అతనితో కీర్తి సురేశ్‌ పెళ్లి.. నటి ఏమన్నారంటే? | Keerthy Suresh Clarity On Her Marriage with Close Friend | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: క్లోజ్ ఫ్రెండ్‌తో వివాహం.. కీర్తి సురేశ్‌ సమాధానం ఇదే!

Published Fri, Jul 26 2024 7:53 PM | Last Updated on Fri, Jul 26 2024 8:37 PM

Keerthy Suresh Clarity On Her Marriage with Close Friend

కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రఘు తాత. ఈ చిత్రానికి సుమన్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో చిత్రయూనిట్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా వరుసగా ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేశ్‌ అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'నాపై వచ్చే రూమర్స్‌పై క్లారిటీ ఇస్తే అదే నిజమనుకుంటారు. అందుకే వాటిపై నేను రియాక్ట్ అవ్వను. కేవలం నా సినిమాల ఎంపిక, నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తా. వాటితో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతా. నా పర్సనల్‌ లైఫ్‌, ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్‌ చేసినా పట్టించుకోను. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు' అని  తెలిపింది.

కాగా.. గతంలోనూ కీర్తి సురేశ్ పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. వాటిన్నింటినీ ఆమె తల్లిదండ్రులు సైతం కొట్టిపారేశారు. కాగా.. రఘుతాత చిత్రంలో పోరాటం చేసే మహిళ పాత్ర పోషిస్తున్నారు.  ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే టీజర్‌ను విడుదల  చేయగా.. విద్యాభ్యాసం, ఉద్యోగంలో ఓ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement