Shruti Haasan
-
రెండోసారి జోడీ?
హీరో ధనుష్, హీరోయిన్ శ్రుతీహాసన్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘3’ (2012) సినిమాలో తొలిసారి జంటగా నటించారు ధనుష్, శ్రుతి. ఆ చిత్రం విడుదలైన 12 ఏళ్లకి మరోసారి ఈ జోడీ రిపీట్ కానుందని టాక్. శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి తాజాగా ధనుష్‌తో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ మూవీలో ధనుష్‌కి జంటగా శ్రుతీహాసన్ నటించనున్నట్లు తెలుస్తోంది. పైగా డైరెక్టర్‌పై ఉన్న నమ్మకంతో తన పాత్ర ఏంటి? అని అడగకుండానే ఓకే చెప్పారట ఆమె. తన కెరీర్లో ఇప్పటి వరకూ చేయని ఓ వైవిధ్యమైన పాత్ర శ్రుతీహాసన్‌ది అని టాక్. ‘3’ మూవీతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ధనుష్–శ్రుతీహాసన్ రెండోసారి జంటగా నటించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమా షూటింVŠ తో బిజీగా ఉన్నారు శ్రుతి. ఆ మూవీ పూర్తయ్యాక ధనుష్ చిత్రంలో పాల్గొంటారని కోలీవుడ్ టాక్. -
రిలేషన్షిప్ ఓకే.. పెళ్లంటేనే భయంగా ఉంది: శృతి హాసన్
ప్రేమలో పడ్డప్పుడు గాల్లో తేలుతుంటారు. అదే బ్రేకప్ అయ్యాక ఈ ప్రేమాగీమా జోలికే వెళ్లొద్దని బలంగా ఫిక్సవుతుంటారు. కానీ కొన్నాళ్లకు మళ్లీ లవ్‌లో పడటం.. చివరకూ అదీ బ్రేకప్ అవడం చూస్తూనే ఉన్నాం. కొన్నేళ్లుగా శాంతను హజారికతో ప్రేమలో ఉన్న శృతి హాసన్(Shruti Haasan) ఇటీవల అతడికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను హీరోయిన్ డిలీట్ చేయడంతో ఇది నిజమేనని అంతా ఫిక్సయిపోయారు. అంతే కాదు పెళ్లిపై ఆసక్తి కూడా లేదని తేల్చి చెప్పింది.ప్రేమ ఓకే, పెళ్లే వద్దు!తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి వివాహం గురించి మాట్లాడింది. 'రిలేషన్షిప్స్ అంటే నాకిష్టం. ఆ ప్రేమ, అనుబంధాలన్నీ నచ్చుతాయి. ప్రేమలో మునగడం ఇష్టమే కానీ పెళ్లి చేసుకుని ఒకరితో ఎక్కువ అటాచ్ అవ్వాలంటేనే భయంగా' ఉంది అని చెప్పుకొచ్చింది. తన పేరెంట్స్ కమల్ హాసన్ (Kamal Haasan)- సారిక(Sarika) గురించి మాట్లాడుతూ.. నేను అందమైన కుటుంబంలో జన్మించాను. మా అమ్మానాన్న ఈ ప్రపంచంలోనే ఉత్తమ జంట అని భావించాను. విడిపోతేనే హ్యాపీ అంటే..ఇద్దరూ కలిసి పని చేసుకునేవారు. కలిసే సెట్స్‌కు వెళ్లేవారు. అమ్మ కాస్ట్యూమ్ డిజైన్స్ చేసేది. సంతోషంగా, సరదాగా ఉండేవాళ్లం. కానీ ఎప్పుడైతే వాళ్లిద్దరూ విడిపోయారో అంతా మారిపోయింది. మా కుటుంబమంతా బాధపడ్డాం. కలిసుండటానికి ప్రయత్నించారు, కానీ కుదర్లేదు. అయినా బలవంతంగా కలిసుండటం కన్నా విడిపోతేనే సంతోషంగా ఉంటామనుకుంటే అది మాక్కూడా మంచిదే! అని చెప్పుకొచ్చింది.సినిమా..ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ కూలీ సినిమాలో నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీ సలార్ 2లోనూ భాగం కానుంది. కాగా కమల్- సారిక 1988లో పెళ్లి చేసుకున్నారు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2004లో కమల్- సారిక విడాకులు తీసుకున్నారు.చదవండి: షాకింగ్.. యూట్యూబ్ నుంచి పుష్ప 2 సాంగ్ డిలీట్ -
'అమరన్' దర్శకుడితో ధనుష్ సినిమా.. ఛాన్స్ కొట్టేసిన టాప్ హీరోయిన్
కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, కథకుడు ఇలా.. పలు ముఖాలు కలిగిన నటుడు ధనుష్. అంతేకాదు బహుభాషా నటుడు. బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ఏక కాలంలో కథానాయకుడిగా మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో ఒకటి ద్విభాషా చిత్రం కుబేర. రెండోది ఇడ్లీ కడై. ఈ చిత్రానికి ధనుష్ దర్శకుడు కూడా. ఇక మూడో చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. గోపురం ఫిలిమ్స్ పతాకంపై అన్బు చెళియన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమరన్ చిత్రం ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. వీర సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో ఈయన అమరన్ చిత్రాన్ని తెరకెక్కించిన ఘనత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం గురించి ఆయన ఒక భేటీలో పేర్కొంటూ ఇది కూడా రియల్ హీరో కథా చిత్రంగానే ఉంటుందని తెలిపారు. సమాజంలో ఎందరో రియల్ లైఫ్ వీరులు, హీరోలు ఉన్నారన్నారు. వారిలో ఒకరి కథగా తమ చిత్రం ఉంటుందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గురించి అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నటి శృతిహాసన్ నాయకిగా నటించనున్నారన్నదే ఆ అప్డేట్. ఇంతకు ముందే ధనుష్, శృతిహాసన్ 3 అనే చిత్రంలో నటించారు. దీంతో మరో సారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందన్న మాట. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్న శృతిహాసన్ తదుపరి ధనుష్ తో జత కట్టనున్నారన్న మాట. కాగా రాయన్ చిత్రం తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
గోత్ థీమ్‌తో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్న శ్రుతీ హాసన్
స్టార్ హీరోయిన్ శ్రుతీ హాసన్ క్రిస్మస్(Christmas) సీజన్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటానికి సిద్ధమైంది. ఈ సెలబ్రేషన్స్ ద్వారా కొత్త సంవత్సరాదిని సరికొత్త ఉత్సుకతలో ప్రారంభించటానికి ఆమె అడుగులు వేస్తున్నారు. క్రిస్మస్ పండుగను శ్రుతీ హాసన్ తనదైన శైలిలో జరుపుకోవటానికి సెలబ్రేషన్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా గోత్ థీమ్‌తో క్రిస్మస్ను సెలబ్రేట్ చేయటానికి తన స్టైల్‌ను జోడించింది.శ్రుతీ హాసన్(Shruti Haasan), తనదైన స్టైల్లో యూనిక్‌గా నిర్వహిస్తోన్న క్రిస్మస్ పండుగ వేడుకలకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రత్యేకమైన శైలిలో హాలీడే సీజన్‌కు స్వాగతం పలుకుతూ ఆమె అభిమానులు సహా అందిరలోనూ ఆనందాన్ని నింపింది.ఇక సినిమాల విషయానికి వస్తే 2023 శ్రుతీ హాసన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ ఏడాదిగా చెప్పొచ్చు. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, సలార్ పార్ట్ 1 చిత్రాలు విడుదలై ఘన విజయాలను సాధించాయి.కానీ ఈ ఏడాది మాత్రం ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే అభిమానులు మాత్రం 2025లో సరికొత్త చిత్రాల్లో ఆమెను చూడొచ్చు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్రేజీ పాన్ ఇండియా మూవీ కూలీ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న సలార్ 2 చిత్రం కూడా వచ్చే ఏడాదిలో సందడి చేయనుందని సమాచారం.ఇవి కాకుండా మరిన్న క్రేజీ చిత్రాల్లో శ్రుతీ హాసన్ ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఆమె తన అద్భుతమైన నటనతో అభిమానులు సహా ప్రేక్షకులను మెప్పించనున్నారు. -
అడివి శేష్ కి గుడ్ బాయ్ చెప్పిన శృతి హాసన్.. ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్
-
డకాయిట్ మిస్టరీ.. శృతి పోయి మృణాల్ ఎలా వచ్చింది?
-
జైపూర్‌కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
ట్రెడిషినల్ లుక్‌లో మెరిసిపోతున్న హీరోయిన్ శృతి హాసన్ (ఫొటోలు)
-
సమంత బాటలో శృతిహాసన్?
సినిమా రంగంలో అనుకున్నవన్నీ జరగవు. కొన్నిసార్లు ఊహించనవీ జరుగుతాయి. అలా టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్న నటి సమంత కెరీర్ ఒక్కసారిగా సమస్యల్లోకి నెట్టబడింది. భర్త నాగచైతన్య నుంచి విడిపోవడం, అదే సమయంలో మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. దీంతో సినిమాలకు దూరం అయ్యారు. ఆ వ్యాధి నుంచి బయట పడటానికి చాలా ప్రయత్నాలు చేశారు. పలు రకాల వైద్యం, యోగాలు, ధ్యానాలు చేశారు. మొత్తం మీద వ్యాధి నుంచి బయట పడ్డారు. అయితే ఇంకా నటనకు సిద్ధం కాలేదు. కారణం వచ్చిన చిత్రాలు వెనక్కి పోవడమేనని సమాచారం. మలయాళంలో మమ్ముట్టికి జంటగా నటించే అవకాశం వచ్చిందన్నారు. సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. వీటిలో ఏవీ జరగలేదు. అలాగే చైన్నె లవ్‌స్టోరీ అనే ఆంగ్ల చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కారణాలేమైనా ఆ చిత్రం కూడా చేజారిపోయింది. అయితే ఆ చిత్రంలో నటించే అవకాశాన్ని నటి శృతిహాసన్ చేజిక్కించుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈమె కూడా ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. శృతిహాసన్ అంగీకరించి, వైదొలగడం అనేది ఇది రెండోసారి. ఈమె ఇప్పటికే తెలుగు చిత్రం డెకాయిట్ లవ్‌స్టోరీ అనే చిత్రం నుంచి వైదొలగారు. టాలీవుడ్ నటుడు అడవి శేషు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి శృతిహాసన్ నటించడానికి అంగీకరించారు. ఈ చిత్ర టీజర్ కూడా విడుదలై మంచి ఆదరణ పొందింది. అలాంటి సమయంలో కారణాలేమైన శృతిహాసన్ ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తాజాగా ఆంగ్ల చిత్రం చైన్నె లవ్‌స్టోరీ నుంచి వైదొలిగినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీటన్నింటికీ కారణం ఆమె నటిస్తున్న కూలీ చిత్రమేనా? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కూలీ. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ తరువాత రజనీకాంత్ అస్వస్థతకు గురి కావడంతో షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ చిత్రంలో నటి శృతిహాసన్ రజనీకాంత్‌కు కూతురిగా నటిస్తున్నట్లు సమాచారం. కాగా కాల్షీట్స్ సమస్య కారణంగానే ఆమె చైన్నె లవ్‌స్టోరీ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. అలా శృతిహాసన్ కూడా నటి సమంత బాటలోనే పయనిస్తున్నారు అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
టాలీవుడ్ మూవీ నుంచి తప్పుకున్న శృతి హాసన్!
కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గతేడాది సలార్ మూవీ అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం రజినీకాంత్ చిత్రం కూలీలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.అయితే శృతిహాసన్ ఇప్పటికే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. అందులో టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న డెకాయిట్:ఎ లవ్ స్టోరీ ఒకటి. అంతే కాకుండా చెన్నై స్టోరీ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ రెండు సినిమాల నుంచి శృతిహాసన్ తప్పుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే కొన్ని విభేదాల కారణంగానే ఆమె గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితుల్లో ఒకరు మీడియాకు వెల్లడించారు. డెకాయిట్‌తో పాటు చెన్నై స్టోరీ కూడా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: కర్రసాము నేర్చుకుంటున్న శృతిహాసన్ .. వీడియో వైరల్)కాగా.. గతేడాది డిసెంబర్లో అడివి శేష్, శృతి హాసన్ జంటగా డెకాయిట్ మూవీని ప్రకటించారు. అదే రోజున అనౌన్స్మెంట్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. మరోవైపు చెన్నై స్టోరీలో శ్రుతి హాసన్ డిటెక్టివ్ పాత్రను పోషించాల్సి ఉంది. అంతకు ముందు సమంత రూత్ ప్రభుని ఈ సినిమాలో కథానాయికగా తీసుకున్నారు. ఆ తర్వాత శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. తాజాగా శృతి కూడా సినిమా నుంచి తప్పుకుంది. -
చికాగో ఫ్యాన్స్ మీట్లో శృతిహాసన్ సందడి
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సింగర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లోకనాయకుడు కమల్‌హాసన్ గారాలపట్టిగా బోల్డెంత పేరు ఉన్నప్పటికి ..తన సొంత టాలెంట్, గ్లామర్‌తో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ.. టాప్ హీరోయిన్గా వెలుగుతోంది. పలు సేవా కార్యక్రమంలో పాలుపంచుకునే శృతిహాసన్ రీసెంట్గా అమెరికాలో పర్యటించారు. చికాగోలోని ఫ్యాన్స్ మీట్లో పాల్గొని..సందడి చేశారు.సాక్షి, HR PUNDITS పార్టనర్షిప్ గా.. పక్కాలోకల్ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ లో శృతి హాసన్ బార్బీ డాల్‌గా మెరిసిపోతూ.. అభిమానులను కుష్ చేశారు. ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాసన్ ను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. వేదికపై శృతిహాసన్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాకుండా వారి కోరిక మేరకు సాంగ్స్ కూడా పాడారు. అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఫ్యాన్స్ తో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా నిర్వహకులు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. శృతి హాసన్ తన సినీ కెరీర్ కు సంబంధించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. చికాగో తనకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైనా స్టయిల్ లో సమాధానం ఇచ్చారు.ఈ ఈవెంట్ లో శృతి హాసన్ సినిమాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఆమె సినిమాలకు సంబంధించి పలు ప్రశ్నలను అభిమానులను అడిగారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి శృతిహాసన్ ఆటోగ్రాప్ చేసిన టీషర్ట్లను అందజేశారు. ఇక ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాన్కు సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. ఇక అందమైన ఫోటో ఫ్రేమ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించిన నిర్వహకులకు.. శృతిహాసన్ కృతజ్ఞతలు తెలిపారు. -
హైదరాబాదులో సందడి చేసిన నటి శృతిహాసన్ (ఫొటోలు)
-
మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!
టాలీవుడ్ నటి, గాయని శృతి హాసన్ విలక్షణ నటుడు కమల హాసన్ కూమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఒకానొక సందర్భంలో శృతి తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోవాలంటే మొదటగా ఏం చేయాలో తెలుసా అంటూ తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది. అవేంటంటే..అందరూ మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడేందుకే జంకుతారు. ఇది ముందు పక్కన పెట్టాయాలంటోంది శృతి. ఈ పరిస్థితిని అందరూ ఏదోఒక సందర్భంలో ఎదుర్కొనే సాధారణ పరిస్థితిగా పరిగణించాలి. అప్పుడే దీనిగురించి బహిరంగంగా మాట్లాడి స్వాంతన పొందే ప్రయత్నం చేయగలుగుతాం, బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతామని చెబుతోంది. నిజానికి మానసికంగా బాధపడుతున్నాను అంటూ.. వెంటనే థెరపిస్టు లేదా కౌన్సలర్ లేదా సైక్రియాట్రిస్ట్ వద్దకు వెళ్లిపోతారు. కానీ అవేమి అవసరం లేదంటోంది శృతి. మన చుట్టు ఉన్నవాళ్లతో లేదా మనకిష్టమైన వ్యక్తులను ఆత్మీయంగా పలకరించడం, వారితో కాసేపు గడపడం వంటివి చేస్తే చాలు మానసిక స్థితి కుదుటపడుతుందని నమ్మకంగా చెబుతోంది. అందుకు ఉదాహారణగా.. మనం ఏదైన జ్వరం రాగానే ఏం చేస్తాం చెప్పండి అంటోంది. మొదటగా.. ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుని వేసుకుని చూస్తారు. తగ్గలేదు అనగానే వైద్యుడిని సంప్రదించే యత్నం చేస్తారు. అలానే దీని విషయంలో కూడా మనంతట మనంగా ఈ మానసిక సమస్యను నయం చేసుకునే యత్నం చేయాలి. అవన్నీ ఫలించని పక్షంలో థెరఫిస్టులను ఆశ్రయించడం మంచిదని చెబుతోంది. అలాగే కొందరూ మెంటల్ స్ట్రెస్ తగ్గేందుకు సినిమాలకు వెళ్లతారు. ఓ మంచి ఫీల్‌తో హ్యాపీగా ఉండేలా చేసుకుంటారు. ఇది కూడా మంచి పద్ధతే అయినా ఒక్కోసారి ఇది కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదని అంటోంది శృతి. చేయాల్సినవి..మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అనిపించగానే దాన్ని పెనుభూతంలా, పెద్ద సమస్యలా చూడొద్దుఆ వ్యాధి మిమ్మల్ని తక్కువగా చేసి చూపించేది కాదు.నలుగురితో కలుపుగోలుగా మెలిగే ప్రయత్నం లేదా మాట్లాడటం వంటివి చేయండి. అలాగే మీ వ్యక్తిగత లేదా ప్రియమైన వ్యక్తులతో సమస్యను వివరించి బయటపడేలా మద్దతు తీసుకోండి. దీంతోపాటు మానసిక ఆరోగ్య నిపుణలను సంప్రదించి..ఏం చేస్తే బెటర్ అనేది కూలంకషంగా తెలుసుకుని బయటపడే ప్రయంత్నం చేయండి.నిజానికి మానసికి ఆరోగ్య మొత్తం ఆరోగ్య శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. ఇది బాగుంటేనే ఏ పనైనా సునాయాసంగా చేయగలం. అందరిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకునేలా జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోగలుగుతాం అని చెబుతోంది శృతి.(చదవండి: ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!) -
కర్రసాము నేర్చుకుంటున్న శృతిహాసన్ .. వీడియో వైరల్
ఇంతకు ముందు సినీ హీరోలు తాము నటించే చిత్రాల కోసం తీవ్రంగా హోమ్‌వర్క్ చేస్తుండేవారు. అయితే, ఇప్పుడు హీరోయిన్లు కూడా తమ పాత్రల కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నారు. తాజాగా నటి శృతిహాసన్ తన పాత్రకు న్యాయం చేయడం కోసం చాలా కష్టపడుతుంది. పాన్ ఇండియా రేంజ్లో రాణిస్తున్న ఈ చెన్నై బ్యూటీ మొదట హిందీలో లక్ అనే చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో నటిస్తూ పాపులర్ అయింది. నిజం చెప్పాలంటే తమిళంలో కంటే తెలుగులోనే శృతిహాసన్‌కు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఈమె నటించిన చిత్రాలన్నీ హిట్టే అని చెప్పవచ్చు. అలా టాప్ హీరోయిన్గా రాణిస్తున్న శృతిహాసన్ తన సొంత భాష తమిళంలో నటించి మూడేళ్లకు పైగా అయ్యింది. ఈమె నాయకిగా నటించిన తమిళ చిత్రం లాభం తెరపైకి వచ్చి మూడేళ్లు అయ్యింది. అలా సుదీర్ఘ గ్యాప్ తరువాత శృతిహాసన్ కోలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం కూలీ. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ తారాగణంతో భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో శృతిహాసన్ నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు ఒక పోస్టర్‌ను విడుదల చేశాయి కూడా. ఇందులో ఆమె పాత్ర చాలా శక్తివంతమైనదిగా తెలుస్తోంది. చిత్రంలో ఆమెకు ఫైట్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. అందుకోసం ఆమె ఆత్మరక్షణ విద్య అయిన కర్రసాములో శిక్షణ పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయో సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అందులో ఆమె తన తండ్రి, ప్రఖ్యాత నటుడు కమలహాసన్ కూడా ఇంతకు ముందు దేవర్‌మగన్ (క్షత్రియ పుత్రుడు) చిత్రంలో కర్రసాము విద్యను ప్రదర్శించారని, అలాగే తానూ ఈ ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈమె వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
15 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్న శృతి హాసన్..
-
పాఠాలు నేర్పినవారందరికీ ధన్యవాదాలు
హీరోయిన్గా పదిహేనేళ్ల విజయవంతమైన కెరీర్‌ని పూర్తి చేసుకుంటూ, ఇంకా అగ్రశ్రేణి హీరోయిన్ల జాబితాలో ఒకరిగా రాణిస్తుండటం అంటే అంత సులభమైన విషయం కాదు. ఈ లిస్ట్‌లో చాలా తక్కువమంది హీరోయిన్లు ఉంటారు. తాజాగా శ్రుతీహాసన్ పేరు ఈ లిస్ట్‌లో చేరింది. తండ్రి కమల్‌హాసన్ నటించిన ద్విభాషా (తమిళం, హిందీ) చిత్రం ‘హే రామ్’ (2000)లో చైల్డ్ ఆర్టిస్టుగా తొలిసారి స్క్రీన్‌పై కనిపించారు శ్రుతీహాసన్. చైల్డ్ ఆర్టిస్టుగా మరో సినిమా చేయలేదు కానీ.. ‘హే రామ్’ రిలీజైన తొమ్మిదేళ్లకు హిందీ చిత్రం ‘లక్’ (2009)తో కథానాయికగా కెరీర్‌ను ఆరంభించారు శ్రుతి.ఆ తర్వాత సూర్య ‘సెవెన్త్ సెన్స్’, ధనుష్ ‘త్రీ’, రామ్‌చరణ్ ‘ఎవడు’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ రవితేజ ‘క్రాక్’ .. ఇటీవల చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ప్రభాస్ ‘సలార్: సీజ్ఫైర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు శ్రుతి. నటిగా–గాయనిగా–సంగీత దర్శకురాలిగా... ఇలా మల్టీ టాలెంట్‌తో దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్. కథానాయికగా పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రుతీహాసన్ స్పందిస్తూ – ‘‘అప్పుడే పదిహేనేళ్లు పూర్తయ్యాయంటే నమ్మశక్యంగా లేదు.నేను పెరిగిన మ్యాజికల్ ఇండస్ట్రీలోనే ఇంతకాలం నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మిగతా జీవితాన్ని కూడా ఇండస్ట్రీతోనే ముడివేస్తాను. ఇండస్ట్రీలో నాకు అందమైన పాఠాలు నేర్పినవారందరికీ ధన్యవాదాలు. అలాగే నన్ను ఆదరించిన ప్రేక్షకులు, నా అభిమానులకు థ్యాంక్స్. వీళ్లే లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు’’ అన్నారు. రజనీకాంత్ ‘కూలీ’, ప్రభాస్ ‘సలార్: శౌర్యంగాపర్వం’, అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రాల్లో నటిస్తున్నారు శ్రుతీహాసన్. -
హారర్ మూవీకి సై
గ్లామర్, డీ–గ్లామర్... ఏ పాత్రని అయినా సునాయాసంగా చేసేస్తారు శ్రుతీహాసన్. అయితే ఇప్పటివరకూ సినిమా మొత్తం పూర్తిగా తన చుట్టూ తిరిగేలా ఉన్న కథల్లో ఈ బ్యూటీ కనిపించలేదు. అంటే... పూర్తి స్థాయి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ శ్రుతీహాసన్ చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు ఏకంగా కథానాయిక ్రపాధాన్యంగా సాగే రెండు చిత్రాల్లో ఆమె కనిపించే చాన్స్ ఉంది. ఒకటి ‘చెన్నై స్టోరీ’. ఈ సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.అయితే ఈ సినిమా నుంచి శ్రుతి తప్పుకున్నారనే వార్త కూడా ఉంది. ఆ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ విషయానికొస్తే... శ్రుతీహాసన్ హీరోయిన్గా యూవీ క్రియేషన్స్ బేనర్ ఈ సినిమానిప్లాన్ చేస్తోందట. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుందని, పూర్తి స్థాయి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని సమాచారం. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి... వార్తల్లో ఉన్న ప్రకారం యూవీలో సినిమాకి శ్రుతీహాసన్ సై అన్నారా? అనేది నిర్మాణ సంస్థ కానీ శ్రుతి కానీ చెబితేనే తెలుస్తుంది. -
రజనీకాంత్ కూలీలో శృతిహాసన్
కూలీ చిత్రం చాలా కాస్ట్లీ గురూ అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అదేవిధంగా జరుగుతోంది. నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కూలీ. ఇది ఆయన నటించే 171వ చిత్రం అవుతుంది. లోకేష్‌కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇది అండర్‌వరల్డ్ డాన్ల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా ఈ చిత్రం ప్రారంభానికి ముందే యూనిట్ వర్గాలు ఫస్ట్‌లుక్, టైటిల్ ప్రోమోలను విడుదల చేసి కూలీ చిత్రంపై పెద్ద ఎత్తున హైప్ తీసుకొచ్చారు. దర్శకుడు లోకేష్నకరాజ్ కూడా హడావుడీగా చిత్రం షూటింగ్‌కు వెళ్లకుండా కథ, కథనాల కోసం తగినంత టైమ్ తీసుకుని పకడ్బందీగా షూటింగ్‌ను ప్రారంభించారు. అలా జూన్ నెలలో ప్రారంభం కావాల్సిన కూలీ ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో ఎలాంటి హంగామా లేకుండా ప్రారంభమైంది. అయితే ఈ నెల 10వ తేదీన చెన్నైలో రెండో షెడ్యూల్ షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. అలా కూలీ చిత్రాన్ని హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో నిర్వ హించాలని దర్శకుడు ప్రణాళికను రచించినట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రం చాలా రేర్ కాంబినేషన్లో తెరకెక్కడం విశేషం. రజనీకాంత్, లోకేష్కనకరాజ్ల కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. ఇకపోతే చాలా సంవత్సరాల తరువాత నటుడు సత్యరాజ్, రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ఇది. అలాగే ఇందులో లోకనాయకుడి వారసురాలు, సంచలన క్రేజీ నటి శృతిహాసన్ తొలిసారిగా రజనీకాంత్‌తో కలిసి నటించడం మరో విశేషం. అయితే ఇందులో ఆమె కథానాయకిగా కాకుండా, చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. అయితే సమీపకాలంలో ఈమె నటిస్తున్న భారీ బడ్జెట్ కథా చిత్రం ఇదే అవుతుంది. అలాగే బిగిల్ చిత్రం ఫేమ్ నటి రెబా మోనిక మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక యువ సంగీత తెరంగం అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా కూలీ చిత్రాన్ని ఈ ఏడాది చివరికంతా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో తెరపైకి తీసుకువచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. -
పెళ్లి చేసుకోను సార్
అమ్మాయిలను వారి పెళ్లి గురించి అడగడం మానుకోండి అంటున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఇంతకీ విషయం ఏంటంటే.. వీలైనప్పుడల్లా సోషల్ మీడియా మాధ్యమాల్లో నెటిజన్లతో చాట్ సెషన్ నిర్వహించడం శ్రుతీహాసన్‌కు అలవాటు. ఇటీవల మరోసారి ఈ బ్యూటీ చాట్ సెషన్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా... ‘మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు?’ అని ఓ నెటిజన్ అడిగితే శ్రుతీహాసన్ కాస్త గట్టిగానే బదులిచ్చారు.‘‘ఇది 2024... అమ్మాయిలను ఇలాంటి ఉపయోగం లేని వెర్రి ప్రశ్నలు అడగడం మానుకోండి’’ అంటూ బదులిచ్చారామె. అలాగే ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మేడమ్’ అని మరో నెటిజన్ శ్రుతీహాసన్‌ను ప్రశ్నించగా... ‘ఐ వోన్ట్ సార్’ (చేసుకోను సార్) అని బదులిచ్చారు. అంటే... పెళ్లి చేసుకోనని సూటిగా చెప్పేశారు. ఇక సినిమాల విషయానికొస్తే... అడివి శేష్‌తో ‘డెకాయిట్’ సినిమా చేస్తున్నారు. అలాగే ప్రభాస్‌తో ‘సలార్ 2’, తమిళంలో ‘చెన్నై స్టోరీ’ సినిమాలు కూడా శ్రుతి చేతిలో ఉన్నాయి. -
మాజీ ప్రేమికుల కథ
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్నపాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ‘డెకాయిట్’తో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్‌కి జోడీగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు శ్రుతీహాసన్. ఈ విషయాన్ని తెలియజేస్తూ... శేష్, శ్రుతి సరదాగా దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘‘ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డెకాయిట్’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు, ఓ యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
హృదయ తలుపు మూసేశా.. బ్రేకప్ సాంగ్ పాడిన శృతిహాసన్
‘నా డోర్స్ మూసేశాను. కీ అంటేనే అసహ్యం’ అని హీరోయిన్ శృతిహాసన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలైన ఈమె తన తండ్రి నటించిన హేరామ్ చిత్రంతో బాల నటిగా రంగప్రవేశం చేశారు. 2009లో లక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 2011లో 7 ఆమ్ అరివు (సెవన్త్ సెన్స్) చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.తెలుగులో ఎక్కువ సక్సెస్అయితే ఆ తరువాత నుంచి శృతిని తమిళ సినీ పరిశ్రమ కంటే తెలుగు సినీ పరిశ్రమే ఎక్కువగా ఆదరిస్తూ వస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్‌బాబు, రవితేజ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకున్నారు. ఇటీవల సలార్‌తో సక్సెస్ అందుకోగా ఇనిమేల్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌తో కలిసి నటించి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు కూతురిగా నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మింగిల్ అవ్వాలనుకోవడం లేదుఇకపోతే శృతిహాసన్‌కు ప్రేమ అచ్చిరాలేదనుకుంటా.. ఇప్పటికే రెండుసార్లు ప్రేమ వ్యవహారంలో విఫలం అయిన శృతిహాసన్ తాజాగా శాంతను హజారికా అనే టాటూ కళాకారుడికి బ్రేకప్ చెప్పిందని సమాచారం. దీంతో తాను ప్రస్తుతం సింగిల్‌నే అని.. మింగిల్ అవ్వాలనుకోవడం లేదని పేర్కొన్నారు. తాజాగా ‘ఐ షట్ ద డోర్. అండ్ ఐ ఈట్ ద కీ. ఐ వోంట్ బీ నీడింగ్ దట్ మీ ఎనీమోర్’ అంటూ ప్రేమలో ఓడిపోయిన వారు పాడుకునేలాంటి పాటను పోస్ట్ చేశారు. హృదయ తలుపులు మూసేశానని, ప్రేమ అనే తాళంతో దాన్ని తెరవాలనుకోవడం లేదని శృతి హాసన్ పాట రూపంలో పాడుతుందన్నమాట! View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్ -
Shruti Haasan: మత్తెక్కించే చూపులతో పిచ్చెక్కిస్తున్న శ్రుతి.... లేటెస్ట్ అవుట్ ఫిట్ అదుర్స్ (ఫోటోలు)
-
శ్రుతి హాసన్‌తో బ్రేకప్.. సారీ అంటూ క్లారిటీ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన బాయ్‌ఫ్రెండ్ శాంతాను హజారికా రియాక్ట్ అయ్యాడు. గత కొద్దిరోజులుగా జంట డేటింగ్లో ఉన్నారు. కానీ, శృతి, శాంతాను ఇద్దరూ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఒకరినొకరు ఫాలో అవడం మానేశారు. దీంతో వీళ్ల బ్రేకప్ వార్తలు బయటకొచ్చాయి.ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ 'శాంతాను హజారికా'తో శ్రుతి హాసన్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఆమె కొంత కాలం క్రితం క్లారిటీ ఇచ్చింది. అయితే బ్రేకప్ వార్తలు వైరల్ అయిన తర్వాత శ్రుతి హాసన్ నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు.కానీ, శాంతాను హజారికా తాజాగా తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. "నన్ను క్షమించండి, నేను దానిపై వ్యాఖ్యానించదలచుకోలేదు" అని శాంతను బాంబే టైమ్స్‌తో అన్నాడు. వారిద్దరూ స్నేహపూర్వకంగానే విడిపోయారని ఖచ్చితమైన సమాచారం ఉందంటూ కథనాలు వస్తున్నాయి. "వ్యక్తిగత విభేదాలు ఉన్నందున, వారు స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు" అని అంతర్గత వ్యక్తి పేర్కొన్నట్లు ఆ పత్రిక తెలిపింది.శ్రుతి విడిపోవడం గురించి రియాక్ట్ కాలేదు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో "ఇది ఒక క్రేజీ రైడ్.., నా గురించే కాకుండా ఇతర వ్యక్తుల గురించి చాలా నేర్చుకున్నాను" అని షేర్ చేసింది. ఆపై బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న పోటోలు, పోస్ట్‌లను కూడా ఆమె తొలగించింది. శాంతనుకు ముందు లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో ప్రేమలో పడింది శృతి.. అతడి కొంతకాలం డేటింగ్ అనంతరం సడన్‌గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. మళ్లీ ఈ లవ్ స్టోరీకి కూడా ఫుల్స్టాప్ పడినట్లు అయింది. -
డిటెక్టీవ్‌గా అక్కడ ఎంట్రీ ఇస్తున్న శృతిహాసన్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ సినీ కేరీర్‌ను చూస్తే నటిగా, సంగీత దర్శకురాలిగా, గాయనీగా, గీత రచయితగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 14 ఏళ్ల వయసులోనే తన తండ్రి కమలహాసన్ కథానాయకుడిగా నటించిన హేరామ్ చిత్రంలో బాల నటిగా రంగప్రవేశం చేసిన శృతిహాసన్ ఆ తరువాత లక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తమిళంలో ఏళాం అరివు (7th సెన్స్) చిత్రంలో సూర్యకు జంటగా నటించి గుర్తింపు పొందారు. అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్న శృతిహాసన్ ఇప్పుడు హాలీవుడ్ చిత్రంలో నటించే స్థాయికి ఎదిగారు. చైన్నె స్టోరీ అనే అంతర్జాతీయ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రంలో నటించే లక్కీఛాన్స్‌ను నటి సమంత పొందారు. అయితే ఆమె మైయోసిటీస్ అనే అరుదైన వ్యాధికి గురి కావడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు. దీంతో ఆ అదృష్టం శృతిహాసన్‌ను వరించింది. ఇది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాస్య నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో శృతిహాసన్ అనూ అనే లేడీ డిటెక్టీవ్‌గా నటిస్తున్నారు. కాగా ఈమె ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. హాలీవుడ్ చిత్రంలో నటించడం తన మనసుకు ఉత్సాహాన్నిస్తోందని ఆమె ఒక భేటీలో పేర్కొన్నారు. -
మా జంట నాన్నకు నచ్చింది: శృతిహాసన్
నటి శృతిహాసన్‌ను చూస్తే పులి కడుపున పులిబిడ్డే పుడుతుందన్న సామెత నిజం అనిపిస్తుంది. కమలహాసన్‌కు చిత్ర పరిశ్రమలో సకల కళా వల్లభుడు అనే పేరు ఉంది. ఈ విషయంలో ఆయన వారసురాలు శృతిహాసన్ కూడా సరిగ్గా సెట్ అవుతుంది. ఈమె బాలీవుడ్లో లక్ చిత్రం ద్వారా కథానాయకిగా నటించి అప్పుడే సంచలన నటిగా ముద్రవేసుకున్నారు. ఆ తరువాత సంగీత రంగంలోకి ప్రవేశించి తన తండ్రి కథానాయకుడిగా నటించిన ఉన్నైపోల్ ఒరువన్ (తెలుగులో ఈనాడు) చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తూనే సంగీతం పైనా దృష్టి సారిస్తున్నారు. ఈమె పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. శృతిహాసన్‌లో గీత రచయిత, మంచి గాయని కూడా ఉన్నారు. కాగా తాజాగా ఇనిమేల్ అనే ప్రైవేట్ ఆల్బమ్ కోసం ఆంగ్లమ్లో ఒక పాటను రాశారు. అనంతరం ఆ పాటను తమిళంలోకి నటుడు కమలహాసన్ అనువదించి తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించగా దానికి నటి శృతిహాసన్ సంగీత బాణీలు కట్టి పాడి నటించారు. ఈ ఆల్బమ్‌లో ప్రస్తుత క్రేజీ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ శృతిహాసన్‌తో కలిసి నటించడం విశేషం. ఇది ఒక రొమాంటిక్ ఆల్బమ్ ఆన్నది గమనార్హం. ఇటీవల విడుదల చేసిన ఈ ఆల్బమ్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతకంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. కాగా తాజాగా ఇనిమేల్ ఆల్బమ్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక మాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో నటి శృతిహాసన్, దర్శకుడు లోకశ్కనకరాజ్ పాల్గొన్నారు. నటి శృతిహాసన్ మాట్లాడుతూ 4 నిమిషాల్లో ఒక జంట రిలేషన్‌షిప్‌లోని భావాలను ఆవిష్కరించే ఆల్బమ్‌గా ఇనిమేల్ ఉంటుందన్నారు. రిలేషన్షిప్ అనేది ఎలా ఒక లూప్గా మారుతోంది, అందులోని అప్స్ అండ్ డౌన్స్‌ను ఈ పాట ద్వారా చెప్పదలచానన్నారు. ఈ ఆల్బమ్ చూసిన ప్రేక్షకులు తమ రిలేషన్ఫిప్లోని లోపాలను సరిదిద్దుకుంటారనే నమ్మకంతో రూపొందించినట్లు చెప్పారు. తాను చిన్నతనం నుంచే సంగీతంతో పయనిస్తున్నానని, అది తన అదృష్టం అని పేర్కొన్నారు. సినీ సంగీతం అనేది ఒక మాన్స్టర్ అని, అందులో ప్రైవేట్ ఆల్బమ్స్ అనేవి 30 శాతం అయినా ఉండాలని భావించానన్నారు. ఇనిమేల్ ఆల్బమ్‌కు ఇంత ప్రచారం రావడానికి కారణం తన తండ్రి, రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అని పేర్కొన్నారు. దర్శకుడు లోకేశ్కనకరాజ్ను విక్రమ్ చిత్ర షూటింగ్ సమయంలో కెమెరాలో చూశానన్నారు. ఈయన రూపం బాగానే ఉందనిపించిందన్నారు. అలా ఆయన ఈ ఆల్బమ్‌లోకి వచ్చారన్నారు. ఎంతో మంది అభిమానులు కలిగిన దర్శకుడు ఇందులో నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రేమను ఒక డెల్యూషన్ అంటారని, అది పరిపూర్ణం కాకపోతే మాయగానే అసహనంగా మారుతుందని, అదే పరిపూర్ణం అయితే ఆ మూవెంట్ డ్రీమ్స్ కమ్ ట్రూ అవుతుందని అన్నారు. అదే డెల్యూషన్ నుంచి సొల్యూషన్ వైపునకు సాగే ప్రేమ పయనం అవుతుందన్నారు. ఈ విషయాన్నే ఇనిమేల్ ఆల్బమ్‌లో చూపించినట్లు చెప్పారు. ఇందులో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌తో తాను నటించడం సంతోషకరమన్నారు. తమ జంట తన తండ్రి కమలహాసన్‌కు నచ్చిందని శృతిహాసన్ పేర్కొన్నారు.