తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూ అప్పుడప్పుడు చాలా ఫన్ చేస్తూ ఉంటుంది.
ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ నెటిజన్స్‌తో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా చిట్ చాట్ నిర్వహించింది ముద్దుగుమ్మ. ఈ చిట్ చాట్‌లో నెటిజన్స్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతుంటారు. హద్దులు మీరి ప్రశ్నలు వేస్తుంటారు. అలా ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో కౌంటరిచ్చింది శృతిహాసన్.
కొందరు నెటిజన్స్ చిన్నప్పటి ఫోటో పెట్టమని అడగ్గా.. మరొకరు ఎర్ర డ్రెస్సులో ఉన్న ఫోటో.. అలాగే బాయ్ ఫ్రెండ్ శంతన హజారికాతో ఉన్న ఫోటో పెట్టమని అడిగారు. అలా అన్ని ఫోటోలను షేర్ చేసిన శ్రుతి హాసన్‌కు.. ఓ నెటిజన్ చాలా వింత ప్రశ్నవేశాడు. నీ పాదాల ఫోటో పెట్టు పెట్టు అని అడిగాడు. అయితే అతనికి శృతి తనదైన శైలిలోనే స్పందించింది. ఏదో ఒక ఏలియన్‌ను పోలిన పాదాల ఫోటోను పెట్టింది. దీంతో నెటిజన్‌కు వింత ప్రశ్నకు తగిన బుద్ది చెప్పింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు బై అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment