Shruti Haasan: ఆ ఏడాది నాకు అత్యంత గడ్డుకాలం: శృతిహాసన్ | Shruti Haasan remines about hard times in 2012 as she shares a pic in goth look | Sakshi
Sakshi News home page

Shruti Haasan: నా జీవితంలో అలాంటి మార్పులు ఊహించలేదు: శృతిహాసన్

Published Wed, Feb 8 2023 12:59 PM | Last Updated on Wed, Feb 8 2023 1:14 PM

Shruti Haasan remines about hard times in 2012 as she shares a pic in goth look - Sakshi

శ్రుతి హాసన్ పేరు సౌత్ సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌లోనూ అగ్రహీరోల సరసన నటించింది కోలీవుడ్ భామ. ఇటీవలే చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలతో అభిమానులను పలకరించింది. ఆ తర్వాత ప్రభాస్ సరసన సలార్‌లోనూ కనిపించనుంది. సౌత్‌లో దూసుకెళ్తున్న శృతి హాసన్ తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో వెల్లడించింది. 

 శ్రుతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. '2012లో ఎదురైన కష్ట సమయాలను గుర్తు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ చిత్రాన్ని పంచుకుంది. ఈ చిత్రం 2012 నాటిది. ఇది వ్యక్తిగతంగా నాకు మంచి జరగలేదు. నా వృత్తిపరంగా చాలా మార్పులు జరుగుతాయని నాకు తెలియదు. అయితే ప్రజలకు దీని గురించి చెప్పాలనుకుంటున్నా. నా జీవితంలో అప్పుడు నకిలీ వైపే బలమైన గాలి వీచింది. అప్పుడు నాలో ఎప్పుడూ మండే మంటలో ఒక బాధ ఉంది. ఎల్లప్పుడూ నేను భవిష్యత్తు ఏదో వెతుకుతూ ఉండేదాన్ని. కలల కోసం ఇంకా ఏదో నేర్చుకోవాలి అని ఆలోచించేదాన్ని. నిశ్శబ్దం అనేది చాలా హింసాత్మకంగా ఉంటుది. ఇది నిజం' అంటూ పోస్ట్ చేసింది. 2012లో కష్ట సమయాలను గుర్తు చేసుకుంటూ గోత్ లుక్‌ని షేర్ చేసింది. 

కాగా.. శృతిహాసన్ ప్రశాంత్ నీల్ రాబోయే యాక్షన్ చిత్రం సాలార్‌లో ప్రభాస్‌ సరసన కనిపించనుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, మధు గురుస్వామి, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement