![Vanitha Vijaykumar Shares Her latest Marriage Photo In Social Media](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/mr-and-mrs.jpg.webp?itok=fvbE-RDO)
తమిళ నటి వనిత విజయకుమార్ గురించి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. 1995లో 'చంద్రలేఖ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఓ సినిమాతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ. అయితే తెలుగులో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించిన వనితా ఈ లవర్స్ డే కానుకగా థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.
అయితే వనితా విజయ కుమార్, కొరియోగ్రాఫర్ రాబర్ట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గతేడాది అక్టోబర్‌లో వార్తలొచ్చాయి. బీచ్‌లో అతనికి ప్రపోజ్ చేస్తున్నట్లు ఫోటోలు షేర్ చేయడంతో అందరూ కూడా నాలుగో పెళ్లికి సిద్ధమైపోయిందని భావించారు. కానీ ఆ తర్వాత మూవీ ప్రమోషన్స్ కోసమే పోస్టర్ రిలీజ్ చేశారని తెలిసింది.
తాజాగా తన మూవీ ప్రమోషన్లలో భాగంగా మరో పోస్టర్‌ను విడుదల చేసింది. మిసెస్ అండ్ మిస్టర్ సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. 'పెళ్లి చేసుకోవాలనే ఆశతో ప్రేమలో పడ్డాం.. కలకాలం కలిసి జీవించాలనే ఆశతో పెళ్లి చేసుకున్నాం.. అరుణ్, విద్యాల ప్రపంచంలో ఏం జరిగింది...? అంటూ లవ్ కోటేషన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన కొందరు మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగంగానే చేసినప్పటికీ పెళ్లికి సంబంధించిన పోస్టర్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పెళ్లి కూతురిలా రెడీ అయిన వనితా విజయ్ కుమార్‌ను చూసిన కొందరు అభిమానులు ఫిదా అవుతున్నారు.
నాలుగో పెళ్లిపై రూమర్స్..
గతేడాది అక్టోబర్‌లో నాలుగో పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. ఇలానే ఓ కొరియోగ్రాఫర్ రాబర్ట్‌కు ప్రపోజ్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేయడంతో పెళ్లికి రెడీ అయిపోయిందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో నోరెళ్లబెట్టారు. తాజా పోస్టర్ చూసిన కొందరు నెటిజన్స్ మరోసారి పెళ్లి గురించి చర్చ మొదలెట్టారు. ఏదేమైనా సినిమా ప్రమోషన్స్ కంటే ఆమె పెళ్లి గురించి ఎక్కువ చర్చించుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment