'ఎవడు' మా బ్యానర్ లో అతిపెద్ద హిట్: దిల్ రాజు
రామ్ చరణ్ నటించిన యాక్షన్, థ్రిల్లర్ 'ఎవడు' చిత్రం ఘన విజయం సాధించడంపై ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఎవడు సక్సెస్ మీట్ లో దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మ్యా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మించిన చిత్రాల్లో అతిపెద్ద హిట్ అని అన్నారు.
దిల్ రాజు నిర్మాతగా 16 చిత్రాలు నిర్మించగా, వాటిలో బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దిల్, బృందావనం, ఆర్య చిత్రాలు విజయం సాధించాయి. తాజాగా విడుదలైన ఎవడు బ్లాక్ బస్టర్ గా టాక్ తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్ లో తొలి రోజున 9.03 కోట్లు వసూలు చేసిందన్నారు. గత కొద్దికాలంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిందని.. తాను ఇంతటి విజయాన్ని సాధిస్తుందని ఊహించలేదు అని అన్నారు. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాంచరణ్ సరసన ఆమీ జాక్సన్, శృతి హసన్, నటించగా, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు.