున్నట్లు వైరల్ అవుతోంది. శ్రుతి పట్టుచీరతో ఆమె బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ పట్టుపంచె, చొక్కాలతో దర్శనమిచ్చిన ఫోటోలు.. ఈ జంట రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ప్రచారానికి దోహదమయ్యాయి. విశేషం ఏమి టంటే ఈ ఫొటోలో నటుడు కమలహాసన్ కూడా పట్టు వస్త్రాల్లో ఉన్నారు. దీంతో నిజంగానే శ్రుతి పెళ్లి జరిగిపోయ్యిందనే ప్రచారం జరుగుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే బుధవారం దివంగత ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్ మనవడు ఆదవ్ వివాహం జరిగింది. ఈ వివాహాంలో నటుడు కమలహాసన్, కూతురు శ్రుతిహాసన్, ఆమె బాయ్‌ఫ్రెండ్ మైఖేల్‌లు పట్టు వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. -
నటనతోపాటు మరో రెండు కోణాలు..
హీరోయిన్ శ్రుతిహాసన్ కొత్త అవసరం ఎత్తనుందా ? ఈ ప్రశ్నకు సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అపజయాలతో నట జీవితాన్ని ప్రారంభించిన ఈ నటి ఆ తరువాత తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మలుచుకుంది. టాలీవుడ్ చిత్రం గబ్బర్‌సింగ్‌తో బంపర్ హిట్నుతన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత శ్రీమంతుడు సినిమాతోపాటు తమిళంలో పూజై, సింగం-3 వంటి చిత్రాలతో హిట్ చిత్రాల నాయకి లిస్టులో చేరింది. అలా సంఘమిత్ర వంటి చారిత్రత్మాక చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్న శుత్రిహాసన్ లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. అయితే అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలిగి వివాదాల్లో ఇరుక్కుంది. అదే సమయంలో తన తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. కారణాలేమైనా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించిన శ్రుతకి ప్రస్తుతం ఏ ఒక్క భాషలోనూ ఒక్క చిత్రం కూడా లేదు. ఆమెలో నటన అనే కోణం కాకుండా సంగీతం, గాయని అనే మరో రెండు కోణాలున్న విషయం తెలిసిందే. ఈ రెండు రంగాల్లో మొదట్లోనే ప్రతిభను నిరూపించుకుంది. దీంతో ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు లేకపోవడంతో సంగీతం, సింగర్‌గా తన సత్తాను మరోసారి అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచార. అవును శ్రుతిహాసన్ ఇప్పుడు కొత్త పోకడలకు శ్రీకారం చుట్టాలని భావిస్తోందట. ఇప్పుడు చాలామంది పాశ్చాత్య సంగీతంతో ఆల్బమ్‌లను రూపొందించి చేతినిండా సంపాదిస్తున్నారు. శ్రుతిహాసన్ కూడా ఈ బాటలో రాణించాలకుంటోందట. పాశ్చాత్య సంగీతంతో పాటను రూపొందించి అందులో తానే నటించి దేశవిదేశాల వేదికలపై కార్యక్రమాలను నిర్వహించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. అలా శ్రుతి పాప్ సింగర్ అవతారమెత్తబోతోందట. -
నా చిన్ననాటి కోరిక: హీరోయిన్
చెన్నై: సంచలన హీరోయిన్ శ్రుతిహాసన్ అనూహ్యంగా అమృతసర్‌లోని గోల్డెన్‌టెంపుల్‌లో ప్రత్యక్షమయ్యారు. శ్రుతి సంఘమిత్ర చిత్రాన్ని అనవసరంగా వదులుకుంది. ఆమె తండ్రి కమలహాసన్‌తో కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం చేతిలో సినిమాలే లేవు అనే ప్రచారాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. నిజానికి శ్రుతి ఖాళీగా కూర్చోలేదు. చేతిలో టిగ్మంషూదులియాస్ యాత్ర అనే చిత్రంతో పాటు ఇతర వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉంది. తను నటిస్తున్న హిందీ చిత్రం అక్టోబరు నెలలో తెరపైకి రానుంది. ఒక బ్రాండ్ ప్రచారంలో భాగంగా ఇటీవల చంఢీగఢ్ వెళ్లిన భామ ఆ పని పూర్తి చేసుకుని సమీపంలోని అమృతసర్‌కు వెళ్లి అక్కడి గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకున్నారు. గోల్డెన్ టెంపుల్ లో రాత్రి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రుతి ప్రచారంలో తన అనుభవాలను పంచుకుంటూ.. గోట్డెన్టెంపుల్ను దర్శంచుకోవాలన్నది తన చిన్న నాటి నుంచి ఉన్న కోరిక అంది. ఆ మధ్య ఒక చిత్ర ప్రచారం కోసం అమృతసర్ వచ్చినప్పుడు ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకున్న, అయితే చివరి క్షణంలో ప్రణాళిక మారిపోవడంతో అది నెరవేర లేదని ఈ భామ తెలిపింది. అయితే ఈ సారి మాత్రం అలాంటి అవకాశాన్ని వదులు కోదలచుకోలేదని పేర్కొంది. స్వర్ణదేవాలయాన్ని సందర్శించడం చాలా గొప్ప అనుభూతి అని తెలిపింది. అక్కడి వాతావరణం, ఎంతో ఎనర్జీని, ప్రశాంతతను అందించిందని శ్రుతిహాసన్ పేర్కొన్నట్లు ఆమె ప్రతినిధి ఒకరు తెలిపారు. -
హీరోయిన్‌పై కుష్బూ విమర్శలు...
హీరోయిన్ శ్రుతీహాసన్పై కాంగ్రెస్ మహిళా నేత, సీనియర్ నటి కుష్భూ విమర్శల దాడి చేశారు. దర్శకుడు సుందర్.సీ నటి కుష్భూ భర్త అన్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ తాజాగా సంఘమిత్ర అనే భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరక్కించడానికి రెడీ అయ్యారు. జయం రవి, ఆర్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించాడానికి మొదట అంగీకరించిన సంగతి అందరికీ తెలుసు. ఈ సినిమా లోగోనూ కూడా ఫ్రాన్స్‌లో జరిగిన కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించిన సంగతి విదితమే.ఈ వేడుకలో సంఘమిత్ర యూనిట్‌తో పాటు నటి శ్రుతి పాల్గొన్నారు. అనంతరం సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు అనూహ్యంగా ప్రకటించిన శ్రుతిహాసన్ కొన్ని ఆరోపణలు కూడా చేసి సంచలనం సృష్టించారు. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఆలస్యంగానైనా స్పందిచారనుకోండి. ఆ సమస్య సద్దుమణిగిందకున్న తరుణంలో తాజాగా కుష్బూ తన ట్విట్టర్లో శ్రుతిని మర్మగర్భంగా విమర్శించటం టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. ఇంతకీ కుష్బూ ఏమన్నారో చూద్దాం.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జేట్ తో తెరకెక్కనున్న చిత్రం సంఘమిత్ర. అలాంటి చిత్రాన్ని సరైన ప్లానింగ్ లేకుండా ఎవరూ నిర్మించరు. అసలు స్కిప్టే లేదని కొందరు ఏవేమో సాకులు చెబుతున్నారు. నిజానికి సంఘమిత్ర చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు రెండేళ్లుగా జరుగుతున్నాయి. అందువల్ల వృత్తిపై అవగాహన లేని వారే అసత్యాలు చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి చిత్రాలకు షూటింగ్ అన్నది 30 శాతమే ఉంటుంది. మిగిలిన 70 శాతం ఫ్రీ ప్రొడక్షన్లోనే జరుగుతుంది. మీ లోపాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయడం సమస్య కాదు. వారసత్వంగా నటన వైపు వచ్చిన వాళ్ల వృత్తిలో పరిణితిని ఎదురు చూస్తారు. మీలోని తప్పులను గ్రహించి, లోపాలను సరిదిద్దుకున్నప్పుడే సుదీర్ఘ పయనం చేయగలరు. ఇది నటి ఇది నటి కుష్బూ ట్విట్టర్లో పేర్కొన్న సారాంశం. మరి ఆమె విమర్శలకు శ్రుతి ఎలా స్పందిస్తారో చూడాలి. -
కెమెరా వెనుక నిలబడనున్న నటి!
ఏమీటి ఆది అంతం లేకుండా ఈ స్టార్ట్–కట్–ఒన్మోర్–ఓకే–పేకప్ల గొడవవేమిటన్నదే మీ సందేహం. పైన పదాలన్నీ సినీ పరిశ్రమలోని వారికి సుపరిచిత పదాలే. ముఖ్యంగా అందాల భామ శ్రుతీహాసన్‌కు బాగా పరిచయం. ఎందుకంటే తన కుటుంబమే ఒక విజయవంతమైన సినిమా. శ్రుతి సినిమాలోనే పుట్టి పెరిగిన నటి. అమ్మ, నాన్న, చెల్లెలు,పెదనాన్న ఇలా అందరికీ సినిమానే జీవితం. కాగా సరిగమలతో తెరంగేట్రం చేసిన శ్రుతీహాసన్ ఆ తరువాత నటనతో, గానంతో సుపరిచితురా లయ్యారు. ఇలా భారతీయ సినిమాలోనే తనకుంటూ చెరగని ముద్ర వేసుకున్న శ్రుతీహాసన్ పులి కడుపున పులిబిడ్డ కాకండా పిల్లి పుడుతుందా అనే స్థాయికి ఎదిగిపోయారు. ఆమె తండ్రి కమలహాసన్ సకలకళావల్లభుడని ఇప్పుడు ప్రత్యేకంగా ఉదహరించాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన వారుసురాలి అడుగులు అదే బాటలో పడుతున్నాయా?అవుననే అనిపిస్తోంది. శ్రుతీహాసన్ నటిగా, సంగీతదర్శకురాలిగా, గాయనిగా నిరూపించుకున్నారు. ఇవన్నీ తెర ముందు తెర వెనుక శాఖలు.తాజాగా కెమెరా వెనుక నిలబడనున్నారనే వార్త బలంగా వినబడుతోంది. ఎస్.శ్రుతీహాసన్లో మంచి కథకురాలు కూడా ఉన్నారు. దాన్నిప్పుడు పదును పెట్టే పనిలో ఉన్నారట. అంతే కాదు మెగాఫోన్ పట్టి ఆ కథను తనే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ శుభవార్తను శ్రుతి త్వరలోనే చెప్పబోతున్నారట. అప్పటి వరకూ ఎదురు చూద్దామా‘మొత్తం మీద ఇప్పటి వరకూ ఇతర దర్శకులు స్టార్ట్ యాక్షన్ అనగానే నటిస్తున్న శ్రుతీహాసన్ త్వరలో తనే స్టార్ట్ యాక్షన్ కట్ చెప్పడానికి రెడీ అవుతున్నారన్న మాట. -
బాలీవుడ్ బ్యూటీ ఆమేనట
చెన్నై: బాలీవుడ్లో కత్రినాకైఫ్, ప్రియాంకచోప్రా, దీపికాపడుకొనే లాంటి ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అయితే వారందనీ వెనక్కునెట్టి బాలీవుడ్ బ్యూటీ క్రెడిట్‌ను మాత్రం శ్రుతీహాసన్ కొట్టేశారు. ఈమెకు అందాలరాశి పట్టం కట్టింది ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు, నటుడు కేఆర్కే(కమాల్ ఆర్ ఖాన్). సినిమాలను సీన్ బై సీన్ తన విమర్శలతో చీల్చి చండాడే ఈయన సాధారణంగా ఎవరినీ ప్రశంసించరట. అలాంటిది తనకు నచ్చిన బాలీవుడ్ హీరోయిన్ శ్రుతీహాసన్ అనీ, ఆమె చాలా అందగత్తె అనీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే శ్రుతిలో చిన్న లోపాన్ని కూడా కేఆర్కే వెల్లడించారు. ఆమెకు మంచి చిత్రాలను ఎంపిక చేసుకోవడం తెలియడం లేదని అన్నారు. ఆయన శ్రుతీహాసన్‌ను బాలీవుడ్ బ్యూటీగా పేర్కొనడం అక్కడి ప్రముఖులను సైతం విస్మయానికి గురి చేసిందట. ఇక కేఆర్కే ట్వీట్‌కు అభిమానులు బాగానే రియాక్ట్ అవుతున్నారు. ఒక అభిమాని స్పందిస్తూ.. ‘శ్రుతీహాసన్ బాలీవుడ్ బ్యూటీ అనడాన్ని ఆహ్వానిస్తున్నా, అయితే ఆమెకు మంచి చిత్రాలను ఎంచుకోవడం తెలియదనడాన్ని అంగీకరించబోమ’ని అన్నారు. ఈ నెల 9వ తేదీన విడుదల కానున్న బీహెటీ(బెహాన్ హోగి తేరి) చిత్రం చూసిన తరువాత కేఆర్కే కచ్చితంగా తన అభిప్రాయాన్ని మార్చుకుంటారని అన్నాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ అన్న విషయాన్ని చాలా మంది అభిమానులు అంగీకరిస్తున్నారు. మొత్తం మీద ఈ అందగత్తె ఇటీవల సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగి పతాక శీర్షికల్లో నిలిచారు. -
శ్రుతి డబుల్ హ్యాట్రిక్
ఇవాళ ఒక్క హిట్టే గగనంగా మారుతుంటే, హిట్ తరువాత హిట్ సాధించడం అన్నది సాధారణ విషయం కాదు.అలా హ్యాట్రిక్ సొంతం చేసుకోవడం విశేషం అవుతుంది. ఇక నటి శ్రుతీహాసన్ విషయానికొస్తే ఈ బ్యూటీ విజయపరంపర కొనసాగుతోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ నాయకిగా రాణిస్తున్న శ్రుతి ఒక్క తెలుగు భాషలోనే వరుసగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరోయిన్గా రికార్డు సాధించారు. ఇటీవల ప్రేమమ్, సింగం–3, ఇటీవల విడుదలైన కాటమరాయుడు చిత్రాలతో రెండవ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నారు. గ్లామర్‌తో పాటు ఫెర్ఫార్మెన్స్ నటిగా పేరు తెచ్చుకుంటున్న శ్రుతీహాసన్‌కు తెలుగులో తొలి విజయాన్ని పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించిన గబ్బర్‌సింగ్ చిత్రంతో అందుకున్నారు. ఆ తరువాత ఈ అమ్మడికి కేరీర్ పరంగా వెనుక తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. రెండవ సారి పవన్‌కల్యాణ్‌తో నటించిన కాటమరాయుడు చిత్రం శుక్రవారం విడుదలై విశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతోందని శ్రుతీ వర్గాలు పేర్కొన్నారు. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు లభిస్తున్నాయని, శ్రుతీహసన్ 2017 సాధించిన రెండవ విజయం ఇదని పేర్కొన్నారు. శ్రుతీహాసన్ బహుభాషా నటి కావడంతో దక్షిణాదిలో నటించిన చిత్రాలు హిందీలోనూ మంచి వసూళ్లను రాబడుతున్నాయని, అదే విధంగా హిందీ చిత్రాలు దక్షిణాదిలోనే సక్సెస్ అవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే సౌత్ బాక్సాఫీస్ హీరోయిన్గా ఎదిగిన శ్రుతీ తదుపరి సంఘమిత్ర అనే భారీ త్రిభాషా చిత్రంలో నటించనున్నారని తెలిపారు. సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయంరవి, ఆర్య కథానాయకులుగా నటించడానికి రెడీ అవుతున్నారన్నది గమనార్హం. ఈ చిత్రం తన కేరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని శ్రుతీహాసన్ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. -
అది క్షమించరాని నేరం!
భారత దేశంలో స్త్రీలకు రక్షణ కరువైందా? ఇందుకు అవుననే సమాధానమే వస్తోంది మహిళా లోకం నుంచి. ఈ ఆధునిక యుగంలో స్త్రీలు మగవారికి ఎందులోనూ తీసిపోనంతగా రాణిస్తున్నారు. అయినా కొందరు మానవ మృగాలు స్త్రీని ఒక ఆట వస్తువుగానే చూస్తున్నారు. వారి అఘాయిత్యాలకు మహిళలు బలైపోతూనే ఉన్నారు. అన్ని రకాలుగా బలపడిన స్త్రీలు కూడా ఒక్కోసారి మగవాడి పైశాచికత్వం నుంచి బయట పడలేకపోతున్నారు. ఇందుకు నటి భావన ఉదంతమే ఒక నిదర్శనం. ఆమెకు జరిగిన అఘాయిత్యాన్ని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఖండిస్తున్నారు.అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని గళమెత్తున్నారు.చాలా మంది నటీమణులు భావనకు అండగా నిలుస్తున్నారు.నటి వరలక్ష్మీశరత్‌కుమార్, స్నేహ, సంధ్య ఇలా పలువురు భావనపై అత్యాచారయత్నాన్ని తీవ్రంగా ఖండించారు.తాజాగా నటి శ్రుతీహాసన్ స్పందిస్తూ విదేశాల్లో మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. భారతదేశంలో మాత్రం ఇంకా అభద్రతాభావంతో గడుపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు మానవ రక్షణ కరవైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.నటి భావనపై లైంగికయత్నం క్షమించరాని నేరంగా పేర్కొన్నారు.అలాంటి అఘాయిత్యాయలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.అప్పుడు ఇలాంటి ఘటనలకు అడ్డుకట్టపడుతుందని మంగళవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి శ్రుతీహాసన్ అన్నారు. -
కొత్త ఏడాదే... సింహగర్జన
సింహం ఎప్పుడు గర్జిస్తుంది? అనే ఉత్కంఠకు తెర పడింది. సింహం థియేటర్లలోకి వచ్చేది కొత్త ఏడాదిలోనే అని చిత్ర బృందం ప్రకటించింది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సింగం–3’. ‘సింగం’ సిరీస్‌లో వస్తోన్న ఈ మూడో సినిమాను తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని ఈ నెల 16న విడుదల చేయాలను కున్నారు. వారం ముందు రామ్‌చరణ్ ‘ధృవ’ రిలీజవుతోందని ఈ నెల 23కి ‘సింగం–3’ విడుదల తేదీ మార్చారు. అయితే... 23న కూడా సినిమా విడుదల లేదని 15వ తేదీనే సూర్య స్పష్టం చేశారు. మా చేతుల్లో లేని పలు కారణాలే వాయిదాకు కారణమని పేర్కొన్నారు. తమిళనాడులో జయ లలిత మరణం తదనంతర పరిస్థితుల వల్లే సినిమా వాయిదా పడిందని వార్తలొచ్చాయి. కారణాలు ఏవైనా... ఇప్పుడు వచ్చే జనవరి 26న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ స్వరకర్త. -
గాసిప్స్‌కు బాధపడను
గాసిప్స్‌కు బాధపడనని అంటున్నారు నటి శ్రుతిహాసన్. టాప్ కథానాయకిగా వెలుగొందుతున్న ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు, హిందీ అంటూ రౌండ్ చుట్టేస్తున్నారు. చాలా బోల్డ్ నటిగా భావించేవారిలో శ్రుతిహాసన్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఆదిలో విజయం ఆమడదూరం అనిపించినా ఆ తరువాత సక్సెస్‌కు చిరునామాగా మారారు. తాజాగా తెలుగులో నటించిన ప్రేమమ్ చిత్రంలో టీచర్ పాత్ర శ్రుతికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా శ్రుతి ఒక భేటీలో పేర్కొంటూ ప్రేమమ్ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం విడుదలకు ముందు ఈ పాత్రను తాను పోషించడం గురించి సోషల్ మీడియాలో చాలా విమర్శలు ప్రసారం అయ్యాయన్నారు. అలాంటి వాటిని పని పాటా లేని వాళ్లు ప్రసారం చేసి ఉంటారని భావించానన్నారు. ఏదేమైనా అలాంటి ప్రచారం గురించి తాను పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కథ, అందులోని తన పాత్రపై తనకు నమ్మకం ఉందన్నారు. ఆ పాత్రకు ఎలా జీవం పోయాలన్న విషయంపై శ్రద్ధ చూపానని చెప్పారు. చిత్రం విడుదల అనంతరం తన పాత్ర పోషణకు ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు. తాను కమలహాసన్ కూతురినని, ఆయనలానే తాను చాలా స్ట్రాంగ్ అని పేర్కొన్నారు. విమర్శలు, సత్యదూర ప్రచారాలు తనను ఎలాంటి బాధింపునకు గురి చేయవని దృఢంగా అన్నారు. అదే విధంగా తన గురించి గాసిప్స్ ప్రసారం అవుతున్నాయనీ,అలాంటి వాటికి అస్సలు వర్రీ అవ్వనని అన్నారు. ప్రస్తుతం తాను తెలుగు,తమిళం,హిందీ అంటూ అధిక చిత్రాలలో నటిస్తున్నాననీ తెలిపారు.నటీనటులకు భాషాభేదం ఉండదన్నారు. భాషకు అతీతమైంది ఒక్క సినిమారంగమేనని పేర్కొన్నారు. తాను తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకాదరణను పొందానని, బాలీవుడ్‌లోనూ ప్రత్యేక స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నానని అన్నారు. అందుకు శాయ శక్తులా పోరాడుతున్నానని, ఆ ఆశను నెరవేర్చుకుంటాననే విశ్వాసాన్ని శ్రుతిహాసన్ వ్యక్తం చేశారు. -
రణబీర్‌కపూర్ ప్రేమలో శ్రుతి పడిందా..?
బాలీవుడ్ యువ నటుడు రణబీర్‌కపూర్, నటి శ్రుతిహసన్ ప్రేమలో పడ్డారనే ప్రచారం మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో రణబీర్ కపూర్ చాలా చరిత్రనే ఉంది. ఈ సంచలన నటుడు నటి కత్రినాకైఫ్ డీప్‌గా ప్రేమించుకున్నారు. ఎంతగా అంటే ఇద్దరూ కలిసి కొన్నాళ్లు సహజీవనం సాగించేంతగా. రణబీర్‌కపూర్, కత్రినాకైఫ్‌ల ప్రేమ పెళ్లికి దారి తీస్తుందనే అనుకున్నారంతా. అయితే ఇటీవలే వారిద్దరూ విడిపోయారు. అయితే వీరు విడిపోవడానికి నటి దీపికాపదుకోనే కారణం అనే ప్రచారం జరిగింది. అంతకు ముందు రణబీర్‌కపూర్, దీపికల మధ్య ప్రేమకు ముసలం పుట్టడానికి కారణం కత్రినాకైఫేనని, అందుకు దీపకాపదుకోనే ప్రతీకారం తీర్చుకున్నారని బాలీవుడ్లో ప్రచారం జోరుగా జరిగింది. ఇలాంటి పరిస్థితిలో నటుడు రణబీర్‌కపూర్ కొత్త లవర్ వేటలో ఉన్నారని, అది నటి శ్రుతిహాసన్‌తో నెరవేరిందని తాజాగా ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించి సంచలన చర్చకు దారి తీసింది. శ్రుతిహసన్ బహుభాషా నటి అన్న విషయం తెలిసిందే. తమిళం,తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ నాయకిగా రాణిస్తున్నారు. ఇటీవల రణబీర్‌కపూర్,నటి శ్రుతిహసన్ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు. ఈ ప్రకటనలో వారి జంట బాగుందనే ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ యాడ్‌లో వర్కౌట్ అయిన రణబీర్‌కపూర్, శ్రుతిల కెమిస్ట్రీ వారి మధ్య ప్రేమకు దారి తీసిందనే వదంతులు దొర్లుతుండడం గమనార్హం. ఏ విషయాన్నైనా నిర్భయంగా చెప్పే శ్రుతిహాసన్ ఇప్పుడు రణబీర్‌కపూర్‌తో తనను కలుపుతూ జరుగుతున్న ప్రచారం గురించి ఎలా స్పందిస్తారో చూడాలి. -
రాయుడు షూటింగ్ షురూ
‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తర్వాత తమ హీరో కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు స్వీట్ న్యూస్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’ షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్‌లో ప్రారంభమైంది. దాంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కిషోర్ కుమార్ పార్దసాని (డాలీ) దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్ మరార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ‘గబ్బర్‌సింగ్’లో పవన్ కల్యాణ్ సరసన నటించిన శ్రుతీహాసన్ రెండోసారి ఈ చిత్రంలో జోడీ కడుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పదిహేను రోజుల పాటు తొలి షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్. -
నా పేరుని మా నాన్న మరచిపోయారు!
కన్న కూతురి పేరుని తండ్రి మరచిపోతే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకే ‘నా పేరుని మా నాన్న మరచిపోయారు’ అని శ్రుతీహాసన్ అంటే, ఎవరైనా ఆశ్చర్యపోతారు. కమల్‌హాసన్ ముద్దుల కూతురు శ్రుతి ప్రస్తుతం తన తండ్రికి రీల్ డాటర్‌గా ‘శభాష్ నాయుడు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కమల్ రెండో కూతురు అక్షరాహాసన్ సహాయ దర్శకురాలిగా చేస్తున్నారు. తండ్రి, చెల్లితో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు శ్రుతి. ఈ చిత్ర షూటింగ్ స్పాట్లో కొన్నాళ్ళ క్రితం జరిగిన గమ్మత్తై విషయాన్ని శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘కమల్ నాకు నాన్న మాత్రమే కాదు.. ఈ చిత్రదర్శకుడు, కో-స్టార్ కూడా. భలే గమ్మత్తుగా ఉంది. ఒక సీన్లో ఆయన నన్ను పేరు పెట్టి పిలవాలి. కానీ, ఈ సినిమాలో నా పాత్ర పేరుతో కాకుండా నా రియల్ నేమ్‌తో పిలిచారు. అప్పుడు నేను ‘రాంగ్ నేమ్ అయినా.. థ్యాంక్యూ’ అన్నాను. ఈ సినిమా నాకో స్వీట్ మెమరీ అవుతుంది’’ అనినవ్వుతూ అన్నారు. ఈ చిత్రం కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమితో శ్రుతీకి మనఃస్పర్థలు వచ్చాయనే వార్త రావడం, అలాంటిదేమీ లేదని శ్రుతి స్పష్టం చేయడం తెలిసిందే. కమల్‌కి గౌతమి అత్యంత సన్నిహితురాలనీ, ఇద్దరూ కలసి ఉంటారనీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గౌతమితో మనఃస్పర్థలు నెలకొన్నాయనే వార్త వచ్చిన తర్వాత మీరు ఆమెతో మాట్లాడారా? అని శ్రుతీని ఓ ఆంగ్ల పత్రిక అడిగితే - ‘‘మా నాన్న కాంబినేషన్లో చేస్తున్న ‘శభాష్ నాయుడు’ షూటింగ్‌కి చిన్న బ్రేక్ వచ్చింది. నేను నా మిగతా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. మా నాన్ననీ, చెల్లెల్నీ కలవడానికి కూడా తీరిక లేదు. అయితే ఒక్కటి మాత్రం చెబుతాను. ఈ ప్రపంచంలో నాకు ముఖ్యమైన వ్యక్తుల్లో మా నాన్నగారు ఒకరు. ఆయనకు ముఖ్యమైన వ్యక్తి(గౌతమి)ని నేను కచ్చితంగా గౌరవిస్తా’’ అన్నారు. -
చైతూ మనసుకి దగ్గరైంది!
నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రేమమ్’. శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సెప్టెంబర్ 20న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్రం పాటలను విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు విజయదశమి కానుకగా అక్టోబర్‌లో విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. నాగచైతన్య మాట్లాడుతూ - ‘‘నా మనసుకు బాగా దగ్గరైన ప్రేమకథా చిత్రమిది. లవ్ అండ్ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. మలయాళ సినిమా రీమేక్ అయినా దర్శకుడు చందు మొండేటి తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కొద్దిగా మార్పులు చేసి, తెరకెక్కించారు’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇటీవల విడుదలైన ‘ఎవరే..’ పాటకు మంచి స్పందన లభించింది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆ పాట వీడియోను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ఈశ్వరీరావు, బ్రహ్మాజీ, జీవా, చైతన్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గోపీసుందర్, రాజేశ్ మురుగేశన్. -
ఫేవరెట్ కార్నర్.. అదే ప్రమాదానికి కారణం
అది చెన్నైలోని ఆళ్వార్‌పేట. అక్కడ కమల్‌హాసన్ ఆఫీస్ ఉంది. ఇంట్లో, ఆఫీసులో ప్రతి గదికీ కార్నర్స్ ఉన్నట్లే ఆ ఆఫీసులో కూడా ఉన్నాయి. ఒక్కే ఒక్క కార్నర్ మాత్రం కమల్‌కి చాలా ఇష్టం. 18 అడుగుల ఎత్తులో ఉన్న ఒక గది కార్నర్ అది. ఆ మూల నిలబడితే రోడ్డు కనిపిస్తుంది. అక్కడ నిలబడి రోడ్డుపై వచ్చే పోయే జనాలను చూస్తూ, ఒకవేళ అది కాకపోతే ఏదో ఆలోచిస్తూ టైమ్‌పాస్ చేస్తుంటారు కమల్. ఆ రోజు కూడా అలానే నిలబడ్డారు. ఎప్పుడూ తీపి అనుభవాలనే మిగిల్చిన ఆ కార్నర్ ఈసారి మాత్రం కమల్‌కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆయన ఎక్కడైతే నిలబడ్డారో ఆ ప్రదేశం హఠాత్తుగా కుంగిపోయింది. దాంతో కమల్ 18 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. అంత ఎత్తు నుంచి పడటంతో దెబ్బలు తగిలి విపరీతంగా రక్తం పోయిందట. ‘‘లక్కీగా పక్కన మనుషులు ఉండటంవల్ల ఆస్పత్రిలో చేర్చారు. లేకపోతే చనిపోయి ఉండేవాణ్ణి’’ అని కమల్ పేర్కొన్నారు. ఆ మధ్య ఆయన జారిపడిన విషయం, కాలికి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. కమల్ మెట్ల మీద నుంచి జారిపడ్డారని చాలామంది అనుకున్నారు. కానీ, ఈ ప్రమాదానికి కారణం ఆయనకు నచ్చిన ఆ కార్నర్. ఈ విషయాన్ని స్వయంగా కమలే తెలిపారు. మరో నెలలోపు ఆయన ‘శభాష్ నాయుడు’ షూటింగ్లో పాల్గొంటారనే వార్త వచ్చింది. దానికి కమల్ స్పందిస్తూ - ‘‘నెల రోజుల్లోనా? చాన్సే లేదు. సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నా. కనీసం రెండు నెలలైనా పడుతుంది. ఆ తర్వాతే షూటింగ్’’ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ రియల్ డాటర్ శ్రుతీహాసన్ ఆయనకు రీల్ డాటర్‌గా నటిస్తున్నారు. -
శ్రుతి మొదటి బాయ్‌ఫ్రెండ్ ఎవరు?
సాధారణంగా కథానాయికలు తమ బాయ్ఫ్రెండ్ల గురించి చెప్పరు. అలాంటిది తొలిబాయ్ఫ్రెండ్ ఎవరంటే ఆగ్రహంగో ఊగిపోతారు. అలాంటిది నటి శ్రుతిహాసన్ రూటేవేరు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. సహ నటీమణులతో సహజంగా మెలుగుతారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషానటిగా వెలుగొందుతున్న నటి శ్రుతి. ఈమె బాయ్‌ఫ్రెండ్స్ అంటూ సినీ వర్గాలు చాలా మందితో కలిపి వదంతులు ప్రచారం చేశారు. వారిలో నటుడు సిద్ధార్థ్ పేరు కూడా చోటు చేసుకుంది. అయితే అలాంటి ప్రచారం గురించి శ్రుతిహాసన్ అస్సలు పట్టించుకోరు. అసలు పెళ్లే చేసుకోను అని ధైర్యంగా చెప్పిన నటి శ్రుతి. ఎలాంటి ప్రశ్నలకైనా తడుముకోకుండా బదులిచ్చి అడిగిన వాళ్లను ఔరా అనిపించగల చాతుర్యం ఈ బ్యూటీకి ఉంది. గ్లామర్ గురించి అభిప్రాయం చెప్పమన్న వాళ్లతో అసలు గ్లామరంటే అర్థం ఏమిటని ప్రశ్నించిన నటి శ్రుతి. అలాగే మీ తొలి బాయ్‌ఫ్రెండ్ ఎవరన్న ప్రశ్నకు ఏ మాత్రం సంకోచించకుండా తను ఒక సంగీత దర్శకుడని తెలిపారు. ఆయన మంచి ప్రతిభావంతుడని, మర్యాదస్తుడని అన్నారు. సాధారణంగా హీరోయిన్లు తమ బాయ్‌ఫ్రెండ్స్ గురించి బహిరంగంగా చెప్పరని,తాను మాత్రం ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలినన్నారు. తానేమిటో తెలిసిన వారు తన గురించి తప్పుగా భావించరని అన్నారు. ఇంతకీ తన తొలి బాయ్‌ఫ్రెండ్ ఒక సంగీతదర్శకుడని చెప్పారేగానీ ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు శ్రుతి. ప్రస్తుతం ఈ బ్యూటీ తన తండ్రితో కలిసి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్నారు.సూర్య సరసన నటిస్తున్న ఎస్-3 చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అదే విధంగా తెలుగులో నాగచైతన్యకు జంటగా ప్రేమమ్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో మరో సారి పవన్‌కల్యాణ్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
అతను అలాగే ఉండాలి!
ఈ తరం కథానాయికల్లో శ్రుతీహాసన్‌ది కాస్త విభిన్నమైన శైలి. కమల్‌హాసన్ నటవారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రుతి నటిగానే కాకుండా గాయనిగా, స్వరకర్తగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా జీవించాలనేది ఆమె సిద్ధాంతం. ఇప్పుడే కాదు..చిన్నతనం నుండి నేనింతే అంటున్నారామె. ‘‘చిన్నతనం నుండి నేను స్వతంత్రంగానే ఉంటూ వచ్చాను. చివరికి హోమ్‌వర్క్‌లు కూడా నేను చేయాల్సిందే. పాపం మా అమ్మ సాయం చేద్దామనుకంటే నేను మాత్రం అసలు ముట్టుకోనిచ్చేదాన్ని కాదు. అందుకే ఇప్పటికీ నేను వేరే చోట ఉండటానికే ఇష్టపడతాను. నాకు కుటుంబమంటే ఇష్టమే కానీ నా స్పేస్ నాకు కావాలి. రాత్రి నిద్రపోవాలి... ఉదయాన్నే నిద్రలేవాలి అదీ ఒంటరిగానే’’ అని చెప్పారు. మరి పెళ్లి చేసుకునే ఆలోచనా ఉందా? అని అడిగితే- ‘‘నాక్కాబోయే వాడు చాలా టాలెంటెడ్ అయి ఉండాలి. కానీ, అతను ఎలాంటి విజయాలు సాధించినా, ఎంత పనిచేసినా రాత్రి ఇంటికి వ చ్చేసరికి నన్ను బాగా చూసుకోవాలి. నా మీద ఆ అలసటను, ఒత్తిడిని చూపించకూడదు. అలా ఉండటం ఎవరికైనా కష్టమే. కానీ, అలాంటి వాణ్ణే పెళ్లి చేసుకుంటా’’ అని చెప్పారు. మరి శ్రుతి జీవితానికి లయ జత కలిపేది ఎవరో? -
నేనూ... మా ఆయన!
‘దేవుడా.. శ్రుతీహాసన్‌కి పెళ్లయ్యిందా? ఏం పాపం చేశామని ఇప్పుడే పెళ్లి చేసేసుకుంది. ఇంకొన్నాళ్ల పాటు సినిమాలు చేస్తుందా? లేదా.. కొంపతీసి సినిమాలు మానేసే ఉద్దేశం ఏమీ లేదు కదా’ అని శ్రుతీహాసన్ అభిమానులు తెగ ఫీలైపోయారు. వీళ్లు ఇంతగా బాధపడిపోవడానికి కారణం, సరదాగా శ్రుతీహాసన్ తన ట్విట్టర్లో చేసిన ఓ ట్వీట్. ‘లంచ్ విత్ మై డియరెస్ట్ హజ్బెండ్’ అంటూ శ్రుతి ఓ ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో దుమారమే చెలరేగింది. అది చూసి, ఆమె అభిమానులందరూ చెలరేగిపోయారు. ‘మీకు పెళ్లయిందా...? అతను మీ భర్తా... ఇంతకన్నా హ్యాండ్సమ్ పర్సన్ మీకు భర్తగా వస్తాడు కదా... ఇంత తొందరపడ్డారేంటి?’ అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో శ్రుతీహాసన్ ‘‘నాకస్సలు పెళ్లి కాలేదు.. నిజం చెబుతున్నా... నన్ను నమ్మండి. సరదాగా చేసిన ట్వీట్ అది’’ అని పోస్ట్ పెట్టడంతో అభిమానులు శాంతించారు. -
వారసురాలితో నటించనున్న మరో హీరో
హీరోలు తమ వారసులతో కలిసి నటించడం అన్నది అరుదైన విషయమే అనాలి.అలా విశ్వనటుడు కమలహాసన్ తన వారసురాలు, నేటి క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్‌తో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరిని కలిపి చిత్రం చేయాలన్న ప్రయత్నాలు చాలా కాలంగాను జరుగుతున్నాయి. కమలహాసన్‌నే తన చిత్రంలో శ్రుతిని నటించమని ఇదివరకే అడిగారు.అయితే ఆమె కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ చిత్రంలో నటించలేనని చె ప్పారు. తాజాగా కమలహసన్, శ్రుతిహసన్‌లను వెడి తెరపైనా తండ్రీ కూతుళ్లుగా చూడబోతున్నాం.ఈ క్రేజీ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. నటుడు అర్జున్ కూడా తన వారసురాలితో నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. అర్జున్ కూతురు ఐశ్వర్య నటుడు విశాల్‌కు జంటగా పట్టత్తుయానై చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోవడం వల్లో లేక మరే కారణంతోనో ఐశ్వర్యకు ఆ తరువాత అవకాశాలు రాలేదు. అర్జున్ ప్రస్తుతం ఓరు మెల్లియ కోడు, నిపుణన్ చిత్రాల్లో నటిస్తున్నారు.తదుపరి తన స్వీయ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన వారసురాలు ఐశ్వర్య కూడా ముఖ్య పాత్రను పోషించనున్నారట.ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
షాపింగ్‌కి వెళితే అవి కొనకుండా ఉండలేను!
శ్రుతీహాసన్ ఫిజిక్ చాలా బాగుంటుంది. మోడ్రన్ దుస్తుల్లోనూ బాగుంటారు.. సంప్రదాయ దుస్తుల్లోనూ లవ్లీగా ఉంటారు. ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అందుకు అనుగుణంగా డ్రెస్సులు సెలక్ట్ చేసుకుంటారామె. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ - ‘‘నాకు తెలిసి బట్టలు, నగలు ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. నగల సంగతెలా ఉన్నా డ్రెస్సులంటే నాకు పిచ్చి. షాపింగ్ మాల్‌లోకి అడుగుపెట్టానంటే బట్టలు కొనకుండా ఉండలేను. జనరల్‌గా నాకు జీన్స్, టీ-షర్ట్ ఇష్టం. అవే సౌకర్యవంతంగా అనిపిస్తాయి. అయినప్పటికీ వేరే డ్రెస్సులు కూడా కొంటుంటాను. బట్టల పిచ్చి మాత్రమే కాదు.. నాకు పాదరక్షల పిచ్చి కూడా ఉంది. షాపింగ్‌కి వెళ్లినప్పుడు షూస్ కొనకుండా ఉండలేను. ఇప్పటివరకూ నా దగ్గర యాభై, అరవై షూస్ ఉన్నాయి. అన్నేం చేసుకుంటావని ఫ్రెండ్స్ అడుగుతుంటారు. నవ్వేసి ఊరుకుంటాను. సీజన్‌కి తగ్గట్టుగా, వేసుకున్న డ్రెస్‌కి మ్యాచింగ్‌గా షూలు వేసుకుంటాను’’ అని చెప్పారు. -
ఆ క్షణాలను గుర్తు చేసుకుని ఆనందపడిపోతా!
జీవితంలో ఎప్పుడు తల్చుకున్నా అప్పటికప్పుడు హాయిగా నవ్వుకుని, ఆనందపడదగ్గ సంఘటనలు బోల్డన్ని ఉంటాయి. ఇలాంటి తీపి గుర్తులు శ్రుతీహాసన్‌కు చాలా ఉన్నాయట. ఎప్పుడైనా అవి గుర్తొస్తే, పులకరించిపోతానని అంటున్నారామె. ఇంతకీ ఆ మధురమైన జ్ఞాపకాలు ఏంటంటే... చిన్నప్పుడు స్టేజి మీద తొలిసారి డ్యాన్స్ చేసిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని శ్రుతీహాసన్ చెబుతూ -‘‘అంత చిన్న వయసులోనే మనం ధైర్యంగా స్టేజి మీద పెర్ఫార్మ్ చేశాం కదా. ఇప్పుడెందుకు చేయలేం? అని పెద్దయ్యాక అనిపించింది. సో.. నా తొలి పెర్ఫార్మెన్స్ నాకు ఆనందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందనే చెప్పాలి. నా చెల్లెలు అక్షరకూ, నాకూ మధ్య దాదాపు నాలుగైదేళ్లు వయసు వ్యత్యాసం ఉంది. అక్షర పుట్టినప్పుడు నాకు భలే ఆనందం అనిపించింది. ఆ డేట్‌ని ఎప్పుడు తల్చుకున్నా బుల్లి చేతులు, కాళ్లు, వేళ్లు గుర్తొస్తాయి. ‘హీరోయిన్గా ఎంటర్ అవుదాం. ఇక జీవితాంతం ఆర్టిస్ట్‌గా కొనసాగుదాం’ అని నిర్ణయించుకున్న క్షణాలు నాకెప్పటికీ తీపి గుర్తుగా మిగిలిపోతాయి. ఖాళీ సమయాల్లో రాసుకున్న చిన్ని చిన్ని కవితల్లో కొన్ని గుర్తొస్తుంటాయి. ఎక్కడైనా రుచికరమైన తినుబండారాలు లాగిస్తుంటాను కదా. ఆ టేస్ట్ గుర్తొచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఒకే టేక్‌లో ఓకే అయిపోతాయ్. వాటిలో మనసుకి హత్తుకున్న సీన్స్ అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. ఇలా నేను తల్చుకుని ఆనందపడటానికి బోల్డన్ని సంఘటనలు ఉన్నాయి’’ అన్నారు. -
శివకార్తికేయన్‌తో శ్రుతీహాసన్
ఈ మధ్య కోలీవుడ్‌లో యువ కథానాయకుల పంట పండుతోందనే చెప్పాలి. ఇంతకు ముందు ప్రముఖ కథానాయికలు యువ కథానాయకులతో నటించడానికి తటపటాయించే వాళ్లు. ఎక్కడ వారి ఇమేజ్ డామేజ్ అవుతుందోనని ఒకింత భయపడేవాళ్లు కూడా. అలాంటిది ఇప్పటి టాప్ నాయికలు నయనతార, హన్సిక, త్రిష, శ్రుతీహసన్ లాంటి వారు కుర్ర హీరోలతో నటించడానికి సై అనడంతో వాళ్లు యమ ఖుషీలో తేలిపోతున్నారనే చెప్పాలి. ఆ మధ్య వర్ధమాన నటుడు ఆరితో మాయ చిత్రం, ఇటీవల నానుమ్ రౌడీదాన్ చిత్రంలో విజయ్‌వసంత్‌తో నటించడానికి స్టార్ నాయకి నయనతార ఏ మాత్రం వెనుకాడలేదు. అదే విధంగా హన్సిక శివకార్తికేయన్‌తో మాన్‌కరాటే చిత్రంలో నటించి ఆ చిత్రానికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇక మరో సంచలన నటి త్రిష నాయకి చిత్రంలో గణేశ్వెంకట్రామన్తో నటిస్తోంది. తాజాగా శివకార్తికేయన్ సరసన క్రేజీ బ్యూటీ శ్రుతీహసన్ నటించడానికి పచ్చజెండా ఊపడం విశేషం. వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంటున్న శివకార్తికేయన్ నటించిన రజనీమురుగన్ విడుదలలో కొన్ని చిక్కులను ఎదుర్కొన్నా ప్రస్తుతం అవి తొలగి త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఆయన తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పీసీ.శ్రీరామ్ ఛాయాగ్రహణ అందిస్తున్న ఇందులో శ్రుతీహాసన్ నటించే ప్రయత్నాలు జరిగాయి. దర్శకుడు కథ చెప్పగానే నచ్చేయడంతో శ్రుతీ హాసన్ వెంటనే నటించడానికి పచ్చజెండా ఊపినట్లు స మాచారం. కాగా ఈ బోల్డ్ అండ్ బ్యూటీ మరో పక్క సూర్య సరసన సింగం-3లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. -
అతని చెంప చెళ్లుమనిపించాను
చెన్నై : క్షణ క్షణంబుల్ మారున్ జవరాళ్ల చిత్తంబుల్ అన్న జాతీయాన్ని నటి శ్రుతీహాసన్ జ్ఞప్తికి తెస్తున్నారు. ఇంతకు ముందు వరకూ తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. పెళ్లి చేసుకుని తీరాలన్నది రూలా? అనే విధంగా మాట్లాడిన నటి. ఇప్పుడు మనసు సడన్‌గా పెళ్లి పైకి మళ్లింది. పెళ్లి చేసుకోవాలి, ఆదర్శ తల్లినవ్వాలి అంటున్నారు. ఈ ముద్దుగుమ్మలో ఇంత మార్పుకు కారణాలేమిటబ్బా? అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆరాలు తీయడం మొదలెట్టాయి. ఆ మధ్య టాలీవుడ్ చిత్రం శ్రీమంతుడు ఘన విజయాన్ని,తాజాగా కోలీవుడ్ చిత్రం వేదాళం సంచలన విజయాన్ని ఎంజాయ్ చేస్తూ పుల్ జోష్‌లో ఉన్నారు శ్రుతి. ఇక అసలు విషయం ఏమిటంటే ఇలా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్న సంచలన తార శ్రుతీహాసన్ ఇటీవల సీనియర్ నటి కుష్బూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ చానల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన గురించి ప్రచారం అవుతున్న వదంతులు, ప్రేమ, వ్యక్తిగత అంశాల గురించి చూద్దాం. నేనెవరికీ ప్రపోజల్ చేయలేదు ‘ఇప్పటి వరకూ నాకు ఎవరూ లవ్ ప్రపోజ్ చేయలేదు. అందువల్ల నేనూ ఎవరికీ పెళ్లి ప్రపోజల్ చేయలేదు. ఒక సారి స్నేహితుడొకరు ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమను ప్రపోజ్ చేశాడు. ఊహించని ఆ పరిణామానికి కాస్త చలించిన మాట నిజం. తక్షణమే తేరుకుని అతని చెంప చెళ్లుమనిపించాను. ఇక కోస్టార్స్‌తో చెట్టాపట్టాల్ లాంటి నిరాధార వదంతులకు స్పందిండం బోర్ అనిపిస్తోంది. కుటుంబం గురించి మాట్లాడాలంటే ముందుగా మా అమ్మ గురించే చెప్పాలి. ఆమె కూతుర్ని కావడం గర్వంగా ఉంది. గత 20 ఏళ్ల క్రితమే పర్జానియా చిత్రంలో నటనకుగాను జాతీయ అవార్డును అందుకున్న నటి మా అమ్మ. అలాగే నాన్న కమలహాసన్, చెల్లెలు అక్షరలతో కలిసి నటించాలన్న కోరిక బలంగా ఉంది. అక్షరను నేనెప్పుడూ పోటీగా భావించను. తను నా చెల్లెలు. నా కళ్ల ఎదుట పెరిగింది. సినిమాలో ఎవరి స్థానం వారికి ఉంటుంది. వ్యక్తిగతం గురించి చెప్పాలంటే నాకిప్పుడు వెంటనే పెళ్లి చేసుకోవాలని, ఆదర్శ తల్లినవ్వాలని కోరిక’ అంటూ చెప్పుకొచ్చింది. -
మూడో లైలా కోసం మజ్నూ వేట
-
ప్రేమ చేసే మాయలో..!
‘ఏ మాయ చేసావె’ సినిమాతో లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించుకున్న నాగచైతన్య మళ్లీ ఓ ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. మలయాళ సినీ పరిశ్రమనే కాకుండా మొత్తం దక్షిణాదినే షేక్ చేసిన చిత్రం ‘ప్రేమమ్’. ఓ యువకుని జీవితంలో జరిగే అందమైన ప్రేమకథలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ఇప్పుడు నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ కానుంది. ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో చైతూ సరసన శ్రుతీహాసన్, అనుపమ కథానాయికలుగా నటించనున్నారు. ఇంకో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర వంశీ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘ ‘ప్రేమమ్’ ఓ స్వచ్ఛమైన ప్రేమకథ. అందరి హృదయాలను హత్తుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మాతృకను మించి హిట్ అయ్యేలా చందూ మొండేటి స్క్రిప్ట్‌ను బాగా తయారు చేశాడు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేశ్ మురుగేశన్, గోపీ సుందర్, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
శ్రుతిహాసన్ దయాగుణం
చెన్నై : ఎక్కడైనా బావ అనుగాని వంగ తోట కాడ కాదు అన్న సామెత మన నటీమణులకు వర్తిస్తుందని చెప్పవచ్చు. చిత్రం జయాపజయాలతో మాకేంటి పని. మేము నటించాం. ముందుగా ఒప్పందం ప్రకారం తమ పారితోషికం చెల్సించాల్సిందే అని వసూలు చేస్తుంటారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన నటి శ్రీదేవి వృత్తాంతమే. ఆమె చాలా కాలం తరువాత తమిళంలో విజయ్ కథానాయకుడుగా నటించిన పులి చిత్రంలో ఒక ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే. శ్రుతిహాసన్, హన్సికలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదేవి ఆ చిత్ర హీరో విజయ్ను, నిర్మాతల్ని పొగడ్తల్లో ముంచెత్తారు. పులి చిత్రం విడుదల సమయంలో నిర్మాతల ఇళ్లల్లో ఐటీ దాడులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనుకున్న సమయంలో విడుదలవుతుందో, కాదో అన్నంత పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఎట్టకేలకు తెరపైకి వచ్చినా చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఆ చిత్ర కథానాయకుడు కోట్ల పారితోషికం త్యాగం చేశారన్నది గమనార్హం. ఇక నటి శ్రుతిహాసన్‌కు కూడా పులి చిత్రం విషయంలో తన దారాళ మనసును చాటుకున్నారన్న విషయం ఆలస్యంగా వెలుగులో కొచ్చింది. ఈ చిత్రం కోసం ఒప్పందం కుదుర్చుకున్న పారితోషికంలో సుమారు 20 లక్షలు శ్రుతికి బాకీ ఉందట. ఆ మొత్తాన్ని శ్రుతిహాసన్ వదులుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
గాసిప్స్ పట్టించుకోను
చెన్నై : గాసిప్స్‌ను కేర్ చేయను అంటున్నారు నటి శ్రుతిహాసన్. అలాగే ఒక భాషకు చెందిన నటిననిపించుకోవడానికి ఇష్టపడనంటున్న ఈ క్రేజీ హీరోయిన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీ అంటే అజిత్ చిత్ర యూనిట్ ఈ బ్యూటీ కోసం ఎదురు చూసేంత. అవును తమిళం, తెలుగు, హిందీ భాషలో నటిస్తున్న శ్రుతిహాసన్ కాల్షీట్స్ కోసం వేదాళం చిత్ర యూనిట్ ఎదురు చూస్తోందని సమాచారం. ఇలా మూడు భాషలు ఆరు చిత్రాలు అన్నట్లుగా పరుగులు తీస్తున్న శ్రుతి అసలు తను నటినవుతాననే ఊహించలేదట. కాకతాళీయంగా నటినయి సంగీతం, గానానికి దూరం అయ్యానంటున్నారు. దీనిగురించి శ్రుతిహాసన్ తెలుపుతూ చిన్న వయసు నుంచే సంగీతం, గానం అటే ఆసక్తి ఏర్పడందన్నారు. అలాంటిది ఇప్పుడు ఫుల్‌టైమ్ నటిగా మారడంతో ఆ రెండింటికీ దూరం కావలసి వస్తోందన్నారు. అక్కడికీ సందర్భం కుదిరినప్పుడల్లా పాడ డపై ఆసక్తి చూపుతున్నానని అన్నారు. ప్రస్తుతం అజిత్‌తో వేదాళం, సూర్య సరసన సింగం-3 చిత్రాల్లోనటిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా తెలుగు, హిందీ భాషల్లోనూ కొత్త చిత్రాలున్నాయని చెప్పారు. ఇలా అన్ని భాషల్లోనూ నటించాలని కోరుకుంటున్నానన్నారు. ఏ ఒక్క భాషలోనో నటించడం తనకిష్టం అని చెప్పనన్నారు. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ అంటూ విడి విడిగా చెప్పడం కూడా తనకు నచ్చదన్నారు. కారణం తాను ఇండియా వాసినని పేర్కొన్నారు.అందువల్ల అన్ని భాషా చిత్రాలను కలిపి భారతీయ సినిమా అనడాన్ని గర్వంగా భావిస్తానని అన్నారు. హాలీవుడ్, చైనా చిత్రాలనే తీసుకుంటే హాలీవుడ్ లేదా చైనీస్ చిత్రాలనే అంటారన్నారు.ఇక్కడ మనం మాత్రమే ఆ వుడ్ చిత్రం ఈ వుడ్ చిత్రం అంటున్నామని అన్నారు. తన చిత్రాల విషయంలో తన తండ్రి కమల హాసన్ సలహాలు తీసుకుంటారా? అని చాలా మంది అడుగుతుంటారని,నాన్న సూచనలు తీసుకోవడానికి వెళ్లినా ఆయన తననే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోమని చెబుతారని అన్నారు. తనపై చెల్లి అక్షరహాసన్ పై నాన్నకంత నమ్మకం అని పేర్కొన్నారు. నాన్నతో కలిసి నటిస్తారా? అని చాలా మంది అడుగుతున్నారని ఒకసారి అలాంటి అవకాశం వచ్చినా నటించలేకపోయానని అన్నారు. కారణం అప్పుడు తాను హిందీ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నానని వివరించారు. తనపై వదంతులూ బాగానే ప్రచారం అవుతున్నాయని అయితే వాటి గురించి పట్టించుకోనని అన్నారు.అసలు బాధ పడనని చెప్పారు. తమది పెద్ద సినిమా కుటుంబం. తనకు పనే ముఖ్యం అని అన్నారు. తానూ నాన్నంత పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు అదే తన లక్ష్యం అని శ్రుతిహాసన్ అన్నారు. -
అలా కాకుంటే ఎదిగేవాళ్లం కాదు
అలా కాకుంటే మేమిప్పుడిలా సొంత కాళ్ల మీద నిలబడేవాళ్లం కాదు అంటున్నారు నటి శ్రుతిహాసన్. మేటి కథానాయికల్లో ఈ బ్యూటీ ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రముఖ హీరోలందరూ తమకు జంటగా శ్రుతిహాసన్ నటిస్తే బాగుండుననుకునే స్థాయికి ఎదిగారీమె. కథల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తూ విజయాల బాటలో దూసుకుపోతున్న ఈ క్రేజీ భామ నటించిన పులి చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. అలాగే అజిత్ సరసన నటిస్తున్న వేదాళం చిత్రం దీపావళికి విడుదలకు ముస్తాబవుతోంది. ఇలా భారీ చిత్రాల్లో నటిస్తూ సూపర్ కమర్షియల్ హీరోయిన్గా ఎదుగుతున్న శ్రుతిహాసన్ తన మనసులోని మాటను వెల్లడించడానికి ఏ మాత్రం వెనుకాడరు. శ్రుతికి తన తండ్రి కమలహాసన్ అంటే ఎనలేని అభిమానం. దాన్ని మరోసారి తన మాటల్లో బహిరంగపరిచారు. ఆ ప్రేమాభిమానాలు తను ఎలా వ్యక్తం చేశారో చూద్దాం. ప్రపంచంలోనే ఉన్నతమైన తండ్రి మా నాన్న. పిల్లల్ని ఎలా పెంచాలో ఆయనకు బాగా తెలుసు. పిల్లల్ని స్వతంత్రంగా జీవించేలా చేసే ఆయన చర్యల్ని అందరూ గమనించాలి. నాన్న మాకలా స్వేచ్ఛనివ్వకపోతే ఇప్పుడిలా సొంత కాళ్ల మీద నిలబడేవాళ్లం కాదు. చిన్న తనం నుంచే నాన్న మాకు స్వతంత్రంగా జీవించే స్వేచ్ఛనిచ్చారు. తప్పుల నుంచి పాఠం నేర్చుకుంటారనేదే నాన్న భావన. ఆయన పెంపకంలో పెరిగిన నేనిప్పుడు ఏది తప్పో? ఏది ఒప్పో తెలుసుకోగలుగుతున్నాను. అందుకే నాన్న అంటే నాకు అంత ప్రేమ. చిన్నతనంలో ఒక సారి నాన్న నా వద్దకు వచ్చి ఒక భారీ బడ్జెట్ చిత్రం చెస్తున్నాను.అందుకు చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఉంటున్న ఈ పెద్ద ఇల్లు మారి చిన్నింట్లో జీవించాల్సిన పరిస్థితి కూడా కలగవచ్చు. నీకు సమ్మతమేనా?అని అడిగారు.నేనప్పుడు మాతో మీరు ఉంటే చాలు నాన్న అని అన్నాను.మా నాన్న చాలా నిజాయితీపరుడు.చిన్నతనంలో నాన్న అంటే ప్రేమ మాత్రమే ఉండేది. ఇప్పుడు గౌరవం పెరిగింది. -
అక్టోబర్ 1న పులి
పులిగా ఇళయదళపతి గాండ్రించడానికి సిద్ధం అవుతున్నారు. విజయ్ చిత్రాల్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో సిల్వర్ స్క్రీన్‌పై సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైంది చిత్రం పులి. ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.చిరకాలం తరువాత శ్రీదేవి తమిళంలో నటించిన చిత్రం పులి. అందాల భామలు హన్సిక, శ్రుతిహాసన్ నాయికలు కనువిందు చేయనున్న ఈ చిత్రంలో కన్నడు సూపర్‌స్టార్ సుదీప్ ప్రతినాయకుడిగా విజృంభించనున్నారు. శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సాంఘిక జానపద కథా చిత్రాన్ని ఎస్కేటీ ఫిలింస్ పతాకంపై పీటీ.సెల్వకుమార్, విబుతమీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్ర టీజర్,పోస్టర్, ఆడియో ఆవిష్కరణ అంటూ వరుసగా ప్రచారం చేసుకుంటూ వస్తున్న చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 17 నే పులిని తెరపైకి తీసుకురావాలని మొదట నిర్ణయించారు. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో అక్టోబర్ ఒకటవ తేదీకి విడుదలను మార్చుకున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తికావడంతో మంగళవారం సెన్సార్‌కు పంపినట్లు తెలిసింది. పులి ఆ బాలగోపాలాన్ని అలరించే విధంగా జనరంజికంగా రావడంతో యూ సర్టిఫికెట్ వస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉందట. -
అంత బాగా లేదు.. అందుకే ఒప్పుకోలేదు!
కథ చెప్పడం ఓ కళ. ఆ కళలో ఆరితేరినవాళ్లు ఎంత పేలవమైన కథను అయినా చాలా ఆసక్తికరంగా చెబుతారు. ఆ కథ వినగానే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు హీరో, హీరోయిన్లు. అలా కాకుండా కొంచెం కథ విని, పచ్చజెండా ఊపేసేవాళ్లూ ఉంటారు. ఇటీవల హిందీ దర్శకుడు మిలన్ లూథ్రియా చెప్పిన కొంచెం కథ విని, శ్రుతీహాసన్ నటించడానికి అంగీకరించారట. అజయ్ దేవగన్ హీరోగా ఆయన ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. కాగా, ఓసారి పూర్తి కథ వినండంటూ ఇటీవల శ్రుతికి ఆయన ఫైనల్ స్క్రిప్ట్‌ని వినిపించారట. ముందు విన్న కొంచెం కథలో తన పాత్ర ఉన్నంత బాగా ఫైనల్ స్క్రిప్ట్‌లో లేదని శ్రుతికి అనిపించిందని సమాచారం. దాంతో ఈ చిత్రంలో నటించాలనే ఆలోచనను విరమించుకున్నారని బాలీవుడ్ టాక్. -
గ్రామాన్ని దత్తత తీసుకుంటా
గ్రామాన్ని దత్తత తీసుకుంటానంటున్నారు నటి శ్రుతిహాసన్. ఇప్పుడీమె దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు.తమిళంలో విజయ్ సరసన నటించిన భారీ చిత్రం పులి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అజిత్‌కు జంటగా ఏఎం.రత్నం నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో మహేశ్‌బాబుతో నటించిన శ్రీమంతుడు చిత్రం ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింబడుతోంది. ఇది చిత్ర కథానాయకుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దీన దశలో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకునే ఇతివృత్తంతో తెరకెక్కిన కథా చిత్రం. కథానాయికి గ్రామీణాభివృద్ధికి పాటు పడే విద్యను చదువుతుంది. ఇది శ్రుతిహాసన్ పోషించిన పాత్ర. కాగా శ్రుతిహాసన్ తన ట్విట్టర్లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. గ్రామాన్ని దత్తత తీసుకునే ఇతి వృత్తంతో కూడిన శ్రీమంతుడు చిత్రంలో నటించారు. నిజ జీవితంలో గ్రామాన్ని దత్తత తీసుకుంటారా? అన్న అభిమాని ప్రశ్నకు తప్పకుండా.అలాంటి ఆలోచన నాకు ఉంది అని బదులిచ్చారు. దృఢమైన వ్యక్తిత్వాన్ని, అంకితభావాన్ని నా తండ్రి కమలహాసన్ నుంచి నేర్చుకున్నాను. ఇంకా చాలా నేర్చుకుంటున్నాను. తన వంతు సేవ ప్రజలకు చేస్తాను. అలాగే నటిగా బిజీగా ఉన్నా సంగీతంపై ఇష్టంతో త్వరలో ఒక మ్యూజికల్ ఆల్బమ్ చెయ్యాలనుకుంటున్నాను. నాకు నచ్చిన విహార ప్రాంతం లాస్ ఏంజిల్స్. ఇష్టమైన వంటకం సాంబారు అన్నం. ఇక తన చెల్లెలు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తను అందరికీ నచ్చే అమ్మాయి. -
ఆ ముగ్గురిలో మణిరత్నం నాయిక ఎవరు?
దర్శకుడు మణిరత్నం చిత్రాల్లో కథానాయకులతో పాటు కథానాయికలకూ ప్రాముఖ్యత ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాటి మౌనరాగం నుంచి తాజా చిత్రం ఓ కాదల్ కణ్మణి వరకూ ఈ విషయం స్పష్టమవుతుంది. ప్రేమ కథలైనా,యాక్షన్ చిత్రాలైనా,సెంటిమెంట్‌ను పండించడంలోనయినా మణిరత్నం తనకు తానే సాటి. ఆయన దర్శకత్వశైలి ప్రత్యేకం. ఆ మధ్య ఒకటి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో మణిరత్నం పని అయిపోయింది. చిత్రాలు చేయడం మానుకోవడం మంచిది అన్నవాళ్లు లేకపోలేదు. తాజా చిత్రం ఓ కాదల్ కణ్మణి చూసిన తరువాత ఇలాంటి ప్రేమకథా చిత్రాలు చేయడంలో మణిదిట్ట అన్న నోళ్లు ఎన్నో. ఇప్పటికీ మణిరత్నం చిత్రం అంటే పరిశ్రమలోనూ,ప్రజల్లోనూ ఆ క్రేజే వేరు. అలాంటి తాజా చిత్రానికి దర్శకమణి సిద్ధం అయ్యారు. మరోసారి మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు సెలైంట్‌గా చేస్తున్నారు. ఇప్పటికే కథానాయకులుగా కార్తీ, దుల్కర్ సల్మాన్ ఓకే అయినట్లు సమాచారం. కథానాయికల విషయమే పెద్ద మర్మంగా మారింది. మణిరత్నం చిత్రంలో నటించడానికి పూర్వ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నుంచి యువతార కీర్తీసురేష్ వరకూ సై అంటున్నారు. నిజానికి ఐశ్వర్యారాయ్ రీఎంట్రీ మణిరత్నం చిత్రంతోనే జరగాల్సింది. ఆమె ఆశించింది అదే. అయితే అనివార్యకారణాల వల్ల మణిరత్నం చేయాల్సిన చిత్రం వాయిదా పడడంతో ఐశ్వర్యారాయ్ హిందీ చిత్రం ద్వారా పున ఃప్రవేశం చేస్తున్నారు. మణిరత్నం తాజా చిత్రంలో ఐశ్వర్య ముఖ్య పాత్ర పోషిస్తునట్లు ప్రచారం జరిగింది. ఇందులో నటించడానికి ఆమె ఆసక్తిగా ఉన్నా కాల్షీట్స్ సర్దుబాటు కావడం లేదని సమాచారం. ఈ విషయం అటుంచితే ఈ మల్టీస్టారర్ చిత్రంలో హీరోయిన్గా క్రేజీ నటి శ్రుతిహాసన్ నటించనున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తరువాత సంచలన నటి నయనతార పేరు ప్రచారంలోకొచ్చింది. వాళ్లిద్దరూ కాకుండా ఇప్పుడు వర్ధమాన నటి కీర్తీసురేష్ పేరు హల్చల్ చేస్తోంది. ఇప్పుడీ ముగ్గురిలో మణి నాయికి ఎవరన్నది? తేలాల్సి ఉంది. విశేషమేవిటంటే పై ముగ్గురూ మణిరత్నం చిత్రం నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక బాల్ మణి కోర్టులోనే ఉందంటున్నారు. అయితే యువ నటి కీర్తీసురేష్కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం కోలీవుడ్‌లో విడుదల కాలేదన్నది గమనార్హం. ఈ నెల 31న విక్రమ్‌ప్రభుతో నటించిన ఇదుఎన్న మాయం చిత్రం తెరపైకి రానుంది. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన నటించిన రజనీమురుగన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మరో రెండు మూడు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక త్వరలోనే మణిరత్నం వర్గం ఈ సస్పెన్స్‌కు తెరదించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి కోమాలి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. -
పులి కోసం పాట
శ్రుతీహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు పాడతారు, కవితలు రాస్తారు. అన్నింటికీ మించి ఆమె అద్భుతమైన నటి. సంగీతం మీద ఉన్న మక్కువతో తాను నటిస్తున్న సినిమాల్లోని పాటలు పాడుతుంటారు శ్రుతి. ఆ మధ్య ‘ఆగడు’లో ‘జంక్షన్లో.. జంక్షన్లో..’ పాట పాడారు. అలాగే, హిందీ చిత్రం ‘తేవర్’ కోసం రెండు పాటలు పాడారు. తాజాగా, విజయ్ సరసన కథానాయికగా నటిస్తున్న ‘పులి’ చిత్రం కోసం శ్రుతి ఓ పాట పాడారు. ఆమెతో కలిసి విజయ్ కూడా ఈ పాట పాడటం విశేషం. రెండేళ్ల క్రితం ‘తుపాకీ’ కోసం ఓ పాట పాడిన విజయ్, మళ్లీ పాడటం ఇప్పుడే. చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తాజా పాట రికార్డ్ అయ్యింది. -
నా జీవితంలో పెళ్లి లేదు
నా జీవితంలో పెళ్లి అనే పదానికి తావే లేదని నటి శ్రుతిహాసన్ ఖరాఖండిగా వెల్లడించారు. ఈమె విడిపోయిన ఇద్దరు నట ప్రముఖుల వారసురాలన్న విషయం తెలిసిందే. ఈ సంచలన నటి ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా అజిత్‌కు జంటగా కొత్త చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి సూర్యతో సింగం-3 చిత్రంలోనూ నటించనున్నారు. ఇలా వరుసగా ప్రముఖ హీరోలతో నటిస్తున్న శ్రుతిహాసన్ ఇటీవల ఒక పత్రికకు భేటీ ఇస్తూ తన తండ్రి కమలహాసన్‌తో కలసి నటించాలనే అభిలాషను వ్యక్తం చేశారు. అయితే అలాంటి అవకాశం ఇంతకుముందు రెండుసార్లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదామె. కారణం కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడమే నని వివరించారు. కాగా వివాహం ఎప్పుడన్న ప్రశ్నకు శ్రుతి బదులిస్తూ ఈ విషయమై ఇప్పటికే ఒకసారి బదులిచ్చానని అయినా మళ్లీ చెప్పడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని పెళ్ళి గురించి తానెప్పుడూ ఆలోచించలేదని స్పష్టం చేశారు. ఇష్టాలు, ఆశల్లో భేదాభిప్రాయాలు ఉన్న దంపతులు సంసార జీవితం ప్రశాంతంగా సాగదన్నారు. ఈ కారణం గానే విడిపోతుంటారని వ్యాఖ్యానించారు. అందుకే తాను వివాహమే చేసుకోరాదన్న నిర్ణయాన్ని తీసుకున్నానన్నారు. శ్రుతి నిర్ణయం విస్మయాన్ని కలిగించినా ఆమె పెరిగిన వాతావరణం శ్రుతిపై అలాంటి ప్రభావానికి కారణం అని భావించాల్సి ఉంటుంది. శృతి తల్లిదండ్రులు కమలహాసన్, సారిక విడివిడిగా జీవిస్తున్నారు. శృతి కూడా ముంబయిలో ఒంటరిగానే నివసిస్తున్నారు. తల్లిదండ్రులను కలవాలపించినప్పడు వెళ్లి చూసి వస్తున్నారు. తల్లిదండ్రులు విడిపోవడం అన్నది ఎంత బాధాకరమే శ్రుతి చెప్పక పోయి నా స్పష్టంగా తెలిసిపోతుంది. -
అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు
చెన్నై: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. 'రేసుగురం'లో ఉత్తమ నటనకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది. 'రేసుగుర్రం'లో నటించిన శృతి హాసన్ ఉత్తమ కథానాయిక అవార్డు అందుకుంది. 62వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల ప్రదానోత్సవం శనివారం చెన్నైలో జరిగింది. రేసుగుర్రం 3 పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ఎంపికైన 'మనం'కు 5 అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం: మనం ఉత్తమ దర్శకుడు: విక్రమ్ కే కుమార్(మనం) ఉత్తమ సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్(మనం) ఉత్తమ గేయరచయిత: చంద్రబోస్(మనం) ఉత్తమ ఛాయగ్రాహకుడు: పిఎస్ వినోద్(మనం ఉత్తమ నటుడు: అల్లు అర్జున్(రేసుగుర్రం) ఉత్తమ నటి: శృతి హాసన్(రేసుగుర్రం) ఉత్తమ నేపథ్య గాయకుడు: సింహా(రేసుగుర్రం) ఉత్తమ సహాయ నటుడు: జగపతిబాబు(లెజెండ్) ఉత్తమ సహాయనటి: మంచు లక్ష్మి(చందమామ కథలు) ఉత్తమ నేపథ్య గాయనీ: సునీత(ఊహలు గుసగుసలాడే) -
శృతిహాసన్ నటన నాకు నచ్చదు : కమల్
-
అన్నీ నాన్న దగ్గరే నేర్చుకున్నా!
ఇంటర్వ్యూ శ్రుతిహాసన్... పేరు వినగానే ఓ సినిమా కుటుంబం గుర్తుకు వస్తుంది. చారుహాసన్, సుహాసిని తండ్రీ కూతుళ్ల తరం కాస్త కనుమరుగు కాగానే ఆ కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుని కమల్‌హాసన్ కూతురు శ్రుతిహాసన్ అడుగుపెట్టింది. ఆ తండ్రి నుంచి ఈ కూతురు నేర్చుకున్న పాఠాలు, ఫార్ములాలు ఫాదర్స్ డే సందర్భంగా... ♦ చిన్నప్పుడు మీ నాన్నతో కలసి షూటింగ్స్‌కి వెళ్లేవారా? నేను చూసిన తొలి సినిమా షూటింగ్ నాన్నగారు చేసిన ‘విచిత్ర సోదరులు’. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లాను. ♦ షూటింగ్ సమయంలో నాన్నను చూసినప్పుడు ఏమనిపించేది? అమ్మో! నాన్న చాలా డేరింగ్ అనుకున్నాను. ఓ సినిమా కోసం ఆయన సింహాలు, పులులతో కలసి నటించారు. అది చూసి థ్రిల్ అయ్యా. ♦ కమల్‌హాసన్ కూతురు అనే ట్యాగ్‌ను ఎదుర్కోవడం ఎలా ఉంది? ఇందులో కొంత సౌకర్యం ఉంటుంది, కొంత కష్టమూ ఉంటుంది. ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆయన కూతురిననే అభిమానం నా మీద కూడా చూపిస్తారు. నేను నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా ఆయనను పోలిన కదలికల కోసం చూస్తుంటారు. అదేమీ ఇబ్బంది కాదు. అయితే నేను నటించడానికి సీన్లోకి ఎంటర్ కాక ముందే నా ఫెర్ఫార్మెన్స్ని నాన్నతో పోల్చి చూడడానికి సిద్ధమైపోతుంటారు. అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆయన యాభై ఏళ్లకు పైగా నటిస్తున్నారు. అంతటి నటుడితో నన్నే కాదు, మరెవరినీ పోల్చలేం. ♦ ‘కమల్ కూతురు’ అనే ఇమేజ్ నుంచి బయటపడటానికి చాలానే కష్టపడి ఉంటారు? అవునండీ. అదైతే నిజమే. నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి చాలానే కృషి చేశాను. ఇప్పుడు అందరూ నన్ను నన్నుగానే గుర్తిస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ♦ పాత్రలపరంగా ప్రయోగాలు చేసే కమల్ జీవితంలో చేసిన ప్రయోగాలు ఏమైనా? ‘విశ్వరూపం’ సినిమా తీయడమే పెద్ద ప్రయోగం. దాని కోసం ఆయన చాలా ఆందోళన చెందారు. ♦ ఆ ప్రయోగం అనవసరమని మీకెప్పుడైనా అనిపించిందా? మా ఇంట్లో అందరికీ సినిమా అత్యంత ప్రధానమైనది. సినిమాని ఉన్నత స్థాయిలో ఉంచి గౌరవిస్తాం. అందుకోసం ఏం చేయడానికైనా వెనకాడం. ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తుంటాం. ♦ ఆ సినిమా విడుదలలో అవరోధాలు ఎదురైతే కుటుంబం పరిస్థితి ఏంటని మీకు భయం వేయలేదా? ఏ మాత్రం లేదు. నాన్న ఆర్థిక స్థితిగతులు వేరు, నావి వేరు. నా ఖర్చులు నేనే పెట్టుకుంటాను. నాన్న డబ్బు మీద ఆధారపడి మా ఖర్చులు పెంచుకోలేదెప్పుడూ. అందుకే అలాంటి భయానికి తావే లేదు. ♦ మీ సంపాదనను నాన్నగారితో చర్చిస్తారా? ఆయనెప్పుడూ అడగరు. మొదటి సినిమా నుంచే సొంతంగా మనీ మేనేజ్ మెంట్ చూసుకుంటున్నాను. నాన్న చిన్నప్పుడే మాకు బాధ్యతగా ఉండడం నేర్పించారు. చేతిలో డబ్బు ఉంది కదా అని దుబారా చేయడం అలవాటు కాలేదు. ♦ మీ అమ్మానాన్నలు విడిపోయిన తర్వాత మీరు ఎవరి దగ్గర పెరిగారు? ఇద్దరి దగ్గరా పెరిగాను, ఇద్దరితో మంచి అటాచ్మెంట్ ఉంది. అయితే అమ్మ దగ్గర చనువెక్కువ. నాన్న నుంచి నేర్చుకున్నవే ఎక్కువ. ♦ కథ ఎంపికలో, వస్త్రధారణ గురించి పేరెంట్స్ సలహాలిస్తుంటారా? ఎవ్వరూ ఇవ్వరు. కథ ఎంపిక పూర్తిగా నాదే. ఇక దుస్తుల ఎంపిక అనేది కథను బట్టి దర్శకులు నిర్ణయిస్తారు. ♦ ఈ రంగంలో గాసిప్లను ఎదుర్కోవడంలో మీ నాన్న అండ ఉంటుందా? సినిమా ఇండస్ట్రీని మధించిన వ్యక్తి కాబట్టి నాన్నకు అన్నీ అర్థమవుతాయి. సెలబ్రిటీల గురించి ఏదో ఒక కథనం అలా ప్రచారమవుతూ ఉంటుంది. వాటన్నింటినీ పట్టించుకోవడం నా పని కాదు. నటించడమే నా పని... ఇదీ నాన్న నుంచి నేర్చుకున్న పాఠమే. ♦ మీకు - మీ నాన్నగారికీ పూర్తిగా వైవిధ్యం ఉన్న అంశం ఒకటి చెప్తారా? నేను దేవుణ్ని బాగా నమ్ముతాను. ఆయన నమ్మరు. ♦ మీకు దేవుణ్ని నమ్మడం, భక్తి అమ్మ నుంచి అలవాటైందా? అమ్మ (సారిక) ఆధ్యాత్మికతను ఇష్టపడుతుంది, దేవుణ్ని నమ్ముతుంది. కానీ గుడికి వెళ్లదు. నేను గుడికి కూడా వెళ్తాను. ♦ ‘మా నాన్న గ్రేట్’ అని మీరు ఆనందపడిన సందర్భం? ఈ మధ్య నేను సినిమాలతో చాలా బిజీగా గడిపేయడాన్ని గమనించారు నాన్న. ఇలాగే కొనసాగితే నాలోని రైటర్ కనుమరుగవుతుందనుకుని నన్ను ‘రాయడం మానవద్దని’ హెచ్చరించారు. స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్వేర్, రైటింగ్ కోర్స్ మెటీరియల్ బహుమతిగా ఇచ్చారు. నన్ను ఇండిపెండెంట్‌గా ఉండమని, నా గురించి ఏదీ పట్టించుకోనట్లు కనిపిస్తూనే, నన్ను ఓ కంట కనిపెట్టే ఉన్నారనిపించి చాలా సంతోషం కలిగింది. రియల్లీ గ్రేట్ ఫాదర్. -
సూర్యతో మరోసారి రొమాన్స్
సూర్యతో శ్రుతిహాసన్ మరోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. శ్రుతి కోలీవుడ్‌లో తన పయనాన్ని సూర్య తోనే మొదలెట్టారన్న సంగతి విదితమే. అయితే వీరి తొలి కలయికలో రూపొందిన 7 ఆమ్ అరివు అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఈ జంట మాస్ చిత్రంలో మరోసారి కలవాల్సి ఉన్నా చివరి నిమిషంలో అది మిస్ అయ్యింది. తాజాగా సింగం -3 చిత్రంలో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. సింగం, సింగం-2 చిత్రాలు విజయాన్ని సాధించిన నేపథ్యంలో సింగం -3ను తెరకెక్కించడానికి రంగం సిద్ధమైంది. సింగం సీక్వెల్‌ను తెరపై ఆవిష్కరించిన హరినే ఈ సింగం -3ని సెల్యులాయిడ్‌పై కెక్కించనున్నారు. సింగంలో అనుష్క హీరోయిన్. సింగం-2లో అనుష్కతో పాటు అదనంగా హన్సిక వచ్చి చేరారు. తాజాగా సింగం-2 అనుష్కతో శ్రుతిహాసన్ నటించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు హరి స్పష్టం చేశారు. తాజా వివరాలను ఆయన తెలుపుతూ సింగం -3లో సూర్య రెండు డైమన్షన్లలో కనిపిస్తాడన్నారు. సూర్య పోలీస్ పాత్రలో నటిస్తున్న ఐదవ చిత్రం ఇది. చిత్ర షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. తూత్తుకుడి, కారైకుడి ప్రాంతాల్లో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించి ఆ తరువాతే గోవా, ఫ్రాన్స్, ప్యారిస్‌లలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
లక్ష్మీమీనన్‌పై శ్రుతిహాసన్ ఫైర్
ఇద్దరు హీరోయిన్లు ఒక చిత్రంలో నటిస్తుంటే వారి మధ్య ఈగో సమస్య తలెత్తడం సహజం. అయితే ఇక్కడ నటి శ్రుతిహాసన్, లక్ష్మీమీనన్‌ల మధ్య మరో రకమైన విభేదాలు తలెత్తాయనే ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. అసలు శ్రుతి టాప్ హీరోయిన్. లక్ష్మీమీనన్ ఎదుగుతున్న నటి. అలాంటిది వీరి మధ్య వైరం ఏమిటన్న ఆసక్తి కలగడం సహజం. అయితే వీరిద్దరూ కలసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్ర హీరో అజిత్. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఎన్నై అరిందాల్ చిత్రం తరువాత ఆయన అజిత్ హీరోగా నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. వీరం చిత్రం తరువాత అజిత్‌ను శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా ఇదే. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. ఇందులో అజిత్ చెల్లెలిగా నటి లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ దర్శకుడు శివ ఇంతకుముందు చిత్రం వీరంలో అజిత్‌ను తమ్ముళ్లపై అపారప్రేమ ఉన్న అన్నయ్యగా చూపించి విజయం సాధించారు. ఈ చిత్రంలో చెల్లెల్ని ప్రాణంగా చూసుకునే అన్నయ్యగా చూపించబోతున్నట్లు సమాచారం. దీంతో అసలు విషయం అర్థం అయ్యే ఉంటుంది. చిత్రంలో అన్నా చెల్లెళ్ల సన్నివేశాలు బలమైనవిగా ఉంటాయని లక్ష్మీమీనన్ ఇందులో చెల్లెలి పాత్ర చేయడానికి అంగీకరించినట్లు కనిపించిన వారికంతా డప్పు కొట్టుకుంటోందట. చిత్రంలో హీరోయిన్ శ్రుతి పాటల సన్నివేశాలకే పరిమితం అని చిత్రంలో అజిత్ తరువాత బలమైన పాత్ర తనదేనని అందరకీ చెప్పుకుంటోందట. ఈ విషయం తెలిసి శ్రుతి లక్ష్మీమీనన్‌పై మండిపడుతున్నారని కోలీవుడ్ టాక్. -
టాక్సీ డ్రైవర్‌గా..!
గాసిప్ శ్రుతీహాసన్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారా...? తమిళ పరిశ్రమ ఔననే అంటోంది. అజిత్ హీరోగా ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మొదట అజిత్ టాక్సీడ్రైవర్గా నటించనున్నారనే వార్త ప్రచారమైంది. తాజాగా, ఆ పాత్రను శ్రుతీ చేస్తున్నారని భోగట్టా. మరైతే.. అజిత్ పాత్ర ఏంటి? అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. -
ఆయన సూపర్ చెఫ్
నటుడు అజిత్ సూపర్ చెఫ్ అట. ఇది చెప్పింది ఎవరో కాదు క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్. ఇంతకుముందు టాలీవుడ్లో ఎంత బిజీ నటిగా వెలుగొందారో అంతకంటే యమబిజీగా ఈ బ్యూటీ కోలీవుడ్‌లో విరాజిల్లుతున్నారు. శ్రుతి, ఇళయదళపతి విజయ్ సరసన నటిస్తున్న పులి చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఆమె మరో టాప్ స్టార్ అజిత్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఎన్నై అరిందాల్ తరువాత అజిత్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ మొదలైంది. ఇంతకుముందు అజిత్‌తో వీరం చిత్రాన్ని తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న మరో భారీ చిత్రం ఇది. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అజిత్‌కు చెల్లెలిగా నటి లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. చిత్ర షూటింగ్లో ఘుమఘుమలాడే బిరియానీ చేసి యూనిట్ సభ్యులకు విందునివ్వడం అజిత్‌కు ఆనవాయితి. ఈ చిత్ర షూటింగ్‌లోనూ అజిత్ తన చేతివాటం చూపించారట. ఆయన చేసిన బిరియానీ తిన్న శ్రుతిహాసన్ ఆహా ఏమి రుచి అనరా మైమరచి అంటూ అజిత్‌కు పొగడ్తలతో ముంచెత్తేశారు. దీని గురించి ఈ బబ్లీ గర్ల్ తెలుపుతూ అజిత్ మంచి వ్యక్తిత్వం గల మనిషి మాత్రమే కాదు. ఆయనలో మంచి పాక శాస్త్ర నైపుణ్యుడు ఉన్నారని కితాబిచ్చారు. ఆయన సరసన నటిం చడం తీయని అనుభవంగా పేర్కొన్నారు. -
శృతిలయలు
-
శ్రీవారి సేవలో శృతిహాసన్
సాక్షి, తిరుమల: సినీ నటి శృతిహాసన్ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌తో కలసి ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. శృతిహాసన్‌ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. -
శ్రీవారిని దర్శించుకున్న శృతిహాసన్
-
అజిత్ 56వ చిత్రం ప్రారంభం
నటుడు అజిత్ 56వ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆరంభం, వీరం, ఎన్నైఅరిందాల్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. ఆయనతో ఇంతకు ముందు ఆరంభం,ఎన్నైఅరిందాల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీసాయిరాం క్రియేషన్స్ అధినేత ఎఎం రత్రం మూడోసారి నిర్మిస్తున్న చిత్రం ఇది. అదేవిధంగా ఇంతకుముందు అజిత్ హీరొగా వీరం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శివ మరోసారి ఆయనతో కలిసి ఈ చిత్రంలో పని చేయనున్నారు. ఈచిత్రంలో అజిత్ సరసన క్రేజీ నటి శ్రుతీహాసన్ నటించనున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం. అయితే చిత్రవర్గాలు ఈవిషయాన్ని ద్రువీకరించలేదన్నది గమనార్హం.కాగా ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత భాణీలందించనుండటం మరో విశేషం. ఈ చిత్ర పూజాకార్యక్రమాలను గురువారం ఉదయం చెన్నైలో నిర్మాత నిర్మించిన శ్రీసాయిబాబా ఆలయంలో నిర్వహించారు. -
శ్రుతిపై వదంతులు వద్దు
నటి శ్రుతిహాసన్‌పై వదంతులు ప్రచారం చేయకూడదంటూ పులి చిత్ర నిర్మాత పీటీ సెల్వకుమార్ అభ్యర్థించారు. నాగార్జున, కార్తీ కలసి నటిస్తున్న కొత్త చిత్రం నుంచి వైదొలగిన శ్రుతిహాసన్ గురించి రోజుకో రకంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత సెల్వకుమార్ బుధవారం మధ్యాహ్నం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ పీవీపీ సినిమా సంస్థ నాగార్జున, కార్తీ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం నుంచి వైదొలగిన శ్రుతిహాసన్‌కు వ్యతిరేకంగా ఆ సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. శ్రుతి ఆ చిత్రంలో నటించకుండా వేరే కొత్త చిత్రం ఒప్పుకుని నటించడానికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి తమ సంస్థ విజయ్ హీరోగా నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతి, హన్సిక, శ్రీదేవి, సుదీప్ నటిస్తున్నారు. శ్రుతి మా చిత్రం కోసం ఏప్రిల్ ఒకటి నుంచి 15వ తారీఖు వరకు కాల్షీట్స్ కేటాయిం చారు. ప్రస్తుతం పులి చిత్రం తలకోనలో నిర్వహిస్తున్నాం. ఈ చిత్రం కోసం 150 మంది రెండు నెలలుగా శ్రమించి కళా దర్శకుడు ముత్తురాజ్ నేతృత్వంలో బ్రహ్మాండమైన సెట్‌ను వేశాం. ఈ సెట్లో ఈ నెలలో షూటింగ్ చేయకపోతే మేలో పర్యాటకులు రాక ఎక్కువ కావడంతో ఆ సెట్‌ను కూల్చేయాల్సి ఉంటుంది. శుృతిహాసన్ చివరి దశలో చిత్రం ఆగిపోకూడదని పులి చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరిస్తున్నారు. అంతేకాని ఆమె వేరే కొత్త చిత్రంలో నటించడం లేదని వివరించారు. -
శ్రుతి పాత్రలో తమన్న
శ్రుతిహాసన్ వైదొలగిన చిత్రంలో నటి తమన్న ఎంపికైనట్టు కోలీవుడ్ టాక్. టాలీవుడ్ నటుడు నాగార్జున, కోలీవుడ్ నటుడు కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ద్విభాషా చిత్రాన్ని పీవీపీ సిని మా సంస్థ నిర్మిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా (కార్తీకి జంటగా) నటి శ్రుతిహాసన్‌ను ఎంపిక చేశారు. అయితే తీరా చిత్ర షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరుణంలో ఆమె చిత్రం చేయడం లేదని చెప్పడం. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఆమెపై కోర్టులో కేసులు వేయడం వంటి పరిణామాలు పాఠకులకు తెలిసిందే. కొత్త చిత్రాలను అంగీకరించరాదని శ్రుతిపై కోర్టు ఆదేశించిన తరుణంలో ఆమెపై హైదరాబాద్ పోలీసులు కేసును నమోదు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితిలో శ్రుతి వైదొలగిన చిత్రంలో ఆమెకు బదులుగా మిల్కీ బ్యూటీ తమన్న ఎంపికైనట్లు సమాచారం. కాగా కార్తీ తమన్నలది హిట్ పెయిర్. వీరిద్దరూ కలసి నటించిన పైయ్యా, చిరుదై చిత్రాలు విజయం సాధించాయి. అదే విధంగా తమన్నకు తమి ళం, తెలుగు భాషలలో మంచి పేరే ఉంది. తమిళంలో వీరం చిత్రం తరువాత ప్రస్తుతం ఆర్యతో కలసి ఒక చిత్రం చేస్తున్నారు. దీంతో శ్రుతి హాసన్ పాత్రలో ఆమె బెటర్ అన్న నిర్ణయానికి వచ్చిన దర్శక నిర్మాతలు తమన్నను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారిక పూర్వకంగా వెల్లడించలేదన్నది గమనార్హం. -
గ్లామర్‌కు మెరుగులు
విశ్వనాయకుడు కమలహాసన్ కుటుంబం నుంచి ప్రస్తుత చివరి నట పయనం అక్షరహాసన్. ఈమె కూడా తన అక్క శ్రుతిహాసన్ మాదిరిగానే తన నట జీవితానికి బాలీవుడ్ నుంచే శ్రీకారం చుట్టారు. అయితే శ్రుతిహాసన్‌లా కాకుండా అక్షర తొలి చిత్రంతోనే పలువురు ప్రశంసల్ని, మంచి విజయాన్ని అందుకున్నారు. షమితాబ్లో ఒక సహాయ దర్శకురాలిగా సహజమైన నటనను ప్రదర్శించి ఆ పాత్రకు జీవం పోశారు. బాలీవుడ్ బిగ్‌బి, కోలీవుడ్ సీనియర్నటుడు ధనుష్‌ల మధ్య నటించడం అంత అషామాషి విషయం కాదు. అయినా అక్షర తన పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఫలితం కోలీవుడ్, బాలీవుడ్‌లలో పలు అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయట. అయితే చిత్రాల ఎంపిక విషయంలో ఏ మాత్రం తొందరపడని అక్షరహాసన్ తన అందాన్ని పెంచుకునే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం. తొలి చిత్రం సమయంలో తన రూపంలోను, ధరించే దుస్తులపైనా ప్రత్యేక దృష్టి సారించని అక్షర చుట్టూ ప్రస్తుతం శారీరక కసరత్తులు, శిక్షకులు, కేశాలంకారణ నైపుణ్యాలు అందాన్ని మెరుగులు దిద్దే నిపుణులు అంటూ ఒక పెద్ద బృందమే చేరిపోయిందట. వీరంతా అక్షరను బాలీవుడ్ ఇండస్ట్రీకి తగ్గ ఫిగర్‌గా మార్చి చూపిస్తామని వాగ్దానాలు కూడా చేసేశారట. సమీప కాలంలో ఈమె ముంబయిలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రముఖ మోడల్స్‌తో కలిసి కవాత్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరచారట. ఈ విషయం గురించి అక్షర తెలుపుతూ ఒక నటికి దుస్తులు, అలంకార వస్తువులపై శ్రద్ధ ఎంత అవసరం అన్నది తెలుసుకున్నానన్నారు. ఒకపక్క గ్లామర్‌లో తన సోదరి శ్రుతి దుమ్మురేపుతుండడంతో అక్షరకు అలాంటి ఆశ పుట్టడమే మార్పుకు కారణం కావచ్చునంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
కొత్త సినిమాలేవీ అంగీకరించకూడదు!
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మినహా శ్రుతీహాసన్ వేరే కొత్త సినిమాలేవీ అంగీకరించకూడదని హైదరాబాద్ మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఓ ఉత్తర్వు జారీ చేసింది. హైదరాబాద్, చెన్నైలకు చెందిన పిక్చర్ హౌస్ మీడియా చేసిన ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. నాగార్జున, కార్తి హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం నిర్మిస్తోంది. ఇందులో శ్రుతీహాసన్‌ను నాయికగా తీసుకున్నారు. తొలి షెడ్యూల్ పూర్తవుతున్న నేపథ్యంలో శ్రుతీహాసన్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలనుకున్నారు. అయితే, తేదీలు ఖాళీ లేకపోవడం వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నాననీ ‘ఇ-మెయిల్’ ద్వారా తమకు శ్రుతీహాసన్ తెలియజేశారట. ఆ విషయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పిక్చర్ హౌస్ మీడియా సంస్థ పేర్కొంది. ముందుగా సంప్రతించే శ్రుతి డేట్లు తీసుకున్నామనీ, ఆమె అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు తప్పుకోవడం వల్ల కోట్ల రూపాయల్లో తమకు నష్టం వాటిల్లడంతో పాటు, ఇతర నటీనటుల సమయం కూడా వృథా అవుతోందనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు శ్రుతీహాసన్పై కేసు పెట్టారు. ఈ కేసుని విచారించి ఇది సివిల్ అఫెన్స్ అనీ, తదుపరి ఆర్డర్లు వెలువడే వరకూ శ్రుతీహాసన్ కొత్త సినిమాలు అంగీకరించకూడదనీ న్యాయస్థానం ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. క్రిమినల్కేసు నమోదు చేసి, విచారణ చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. -
డైరీ ఫుల్!
తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు శ్రుతీ హాసన్. ప్రస్తుతం తమిళ నటుడు విజయ్, మహేశ్‌బాబు చిత్రాల్లో నటిస్తున్న శ్రుతి తాజాగా ఓ చిత్రం నుంచి తప్పుకున్నారని సమాచారం. పీవీపీ ప్రొడక్షన్స్ పతాకంపై నాగార్జున, కార్తీ హీరోలుగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం ఆరంభమైన విషయం తెలిసిందే. ఇందులో కార్తీ సరసన శ్రుతీహాసన్‌ను తీసుకున్నారనే వార్త ప్రచారమైంది. ముందు ఈ చిత్రం ఒప్పుకున్నా, ఆ తర్వాత డైరీ చెక్ చేసుకుంటే, తేదీ ల్లేవట. అందుకని, ఈ చిత్రం నుంచి శ్రుతీ తప్పుకున్నారట. -
ముద్దు వద్దన్నాడు!
పాత్ర కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా శ్రుతీహాసన్ సిద్ధంగా ఉంటారు. అందంగా కనిపించడం మాత్రమే కాదు.. అందవిహీనంగా కూడా కనిపించడానికి వెనకాడరు. అందుకు నిదర్శనం ‘డీ-డే’. ఆ చిత్రంలో మొహంపై కుట్లుతో కనిపిస్తారామె. అలాగే, కథానుసారం చిత్రకథానాయకుడు అర్జున్ రామ్‌పాల్‌తో చుంభన సన్నివేశంలో కూడా నటించారు. ఇప్పుడు ఆమె చేస్తున్న చిత్రాల్లో హిందీ ‘వెల్కమ్ బ్యాక్’ ఒకటి. ఇందులోనూ లిప్ లాక్ సీన్ ఉందట. అది లేకపోతే సన్నివేశం పేలవంగా ఉంటుందట. అందుకని, శ్రుతి ఆ సీన్ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ, చిత్రకథానాయకుడు జాన్ అబ్రహాం మాత్రం తిరస్కరించారట. ఇప్పటివరకు బోల్డన్ని లిప్ లాక్ సీన్స్‌లో నటించిన జాన్ అబ్రహాం ఈసారి ససేమిరా అనడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడాయన ఫ్యామిలీ మ్యాన్ కదా. ప్రేయసి ప్రియా రుంచల్‌ని పెళ్లి చేసుకున్నప్పట్నుంచీ వ్యక్తిగతంగా పద్ధతిగా ఉండటంతో పాటు వృత్తిపరంగా కూడా కొన్ని పద్ధతులు పాటించాలనుకున్నారట. ‘ఇక పెదవి ముద్దు సీన్స్‌లో నటించకూడదు’ అన్నది ఆయన మొదటి నిర్ణయం అని సమాచారం. తన నిర్ణయాన్ని ‘వెల్కమ్ బ్యాక్’ దర్శకుడు అనీస్ బజ్మీ దగ్గర చెప్పి, ఒప్పించారట. -
ఇద్దరు శ్రుతీహాసన్లు కావాలి!
మీకు పాటలు పాడటం ఇష్టమా? నటనంటే ఇష్టమా? అని శ్రుతీహాసన్‌ని అడిగితే.. ‘‘రెండు కళ్లల్లో ఏది ముఖ్యమో చెప్పమంటే ఏం చెబుతాను’’ అంటారు. సంగీతం అంటే ఈ బ్యూటీకి చిన్నప్పట్నుంచీ ప్రాణం. కానీ, ఇప్పుడు కథానాయికగా బిజీ కావడం వల్ల సంగీతానికి ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నారామె. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మొత్తం ఏడు చిత్రాల్లో నటిస్తున్నాను. దాంతో ఏదైనా మ్యూజికల్ ఆల్బమ్ తయారు చేయాలని ఉన్నా తీరిక చిక్కడం లేదు. సంగీతం మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టే, అప్పుడప్పుడూ కొన్ని సినిమాలకు పాడుతున్నాను. ఒకవేళ పూర్తి స్థాయి గాయనిగా, నటిగా కొనసాగాలని ఆశపడితే అప్పుడు ఒకరు కాదు... ఇద్దరు శ్రుతీహాసన్లు కావాలి’’ అన్నారు సరదాగా. -
అందుకే ఆ బహుమతి!
శ్రుతీహాసన్‌కి ఇటీవల మంచి పుట్టినరోజు బహుమతి లభించింది. అది ఇచ్చింది వాళ్ల నాన్న కమలహాసనే. శ్రుతీ మంచి రచయిత్రి. నటనలో బిజీ అయిపోవడంతో ఆమెలోని రచయిత్రి మరుగునపడిపోయింది. దాంతో కమల్ మళ్లీ కూతురితో కలం పట్టించాలనుకున్నారు. అందుకే శ్రుతీకి ఊహించని బహుమతి ఇచ్చారాయన. దాని గురించి శ్రుతీహసన్ మాట్లాడుతూ -‘‘మా నాన్నగారు నాకిచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ఓ స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్వేర్, రైటింగ్ కోర్స్. నా ప్రతిభ మీద ఆయనకు చాలా నమ్మకం. నా చిన్నప్పుడు నేను చిన్న చిన్న కథలు, కవితలు రాసేదాన్ని. ఇప్పుడు తీరిక చిక్కడంలేదు. నన్ను ఇన్స్పైర్ చేసి, మళ్లీ నాతో రచనలు చేయించడానికే నాన్నగారు ఆ బహుమతి ఇచ్చారు. నాక్కూడా రాయడం ఇష్టం. అందుకే వీలు చేసుకుని తొలుత లఘుచిత్రాలకు కథలు రాయాలనుకుంటున్నా’’ అన్నారు. -
ఓ శుభవార్త!
‘‘మీతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా. కాకపోతే 24 గంటల తర్వాతే’’ అంటూ శ్రుతీహాసన్ ట్విట్టర్లో ఊరించారు. ఇది చదివినవాళ్లల్లో కొంతమంది శ్రుతి చెప్పనున్న ఆ శుభవార్త తన పెళ్లికి సంబంధించినది కావచ్చని కొందరు ఊహించేసుకున్నారు. కానీ, ఇటీవల ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను’ అన్నారు కాబట్టి, పెళ్లికి సంబంధించిన వార్త అయ్యుండక పోవచ్చని కూడా భావించారు. వాస్తవానికి శ్రుతి చెప్పాలనుకున్న వార్త ఓ చిత్రానికి సంబంధించింది. నాగార్జున, కార్తీ కాంబినేషన్లో పీవీపీ సంస్థ ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ను కథానాయికగా తీసుకున్నారు. దీని గురించే శ్రుతి ప్రత్యేకంగా ప్రకటించాలనుకున్నారు. ఈ కథ విన్నాననీ, కొత్తగా ఉండటంతోపాటు హృదయానికి హత్తుకునే విధంగా ఉందని ఆమె తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళాల్లో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించనున్నారు. -
నాతో తేడాగా ప్రవర్తిస్తేనా...
‘‘పిరికితనం చాలా ప్రమాదకరమైనది. అది మన ఎదుగుదలను ఆపేస్తుంది. అందుకే ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి’’ అని శ్రుతీహాసన్ అంటున్నారు. ఈ మధ్య ఢిల్లీ, హైదరాబాద్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి కదా.. ఈ ప్రపంచంలో ఆడవాళ్లు సురక్షితంగా ఉండగలిగేదెక్కడ అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే -‘‘నాకు తెలిసినంతవరకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్. అక్కడ స్త్రీలకు స్వాతంత్య్రం ఉంటుంది. మగవాళ్లతో సమానంగా అన్ని హక్కులూ ఉంటాయి. ఇక.. భద్రత గురించి చెప్పాలంటే భేష్. చాలా బాగుంటుంది. అందుకే నాకు లాస్ ఏంజిల్స్ అంటే ఇష్టం’’ అన్నారు. మీరు స్త్రీవాదా? అనడిగితే -‘‘అవును. పక్కా ఫెమినిస్ట్‌ని. స్త్రీవాదం అంటే.. మగవాళ్లపై నోరుపారేసుకోవడం కాదు. గోరంతను కూడా కొండంత చేసేసి మగవాళ్లపై విరుచుకుపడను. మగవాళ్లను చీడపురుగుల్లా చూడను. కానీ, నాతో తేడాగా ప్రవర్తిస్తే మాత్రం నేనేంటో చెబుతా. అలాంటి సందర్భాల్లో పిరికితనంగా ఉంటే ఆడించేస్తారు. అందుకే ధైర్యంగా ఎదుర్కొంటా. మా అమ్మ (సారిక) గారి నుంచి వచ్చిన అలవాటు ఇది. ఆమె చాలా ధైర్యవంతురాలు. నాకు తెలిసి ఇప్పటివరకూ తను ఏ విషయానికీ భయపడలేదు. నేను కూడా మా అమ్మలానే’’ అని చెప్పారు. -
కమల్‌తో శ్రుతి డాన్స్
నటుడు కమలహాసన్‌తో కలసి ఆయన కూతురు క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్ లెగ్‌షేక్ చేయనున్నారని, ఈ అరుదైన మేళవింపులో సాగే ఆ నృత్య గీతికకు హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికకాబోతున్నట్లు సినీవర్గాల సమాచారం. కమలహాసన్ ఎంత గొప్ప నటుడో, అంత మంచి డాన్సర్. ఈయనతో శ్రుతిహాసన్‌ను నటింప చేయాలని కనీసం ఒక పాటలోనైనా ఆడించాలని జరిగిన పలు ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇటీవల కమలహాసన్ నటించిన ఉత్తమ విలన్ చిత్రంలో శ్రుతిని ఒక్క పాటలో నటింప చేయాలని ఆ చిత్ర దర్శకుడు, కమల్ మిత్రుడు రమేష్ అరవింద్ చాలా ప్రయత్నం చేసి విఫలం అయ్యారనే ప్రచారం జరిగింది. అలాంటిది కమల్, శ్రుతిహాసన్ ఒక వేదికపై ఒక పాటకు కలిసి డాన్స్ చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం ప్రాంతంలో హుదూద్ తుపాను ప్రళయం తాండవం చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ప్రాణనష్టం ఆస్తినష్టం ఎక్కువై అతలాకుతలం అయ్యాయి. ఆ తుపాను బాధితుల్ని ఆదుకోవడానికి పలువురు పలు రకాలుగా సాయం అందిస్తున్నారు. అందులో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమ మేము సైతం అంటూ స్టార్నైట్స్ లాంటి పలు వినోద కార్యక్రమాలతో నిధిని సేకరించే కార్యక్రమానికి సిద్ధం అయ్యింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో వివిధ వినోదపు కార్యక్రమాలతో తారలు సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ తారలతో పాటు కోలీవుడ్‌కు చెందిన కమలహాసన్, సూర్య, కార్తీ, శ్రుతిహాసన్, శ్రీయ మొదలగు పలువురు నటీనటులు పాల్గొననున్నారని సమాచారం. ఈ వేదికపై కమలహాసన్, శ్రుతిహాసన్ కలిసి డాన్స్ చేయనున్నట్లు తెలిసింది. వీరిద్దరితో ఆడించే క్రెడిట్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాదేకే దక్కుతుందని సమాచారం. -
మహేష్, శృతి హాసన్ లకు అభిమాని 'క్లిక్'
మహేష్‌బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పుణెలో జరుగుతోంది. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను ఇక్కడి ఐటీ పార్క్ లో తెరకెక్కిస్తున్నారు. స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా షూటింగ్ కొనసాగిస్తున్నారు. తమ అభిమాన హీరో హీరోయిన్ల షూటింగ్ చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున గుమిగూడుతున్నారు. పుణెలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో చాలా మంది తెలుగువారు ఉన్న విషయం తెలిసిందే. మహేష్‌బాబు, శృతిహాసన్ ను చూసేందుకు అభిమానులు అమితాసక్తి చూపుతున్నారు. ఒకానొక దశలో అభిమానులు అదుపు చేయడం సినిమా యూనిట్ కు కష్టతరమవుతోంది. ఓ అభిమాని అయితే షూటింగ్ స్పాట్ లో ఉన్న మహేష్‌బాబు, శృతిహాసన్ లను తన కెమెరాలో బంధించాడు. దీన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ ఫోటోను అభిమానులు ఆసక్తిగా తిలకించడమే కాకుండా, లైకులు మీద లైకులు కొడుతున్నారు. సాక్షి పోస్ట్(www.sakshipost.com)లో పోస్టు చేసిన ఈ ఫోటోను శృతిహాసన్ తన ట్విటర్ పేజీలో షేర్ చేయడం విశేషం. -
అలా అనడానికి వాళ్ళెవరు?
‘‘పాత్ర అనేది కథను బట్టి ఉంటుంది. పాత్ర తీరుతెన్నులు దర్శకుని సృజనను బట్టి ఉంటాయి. ఒక కథను తయారు చేయడం, ఒక పాత్రను మలచడం.. సినిమా చూసి విమర్శించినంత తేలిక కాదు. ‘ఈ పాత్రను ఇంత ఘాటుగా తీయడం అవసరమా?’ అనీ, ఒకవేళ పద్ధతిగా కనిపిస్తే.. ‘ఈ పాత్ర ఇంకా మోడర్న్‌గా ఉంటే బాగుంటుంది’ అనీ తోచిన వ్యాఖ్యలు చేయడానికి బయటివాళ్లెవరు?’’ అని ఇటీవల శ్రుతీ హాసన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలు కూడా చేస్తూ, ముందుకు దూసుకెళుతున్నారు శ్రుతి. తెరపై తారలు చేసే పాత్రల్ని బట్టి వాళ్ల గుణాన్ని, అభిరుచులను అంచనా వేయడం సరికాదని ఆ ఇంటర్వ్యూలో శ్రుతి చెబుతూ -‘‘గ్లామరస్ పాత్రల్లో నేను కనిపించినప్పుడు, నా శరీరాన్ని వేరే దృష్టితో చూస్తే, అది చూసేవాళ్ల తప్పు. మీరెలాగైనా కనిపించండి... ఎదుటి వ్యక్తి మనసులో ఏమీ లేనప్పుడు మీ గురించి లేనిపోనివి ఊహించుకోరు. నా మటుకు నా శరీరం నాకు గుడి లాంటిది. వేరేవాళ్లు వేరే రకంగా అనుకుంటే అది నా తప్పు కాదు. అలాంటివాళ్ల గురించి ఆలోచించి నా సమయాన్ని వృథా చేసుకోను. అలాగే, తెరపై మేం చేసే పాత్రలను మా నిజజీవితానికి ఆపాదించవద్దు. తెరపై కనిపించేది పాత్రలు మాత్రమే.. మేము కాదు’’ అన్నారు. -
మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు!
‘‘సినిమా ప్రపంచంలో పురుషాధిక్యత ఉంటుంది అంటారు. ఆ మాటకొస్తే... ఒక్క సినిమా ప్రపంచం ఏం ఖర్మ.. అన్ని రంగాల్లోనూ పురుషులదే పై చేయి’’ అని శ్రుతీ హాసన్ అంటున్నారు. ఇటీవల ఓ సందర్భంలో పురుషాధిక్యత గురించి ప్రత్యేకంగా మాట్లాడారామె. ఆడవాళ్లు అణిగి మణిగి పడి ఉండాలని మగవాళ్లు కోరుకుంటారనీ, అంత మాత్రాన తగ్గాల్సిన అవసరంలేదనీ శ్రుతీ హాసన్ చెబుతూ -‘‘సినిమా నటి, పాత్రికేయురాలు, అధ్యాపకురాలు, గృహిణి.. ఎవరైనా కానివ్వండి మన దేశంలో అస్సలు రక్షణ లేదు. మీరు ఇంట్లో ఉండండి, వృత్తి రీత్యా హోటల్లోనో లేక గెస్ట్ హౌస్‌లోనో బస చేయండి.. రక్షణ ఉంటుందని మాత్రం గ్యారంటీ లేదు. అందుకే మహిళలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వయసులో ఉన్నవాళ్లే కాదు... చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికీ ఇండియా అంత సురక్షితం కాదు’’ అని ముక్కుసూటిగా చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచిస్తున్న శ్రుతి తాను కూడా అలానే ఉంటారు. అందుకే, ఎవరో ఆగంతకుడు తన ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించినప్పుడు వెంటనే స్పందించి, అతన్ని బయటికి నెట్టివేయగలిగారామె.