kollywood actress
-
ఈ సినిమా నా జీవితాన్ని మార్చేసింది: డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్
హీరోయిన్ కయాదు లోహార్ ఇటీవలే డ్రాగన్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. 21 ఏళ్ల వయసులోనే కన్నడ సినిమా ముగిల్‌పేటతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత మలయాళంలో పథోన్పత్తం నూత్తాండు అనే చిత్రంలో అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో 2022లోనే శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతే కాకుండా మరాఠీ భాషలోనూ ప్రేమ్ యు అనే చిత్రంలో కనిపించింది. దక్షిణాది అన్ని భాషల్లో అడుగుపెట్టిన డ్రాగన్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుందిం. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.డ్రాగన్ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని చెబుతోంది ఈ అస్సాం బ్యూటీ. ఈ సందర్భంగా డైరెక్టర్, హీరోతో పని చేసిన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రదీప్ రంగనాథన్ లాంటి కో స్టార్‌తో పని చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ మూవీతో నాకు నిజమైన స్నేహితుడు దొరికాడని సంతోషం వ్యక్తం చేసింది. అయితే మొదట ఈ సినిమాలో ఛాన్స్ రాదేమోనని బాధపడ్డానని కయాదు లోహర్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్ చేసింది.కయాదు లోహర్ ఇన్‌స్టాలో రాస్తూ..'మొదట జూమ్ కాల్లో డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు కీర్తి క్యారెక్టర్‌కు సంబంధించిన కథ చెప్పారు. అది విని చాలా ఉత్సాహంగా ఉన్నా. కానీ ఆ తర్వాత అతని నుంచి నాకు రిప్లై రాలేదు. దీంతో నేను ఆ ప్రాజెక్ట్‌ను కోల్పోయానేమో అని కొంచెం బాధపడ్డా. కానీ ఒక నెల తరువాత అశ్వత్ మళ్లీ నాతో టచ్‌లోకి వచ్చారు. రెండోసారి పల్లవి పాత్ర కోసం నాకు నేరేషన్ ఇచ్చారు. నేరేట్ చేయడం పూర్తి చేసిన తర్వాత మీటింగ్ ముగించి ఆయన వెళ్లిపోవడంతో కాస్త కంగారు పడ్డా. కానీ 5 నిమిషాల్లోనే తిరిగి వచ్చి పల్లవిగా నిన్ను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయని' తెలిపింది.ఆ తర్వాత తాను పల్లవి పాత్రలో అద్భుతంగా చేసి చూపిస్తానని ఆయనకు ప్రామిస్ చేశా.అశ్వత్ మరిముత్తు సినిమాలో స్త్రీ పాత్రలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఈ కథను రెండుసార్లు విని.. పల్లవి పాత్రను అర్థం చేసుకున్న తర్వాత ఈ చిత్రంలో భాగమయ్యే అవకాశాన్ని కోల్పోకూడదని నిర్ణయించుకున్నా. పల్లవి పాత్ర నాకు ఇచ్చినందుకు అశ్వత్‌కు ధన్యవాదాలు. నాకు అద్భుతమైన పాత్రతో అరంగేట్రం ఇచ్చినందుకు. మీకు నటుల పట్ల మీకు ఉన్న ప్రేమ, వారికి ఉత్తమమైన పాత్రలు అందించడం, వేరే దేని గురించి ఆలోచించకుండా పూర్తిగా సినిమాపై ప్రేమ పని చేస్తారు. ఈ విషయంలో మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని' పోస్ట్ చేసింది. ప్రదీప్ రంగనాథన్ గురించి రాస్తూ..' ప్రదీప్ లాంటి కో స్టార్ దొరకడం చాలా అరుదు. ఈ సినిమాతో నాకు నిజమైన స్నేహితుడు లభించాడు. అతని అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు నా మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మేమిద్దరం సెట్లో మాట్లాడుకోవడం.. కథ గురించి చర్చించుకోవడం.. మా ఇద్దరి మనస్సులో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ప్రదీప్ సార్ మీరు సూపర్ టాలెంటెడ్.. అద్భుతమైన నటుడు మీరు' అంటూ హీరోపై ప్రశంసలు కురిపించింది. View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) -
25 ఏళ్ల మా బంధానికి ఆయన ఆశీస్సులే కారణం: ఖుష్బు సుందర్
సీనియర్ నటి ఖుష్బు సుందర్ అప్పట్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ పలు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపిస్తోంది. కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. సినిమాల్లో నటిస్తూనే 2000వ సంవత్సరంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. హీరో, డైరెక్టర్ అయిన సుందర్‌ను ఆమె పెళ్లాడింది.తాజాగా ఇవాళ తమ 25వ వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు ఖుష్బు - సుందర్ దంపతులు. ఈ సందర్భంగా ప్రముఖ మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఖుష్బు సుందర్న్తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ ప్రత్యేకమైన రోజున తన వెడ్డింగ్ శారీని ధరించినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.I very proudly wear my wedding saree on my 25th anniversary today. I added few borders to give a twist. We couldn't have asked for a better way to start our day than taking the blessings of ##LordMuruga in Palani. What we have today wouldn't be possible without the blessings of… pic.twitter.com/5JobnMNkdF— KhushbuSundar (@khushsundar) March 9, 2025 -
హనుమాన్ నటి బర్త్ డే.. గొప్ప మనసు చాటుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్
హనుమాన్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో చోటు సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్‌కుమార్. టాలీవుడ్లో బాలయ్య మూవీ వీరసింహారెడ్డిలోనూ తనదైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ నెల 5న ఆమె పుట్టినరోజు కావడంతో తన గొప్ప మనసును చాటుకున్నారు.వరలక్ష్మి తన బర్త్ డే సందర్భంగా అనాథ చిన్నారుల్లో సంతోషం నింపారు. హైదరాబాద్‌లోని లెప్రా సోసైటీ అనాథాశ్రమానికి వెళ్లిన వరలక్ష్మీ తన భర్త నికోలయ్ సచ్దేవ్తో పాటు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందించారు. అంతేకాకుండా ఆశ్రమానికి తనవంతుగా ఆర్థికసాయం అందజేశారు. సెలబ్రిటీలు వస్తే అనాథాశ్రమం గురించి ప్రజలకు తెలుస్తుందనే మంచి ఉద్దేశంతోనే వచ్చానని వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. -
ఆ పనుల నుంచి బయటకు రండి: రకుల్ ప్రీత్‌సింగ్
ఈతరం ప్రేక్షకులను సైతం అలరిస్తున్న నటి రకుల్‌ప్రీత్‌సింగ్(Rakul Preet Singh ). ఇంతకుముందు దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా వెలిగిన ఈ బ్యూటీ తమిళంలో తడైయరతాక్క చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఎన్నమో ఎదో, ధీరన్ అధికారం ఒండ్రు, దేవ్, ఇండియన్ 2, అయలాన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అదేవిధంగా తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా పేరు పొందారు. ప్రస్తుతం హిందీ చిత్రాలపైనే పూర్తి దృష్టి పెడుతున్న ఈ భామ తాజాగా అజయ్‌దేవగన్, మాధవన్‌లతో కలిసి దే దే ప్రాయ్ దే–2 చిత్రంలో నటిస్తున్నారు.ఇక తమిళంలో కమలహాసన్‌తో కలిసి నటించిన ఇండియన్–3 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్‌సింగ్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక పోస్ట్ చేశారు. అందులో అలవాటైన పనుల నుంచి, ప్రాంతాల నుంచి బయటకు రండి. సౌకర్యంగా అలవాటైన ప్రాంతమే మీకు విరోధి. అలవాటైన ప్రాంతం అందంగా ఉంటుంది. అయితే అది మిమ్మల్ని ఏ విషయంలోనూ ఎదగనీయదు అని ఎవరో చెప్పారు. ప్రజలు సోంబేరితనంగా మారడానికి కారణం వారికి అన్నీ రేపే కావాలి భావించడమే. ఎందుకంటే వారు తాము ఉన్న ప్రాంతాల్లో సౌకర్యంగా ఉండడమే. ఒక పనిచేయడం నుంచి మారాలనుకోవడం లేదు. నిత్యం చేసే పని మీకు సులభంగా ఉండవచ్చు. అయితే అది మిమ్మల్ని ఎదగనీయదు. ఎదగాలంటే మీరు అలవాటైన ప్రాంతం నుంచి బయటకు రావాలి. కఠినమైన విషయాలను చేయాలి. నా స్వభావం చాలా బలమైనది. అధికంగా నేను ప్రేమించుకుంటాను. కొత్తదనాన్ని కోరుకునే వ్యక్తిని నేను అని రకుల్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
'పెళ్లి’ ఆశతో ప్రేమలో పడ్డాం.' వనితా విజయ్‌కుమార్ లవర్స్ డే స్పెషల్!
తమిళ నటి వనిత విజయకుమార్ గురించి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. 1995లో 'చంద్రలేఖ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమె పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఓ సినిమాతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ. అయితే తెలుగులో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించిన వనితా ఈ లవర్స్ డే కానుకగా థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.అయితే వనితా విజయ కుమార్, కొరియోగ్రాఫర్ రాబర్ట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గతేడాది అక్టోబర్‌లో వార్తలొచ్చాయి. బీచ్‌లో అతనికి ప్రపోజ్ చేస్తున్నట్లు ఫోటోలు షేర్ చేయడంతో అందరూ కూడా నాలుగో పెళ్లికి సిద్ధమైపోయిందని భావించారు. కానీ ఆ తర్వాత మూవీ ప్రమోషన్స్ కోసమే పోస్టర్ రిలీజ్ చేశారని తెలిసింది.తాజాగా తన మూవీ ప్రమోషన్లలో భాగంగా మరో పోస్టర్‌ను విడుదల చేసింది. మిసెస్ అండ్ మిస్టర్ సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. 'పెళ్లి చేసుకోవాలనే ఆశతో ప్రేమలో పడ్డాం.. కలకాలం కలిసి జీవించాలనే ఆశతో పెళ్లి చేసుకున్నాం.. అరుణ్, విద్యాల ప్రపంచంలో ఏం జరిగింది...? అంటూ లవ్ కోటేషన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన కొందరు మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగంగానే చేసినప్పటికీ పెళ్లికి సంబంధించిన పోస్టర్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో పెళ్లి కూతురిలా రెడీ అయిన వనితా విజయ్ కుమార్‌ను చూసిన కొందరు అభిమానులు ఫిదా అవుతున్నారు.నాలుగో పెళ్లిపై రూమర్స్..గతేడాది అక్టోబర్‌లో నాలుగో పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. ఇలానే ఓ కొరియోగ్రాఫర్ రాబర్ట్‌కు ప్రపోజ్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేయడంతో పెళ్లికి రెడీ అయిపోయిందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో నోరెళ్లబెట్టారు. తాజా పోస్టర్ చూసిన కొందరు నెటిజన్స్ మరోసారి పెళ్లి గురించి చర్చ మొదలెట్టారు. ఏదేమైనా సినిమా ప్రమోషన్స్ కంటే ఆమె పెళ్లి గురించి ఎక్కువ చర్చించుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Vanitha (@vanithavijaykumar) -
ఓటీటీకి వచ్చేసిన త్రిష థ్రిల్లర్.. వారం రోజుల్లోనే ఎంట్రీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పెద్దగా కనిపించట్లేదు. గతేడాది విజయ్ సరసన ది గోట్ చిత్రంలో కనిపించిన త్రిష.. ప్రస్తుతం అజిత్ కుమార్ మూవీ విదాముయార్చితో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఇదిలా ఉండగా.. త్రిష మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. మాలీవుడ్‌లో ఐడెంటిటీ అనే మూవీలో నటించింది. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో టొవినో థామస్ హీరోగా నటించారు. సంక్రాంతికి కానుకగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు.మలయాళంలో హిట్ టాక్ రావడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. జనవరి 24న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజైంది. ఈ మూవీకి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోయింది. రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ. 18 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.వారంలోనే ఓటీటీకి..గత శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 31 నుంచే జీ5 వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ చిత్రంలో హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. -
రాజకీయాల్లోకి వస్తానంటోన్న హీరోయిన్.. ఆమెనే ఆదర్శం!
సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని వేరుచేసి చూడలేం. నటులే కాదు.. నటీమణులు కూడా రాజకీయ రంగప్రవేశానికి సై అంటున్నారు. ఈ మధ్య నటి త్రిష ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. తాజాగా మరో హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమంటోంది. దక్షిణాదిలో ఓ రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న ఆ నటి ఎవరో తెలుసుకుందాం.తాజాగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తానూ రాజకీయాల్లోకి వస్తానని అంటోంది. తెలుగులో గతేడాది హనుమాన్తో మెప్పించిన వరలక్ష్మి శరత్‌కుమార్ దక్షిణాదిలో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది సచ్ దేవ్ నికోలయ్‌ను పెళ్లి చేసుకుని నటనను కొనసాగిస్తున్నారు.తాజగా విశాల్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నటి అంజలి హీరో, హీరోయిన్లుగా నటించిన మదగజరాజా చిత్రం 12 ఏళ్ల తరువాత సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలో కార్యక్రమంలో పాల్గొన్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీడియాతో ముచ్చటించారు.12 ఏళ్ల క్రితం నటించిన మదగజరాజా చిత్రం పొంగల్ సందర్భంగా తెరపైకి రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయని వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. పోడా పోడీ చిత్రం తరువాత తాను నటించిన రెండవ చిత్రం ఇదేనని చెప్పారు. కమర్శియల్ అంశాలతో కూడిన వినోదభరిత కథా సినిమా అన్నారు. పది ఏళ్లలో సినిమా చాలా మారిపోయిందన్నారు.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నెగెటివ్ కామెంట్స్‌పై వరలక్ష్మి స్పందిచారు. సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా వదంతులు ప్రచారం చేస్తున్తన్నారని అన్నారు. తాను ఒక సారి విమానాశ్రయంలో విమానం బయలుదేరే సమయం కావడంతో అత్యవసరంగా వెళుతుండగా పలువురు వచ్చి తనతో ఫొటోలను తీసుకున్నారన్నారు.అప్పుడు ఒకతను వచ్చి ఫొటో తీసుకుంటానని అడిగారన్నారు. కానీ నాకు సమయం మించి పోవడంతో తాను వద్దని చెప్పాన్నాననీ, దీంతో అతను తమతో ఫొటో తీసుకోనివ్వరా? మరి మీరెందుకు నటనలోకి వచ్చారని కామెంట్ చేశాడన్నారు. అలాంటి వారికి బుద్ధి లేదని, వారికి బదులివ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక రాజకీయ రంగప్రవేశం చేస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ కచ్చితంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని స్పష్టం చేశారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. తనకు స్ఫూర్తి దివంగత ముఖ్యమంత్రి జయలలిత అని అన్నారు. -
వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో అలాగేనా?.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!
టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ధనుశ్ హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు జంటగా రుచిత్రంబలం (తెలుగులో ‘తిరు’) మూవీలో నటించారు. ఈ సినిమాలో నటనకు గానూ నిత్యాకు జాతీయ ఉత్తమ నటి అవార్డ్‌ను దక్కించుకుంది. అంతేకాకుండా జయం రవి సరసన కాదలిక్క నెరమిళ్లై అనే సినిమాలో కనిపించనుంది. ఈ మూవీ సంక్రాంతి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.కాగా.. ఈ చిత్రానికి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన సతీమణి కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. తాజాగా చెన్నైలో ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ఓ ఈవెంట్‌కు హీరోయిన్ నిత్యామీనన్ కూడా హాజరైంది. అయితే ఈవెంట్లో నిత్యామీనన్ వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఆమె మాట్లాడుతుంగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ నిత్యా అతన్ని సున్నితంగా తిరస్కరించింది. దీంతో నిత్యామీనన్ తీరుపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఆమెది చెత్త బిహేవియర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కానీ అంతకుముందు ఇదే ఈవెంట్లో నిత్యా వ్యవహరించిన తీరు అందరిని షాకింగ్‌కు గురి చేస్తోంది. ఇదే ఈవెంట్లో నిత్యా మీనన్ దర్శకుడు మిష్కిన్‌ను ముద్దుపెట్టుకుంది. అంతేకాకుండా మూవీ హీరో జయం రవిని కూడా హగ్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఆమె చేసిన దాంట్లో తప్పేమీ లేకపోయినా.. ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇస్తే ఇవ్వరా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఫ్యాన్స్‌తో నిత్యా మీనన్ తీరు సరికాదంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: ప్రేమకు వ్యతిరేకం కాదు.. అలాంటి వ్యక్తికే నా లైఫ్‌లో చోటు: నిత్యా మీనన్)కాగా.. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు.జాతీయ అవార్డుకాగా తిరు సినిమాకుగానూ నిత్యామీనన్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా రాశీ ఖన్నా హీరోయిన్గా యాక్ట్ చేసింది. హీరో స్నేహితురాలిగా నిత్య ఆకట్టుకుంది. మిత్రన్ జవహర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైంది. నిత్య లేటెస్ట్ మూవీ కాదలిక్క నెరమిళ్లై విషయానికి వస్తే.. ఇందులో జయం రవి, వినయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. రెడ్ జియాంట్ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.తెలుగులో సినీ కెరీర్.. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది. Worst behaviour from #Nithyamenon !pic.twitter.com/8mmHTcYg4a— Kolly Censor (@KollyCensor) January 9, 2025 -
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
బిగ్ బాస్ బ్యూటీ, హీరోయిన్ సాక్షి అగర్వాల్ మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల స్నేహితుడు, ప్రియుడన నవనీత్‌తో ఏడడుగులు వేసింది. వీరి పెళ్లి వేడుకను గోవాలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. జనవరి 2న గోవాలోని ఒక విలాసవంతమైన హోటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. మా చిన్ననాటి స్నేహం ఇప్పుడు జీవితకాల బంధంగా మారిందని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. నవనీత్‌ను పెళ్లి.. నా కలను నిజం చేసిందని సంతోషం వ్యక్తం చేసింది.సాక్షి అగర్వాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'మా వివాహం ప్రేమ, సంప్రదాయం, కుటుంబం, సన్నిహితులతో కలిసిన జ్ఞాపకాల వేడుక. నవనీత్‌ని పెళ్లి చేసుకోవడంతో నా కల నిజమైంది. అతని అచంచలమైన మద్దతు నాకు ఎప్పుడు ఉంటుంది. అతని ప్రేమ, జ్ఞాపకాలు ఎప్పటికీ నాతో ఉంటాయి. మా జీవితంలో ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినప్పటికీ ఇప్పుడు సరికొత్త అధ్యాయం మొదలైనందుకు చాలా సంతోషిస్తున్నా' అని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు.(ఇది చదవండి: ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఇండియాలో ఎక్కడ చూడాలంటే?)కాగా.. సాక్షి అగర్వాల్ ఎక్కువగా తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది. మొదట మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన సాక్షి ఆ తర్వాత నటనలో అడుగుపెట్టింది. తమిళ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ తమిళ సీజన్-3లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇక సినిమాల విషయానికొస్తే కన్నడ చిత్రం హెద్దరి మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్లో అట్లీ తెరకెక్కించిన రాజా రాణి చిత్రంలో కీలక పాత్ర పోషించింది. శాండల్‌వుడ్‌లో సాఫ్ట్వేర్ గండా (2014) చిత్రంలో కనిపించింది. అంతేకాకుండా రజినీకాంత్ మూవీ కాలా (2018)లో నటించింది. అదే ఏడాది మలయాళంలో ఒరాయిరం కినక్కలాల్ (2018) చిత్రంలో కీ రోల్ పోషించింది. తమిళంలో సిండ్రెల్లా అనే హారర్ థ్రిల్లర్ చిత్రంలో సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించింది. ఆ తర్వాత అరణ్మనై- 3, భగీర లాంటి చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించింది. View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) -
వేకేషన్లో నమ్రతా, సితార చిల్.. తామరపువ్వులా తంగలాన్ బ్యూటీ!
కలర్‌ఫుల్ డ్రెస్సులతో లైగర్ భామ పోజులు..క మూవీ హీరోయిన్ తన్వీ రామ్ అలాంటి లుక్..వేకేషన్లో నమ్రతా, సితార చిల్..పెళ్లి వేడుకలో సందడి చేసిన శోభన, సుహాసిని..తామర పువ్వులాంటి అందంతో తంగలాన్ బ్యూటీ.. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) -
నయనతార డాక్యుమెంటరీ.. ఎవరికీ ఉపయోగం లేదన్న ప్రముఖ రచయిత!
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీ విడుదల తర్వాత వివాదం మొదలైన సంగతి తెలిసిందే. తన సినిమాలో మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వాడారని హీరో ధనుశ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరగనుంది.ఇదిలా ఉండగా నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీపై ప్రముఖ బాలీవుడ్ నవలా రచయిత్రి శోభా దే మండిపడ్డారు. తాను నయనతార డాక్యుమెంటరీని చూశానని.. కానీ అందులో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఏమీ లేవన్నారు. ప్రోమోలు చూసే వరకు నయనతార గురించి నాకు పూర్తిగా తెలియదని.. అందుకే ధైర్యం చేసి 45 నిమిషాల డాక్యుమెంటరీ చూసినట్లు తెలిపారు.(ఇది చదవండి: నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్)అయితే వివాహం లాంటి వ్యక్తిగత విషయాలను డబ్బుల కోసం ఇలా డాక్యుమెంటరీ రూపొందించడం సరికాదని ఆమె విమర్శించారు. ఇందులో ఎలాంటి సందేశం లేదని అన్నారు. ఆమెను చూసి మరికొందరు సినీ తారలు డబ్బుల కోసం ఇదే పద్ధతిని పాటిస్తారేమో అంటూ విమర్శలు చేశారు. అయితే కొంతమంది శోభా దే వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.కాగా.. నయనతార రూపొందించిన ఈ డాక్యుమెంటరీ కేవలం తన వ్యక్తిగత, కెరీర్, వివాహం ఆధారంగా తీసుకొచ్చారు. విఘ్నేష్ శివన్‌తో ఆమె వివాహం గురించి ప్రధానంగా చూపించారు. ఈ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఫుటేజీని ఉపయోగించినందుకు రూ.10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shobhaa De (@shobhaade) -
స్టార్ జంటకు ఘోర అవమానం.. 30 నిమిషాలైనా ఎవరూ కూడా!
సినీతారలు రోడ్డు మీద కనపడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు. అంతేకాదు పోటీపడి మరీ వారితో ఫోటోలు దిగేందుకు వెనుకాడరు. సినీతారలకు ఉన్న క్రేజ్ అలాంటిది. బయట ఎక్కడైనా సినీ సెలబ్రిటీలు కనిపిస్తే ఇంకేముంది ఎంచక్కా వారితో సెల్ఫీ కోసం ఎగబడతాం. కానీ అందుకు భిన్నంగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో మీరు చూసేయండి.దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు ఉన్న సెలబ్రిటీ కపుల్ నయనతార- విఘ్నేశ్ శివన్. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్‌కు వెళ్లిన నయన్- విఘ్నేశ్ దాదాపు 30 నిమిషాల పాటు లైన్లోనే వెయిట్ చేసిన తర్వాత టేబుల్ దక్కించుకున్నారు. అయితే ఆ సమయంలో వీరిని అక్కడా ఎవరూ కూడా గుర్తు పట్టలేదు. అంతేకాదు వీళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అదే మనమైతే పక్కన పెట్టి ఫోటోల కోసం పోటీ పడేవాళ్లేమో. దీనికి సంబంధించిన వీడియోను విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'17 నవంబర్.. చాలా ఏళ్ల తర్వాత సింపుల్‌గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఇలా డిన్నర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. దాదాపు 30 నిమిషాలు లైన్లో ఉన్నాం. చివరికీ ఒక మంచి టేబుల్ దొరికింది. ఈ వీడియో తీసిన వ్యక్తికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు విఘ్నేష్, నయనతార తమ కుమారులతో కలిసి ఢిల్లీలోని కుతాబ్ మినార్ను సందర్శించారు. ఆ జంట రాజధానిలోని ఓ ఫేమస్ హోటల్‌కి వెళ్లారు. అక్కడ కూడా వారిని ఎవరూ గుర్తించలేదు.నయనతార ఇటీవల తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. ధనుశ్ హీరోగా నటించిన నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఓ క్లిప్‌ను ఉపయోగించినందుకు ఆమెకు రూ. 10 కోట్ల లీగల్ నోటీసు పంపారు. ఆ తర్వాత దీనిపై నయనతార ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
ధనుశ్- నయనతార వివాదం.. అప్పుడే పెళ్లిలో కలిశారు.. కానీ!
ప్రస్తుతం కోలీవుడ్‌ను కుదిపేస్తోన్న వివాదం ఏదైనా ఉందంటే అది ధనుశ్- నయనతారదే. ఇటీవల నయనతార లైఫ్ స్టోరీగా వచ్చిన డాక్యుమెంటరీ రిలీజైన తర్వాత ఈ వివాదం మొదలైంది. 2015లో ధనుశ్-నయన నటించిన నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.ఈ వివాదం మొదలైన తర్వాత కోలీవుడ్‌లో వీరిద్దరు ఒకరంటే ఒకరికీ అస్సలు పడటం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీ కొనసాగుతున్న టైమ్‌లో ఊహించని విధంగా ఇద్దరూ ఓకే వేదికపై మెరిశారు. తమిళ నిర్మాతల్లో ఒకరైన ఆకాశ్ భాస్కరన్ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకలో పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా.. కనీసం చూసుకోలేదు కూడా. ఈ పెళ్లికి నయన్ భర్త విఘ్నేశ్ శివన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా.. నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.#Dhanush & #Nayanthara together at the recent wedding of Producer AakashBaskaran pic.twitter.com/ulZDckjak8— AmuthaBharathi (@CinemaWithAB) November 21, 2024 #Dhanush & #Nayanthara today at a Marriage Function pic.twitter.com/xHURf15YJ6— Arun Vijay (@AVinthehousee) November 21, 2024 -
తెలుగువారిపై కామెంట్స్.. సినీ నటి కస్తూరికి రిమాండ్
తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఇవాళ ఆమెను చెన్నైలోనే ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుకాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది. (ఇది చదవండి: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్)క్షమాపణలు చెప్పిన కస్తూరిఅలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై చెన్నైలో నివసించే తెలుగు వారు మండిపడ్డారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలుగువారికి కస్తూరి క్షమాపణలు చెప్పింది. -
తెలుగువారిపై వివాదాస్పద కామెంట్స్.. కస్తూరికి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు!
ప్రముఖ నటి కస్తూరి తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో కస్తూరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.ముందస్తు బెయిల్ నిరాకరణ..ఈ కేసులో నటి కస్తూరి ఇప్పటికే మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.క్షమాపణలు చెప్పిన కస్తూరిఅయితే తన వ్యాఖ్యల పట్ల నటి కస్తూరి క్షమాపణలు చెప్పింది. తనకు తెలుగు గడ్డ మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్ అయింది. దీంతో ఆ పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆరోపించింది. అయినప్పటికీ కస్తూరి వ్యాఖ్యలపై చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.ఇంటికెళ్లిన పోలీసులు..ఆమె కేసులు నమోదు చేసిన పోలీసులు సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు. అయితే, తన ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉందని సమాచారం. కేసుల భయంతో ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసుల విషయంలో ఆమె ఒక లాయర్‌ను సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.అసలేం జరిగిందంటే..హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి తెలుగువారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. ఇదే వేదికపై ఆమె డిఎంకే పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ నేతలు తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. -
హీరోయిన్ రమ్య పాండియన్ హల్దీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఓటీటీలో నయనతార రియల్ లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫ్యామిలీతో బిజీగా ఉంది. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్నను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది షారూఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించిన నయన్.. ఆ తర్వాత వచ్చిన అన్నపూరణి సినిమా వివాదానికి దారితీసింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా పిక్స్ షేర్ చేసి అభిమానులకు అప్డేట్స్ ఇస్తోంది. అయితే తాజా ఫోటోలు చూసి నయన్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్ చేయించుకుందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: నా బుగ్గల్లో ప్లాస్టిక్ ఏం లేదు!)అయితే గతంలో తన సినీ ప్రయాణంపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తన కెరీర్, పెళ్లితో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఇందులో చూపించనున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునన్న నయన్ జీవితంపై తెరకెక్కించిన డాక్యుమెంటరీని ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 18 నుంచి ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ బయోపిక్కు నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే టైటిల్ ఖరారు చేశారు. Thirai-layum natchathiram, vaazhkailayum natchathiram ✨Watch Nayanthara: Beyond The Fairy Tale on 18 November, only on Netflix!#NayantharaOnNetflix pic.twitter.com/5m9UbBNZ6M— Netflix India South (@Netflix_INSouth) October 30, 2024 -
ప్రేమకు వ్యతిరేకం కాదు.. అలాంటి వ్యక్తికే నా లైఫ్‌లో చోటు: నిత్యా మీనన్
టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ధనుశ్ హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు జంటగా రుచిత్రంబలం (తెలుగులో ‘తిరు’) మూవీలో నటించారు. ఈ సినిమాలో నటనకు గానూ నిత్యాకు జాతీయ ఉత్తమ నటి అవార్డ్‌ను దక్కించుకుంది. ఇటీవల తనకు అవార్డ్ రావడం పట్ల నిత్యామీనన్ స్పందించింది. జాతీయ అవార్డ్ వస్తుందని తానెప్పుడూ ఊహించలేదని తెలిపింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిత్యామీనన్ వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. ప్రేమ పట్ల నాకు ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు లేవని తెలిపింది. అయితే తనకిప్పుడు ప్రేమ, పెళ్లి ఇంపార్టెంట్ కాదని.. ప్రస్తుతం తన కెరీర్‌తో సంతోషంగా ఉన్నానని చెబుతోంది. వాటికి కూడా టైమ్ వస్తుందని.. అది ఎప్పుడైనా కావొచ్చు అంటోంది నిత్యామీనన్.నిత్యా మీనన్ మాట్లాడుతూ..'నా జీవితంలో ప్రేమకు అవకాశం లేదని కాదు. అలాగని ప్రేమకు వ్యతిరేకం కాదు. నా జీవితంలోనూ ఎవరైనా రావాల్సిందే. కానీ అది ఇప్పుడే పెళ్లి చేసుకో అనే మాటలు నేను నమ్మను. ప్రేమ, పెళ్లి విషయంలో చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నా. ఆ సందర్భం ఎప్పుడైనా రావొచ్చు. అది 50 ఏళ్ల వయసులో వచ్చినా సరే నేను సంతోషిస్తా. లైఫ్‌లో ఒక వ్యక్తిగా చాలా ఎదుగుతున్నప్పటికీ మరింత నేర్చుకుంటూనే ఉంటా. అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే నా జీవితంలోకి వస్తాడు. ప్రస్తుతం నేను దాని కోసం వెతకడం లేదు. జీవితం అనేది చాలా విషయాలతో ముడిపడి ఉంది. ' అని తమ మనసులో మాట చెప్పుకొచ్చింది. -
టాలీవుడ్ మూవీ నుంచి తప్పుకున్న శృతి హాసన్!
కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గతేడాది సలార్ మూవీ అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం రజినీకాంత్ చిత్రం కూలీలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.అయితే శృతిహాసన్ ఇప్పటికే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. అందులో టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న డెకాయిట్:ఎ లవ్ స్టోరీ ఒకటి. అంతే కాకుండా చెన్నై స్టోరీ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ రెండు సినిమాల నుంచి శృతిహాసన్ తప్పుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే కొన్ని విభేదాల కారణంగానే ఆమె గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితుల్లో ఒకరు మీడియాకు వెల్లడించారు. డెకాయిట్‌తో పాటు చెన్నై స్టోరీ కూడా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: కర్రసాము నేర్చుకుంటున్న శృతిహాసన్ .. వీడియో వైరల్)కాగా.. గతేడాది డిసెంబర్లో అడివి శేష్, శృతి హాసన్ జంటగా డెకాయిట్ మూవీని ప్రకటించారు. అదే రోజున అనౌన్స్మెంట్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. మరోవైపు చెన్నై స్టోరీలో శ్రుతి హాసన్ డిటెక్టివ్ పాత్రను పోషించాల్సి ఉంది. అంతకు ముందు సమంత రూత్ ప్రభుని ఈ సినిమాలో కథానాయికగా తీసుకున్నారు. ఆ తర్వాత శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. తాజాగా శృతి కూడా సినిమా నుంచి తప్పుకుంది. -
ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురు చూశా: ది రాజాసాబ్ హీరోయిన్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ మోషన్ పోస్టర్ లుక్‌ను రివీల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. పుట్టినరోజున ది రాజాసాబ్ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. న్యూ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన అవకాశం రావడంపై స్పందించింది. ఇలాంటి ఛాన్స్ కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని తెలిపింది. తెలుగులో నా మొదటి సినిమానే ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని మాళవిక ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. ఇటీవల తంగలాన్ మూవీతో అలరించిన మాళవిక మోహనన్.. ది రాజాసాబ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో మొదటి సినిమానే రెబల్ స్టార్‌తో కలిసి నటించడం ఈ ముద్దుగుమ్మకు కలిసి వస్తుందేమో వేచి చూడాల్సిందే. ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ఈ ఏడాదిలో యుద్రా సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది తంగలాన్ బ్యూటీ. -
జయం రవి విడాకులకు కారణం నేను కాదు.. సింగర్ క్లారిటీ!
కోలీవుడ్ హీరో జయం రవి తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం ఒక సింగర్ అని టాక్ వినిపిస్తోంది. తాము విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ఒక లేఖను కూడా జయం రవి విడుదల చేశారు. ఇదే విషయంపై ఆయన సతీమణి ఆర్తి కూడా తీవ్రమైణ ఆరోపణలు చేశారు. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఒక సింగర్ అని నెట్టింట వార్తలు వస్తున్నాయి. జయం రవితో బెంగళూరుకు చెందిన కెనిషా ఫ్రాన్సిస్ డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: జయం రవి, ఆర్తి విడిపోవడానికి కారణం ఆ సింగరేనా..?)అయితే తనపై వస్తున్న ఆరోపణలపై సింగర్ కెనీషా స్పందించింది. జయం రవికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలిపింది. మా మధ్య ఉన్నది కేవలం బిజినెస్‌కు సంబంధించిన రిలేషన్ మాత్రమే అని అన్నారు. నాకు బిజినెస్‌లో ఆయన సపోర్ట్ చేస్తున్నారు అంతే.. జయం రవి నాకు మంచి మిత్రుడని తెలిపింది. మీరంతా అనుకుంటున్నట్లు వారి విడాకులకు కారణం నేను కాదని తేల్చి చెప్పింది. తనపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగొద్దంటూ సింగర్ కెనీషా కోరింది. -
వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ సాయివిష్ణు అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. తాజాగా తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్ అంటూ భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెన్నైలో జరిగిన మేఘా ఆకాష్, సాయివిష్ణు వివాహ రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు డీఎంకే మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ( ఇది చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు)కాగా.. నితిన్ 'లై' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది మేఘా ఆకాశ్. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా కొన్ని మూవీస్ చేసింది. తెలుగులో 'లై'తో పాటు ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, బూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు మూవీస్ చేస్తోంది. కోలీవుడ్‌లో 2019లో పెట్టా మూవీతో ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్.. ఎన్నై నోకి పాయుమ్ తోట, వంద రాజావ తాన్ వరవానే చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా సబానాయగన్, వడకుపట్టి రామసామి సినిమాలతో మెప్పించింది. சென்னையில் நடைபெற்ற தமிழ்நாடு காங்கிரஸ் கமிட்டி முன்னாள் தலைவர் திரு. சு.திருநாவுக்கரசர் அவர்களின் மகன் எஸ்.ஆர்.டி.சாய் விஷ்ணு - மேகா ஆகாஷ் ஆகியோரது திருமண வரவேற்பு நிகழ்ச்சியில் மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் கலந்துகொண்டு மரக்கன்று பசுமைக்கூடை வழங்கி மணமக்களை… pic.twitter.com/OQXqNfAowD— CMOTamilNadu (@CMOTamilnadu) September 14, 2024 View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
డైరెక్ట్‌గా ఓటీటీకి కీర్తి సురేశ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రఘుతాత. ఈ మూవీకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో టాలీవుడ్లో విడుదల కాలేదు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రఘు తాత అందుబాటులోకి రానుంది. ఈ సినిమా హక్కులను జీ5 దక్కించుకోగా.. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ట్విటర్ వేదికగా పంచుకుంది.ఆగష్టు 15న తమిళంలో విడుదలైన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలతో ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో కీర్తి సురేశ్ హిందీకి వ్యతిరేకంగా పోరాడే మహిళ పాత్ర పోషించింది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు నిర్ణయం తీసుకుందో ఈ మూవీ చూస్తేనే తెలుస్తుంది. Kayal is coming to your home for blasting entertainment!😂🔥 #RaghuThatha will be streaming from September 13th only on ZEE5 in Tamil, Telugu, and Kannada. @KeerthyOfficial @hombalefilms @vkiragandur @sumank @vjsub @yaminiyag @RSeanRoldan @rhea_kongara @editorsuresh pic.twitter.com/XY1fO7HT55— ZEE5 Telugu (@ZEE5Telugu) September 9, 2024 -
మలయాళమే కాదు.. ఇక్కడ పెద్ద లిస్టే ఉంది: నటి షాకింగ్ కామెంట్స్
మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన హేమ కమిటీ నివేదికపై ప్రముఖ కోలీవుడ్ నటి రేఖ నాయర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉందన్నారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. మీడియా లేని కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. అప్పట్లో చాలామంది సర్దుకుపోయేవారని కామెంట్ చేశారు. కొంతమంది అడ్జస్ట్మెంట్ కాలేక సినిమాల నుంచి తప్పుకున్నారని రేఖా నాయర్ వెల్లడించారు.కోలీవుడ్‌లోనూ ఇలాంటి వేధింపులు చాలానే జరుగుతున్నాయని రేఖా నాయర్ ఆరోపించారు. మలయాళంలో కేవలం పది నుంచి ఇరవై మంది మాత్రమే ఉంటారని.. తమిళంలో ఆ సంఖ్య భారీగానే ఉంటుందని అన్నారు. ఇక్కడైతే ఏకంగా 500లకు పైగానే ఉంటారని తెలిపారు. ఇవన్నీ బయటికి మాట్లాడితే సినిమా ఛాన్సులు రావని రేఖా నాయర్ వెల్లడించారు. అందుకే హీరోయిన్స్ వాటి గురించి మాట్లాడేందుకు భయపడతారని పేర్కొన్నారు. తమిళంలో సినిమా సంఘాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరన్నారు. కేవలం మలయాళం, తమిళం మాత్రమే అన్ని భాషల్లోనూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.కాగా.. తమిళంలో టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచుకున్న నటి రేఖ నాయర్. ఆమె వంశం, పగల్ నిలవు, ఆండాళ్ అజగర్, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, బాల గణపతి లాంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతే కాకుండా తమిళంలో బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే గతంలో మహిళల పట్ల ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల నడుము మీద అబ్బాయిలు చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి కానీ.. ఏదో అయిపోయిందని హంగామా చేయొద్దని కామెంట్స్ చేశారు. -
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్‌పై పలువురు సినీతారులు రియాక్ట్ అవుతున్నారు. ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరోయిన్స్ సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా దీనిపై మాట్లాడారు. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తాజాగా హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ సనమ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాస్టింగ్ కౌచ్ కేవలం మలయాళంలో మాత్రమే కాదు.. తమిళ సినిమాల్లో కూడా ఉందని వెల్లడించింది. ఎవరైనా కమిట్ అవ్వాల్సిందే తప్పా.. నో చెప్పడానికి తమిళ ఇండస్ట్రీలో అవకాశం లేదని తెలిపింది.సనమ్ శెట్టి మాట్లాడుతూ..'హేమ కమిటీ నివేదిక వివరాలు నాకు తెలియవు. కానీ నేను ఈ చర్యను స్వాగతిస్తున్నా. ఇలాంటి నివేదికను రూపొందించినందుకు జస్టిస్ హేమకు, కేరళ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తమిళ సినీ ప్రపంచంలోనూ కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి గురించి ఎవరూ బయటికి చెప్పలేరు. నేను నా స్వంత అనుభవంతో దీనిపై మాట్లాడుతున్నా. తాను వ్యక్తిగతంగా కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా. పురుషులు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులే. సినిమాల్లో అవకాశాల కోసం ఇదొక్కటే మార్గం కాకూడదు. టాలెంట్ ఉంటే.. అవకాశాలు అవే వస్తాయని నేను నమ్ముతా" అని అన్నారు. కాగా.. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై హేమ కమిటీ ఇచ్చిన నివేదికను కేరళ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.హేమ కమిటీ రిపోర్ట్ ఏంటంటే?మలయాళం ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ విచారణ జరిపి రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదికను ఆగస్ట్ 19న కేరళ ప్రభుత్వం బయట పెట్టింది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా మంది మహిళలు కమిట్ అవ్వాల్సి వచ్చిందని ఆ రిపోర్టులో స్పష్టంగా చెప్పడం సంచలనంగా మారింది. మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. -
వెంకటేశ్‌తో మొదటి సినిమా.. ఖుష్బు ఎమోషనల్ పోస్ట్!
కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించింది. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో పాటు దక్షిణాదిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. ఇవాళ ఆమె నటించిన మొదటి చిత్రం కలియుగ పాండవులు రిలీజై 38 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఖుష్బు ఎమోషనల్ పోస్ట్ చేసింది.ఖుష్బు ట్వీట్లో రాస్తూ..'నా సౌత్ ఇండియా మొదటి సినిమా 14 ఆగస్టు 1986న విడుదలైంది. వెంకటేశ్ పక్కన నటించడం నా అదృష్టం.. ఇప్పటికీ ఆయన నా ఫ్రెండ్‌గా ఉన్నారు. ఈ చిత్ర యూనిట్ అంతా ఒక కుటుంబంలా నన్ను ఆదరించారు. తెలుగు ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. డి రామానాయుడు నిర్మించారు. ఖుష్బు చివరిసారిగా అరణ్మనై-4 చిత్రంలో కనిపించింది. It's been 38 years since my very first south Indian film released. #KaliyugaPandavalu released on 14th August 1986. I am eternally grateful to my dearest @VenkyMama for being the most precious co star & friend till date. @SureshProdns for treating me like a family.… pic.twitter.com/FOwH0wdrpw— KhushbuSundar (@khushsundar) August 14, 2024 -
Srinidhi Shetty: చీరలో నన్ను మిస్ అయ్యారా? అంటూ ఫోటోలు షేర్ చేసిన శ్రీనిధి శెట్టి
-
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. నటి ఏమన్నారంటే?
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రఘు తాత. ఈ చిత్రానికి సుమన్‌కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో చిత్రయూనిట్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా వరుసగా ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేశ్ అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'నాపై వచ్చే రూమర్స్‌పై క్లారిటీ ఇస్తే అదే నిజమనుకుంటారు. అందుకే వాటిపై నేను రియాక్ట్ అవ్వను. కేవలం నా సినిమాల ఎంపిక, నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తా. వాటితో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతా. నా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా పట్టించుకోను. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు' అని తెలిపింది.కాగా.. గతంలోనూ కీర్తి సురేశ్ పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. వాటిన్నింటినీ ఆమె తల్లిదండ్రులు సైతం కొట్టిపారేశారు. కాగా.. రఘుతాత చిత్రంలో పోరాటం చేసే మహిళ పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే టీజర్‌ను విడుదల చేయగా.. విద్యాభ్యాసం, ఉద్యోగంలో ఓ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
అప్పుడు సినిమాలకు గుడ్‌బై చెబుతా!
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్నది సామెత. ఈ విషయంలో చాలామంది నటీనటులు ఎప్పుడూ ముందుంటారు. క్రేజ్ ఉన్నప్పుడే వరుస సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుంటారు. లీడ్ రోల్ దశ దాటాక కొందరు తారలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తుంటారు. అయితే ఈ విషయంలో తన రూటే సపరేటు అంటున్నారు హీరోయిన్ దుషారా విజయన్ . క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయరట. ఎందుకంటే ముప్పై ఐదేళ్ల తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతానంటున్నారామె.‘బోదై ఏరి బుద్ధి మారి’ (2019) సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు దుషారా. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ‘సార్పట్ట పరంబరై’ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం రజనీకాంత్ ‘వేట్టయాన్’, విక్రమ్ ‘వీర ధీర శూరన్’, ధనుష్ ‘రాయన్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు దుషారా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– ‘‘నాకు ముప్పై ఐదేళ్లు వచ్చాక నటనకు స్వస్తి పలుకుతాను. ఆ తర్వాత విదేశాలన్నీ చుట్టేయాలనుకుంటున్నాను. నేను చూడని దేశమంటూ ఉండకూడదు. అలా ΄ప్లాన్ చేసుకుంటున్నాను’’ అన్నారు. -
ఆ తర్వాతే సినిమాలకు గుడ్ బై: యంగ్ హీరోయిన్
బోదై ఏరి బుద్ధి మారి చిత్రం ద్వారా 2019లో సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా విజయన్. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంబరై చిత్రంతో హీరోయిన్గా మంచి గుర్తింపుపొందారు. దిండుగల్‌లోని రాజకీయ కుటుంబానికి చెందిన దుషారా విజయన్.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో ప్రవేశించారు. సార్పట్టా పరంబరై చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి.అలానే నక్షత్రం నగర్గిరదు, కళువేత్తి మూర్కన్, అనీతి వంటి చిత్రాల్లో దుషారా విజయన్ నటించారు. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్, ధనుష్ హీరోగా వస్తోన్న రాయన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ సరసన వీర ధీర శూరన్ చిత్రంలో నటిస్తున్నారు.మంచి అభినయం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న దుషారా విజయన్ అందాలారబోతకు వెనుకాడేది లేదని దుషారా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రాయన్ చిత్రంలో నటించడం సాధనగా భావిస్తున్నానన్నారు. తాను ధనుష్‌కు వీరాభిమానినని తెలిపారు. ఆయనతో కలసి నటించాలన్న చిరకాల కోరిక రాయన్ చిత్రంతో నెరవేరిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను ఉత్తర చెన్నై యువతిగా నటించినట్లు చెప్పారు. తాను 35 ఏళ్ల వయసు తరువాత నటనకు గుడ్‌బై చెబుతానని అన్నారు. ఆ తరువాత విదేశీయానం చేస్తానని చెప్పారు. అలా తాను పయనించని దేశం ఉండదని దుషారా విజయన్ పేర్కొన్నారు. -
ఐశ్వర్యా రాజేశ్ మత్తెక్కించే పోజులు.. రోజురోజుకీ అందంగా! (ఫొటోలు)
-
స్టార్ హీరోయిన్‌కు అలాంటి సమస్య.. షాకింగ్ న్యూస్ చెప్పిన భామ!
కోలీవుడ్ భామ శృతిహాసన్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అంతే కాదు క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇండియన్ సినిమాలో ఇక అన్నింటీకీ మించి లోకనాయకుడు కమలహాసన్ కూతురనే బ్రాండ్ కూడా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్లో సక్సెస్‌పుల్ హీరోయిన్గా రాణిస్తున్న ఈమె త్వరలో సలార్–2 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈమె ప్రేమలోనూ మూడు సార్లు ఫెయిలయ్యారు ముద్దుగుమ్మ. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే శృతిహాసన్ గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. నటికి పీసీఓఎస్ అనే సమస్య ఉందన్న విషయం షాకింగ్‌కు గురిచేస్తోంది. తనకు బ్యాడ్ పీరియడ్స్ సమస్య ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది భామ. మొదటి పీరియడ్ సమయం నుంచే అది పెద్ద పోరాటంగా మారిందన్నారు. ఆ బాధను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నానని చెప్పారు. బ్యాడ్ పీరియడ్ సమయంలో ఏ పని సరిగా చేయలేకపోతున్నానని చెప్పారు. ఈ కారణంగా చాలా విషయాలను కోల్పోయానని చెప్పారు.కోట్ల రూపాయల ఖర్చుతో చిత్రాలు చేస్తున్న దర్శకులకు తనకు పీరియడ్స్ సమస్య ఉంది షూటింగ్‌ను మరో రోజు పెట్టుకోండి అని చెప్పగలనా? అని శృతిహాసన్ ప్రశ్నించారు. పలువురు నటీనటుల కాల్షీట్స్తో, భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాల్లో నటించడం వల్ల బాధను భరిస్తూ.. పాటల సన్నివేశాల్లో డాన్స్ చేస్తూ.. కామెడీ సన్నివేశాల్లో నవ్వుతూ నటిస్తున్నానని చెప్పారు.పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువనిజానికి ఇలాంటి సమస్య చాలా మంది స్త్రీలలో ఉంటుంది. వారంతా జీవితంలో సాధిస్తున్నారు. పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ ( పీసీఒఎస్) వ్యాధి కారణంగా స్త్రీలు అధిక రక్త స్రావానికి గురవుతుంటారంటారు. ఈ వ్యాధి కలిగిన వారితో చా లామందికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదంటారు. ఏదేమైన ఇలాంటి అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు నటి శృతిహాసన్ చెప్పిన విషయం ఆమె అభిమానులను షాక్‌కు గురి చేసింది. -
బెంగళూరు టీమ్‌పై నటి వ్యంగ్య పోస్ట్.. ఆ రెండేళ్లు మర్చిపోయారా? అంటూ సెటైర్లు!
తమిళ నటి కస్తూరి 90వ దశకంలో హీరోయిన్గా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు. సామాజిక, రాజకీయ అంశాల మీద పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఐపీఎల్ టీం బెంగళూరు ఓటమిపై పోస్ట్ పెట్టింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయిన ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రముఖ కోలీవుడ్ నటి కస్తూరి తన ట్విటర్లో ఖాతాలో వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. చాలా ఏళ్లుగా ఈ విషయం అక్కడి వారికి తెలుసు అంటూ బెంగళూరు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ పిక్‌ను షేర్ చేసింది. అంతే కాకుండా 'ఈసాలా కూడా కప్ ఇల్లా' అంటూ కించపరిచేలా క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.అయితే ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమె చేసిన పోస్టుకు కౌంటర్‌గా కామెంట్స్ పెడుతున్నారు. సీఎస్కే టీమ్‌లా రెండేళ్లు మా టీమ్ బ్యాన్ కాలేదని గుర్తు చేస్తున్నారు. మీ టీమ్ అంతా ఫిక్సింగ్ అంటూ కస్తూరిని ట్రోల్ చేస్తున్నారు. మీ టీమ్ చెన్నై ఫిక్సింగ్ కింగ్స్ అంటూ నెటిజన్స్ పెద్దఎత్తున ఆడేసుకుంటున్నారు.The locals have known for years ....🤭😃#eesala #illa pic.twitter.com/gektBLqkFZ— Kasturi (@KasthuriShankar) May 23, 2024 -
బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ శాంతను హజరికాతో బంధానికి గుడ్ బై చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ రూమర్స్‌కు మరింత బల చేకూరింది. అయితే ఈ విషయాన్ని శృతిహాసన్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.అయితే తాజాగా శృతిహాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓ నెటిజన్ శృతి రిలేషన్షిప్ గురించి ప్రశ్నించారు. ప్రస్తుతం మీరు సింగిలా? లేదా కమిట్ అయ్యారా? అని నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి శృతి తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది.శృతి హాసన్ స్పందిస్తూ.. 'ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం నాకు సంతోషం అనిపించదు. కానీ నేను ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉన్నా. మింగిల్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నా. అందులోనే నేను ఆనందంగా ఉన్నా. ప్రస్తుతానికి నాకు ఇది చాలు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో శాంతను హజరికాతో బ్రేకప్ అయినట్లు క్లారిటీ ఇచ్చేసింది. గతంలో వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలొచ్చాక తొలిసారి శృతిహాసన్ స్పందించింది.కాగా.. శృతిహాసన్, శాంతను కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరూ ముంబయిలోనే సహజీవనం చేశారు. గతంలో ఎప్పటికప్పుడు తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకునేవారు. ప్రస్తుతం ఈ జంట విడివిడాగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. శృతిహాసన్ ప్రస్తుతం అడివి శేష్ సరసన డకాయిట్ చిత్రంలో కనిపించనుంది. ఆ తర్వాత చెన్నై స్టోరీ, సలార్ పార్ట్-2: శౌర్యంగ పర్వంలోనూ నటించనుంది. -
కుమారునితో స్టార్ హీరోయిన్.. వీడియో పోస్ట్ చేసిన భర్త!
ప్రేమకు చిరునామా అమ్మ. మమతకు మారు పేరు అమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కన్న పిల్లల లాలనలో తరించిపోయోది అమ్మ. నటి నయనతార ఇప్పుడు అలాంటి మాతృత్వ మధుర్యాన్నే ఆస్వాదిస్తున్నారు. హీరోయిన్గా అగ్రస్థానంలో రాణిస్తున్న నయనతార ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.కాగా, గత 2022లో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ఆరేళ్ల ప్రేమకు నిర్వచనం ఈ పెళ్లి. కాగా అదే ఏడాది అక్టోబర్ నెలలో నయనతార, విఘ్నేశ్ శివన్‌లు సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వీరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేశ్ శివన్‌లో తమ జీవితంలో రీల్ విషయం, రియల్ విషయం గానీ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.తమ పెళ్లి వేడుకను మాత్రం ఒక ఓటీటీ సంస్థకు విక్రయించి వార్తల్లోకి ఎక్కారు. ఇక పుట్టిన రోజు గాని, ఇతర వేడుకలు గాని సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే తమ పిల్లల అన్నప్రాసన వేడుక ఫొటోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మాతృదినోత్సం సందర్భంగా నటి నయనతార తన చిన్నపిల్లగా మారిపోయారు.వారి ముద్దు మురిపాల్లో మురిసిపోయారు. పిల్లలను భుజాలపై మోస్తూ పరవశించిపోయారు. పిల్లలను లాలించి, మురిపించి అమ్మతనాన్ని అనుభవించారు. వారి చేతులు పట్టుకుని బుడి బుడి అడుగులు వేయిస్తూ ఆనందంతో పరవశించిపోయారు. ఈ వీడియోను నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో నయనతారను ఉద్ధేశించి విఘ్నేశ్‌శివన్ పేర్కొంటూ నువ్వే నా ప్రాణం, నా లోకం అని పేర్కొన్నారు. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. అమ్మకు కన్నపిల్లల ముందు తన స్థాయి అస్సలు గుర్తుకురాదని ఈ వీడియోతో నయనతార మరోసారి నిరూపించారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయనతారకు క్రేజీ ఛాన్స్.. భారీగా డిమాండ్ చేస్తోన్న భామ!
జీవితంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. అది డబ్బు కావచ్చు ఇంకేదైనా కావ్వవచ్చు. జరిగిన ఏ ఒక్క క్షణం తిరిగి రాదు. అందుకే ఉన్న సమయంలోనే సంపాదించుకోవడం అయినా, అనుభవించడం అయినా. ఈ నగ్న సత్యం బాగా తెలిసిన నటి నయనతార. నటిగా ఆదిలో అవరోధాలను ఎదుర్కొన్నా, తన ప్రతిభ, అంది వచ్చిన అదృష్టంతో ఎదుగుతూ అందలం ఎక్కారు. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్నా.. మరో పక్క నిర్మాతగా, ఇతర వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయినా డబ్బెవరికి చేదు అన్న సామెతలా కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదనిపిస్తోంది. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తూనే కథానాయికగా కాకుండా అక్కగా.. చెల్లెలిగా నటించడానికి కూడా వెనుకాడడం లేదు.ఆ మధ్య ఇమైకా నొడిగళ్ చిత్రంలో నటుడు అధర్వకు అక్కగా.. ఆ తరువాత తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా నటించారు. ఇప్పుడు కన్నడ నటుడు యశ్ కు అక్కగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని వెనుక బలమైన పాత్రలు ఉండవచ్చు.. అంతకంటే ముఖ్యమైనది డబ్బు. అవును ఇది అక్షరాలా నిజం.లేడీ సూపర్‌స్టార్ నయనతారకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ చిత్రానికి రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళంలో టెస్ట్, మన్నాంగట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే ములాయంలో నివీన్ బాలి సరసన కథానాయికిగా నటిస్తున్నారు.తాజాగా కేజీఎఫ్ చిత్రం ఫేమ్ యశ్ పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులో ప్రాముఖ్యత కలిగిన అక్క పాత్ర చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె అంగీకరించలేదని సమాచారం. దీంతో ఇప్పుడు ఆ పాత్రలో నయనతారను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి నయనతార డబుల్ పారితోషికం అంటే రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
షూటింగ్‌కు ఆటోలో వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే?
ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉండే నిలిచిన హీరోయిన్ శృతిహాసన్. స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె.. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వైరలయ్యాయి. అయితే ఈ విషయంపై శృతిహాసన్ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు కోలీవుడ్ భామ. కాకపోతే ఆమె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో చూసేద్దాం.అసలు విషయానికొస్తే శృతి హాసన్ ప్రస్తుతం ముంబాయిలో ఉంటున్నారు. అక్కడే ఓ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే షూటింగ్‌కు బయలుదేరిన ఆమె ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. అది ఎంతసేపటికీ క్లియర్ కాకపోవడంతో.. షూటింగ్‌కు ఆలస్యం అవుతుందని శృతిహాసన్ తాను వెళుతున్న కారును పక్కన నిలిపేసి ఆటో ఎక్కి వెళ్లిపోయారు.ఆమె ఆటోలో వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శృతిహాసన్ ఏ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారో తెలియదు గానీ ఆమె వృత్తి ధర్మానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనే ఆ మధ్య నటుడు అమితాబ్ బచ్చన్ విషయంలోనూ జరిగింది. ఆయన ఇదే విధంగా కారులో వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కారు దిగి వేరే వ్యక్తి బైక్‌లో షూటింగ్ స్పాట్‌కు వెళ్లడం విశేషం. -
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!
ఒక్కోసారి హీరోయిన్లకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. తాజాగా నటి తాన్యా రవిచంద్రన్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్ మనవరాలైన తాన్యా రవిచంద్రన్.. ఆయన వారసత్వాన్ని తీసుకుని సినీ రంగప్రవేశం చేశారు. ఆమె 2017లో భలే వెళైదేవా అనే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. శశికుమార్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ తాన్నా రవిచంద్రన్‌కు అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. అలా బృందావనం, కరుప్పన్, నెంజుక్కు నీతి, మాయోన్, అకిలన్ వంటి చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.తాజాగా ఆమె రసవాది అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్ ఓ భేటీలో అభిమానులతో ముచ్చటించారు. వారితో తన చిత్రాల గురించి.. తాను నటించాలనుకుంటున్న పాత్రల గురించి వివరించారు. అదే సమయంలో తనకు ఎదురైన విచిత్రమైన ప్రశ్న గురించి చెప్పారు. ఒకసారి అభిమాని ఒకరు అనూహ్యంగా అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగారన్నారు. అతను అడిగిన విధానం తనకు అర్థం కాలేదన్నారు. అక్కా అన్నాడు.. పెళ్లి చేసుకుంటావా? అని సంబంధమే లేకుండా అడిగిన అతని ప్రశ్నకు బదులేం చెప్పాల్లో తనకు అర్థం కాలేదన్నారు. ఇలాంటి ఫన్నీ సంఘటనలు గుర్తొస్తే నవ్వొస్తుందని తాన్యా రవిచంద్రన్ పేర్కొన్నారు. కాగా రసవాది చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్‌కుమార్
దక్షిణాది నటీమణుల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ రూటే వేరని చెప్పవచ్చు. ఆమె ఎంత సౌమ్యంగా మాట్లాడతారో, తేడా వస్తే అంత రఫ్‌గానూ దులిపేస్తారు. నిర్మొహమాటంగా మాట్లాడే వరలక్ష్మీశరత్‌కుమార్ ఏ భాషలోనైనా.. ఎలాంటి పాత్రనైనా నటించే సత్తా కలిగిన నటి. ఈమె తాజాగా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన బహుభాషా చిత్రం శబరి ఇటీవలే తెరపైకి వచ్చింది. మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా తన గురించి మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు.అసలు తన గురించి నెగిటివ్‌గా మాట్లాడటానికి మీరెవరు? అని వరలక్ష్మి ప్రశ్నించారు. శరత్‌కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమెకు వరలక్ష్మీ శరత్‌కుమార్ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మనస్పర్థల కారణంగా వరలక్ష్మీ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత శరత్‌కుమార్ నటి రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.అయితే ప్రస్తుతం శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయ, రెండో భార్య రాధిక కుటుంబాలు కలిసి మెలిసే ఉంటున్నాయి. ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ అందరూ కలిసి పాల్గొన్నారు. ఈ సంఘటన గురించి రక రకాల కామెంట్స్ దొర్లాయి. వీటిపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీరు కామెంట్స్ చేసే వ్యక్తి జీవితం ఏమిటన్నది మీకు తెలుసా? తను ఉన్నత స్థాయికి చేరారంటే అందుకు పడిన కష్టం మీకు తెలుసా? ఈజీగా కామెంట్స్ మాత్రం చేస్తారు అని ఫైరయ్యారు.ఒకరి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు వారి గురించి మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని కామెంట్ చేసేకంటే.. మీరెందుకు సాయం చేయకూడదు అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే పారితోషికం చాలా తక్కువని అన్నారు. ఎందుకంటే తమకు ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదని.. షూటింగ్ లేకపోతే పారితోషికమే రాదని చెప్పారు. అయితే నెగిటివ్ కామెంట్స్ చేసేవారు తాము సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటామని భావిస్తుంటారన్నారు.కానీ నిజానికి అలాంటి పరిస్థితిలేదని ఆమె తెలిపారు. తాము నెలకు తమ వద్ద పని చేసేవారికి జీతాలు చెల్లించాలని.. అయితే తమకు మాత్రం నెలసరి జీతాలు ఉండవన్నారు. షూటింగ్ ఉంటేనే పారితోషిక ఉంటుందని.. ఒక్కోసారి నిర్మాత ఇంట్లో ఏదైనా సమస్య తలెత్తి.. షూటింగ్ నిలిచిపోతే పారితోషికం ఆగిపోతుందన్నారు. తాము వెళ్లి అడిగే పరిస్థితి ఉండదన్నారు. అలా తమకు పారితోషికం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి అన్నారు. కాబట్టి తమ పని అంత సులభం కాదని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ పేర్కొన్నారు. -
ఎంతైనా జ్యోతిక... ఆ స్టయిలే వేరు! (ఫొటోలు)
-
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
టాలీవుడ్ నటుడు అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తమిళ నటుడు ఉమాపతి రామయ్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహా వేడుక జూన్ 10న చెన్నైలో జరగనుంది. నగరంలోని అంజనసుత శ్రీ యోగాంజనేయ మందిరం పోరుర్‌లో వేదికగా నిలవనుంది.గతేడాది నిశ్చితార్థంకాగా.. గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట జూన్‌లో పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. ఉమాపతి, ఐశ్వర్య ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. వరుడు ఎవరంటే?కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. తమిళంలో మనియార్ కుటుంబం, తిరుమణం, తన్నే వండి సినిమాల్లో ఉమాపతి నటించారు. అర్జున్ సర్జా కూతురు కూడా తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. విశాల్ మూవీ పటతు యానై సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో అందాల నటిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యను ఉమాపతి పెళ్లి చేసుకోనున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
రివాల్వర్ రీటా’గా వస్తోన్న కీర్తి సురేశ్.. అప్డేట్ వచ్చేసింది!
మాలీవుడ్‌లో బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్‌లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌పుల్ హీరోయిన్గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ వరుణ్ ధావన్‌కు జంటగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న బేబీజాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన తెరి చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే తమిళంలో జయంరవికి జంటగా నటించిన సైరన్ చిత్రం కీర్తిసురేశ్‌ను నిరాశపరిచింది.ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో రివాల్వర్ రీటా ఒకటి. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు రెడిన్ కింగ్స్లీ, మైమ్‌గోపీ, సెండ్రాయిన్, స్టంట్ మాస్టర్ సూపర్‌సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని నటి కీర్తిసురేశ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో చివరి షూటింగ్లో కేక్ కట్ చేసిన వీడియోను విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా ఈ చిత్రం ఆడియో, ట్రైలర్లను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కీర్తిసురేశ్ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. -
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ వారికి మాత్రమే!
హన్సిక ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ గార్డియన్. తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి శబరి గురు శరవణన్ దర్శకత్వం వహించాడు. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈమూవీ బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. మొదటి వారంలో థియేటర్లలో మాయమైపోయింది. తాజాగా ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది.హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన గార్డియన్ మూవీ ఓవర్సీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం సింప్లీసౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియాలోని ఆడియన్స్‌కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ హారర్ మూవీ రానున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్‌లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు.అసలు కథేంటంటే..రోటీన్ హారర్ స్టోరీగా దర్శకుడు శబరి గురుశరవణన్ తెరకెక్కించారు. అపర్ణ (హన్సిక) ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహాయంతో సిటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారిపై ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది? అసలు ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్రవేశించింది? ఆ ఆత్మ కారణంగా అపర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో పడింది అన్నదే అసలు కథ. -
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాక్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అరణ్మనై-4తో వస్తోన్న ఈ చిత్రంలో రాశి ఖన్నా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో తమన్నా, రాశి ఖన్నా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఓ హాలీవుడ్ ఫిల్మ్‌ని చూశాక వ్యాక్సింగ్ (చర్మంపై రోమాలు తొలగించడం) మానేశానని తెలిపారు. హాలీవుడ్ చిత్రం హౌజ్ ఆఫ్ వ్యాక్స్ చిత్రంలో వ్యాక్స్తోనే పలు రకాలుగా చంపేస్తుంటారు. ఆ సినిమా చూశాకే వ్యాక్సింగ్ మానేశానని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది. రాశి ఖన్నాతో కలిసి వేదికపై మెరిసింది. కోలీవుడ్ దర్శకుడు సుందర్ నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ చిత్రం మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ నటి..!
సీనియర్ నటి కోవై సరళ మీకు గుర్తుందా? ఆమె పేరు వినగానే కామెడీ వెంటనే గుర్తుకొచ్చేస్తోందా? కోవై సరళ- బ్రహ్మానందం జోడీ చేసే కామెడీ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మెదలుతూనే ఉంటాయి. టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు.ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాల్లో కనిపిస్తున్నారు. చివరిసారిగా 2022లో వచ్చిన సెంబి చిత్రంలో కోవై సరళ నటించింది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూపర్ హిట్ సిరీస్ అరణ్మనై పార్ట్-4 త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. బాక్ పేరుతో తెలుగులోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కు కోవై సరళ కూజా హాజరయ్యారు. సరికొత్త లుక్‌లో కనిపించి సందడి చేశారు. సినీ ప్రియులు గుర్తు పట్టలేని విధంగా ఆమె మారిపోయారు. కాగా.. ఈ చిత్రం మే3న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఉల్లిపొర లాంటి చీరలో మాళవిక అందాల జాతర (ఫొటోలు)
-
Priyanka Arul Mohan Photos: ఈ గ్లామర్ సరిపోదా అంటూ ఊపేస్తున్న హీరోయిన్ (ఫోటోలు)
-
Malavika Mohanan: 'తంగలాన్' బ్యూటీ మాళవిక మోహనన్ గ్లామర్ ఫోటోలు వైరల్ (ఫొటోలు)
-
లేడీ సూపర్‌స్టార్‌కు గట్టి పోటీ.. ఆమె దెబ్బకు మాలీవుడ్‌కు!
ప్రస్తుతం నయనతార మాలీవుడ్ వైపు మళ్లుతున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగుతున్న నయనతారకు ఇప్పుడిప్పుడే ఆ పేరు దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చైన్నె సుందరి త్రిష నుంటి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో త్రిష కోలీవుడ్‌లో సూపర్ స్టార్ హోదాను కైవసం చేసుకోనుందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో గత కొద్దికాలంగా హాట్ టాపిక్ ఇదే. నయనతార గతేడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అయితే బాలీవుడ్లో మరో అవకాశం రాలేదు. ఇక తమిళంలో ఇటీవల ఈమె నటించిన ఇరైవన్, అన్నపూరణి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచాయి. ప్రస్తుతం నవ దర్శకుడు టూయుటూ విక్కీ దర్శకత్వం వహిస్తున్న మన్నాగట్టి, సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, మాధవన్‌తో కలిసి టెస్ట్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. నయనతారకు వీటిలో ఏదో ఒకటి హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు నయన్‌కు ఇప్పుడిప్పుడే దూరమవుతున్నాయి. నటి త్రిష వైపు వెళుతున్నాయని చెప్పక తప్పడం లేదు. ఆ తరువాత తెలుగులోనూ స్టార్ హీరోలైన చిరంజీవి, అల్లుఅర్జున్‌లతో కలిసి నటించే అవకాశాలను దక్కించుకున్నారు. అంతేకాకుండా మలయాళంలోనూ నటిస్తున్నారు. దీంతో నయనతార కూడా మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తన మాతృభాష అయిన ఈ చిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకుముందే మమ్ముట్టి, నివిన్‌బాలీ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. అలా ఈమె మలయాళంలో నటించిన చివరి చిత్రం గోల్డ్. అల్పోన్స్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2022లో విడుదలై పెద్దగా ఆడలేదు. దీంతో కొంతకాలం మాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వచ్చిన నయనతార తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి డియర్ స్టూడెంట్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నయనతార టీచర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నటుడు నివిన్ బాలి హీరోగా నటిస్తున్నారు. -
ఆ విషయం వాళ్లనే అడగాలి: ప్రియమణి హాట్ కామెంట్స్
మాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎదిగిన నటి ప్రియమణి. ముఖ్యంగా కోలీవుడ్‌లో భారతీరాజా, బాలుమహేంద్ర వంటి టా ప్ దర్శకుల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న లక్కీ బ్యూటీ ఆమె. పరుత్తివీరన్ చిత్రంలో ముత్తళగు పాత్రలో పరకాయ ప్రవే శం చేసి జాతీయ ఉత్త మ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ చి త్రం తరువాత గ్లామర్ పాత్రలపై ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రియమణి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, నాగార్డున వంటి స్టార్ హీరోల సరసన నటించారు. కానీ కోలీవుడ్‌లో అలాంటి స్టార్స్ చిత్రాల్లో నటించే అవకాశాలు రాలేదు. నిజం చెప్పాలంటే ఈమె తమిళంలో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు. కాగా ఆ మధ్య పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టిన ప్రియమణి చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అయితే హీరోయిన్గా కాకుండా సపోర్టింగ్ పాత్రల్లోనే నటించే అవకాశాలు వస్తున్నాయి. కాగా చాలా కాలం క్రితమే బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ప్రియమణి మళ్లీ ఇటీవల హిందీ చిత్రాల అవకాశాలు పొందడం విశేషం. గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన షారూఖ్ ఖాన్ హీరోగా నటించి నిర్మించిన జవాన్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. తాజాగా అజయ్‌దేవ్‌గన్ సరసన మైదాన్ చిత్రంలో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ప్రియమణి బదులిస్తూ తాను ఎవరినీ తప్పు పట్టలేనన్నారు. తనకు అవకాశం ఇస్తే నటనలో వారిని డామెనేట్ చేస్తానని కొందరు తనతో చెప్పారన్నారు. అయితే అందులో నిజం లేదన్నది తనకు తెలుసన్నారు. నిజం చెప్పాలంటే టాప్ హీరోలతో జత కట్టే అవకాశాలు రాకపోవడానికి కారణం తనకూ తెలియదన్నారు. ఆ విషయం గురించి ఆ హీరోలు, నిర్మాతలనే అడగాలని నటి ప్రియమణి పేర్కొన్నారు. -
కబాలి భామ సరికొత్త లేడీ ఓరియంటెడ్ చిత్రం!
2006లో తిరుడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి సాయి దన్సిక. అయితే 2009లో జయం రవితో నటించిన ఐదుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. తరువాత మాంజావేలు, నిల్ గమనీ సెల్లాదే, పరదేశీ వంటి చిత్రాల్లో కథానాయకిగా సత్తాచాటారు. 2016లో రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రంలో ఆయనకు కూతురిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని మలయాళ చిత్రాల్లోనూ నటించిన ఈమె ఇప్పటికీ మంచి స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారు. కాగా తాజాగా ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ఈమె నటించిన ది ప్రూఫ్ చిత్రాన్ని నృత్య దర్శకురాలు రాధిక తెరకెక్కించడం విశేషం. ఈమె మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం కావడం గమనార్హం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. కాగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు శశికుమార్ బుధవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) -
తెలుగులో ఎంట్రీ.. ఛాన్సుల కోసం దాన్నే నమ్ముకున్న బ్యూటీ!
సినిమాల్లో తన గ్లామర్ పవర్ చూపిస్తోన్న నటి అనికా సురేందర్. బాలా నటిగా రంగప్రవేశం చేసిన ఈ మలయాళ కుట్టి, ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్ అంటూ తన స్థాయిని విస్తరించుకుంది. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఎనై అరిందాల్(తెలుగులో ఎంతవాడు కానీ) చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత నానుమ్ రౌడీదాన్ చిత్రంలో చిన్న నయనతారగా నటించింది. దీంతో అందరూ అనికా సురందర్ను చిన్న నయనతార అని కూడా పిలుస్తుంటారు. అదే విధంగా ఆ అరువాత అజిత్, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన విశ్వాసం చిత్రంలో వారి కూతురిగా నటించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చాలా మంది బాల తారల మాదిరిగానే ఈ అమ్మడు హీరోయిన్గా నటించే అవకాశాన్ని తెలుగు చిత్రం బుట్టబొమ్మతో అందుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో తదుపరి అవకాశం కోసం అనికా సురేంద్రన్ శక్తికి మంచి ప్రయత్నిస్తూనే ఉందని చెప్పవచ్చు. అందుకు ఈ చిన్నది గ్లామర్‌పైనే ఆధారపడుతోంది. అలా ఎంత వరకూ చేరుకుందంటే ఇప్పుడు మరో సిల్క్ స్మిత అనిపించుకునే వరకూ. అవును ఆ రేంజ్‌కు అనికా సురేందర్ గ్లామరస్ ఫొటోలను ప్రత్యేకంగా తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తోంది. కాగా తాజాగా నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించి స్వీయ దర్శకత్వం వహించిన ఆయన 50వ చిత్రంలో అనికా సురేందర్ ఒక ముఖ్య భూమికను పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఈమె కెరీర్‌కు ఉపయోగపడుతుందనే ఆశతో ఉంది. అయితే తన గ్లామరస్ ఫొటోలను విడుదల చేయడంలో మాత్రం తగ్గేదే లేదంటోందీ మలయాళ కుట్టి. View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) -
'40 రోజులు వనవాసం'.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కీర్తి తన శక్తికి మించిన పాత్రల్లోనూ నటించి మెప్పించింది. మహానటిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. తాజాగా అక్కా అనే వెబ్ సిరీస్‌లో నటి రాధిక ఆప్టేతో కలిసి నటించారు. ధనరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం కేరళలో మకాం పెట్టిన కీర్తి సురేష్ తాజాగా తన ఇన్‌స్ట్రాగామ్‌లో పంచుకున్నారు. దాదాపు 40 రోజులు వనవాసం పూర్తి చేసి ఇప్పుడే సోషల్ మీడియాలోకి తిరిగివచ్చానని రాసుకొచ్చారు. అక్కా వెబ్ సిరీస్‌లో నటించడం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ షెడ్యూల్‌ని ముగించుకుని ఇంటికి తిరిగిరావడం సరి కొత్త అనుభూతిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై ఇతర మూవీ షూటింగ్‌లకు హాజరవుతానని తెలిపారు. కాగా.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివెడీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలు కావడం విశేషం. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది!
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. ఆ తర్వాత నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల వెబ్ సిరీస్‌లతో అలరించిన మలయాళీ భామ 36వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఇవాళ నిత్యా మీనన్ బర్త్ డే కావడంతో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా నిత్యా నటిస్తోన్న 'డియర్ ఎక్సెస్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ద్వారా కామిని డైరెక్టర్‌గా పరిచయవుతున్నారు. రిలీజైన పోస్టర్లో నిత్యా ఒక చేతిలో మొబైల్.. మరో చేతిలో గ్లాస్ పట్టుకుని కనిపించింది. ఈ సినిమాను బాస్క్ టైమ్ థియేటర్, పోప్టర్ మీడియా నెట్వర్క్ బ్యానర్లపై బీజీఎన్, ఆదిత్య అజయ్ సింగ్, రామ్‌కి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్టర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వినయ్ రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్, దీపక్ పరంబోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
జ్యోతిక సూపర్ హిట్ చిత్రం.. సీక్వెల్‌కు ప్లాన్!
ప్రస్తుతం ఎవర్గ్రీన్ నటిగా రాణిస్తున్న నటి జ్యోతిక. చంద్రముఖి చిత్రం తర్వాత ఆమె నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడారు. ఆ తర్వాత నటనకు కాస్త విరామం ఇచ్చారు. అది కూడా కుటుంబం కోసమే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలా జ్యోతిక నటించిన 36 వయదినిలే చిత్రం చేసి సూపర్‌హిట్ కొట్టారు. ఆ తరువాత వరుసగా నటనను కొనసాగిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి సైతాన్ చిత్రంతో అక్కడా సక్సెస్ సాధించారు. దీంతో హిందీలో మరిన్ని అవకాశాలు ఈమె తలుపు తడుతున్నాయని సమాచారం. జ్యోతిక ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఉడన్ పిరప్పే. నటుడు శశికుమార్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇతి వృత్తంతో ఆర్.శరవణన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం 2021లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది. ఇది జ్యోతికకు చాలా నచ్చిన చిత్రం కావడం గమనార్హం. కాగా తాజాగా ఉడన్పిరప్పే చిత్రానికి సీక్వెల్‌ను చేయాలని జ్యోతిక ఆశిస్తున్నట్లు సమాచారం. అందుకు దర్శకుడు శరవణన్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జ్యోతిక మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడంతో ఈ చిత్రాన్ని ఆ స్థాయిలో చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉడన్పిరప్పే సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ.. క్రేజీ అప్డేట్!
చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందించారు. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ పార్వతీ తిరువోతు బర్త్ డే సందర్భంగా తంగలాన్‌లో ఆమె నటించిన గంగమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే మహిళా రైతు క్యారెక్టర్లో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. తంగలాన్ సినిమాను త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చియాన్ విక్రమ్‌ను విభిన్నమైన క్యారెక్టర్లో దర్శకుడు పా.రంజిత్ చూపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా..తంగలాన్' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నాప్పటికీ కుదరలేదు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. Happy birthday # Gangamma, @parvatweets stay happy n blessed 💥💥💥#HBDParvathyThiruvothu#Thangalaan pic.twitter.com/nNWvFpihfv — pa.ranjith (@beemji) April 7, 2024 -
వెంటిలేటర్‌పైనే హీరోయిన్.. వేడుకుంటున్న అరుంధతి సోదరి
కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతుంది. మార్చి 14న ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్దిరోజులుగా అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే గానీ బతకదని తన సోదరి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇప్పటికే పలుమార్తు వేడుకున్నారు. అందుకోసం బ్యాంకు వివరాలను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం త్రివేండ్రంలోని అనంతపూరి ఆస్పత్రిలో అరుంధతికి చికిత్స జరుగుతుందని ఆమె సోదరి ఆర్తీ చెప్పింది. ఇప్పుడు వెంటిలేటర్ సాయంతో అరుంధతి శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపింది. వైద్యం కోసం రోజూ దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు అవుతోందని, ఇప్పటికే అరుంధతి కోసం రూ. 40 లక్షలు ఆస్పత్రి బిల్లులు చెల్లించామని అర్తీ చెబుతుంది. అరుంధతి తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా మెదడులో రక్తం గడ్డకట్టింది. అందుకు సంబంధించిన బ్రెయిన్ సర్జరీ ప్రస్తుతం పూర్తి అయినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూడా కదలలేని స్థితిలో వెంటిలేటర్ మీదే అరుంధతి చికిత్స పొందుతున్నట్లు ఆర్తీ ఆవేధన చెందుతుంది. 90 రోజులు దాటినా తర్వాత కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం క్లారిటీగా చెప్పలేమని వైద్యులు అన్నట్లు ఆర్తీ పేర్కొంది. ప్రస్తుతం అరుంధతికి పక్కటెముకలకి సంబంధించిన శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది కాబట్టి తమకు సాయం చేయాలని ఆమె కోరింది. ఇప్పటికే పలువురు మళయాల నటీమణులు కూడా ఆమెకు సాయం చేయాలని పలు వీడియోల ద్వారా అభ్యర్థిస్తున్నారు. అరుంధతి నాయర్ తమిళ చిత్రం అయిన 'పొంగి ఎజు మనోహర'తో అరుంధతి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన 'సైతాన్' (తెలుగులో భేతాళుడు)లో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by ❣️A S W A T H Y.R A H U L👸👑❣️ (@__aswathy__sr21__official__) -
వివాదంలో రఘువరన్ బీటెక్ నటి.. !
కోలీవుడ్ ధనుశ్ నటించిన చిత్రం రఘువరన్ బీటెక్. ఈ చిత్రంలో అతనికి జోడీగా అమలా పాల్ నటించింది. ఇంజినీరింగ్ చదివిన నిరుద్యోగుల బాధలను చూపే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో రఘువరన్‌కు తల్లిగా నటి శరణ్య పొన్వన్నన్ నటించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని వారు నివాసముండే విరుంగబాక్కంలో పార్కింగ్ గొడవ ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. పార్కింగ్ విషయంలో పొరుగింటి వారితో వివాదం తలెత్తింది. దీంతో పక్కింటి వారు శరణ్య పొన్వన్నన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను నటి బెదిరించిందని పేర్కొంటూ శ్రీదేవి అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్లు తెలుస్తోంది. అయితే శరణ్య రఘువరన్ బీటెక్‌తో పాటు 24, వేదం, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. -
కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ బ్రో.. ఇంత అందాన్ని మర్చిపోయారా?
కోలీవుడ్ భామ ఇటీవలే హనుమాన్ సినిమాతో అలరించారు. తేజ సజ్జాకు అక్కా పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. గతేడాది టాలీవుడ్లో వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్ చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. అయితే గతంలో చాలా ఇంటర్వ్యూల్లో తన పెళ్లి గురించి దాటవేస్తూ వచ్చిన బ్యూటీ.. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్ అనే వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమెనే లేడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఐపీఎల్ మ్యాచ్‌లో తళుక్కున మెరిసింది. చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వరలక్ష్మి సందడి చేసింది. చెపాక్ స్టేడియంలోని స్టాండ్స్‌లో వరలక్ష్మి నిలబడి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ మ్యాచ్‌లో కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ పెట్టారు.. ఈ అందాన్ని గుర్తించడం ఎలా మరిచిపోయారు? అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Cameraman ka focus Aaj kahan hai 🙄🤪Itna glamor nahi notice kiya ? pic.twitter.com/bJqvmluOo8 — aCute 📐 (@chaoticalm_090) March 26, 2024 -
హీరో డైరెక్షన్లో నటించనున్న స్టార్ హీరోయిన్..!
కోలీవుడ్ నటుడు శశికుమార్ దర్శకత్వంలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార పచ్చజెండా ఊపారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుబ్రమణ్యపురం చిత్రం ద్వారా కథానాయకుడు, దర్శకుడిగా పరిచయమైన శశికుమార్ ఆ తరువాత నాడోడిగళ్ చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతో శశికుమార్ హీరోగా స్థిరపడిపోయారు. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఈయన ఈ మధ్య కథానాయకుడిగా నటించిన అయోథి చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక నటి నయనతార విషయానికి వస్తే లేడీ సూపర్‌స్టార్‌గా ఆమె రాణిస్తున్నారు. ఇటీవల జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ విజయాన్ని అందుకున్నారు. గతేడాది ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్న తన 75వ చిత్రం అన్నపూరణి తీవ్ర నిరాశ పరిచింది. అంతే కాకుండా వివాదాల్లో చిక్కుకుని కేసుల వరకూ వెళ్లి ఓటీటీలో నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా.. నయన్‌కు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే విజయాలే ముఖం చాటేస్తున్నాయి. ప్రస్తుతం టెస్ట్ అనే క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రంతో పాటు మన్నాంగట్టి అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా తాజాగా నటుడు శశికుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరలవుతోంది. ఇదీ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో నయనతార పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రానికి శశికుమార్ దర్శకత్వం మాత్రమే చేయనున్నట్లు.. నటన జోలికి వెళ్లడం లేదని సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. -
హీరోయిన్‌తో స్టార్ డైరెక్టర్ రొమాన్స్.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
హీరోయిన్ శృతిహాసన్, లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటించిన ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇటీవల ఇనిమెల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఈ జంట రొమాన్స్‌తో రెచ్చిపోయి నటించారు. తాజాగా ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కమల్‌హాసన్ లిరిక్స్ అందించడమే కాకుండా తానే స్వయంగా నిర్మించారు. అయితే ఈ సాంగ్‌లో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటన ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వీరిద్దరి రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. లోకేశ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా రిలీజైన సాంగ్ కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. సాంగ్ చూస్తే లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మీరు కూడా ఈ రొమాంటిక్ సాంగ్‌ను చూసేయండి. ఇక సినిమాల విషయాకొనిస్తే లోకేశ్ కనగరాజ్ నెక్స్ట్ రజినీకాంత్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరోవైపు శృతిహాసన్ అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటించనున్నారు. -
నా భర్త అలాంటి సినిమాలనే ఎంచుకుంటారు: జ్యోతిక
సౌత్ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక దంపతులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తమదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న జ్యోతిక ఇటీవలే బాలీవుడ్ మూవీ సైతాన్లో నటించింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సైతాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న జ్యోతిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన భర్త సూర్యపై ప్రశంసలు కురిపించింది. సూర్య మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండే స్క్రిప్టులను ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని తెలిపింది. ఆ విషయంలో తాను గర్వపడతానని అన్నారు. ఆయన సినిమాల్లో మహిళలను కించపరిచేలా పాత్రలు ఉండవని.. వారి క్యారెక్టర్ మరింత ఉన్నతంగా ఉండేలా చూసుకుంటారని వెల్లడించింది. స్టోరీ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా.. ఆమె రోల్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా పట్టించుకోరని.. అందుకు జై భీమ్ చిత్రమే సాక్ష్యమని పేర్కొన్నారు. కాగా.. సైతాన్ మూవీతో జ్యోతిక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు వికాస్ భల్ దర్శకత్వం వహించారు. మరోవైపు సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. శివ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
మా అక్కను కాపాడండి.. మరోసారి సాయం కోరిన హీరోయిన్ సోదరి
కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతుంది. సుమారు ఆరు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే గానీ బతకదని తన సోదరి ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. అందుకోసం బ్యాంకు వివరాలను సైతం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికసాయం కోరుతూ అరుంధతి సోదరి ఆర్తి మీడియా ముందుకువచ్చారు. 'నా సోదరి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికి కూడా మా వద్ద డబ్బుల్లేవు. దాంతో మేము ఫండ్ రైజింగ్ మొదలుపెట్టాం. ఇదొక పెద్ద స్కామ్ అంటూ చాలామంది ట్రోల్ చేశారు. ఆస్పత్రి చుట్టూ మేము పరుగులు పెడుతుంటే ఇలాంటి నెగెటివిటీ వస్తుందనుకోలేదు' అన్నారు. ప్రస్తుతం అరుంధతికి బ్రెయిన్ సర్జరీ చేపించాలని ఆర్తి తెలిపింది. అందు కోసం త్రివేండ్రంలోని అనంతపూరి ఆస్పత్రిలో చేర్పించామని ఆమె చెప్పుకొచ్చింది. కదలలేని స్థితిలో వెంటిలేటర్ మీద అరుంధతి ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఇప్పటికే సుమారు రూ. 5 లక్షలకు పైగా ఖర్చు పెట్టామని ఆమె తెలిపింది. ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పలేమని.. అందుకు కావాల్సిన డబ్బు తమ వద్ద లేదని ఆమె వాపోయింది. సాయం చేయాలనుకునే వారి కోసం తన బ్యాంకు ఖాతా వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అరుంధతి స్నేహితురాలు, సహనటి రమ్య మాట్లాడుతూ.. 'కోలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాల్లో అరుంధతి హీరోయిన్గా నటించారు. ఆమె తలకు తీవ్రంగా గాయమైంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, లేదా నడిగర్ సంఘం సభ్యులు ఒక్కరూ సాయం చేయడానికి ఆసక్తి చూపించలేదు. కనీసం మాట్లాడనూ లేదు. తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోలేదు.సహ నటీనటులు కొంతవరకు మాత్రమే సాయం చేయగలరు. ఎందుకంటే, మేము రూ.కోట్లలో సంపాదించడం లేదు.' అని వాపోయారు. తమిళ చిత్రం అయిన 'పొంగి ఎజు మనోహర'తో అరుంధతి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన 'సైతాన్'లో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Arathy Nair (@aaraty.nairr) -
రొమాన్స్‌తో రెచ్చిపోయిన స్టార్ డైరెక్టర్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా!
లియో మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. తాజాగా నటుడి అవతారమెత్తాడు. తన తొలి వీడియోలోనే రొమాన్స్‌తో రెచ్చిపోయారు. హీరోయిన్ శృతి హాసన్‌తో కనగరాజ్ చేసిన రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. వీరిద్దరు ఇనిమేల్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియో తీసుకురానుండగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో ఈ జంట రొమాన్స్‌లో మునిగితేలారు. తాజాగా రిలీజైన ఇనిమేల్ ప్రోమో చూస్తే లోకేశ్, శృతి రెచ్చిపోయి నటించినట్లు అర్థమవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ వీడియోను రూపొందిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మ్యూజిక్ పెద్దగా లేకపోయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి వీడియోలోనే లోకేశ్ రెచ్చిపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. కేవలం 18 సెకన్లు మాత్రమే ఉన్న ప్రోమో తెగ వైరలవుతోంది. కాగా.. ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. లోకేశ్ కనగరాజ్ తన తదుపరి చిత్రాన్ని రజినీకాంత్‌తో తెరకెక్కించనున్నారు. #Inimel the game begins from 25th March. Mark the Moment! Streaming exclusively on https://t.co/UXpv3RSFt6#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelat25th@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit… pic.twitter.com/LCAju1D2eq — Raaj Kamal Films International (@RKFI) March 21, 2024 -
అర్ధరాత్రి భర్త చేసిన పనికి బుల్లితెర నటి ఎమోషనల్..!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. గతేడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తరచుగా వార్తల్లొ నిలిచారు. వీరిద్దరి పెళ్లి తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయిన రవీందర్ ఇటీవలే బెయిల్‌పై రిలీజై వచ్చారు కూడా. ఆ తర్వాత తమిళ బిగ్‌బాస్ సీజన్‌పై రివ్యూలు ఇస్తూ అభిమానులను అలరించారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇవాళ రవీందర్ భార్య మహాలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అర్ధరాత్రి కేక్ తీసుకొచ్చి భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మహాలక్ష్మి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతే ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. మహాలక్ష్మి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ పుట్టినరోజు తీవ్ర భావోద్వేగాలతో నిండిపోయింది. నా భర్త అర్ధరాత్రి నన్ను నిద్రలేపి కేక్‌తో సర్ప్రైజ్ ఇచ్చారు. అతన్ని భర్తగా కలిగి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా అమ్మ, సోదరుడు నన్ను మానసిక వికలాంగుల కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లలకు అన్న దానం చేశాం. ఇది నా గుండెకు హత్తుకునే అనుభవం. ముఖ్యంగా మా అమ్మ, చిన్న సోదరుడు చోటేకి ధన్యవాదాలు. మా నాన్న బంగ్లాదేశ్ నుంచి విష్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. అన్ని సమయాల్లో అండగా నిలిచిన మామయ్యకు ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఎల్లప్పుడూ ప్రత్యేకమైంది. మీ అందరు నా చుట్టూ ఉన్నందుకు సంతోషంగా ఉన్నా. ఈ రోజున శుభాకాంక్షలు తెలిపేందుకు సమయాన్ని వెచ్చించినందుకు నా కుటుంబం, స్నేహితులందరికీ, నన్ను ప్రేమించే వారికి కృతజ్ఞతలు' అంటూ మహాలక్ష్మి పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మహాలక్ష్మికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా నటి మహాలక్ష్మి కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదానానికి ఆమె ముందుకొచ్చారు. నేను చనిపోయాక కూడా నా ఆర్గాన్ ఇతరుల రూపంలో బతికే ఉంటాయని ఆమె తెలిపారు. నేను ఒక అవయవ దాతగా మారి ఇతరుల జీవితాల్లో వెలుగులు తీసుకురాగలననే నమ్మకంతో ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. నా నిర్ణయంతో అవసరమైన వారికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Pephands (@pephands_org) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) -
తంగలాన్ భామ స్పెషల్ లుక్.. బంగారు వర్ణంతో మెరిసిన భామ!
సినీ కుటుంబం నుంచి వచ్చిన మలయాళ భామ మాళవిక మోహనన్. మొదట్లో మాతృభాషలో నటించిన ముద్దుగుమ్మ.. ఆ తరువాత పేట చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైంది. పేట చిత్రంలో రజనీకాంత్ మిత్రుడు శశికుమార్ భార్యగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటించారు. అందులో పాత్ర పరిమితే అయినా, హిట్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ధనుశ్కు జంటగా మారన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కరోనా కాలంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. మరోపక్క మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ బహు భాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్‌కు జంటగా తంగలాన్ చిత్రంలో నటించారు. ఇందులో గిరిజన అమ్మాయి పాత్రలో నటించడం విశేషం. దీంతో తంగలాన్ చిత్రంపై అభిమానుల్లో చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావలసిన ఈ చిత్రం ఎన్నికల కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. కాగా ఈమె నటించిన చిత్రాల విడుదల ఆలస్యమైనప్పటికీ.. ఈ బ్యూటీ మాత్రం అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తరచు ప్రత్యేక ఫొటో షూట్ చేసుకుంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. అదే విధంగా తాజాగా 24 క్యారెట్ల బంగారంలా మెరిసి పోయే దుస్తులు ధరించి స్పెషల్ ఫొటో షూట్ చేసుకున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
స్టార్ హీరోయిన్‌కు ట్విన్స్.. వైరలవుతున్న పోస్ట్!
కొత్త ఏడాది ప్రారంభంలోనే హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ తాజాగా గర్భం ధరించినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే అమలాపాల్‌కు పెళ్లి కాగా.. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ శుభవార్త తెలుసుకున్న ఫ్యాన్స్ అమలాపాల్‌కు అభినందనలు తెలిపారు. తాజాగా అమలాపాల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాపను తన చేతుల్లో ఎత్తుకుని కనిపిచింది. అంతే కాకుండా 'టూ హ్యాపీ కిడ్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరలోనే తల్లి కాబోతున్న అమలాపాల్‌ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్ ద్వారా తనకు కవల పిల్లలు పుట్టబోతున్నారన్న హింట్ ఇచ్చిందా అనే డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అమలాపాల్ తాజా పోస్ట్ బట్టి చూస్తే త్వరలోనే ట్విన్స్‌కు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. గతేడాది జూన్ నుంచే డేటింగ్లో ఉన్న అమలాపాల్ నవంబర్‌లో జగత్ దేశాయ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే జనవరి 3న ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. కాగా.. టాలీవుడ్లో అల్లు అర్జున్‌కు జంటగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెప్పించింది. గతంలో మలయాళ డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన భామ.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
మృత్యువుతో పోరాడుతున్న హీరోయిన్.. కనీసం ఫోన్ కూడా చేయలేదు!
హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఓ ఇంటర్వ్కకు హాజరైన ఆమె అనంతరం తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సాయం కోసం నటి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని మరో నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు బ్యాంకు వివరాలను సైతం పొందు పరిచింది. అయితే ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీ సభ్యుల నుంచి ఎలాంటి సాయం అందలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు, బుల్లితెర నటి రెమ్యా జోసెఫ్ వెల్లడించారు. ఇంతవరకు వారి కుటుంబ సభ్యులను నడిగర్ సంఘం సభ్యులు కూడా సంప్రదించలేదని తెలిపింది. కనీసం ఫోన్ చేసి కూడా ఎవరూ ఆరా తీయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఆర్థిక సాయం కోరితే చాలామంది ట్రోల్ చేశారని అరుంధతి సోదరి ఆరతి వెల్లడించింది. ఇప్పటికే వైద్యానికి దాదాపు రూ.5 లక్షల ఖర్చు అయిందని పేర్కొంది. ప్రస్తుతం బ్రెయిన్ సర్జరీకి డాక్టర్లు సిద్ధమవుతున్నారని ఆరతి తెలిపారు. సినీ కెరీర్.. కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్ శివానందికమ్, సైతాన్, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఒట్టకోరు కాముకన్ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్ థింక్ అనే వెబ్ సిరీస్‌ల్లోనూ యాక్ట్ చేసింది. -
తన ప్రత్యేకత సిల్వర్ స్క్రీనే కాదు.. ఇన్‌స్టా ప్యాషన్ కూడా..
ప్రియంకా మోహన్.. నటించబోయే నెక్స్›్ట మూవీ కోసం ఎంతమంది ఎదురుచూస్తారో.. సోషల్ మీడియాలో ఆమె నెక్స్›్ట ఫొటో కోసమూ అంతేమంది వేచి చూస్తుంటారు. దీన్నిబట్టే చెప్పొచ్చు స్టోరీస్ సెలెక్షన్లో ప్రియంకా ఎంత ప్రత్యేకంగా ఉంటుందో! సిల్వర్ స్క్రీన్ కథే కాదు.. ఇన్‌స్టాలోని ఫ్యాషన్ స్టోరీనూ! ఆ స్టోరీ టెల్లింగ్‌లో ఈ బ్రాండ్స్ కూడా పార్ట్‌నర్సే! అకోయ జ్యూలరీ.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ట్రెండ్‌కి తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్‌లో తెగ క్రేజ్ సంపాదించుకుంటోంది. ఆ క్రేజే ఈ బ్రాండ్‌ను సెలబ్రిటీలకూ దగ్గర చేస్తోంది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్లైన్ లోనే కొనుగోలు చేసే వీలుంది. దేవ్నాగరి.. అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియంకా.. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నారు. కానీ అమ్మమ్మ స్ఫూర్తితో చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవ్నాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. చీర బ్రాండ్: దేవ్నాగరి, రూ. 57,000 జ్యూలరీ బ్రాండ్: అకోయ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇవి చదవండి: Alia Bhatt: తనకు 'ఆలూ' అనే ముద్దు పేరు ఎలా వచ్చిందో తెలుసా! -
ప్రముఖ నిర్మాణ సంస్థ ఓవరాక్షన్.. నటీనటుల ఆగ్రహం!
కండనాళ్ ముదల్, కణ్ణాముచ్చి ఏనడా చిత్రాల ఫేమ్ ప్రియ దర్శకత్వం వహించిన తాజాచిత్రం పొన్ ఒండ్రు కండేన్. ఈ చిత్రంలో అశోక్‌సెల్వన్, వసంత రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకు చెందిన వైఎస్సార్ ఫిలిమ్స్, జియో స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని కలర్స్ తమిళ్ టీవీ ఛానెల్లో విడుదల చేస్తున్నట్లు ప్రోమోను జియో స్టూడియోస్ సంస్థ తన ఎక్స్ మీడియాలో పేర్కొంది. ఇదే ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన వసంత్ రవి తీవ్రంగా ఖండించారు. ఈయన ఈ వ్యవహారంపై తన ఎక్స్ మీడియా ద్వారా స్పందిస్తూ ఈ విషయం తనను ఆశ్యర్యానికి గురి చేసిందన్నారు. జియో స్టూడియోస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలాంటి ప్రకటన చేయడమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పొన్ ఒండ్రు కండేన్ చిత్రాన్ని నేరుగా ఛానెల్లో విడుదల చేసే విషయం గురించి అశోక్‌సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, నిర్మాత యువన్‌శంకర్‌రాజా, దర్శకురాలు ప్రియ అనుమతి తీసుకోకుండా ఇలాంటి ప్రకటన చేయడం బాధ కలిగిస్తోందన్నారు. తాము ఈ చిత్రం కోసం కఠినంగా శ్రమించినట్లు పేర్కొన్నారు. అలాంటిది చిత్రాన్ని ఛానల్లో విడుదల చేయబోతున్నట్లు చేసిన ప్రకటన గురించి తమకెవరికీ తెలియదన్నారు. అలాంటి ప్రకటనను ఎక్స్ మీడియా ద్వారా ప్రకటించి తమకు మర్యాద నిచ్చినందుకు జియో స్టూడియోస్ సంస్థకు చాలా ధన్యవాదాలు అని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమను కలిసి ప్రకటన చేయడం సరికాదని వసంత్‌రవి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. మళ్లీ ఆమెనా?
లియో కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందా? అంటే దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమధానమే వినిపిస్తోంది. నటుడు విజయ్, నటి త్రిష సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఈ జంట ఇప్పుటికే ఆది, గిల్లీ, తిరుపాచ్చి, కురువి, లియోతో పాటు దాదాపు ఐదు చిత్రాల్లో జంటగా నటించారు. ఇందులో గిల్లీ, తిరుపాచ్చి, లియో చిత్రాలు మంచి విజయా న్ని సాధించాయి. కాగా తాజాగా మరోసారి ముచ్చటగా రెండో హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. కాగా.. విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఇందులో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలోనే విజయ్‌తో నటి త్రిష మరోసారి జత కడుతున్నట్లు తాజా సమాచారం. ఇందు తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్ సరసన త్రిష నటించనున్నారు. అయితే ఇది ప్రత్యేక పాత్రేనని సమాచారం. కాగా ముందు ఈ పాత్రకు నటి అనుష్కను నటింపజేసే ప్రయత్నం చేసినట్లు.. ఆమె తిరస్కరించడంతో ఈ అవకాశం నటి త్రిషకు వచ్చినట్లు టాక్. కాగా.. గోట్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చైన్నెలో జరుగుతోంది. కాగా ప్రస్తుతం త్రిష నటుడు కమలహాసన్‌కు జంటగా థగ్స్ లైఫ్, అజిత్ సరసన విడాముయర్చి చిత్రాలతో పాటు, ఓ మలయాళ, తెలుగు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
ఇంకెన్నాళ్లు ఈ దారుణాలు.. ఇంకెంతకాలం భరించాలి: నటి ఆవేదన
నటి సోనా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈమె బహు భాషా నటి. అంతకు మించి ఏదో ఒక ఘటనతో వార్తలో తరచుగా కనిపించే నటి. శృంగార తారగానూ ముద్ర వేసుకున్న సోనాలో నిర్మాత, దర్శకురాలు కూడా ఉన్నారు. తాజాగా తన బయోపిక్‌ను స్మోక్ అనే పేరుతో స్వీయ దర్శకత్వంలో వెబ్ సిరీస్‌గా రూపొందిస్తున్నారు. కాగా ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన బాలిక అత్యాచారం, హత్యా ఘటనపై స్పందించింది. ఈ రోజు మనం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని.. కానీ ఇటీవల పాండిచ్చేరిలో చిన్నారికి జరిగిన దారుణ ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక అమ్మాయిగా ఎలా ఉండాలో అనేది కూడా తెలియని ఆ బాలికను చిత్ర వధ చేసి ప్రాణాలు తీయడం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఇలాంచి క్రూరమైన ఘటనతో మనం మానవ సమాజంలోనే బతుకుతున్నామా? లేక మృగాల మధ్య జీవిస్తున్నామా? అని తెలియడం లేదన్నారు. ఒక నటిగా తానూ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొని బయట పడ్డానని చెప్పారు. మృగాల్లాంటి మగాళ్ల మధ్య జీవించడానికి.. రక్షించుకోవడానికి అనునిత్యం పరుగులు తీస్తూనే ఉన్నామన్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న ఈ నాగరిక ప్రపంచంలో మహిళలను అణచివేయడం.. కించపరచడం, తప్పుగా చిత్రీకరించడడం కొనసాగుతూనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిని ఇంకా ఎంతకాలం మౌనంగా భరించాలి.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నటి సోనా పేర్కొన్నారు. -
టాలీవుడ్ హీరోయిన్‌కు సీఎం కుమారుడు ఖరీదైన గిఫ్ట్.. వైరలవుతోన్న ట్వీట్!
హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం తన అందం, అభినయంతో ప్రేక్షకులనున ఆకట్టుకుంటుంది. ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చిత్రలహరి, అలా వైకుంటపురంలో సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. గతేడాది యంగ్ విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ చిత్రంలో హీరోయిన్గా అలరించిన భామ.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో నటన, మోడలింగ్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. అంతేకాదు ఇటీవలే మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్షిప్ పోటీలోని మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనపై వస్తున్న వార్తలన్ని అవాస్తమని కొట్టిపారేసింది. మీరు ఏదైనా రాసేముందు దయచేసి నిజాలు ఏంటో తెలుసుకోవాలని సూచించింది. ఇలాంటి వాటితో తమ కుటుంబం ఒత్తిడిలో ఉందని.. అనవసరంగా ఒక అమ్మాయి జీవితంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. నివేదా పేతురాజ్ తన ట్వీట్లో రాస్తూ..'నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ నేను మౌనంగా ఉన్నా. ఎందుకంటే దీని గురించి మాట్లాడే బుద్దిలేని కొందరు వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసే ముందు వారు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి కొంతైనా మానవత్వంతో ఉంటారని భావించా. వాటి వల్ల కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.' అంటూ విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత రాస్తూ.. 'నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చా. 16 ఏళ్ల వయసు నుంచే ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నా. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్‌లోనే నివసిస్తోంది. మేము దాదాపు 20 ఏళ్లకు పైగా దుబాయ్‌లో ఉన్నాం. సినీ పరిశ్రమలో కూడా నాకు అవకాశాలు ఇప్పించమని నేను ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోను అడగలేదు. ఇప్పటికీ 20కి పైగా సినిమాలు చేశా. నేను ఎప్పుడూ డబ్బు కోసం అత్యాశ పడలేదని' రాసుకొచ్చింది. నా గురించి ఇప్పటివరకు మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదు. మేము 2002 నుంచి దుబాయ్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. అలాగే 2013 నుంచి రేసింగ్ అంటే నా అభిరుచి. నిజానికి చెన్నైలో రేసులను నిర్వహించడం గురించి నాకు తెలియదు. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నా. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మానసికంగా పరిణీతి సాధించా. అంతేకాదు.. మీ కుటుంబంలోని ఇతర స్త్రీలు కోరుకున్నట్లే గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని.. ఇకపై నా పరువు తీసేలా వ్యవహరించని ఇప్పటికీ విశ్వసిస్తున్నందున చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒక కుటుంబం ప్రతిష్టను కించపరిచేలా మాట్లాడేముందు.. మీరు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించుకోవాలని కోరుతున్నా. అలాగే మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని మీడియా మిత్రులకు అభ్యర్థిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చింది. అసలేం జరిగిందంటే.. కాగా.. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నివేదా పేతురాజ్‌కు 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ వచ్చాయి. ఆమె కోసం ఉదయనిధి స్టాలిన్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఇదే విషయమై తమిళ సినీ ఇండస్ట్రీకి ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న నివేదా పేతురాజ్ ఘాటుగా స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనంటూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. Lately there has been false news circulating about money being lavishly spent on me. I kept quiet because I thought people who are speaking about this will have some humanity to verify the information they receive before mindlessly spoiling a girl’s life. My family and I have… — Nivetha Pethuraj (@Nivetha_Tweets) March 5, 2024 -
వరలక్ష్మి ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త గురించి విస్తుపోయే నిజాలు!
ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా.. ఉన్నట్టుండి ఈ భామ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. పెళ్లిపై గతంలో చాలాసార్లు దాటవేస్తూ వచ్చిన వరలక్ష్మి ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్‌ను పెళ్లాడనుంది. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్‌ను పెళ్లాడబోయే వ్యక్తిగా గురించి ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? అనే విషయాలపై ఆడియన్స్ నెట్టింట చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్ సచ్దేవ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు అతనెవరు? వరలక్ష్మీకి ఎలా పరిచయమయ్యాడు? అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి వెతకగా.. ఆశ్చర్యపోయే నిజం బయటికొచ్చింది. వరలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకోనుందన్న వార్త తెలియగానే.. నికోలయ్ సచ్దేవ్ గురించి ఆమె ఫ్యాన్స్ నెట్టింట వెతకడం మొదలెట్టారు. అయితే ఆయన గురించి అభిమానులకు గుండె పగిలే నిజం తెలిసింది. అతనికి ఇంతకుముందే పెళ్లయినట్లు సమాచారం. నికోలయ్ మొదట కవిత అనే ఓ మోడల్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారట. దీంతో విషయం తెలుసుకున్న వరలక్ష్మి ఫ్యాన్స్ కాబోయే భర్తకు ఇది రెండో పెళ్లా? అని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై నికోలయ్, వరలక్ష్మీ కానీ ఇంకా స్పందించలేదు. వీరిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ విషయంలో వరలక్ష్మి ఫ్యాన్స్ మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
ఈ ఫోటోలోని వ్యక్తి స్టార్ హీరోయిన్ మదర్.. ఎవరో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గతేడాది రిలీజైన సలార్‌తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. అయితే గతంలో ఆమె సింగర్‌గా కూడా సుపరిచితమే. ప్రస్తుతం జయం రవి, నిత్యామేనన్ నటిస్తున్న ఓ తమిళ సినిమాకు పాట పాడనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తన తల్లిదండ్రుల ఫోటోలతో వీడియోను రూపొందించింది. నాకు అమ్మా, నాన్న అంటే చాలా ఇష్టం.. వారిద్దరు నా జీవితంలో అద్భుతమైన. ప్రత్యేక వ్యక్తులని తెలిపింది. వారు నా తల్లిదండ్రులు కావడం నా అదృష్టమని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మొదట వాణి గణపతిని పెళ్లాడిన కమల్ హాసన్.. ఆ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత సారికను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అక్షర హాసన్, శృతి హాసన్ జన్మించారు. కాని అనివార్య కారణాలతో 1988లో పెళ్లి చేసుకున్న కమల్, సారిక 2004లో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
నయన్ - విఘ్నేశ్ జంటపై రూమర్స్.. ఆ ఫోటో షేర్ చేసిన భర్త!
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్‌లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది షారుక్ సరసన జవాన్‌తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఆమె నటించిన అన్నపూరణి పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో ఓ వర్గం వారిని కించపరిచేలా సీన్స్ ఉన్నాయంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీ నుంచి తొలగించింది. అయితే ఇటీవల నయన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన భర్తను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడంతో పెద్ద ఎత్తున రూమర్స్ మొదలయ్యాయి. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట విడిపోనుందా? అనే అనుమానాలు తలెత్తాయి. కానీ అంతలోనే మళ్లీ తన భర్తను ఫాలో చేసింది. దీంతో ఈ జంట విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టింది. కానీ తాజా పరిణామాలతో వాటికి చెక్ పెడుతూ.. విఘ్నేశ్ శివన్ ఆమె ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్స్‌కు తెరపడింది. కాగా.. నయనతార ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా.. గత నెల ప్రేమికుల రోజు నయనతార.. తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. -
హీరోయిన్‌పై చేయి చేసుకున్న డైరెక్టర్.. క్లారిటీ ఇదే!
ఇటీవల యంగ్ హీరోయిన్, మలయాళ భామ మమితా బైజు పేరు వార్తల్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన చిత్రం ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మలయాళంలో హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ డైరెక్టర్ తనపై అనవసరంగా చేయి చేసుకున్నారంటూ మమితా ఆరోపించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వనంగాన్ సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు రాసుకొచ్చారు. (ఇది చదవండి: డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్) అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై మమితా బైజు స్పందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టి పారేసింది. బాలతో ‘వనంగాన్’ సినిమా కోసం ఏడాది పాటు పని చేసినట్లు తెలిపింది. కానీ ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. నన్ను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. అతను నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదని.. కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు మమితా వివరించింది. కాగా.. ప్రేమలు సినిమా తెలుగు రైట్స్ రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఈ నెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలై రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా.. వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
రాజకీయ నాయకుడు అసభ్యకర కామెంట్స్.. త్రిష కీలక నిర్ణయం!
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్స్‌పై పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ విషయంలో త్రిష చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే వెల్లడించింది. తన లీగల్ టీం దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తుందని తెలిపింది. తాజాగా ఏవీ రాజు కామెంట్స్‌పై త్రిష టీం చర్యలకు దిగింది. ఆయనపై త్రిష పరువునష్టం దావా కేసు వేశారు. దీనికి సంబంధించిన నోటీసులను తన ట్విటర్లో పంచుకున్నారు. తన లీగల్ టీం ద్వారా ఏవీ రాజుకు నోటీసులు పంపించారు. కాగా.. గతంలో త్రిషపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అసభ్యకర కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు త్రిషను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన కామెంట్లను కోలీవుడ్ సినీ తారలంతా మూకుమ్మడిగా ఖండించారు. త్రిషకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గతంలో ఓ ఎమ్మెల్యే త్రిషకు డబ్బులిచ్చి రిసార్ట్‌కు తీసుకొచ్చారంటూ ఏవీ రాజు చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. pic.twitter.com/DmRXHibIYx — Trish (@trishtrashers) February 22, 2024 -
'నువ్వు ప్రపోజ్ చేసిన క్షణం.. కళ్లార్పకుండానే': సీనియర్ హీరోయిన్
సీనియర్ నటి ఖుష్బు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలతో మెప్పించింది. 1990లో సౌత్‌లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో మెప్పించింది. కాగా.. 1995లో మురై మామన్ చిత్రంలో నటిస్తుండగానే డైరెక్టర్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాద ఐదేళ్లకు మార్చి 9న 2000 ఏడాదిలో దర్శకుడు సుందర్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను పంచుకుంది. తన భర్త ప్రపోజ్ చేసిన తేదీని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆయన ప్రపోజ్ చేసిన రోజు నుంచి ఇప్పటివరకు నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని పోస్ట్ చేశారు. సోషల్ మీడియా లేని రోజుల్లో మీరు ప్రపోజ్ చేయగానే ఎలాంటి ఆలోచన లేకుండా అంగీకరించానని రాసుకొచ్చింది. 29 ఏళ్ల క్రిత నేను తీసుకున్న ఆ నిర్ణయం అత్యుత్తమమని ఖుష్బు ఎమోషనలయ్యారు. ఖుష్బు తన ట్వీట్లో రాస్తూ..'22 ఫిబ్రవరి 1995 నుంచి.. 22 ఫిబ్రవరి 2024 వరకు ఏమీ మారలేదు. కేవలం నా వయసు మాత్రమే పెరిగింది అంతే. మీలో ఉప్పు, మిరియాల సువాసన అలానే ఉంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం.. మన తప్పులను అంగీకరించడం.. ఒకరినొకరు ప్రోత్సహించడం. ఆపద సమయంలో అండగా నిలవడం. ఒకరి చేయి ఒకరం పట్టుకుని.. మన అందమైన కుటుంబాన్ని నిర్మించే మార్గంలో నడుస్తున్నాం. మీరు నాకు ప్రపోజ్ చేసి ఈ రోజుకు 29 సంవత్సరాలైంది. ఎలాంటి కెమెరాలు, ఫోటోలు, సోషల్ మీడియా లేని రోజుల్లో నీ ప్రేమను అంగీకరించా. ఒక్కసారి ఆలోచించకుండా.. కను రెప్పవేయకుండానే ఓకే చెప్పా. కొన్నిసార్లు ఉత్తమ నిర్ణయాలు గట్స్ ఫీలింగ్‌తో తీసుకోబడతాయి. ఈ రోజు మీరు అది నిరూపించారు. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. మీ ప్రపోజల్‌ను అంగీకరించడం నా జీవితంలోనే అత్యుత్తమ నిర్ణయం. నీపై 29 ఏళ్ల క్రితం మొదలైన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఖుష్బు గతేడాది తెలుగులో గోపించంద్ చిత్రం రామబాణంలో కనిపించింది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అందువల్లే సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో ఒకరైన దర్శకుడు సుందర్ తమిళంలో 32 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. అంతే కాదు 20కి పైగా సినిమాల్లో నటించారు. ఉల్లతై అల్లిత, అరుణాచలం, అన్బే శివం, విన్నర్, గిరి, కలకలప్పు, తీయ వేళై సెయ్యనుం కుమారు, అరణ్మనై, అంబాల, వంత రాజావతాన్ వరువేన్ సినిమాలు చేశారు. From then on, 22nd Feb 1995, to now, 22 Feb 2024, nothing has changed. Except that I have grown older and you have salt n pepper sauciness now. The love, respect for each other, accepting each other with our minuses, encouraging each other to give and do our best. Standing by… pic.twitter.com/j0H5DNzuXP — KhushbuSundar (@khushsundar) February 21, 2024 -
'త్రిషపై వ్యాఖ్యలను ఖండించడం ఇష్టం లేదు'.. విశాల్ ట్వీట్ వైరల్!
స్టార్ హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారితీశాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలైంది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు త్రిష కూడా ట్వీట్ చేసింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు మండిపడుతున్నారు. త్రిషకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హీరో విశాల్ స్పందించారు. ఇలాంటి కామెంట్స్‌పై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక మూర్ఖుడు మా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా.. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తారని నాకు తెలుసు అన్నారు. సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. భూమిపై ఉన్న అలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించిందని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ తన ట్వీట్లో రాస్తూ..'ఒక రాజకీయ పార్టీకి చెందిన తెలివితక్కువ మూర్ఖుడు. మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా. ఇది పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు. కాబట్టి మీ పేరును ప్రస్తావించను. మీరు టార్గెట్ చేసిన తన పేరును కూడా ప్రస్తావించను. ఎందుకంటే మేము మంచి స్నేహితులం మాత్రమే కాదు.. సినిమాల్లో సహచరులం కూడా. మీరు చేసిన పని తర్వాత మీ ఇంట్లో ఉన్న స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నా.' అని రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తావిస్తూ..' ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసిన పనిని చెప్పేందుకు కూడా మాటలు రావడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు నిన్ను ఖండించడం ఇష్టం లేదు.. ఎందుకంటే నీకు ఇది చాలా తక్కువే అవుతుంది. అందుకే మీరు నరకంలో కుళ్లిపోవాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ ఒక మనిషిగా చెబుతున్నా. మీరు భూమిపై ఉన్నంత వరకు మనిషిలాగా ఎప్పటికీ ఉండలేరు. ప్రస్తుతం సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఒక ట్రెండ్‌గా మారింది. డబ్బు కోసమే అయితే మంచి ఉద్యోగం సాధించండి. లేదా కనీసం ప్రాథమిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి' అంటూ తనదైన శైలిలో విశాల్ కౌంటరిచ్చారు. I just heard that a stupid idiot from a political party spoke very ill and disgustingly about someone from our film fraternity. I will not mention your name nor the name of the person you targeted because I know you did it for publicity. I definitely will not mention names… — Vishal (@VishalKOfficial) February 20, 2024 -
త్రిషపై మరోసారి అలాంటి కామెంట్స్.. ఇంతటి నీచానికి దిగుజారుతారా?
గతేడాది లియోతో సూపర్ హిట్ కొట్టిన భామ త్రిష. విజయ్ సరసన హీరోయిన్గా నటించి బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదస్పదమయ్యాయి. ఏకంగా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడ్డారు. అయితే తాజాగా అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు చేసిన అసభ్యకర కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్రిషపై ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ అతనిపై మండిపడుతున్నారు. తక్షణమే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో త్రిషకు పలువురు అండగా నిలుస్తున్నారు. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలవుతోంది. (ఇది చదవండి: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్!) తాజాగా ఈ విషయంపై హీరోయిన్ త్రిష స్పందించింది. ఫేమస్ కావడం కోసం ఏంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు అవీ.. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. దీనిపై త్వరలోనే న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ తదుపరి చర్యలు తీసుకుంటుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్‌కు తీసుకొచ్చారని ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఏవీ రాజు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది చూసిన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా త్రిషపై అసభ్యంగా మాట్లాడిన ఏవీ రాజును అరెస్ట్ చేయాలని నటుడు, దర్శకుడు చేరన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై నటీనటుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా బహిరంగంగా సినీ పరిశ్రమలోని సభ్యులను కించపరిచేలా మాట్లాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. WTF this Trisha should file legal action against him,nowdays these guys are behaving very cheaply #Trisha | #TrishaKrishnan pic.twitter.com/Ip1ZClB8xS — Sekar 𝕏 (@itzSekar) February 20, 2024 It's disgusting to repeatedly see low lives and despicable human beings who will stoop down to any level to gain https://t.co/dcxBo5K7vL assured,necessary and severe action will be taken.Anything that needs to be said and done henceforth will be from my legal department. — Trish (@trishtrashers) February 20, 2024 வன்மையாக கண்டிக்கிறேன்.. எந்த ஆதரமுமின்றி பொது வெளியில் திரைத்துறையினர் பற்றி பெயர் சொல்லி அவதூறு கிளப்பிய இவரை சட்டமும் காவல்துறையும் உரிய நடவடிக்கை எடுக்க வேண்டும்... @VishalKOfficial @Karthi_Offl நடிகர் சங்கம் இதற்கு தகுந்த பதிலும் நடவடிக்கையும் எடுக்கும் என நம்புகிறேன் https://t.co/fRNYxH5DAV — Cheran (@directorcheran) February 20, 2024 Shocked & disgusted by the behaviour of Ex AIADMK functionary A. V. Raju for making unwarranted , baseless, loose and completely false allegations about Trisha. It is 2024; we talk about women empowerment & equality - why drag an unrelated person into personal mud slinging. There… — Aditi Ravindranath (@aditi1231) February 20, 2024 -
ప్రియుడితో ప్రేమ పెళ్లి.. విడాకులతో షాకిచ్చిన బుల్లితెర నటి!
కోలీవుడ్‌లో బుల్లితెరపై మెప్పించిన నటి ప్రియాంక నల్కారి. తమిళంలో సీతారామన్ అనే సీరియల్‌తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత రోజా సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లోనూ మెరిసింది. అంతేకాకుండా టాలీవుడ్లో అందరి బంధువయా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎస్ఎంఎస్, హైపర్, నేనేరాజు నేనేమంత్రి, వైఫ్ఆఫ్ రామ్, కిక్-2 చిత్రాల్లో నటించింది. అయితే గతేడాది ఆడియన్స్‌కు ఊహించని షాకిచ్చింది ప్రియాంక. తన ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లాడింది. బుల్లితెర నటుడు రాహుల్ వర్మను మలేషియాలో పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఆ వార్త విన్న ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. కోలీవుడ్‌లో బుల్లితెరతో పాటు వెండితెరపై మెరిసిన ప్రియాంక నల్కారి ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో నలదమయంతి అనే సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నారు ప్రియాంక నల్కారి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది.' ఏడాదిలోపే విడాకులు..! గతేడాది మార్చిలో పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ జంట విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆడియన్స్‌తో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు భర్తతో విడిపోయారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అవునని సమాధానమిచ్చింది ప్రియాంక. అలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా సమాధానాలిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. పెళ్లైన ఏడాదిలోపే ప్రియాంక విడాకులు తీసుకోవడంతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే ప్రియాంక సీతారామన్ సీరియల్ నుంచి తప్పుకుంది. అప్పట్లోనే దీనికి కారణం తన భర్తే అని కూడా చెప్పుకొచ్చింది. ప్రియాంక ఓ సీరియల్లో నటించేందుకు చెన్నైకి రావడం.. ఆమె భర్త మలేషియాలో ఉండడంతో వారి మధ్య దూరం పెరగడం వల్లే ప్రియాంక నటనకు స్వస్తి చెప్పిందని కూడా కొందరు రాసుకొచ్చారు. కానీ.. ఆ తర్వాత ప్రియాంక నలదమయంతి అనే సీరియల్‌తో మళ్లీ నటించడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ పేజీలో భర్త ఫోటోలన్నింటినీ తొలగించింది. ప్రియాంక భర్త రాహుల్ కూడా ఆమెతో ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేశాడు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం ప్రియాంక నల్కారి వెల్లడించలేదు. ఈ టాపిక్ ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రియాంక భర్త రాహుల్ వర్మ విషయానికొస్తే.. నటుడు, బిజినెస్ మేన్ రాణిస్తున్నారు. అతడు తెలుగులో పలు సీరియల్స్‌లో నటించాడు. అదే క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018లో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత గతేడాది మలేషియాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka Nalkari Official (@nalkarpriyanka) -
స్టార్ డైరెక్టర్‌తో శృతిహాసన్.. అసలు సెట్ అవుతుందా?
కోలీవుడ్ భామ శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ సెట్ అయిందా? ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇదే. మల్టీ టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్. నటిగా మాత్రమే కాదు.. సింగర్, సంగీత దర్శకురాలు అనే విషయం తెలిసిందే. బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న భామ తెలుగులో వరుసగా విజయాలను అందుకుంటున్నారు. తమిళంలో మాత్రం మంచి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. అదేవిధంగా లియో డైరక్టర్ లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే మా నగరం చిత్రంతో దర్శకుడుగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 171వ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ఖైదీ–2, విక్రమ్–2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఉన్న పోస్టర్ సామాజిక మాద్యమాల్లో వైరలవుతోంది. వీరి కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతుందా అన్న చర్చ కోలీవుడ్‌లో మొదలైంది. అయితే ఆ పోస్టర్లో ఇనిమే మాయెమే తీర్వాగుమ్ ఇదువే ఉరువు, ఇదువే సూల్ నిల్ ఇదువే మాయై ( ఇకపై మాయనే పరిష్కారం ఇదే బంధం ఇదే పరిస్థితి ఇదే మాయ) అని పేర్కొన్నారు. దీంతో ఇది చిత్రంగా రూపొందుతుందా? లేక కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శ్రుతిహాసన్‌తో దర్శకుడు లోకేష్ మ్యూజికల్ ఆల్బమ్‌ను రూపొందించబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
యంగ్ హీరోతో జతకట్టనున్న పొన్నియిన్ సెల్వన్ భామ!
వైవిధ్య భరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ఫుల్ బాటలో పయనిస్తున్న యంగ్ హీరో అశోక్‌సెల్వన్. ఇటీవల ఈయన నటించిన పోర్ తొళిల్, బ్లూస్టార్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణతో విజయం సాధించాయి. తాజాగా అశోక్‌సెల్వన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పొన్ను ఒన్ను కండేన్. వి. ప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఫేమ్ ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటిస్తున్నారు. వసంత రవి మరో ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. పొన్ను ఒన్ను కండేన్ చిత్రం యువతను ఆకట్టుకునే పలు ఆసక్తికరమైన అంశాలతో ఉంటుందని సమాచారం. అశోక్‌సెల్వన్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలిసింది. నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి చిన్న గ్యాప్ తరువాత ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
స్టార్ హీరో భార్య సూపర్ హిట్ చిత్రం.. ఐదేళ్ల తర్వాత వస్తోంది!
జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాక్షసి. ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాష్, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. తమిళంలో హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులోనూ తీసుకొస్తున్నారు. అమ్మ ఒడి టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈనేపథ్యంలో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే టీచర్ పాత్రలో జ్యోతిక నటించారు. పాడైపోయిన స్కూళ్లను.. పునరుద్దించాలనుకునే పాత్రలో జ్యోతిక నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రంలో నాగినీడు హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్, సత్యన్ ముఖ్యపాత్రలు పోషించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. -
స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో కాదట!
దసరా బ్యూటీ కీర్తి సురేశ్, జయం రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'సైరెన్'. 108 అనేది ఉపశీర్షిక. యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని కీర్తి సురేశ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథనే సినిమాగా రూపొందిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి జైలు నుంచి బయటికొచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కుతోంది. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్..! అయితే ఈ సినిమాపై మొదట డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కానుందని వార్తలొచ్చాయి. ఈ మూవీ రిలీజ్ తేదీపై గతంలో చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. దీంతో ఈ సినిమాను ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను జయం రవి, కీర్తి సురేష్ ట్విటర్లో పంచుకున్నారు. (ఇది చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్..!) కాగా.. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. డీజే టిల్లు స్క్వేర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. మరోవైపు కీర్తి సురేశ్ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. . @actor_jayamravi coming out on parole this Feb16th ! 🚨#SirenFromFeb16 #Tamil & #Telugu A @gvprakash Musical @antonybhagyaraj @anupamahere @sujataa_HMM @iYogiBabu @IamChandini_12 @AntonyLRuben @brindagopal @dhilipaction @selvakumarskdop @SaktheeArtDir @shiyamjack… pic.twitter.com/Au67K5Vo3F — Keerthy Suresh (@KeerthyOfficial) January 22, 2024 -
Kalyani Priyadarshan Latest Photos: సాంప్రదాయ దుస్తులలో ఊరిస్తున్న కోలీవుడ్ బ్యూటీ.. (ఫోటోలు)
-
'డైరెక్టర్స్ రొమాంటిక్ హీరోయిన్‌గానే చూస్తారు.. కానీ అలా తొలిసారి'
డైరెక్టర్స్ రొమాంటిక్ హీరోయిన్‌గానే చూస్తారుహాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లండన్‌కు చెందిన బోల్డ్ అండ్ బ్యూటీ మోడలింగ్ రంగంలో రాణిస్తూ దర్శకుడు ఎంఎల్ విజయ్ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన మదరాసు పట్టణం చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ తరువాత రజినీకాంత్, విజయ్, విక్రమ్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించి భారతీయ సినీ నటిగా గుర్తింపు పొందారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో లండన్‌కు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ వెబ్‌సీరీస్‌లో నటించారు. అలాంటి పరిస్థితుల్లో తనను కథానాయకిగా పరిచయం చేసిన దర్శకుడు ఏఎల్ విజయ్ మళ్లీ అమీజాక్సన్‌ను కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఆమె నటించిన తాజా చిత్రం మిషన్ చాప్టర్–1. అరుణ్‌విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లైకా పొడక్షన్ సంస్థ నిర్మించింది. పొంగల్ సందర్భంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో అమీజాక్సన్ లండన్‌కు చెందిన పవర్ఫుల్ పోలీసు అధికారిగా నటించడం విశేషం. అయితే అనారోగ్యంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు విజయ్ తన చిత్రాల్లో పాత్రలను శక్తివంతంగా రూపొందిస్తారన్నారు. ఎంతగా అంటే.. ఎన్నేళ్లయినా కూడా ఆ పాత్రలు అలా గుర్తుండిపోతాయన్నారు. అలాంటి దర్శకుడి ద్వారా మదరాసు పట్టణం చిత్రంతో తాను హీరోయిన్గా పరిచయం అవడం తన అదృష్టమని అన్నారు. మిషన్ చాప్టర్ –1 చిత్రంలో తాను చాలా ముఖ్యమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. చాలా మంది దర్శకులు తనను రొమాంటిక్ హీరోయిన్‌గానే చూస్తారని.. అందువల్ల తనకు యాక్షన్ కథాపాత్రలు వస్తాయని ఊహించలేదన్నారు. అలాంటిది దర్శకుడు తనకు యాక్షన్ హీరోయిన్గా చూపించారని చెప్పారు. ఈ చిత్రం తన సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం తనకు ఉందని అమిజాక్సన్ పేర్కొన్నారు. -
స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ కూతురు!
వైద్య విద్య చదివి హీరోయిన్గా సినీ రంగప్రవేశం చేసిన నటి ఆదితి శంకర్. అంతే కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఆదితి శంకర్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. అందులో ఈ చైన్నె చంద్రం పక్కా పల్లెటూరి యువతిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా తొలి చిత్రంలోని పాటను కూడా పాడి సింగర్‌గా కూడా పరిచయమయ్యారు. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా అనూహ్య విజయాన్ని అందుకుంది. కాగా.. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్నారు. నటుడు అధర్వ తమ్ముడు ఆకాష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. ఈ చిత్ర నిర్మాణంలో ఉండగానే ఆదితి శంకర్ మరో లక్కీచాన్స్ తలుపు తట్టినట్టు తాజా సమాచారం. విరుమాన్ చిత్రంలో కార్తీతో జత కట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరో సూర్య సరసన నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. కాగా... నటుడు సూర్య ప్రస్తుతం కంగువా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. శివ దర్శకత్వంలో ఈ భారీ చారిత్రక కథా చిత్రం త్రీడీ ఫార్మెట్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. కాగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడి వాసల్ చిత్ర షూటింగ్లో సూర్య 10 రోజులు పాల్గొననున్నారు. ఆ తరువాత సుధా కొంగర దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఇందులో దుల్కర్ సల్మాన్ ,విజయ్‌వర్మ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. అదేవిధంగా ఇందులో నజ్రియా నాయకిగా నటిస్తున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ఆదితి శంకర్‌ను తీసుకున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
Aishwarya Rajesh Birthday: కోలీవుడ్ స్వప్న సుందరి ఐశ్వర్య రాజేశ్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
ఆ హీరోపై కన్నేసిన హీరోయిన్.. అదే తన లక్ష్యమట!
కోలీవుడ్‌లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న శింబుతో జత కట్టడమే తన జీవిత లక్ష్యం అంటోంది వర్ధమాన నటి దేవయాని శర్మ. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తోంది. అదేవిధంగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. 2021లో రొమాంటిక్ అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించి తన నటనతో అందరినీ మెప్పించింది. ఆవిధంగా ప్రారంభంలోనే గుర్తింపు తెచ్చుకున్న దేవయానిశర్మ పలు రకాల నృత్యాల్లో శిక్షణ పొందడం విశేషం. హిందీ, తెలుగు భాషల్లో నటిస్తున్నా తమిళ చిత్రాల్లో నటించాలన్నది తన కోరిక అని పేర్కొంది. సాధారణ కథానాయకి పాత్రల్లో కాకుండా ప్రతిభకు పదునుపెట్టే వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలన్నదే తన ఆశయమని చెబుతోంది. హీరోయిన్లలో కీర్తీ సురేష్, సాయిపల్లవి అంటే తనకు చాలా ఇష్టమని.. నటిగా వారే తనకు ఆదర్శమని పేర్కొంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే శింబు అంటే పిచ్చి అభిమానమని.. కచ్చితంగా ఆయనతో జత కడతానని.. అదే తన జీవిత లక్ష్యమని అంటోంది. అందుకోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పింది. అదే సమయంలో మంచి నటిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడానికి తన వంతు కృషిచేస్తానని చెప్పింది. మొత్తం మీద హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో పాగా వేసిన ఢిల్లీ భామ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలోనూ త్వరలో పాగా వేస్తాననే ధీమాను వ్యక్తం చేస్తోంది.ఈ ముద్దుగుమ్మ ఆశ ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Deviyani Sharma (@deviyyani) -
స్కూల్లోనే ప్రేమలో పడ్డా.. కానీ అలా జరగలేదు: చంద్రముఖి నటి
కుంకీ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ నటి లక్ష్మీ మీనన్. ఆ తరువాత వరుసగా అవకాశాలు వరించడంతో బిజీగా మారిపోయింది. అలా పలు హిట్ చిత్రాలలో నటించిన ఈ అమ్మడు ప్లస్–2 పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే నటనకు విరామం తీసుకుంది. అదే లక్ష్మీమీనన్ చేసిన పెద్ద పొరపాటు. ఆమె తనకు తానుగా తీసుకున్న విరామం పర్మినెంట్‌గా మారింది. ఆ తరువాత కొన్ని చిత్రాలలో నటించినా అవి పెద్దగా ఆడలేదు. అలాంటిది గతేడాది చంద్రముఖి–2 చిత్రంలో మెరిసింది. ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. కాగా సమీప కాలంలో తమిళ నిర్మాతల మండలి ఇతర సినీ సంఘాలతో కలిసి నిర్వహించిన కలైంజర్- 100 కార్యక్రమంలో నటి లక్ష్మీమీనన్ ఓ పాటకు డాన్స్ చేసింది. అయితే తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన లక్ష్మి మీనన్ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. మీరు ఎవరినైనా ప్రేమించారా? లేక మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? అన్న ప్రశ్నకు తన తొలి ప్రేమ అనుభవాన్ని వెల్లడించింది. తనను ఎవరూ ప్రేమించలేదని.. కానీ పాఠశాలలో చదువుతున్న సహ విద్యార్థితో తానే ప్రేమలో పడ్డానని చెప్పింది. అతను నచ్చడంతో నేరుగా అతని వద్దకు వెళ్లి తన ప్రేమ గురించి చెప్పానంది. కొన్ని రోజుల తరువాత అతను అంగీకరించాడని తెలిపింది. అయితే తామిద్దరం తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, ఔటింగ్‌కు వెళ్లడం వంటివి జరగలేదని చెప్పింది. మేమిద్దరం కేవలం చదువుపైనే దృష్టి సారించి స్నేహితుల్లాగే ఉన్నామని తెలిపింది. ఎప్పుడో ఒకసారి కలిసి మాట్లాడుకునే వారమని చెప్పింది. అయితే పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తరచూ కలుసుకునేవారిమని.. ఫోన్లో మాట్లాడుకునే వాళ్లమని చెప్పుకొచ్చింది. అలా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్లమని వెల్లడించింది. అయితే పాఠశాల చదువు పూర్తయ్యాక మా మధ్య ప్రేమ కూడా కనిపించకుండా పోయిందని చెప్పింది. ఆ తరువాత ఇద్దరం తమ వృత్తిలో బిజీ అయిపోయామని చెప్పింది. కాగా.. అతను ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని చెప్పింది. దీంతో మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు? అన్న ప్రశ్నకు ఇంట్లో వాళ్లు చూసిన వ్యక్తినే చేసుకుంటానని స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by 𝐋𝐚𝐤𝐬𝐡𝐦𝐢 𝐌𝐞𝐧𝐨𝐧 (@lakshmimenon967) -
Actress Sneha ‘సిల్వర్ స్క్రీన్’ అందాల నటి స్నేహ స్టైలిష్.. ఫొటోలు
-
సన్ని లియోన్ మూవీ హీరోయిన్.. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న భామ!
ఈ రోజుల్లో ఫేమస్ కావడం చాలా ఈజీ. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నటీమణులు సోషల్ మీడియాను ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నారు. అవకాశాల కోసం, అభిమానులను అలరించడంకోసం, ఆదాయం కోసం కూడా లేటేస్ట్ పిక్స్‌తో హల్చల్ చేస్తుంటారు. ఇందుకు సీనియర్, జూనియర్ నటీమణులు అంటూ ఎవరూ అతీతులు కారు. వీరిలో యువ నటి దర్శా గుప్త వంటి వారికి ఈ సామాజిక మాధ్యమాలే అవకాశాల కోసం ముఖ్యమైన వేదికగా మారుతున్నాయి. బుల్లితెరపై విశేష ఆదరణను పొందిన దర్శా గుప్త రుద్ర తాండవం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రం సక్సెస్ అయినా ఈ అమ్మడికి తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ప్రధాన పాత్ర పోషించిన ఓ మై ఘోస్ట్ చిత్రంలో యువ కథానాయకిగా నటించింది. అందులో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అందాలను ఆరబోయడానికి వెనుకాడలేదు. ప్రస్తుతం మెడికల్ మిరాకిల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దీంతో చేతిలో మరో అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఆ వేటలో పడింది. అందుకు ఈ బ్యూటీ ఎంచుకున్న మార్గం సోషల్ మీడియా. అందులో అందాలను విచ్చలవిడిగా ఆరబోసిన ఫొటోలను పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే దర్శాగుప్త ప్రయత్నం ఏ మాత్రం ఫలిస్తుందో చూడాలి. View this post on Instagram A post shared by Dharsha Gupta (@dharshagupta) View this post on Instagram A post shared by Dharsha Gupta (@dharshagupta) -
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన నటి.. రెండో పెళ్లి చేసుకున్నకాజల్ పసుపతి ..!
నటి కాజల్ పసుపతి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కో, మౌన గురు, కథమ్ కథమ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అల్లు శిరీష్ నటించిన ద్విభాషా చిత్రం గౌరవంలో కనిపించింది. అయితే 2008లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత విభేదాల కారణంగా 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడారు. కానీ కాజల్ పసుపతి మాత్రం ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగానే ఉంటోంది. అయితే గతంలో ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కాజల్ ప్రకటించింది. కానీ తాజాగా ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. శాండీతో విడాకులు తీసుకుని ఇప్పటికే 11 ఏళ్లయింది. తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ పాత పెళ్లి ఫోటోను షేర్ చేసింది. కాజల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఫైనల్‌గా రెండో పెళ్లి చేసుకున్నా.. నన్ను క్షమించండి ఫ్రెండ్స్.. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా..మరికొందరు మీ భర్త ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. అయితే కాజల్ కేవలం తన ఫోటోనే షేర్ చేయడంతో ఫ్రాంక్ చేసి ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. లేదా ఏదైనా మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేసి ఉంటుందని అంటున్నారు. రెండో పెళ్లిపై క్లారిటీ రావాలంటే కాజల్ స్పందించాల్సిందే. అయితే గతంలో ఆమె ఓ బీజేపీ నేతను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by KAAJAL PASUPATHI OFFICIAL⚛️ (@kaajal_pasupathi) -
ఆ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నా: యంగ్ హీరోయిన్
ఇటీవలే ఆంటోనీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ భామ కల్యాణి ప్రియదర్శన్. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంతకు ముందు ఎప్పుడు కనిపించని కిక్ బాక్సర్ పాత్రలో మెప్పించింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలన్నింటిలో తనదైన నటనతో ఆకట్టుకుంది. జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జోజు జార్జ్ హీరోగా నటించారు. దర్శకుడు ప్రియదర్శన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా తాను నటించిన ఆంటోనీ చిత్రం గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మూవీ కోసం చాలా కష్టపడినట్లు తెలిపింది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం కల్యాణి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'కంఫర్ట్ జోన్లో గ్రోత్ లేదు. గ్రోత్ జోన్లో కంఫర్ట్ లేదు. నేను ఈ విషయాన్ని కాస్తా ఆలస్యంగా తెలుసుకున్నా. కానీ ఆ పంచ్‌లు, కిక్‌లు, గాయాలు, కన్నీళ్లు, చిరునవ్వులు మాత్రమే నిజమయ్యాయి. కానీ ఆ రక్తం మాత్రం నిజం కాదు. మీ ప్రశంసలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కేరింతలకు ధన్యవాదాలు. అన్నింటికంటే మించి నాపై, నా సినిమాపై ప్రేమ చూపినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో గాయపడినట్లు కల్యాణి తెలిపింది. మూడు వారాలపాటు ప్రతిరోజూ దాదాపు నాలుగు గంటలు కిక్ బాక్సింగ్ శిక్షణ ఉండేదని వివరించింది. అందుకోసం చాలా శిక్షణ కష్టపడ్డానని.. గాయాల కారణంగా రెండు రోజులు షూటింగ్ నుంచి విరామం తీసుకోవలసి వచ్చిందని వెల్లడించింది. అందుకే ఇతర నటీనటులకు కూడా డేట్స్ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని కల్యాణి తెలిపింది. కాగా.. ఆంటోనీ చిత్రంల నైల ఉష, చెంబన్ వినోద్, ఆశా శరత్, విజయరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం కల్యాణి ఫాతిమా ఆన్ మైక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
నాతో సన్నిహితంగా ఉండాలని చూశాడు.. అందుకే: హీరోయిన్
వివాదస్పద నటిగా ముద్ర వేసుకున్న నటి మనీషా యాదవ్. బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన వళక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఒరు కుప్పం కాదల్‌తో పాటు పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా దర్శకుడు శీను రామసామి దర్శకత్వంలో ఇదమ్ పొరుల్ యావళ్ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేశాక.. ఊహించని విధంగా మూవీ నుంచి తొలగించారు. దీనికి ప్రధాన కారణం ఆమె సహకరించడం లేదని.. తనను ఇబ్బందులకు గురి చేశారన్నది డైరెక్టర్ ఆరోపించారు. లైంగిక ఆరోపణలు.. అయితే 'ఇదం పొరుల్ యావల్' సినిమా సమయంలో నటి మనీషా యాదవ్‌పై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని దర్శకుడు శీను రామసామిపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె స్థానంలో నందితా శ్వేత ఈ చిత్రంలో నటించారు. అయితే ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అయితే ఇటీవలే ఆమె మరోసారి రామస్వామి చిత్రంలో నటించనుందంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మనీషా యాదవ్ స్పందించింది. అలాంటి వారితో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇటీవలే ఓ పాత్ర కోసం మనీషాను సంప్రదించారన్న ప్రశ్నకు కాస్తా ఘాటుగానే బదులిచ్చింది. మనీషా మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం శీను రామస్వామి ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆయన కొత్త సినిమాలో నటిస్తావా అని అడిగారు. తాను ఆ చిత్రంలో నటించనని మొహం మీదే చెప్పేశా. కానీ'ఇదం పొరుల్ యేవల్' మూవీ సమయంలో అతను ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉంది. తప్పుడు ఉద్దేశ్యంతో చాలాసార్లు సన్నిహితంగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ నేను అతని కోరికలను అంగీకరించలేదు. అందుకే నన్ను సినిమా నుంచి తప్పించాడు. నాపై తప్పుడు ప్రచారం చేశాడు. నాకు నటించడం తెలియదని సినీ పరిశ్రమలో దుష్ప్రచారం చేశాడని' తెలిపింది తాను పెద్ద దర్శకులతోనే చాలా చిత్రాలు చేశానని.. అయితే ప్రతిభ ఉన్నా.. ఇలాంటి మానవత్వం లేని దర్శకుల చిత్రాలలో నటించాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. 'ఒరు కుప్ప కథై' ఆడియో లాంఛ్ కార్యక్రమంలో అందరిలాగే మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించింది. అంతే కానీ ఆయన సినిమాలో నటించడం జరగదన్నారు. తనకు మంచి భర్త, కుటుంబం, స్నేహితులు ఉన్నారని నటి మనీషా యాదవ్ పేర్కొంది. నాలాంటి కొత్త హీరోయిన్లకు ఇలాంటి చెడు అనుభవాలు ఎప్పుడూ ఎదురు కాకూడదని అన్నారు. அனைவருக்கும் இனிய தீபாவளி வாழ்த்துக்கள்.. ✨🪔 pic.twitter.com/QleYnFArIm — Manisha Yadav (@ManishaYadavS) November 13, 2023 -
ఓ యువతి జీవితకథనే అన్నపూరణి..!
లేడీ సూపర్‌స్టార్ నయనతార చిత్రంమంటే కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న చిత్రం అన్నపూరణి. ఈ చిత్రం ద్వారా నీలేష్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఒకటో తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ సంబంధించిన విశేషాలను దర్శకుడు పంచుకున్నారు. చిన్న వయస్సులోనే వంటలపై ఆసక్తి కలిగిన ఒక యువతి ఎలా ఆ రంగంలో విజయం సాధించింది అన్నదే అన్నపూరణి చిత్రమని దర్శకుడు నీలేష్ కృష్ణ తెలిపారు. ఆమె తన కుటుంబం, వారి సామాజికవర్గం పురుషాధిక్యతను ఎదుర్కొని ఎలా తన లక్ష్యాన్ని చేరుకుందన్నదే కథగా తెరకెక్కించినట్లు పేర్కొన్నారు. ఈ కథను కొన్నేళ్ల కిత్రమే నయనతారకు వినిపించారన్నారు. ఆమె ఆ సమయంలో యాక్షన్, థ్రిల్లర్, కమర్షియల్ కథా చిత్రాలు అధికంగా చేస్తున్నారని.. ఈ కథ వాటికి భిన్నంగా ఉందని చెప్పి నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారన్నారు. అయితే ప్రస్తుతం తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే చిత్రంలో నటించగలనని, అంతవరకు వేచి చూడగలరా అని అడిగారన్నారు. అలా నయనతార కోసం ఎదురుచూసి ఈ చిత్రాన్ని పూర్తి చేశామని చెప్పారు. మానవత్వం, ప్రేమ, ఆత్మవిశ్వాసం గురించి చెప్పే చిత్రంగా అన్నపూరిణి కథా చిత్రం ఉంటుందన్నారు. ఇది నయనతార ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. అంతే కాకుండా నలభీముల గౌరవాన్ని పెంచే చిత్రంగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, జయ్, కేఎస్ రవికుమార్, కుమారి సచ్చు, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లీ, రేణుక, కార్తీక్ కుమార్, సురేష్ చక్రవర్తి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
యూత్ కలల రాణికి నిశ్చితార్ధం.. త్వరలో పెళ్లి
భాషతో సంబంధం లేకుండా గుడ్‌నైట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ ఏడాదిలో చిన్న సినిమా వచ్చిన గుడ్‌నైట్ భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్మార్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై వచ్చిన ఈ చిత్రంలో కె. మణికంఠన్, మీతా రఘునాథ్ జోడీ చాలా బాగా మెప్పిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గుడ్‌నైట్ చిత్రంలో ఎలాంటి మేకప్ లేకుండా 'అను' పాత్రలో మీతా రఘునాథ్ ప్రేక్షకులను చాలా బాగా మెప్పించింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా ఈ ఏడాది హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. నిద్ర, గురక వంటి సాదాసీదా విషయాలను కథావస్తువుగా తీసుకుని అద్భుతమైన స్క్రీన్ ప్లేగా అభిమానులకు అందించారు దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్. మీతా రఘునాథ్ పెళ్లి ఈ చిత్రంలో మణికందన్, మీతా రఘునాథ్ నటనకు భారీ స్పందన లభించింది. మీతా రఘునాథ్ తన సహజ నటనతో అభిమానులను ఆకట్టుకుంది. 2022లో "సా నీ నిధూమ్ నీ" చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసిన ఆమెకు 'గుడ్ నైట్' చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన చూసిన అభిమానులు తనలాంటి భార్య కావాలని సోషల్ మీడియాలో ఎందరో యూత్ మాట్లాడుకునేలా చేసింది. భర్త కోసం దేన్నైనా భరించే భార్యగా ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సినిమా వల్ల ఆమెకు కోలీవుడ్‌లో భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. ఈ సందర్భంలో మీతాకు పెళ్లి నిశ్చయమైంది. తాజాగా ఆమె నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనుండగా, అభిమానులు మీతాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
మరో లేడీ ఓరియంటెడ్ చిత్రంలో స్టార్ హీరోయిన్ !
నాలుగు పదుల వయసులో వరుస అవకాశాలతో దూసుకెళుతున్న హీరోయిన్ నయనతార. దక్షిణాదిలోనే కాకుండా ఇటీవల బాలీవుడ్ చిత్రం జవాన్‌తో సక్సెస్ కొట్టింది. ఒక పక్క నటన, మరో పక్క పిల్లల బాధ్యత, ఇంకో పక్క వ్యాపారం అంటూ బిజీగా జీవితాన్ని గడుపుతోంది. 75 చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేసింది. అయినా హీరోయిన్గా ఎక్కడా ఫుల్స్టాప్ లేదంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. 75వ చిత్రంగా మాధవన్, సిద్ధార్థ్‌లతో టెస్ట్ చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా కథానాయకిగా నటించిన మరో చిత్రం అన్నపూరణి. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా మరో నూతన చిత్రానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అరుణ్రాజా కామరాజ్ దర్శకత్వం వహించనున్న హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించనున్నారని తెలిసింది. నటుడిగా సినీరంగానికి పరిచయం అయిన అరుణ్రాజా కామరాజ్ ఆ తరువాత గాయకుడు, గీత రచయితగా తనలోని ప్రతిభను నిరూపించుకుని ఆపై దర్శకుడిగా కనా చిత్రంతో పరిచయమయ్యారు. దర్శకుడిగా తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఈయన ఉదయనిధి స్టాలిన్ హీరోగా నెంజిక్కు నీతి చిత్రం చేసి సక్సెస్ అయ్యారు. తాజాగా లేబుల్ అనే వెబ్‌సిరీస్ చేశారు. నటుడు కార్తీ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అది ఏమైందో గానీ తాజాగా నయనతార హీరోయిన్గా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
స్టార్ డైరెక్టర్ కూతురు షాకింగ్ నిర్ణయం.. నిజమేనా?
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలు అదితి శంకర్. చాలా చలాకీగా ఉండే ఈమె మల్టీ టాలెంటెడ్. చదివింది వైద్య విద్య అయినా నటనపై ఆసక్తితో సినిమాల్లో అడుగు పెట్టింది. దీంతో ఎలాగైనా కథానాయకిగా నటించాలనే పట్టుదలతో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించారు. అలా విరుమాన్ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా నటించి మెప్పించారు. మరో విషయం ఏమిటంటే తొలి చిత్రంతోనే గాయని అవతారం ఎత్తి తన మల్టీ టాలెంటెడ్‌ను నిరూపించుకున్నారు. ఆ చిత్రం తరువాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఈ రెండు సూత్రాలు సక్సెస్ అయ్యి అదితి శంకర్‌ను లక్కీ హీరోయిన్ చేశాయి. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. తదుపరి రాక్షసన్ చిత్రం ఫేమ్ రాంకుమార్ దర్శకత్వంలోనూ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అదితి శంకర్ నటనకు గుడ్ బై చెప్పనున్నారనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె డాక్టర్ దుస్తులు ధరించిన ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఫొటోలు వైరల్ అవ్వడమే ఇందుకు కారణం కావచ్చు. అయితే ఆమె నిజంగానే నటనకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? లేక ఏదైనా చిత్రంలోని ఫొటోలను సామాజి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కథానాయకగా సక్సెస్ బాటలో పయనిస్తున్న అదితి శంకర్ నటనకు గుడ్ బై చెబుతున్నారన్న వార్త అభిమానులకు నమ్మశక్యంగా లేదు. అయితే ఈ విషయమై ఆమె సైతం మౌనం వహిస్తున్నారు. అయితే ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో ఉండటానికి ఇష్టపడే అదితి శంకర్ చేస్తున్న కొత్తరకం పబ్లిసిటీ స్టంట్‌గా కొందరు భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
ఆడిషన్స్‌లోనే అవమానం.. ఇప్పుడు ఆమెనే స్టార్ హీరోయిన్!
పుట్టుకతోనే అందరూ ప్రతిభావంతులు కారు. పుత్తడి అయినా సాన పెడితేనే మెరుస్తుంది. ఒకసారి కాకపోయినా మరోసారి ప్రతిభ వెలికి వస్తుంది. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటి నయనతార జీవితం కూడా అలాంటిదే. ఈ కేరళ భామ కోలీవుడ్‌లో ఎంటర్ అవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అలా పలు అవమానాలను, ఆవేదనలను భరించారు. అయ్యా చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి దిగుమతి అయ్యారు. అయితే అంతకు ముందే అవకాశాలు ఈమెను ఊరించి ఉసూరుమనిపించాయి. అయితే నటుడు, దర్శకుడు పార్తీపన్ నయనతారకు తొలి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన చెప్పిన సమయానికి నయనతార అడిషన్‌కు హాజరు కాలేకపోయారు. అప్పటి ఆమె పరిస్థితి అలాంటిది. కేరళ నుంచి చైన్నెకు బస్సులో చేరుకునే ప్రయత్నంలో ఆమెకు ఆలస్యమైంది. కారణం పార్తీపన్‌కు ఫోన్ ద్వారా వివరించినా.. ఆయన కోపంతో నువ్వు ఇక రావలసిన అవసరం లేదని చెప్పడం నయనతారకు కలిగిన తొలి నిరాశ. ఆ తరువాత శింబుకు జంటగా తొట్టి జయ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు వీజెడ్ దురై అడిషన్ నిర్వహించారు. అందులో పాల్గొన్న నయనతార సరిగా నటించకపోవడంతో నీకు నటన సెట్ కాదు వెళ్లిపోవచ్చు అంటూ రిజెక్ట్ చేశారు. ఇది నయనతార ఎదుర్కొన్న మరో అవమానం. అలాంటిది అయ్యా చిత్రంలో శరత్‌కుమార్ సరసన నటించే అవకాశం వరించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో నయనతారకు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో పలు సంఘటనలు కారణంగా ఆవేదనకు గురయ్యారు. సవాళ్లను ఎదురొడ్డి, ప్రేమ వైఫల్యాలను తట్టుకుని నిలిచారు. అలాంటిది రజనీకాంత్, శరత్‌కుమార్, విజయ్, అజిత్, శింబు, ధనుష్ అంటూ తమిళంలోనూ తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌తోనూ, హిందీలో బాద్షా షారూక్‌ఖాన్ వంటి సూపర్స్టార్లతో నటించి లేడీ సూపర్ స్టార్ అయ్యారు. కాగా.. నయనతార నవంబర్ 18న తన 39వ పుట్టిన రోజు తన పిల్లలతో కలిసి జరుపుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు నయనతారకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
అందరికీ కనిపించే షకీలా.. తెర వెనుక కన్నీటి జీవితం తెలుసా?
సౌత్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి షకీలా. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా టాలీవుడ్ అభిమానులను పలకరించింది. అయితే మొదట అడల్డ్ మూవీల్లో కనిపించిన షకీలా.. ఒకప్పుడు మలయాళ సినిమా పరిశ్రమలో ఆమె పెద్ద సంచలనం. సినిమా టైటిల్స్‌లో ఆమె పేరు ఉంటే చాలు బాక్సాఫీస్ షేక్ అయ్యేది. తమిళనాడుకు చెందిన షకీలా సౌత్ చిత్రసీమను తన గ్లామర్‌తో ఊపేసింది. అయితే నవంబర్ 19న, 1973లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించింది. ఆమె తన బాల్యమంతా నెల్లూరులోనే పెరిగింది. తమిళంలో "ప్లేగర్ల్స్" అనే చిత్రంతో షకీలా సినీ ప్రస్థానం మొదలెంది. తమిళ, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. ఆమె తన తన పేరు శృంగార తారగానే అభిమానుల్లో ముద్ర పడిపోయింది. కానీ తన జీవిత కథ అందరికీ తెలియాలని ఆత్మకథ వ్రాసినట్టు చెప్పుకున్నది. తనకు పదహారేళ్ల వయసులోనే తల్లే స్వయంగా వ్యభిచారంలోకి పంపినట్లు వెల్లడించింది. తాను నటించిన సినిమాలు కేవలం తన శరీరాన్ని శృంగార తారగా చూపేందుకు పరిమితమయ్యాయని.. తనలో నటిని బయటికి తీసేందుకు ఎవ్వురూ ప్రయత్నించలేదని షకీలా తన ఆత్మకథలో రాసుకొచ్చింది. అప్పట్లోనే దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటిగా షకీలా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు షకీలా నటించిన చాలా సినిమాలు అశ్లీలతతో కూడుకొని ఉండేవి. అయితే చాలా ఏళ్ల నుంచి అలాంటి చిత్రాలకు ఆమె దూరంగా ఉంది. షకీలా ఇప్పుడు తమిళం, తెలుగు చిత్రాలతో పాటు పలు రియాల్టీ షోలలో మెప్పిస్తుంది. పలు టెలివిజన్ కార్యక్రమాల ద్వారా హాస్య పాత్రలు చేస్తూ.. కుటుంబ ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది. తన జీవితంలో తన ఆమె తల్లితో పాటు సోదరినే చాలా ఎక్కువగా మోసం చేసిందని ఆమె చెప్పింది. షకీలా కూడబెట్టిన మొత్తం డబ్బును తన సోదరి తీసుకుని మోసం చేసినట్లు ఇది వరకే చెప్పింది. ఇటీవల షకీలా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో కనిపించింది. కానీ రెండో వారంలోనే ఆమె ఎలిమినేట్ అయింది. -
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బిగ్ బాస్ బ్యూటీ!
ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ సాక్షి అగర్వాల్. తమిళం, మలయాళం, కన్నడతో వంటి పలు భాషా చిత్రాలు ఉన్నాయి. బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ద్వారా పాపులర్ అయిన సాక్షి అగర్వాల్ హీరోయిన్, గ్లామర్, యాక్షన్, విలనిజం, గ్రామీణ యువతిలాగా అన్ని రక రకాల పాత్రలో నటిస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం తమిళంలో రజిత్ కన్నా దర్శకత్వం వహిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం సారా లో నటిస్తున్నారు. అదేవిధంగా 8 బుల్లెట్స్ చిత్రం ఫేమ్ వెట్రికి జంటగా నటించిన చిత్రంను పూర్తి చేశారు. ఇది కాకుండా సాక్షి అగర్వాల్ చేతిలో 'అతిథి 2'తో పాటు చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మేనల్లుడు హీరోగా నటిస్తున్న చిత్రంలో సాక్షి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా కనిపించనున్నారు. అదేవిధంగా ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు బి అజనీష్ లోకనాథ్ నిర్మిస్తున్న చిత్రంలోనూ ఈమె చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇలా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న సాక్షి అగర్వాల్‌కు తాజాగా బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయట. సాక్షి అగర్వాల్ త్వరలో ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించనుంది. మొత్తం మీద ఈ దీపావళి ఈ బ్యూటీకి కొత్త ఆనందాన్నే తీసుకొచ్చినట్లుంది. View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
బెడ్ రూమ్ సీన్.. కుదరదని మొహం మీదే చెప్పేశా: హీరోయిన్
టాలీవుడ్లో మీకు మాత్రమే చెప్తా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ భా వాణి భోజన్. అయితే ఈ మూవీతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత నటించిన తమిళ చిత్రం ఓ మై కడవలేతో గుర్తింపు తెచ్చుకుంది. మొదట బుల్లితెర నటిగా 2010లో కెరీర్ ప్రారంభించిన వాణి ప్రస్తుతం హీరోయిన్గా బిజీ అయిపోయింది. ఇప్పటివరకు ఈ అమ్మడుకు పెద్ద హిట్ పడలేదు. (ఇది చదవండి: అలా కనిపించడం చాలా కొత్తగా అనిపించింది: సీతారామం బ్యూటీ) కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ కోలీవుడ్‌లో మంచి సక్సెస్ కోసం పోరాడుతోంది. మధ్యలో సరైన అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపింది. దాదాపుగా స్టార్ హీరోయిన్ హోదా కోసం 13 ఏళ్లుగా కష్టపడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌పైనే దృష్టి సారించింది భామ. తాజాగా ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మరో చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా.. వాణిభోజన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమె మాట్లాడుతూ కథకు అవసరం లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో నటించాలని ఒత్తిడి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక చిత్రంలో అనవసరంగా బెడ్రూం సన్నివేశంలో నటించాలని చెప్పారని వివరించింది. అదీ ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా చేయమని అడిగాగు. దీంతో తాను అలాంటి సన్నివేశంలో నటించనని మొహం మీదే చెప్పేశానని తెలిపింది. తనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదని.. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయడమే ముఖ్యమని పేర్కొంది. అయితే తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ హల్ చల్ చేస్తోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ ఇదివరకే ఒక నటుడితో ప్రేమ, సహజీవనం అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. (ఇది చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?) -
అది చూసే హీరోయిన్గా తీసుకుంటున్నారు.. టైగర్ నాగేశ్వరరావు భామ కామెంట్స్!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా జీవితంలో ఒక భాగం అయిందంటే అతిశయోక్తి కాదు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో సెల్‌ఫోన్ అనే పరికరంతో ప్రపంచమే అరచేతిలో గిరాగిరా తిరుగుతోంది. మనిషి దాని చుట్టూ తిరుగుతుండడంలో ఆశ్చర్యమేముంది. సామాజిక మాధ్యమాలను కొందరు తమ స్వప్రయోజనాలకు.. మరికొందరు నేరాలు, ఘోరాలకు యథేచ్ఛగా వాడుకుంటున్నారు. మరోపక్క అవకాశాలను, అభివృద్ధికి, ఆదాయానికి, కాలక్షేపానికి ఉపయోగిస్తున్నారు. ఇందుకు సినిమా వాళ్లు సైతం అతీతం కాదు. తాజాగా సామాజిక మాధ్యమాల గురించి నేటి అనుకీర్తీ వాస్ ఏమంటున్నారో ఓ లుక్కేద్దాం. అచ్చంగా తిరుచ్చి వాసి అయిన ఈ బ్యూటీకి మిస్ ఇండియా కిరీటం పెద్ద అలంకారం. అదే ఇప్పుడు అనుకీర్తీవాస్కు హీరోయిన్ అవకాశాలను తెచ్చిపెడుతోంది. విజయ్ సేతుపతికి జంటగా డీఎస్పీ అన చిత్రంలో కథానాయకిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా తెలుగులో రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించారు. ప్రస్తుతం వెట్ట్రి అనే మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ అమ్మడు చేసింది కొన్ని చిత్రాలే అయినా తరచూ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలను ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని తన వైపునకు తిప్పుకుంటోంది. ఇటీవలే అనుకీర్తీ వాస్ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల క్రితం తనకు సామాజిక మాధ్యమాలు అంటే ఏంటో తెలియదన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్రాముఖ్యత గురించి అనుభవపూర్వకంగా గ్రహించినట్లు పేర్కొన్నారు. హీరోయిన్ అవకాశం వచ్చినప్పుడల్లా మీ ఇన్‌స్ట్రాగామ్ ఐడీనీ పంపమని చెబుతున్నారన్నారు. అలా దాన్ని చూసే నిర్ణయాలు తీసుకుంటున్నారని.. దీంతో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తున్నట్లు నటి అనుకీర్తీవాస్ పేర్కొన్నారు. -
విద్యార్థులపై నటి ఆగ్రహం... అరెస్ట్ చేసిన పోలీసులు..!
కోలీవుడ్ నటి రంజనా నాచ్చియార్ మరోసారి వార్తల్లో నిలిచింది. బస్సు ఫుట్‌బోర్డులో వేళాడుతూ వెళ్తున్న విద్యార్థులపై దాడి చేశారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో కుండ్రత్తూరు పోలీసులు శనివారం ఆమెను అరెస్టు చేశారు. అయితే సాయంత్రానికే ఆమెకు శ్రీపెరంబదూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్‌పై నటి రంజనా విడుదలయ్యారు. అసలే జరిగిందంటే.. బస్సు ఫుట్‌బోర్డులో వేళాడుతూ వెళ్తున్న విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా, కండెక్టర్, డ్రైవర్లను ఆమె దూషించిన వీడియో వైరల్ కావడంతోనే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. చైన్నె నగరంలో పాఠశాల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయడం అలవాటుగా మారింది. ఈ పరిస్థితులలో బీజేపీ మహిళా నేత, సినీ సహాయ నటి రంజనా నాచ్చియార్ విద్యార్థులను హెచ్చరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. చైన్నె పోరూర్ నుంచి కుండ్రత్తూరు వైపుగా వెళ్తున్న నగర రవాణా సంస్థ బస్సులో అనేక మంది విద్యార్థులు ఫుట్‌పై వేలాడుతూ ప్రయాణం చేస్తుండటాన్ని రంజనా నాచ్చియార్ గుర్తించారు. తన వాహనంలో ఆ బస్సును ఛేజింగ్‌చేసి మరీ అడ్డుకున్నారు. ఫుట్ బోర్డుపై వేలాడుతున్న విద్యార్థులను దూషిస్తూ, చెంపలు పగల కొట్టే విధంగా కొడుతూ బలవంతంగా కిందకి దించేశారు. అంతటితో ఆగకుండా డ్రైవర్, కండెక్టర్లతో గొడవకు దిగారు. ఫుట్‌బోర్డులో విద్యార్థులు వేలాడుతుంటే చోద్యం చూస్తారా..? అని తన దైన శైలిలో దూషణలో ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ వీడియో వైరల్ కావడంతో వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. విద్యార్థులను కొట్టడం, దూషించడం, డ్రైవర్, కండెక్లర్లతో గొడవ పడడం వంటి అంశాలను పరిగణించి ఆమైపె ఐదు సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రంజనా నాచియార్ బిల్లా పండి, సుకుమారిన్ శబదం, మయం లాంటి కోలీవుడ్ చిత్రాల్లో నటించారు. பேருந்தை வழிமறித்து வெலவெலக்க வைத்த நடிகை.. நடுரோட்டில் நடந்தது என்ன?#Chennai #GovtBus #Student #Attack #RanjanaNaachiyar #NewsTamil24x7 pic.twitter.com/ojWZPdyb3T — News Tamil 24x7 | நியூஸ் தமிழ் 24x7 (@NewsTamilTV24x7) November 4, 2023 VIDEO | BJP functionary Ranjana Nachiyar arrested by police for allegedly assaulting school students in Chennai, Tamil Nadu. pic.twitter.com/6N6PldD2Ra — Press Trust of India (@PTI_News) November 4, 2023 -
స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన గుంటూరు కారం హీరోయిన్!
ప్రస్తుతం కోలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. హర్యానాకు చెందిన ఈ బ్యూటీ వైద్య విద్యను అభ్యసించి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. అందాల పోటీల్లో పాల్గొని ప్రాచుర్యం పొందిన తర్వాత 2019లో బాలీవుడ్లో నటిగా రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత అక్కడ అవకాశాలు రాకపోయినా టాలీవుడ్ అమ్మడికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికింది. (ఇది చదవండి: బిగ్‌బాస్ 7: టేస్టీ తేజ అవుట్.. అతడి భయమే నిజమైంది!) ‘ఇక్క డ వాహనాలు నిలుప రాదు’ అనే తెలుగు చిత్రంలో మెరిసిన మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన నటించే స్థాయికి చేరుకున్నారు. ఆయనతో జత కట్టిన గుంటూరు కారం చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సంక్రాంతికి తెరపైకి మరో రెండు, మూడు తెలుగు చిత్రాలు చేతిలో వున్నాయి. కాగా కొలై అనే చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కీలకపాత్ర పోషించి గుర్తింపు పొందారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా దళపతి విజయ్ సరసన కథానాయకిగా నటించే లక్కీ ఛాన్స్‌ను దక్కించుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ కోసం ఈ బ్యూటీ ఇప్పుడు థాయ్‌లాండ్ చేరుకున్నారు. కాగా అంతకుముందే దుబాయ్‌కు వెళ్లి అక్కడి ఎడారి ప్రాంతంలో అందాలను ఒలకబోస్తూ ప్రత్యేకంగా ఫొటో సెషన్లో పాల్గొన్నారు. వివిధ భంగిమలతో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. (ఇది చదవండి: కీడా కోల, మా ఊరి పొలిమేర 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అంటోన్న సమంత!
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే లక్ష్యం తీరాలు చేరుకోవచ్చనే నానుడి నటి సమంతకు సరిగ్గా సెట్ అవుతుంది. హీరోయిన్గా ఈ చైన్నె భామ పయనం పూలబాటేమీ కాదు. ఆదిలో ఆశలు, అడియాశల సంగమంగానే సమంత సినీ జీవితం సాగింది. అలా తమిళ చిత్రాలతో సాదాసీదాగా సాగిన సమంత నట జీవితాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా మార్చేసింది. తెలుగులో తొలి చిత్రం ఏమాయ చేశావే అనూహ్య విజయాన్ని సాధించి సమంతను క్రేజీ హీరోయిన్ను చేసేసింది. ఆ తరువాత బృందావనం, దూకుడు వంటి చిత్రాలు స్టార్ హీరోయిన్గా నిలబెట్టాయి. అలా అక్కడ తొలి చిత్రం హీరో నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి వంటి జీవితంలో ఆనందకరమైన ముఖ్య ఘట్టాలు చకచకా జరిగాయి. అంతా సంతోషం అయితే జీవితం ఎలా అవుతుంది. నాగచైతన్యతో మనస్పర్థలు, విడిపోవడం వంటి పెద్ద కుదుపునకు సమంత గురైంది. ఆ చేదు అనుభవాలను మరచిపోకముందే మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి సమంతని తాకింది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అనుకుందో ఏమో సమంత ఆ వ్యాధితోనూ గట్టిగానే పోరాటం చేసింది. ప్రస్తుతం ఈ పోరాటంలో విజయవంతం అయ్యారనే చెప్పాలి. తాజాగా సమంత ఇప్పుడు నేను రెడీ మళ్లీ వస్తున్నా అంటూ ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్ చేశారు. ఎంతక్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఒక పక్క వైద్యం కోసం దేశాల బాట పడుతూనే.. మరో పక్క యోగాలు, వ్యాపారాలు అంటూ ఆధ్యాత్మిక పయనం చేస్తూ.. ఇంకో పక్క శారీరక వ్యాయామాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తను చేసే ప్రతి కార్యాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేస్తూ అభిమానులు తనను మర్చిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా తను వర్కౌట్స్ చేస్తున్న దృశ్యాలను, అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. కాగా ఈమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్కు సిద్ధం అవుతోంది. అదే విధంగా సమంత తమిళం, ఆంగ్ల భాషల్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంతో ఈమె హాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!
ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటుడు మోహన్. 16 ఏళ్ల తర్వాత మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇస్తోన్న చిత్రం హరా. ఇంతకుముందు దాదా 87, పౌడర్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించిన విజయ్శ్రీ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కోయంబత్తూర్ ఎస్పీ.మోహన్ రాజ్‌తో కలిసి జీ.మీడియా పతాకంపై జయశ్రీ విజయ్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందే చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా.. అయితే మధ్యలో దర్శకుడు విజయ్ ప్రమాదానికి గురికావడంతో షూటింగ్ వాయిదా పడింది. తాజాగా హరా చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమై ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఒక ప్రముఖ నటి కథానాయకిగా నటించాల్సి ఉండగా కాల్షీట్స్ సమస్య కారణంగా ఈ చిత్రం నుంచి వైదొలగింది. దీంతో ఆమె ప్లేస్‌లో అయాలి నటి అనుమోల్‌ను ఎంపిక చేసినట్లు దర్శకుడు విజయ్ తెలిపారు. ఆమె అయాలి వెబ్ సిరీస్‌లో మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ఆయన 68వ చిత్రంలోనూ అనుమోల్ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. కాగా.. హరా చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఈ సినిమాలో యోగిబాబు, మొట్టై రాజేంద్రన్, సింగం పులి, దీప, మైమ్ గోపి, శ్యామ్స్, కౌశిక్, అనిత నాయర్, చారుహాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి లియాండర్ లీ మార్టీ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
అలాంటి నటించడమే తనకు చాలా ఇష్టం: యంగ్ హీరోయిన్
సహజమైన నటన అంటేనే తనకు ఇష్టమని అంటోంది ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్. తాను ఏ సినిమాలో నటించిన సహజ నటన కోసమే పరితపిస్తానని ఆమె తెలిపారు. చైన్నెలోని మొగప్పైర్‌లో ఉన్న పేజీ 3 లగ్జరీ మేక్ఓవర్ స్టూడియో సంస్థ మొదటి సంవత్సరం వేడుకలు నటి ఐశ్వర్య రాజేష్, పారిశ్రామిక వేత్త వీణా కుమారవేల్, ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్త మీనాక్షి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. నేటి తరం మహిళలు వారి వారి రంగాల్లో రాణిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సినీ తారలను స్ట్లైలింగ్ చేయడంలో బ్యూటీ సంస్థల పాత్ర ఎనలేనిది అని కొనియాడారు. తాను సినిమా ల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రలపైనే కాకుండా సహజమైన నటన పై దృష్టి పెడతానన్నారు. అందువల్లే తనకంటూ ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ఇందులో నిర్వాహకులు షణ్ముగ కుమార్ పాల్గొన్నారు. కాగా.. ఇటీవలే మలయాళ చిత్రం పులిమాడలో ఐశ్వర్య రాజేశ్ కనిపించింది. -
40 ఏళ్ల బ్యూటీ.. లిప్‌లాక్ సీన్.. ఇంకా అవుట్ కాలేదు..!
హీరోయిన్గా రెండు దశాబ్దాల పాటు కొనసాగడం అంటే ఆషామాషీ కాదు. అది కూడా అగ్రస్థానంలో అది దక్షిణాది సినిమాలో ఒక్క త్రిషకే దక్కిందని చెప్పేయొచ్చు. జోడి అనే తమిళ చిత్రంలో కథానాయకి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా రెండు మూడు సన్నివేశాల్లో తళుక్కుమన్న త్రిష దక్షిణాదిలో స్టార్ హీరోలందరి సరసన నటించింది. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. (ఇది చదవండి: ఆ హీరోతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మిస్ శెట్టి!) అలాంటి త్రిష ఒక్కో చిత్రంతో కన్నడ, హిందూ సినీ అభిమానులను పలకరిస్తుందని కూడా అనుకొని ఉండరు. ముఖ్యంగా తమిళంలో రజనీకాంత్ కమలహాసన్, విజయ్, అజిత్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తన ప్రత్యేకతను చాటుకుంది. అలా 40 ఏళ్ల బ్యూటీ నేటికీ నాటౌట్‌గా నిలిచి హీరోయిన్గా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో విక్రమ్, జయంరవి, కార్తీ, ప్రభు, ప్రకాష్‌రాజ్, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్వారాయ్ వంటి దిగ్గజాలతో కలిసి నటించి యువరాణి కుందవైగా అందం, అభినయంతో తనదే పైచేయిగా అనిపించుకున్నారు. అంతే ఆ తర్వాత త్రిషకు క్రేజీ అవకాశాలు వరుస కడుతున్నాయి. తాజాగా విజయ్ సరసన నటించిన లియో చిత్రం ఇటీవల విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా లియో చిత్రంలో నటుడు విజయ్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు. కాగా ఈ చిత్ర ఒక వారం వసూళ్లను నిర్మాత అధికారికంగా విడుదల చేశారు. అది చూసిన త్రిష పోలా అదిరిపోలా అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా? ) ఈ సందర్భంగా ఆమె లియో చిత్రంలో నటించిన కొన్ని ఫొటోలను వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. త్రిష ప్రస్తుతం మరో స్టార్ నటుడు అజిత్ సరసన విడాముయర్చి చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. Appadi Podu🔥 pic.twitter.com/5eMWC4LRqU — Trish (@trishtrashers) October 26, 2023 -
ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ కోలీవుడ్ నటి ఇంట్లో విషాదం నెలకొంది. నటి బాబిలోనా సోదరుడు విఘ్నేష్ కుమార్ అలియాస్ విక్కీ ఇటీవల చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద రితీలో మృతి చెందారు. విఘ్నేష్ వయస్సు 40 ఏళ్లు కాగా.. ప్రస్తుతం చెన్నైలోని సాలిగ్రామం దశరథపురం అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన అతని స్నేహితుడు విరుగంబాక్కం పోలీసులకు సమాచారమిచ్చారు. అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో విగతజీవిగా పడి ఉన్న విఘ్నేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాబిలోనా సోదరుడిని కొద్ది రోజుల క్రితం చెన్నైలోని వలసరవాక్కంలో సాధారణ పెట్రోలింగ్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో గొడవ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. విఘ్నేష్‌కు క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. గతంలోనూ అతను అనేక నేరాలకు పాల్పడినట్లు సమాచారం. కాగా.. నటి బాబిలోనా శాస్త్ర (2000), ఇష్క్ కా ఆచార్ (2004), లెవెల్ క్రాస్ (2002) వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో నిర్మలా ఆంటీ అనే చిత్రంలో కనిపించారు. అందాల ఆరబోతతో తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సెక్సీ నటిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె అసలు పేరు భాగ్యలక్ష్మి కాగా.. పారిశ్రామికవేత్త సుందర్ బాబుల్ రాజును 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. -
రెండోపెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. బర్త్ డే రోజే సర్ప్రైజ్!
స్టార్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. రామ్ చరణ్ మూవీ నాయక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ.. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో మెప్పించింది. ఈ ఏడాది అజయ్ దేవగణ్ నటించిన భోళా చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఇవాళ తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్న కేరళ కుట్టి రెండోసారి పెళ్లికి సిద్ధమైంది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో కలిసి పెళ్లి పీటలెక్కనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: Pooja Hegde: లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే.. ధర ఎంతో తెలిస్తే షాకే!) ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అమలాపాల్, జగత్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది. తన లవర్ అమలాపాల్‌కు జగత్ దేశాయ్ మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత కాబోయే దంపతులు ఒకరినొకరు ముద్దుపెట్టుకుని కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జగత్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నా జిప్సీ క్వీన్ ఓకే చెప్పింది. హ్యాపీ బర్త్‌డే మై లవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. గతంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ను పెళ్లాడిన అమలాపాల్.. 2017లో విడాకులు తీసుకుంది. కాగా.. అమలాపాల్ 2009లో మలయాళ చిత్రం నీలతామరా మూవీలో తొలిసారిగా నటించింది. 2010లో తమిళ చిత్రం మైనాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు అందుకుంది. బాలీవుడ్, తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. . (ఇది చదవండి: మా కోసమే ఉంటున్నాడు.. అతనొక రియల్ హీరో: నాగార్జున) -
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న ప్రముఖ నటి!!
నటిగా రోహిణి 1974లోనే బాలనటిగా తెరంగేట్రం చేశారు. తర్వాత కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అంతే కాదు ఈమెలో మంచి డబ్బింగ్ కళాకారిణి, దర్శకురాలు కూడా ఉన్నారు. 2005లోనే చిన్న చిన్న ఆశై అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.ఆ తరువాత ఒక డాక్యుమెంటరీ చిత్రం కూడా చేశారు. (ఇది చదవండి: కన్నీరు పెట్టుకున్న శోభ, యావర్.. నేడు షో టైమింగ్స్‌లో మార్పు) తాజాగా మరోసారి మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. యదార్థ ఘటనలతో ఇప్పటికే చాలా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో పలు చిత్రాలు విజయాన్ని సాధించాయి. జైభీమ్, సూరారై పోట్రు వంటి చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. కాగా ఆ మధ్య తమిళనాడునే ఉలిక్కిపడేలా చేసిన వాచ్ఛాత్తి హింసా సంఘటన ఇప్పుడు వెండితెరకెక్కనుంది. దీనికి నటి రోహిణి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కాగా దీనికి రచయిత ఆదవన్ దీక్షగా మాటలు,కథనం రాస్తున్నారు. ఇందులో జై భీమ్ చిత్రం ఫేమ్ లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
Srinidhi Shetty Latest Photos: ట్రెడిషనల్ & ట్రెండీ లుక్‌లో కవ్వించేస్తోన్న కేజీఎఫ్ బ్యూటీ
-
రాజకీయాల్లోకి స్టార్ హీరో కూతురు.. క్లారిటీ ఇదే!
సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న భామ శృతిహాసన్. ప్రస్తుతం పాన్ వరల్డ్ నటిగా మారారు. నటి, సంగీత దర్శకురాలు, గాయనిగా ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శృతిహాసన్. తరచుగా సోషల్ మీడియాలో టచ్‌లో ఉండే శృతి.. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కోలీవుడ్ స్టార్, మక్కల్ ఇయక్కం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వారసురాలు కావడంతో ఆమె రాజకీయ రంగప్రవేశం గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. (ఇది చదవండి: ‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ విషయమై శ్రుతిహాసన్ ఇప్పటికే చాలా స్పష్టంగా సమాధానం చెబుతూనే వచ్చింది శృతి. తాజాగా కోయంబత్తూర్‌లో మీడియాతో ముచ్చటించగా... ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌కు అదే ప్రశ్న ఎదురైంది. తనకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని పేర్కొన్నారు. సినిమాల్లో నటించడంపైనే తనకు ఆసక్తి ఉందని చెప్పారు. కాగా.. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న భామ.. ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం సలార్‌లో కనపించనున్నారు. అదేవిధంగా తొలిసారిగా ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. దీని గురించి ఆమె తెలుపుతూ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమని తెలిపారు. అయితే పెద్ద, చిన్న చిత్రాలు అని చూడనని.. ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించడమే ముఖ్యమని పేర్కొన్నారు. అదే విధంగా తాను తమిళ అమ్మాయినని ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆల్బమ్‌ను కూడా రూపొందిస్తున్నట్లు.. దాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు శ్రుతిహాసన్ చెప్పారు. (ఇది చదవండి: హీరోయిన్గా ఊర్వశి వారసురాలు ఎంట్రీ?) -
బిగ్‌బాస్‌లో ఎంట్రీ.. అప్పుడే రెండు చిత్రాలకు ఓకే!
కోలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర వేయించుకున్న నటి వనితా విజయకుమార్. విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైంది. ప్రముఖ నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించిన వ్యక్తిగత సమస్యల కారణంగా కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలోనే ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్నారు. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్) వనిత రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నా వైవాహిక దాంపత్యం సాఫీగా సాగలేదు. ఈ నేపథ్యంలో కొంత గ్యాప్ తర్వాత వనితా విజయకుమార్ మళ్లీ నటించటానికి సిద్ధమయ్యారు. ఆ మధ్య బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని అక్కడ కూడా తనదైన ముద్రను వేసుకున్నారు. కాగా ఈమె కూతురు గురించి చాలామందికి తెలియదు. వనితా విజయ్ కుమార్ కూతురు పేరు జోవిక. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్ రియాలిటీ షో సెవెన్ సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని తల్లి బాటలోనే ప్రయాణిస్తోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో చదువు చాలా ముఖ్యం అన్న నటి విచిత్ర వ్యాఖ్యలను ఖండించి తనకు చదువు పెద్దగా అబ్బకపోవడంతోనే నచ్చింది చేస్తున్నానని బదిలిచ్చింది. దీంతో తొలి వారమే ఎపిసోడ్‌లోని హాట్ టాపిక్‌గా మారింది. (ఇది చదవండి: హౌస్‌లో అడుగుపెట్టిన సోషల్ మీడియా సెన్సేషన్) తన కూతురు మాటలను పూర్తిగా సమర్థించిన నటి వనిత విజయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను దర్శక నటుడు పార్థీపన్ వద్ద గత కొన్ని నెలలుగా సహాయ దర్శకురాలిగా పనిచేసినట్లు చెప్పారు. తమకు రెండు కార్లు ఉన్నా పార్తీపన్ కార్యాలయానికి మెట్రో రైల్లోనే వెళ్లి వచ్చేదని చెప్పారు. అలా పెడితేనే సహాయ దర్శకుల కష్టమేమిటో ఆమెకు తెలుస్తుందని చెప్పారు. తాను కూడా మొదట్లో దర్శకుడు పి. వాసు వద్ద 10 చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశానని విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జోవికాకు సంబంధించిన మరో సర్ప్రైజ్ ఏమిటంటే తను ఇప్పటికే రెండు చిత్రాల్లో కథానాయకిగా నటించడానికి ఒప్పందం అయినట్లు చెప్పారు. అందులో ఒకటి తన చిత్రం కాగా.. మరొకటి తెలుగు చిత్రమని చెప్పారు. View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) -
'నా కూతురిని చూసి గర్విస్తున్నా'.. బిగ్‌బాస్ గొడవపై స్పందించిన నటి!
ఇటీవలే మొదలైన తమిళ బిగ్ బాస్ మొదటి వారం నుంచే హాట్‌హాట్‌గా మారింది. బిగ్ బాస్ తమిళ సీజన్- 7లో ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ కుమార్తె జోవికా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హౌస్‌లో మరో కంటెస్టెంట్ అయిన విచిత్రకు జోవిక మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. చదువు విషయంలో తలెత్తిన ఈ గొడవపై జోవికా తల్లి, మాజీ కంటెస్టెంట్ వనిత రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో తన కూతురిని చూసి గర్వపడుతున్నానని ఆమె ట్వీట్ చేశారు. వనిత తన ట్వీట్లో రాస్తూ.. 'తన ఆట తనను ఆడనివ్వండి. నా కూతురిని చూసి నేను గర్విస్తున్నా. తన కూతురు ధనిక కుటుంబం నుంచి రాలేదు. నేను కూడా నా జీవితంలో చాలా కష్టపడ్డా. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రతి బిడ్డ తన సొంత మార్గంలో వెళ్లాలనే ప్రత్యేక లక్ష్యాలు ఉంటాయి. నేను ఒక తల్లిగా నా వంతు కృషి చేస్తున్నా. నా ఇద్దరు కుమార్తెలు వారి సొంత మార్గాల్లో రాణిస్తున్నారు' అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తన కూతురు ప్రొఫెషనల్ యాక్టర్ అని.. రెండు సినిమాలకు సైన్ చేసిందని వనిత తెలిపింది. జోవిక తెలుగు, తమిళ ప్రాజెక్టుల్లో నటించనున్నట్లు పేర్కొంది. చిన్న వయస్సులో తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అంటూ రాసుకొచ్చింది. కాగా.. తొలివారంలో ఐషు, అనన్య, చెల్లదురై, కూల్ సురేష్, జోవికా, ప్రదీప్, రవీనా దాహా, యుగేంద్రన్ నామినేట్ అయ్యారు. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో నుండి యుగేంద్రన్ ఎలిమినేట్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. She is already a professional actor technicianw who has signed 2 films . One in telugu and one in tamil . She is working already at 18 years old understanding she has responsibilities at this young age. She is now on a paid job as everyone else — Vanitha Vijaykumar (@vanithavijayku1) October 6, 2023 But is it the end for those who cannot complete their education because they are unable to cope with the education system pressures. Fyi she is not from a rich family, I have struggled to make ends meet on a day to day basis facing family situations etc. — Vanitha Vijaykumar (@vanithavijayku1) October 6, 2023 -
ఒక్క రాత్రిలో జరిగే కథే 'రారా సరసకు రారా'!
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలోని రారా సరసకు రారా అనే పాటలోని పల్లవినే టైటిల్‌గా చేసుకొని రూపొందిన చిత్రం 'రారా సరసకు రారా'. స్కై లాండర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏ జయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేశవ్ దబర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ తదితర భాషల్లో సుమారు 350కి పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. (ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి వేడుక.. వేదిక ఎక్కడో తెలుసా?) ఈ చిత్రంలో కార్తీక్, గాయత్రి పటేల్, బాల, మారి, వినోద్, కాట్పాడి రాజన్, విశ్వ, రవివర్మ, అభిషేక్, బెంజిమిన్, సిమ్రాన్, దీపిక, గాయత్రి, జేపీ, జయవాణి అక్షిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర వివరాలను నిర్మాత ఏ.జయలక్ష్మి తెలుపుతూ ఓ రాత్రిలో జరిగే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. బళ్లారి రాజా, దామోదరం అనే ఇద్దరు రాజకీయాల్లో కలిసి ఉంటూ ఆ తర్వాత శత్రువులుగా మారుతారన్నారు. కాగా బళ్లారి రాజా చేసిన పనికి ఒక యువతి చూసిందన్నారు. దీంతో ఆమెను చంపటానికి బళ్లారి రాజా తన మనుషులను పురమాయిస్తాడన్నారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి ఒక హాస్టల్లో తలదాచుకుంటుందన్నారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నదే చిత్రం కథ అని చెప్పారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏకంగా 60 కట్స్ ఇచ్చిందన్నారు. ఆ కట్స్‌కు అంగీకరిస్తేనే ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారన్నారు. తాము ముంబైలోని రివైజింగ్ కమిటీకి వెళ్లి తక్కువ కట్స్‌తో ఏ సర్టిఫికెట్ పొందినట్లు చెప్పారు. చిత్రాన్ని నవంబర్ 3వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. (ఇది చదవండి: కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు: ఇలియానా) -
లోకేష్ కనగరాజ్ చిత్రం.. స్టార్ హీరోయిన్ అవుట్!!
కోలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ దర్శకుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు లోకేష్ కనగరాజ్. సినిమా ఆశతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి చిత్రరంగ ప్రవేశం చేసిన ఈయన తొలి చిత్రం మా నగరం నుంచి విక్రమ్ వరకు ఒకదాని మించిన ఒక హిట్ అందుకుంటూ వచ్చారు. తాజా విజయ్ కథానాయకుడిగా లియో చిత్రాన్ని పూర్తి చేశారు. ఈనెల 19వ తేదీన తెరపైకి రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇది చదవండి: ఎలిమినేషన్‌కి ముందే మరో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై వేలాడుతున్న కత్తి!) ఈ మూవీ తర్వాత రజినీకాంత్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది దర్శకుల బాటలోనే లోకేష్ కనగరాజ్ కూడా నిర్మాతగా అవతారం ఎత్తుతున్నారు. ఈయన తన శిష్యుడు రత్నకుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రాఘవ లారెన్స్, నయనతార ప్రధాన పాత్రలో ఒక హారర్, థ్రిల్లర్ కథా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈచిత్రానికి లోకేష్ కనకరాజ్ కథ, కథనం బాధ్యతలను నిర్వహించనున్నట్లు తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుంచి నయనతార వైదొలగినట్లు తెలిసింది. ఇటీవలే జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టిన నయనతార ఆ చిత్ర సంచలన విజయంతో భారతీయ సినిమాలో మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. కాగా జయం రవి సరసన నటించిన ఇరైవన్ చిత్రం ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు. తన 75వ చిత్రంతో పాటు టెస్ట్, మన్నాంగట్టి సీన్స్ 1960 పెదరా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: నాపై రాసిన ఆ వార్తలు చదివి కుమిలిపోయా: స్వాతి) జవాన్ చిత్రం తర్వాత హిందీలోనూ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. మరోపక్క తన సొంత నిర్మాణ సంస్థ రవి పిక్చర్స్ పతాకమైన చిత్రాలు నిర్మించడం డిస్ట్రిబ్యూషన్ చేయడం కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే ఇతర వ్యాపార రంగంలోనూ విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కొంత సమయాన్ని తన పిల్లల కోసం కేటాయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ కనగరాజ్ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి అని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. -
ముంబయిలో ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించా: స్టార్ హీరోయిన్
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. అగ్ర హీరోలతో పాటు చాలా చిత్రాల్లో నటించింది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ సినీరంగంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమా బయట వాళ్లకి అందమైన ప్రపంచం అందులోకి దిగితేనే లోతు ఎంతనేది తెలుస్తుందని అన్నారు. ఈ రంగంలో రాణించడం అంత సులభం కాదు.. ముఖ్యంగా నటీమణులు ఎన్నో అగాధాలను అధిగమించిన తర్వాతే అందమైన సినిమా లోకాన్ని అనుభవించడం సాధ్యమవుతుందన్నారు. తన పరిస్థితి అలాంటిదే అని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. కోలీవుడ్‌లో తడయార చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నమో ఏదో, ధీరన్ అధికారం ఒండ్రు, దేవ్, ఎన్జీకే చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా అయిలాన్, కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్–2 చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో అయిలాన్ చిత్రం సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. (ఇది చదవండి: 'బిగ్‌బాస్ 7' ఫస్ట్ కెప్టెన్‌గా రైతుబిడ్డ.. కానీ అతడిని గాయపరిచాడు!) దక్షిణాదిలో అగ్రకథానాయకగా రాణిస్తున్న రకుల్‌ప్రీత్‌సింగ్ సినిమాలో నటిగా ఎదగడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నట్టు ఇంటర్వ్యూలో పేర్కొంది. అందులో చిన్న తనంలోనే సినీ రంగప్రవేశం చేయాలని కలలు కన్న అమ్మాయినని పేర్కొంది. అయితే సినిమా ఇండస్ట్రీ గురించి ఏమి తెలియని రోజుల్లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించాను. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలు, అలా గట్టిగా రంగప్రవేశం చేసినట్లు చెప్పింది. చాలామంది మాదిరిగానే ఈ రంగంలో ఉన్న ఎత్తుపల్లాలను, నిరాకరింపులను చవి చూశానని చెప్పింది. సినిమాల్లో నటించాలన్న బలమైన కోరిక కారణంగా తల్లిదండ్రులను వదిలి ముంబయికి చేరుకుని ఒంటరి జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. అదే తాను ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అని పేర్కొంది. ఆదిలో అందరి మాదిరిగానే ఆ విషయం కోసం క్యూలో నిలబడి అవకాశాల కోసం కాస్టింగ్ ఏజెంట్లకు, దర్శకులకు ఫోన్ చేసేదానని చెప్పింది. అలా ఎంపికైన చిత్రాల్లో చివరికి వేరే వాళ్లు నటించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. పయనంలో ఎదురైన సమస్యలు తనకు మంచి పాఠాన్ని నేర్పించాలని కుటుంబ ప్రోత్సాహం లేకపోతే తానీ స్థాయికి చేరుకోవడం సాధ్యం కాదని అంటోది రకుల్ ప్రీత్ సింగ్. (ఇది చదవండి: టీడీపీ సత్యనారాయణపై నటి రాధిక సీరియస్.. మంత్రి రోజాకు మద్దతు) -
ఆ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా: మాళవిక మోహనన్
ప్రస్తుతం సక్సెస్ కోసం తహతహలాడుతున్న నటీమణుల్లో మాళవికా మోహనన్ ఒకరు. నిజం చెప్పాలంటే ఈ మలయాళ బ్యూటీ కోలీవుడ్‌లో ఇప్పటివరకూ ఒక్క సరైన హిట్‌ను అందుకోలేదనే చెప్పాలి. పేట చిత్రంతో కోలీవుడ్‌కు అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ఒకే అనిపించుకుంది. అయితే ఈ సినిమాతో నటిగా మాళవికా మోహనన్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ధనుష్ సరసన జగమే తంతిరం చిత్రంలో నటించింది. అది ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. (ఇది చదవండి: ఇదే నా చివరి సినిమా: జాతిరత్నాలు డైరెక్టర్) తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్‌కు జంటగా తంగలాన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. దర్శకుడు పా.రంజిత్ చిత్రాల్లో కథానాయికలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇక తంగలాన్ చిత్రంలో విక్రమ్ గెటప్ నుంచి.. ఆయన నటన వరకూ అన్నీ వైవిధ్యంగా ఉన్నాయి. హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది అంటోంది. దీని గురించి ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె పేర్కొంటూ తాను ఇప్పటివరకూ నటించిన చిత్రాల్లో ఛాలెంజింగ్ పాత్రను తంగలాన్ చిత్రంలో పోషించినట్లు చెప్పింది. తన జీవితంలో ఇంత ఉద్వేగాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొంది. ఇందులోని తన నటన మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ పాత్రలో అంత అర్థం ఉందని, అందుకే తంగలాన్ చిత్రం విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఈ చిత్రం తన కెరీర్‌కు టర్నింగ్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కాగా తంగలాన్ చిత్రం సంక్రాంతి బరిలో నిలవనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. (ఇది చదవండి: సెన్సార్ బోర్డుకు లంచం.. విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు! ) -
లెస్బియన్స్‌గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!
కోలీవుడ్‌లో యంగ్ హీరోయిన్స్ శృతి పెరియస్వామి, నిరంజన నతియార్ జంటగా నటించిన చిత్రం 'వాజ్వు తొడంగుమిడం నీతానే'. అయితే ఈ చిత్రంలో వీరిద్దరు లెస్బియన్లుగా నటించారు. ఈ మూవీలో ముస్లిం, హిందూ యువతులుగా నటించారు. షార్ట్‌ఫ్లిక్స్ అనే ఓటీటీ సంస్థతో కలిసి నటి నీలిమా ఇసై దీన్ని నిర్మించారు. ఈ మూవీకి జయరాజ్ పళని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రస్తుతం షార్ట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజై ఓటీటీలో దూసుకెళ్తోంది. (ఇది చదవండి: లూసిఫర్ సీక్వెల్ రెడీ.. మాలీవుడ్‌లో లైకా ప్రొడక్షన్స్ ప్లాన్) ఈ మూవీకి సక్సెస్ కావడంతో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈవెంట్‌కు హాజరైన పలువురు ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో లెస్బియన్లుగా నటించడం పట్ల శృతి పెరియస్వామి, నిరంజన నైదియర్ తమ అనుభవాలను వెల్లడించారు. శృతి పెరియస్వామి మాట్లాడుతూ..' ఈ సినిమా కథను డైరెక్టర్ చెప్పిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను మోడలింగ్‌లో అనేక మంది టాలెంట్ చూపించేందుకు కష్టపడుతున్నారు. ఈ రంగంలో ఉండే చాలా మంది లెస్బియన్స్గానే జీవిస్తున్నారు. అందుకే ఈ పాత్రలలో నటించాలని నిర్ణయించుకున్నా' అని అన్నారు. (ఇది చదవండి: వాడుకోవడం అలవాటేగా.. గీతూ ప్రశ్నలకు బిక్కముఖం వేసిన రతిక) నిరంజన నైదియర్ మాట్లాడుతూ... ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాన్నే స్టోరీగా చేశాం. ఒక నటిగా దర్శకుడు చెప్పిందే చేస్తా. నన్ను లెస్బియన్ మద్దతుదారులా? అని చాలామంది ప్రశ్నించారు. ఒక చిత్రంలో నటుడు హంతకుడిగా నటిస్తే అతన్ని హత్యలు చేసే వ్యక్తిగా చిత్రీకరిస్తామా? ఈ చిత్రంలో కేవలం ఒక సమస్యను మాత్రమే దర్శకుడు చూపించారు' అని అన్నారు. కాగా.. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి షార్ట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో అర్షత్ ఫెరాస్, ఆరుముగవేల్, ఆర్జే ప్రదీప్, శంకర్, నిరంజన్, తస్మిక, కన్నన్, మారన్ కార్తికేయన్, మహేష్, శివ శక్తి, సుధ కీలక పాత్రలు పోషించారు. -
అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు: బుల్లితెర నటి తీవ్ర ఆరోపణలు!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే చీటింగ్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఒక వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినందుకు గాను అరెస్ట్ అయ్యాడు. ఈ వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అయితే గతేడాది బుల్లితెర నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల భర్త జైలుకు వెళ్లినప్పటికీ ఎప్పటిలాగే ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది. దీంతో భర్త జైల్లో ఉంటే మీకిది అవసరమా నెటిజన్స్ ఆమెను తప్పుపడుతున్నారు. (ఇది చదవండి: 'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!) అయితే తాజాగా వీరిద్దరి వ్యవహారం కోలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రవీందర్ జైలులో ఉండగా.. ఆయన భార్య మహాలక్ష్మి సంచలన కామెంట్స్ చేసింది. తన భర్త రవీందర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఈ విషయాలన్నీ తనకు చెప్పలేదని బంధువులతో వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి మాట్లాడుతూ..'పెళ్లికి ముందు ఇలాంటి విషయాలు నాకు తెలియవు. రవీందర్ కూడా సమస్యలుని అనే విషయం చెప్పలేదు.. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు' అంటూ తన భర్త రవీందర్ గురించి సన్నిహితుల ముందు చెప్పింది. ప్రస్తుతం ఈ విషయంలో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రవీందర్ జైలుకెళ్లడం వల్ల అతని భార్య మహాలక్ష్మి ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా కొందరు చెబుతున్నారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కాగా.. ఓ వైపు ఆమెకు ఇప్పటికే పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె అనిల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. గతేడాది నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతను మోసం కేసులో అరెస్టవడంతో మహాలక్ష్మి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. కాగా.. ఇటీవలే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నటి మహాలక్ష్మి భర్త రవీందర్ అరెస్ట్) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
రజినీకాంత్, నయన్ బాటలో యంగ్ హీరోయిన్.. అదేంటో తెలుసా?
ఆస్తికం, నాస్తికం అనేది మనిషి జీవన విధానాన్ని బట్టే ఉంటుంది. ఆస్తికులు భక్తి బాట పడితే.. నాస్తికులు సైన్సును నమ్ముతారు. ఈ విషయంలో ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అయితే ప్రముఖ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే.. ఆయన స్నేహితుడు, విశ్వనటుడు కమలహాసన్ నాస్తికతకు ప్రాధాన్యతనిస్తారు. అదే విధంగా నటి నయనతార పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా గుళ్లు, గోపురాలు తిరిగొచ్చారు. (ఇది చదవండి: బుల్లితెరపై యాంకర్‌గా సన్నీలియోన్.. ఎవరికి చెక్ పెడుతుందో) తాజాగా మరో యువ నటి ఆత్మిక సైతం నయనతార, రజినీకాంత్ తరహాలో ఆధ్యాత్మిక బాట పట్టింది. హిప్ హాప్ తమిళా ఆదికి జంటగా మీసై మురుక్కు చిత్రం ద్వారా కథానాయికిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కోడియిల్ ఒరువన్, కాట్టేరి, కన్నై నంబాదే, తిరువిన్ కాదల్ చిత్రాల్లో నటించారు. కాగా ఈమె ప్రస్తుతం భక్తి బా ట పట్టడం విశేషం. ఆద్మిక ప్రస్తుతం రజినీకాంత్ తరహాలో హిమాలయాలకు వెళ్లారు. అక్కడ బాబాజీ గుహలో ధ్యానం చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. దీని గురించి ఆత్మిక స్పందిస్తూ తన ఆధ్యాత్మిక పయనం అన్నది ఆత్మ ఆదేశం అని పేర్కొన్నారు. బాబాజీ గుహకు వెళ్లాలని దైవమే పిలుపు వచ్చిందన్నారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా బయలుదేరినట్లు చెప్పారు. అయితే ఇది తనకు మరణ అనుభవాన్ని చవిచూసే అనుభవమని పేర్కొన్నారు. అయితే కొన్ని మంచి పరిణామాలు సులభంగా కలిగాయని చెప్పారు. బాబాజీ గుహలో ధ్యానం కోసంకూర్చున్నప్పుడు కలిగిన దైవిక అనుభూతిని జీవితాంతం మరిచిపోలేనన్నారు. ఆ తర్వాత జీవితంపై తన దృష్టి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఈ లోకంలోని ప్రతిఒక్కరూ ఒక్కసారైనా ఇలాంటి అనుభవాన్ని పొందాలని ఆత్మిక పేర్కొన్నారు. (ఇది చదవండి: హెచ్చరించినా తీరు మార్చుకోని శివాజీ.. పంపించేస్తే బెటర్!) View this post on Instagram A post shared by Aathmika 🦁 (@iamaathmika) -
29న నటి విజయలక్ష్మి కోర్టులో హాజరుకావాల్సిందే
ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది. సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. దీంతో మద్రాస్ హైకోర్టు నటి విజయలక్ష్మిని ఈ నెల 29న హాజరుకావాలని ఆదేశించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి విజయలక్ష్మి 2011లో నామ్ తమిళర్ పార్టీ కోఆర్డినేటర్ సీమాన్న్పై వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: వరస మార్చిన రైతుబిడ్డ.. రతికని అక్క అనేశాడు!) సీమాన్, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2011లో దాఖలు చేసిన ఫిర్యాదును 2012లో ఉపసంహరించుకోవాలని నటి విజయలక్ష్మి ఇచ్చిన లేఖ ఆధారంగా పోలీసులు కేసును క్లోజ్ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కేసు విచారణ చేపట్టి సమన్లు జారీ చేశారు. 12 ఏళ్ల నాటి కేసులో ఫిర్యాదుదారుల తర్వాత రాజకీయ ఉద్దేశంతో కేసును మళ్లీ తెరుస్తున్నందున కేసు దర్యాప్తుపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసు చివరిసారి విచారణకు వచ్చినప్పుడు 2011లో నటి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పుడు కేసు ఎందుకు పెండింగ్‌లో ఉంచారో కూడా సమాధానం చెప్పాలని పోలీసులు ఆదేశించారు. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. పోలీసు రిపోర్టు దాఖలైంది. అనంతరం సీమాన్ కేసు రద్దుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు నటి విజయలక్ష్మిని 29న కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణను వాయిదా వేశారు. సీమాన్ సూపర్.. ఆయన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. సీమాన్ సూపర్ అని.. ఆయన పవర్ ఫుల్ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. సీమాన్ పవర్ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని.. రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. -
నయనతార- విఘ్నేశ్ శివన్ ట్విన్స్.. ఈ అరుదైన ఫోటోలు చూశారా?
సౌత్ ఇండియాలో తన అభినయం, అందంతో అభిమానులను సొంతం చేసుకున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ సరసన జవాన్ మూవీలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించగా.. దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లోన కనిపించారు. (ఇది చదవండి: వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే..) అయితే గతేడాది కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట అధికారికంగా మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అంతేకాకుండా ఈ జంటకు సరోగసీ ద్వారా కవల పిల్లలు కూడా జన్మించారు. వీరికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు. (ఇది చదవండి: ఒక్క సినిమాతో ఆ రేటింగ్స్‌నే మార్చేసిన నయనతార) తాజాగా నయన్ సోషల్ మీడియాలో పోస్ట్ తెగ వైరలవుతోంది. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను పంచుకుంది. అయితే గతంలో ట్విన్స్‌తో ఉన్న ఫోటోను పంచుకున్న నయన్.. తాజాగా మరో పిక్‌ను షేర్ చేసింది. అయితే ఈ ఫోటో ట్విన్స్ పుట్టినప్పుడు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోల్లో కవల పిల్లలిద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారు . ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్యూట్ బేబీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
హీరోయిన్గా ప్రముఖ డైరెక్టర్ కూతురు.. కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు!!
దర్శకుడు సెల్వరాఘవన్ నటుడిగా బిజీ అవుతున్నారు. చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆయన నట జీవితం ఇప్పుడు హీరో స్థాయికి చేరుకుంది. తాజాగా పాన్ ఇండియా చిత్రంలో ప్రధానపాత్రను పోషిస్తున్నారు. మూమెంట్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై జీఎం.హరికృష్ణన్, దుర్గాదేవి హరికృష్ణన్ నిర్మిస్తన్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, టాలీవుడ్ నటుడు సునీల్, జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!) ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు రాజీవ్ మీనన్ వారసురాలు సరస్వతి మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రంగనాథన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 1990 ప్రాంతంలో దర్శకుడు కే.భాగ్యరాజ్ రూపొందించిన చిత్రాలు తమిళంలో విజయవంతమవడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రీమేక్ అయి హిట్ అయ్యాయని, అలాంటి కథతో రూపొందించనున్న చిత్రమని దర్శకుడు తెలిపారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర కథను విన్న సెల్వరాఘవన్‌కు నచ్చడంతో ఇందులో ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకరించారని అన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం దిండుగళ్ ప్రాంతంలో 1000 మంది సహాయ నటీనటులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలిపారు. (ఇది చదవండి: సమంతలాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి) View this post on Instagram A post shared by Saraswathi Menon (@sarasmenon) -
జవాన్ డైరెక్టర్‌పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే జవాన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన కనిపించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ చిత్రంలో నయన్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి. ఆమె యాక్షన్ సన్నివేశాలతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. (ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!) అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె సైతం కీలక పాత్రలో కనిపించింది. ఆమె పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో నయనతారకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే వార్త వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ అట్లీపై నయన్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించినా.. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కోలీవుడ్ లేటెస్ట్ టాక్. నయనతార అసంతృప్తిగా ఉందా? తాజా బజ్ ప్రకారం జవాన్‌లో అతిథి పాత్ర పోషించిన దీపికా పదుకొణెకు దక్కిన ప్రాధాన్యత నయనతారకు ఇవ్వలేదని సమాచారం. ఈ విషయంలో నయనతార అట్లీ తీరు పట్ల కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో బాలీవుడ్ చిత్రాల్లో నయన్ నటించకూడదని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రమోషన్లకు దూరం? జావాన్ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో నయన్ కనిపించక పోవడం ఇదే ప్రధాన కారణమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. షారుక్-నయనతార జవాన్ కాస్తా దీపికా- షారుక్ మూవీగా మారిపోయిందంటున్నారు. అంతే కాకుకండా గత వారం ముంబైలో జరిగిన సక్సెస్ మీట్లో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతితో సహా అందరూ హాజరైనప్పటికీ నయన్ సక్సెస్ మీట్‌కు కూడా హాజరు కాలేదు. (ఇది చదవండి: 6 ఏళ్ల తర్వాత పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్) దక్షిణాదిలో ఆమెనే! అయితే మరికొందరేమో దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. గతంలోనూ నయనతార ఎప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదంటున్నారు. గతంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. కేవలం నటించడమే తన పని నయన్ భావిస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు నయనతార దాదాపు రూ.10 నుంచి 11 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది హీరోయిన్లలో ఇప్పటివరకు ఇంత భారీ పారితోషికం తీసుకోలేదని సమాచారం. -
హార్రర్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోన్న రెజీనా!
టాలీవుడ్లో శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా. కోలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటించింది. ఇటీవలే ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటించిన రెజీనా తాజాగా తమిళంలో కంజూరింగ్ కన్నప్పన్ అనే చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు సతీష నాజర్, శరణ్య పొన్వన్నన్, ఆనంద్‌రాజ్, వీటీవీ గణేష్, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి సెల్విన్ రాజ్సేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇది చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) ఈ చిత్రం గురించి సెల్విన్ మాట్లాడుతూ.. ఇది హార్రర్, కామెడీ జానర్లో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. అయితే ఇది గత చిత్రాల తరహాలో ఉండదన్నారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయని తెలిపారు. హాలీవుడ్ స్టైల్లో కొన్ని విషయాలను చెప్పామన్నారు. వినూత్న కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని హార్రర్‌తో కూడిన ఫాంటసీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందించినట్లు చెప్పారు. ఇందులోని క్యాష్‌బ్యాక్ సన్నివేశాలను బ్రహ్మాండంగా చిత్రీకరించినట్లు తెలిపారు. మంచి చిత్రాన్ని చేయాలనే భావనతో నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకావట్లేదని చెప్పారు. చిత్ర షూటింగ్ అధిక భాగం పూర్తి అయిందని.. మరోపక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని దర్శకుడు సెల్విన్ రాజ్సేవియర్ తెలిపారు. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్లో సెక్షన్ 108 చిత్రంలో నటిస్తోంది భామ. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నారు. -
సాక్షి అగర్వాల్ కొత్త మూవీ .. సరికొత్త కాన్సెప్ట్‌తో!
సాక్షి అగర్వాల్ రాజా రాణి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సాక్షి అగర్వాల్. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. తాజాగా సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సారా. ఈ మూవీ షూటింగ్ వినాయక చవితి సందర్భంగా చైన్నెలోని ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోలో ప్రారంభించారు. విజయ్ విశ్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, రోబో శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్.విజయలక్ష్మి, చెల్లమ్మాళ్ గురుస్వామి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజిత్ కన్నా దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు సంగీత దర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. (ఇది చదవండి: చంద్రబాబు అరెస్ట్.. స్టార్ హీరో సంబరాలు!) తనకి అవకాశాన్ని కల్పించిన దర్శకుడికి సాక్షి అగర్వాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్తీక్‌రాజా సంగీత దర్శకత్వంలో నటించడం గర్వంగా ఉందని నటుడు విజయ్ విశ్వ పేర్కొన్నారు. చిత్ర దర్శకకుడు వివరాలను తెలుపుతూ క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక యువతి తన కోసం అన్ని వదులుకొని వచ్చిన ప్రేమికుడిని కాపాడుతుందా? లేక తన కోసం త్యాగం చేసిన స్నేహితుడిని కాపాడుతుందా? అన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమని తెలిపారు. హీరోయిన్ ఇతివృత్తంతో యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా మంచి అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. -
అలా అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతాం: హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ఇప్పుడున్న సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంతా ఈజీ కాదు. ముఖ్యంగా ఇప్పుడున్న సినీ ప్రపంచంలో హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ నడుస్తోంంది. హీరోయిన్స్ సినీ రంగ ప్రవేశం చేయాలన్నా.. మరీ ముఖ్యంగా ఇక్కడ నిలదొక్కు కోవాలన్నా ప్రతిభ, గ్లామర్ ఫస్ట్ ప్రయారిటీగా మారిపోయింది. ఈ విషయాన్ని సైతం చాలామంది హీరోయిన్లు పబ్లిక్ గానే అంగీకరిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా అవుననే అంటున్నారు. (ఇది చదవండి: 'బిగ్‌బాస్'లో అనుకున్నదే జరిగింది.. వెళ్తూ షకీలా ఏడిపించేసింది!) అయితే ఈ కేరళ కుట్టికి మొదట నటనపై ఆసక్తి లేదట. డాక్టర్ అవ్వాలని చదివిన ఐశ్వర్య లక్ష్మి ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంపై దృష్టి సారించారట. అలా పలు వాణిజ్య సంస్థలకు మోడల్‌గా పనిచేసిన ఈమె ఫొటోలు పత్రికల్లో ముఖచిత్రంగా ప్రచురితమవడం, దాంతో సినిమా అవకాశాలు రావడం అలా జరిగిపోయిందట. మలయాళంలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి 2019లో విశాల్ కథానాయకుడు నటించిన యాక్షన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అదేవిధంగా ధనుష్‌కు జంటగా నటించిన జగమే తంధిరం కూడా నేరుగా ఓటీపీలో స్ట్రీమింగ్ కావడంతో ఆ చిత్రం కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఆ తర్వాత విష్ణు విశాల్ సరసన నటించిన కట్టా కుస్తీ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో పూంగుళి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా గార్గీ చిత్రం ద్వారా నిర్మాతగా అవతారం ఎత్తింది. తాజాగా దుల్కర్ సల్మాన్‌కు జంటగా కింగ్ ఆఫ్ కోత్త చిత్రంలో నటించింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అందుకు తగినట్లుగా గ్లామర్‌నే మార్గంగా ఎంచుకుంది. అందాలను ఆరబోస్తూ తీయించుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అలాంటి ఫొటోల గురించి నెటిజన్లు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఐశ్వర్య లక్ష్మి స్పందిస్తూ గ్లామర్‌కు మారడం తప్పనిసరి అని.. అది లేకపోతే ఈ ఫీల్డ్‌లో కొనసాగలేమని పేర్కొంది. (ఇది చదవండి: 'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
ఏడుసార్లు అబార్షన్ అంటూ నటి ఫిర్యాదు.. అంతలోనే బిగ్ ట్విస్ట్!
ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది. సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: మహేశ్ బాబు నుంచి మరో మల్టీఫ్లెక్స్ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా?) అయితే ఈ కేసులో ఇప్పటికే ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సీమాన్ పలుమార్లు అబార్షన్లు చేయించారని ఆరోపిస్తూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. సీమాన్ తనను వాడుకుని మోసం చేసినట్టుగా దశాబ్దం కాలంగా విజయలక్ష్మి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీమాన్ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి యూటర్న్ తీసుకుంది. వలసర వాక్కం పోలీసు స్టేషన్లో కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా వినతిపత్రం సమర్పించారామె. దీంతో పోలీసులు సీమాన్ సూపర్.. ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. సీమాన్ సూపర్ అని.. ఆయన పవర్ ఫుల్ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. సీమాన్ పవర్ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని.. రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. (ఇది చదవండి: హర్ఘసాయి హీరోగా మెగా సినిమా.. టీజర్ వచ్చేసింది) -
పెళ్లి పేరుతో శారీరకంగా!.. డైరెక్టర్‌పై స్టార్ హీరోయిన్ ఫిర్యాదు!
1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన నటి విజయలక్ష్మి. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్‌కు జోడీగా నటించింది. మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి కన్నడ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ హనుమాన్ జంక్షన్, పృథ్వి నారాయణ చిత్రాల్లో కనిపించారు. ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో చాలా చిత్రాలు చేశారు. మద్రాసులో జన్మించిన విజయలక్ష్మి కర్ణాటకలోని బెంగుళూరులో చదువుకుంది. తన కెరీర్లో దాదాపు 40 సినిమాల్లో నటించింది. తెలుగులోనూ హనుమాన్ జంక్షన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా మోహన్‌లాల్‌తో కలిసి ఒక మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది. ఆత్మాహత్యాయత్నం 2006లో తండ్రి మరణంతో విజయలక్ష్మి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత.. మార్చి 2007లో నటుడు సృజన్ లోకేష్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే ఊహించని సంఘటనలతో అతనితో నిశ్చితార్థం బ్రేకప్ అయింది. ఆ తర్వాత సినిమాలకే పరిమితమైన విజయలక్ష్మి గత కొన్నేళ్లుగా మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్లి పేరుతో మోసం తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిబ్రవరి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో అతని వేధింపులు తట్టుకోలేక 2020 జూలైలో మాత్రలు మింగిఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఇటీవలే ఆమె మరోసారి సీమాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా వాడుకున్నారని విజయలక్ష్మి ఆరోపించింది. ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని తెలిపింది. అంతే కాకుండా నా బంగారు నగలు తీసుకుని సీమాన్ మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నారని ఇటీవల మరోసారి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీమాన్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. మంగళవారం తప్పకుండా విచారణకు హాజరు కావాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు. విజయలక్ష్మికి గైనకాలజిస్ట్ పరీక్ష విజయలక్ష్మి ఫిర్యాదుతో చెన్నై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. సీమాన్‌ను విచారణకు ఆదేశించడమే కాకుండా.. విజయలక్ష్మికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆమెకు 7 సార్లు గర్భస్రావం జరిగిందని ఆరోపణల నేపథ్యంలో గైనకాలజిస్టులతో వైద్య పరీక్షలు చేశారు. -
పెళ్లికి ముందు అలాంటి రిలేషన్ ఓకేనా?.. హీరోయిన్ కామెంట్స్ వైరల్!
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ అతుల్య. 2017లో కాదల్ కన్ కట్టుడే అనే తమిళ సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అదే ఏడాదిలోనే కథానాయకన్ చిత్రంలో నటించారు. అంతేకాకుండా కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి రాకముందు అతుల్య పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న మానస్.. హల్దీ వేడుకలు షురూ) ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్య రవికి కన్యత్వంపై ప్రశ్న ఎదురైంది. వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ.. 'ఈ విషయంలో నా అభిప్రాయం ప్రకారం 21 నుంచి 25 ఏళ్లు వయస్సు కరెక్ట్ అనిపిస్తోంది.' అని చెప్పింది. ఆ తర్వాత పెళ్లికి ముందు లైంగిక చర్యలో పాల్గొనడం సరైందేనా? లేక పెళ్లి తర్వాత మంచిదా? అని ప్రశ్నించగా.. దీనికి కూడా నటి సూటిగానే స్పందించింది. అతుల్య రవి మాట్లాడుతూ.. "నా అభిప్రాయం ప్రకారమైతే పెళ్లి తర్వాతే లైంగికపరమైన రిలేషన్షిప్ ఉత్తమం. ఇది మన ఆచార వ్యవహారాలు, సంస్కృతికి అద్దం పడుతోంది. అయితే ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ షిప్స్(సహజీవనం) వల్ల ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ జనరేషన్లో రిలేషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకరితో రిలేషన్లో ఉండడమనేది అది వారి వ్యక్తిగత నిర్ణయం. దీనిపై ఎవరికీ అధికారం లేదు. అయితే వివాహమే అన్నింటికంటే ఉత్తమమైన రిలేషన్ " అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ, మరో థ్రిల్లర్ సిరీస్ కూడా!) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) -
ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రేమ వ్యవహారం, పెళ్లి, పిల్లలు ఇలా అన్ని విషయాల్లోనూ తాను సంచలనమే. వయసు నాలుగు పదుల దగ్గర్లో ఉన్నా.. హీరోయిన్గా 75 చిత్రాల మైల్ స్టోన్ టచ్ చేసింది. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించింది. తాజాగా సామాజిక మాధ్యమాల్లో నయన్ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఆ ఇద్దరు కాదు.. స్టార్ హీరో సినిమాలో బాలీవుడ్ భామ..!) కోలీవుడ్‌లో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో నయన్ నటించబోతున్నారన్నదే లేటెస్ట్ టాక్. తొలి చిత్రం మా నగరం నుంచి ఈ మధ్య విడుదలైన విక్రమ్ వరకు అపజయం అనేది ఎరుగకుండా సక్సెస్ ఫుల్ ప్రయాణం చేస్తున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న లియో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా తదుపరి లోకేష్ కనకరాజు కోసం చాలా చిత్రాలు ఎదురుచూస్తున్నాయి. అందులో కమలహాసన్ నటించిన విక్రమ్ 2, కార్తీ హీరోగా ఖైదీ 2 వంటి భారీచిత్రాలు ఉన్నాయి. అలాంటిది అనూహ్యంగా నయనతార హీరోయిన్గా మరో చిత్రం గురించి వార్త వెలుగులోకి వచ్చింది. మరో విషయం ఏమిటంటే ఇందులో నటుడు లారెన్స్ కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతన్నది తెలియాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: 'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే) -
అతీంద్రియ శక్తులే కథాంశంగా వస్తున్న 'చిరో'
ప్రముఖ నిర్మాత ఎంఎస్ మంజూర్ రెండవ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. విభిన్న కథా చిత్రాలను నిర్మించాలన్న ఆసక్తితో ఈయన ప్రస్తుతం మిలియన్ స్టూడియోస్ పతాకంపై సత్యరాజ్ కథానాయకుడిగా వెపన్ అనే వైవిధ్య భరితమైన కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలోనే పరిశ్రమ వర్గాల్లో మంచి అటెన్షన్‌కు గురిచేస్తోంది. చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాత తదుపరి నిర్మిస్తున్న మరో చిత్రం చిరో. ఇంతకు ముందు పలు యాడ్ ఫిలిమ్స్ చేసిన వివేక్ రాజారామ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే వైవిద్య భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర కథలు చెప్పగానే నిర్మాతలు మంజూర్, అబ్దుల్ చాలా ఇంప్రెస్స్ అయ్యారన్నారు. ఇది ఒక్క జానర్లో సాగే కథాచిత్రంగా ఉండదని.. ప్రతి 20, 25 నిమిషాలకు జానర్ మారుతుందని ఆయన చెప్పారు. అతీంద్రియ శక్తులు కలిగిన యువతి కథే అతీంద్రియ శక్తులు కలిగిన ఓ యువతి ఇతివృత్తమే ఈ చిత్రం అన్నారు. ఇందులో కథానాయకిగా ప్రార్థనా చాబ్రియ నటించనున్నారని చెప్పారు. ఈమెది ఫాంటసీతో కూడిన ఫిక్షన్ కథా పాత్రగా ఉంటుందన్నారు. నటి ప్రార్థనా చాబ్రియను కలిసినప్పుడు ఆమె మాత్రమే ఈ పాత్రను చేయగలరని భావించారన్నారు. చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కిషన్ సీవీ ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్రం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. View this post on Instagram A post shared by Million Studio (@millionstudioss) -
మీరు ఒక్కరే రండి అనేవారు.. నాకు అర్థమయ్యేది కాదు: ఆమని
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని. తెలుగులో జంబలకిడిపంబ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్లాం సినిమాలో ఆమనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకుంది. తెలుగుతో పాటు తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమని.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ నటనలో అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో వినరో భాగ్యము విష్ణుకథ, అల్లంత దూరాన చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమని కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందంటే?) ఆమని మాట్లాడుతూ..'హీరోయిన్లలకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు. అందుకే ఎవరికీ తెలియకపోయేది. ఏ వృత్తిలోనైనా సరే మంచి, చెడు రెండు ఉంటాయి. హీరోయిన్స్‌గా అది మనం డెసిషన్ తీసుకోవాలి. తమిళంలో ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది. కొన్ని చిన్న సంస్థల్లో ఇలాంటివీ జరిగేవి. నాకు ఒకసారి స్విమ్మింగ్ పూల్ సీన్ కోసమని డ్రెస్సు తీసి ఏమైనా స్ట్రెచ్ మార్కులు ఉన్నాయేమో చూడాలి అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇలాంటి వారు కేవలం వాటి కోసమే వస్తారు. నేను వెంటనే అలాంటి క్యారెక్టర్‌ను వద్దనేదాన్ని. ఈ విషయంలో హీరోయిన్స్ వ్యక్తిగత నిర్ణయం. మనం ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కొందరు అడ్వాన్స్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలన్నారు. మీరు రావాలంటా అని మేనేజర్ ఫోన్ చేసేవారు. కానీ ఈ విషయాలు నాకు చాలా రోజులకు అర్థమయ్యేవి. ' అని అన్నారు. ఆమని ఓ సంఘటనపై మాట్లాడుతూ..' అప్పుడు సెల్‌ఫోన్స్ లేవు కదా. డైరెక్ట్‌గా మేనేజర్ వచ్చి మాట్లాడేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలని అన్నారు. అది కూడా ఓ బీచ్ దగ్గర అని చెప్పారు. అక్కడికి మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఫైనాన్షియర్ వస్తున్నారు మిమ్మల్ని చూడాలంటా అన్నారు. అసలు ఫైనాన్షియర్ నన్ను ఎందుకు చూడాలి? డైరెక్టర్, నిర్మాత చూస్తే చాలు కదా. ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలి. ఎందుకంటే ఆయన పక్కన నటించేవారు కాబట్టి తప్పదు. కానీ ఫైనాన్షియర్ చూడటమేంటి? అని అనుమానం వచ్చేది. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. ఒక్కోసారి మమ్మీ వద్దండీ.. మీరు మాత్రమే రండి అని కారు తీసుకొచ్చే వారు. అక్కడే నాకు వారి మైండ్‌సెట్ అర్థమయ్యేది. ఐ యామ్ సారీ.. నేను రాను అని చెప్పేదాన్ని. ' అంటూ సమామాధానమిచ్చింది. (ఇది చదవండి: భార్యతో స్టార్ హీరో విడాకులు.. కానీ మామతో ప్రత్యేక అనుబంధం!) -
అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భామ శృతిహాసన్. బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన భామ పలు చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలోనే టచ్‌లో ఉంటోంది కోలీవుడ్ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది. తన ప్రియుడు శాంతను హజారికాతో కలిసి రొమాంటిక్ వీడియోస్ సైతం అభిమానులతో పంచుకుంటోంది. (ఇది చదవండి: సురేఖవాణి కూతురు బర్త్‌డే.. పబ్‌లో డ్యాన్స్ చేస్తూ! ) అయితే తాజాగా శ్రుతి హాసన్ తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ప్రియుడితో కలిసి ముంబైలో ఉంటున్న ముద్దుగుమ్మ.. షూటింగ్‌లు లేకపోతే వెంటనే ఫ్లాట్‌కు వెళ్లి శంతనుతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ జంట నెట్టింట్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. చాలా గ్యాప్ తరువాత యాక్షన్ సీక్వెన్స్, బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది శృతి. తాజాగా శంతనుతో కలిసి ఫన్నీ క్విజ్‌ను నిర్వహించగా.. వీరికి ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు సంధించారు. ఎవరు బాగా వండుతారు? అనే ప్రశ్నకు నేనే బాగా వండుతా ఉంటూ ఆన్సరిచ్చింది. ఆ తర్వాత ఎవరు బాగా తింటారు? అనే దానికి శంతను అంటూ చెప్పుకొచ్చింది. మీ లవర్‌లో నచ్చే లక్షణాలు ఏంటి? అనే ప్రశ్నకు శృతి హాసన్ ఆసక్తికర సమాధానం చెప్పింది. అదేంటో తెలుసుకుందాం. తన లవర్ గురించి శృతి మాట్లాడుతూ..'శంతను ఎంతో టాలెంట్ ఉన్నవాడు. నన్ను బాగా నవ్విస్తాడు. అయితే కాస్త వింతగా కూడా ప్రవర్తిస్తాడు. నన్ను ఎక్కువగా ఇష్టపడతాడు. అతని కళ్లు అంటే చాలా ఇష్టం. ' అంటూ తన ప్రేమను వెల్లడించింది. ఎవరు ఎక్కువగా సారీ చెబుతుంటారని నెటిజన్స్ ప్రశ్నించగా.. ఎప్పుడైనా సరే తాను సారీ చెప్పాల్సిందేనని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఏడాదిలో శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ముద్దులతో రెచ్చిపోయిన శృతిహాసన్.. మండిపడుతున్న నెటిజన్స్..!) -
సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!
అలనాటి హీరోయిన్ శ్రీవిద్య పేరు 1970లో వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1953న 24 జూలై జన్మించిన శ్రీవిద్య 14 ఏళ్లకే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో నటించింది. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత మలయాళంలో తొలి అవకాశం వచ్చింది. 1971లో 'నోట్రుకు నురు' సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఏడాదిలోనే ‘ఢిల్లీ టు మద్రాస్’ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దాసరి నారాయణరావు తెరకెక్కించిన తాతమనవడు చిత్రంతో అరంగేట్రం చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలతో సహా 500కు పైగా సినిమాల్లో నటించింది. అప్పటి హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా నిలిచింది. కుటుంబ నేపథ్యం శ్రీ విద్య తండ్రి కృష్ణమూర్తి తమిళ చిత్ర పరిశ్రమలో హాస్యనటుడు.. తల్లి వసంతకుమారి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. జీవితం సవ్యంగా సాగుతున్న సమయంలోనే శ్రీవిద్య తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కుటుంబ పోషణకై ఆమె తల్లి కూలి పనికి వెళ్లేది. అప్పట్లో అమ్మకు కనీసం పాలివ్వడానికి కూడా సమయం సరిపోలేదని గతంలో శ్రీవిద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వైవాహిక జీవితం శ్రీవిద్య సినిమాల్లో నటిస్తుండాగనే.. తమిళస్టార్ హీరో కమల్ హాసన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అప్పటికే కమల్ హాసన్ మరో హీరోయిన్ వాణి గణపతితో ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత దర్శకుడు భరతన్‌తో శ్రీవిద్య ప్రేమాయణం కొనసాగించినా.. ఆ బంధంఎక్కువ కాలం నిలవలేదు. చివరికీ మాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జార్జ్ థామస్‌ని ప్రేమించి 1978లో పెళ్లి చేసుకుంది. అయితే ఇది కులాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భర్త వేధింపులు పెళ్లయిన తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించాలని భర్త జార్జ్ షరతు పెట్టాడట. దీంతో శ్రీవిద్య పెళ్లికి ముందే బాప్టిజం పూర్తి చేసింది. పెళ్లి తర్వాత కూడా భర్త బలవంతం వల్లే మళ్లీ నటనలో అడుగుపెట్టింది. అయినప్పటికీ జార్జ్ శ్రీవిద్యను వేధింపులకు గురి చేయడంతో.. ఆ బాధలు భరించలేక 1980లో విడాకులు తీసుకుని జార్జ్‌తో బంధానికి ముగింపు పలికింది. విడాకులిచ్చినా భర్త వదల్లేదు విడాకుల తర్వాత శ్రీవిద్య నటనలో కొనసాగింది. అయితే విడాకుల తర్వాత కూడా శ్రీవిద్యను జార్జ్ వదల్లేదు. ఆమె ఆస్తులన్నీ తనకు తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. చివరకు సుప్రీంకోర్టులో శ్రీ విద్య విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీవిద్య చెన్నై వదిలి కేరళలోని తిరువనంతపురంలో స్థిరపడింది. క్యాన్సర్‌తో మరణం 2003లో శ్రీవిద్యకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ తర్వాత ఆమె చికిత్స కూడా తీసుకున్నారు. తాను చనిపోవడానికి 2 నెలల ముందు శ్రీవిద్య తన బంధువు సహాయంతో ఓ ట్రస్టు స్థాపించి.. ఆస్తినంతా పేద విద్యార్థులకు చదువు, సంగీతం, నాట్యం కోసం కేటాయించేలా వీలునామా రాసింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సినీ కళాకారులను ఆదుకోవాలని వీలుమానాలో వెల్లడించింది. అంతేకాదు తన సోదరుడి ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని వీలునామాలో ప్రస్తావించింది. క్యాన్సర్‌తో చివరికి శ్రీవిద్య 19 అక్టోబర్ 2006న మరణించగా.. తిరువనంతపురంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్, భర్త వేధింపులు, చివరికీ క్యాన్సర్‌తో మరణం ఆమె జీవితాన్ని విషాదంగా ముగిసేలా చేశాయి. -
చేసింది కొన్ని సినిమాలే.. భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!
మలయాళ బ్యూటీ మహిమా నంబియార్ ఇప్పుడు చాలా ఖుషీగా ఉంది. ఈ మలయాళ బ్యూటీ తన 13 ఏళ్ల కెరీర్లో నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి పేరుని తెచ్చుకుంది. దీనికి కారణం మంచి పాత్రలను ఎంపిక చేసుకోవడమే. మలయాళం, తమిళం భాషల్లో నటిస్తున్న మహిమా నంబియార్ఆమె 2010లో మలయాళం సినిమా కార్యస్థాన్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2012లో సట్టై సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమైంది. (ఇది చదవండి: షారుఖ్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!) ఆమె నటించిన తొలి చిత్రమే మంచి సక్సెస్ కావడంతో ఆ తర్వాత కుట్రం 23, కొడి వీరన్, మహాముని తదితర చిత్రాల్లో నటించే అవకాశం వరించింది. వీటిలో ఎక్కువ శాతం సక్సెస్ కావడం ఈమె కెరీర్‌కు ప్లస్ అయ్యింది. కాగా ప్రస్తుతం చంద్రముఖి– 2 లాంటి వంటి భారీ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్, ప్రభు, నయనతార, జ్యోతిక, వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన చంద్రముఖి చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇందులో రజనీకాంత్ పోషించిన పాత్రలో నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ నటించడం విశేషం. అదే విధంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జ్యోతిక పాత్రలో నటించగా.. లక్ష్మి మీనన్, సృష్టి డాంగే, రాధిక శరత్ కుమార్, వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు మహిమ నంబియార్ ఒక నాయకిగా నటిస్తోంది. పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రంలోని ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దీని గురించి మహిమా నంబియార్ తన ట్విట్టర్లో చంద్రముఖి– 2 చిత్రంలోని పాట చిత్రీకరణ కోసం జార్జియా వెళుతున్నట్లు పేర్కొంది. ఒక నటిగా లారెన్‌న్స్ మాస్టర్‌తో కలిసి డాన్స్ చేయాలన్నది తన చిరకాల కలని అది ఇప్పుడు నెరవేరడం సంతోషంగా ఉందని పేర్కొంది. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన హీరోయిన్.. అఫీషియల్‌గా ప్రకటించిన భామ!) View this post on Instagram A post shared by Mahima Nambiar (@mahima_nambiar) -
చేసింది రెండే సినిమాలు.. క్యూ కడుతోన్న ఆఫర్లు!
కోలీవుడ్ భామ అదితి శంకర్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. డైరెక్టర్ శంకర్ కూతురిగా విరుమాన్ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్ర సక్సెస్ అదితి శంకర్‌కు బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత శివ కార్తికేయన్‌తో జతకట్టిన మావీరన్ చిత్రం కూడా విజయాన్ని అందుకుంది. (ఇది చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) తాజాగా ఈ భామ అధర్వ తమ్ముడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీనికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సెల్వరాగం దర్శకత్వంలో తెరకెక్కనున్న 7జి రెయిన్బో కాలనీ–2లో ఈ చిన్నదే నటించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కాగా అదితి శంకర్‌కు మరో అవకాశం తలుపు తట్టిందన్నది తాజా అప్డేట్. ఇంతకుముందు రాక్షసన్ వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ కుమార్ తాజాగా నటుడు విష్ణు విశాల్ హీరోగా చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలోనూ అదితి శంకర్ నటించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఆయన తెలుపుతూ నటి అదితి శంకర్ తమ చిత్ర కథను విన్నారని ఆమె ఇందులో కథానాయకగా నటించనున్నారని తెలిపారు. కాగా ఇంతకుముందు విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన ముండాసు పట్టి, రాక్షసన్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో తాజాగా ఈ కాంబో హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతోందన్నమాట. (ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్! ) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
నెటిజన్ వింత ప్రశ్న.. గట్టిగానే ఇచ్చిపడేసిన స్టార్ హీరోయిన్!
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూ అప్పుడప్పుడు చాలా ఫన్ చేస్తూ ఉంటుంది. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ నెటిజన్స్‌తో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా చిట్ చాట్ నిర్వహించింది ముద్దుగుమ్మ. ఈ చిట్ చాట్‌లో నెటిజన్స్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతుంటారు. హద్దులు మీరి ప్రశ్నలు వేస్తుంటారు. అలా ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో కౌంటరిచ్చింది శృతిహాసన్. కొందరు నెటిజన్స్ చిన్నప్పటి ఫోటో పెట్టమని అడగ్గా.. మరొకరు ఎర్ర డ్రెస్సులో ఉన్న ఫోటో.. అలాగే బాయ్ ఫ్రెండ్ శంతన హజారికాతో ఉన్న ఫోటో పెట్టమని అడిగారు. అలా అన్ని ఫోటోలను షేర్ చేసిన శ్రుతి హాసన్‌కు.. ఓ నెటిజన్ చాలా వింత ప్రశ్నవేశాడు. నీ పాదాల ఫోటో పెట్టు పెట్టు అని అడిగాడు. అయితే అతనికి శృతి తనదైన శైలిలోనే స్పందించింది. ఏదో ఒక ఏలియన్‌ను పోలిన పాదాల ఫోటోను పెట్టింది. దీంతో నెటిజన్‌కు వింత ప్రశ్నకు తగిన బుద్ది చెప్పింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు బై అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. -
కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
కోలీవుడ్ నటి గాయత్రీ శంకర్ సౌత్ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మామనితమ్, విక్రమ్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. గాయత్రీ 2012లో '18 వయసు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి.. 'నడువుల కొంజం పక్కత కానోమ్' అనే చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ హీరోయిన్‌పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ అర్వింద్‌తో డేటింగ్లో కోలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. (ఇది చదవండి: కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) ఆమె ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన ఫోటోను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ఫోటోలో గాయత్రి, అరవింద్ ఎస్‌ఏను కౌగిలించుకుంటూ కనిపించింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చింది ముద్దుగుమ్మ. ఇది చూసిన అభిమానులు ఈ జంట డేటింగ్లో ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇన్‌స్టాలో గాయత్రి రాస్తూ.. 'కమెడియన్‌గా అతని ఎదుగుదలను ప్రశంసించింది. అతని పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేసింది. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడటం నుంచి ఇంత దూరం ప్రయాణించారు. మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అసలు అరవింద్ ఎవరు? తన కామెడీతో అందరినీ నవ్వించే అరవింద్ ఎవరో తెలుసుకుందాం. అతని అసలు పేరు అరవింద్ సుబ్రమణ్యం. అందరూ అతన్ని అరవింద్ ఎస్ఏ అని పిలుస్తారు. ఈ స్టాండప్ కమెడియన్ మొదట 2013లో తమిళ చిత్రం ఆరంభం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు. యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు, హిందీ పాటలతో ప్రేక్షకాదరణ పొందాడు. అరవింద్ మద్రాసీ డా లాంటి షోలో కూడా కనిపించాడు. ఆ తర్వాత 2020లో అమెజాన్ ప్రైమ్‌లో "ఐ వాజ్ నాట్ రెడీ డా" షోను విడుదల రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు కెనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 'వీ నీడ్ టూ టాక్' అనే కామెడీ షోను ప్రదర్శిస్తున్నాడు. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! ) -
సినిమాల్లో నటనే కాదు.. అమ్మతనం ఉట్టి పడుతోంది!
లేడీ సూపర్ స్టార్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన భామ.. సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షారుక్ ఖాన్ సరసన జవాన్‌లో నటిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఎప్పుడు సినిమాలతో బిజీగా నయన్.. చిన్న పిల్లలకు టైం కేటాయించేందుకు వీలు కాదు. అలా ప్రొఫెషనల్ లైఫ్‌తో పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తోంది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) ఆదివారం కాస్తా తన కుమారులతో అమ్మతన్నాని ఆస్వాదిస్తోంది. సినిమాల్లో ప్రియురాలుగా, భర్తకు భార్యగా, బిడ్డకు తల్లిగా ఎంతగా ప్రేమను చూపిన అది నటనే కాబట్టి అందులో మమతాను రాగాలు ఉండవు. అదే నిజ జీవితంలో ఇప్పుడు నయనతార అమ్మతనాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. అందులో సహజ సిద్ధంగా కలిగే మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు. అలా ఆదివారం కాస్తా తీరిక లభించడంతో తన బిడ్డను లాలిస్తూ మురిసి పోతున్న దృశ్యాన్ని ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ఫొటో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తమ ప్రాణంగా ప్రేమించే పిల్లలతో సమయాన్ని ఆనందంగా గడిపినట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నయనతార హిందీలో షారుక్ ఖాన్‌తో తొలిసారిగా జతకట్టిన జవాన్ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తన 75 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. గత ఆరేళ్లకు పైగా ప్రేమించుకుంటూ సహజీవనం చేసిన దర్శకుడు విఘ్నేష్ శివన్.. గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. (ఇది చదవండి: హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకొచ్చింది: ప్రముఖ నటుడు ) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
ప్రతీకారమే లక్ష్యం.. భయపెట్టేందుకు వస్తోన్న 'కల్లరై'!
హార్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన కథా చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే ఈ తరహా చిత్రాలకు ప్రత్యేకంగా సీజన్ అంటూ ఉండదు. అలాంటి విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రం కల్లరై. గుడ్‌న్యూస్ ఫిలిమ్స్ పతాకంపై పొన్నేరి రతి జవగర్ నిర్మించిన ఈ చిత్రంలో సకో రమేష్, దీప్తి దివాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఏపీఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇది చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) ఏపీఆర్ తెలుపుతూ కొడైక్కెనాల్లో మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఒక యువతపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేస్తారన్నారు. ఆ జ్యోతి దెయ్యంగా మారి ఎవరైతే తనను మానభంగం చేసి చంపేశారో వారిపై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో రూపొందిన చిత్రమే కల్లరై అని చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కించి ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయని చెప్పారు. హార్రర్ థ్రిల్లర్ కథా చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ఆ నమ్మకంతోనే తాము ఈ చిత్రా న్ని నిర్మించినట్లు నిర్మాత రతి జవహార్ పేర్కొన్నారు. చిత్రం కచ్చితంగా వారి ఆదరణను పొందుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూ ర్తయ్యాయని.. ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రతి జవహార్, టి.జవహార్ జ్ఞానరాజ్, వి.యశోద, ప్రేమ ప్రియా, రోషిలా భారతీ మోహన్, సురేందర్ హరిహరన్, సురేష్, రామ్ రంజిత్, నందకుమార్, అజయ్ సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (ఇది చదవండి: పవన్‌కు అహం ఎక్కువ.. పూనమ్ కౌర్ టాపిక్‌పై రాజు రవితేజ కామెంట్) -
ఆమెతో నాకు పోటీ కాదు.. అసూయ కూడా లేదు: వాణి
ప్రస్తుతం హీరోయిన్లు అభినయం కంటే అందం, అదృష్టాన్నే ఎక్కువగా నమ్ముకుని ఉన్నారనే వాదన ఉంది. ఇకపోతే అదృష్టం వారి చేతిలో ఉండదు కాబట్టి అందాలారబోత పైనే దృష్టి పెడుతున్నారు. నటి వాణి భోజన్ ఈ విషయంలో తక్కువేమీ కాదు. తాజాగా భరత్‌తో కలిసి రొమాన్స్ చేసిన చిత్రం 'లవ్'. ఇటీవల జరిగిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి అందాలను ఆరబోసే విధంగా దుస్తులు ధరించి వచ్చింది. దీంతో ఫొటోగ్రాఫర్ల దృష్టి అంతా ఆమె పైనే పడింది. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!) ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన వాణి భోజన్ ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నానని.. ఇందులో యోగి బాబు ముఖ్య పాత్రను పోషిస్తున్నారని చెప్పింది. అదే విధంగా నటుడు అధర్వకు జంటగా ఒక చిత్రం చేస్తున్నట్లు తెలిపింది. కాగా చాలా గ్యాప్ తరువాత తెలుగులో ఒక్క చిత్రంలో నటించినట్లు చెప్పింది. ఎలాంటి సినీ నేపధ్యం లేని తాను నటిగా ఇంత దూరం పయనించడం సాధనే అని పేర్కొంది. ఇకపై కూడా మంచి పాత్రలు ఎంపిక చేసుకుని నటిస్తాననీ, ఇప్పటి వరకు తన జర్నీ సంతోషంగానూ, సంతృప్తిగానూ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మీ మాదిరి గానే బుల్లితెర నుంచి వచ్చిన నటి ప్రియా భవానీ శంకర్‌ను మీకు పోటీగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తాను అలా భావించడం లేదని చెప్పింది. ఆమె చాలా చిత్రాల్లో నటిస్తున్నారని, పెద్ద నటులతో జత కడుతున్నారని, ఒక స్నేహితురాలిగా తనకు సంతోషమేనని చెప్పింది. అంతే ఆమెతో తనకు పోటీ కానీ, అసూయ లేవని స్పష్టం చేసింది. నా దారిలో నేను వెళుతున్నట్లు ఇందులో ఒకరితో ఒకరిని పోల్చాల్సిన అవసరం లేదని వాణి భోజన్ తెలిపింది. కాగా.. టాలీవుడ్లో మీకు మాత్రమే చెప్తా సినిమాతో పరిచయమైంది కోలీవుడ్ భామ. భరత్, వాణీ భోజన్ జంటగా నటిస్తోన్న లవ్ చిత్రం మలయాళ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) -
ఆ దర్శకుడికి కలిసొచ్చిన హీరోయిన్.. దక్షిణాదిలోనే భారీ రెమ్యునరేషన్!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం విడుదలై చాలా రోజులైంది. కనెక్ట్ చిత్రం తర్వాత నయనతార తెరపై కనిపించలేదు. ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో పారితోషికాన్ని పెంచుకుంటూనే పోతున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!) ఈ సంచలన భామ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన తొలి చిత్రం జవాన్. షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఇక క్రేజీ బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. కాగా కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అట్లీకి నటి నయనతార లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. ఈయన తొలి చిత్రం రాజారాణిలో నయనతారనే కథానాయకి. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా రూపొందించిన బిగిల్ చిత్రంలోని ఈమెనే హీరోయిన్. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా తన తొలి హిందీ చిత్రంలోను నయనతారనే కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమెకు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు పారితోషికం ముట్ట జెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ హీరోయిన్లతో పోస్తే ఇది తక్కువే అయినా దక్షిణాది హీరోయిన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. కాగా జవాన్ తన తొలి హిందీ చిత్రం కావడంతో రిజల్ట్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు ) -
స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!
ప్రతి మనిషికి జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే. ఇక్కడ ఏదీ నిరంతరం కాదు జయాపజయాలు అంతే. అదేవిధంగా విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం సహజమే. ఇక నటి కీర్తిసురేష్ విషయానికొస్తే చాలా తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకున్నారు. అదేసమయంలో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సీనియర్ నటి మేనక నిర్మాత సురేష్ వారసురాలిగా సినీ రంగప్రవేశం చేసిన కీర్తిసురేష్ తమిళంలో ఇదు ఎన్న మాయం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. (ఇది చదవండి: చిట్టి ఓటీటీ ఎంట్రీ.. అలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో) ఆ తర్వాత ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిరాశపరిచినా నటిగా కీర్తిసురేష్ మాత్రం మంచి మార్కులే తెచ్చుకున్నారు. ఆ తర్వాత రజిని మురుగన్ చిత్రాలతో విజయాలను అందుకున్న ఈమె తెలుగులో మహానటి చిత్రంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అదేవిధంగా ఆరంభ దశలోనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి పీక్ సమయంలో మరింత స్లిమ్‌గా తయారవడానికి కసరత్తులు చేశారు. ఫలితంగా చాలా దారుణమైన విమర్శలకు గురయ్యారు. కీర్తిసురేష్ ముఖంలో గతంలో ఉన్న గ్లామర్ పోయిందని, ఇక ఈమె చాప్టర్ క్లోజ్ అని దారుణమైన కామెంట్స్‌ను ఎదుర్కొన్నారు. అయితే అలాంటి సమయంలోనూ అదేముఖంతో తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తెలుగులో ఆ సమయంలో ఆమె నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన రీతిలో ఆడలేదన్నది వాస్తవం. ఆ తర్వాత మళ్లీ సరికొత్త అందాలను సంతరించుకున్న కీర్తిసురేష్ ఇప్పుడు వరుసగా సక్సెస్‌లను అందుకుంటున్నారు. ఆ మధ్య తెలుగులో నాని సరసన నటించిన దసరా మంచి విజయాన్ని సాధించగా, తాజాగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన మామన్నన్ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇక త్వరలో తెలుగులో చిరంజీవికి చెల్లెలిగా నటించిన బోళాశంకర్ ఆగస్టు 11వ తేదీ రావడానికి ముస్తాబవుతోంది. తమిళంలో జయంరవితో సైరన్, హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం రఘుతాత చిత్రాలు చేతిలో ఉన్నాయి. (ఇది చదవండి: నటికి ఘోర అవమానం.. ఏకంగా ఆ బాడీ పార్ట్స్‌పైనే కామెంట్స్!)