Keerthy Suresh
-
ఓటీటీలో 'కీర్తీ సురేష్' బాలీవుడ్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్- కీర్తీ సురేష్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయిన ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రూ. 349 అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే, నేటి నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగానే ఓటీటీలో చూసే అవకాశం ఉంది. హిందీ,తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు.బేబీ జాన్‌తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమాకు కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్‌లో బేబీ జాన్ చేరిపోయింది. -
పెళ్లి రోజు ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేశ్..
-
పెళ్లి కూతురి చీరలో కీర్తి సురేశ్.. వజ్రంలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్!
పెళ్లి కూతురి చీరలో మెరిసిపోతున్న కీర్తి సురేశ్..క మూవీ హీరోయిన్ తన్వీరామ్ చిల్..ఇండియన్ ఆర్ట్ ఫెయిర్‌లో రానా సతీమణి మిహికా..బ్లాక్ డ్రెస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ హోయలు..వజ్రాల డ్రెస్‌లో ఒదిగిపోయిన్ బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
పెళ్లి కూతురు చీరలో కీర్తి సురేశ్.. తెగ మురిసిపోతున్న ముద్దుగుమ్మ.. (ఫోటోలు)
-
ఓటీటీలో సెడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ 'బేబీ జాన్'
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. బేబీ జాన్‌తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్‌గా మిగిలిపోయింది.బేబీ జాన్ చిత్రం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. వాలెంటైన్స్ డే నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీ తమిళ్ వర్షన్లో మాత్రమే బేబీ జాన్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌తో పాటు మరో 9 భాషలలో సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్‌లో బేబీ జాన్ చేరిపోయింది.బేబీ జాన్ కోసం గ్లామర్ డోస్ పెంచిన కీర్తిబేబీ జాన్ మూవీ సాంగ్‌లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు నెట్టింట వైరల్ అయింది. దీంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. బేబీ జాన్ తర్వాత బాలీవుడ్లో అక్క పేరుతో ఓ వెబ్‌సిరీస్‌లో కీర్తి సురేష్ నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
అంకుల్ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్
బాలనటిగా వెండితెరకు పరిచయమైంది కీర్తి సురేశ్ (Keerthy Suresh). మలయాళంలో మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. గీతాంజలి సినిమాతో హీరోయిన్గా మారింది. నేను శైలజ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. ఇటీవలే బేబీ జాన్‌తో హిందీ బాక్సాఫీస్‌కు పరిచయమైంది.అంకుల్ అని పిలవొద్దుసౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న కీర్తిని ఓ హీరో పిలిచి మరీ తనను అంకుల్ అని పిలవొద్దని చెప్పాడట! ఇంతకీ ఆ హీరో ఎవరంటే మలయాళ నటుడు దిలీప్. 2002లో దిలీప్ కథానాయకుడిగా నటించిన చిత్రం కుబేరన్. ఇందులో అతడు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు. అందులో ఒకరు కీర్తి సురేశ్. దిలీప్ కూతురిగా నటించిన కీర్తి.. తర్వాతికాలంలో అతడి ప్రేయసిగా నటించింది. రింగ్ మాస్టర్ (2014) మూవీలో దిలీప్ గర్ల్‌ఫ్రెండ్‌గా యాక్ట్ చేసింది. హీరోయిన్గా ఇది ఆమెకు రెండో సినిమా. రింగ్ మాస్టర్ సినిమాలో దిలీప్‌తో కీర్తి సురేశ్ఆయన కూతురిగా, ప్రేయసిగా..ఈ విషయాన్ని కీర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. దిలీప్ (Dileep) సరసన హీరోయిన్గా నటించేందుకు ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన్ను చూస్తూనే ఉన్నాను. తనేమీ మారలేదు, అలాగే ఉన్నాడు. రింగ్ మాస్టర్ మూవీలో నేనే తన గర్ల్‌ఫ్రెండ్ అని తెలియగానే నన్ను పిలిచి ఓ మాట చెప్పారు. చిన్నప్పుడు అంకుల్ అని పిలిచేదాన్నని.. అలా మాత్రం పిలవొద్దని కోరాడు. కావాలంటే చేట్ట (అన్నయ్య) అని పిలవమన్నాడు. నేను వెంటనే సరే చేట్ట అన్నాను. రింగ్‌మాస్టర్ నా మొదటి హిట్ సినిమా అని చెప్పుకొచ్చింది.పేరెంట్స్ సలహాపేరెంట్స్ మేనక-సురేశ్ కుమార్ గురించి చెప్తూ.. 'సినిమాల్లోకి వచ్చేస్తానన్నప్పుడు అమ్మానాన్న నాకు కొన్ని సలహాలిచ్చారు. సమయపాలన పాటించాలని అమ్మ చెప్పేది. తను సమయానికి సెట్లో ఉంటానని నేను కూడా దాన్ని అనుసరించాలని నొక్కి చెప్పింది. సెట్లో పనిచేసేవాళ్ల దగ్గరనుంచి డైరెక్టర్ వరకు అందరికీ ఒకేరకమైన గౌరవం ఇవ్వాలంది.అదే చాలా కష్టంఇండస్ట్రీలో నేను మంచి పేరు సంపాదించుకున్నాను. దాన్ని అలాగే కాపాడుకోవాలని నాన్న చెప్పాడు. మా ఇంట్లోని వాళ్లందరూ మంచి విమర్శకులు. అమ్మానాన్న కంటే కూడా నా సోదరి నుంచి ప్రశంసలు అందుకోవడం అత్యంత కష్టతరమైన విషయం. నేనేంటో నిరూపించుకోవాలి, వాళ్ల దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను' అని కీర్తి చెప్పుకొచ్చింది.చదవండి: క్యూట్ గెటప్‌లో అల్లు అర్హ, అయాన్ డ్యాన్స్.. -
మెహందీ వేడుక ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్
మహానటి ఫేం కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంథోనీ తట్టిల్‌తో గత ఏడాది ఏడు అడుగులు వేసింది. పదిహేనేళ్ల డేటింగ్ను అత్యంత గోప్యంగా ఉంచి ఉన్నట్టుండి ఆంటోనీని వివాహ మాడి అభిమానులు సర్ప్రైజ్ చేసింది. తాజాగా తమ మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలును సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. ముఖ్యంగా కీర్తి సురేష్ ధరించిన లేత గులాబీరంగు లెహంగా విశేషాలు ఆసక్తికరంగా మారాయి. మరి ఆవివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తి సురేష్ వైబ్రంట్ లెహంగాతో అందంగా మెరిసిపోయింది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో భర్త ఆంథోనీతో తన మెహందీ వేడుక ఫోటోలతోపాటు, పింక్ వైబ్రంట్ లెహంగా ఫోటోలను షేర్ చేసింది.కీర్తి, ఆంథోనీ ఇద్దరూ మ్యాచింగ్ దుస్తుల్లో అసలైన పెళ్లికళతో అందంగా కనిపించారు. చక్కటి ఎంబ్రాయిడరీ చేసిన గులాబీ రంగు కలిసిన బహుళ వర్ణ లెహెంగాలో కీర్తి మురిపించింది. దీనికి మిర్రర్ వర్క్, మోటిఫ్‌లు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఇంకా పాస్టెల్-హ్యూడ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, లేత వంకాయ గులాబీ రంగు కలగలిసిన దుపట్టా మరింత ఎట్రాక్టివ్‌గా అమరాయి. ఇక తమిళ అక్షరాలతో రూపొందిన చెవిరింగులు భలే ఉన్నాయ్! చాలా సాధారణమైన మేకప్, తేలికపాటి ఆభరణాలను ఎంచుకుంది. మరికొన్ని ఫోటోలలో సన్ గ్లాసెస్ పెట్టుకుని చలాకీగా చిలిపిగా కనిపించింది. మరోవైపు, ఆంథోనీ మ్యాచింగ్ కుర్తా-పైజామా ధరించాడు. ప్రకాశవంతమైన-నీలం రంగు కుర్తా, గులాబీ జాకెట్‌తో కీర్తి లుక్కు అద్దినట్టు సరిపోయాడు.కాగా కీర్తి సురేష, ఆంథోనీ వివాహం గ్రాండ్‌గా గోవాలో (2024, డిసెంబర్ 12) జరిగింది. తొలుత తమిళ బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం మూడుముళ్లు వేయించుకుంది. అలాగే మలయాళీ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే పసుపు తాడుతో తన లేటెస్ట్ మూవీ బేబీజాన్ ప్రమోషన్స్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్య పర్చింది. -
Keerthy Suresh: భర్తతో కీర్తి స్టెప్పులు.. ఈ ఫోటోలు చూశారా?
-
మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారుతో.. కీర్తి సురేష్ (ఫోటోలు)
-
మెక్సికోలో తంగలాన్ భామ చిల్.. బాలిలో బిగ్‌బాస్ బ్యూటీ!
మెక్సికోలో చిల్ అవుతోన్న తంగలాన్ బ్యూటీ..లైగర్ భామ అనన్య పాండే గ్లామరస్ లుక్..బేబీ జాన్ మూడ్‌లోనే కీర్తి సురేశ్..బాలిలో ఎంజాయ్ చేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ విష్ణు ప్రియ..ఆజ్ కీ రాత్ అంటోన్న బిగ్‌బాస్ భామ ప్రియాంక జైన్.. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
Keerthy Suresh: భర్త ఆంటోనితో కీర్తి మొదటి సంక్రాంతి.. స్పెషల్ గెస్ట్‌గా విజయ్ (ఫోటోలు)
-
దుబాయ్‌లో కీర్తి సురేశ్.. బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న అనన్య..!
దుబాయ్‌లో కీర్తి సురేశ్ చిల్...సెల్ఫీ మోజులో శ్రద్ధాకపూర్..శారీలో లావణ్య త్రిపాఠి ఫోటో షూట్..పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సాక్షి అగర్వాల్...బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
Keerthy Suresh: భర్తతో జాలీగా వెకేషన్.. కానీ! (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ వేకేషన్.. చీరలో అనసూయ అదిరిపోయే లుక్
పెళ్లి తర్వాత వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న కీర్తి సురేశ్..చీరలో అనసూయ అదిరిపోయే లుక్..2024 జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..బ్లూ డ్రెస్‌లో సన్నీ లియోన్ స్టన్నింగ్ లుక్స్..హీరోయిన్ ప్రణీత సుభాష్ లేటేస్ట్ పిక్స్..2025 న్యూ ఇయర్ విషెస్ చెబుతోన్న మాళవిక మోహనన్.. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
15 ఏళ్ల ప్రేమ.. నేను అడగడం వల్లే.. కీర్తి సురేశ్ లవ్ స్టోరీ
హీరోయిన్లు డేటింగ్లో ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. వాళ్లు గడప దాటి బయటకు వస్తే చాలు కెమెరాలు వారిని నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. ప్రేమలో ఉన్నా, బ్రేకప్ చెప్పుకున్నా, పెళ్లికి రెడీ అవుతున్నా అన్నీ వాళ్లు చెప్పకుండానే లీకైపోతుంటాయి. అయితే హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) మాత్రం ఏళ్ల తరబడి తన ప్రేమ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తపడింది. ప్రియుడు ఆంటోని తటిల్ (Antony Thattil)ని పెళ్లి చేసుకుని షాకిచ్చింది.మొదట్లో సరదాగా చాటింగ్తాజాగా తన ప్రేమ కథను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొత్త సంవత్సరంతో మా ప్రేమకు 15 ఏళ్లు పూర్తయ్యాయి. మొదట్లో ఓ నెలరోజులు సరదాగా చాటింగ్ చేసుకున్నాం. ఓరోజు నేను నా కుటుంబంతో రెస్టారెంట్‌కు వెళ్లాను. అతడు కూడా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఉండటంతో కలవలేకపోయాను. ఆ తర్వాత మాత్రం నీకు దమ్ముంటే ప్రపోజ్ చేయ్ డ్యూడ్ అన్నాను. అలా 2010లో నాకు ప్రపోజ్ చేశాడు. 2016 నుంచి అది సీరియస్ రిలేషన్‌షిప్‌గా మారింది. నాకు ఓ ఉంగరం కూడా తొడిగాడు. పెళ్లయ్యేవరకు దాన్ని నేను తీయలేదు. నా సినిమాల్లో కూడా మీరు గమనించవచ్చు.నా అదృష్టంతటిల్ నాకంటే ఏడేళ్లు పెద్ద. ఖత్తర్‌లో పని చేస్తూ ఆరేళ్లపాటు నాకు దూరంగా ఉన్నాడు. పన్నెండో తరగతి నుంచి మేము ప్రేమించుకుంటున్నాం. కరోనా సమయంలో కలిసి జీవించాం. నన్ను ఎంతో సపోర్ట్ చేస్తాడు. నన్ను చేసుకోవడం అతడి అదృష్టం అని అంటున్నారు కానీ అతడు దొరకడం నా అదృష్టం. నా ప్రేమ రహస్యం ఇండస్ట్రీలో సమంత (Samantha), విజయ్, అట్లీ, కళ్యాణి ప్రియదర్శన్, ఐశ్వర్య లక్ష్మి సహా కొంతమందికే తెలుసు.ముహూర్తం బాగోలేదని..ఎక్కడ చూసినా ఇంకా పసుపుతాడుతోనే కనిపిస్తున్నానంటున్నారు. మంచి ముహూర్తం చూసుకుని దాన్ని బంగారు తాళిగా మార్చుకుంటాను. జనవరి నెలాఖరువరకు బాగోలేదు. అందుకే ఇలా పసుపుతాడుతోనే ఉంటున్నాను అని కీర్తి చెప్పుకొచ్చింది. కాగా కీర్తి డిసెంబర్ 12న హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంది. తర్వాత గోవాలో క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ బ్యూటీ ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టింది. బేబీ జాన్ సినిమాతో హిందీ చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది.చదవండి: రవితేజకు 'నంది అవార్డు' తెచ్చిన సినిమా రీరిలీజ్‌పై ప్రకటన -
సమంత సందేశం ధైర్యాన్ని ఇచ్చింది: కీర్తి సురేశ్
స్టార్ హీరోయిన్ సమంతకు ‘మహానటి’ కీర్తి సురేశ్ థాంక్స్ చెప్పింది. ఆమె వల్లే తనకు ‘బేబీ జాన్’ అవకాశం వచ్చిందని, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే సినిమాలో నటించానని చెప్పింది. కీర్తి సురేశ్ నటించిన తొలి హిందీ సినిమా ‘బేబీ జాన్’.వరుణ్ ధావన్ హీరోగా కాలీస్ దర్శకత్వంలో అట్లీ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చిందో చెప్పింది. తమిళ మూవీ ‘తెరి’ని హిందీలో రీమేక్ చేయాలని భావించగానే సమంత నా పేరు చెప్పారు. తమిళ్లో ఆమె పోషించిన పాత్రను నేను హిందీలో చేయడం ఆనందంగా ఉంది. సామ్ వల్లే నాకు హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ‘తెరి’లో సమంత నటన నాకెంతో ఇష్టం. ఆ పాత్రలో నేను నటించాలని చెప్పగానే భయపడ్డాను. కానీ సమంత నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మేకర్స్ నా పేరు వెల్లడించగానే.. ‘నువ్వు తప్ప ఈ పాత్రలో మరెవ్వరు చేయలేరు’ అని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. ఆ సందేశం నాకు చాలా ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచింది. సమంత స్ఫూర్తితోనే ధైర్యంగా షూటింగ్ పూర్తి చేశాను. ఈ మూవీలో నటించనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. కాగా, గతంలో కీర్తి, సమంత కలిసి ‘మహానటి’లో నటించారు. -
ఓటీటీలో కీర్తీ సురేష్ భారీ డిజాస్టర్ సినిమా
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది.బేబీ జాన్‌తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. వాస్తవంగా సినిమా విడుదలైన సమయం నుంచి సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని మొదట అనుకున్నారట. అయితే, సినిమా ఫలితం అనుకూలంగా రాకపోవడంతో జనవరి చివరి వారంలో బేబీ జాన్ ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఓటీటీలో తెలుగు, తమిళ్ భాషలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్‌లో బేబీ జాన్ చేరిపోయింది. -
గ్రీన్ డ్రెస్‌లో బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్.. భల్లే భల్లే అంటోన్న మంగళవారం బ్యూటీ
గ్రీన్ డ్రెస్‌లో బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్బేబీ జాన్ టీమ్‌తో కీర్తి సురేశ్ చిల్...బుల్లితెర భామ మౌనీ రాయ్ వేకేషన్ పిక్స్...వింటర్ ఎంజాయ్ చేస్తోన్న పూనమ్ బజ్వా..ఎమర్జన్సీ ప్రమోషన్స్‌తో బిజీగా కంగనా రనౌత్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న శ్రద్ధాదాస్...భల్లే భల్లే అంటోన్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
కీర్తికి వింత అనుభవం.. దోస అని పిలవడంతో..
బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. పర్సనల్ లైఫ్‌ను పక్కనపెట్టేసి ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. కానీ ఏం లాభం? బేబీ జాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించలేకపోయింది. మిక్స్డ్ టాక్ వస్తుండటంతో వసూళ్లు అందుకోవడం కష్టంగా మారింది.కీర్తి దోస..ఇకపోతే సినిమా కోసం తరచూ ముంబై వెళ్తోంది కీర్తి. ఈ క్రమంలో గురువారం రాత్రి అక్కడి ఫోటోగ్రాఫర్లు ఆమను కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు తనను కృతి అని పిలిచారు. దీంతో ఆమె.. నా పేరు కృతి కాదు కీర్తి అని చెప్పింది. ఇకపోతే సౌత్ ఇండియన్ యాక్టర్స్‌ను అక్కడి ఫోటోగ్రాఫర్లు దోస అని పిలుస్తుంటారు. అలా కొందరు దోస అని పిలవడంతో ఆమె అభ్యంతరం చెప్పింది. నా పేరు కీర్తి దోస కాదు కీర్తి సురేశ్. కానీ నాకు దోస అంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.సినిమాబేబీ జాన్ (Baby John Movie) విషయానికి వస్తే వరుణ్ ధావన్ హీరోగా నటించగా కీర్తితో పాటు వామిక గబ్బి హీరోయిన్గా యాక్ట్ చేసింది. జాకీ ష్రాఫ్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలైంది. తేరీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: బేబీ బంప్‌తో సమంత.. వైరల్ ఫోటోలపై ఫ్యాన్స్ ఫైర్ -
బ్యాడ్ లక్ కీర్తి.. అవమానమే తప్ప ఆశ తీరలేదు!
సౌత్ హీరోయిన్లకు ఓ కోరిక ఉంటుంది. ఎప్పటికైనా బాలీవుడ్లో రాణించాలని టార్గెట్‌గా పెట్టుకుంటారు. ఇక్కడ ఓ నాలుగైదు హిట్స్ పడగానే.. బాలీవుడ్ ఎంట్రీ కోసం బారులు తీస్తారు. అక్కడ డెబ్యూ మూవీ హిట్ అయితే చాన్స్‌లు వస్తాయి. కానీ తొలి సినిమానే ప్లాప్ అయితే మాత్రం అంతే సంగతి. పైగా ఆ సినిమా కోసం సౌత్ సినిమాలను వదులుకోవడం..ఇక్కడి దర్శకనిర్మాతలు కూడా బాలీవుడ్లో బీజీ అవుతుందేమోనని వేరే హీరోయిన్ని వెతుక్కోవడంతో రెండింటికి చెడ్డ రేవడిలా మారుతారు. గతంలో త్రిష, కాజల్, శ్రియ, తమన్నా, పూజా హెగ్డే లకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో కీర్తి సురేశ్(Keerthy Suresh) కూడా చేరబోతున్నారు. ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్(Baby John) ఇటీవల విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుణ్ ధావన్(varu Dhawan) హీరోగా నటించిన ఈ చిత్రం.. విజయ్ తేరి సినిమాకు హిందీ రీమేక్. ఈ చిత్రంతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి డెబ్యూ చేసింది. ఎన్నడూ లేనంతగా బేబీ జాన్ లో గ్లామర్ షో చేసింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం..తొలి రోజే ప్లాప్ టాక్ని తెచ్చుకొని కీర్తి సురేశ్ బాలీవుడ్ ఆశలన్నీ అడియాశలు చేసింది. అంతేకాదు బాలీవుడ్లో ఘోర అవమానం కూడా ఎదురైంది. సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో కెమెరామెన్లు ఆమె పేరు కూడా మర్చిపోయారు. కీర్తి సురేశ్‌కు బదులు కృతి ఇటు చూడు అంటూ ఫోటోలు తీశారు. దీంతో కాస్త అసహనానికి గురైన కీర్తి.. ‘నా పేరు కృతి కాదు..కీర్తి..కీర్తి సురేశ్’అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. జాతీయ అవార్డు గ్రహిత, దక్షిణాది స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేశ్ పేరు కూడా బాలీవుడ్‌కు తెలియకపోవడం దారుణం అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్‌లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. జూన్‌లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్‌ల్యాండ్‌లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్‌లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్‌లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్‌లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్‌ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్‌లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం. -
చాలా మంది హీరోల నుంచి కీర్తి సురేష్ ని నేను కాపాడాను..
-
పెళ్లై రెండు వారాలే.. కీర్తి సురేష్‌పై అప్పుడే మొదలైన రూమర్స్
కథానాయకిగా మంచి క్రేజ్‌లో ఉన్న నటి నటనకు విరామం ప్రకటించడం జరుగుతుందా..? అదీ పాన్ ఇండియా నటి, జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత అలా చేస్తుందా..? అంటే అది జరిగే పని కాదు. అయితే నటి కీర్తి సురేష్ విషయంలో ఇప్పుడు అలాంటి ప్రచారమే జరుగుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అనతికాలంలోనే అగ్ర కథానాయికి స్థాయికి చేరుకున్న ఈమె, అంతేవేగంగా ఇండియన్ కథానాయకిగా ఎదిగింది . మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రిగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.కాగా వివాహం విషయంలో చాలా మంది నటీమణుల కంటే ముందుంది.తను 15 ఏళ్లుగా ప్రేమించిన ఆంటోనితో ఈనెల 12వ అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసింది. అయితే భర్తతో హ నీమూన్‌కు కూడా వెళ్లకుండా తాను కథానాయకిగా నటించిన తొలి హిందీ చిత్రం 'మేరీ జాన్' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. కాగా ప్రస్తుతం ఈ భామ కొత్త చిత్రాలు అంగీకరించడం లేదని ప్రచారం హోరెత్తుతోంది. చేతిలో ఉన్న రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాల షూటింగ్‌ను కూడా పూర్తి చేసింది. కాగా కొత్తగా పెళ్లి చేసుకున్న కీర్తీ సురేష్ కొంత కాలం భర్తతో సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు, అందుకని నటనకు విరామం ఇవ్వనున్నట్లు.. తరువాత నటిగా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో అన్నది తెలియాల్సి ఉంది. అయితే కీర్తీ సురేష్‌కు ప్రస్తుతం ఏ భాషలోనూ కొత్తగా అవకాశాలు లేవన్నది నిజం. -
కీర్తి సురేశ్ పెళ్లిలో సందడి చేసిన ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ ఫోటోలు వైరల్!
-
ట్రెండింగ్ బ్యూటీ వామికా గబ్బి.. ఇంతకీ ఎవరీమె? (ఫొటోలు)
-
కీర్తి సురేశ్ 'బేబీ జాన్' ట్విటర్ రివ్యూ
హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) తొలి హిందీ సినిమా 'బేబీ జాన్' (Baby John Movie) చాలా ఏళ్ల క్రితం వచ్చిన 'తెరి' సినిమాకు ఇది రీమేక్. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించాడు. కీర్తితో పాటు వామికా గబ్బి హీరోయిన్గా నటించింది. ట్రైలర్‌తోనే ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనే హింట్ ఇచ్చారు. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా మూవీని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇంతకీ మూవీ టాక్ ఏంటి? ఆడియెన్స్ ఏమంటున్నారు?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది గానీ మరీ సూపర్ బంపర్ అనట్లేదు. తొలి 40 నిమిషాలు డీసెంట్‌గా ఉందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల మాత్రం హార్డ్ హిట్టింగ్ సీన్స్‌తో చూపించారని అంటున్నారు. సెకండాఫ్‌ని యాక్షన్ సన్నివేశాలతో నింపేశారని, క్లైమాక్స్ సాలిడ్‌గా ఉందని అంటున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటున్నారు.యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, కామెడీ, కాస్త రొమాన్స్.. ఇలా అన్ని అంశాల మిక్స్ చేసి తీసిన మాస్ ఎంటర్టైనర్ 'బేబీ జాన్'కి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. హీరోగా చేసిన వరుణ్ ధావన్, గెస్ట్‌రోల్ చేసిన సల్మాన్ ఖాన్ (Salman Khan) అదిరిపోయే ఫెర్మార్మెన్స్ ఇచ్చారని మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!)#BabyJohnReview : ⭐⭐⭐1/2.#BabyJohn is a massy hilarious ride crafted to captivate large audiences. The perfect mix of action, emotions, drama, & humor, coupled with lead actors outstanding performance, delivers an incredibly entertaining & enjoyable cinematic experience.👍 pic.twitter.com/8DMSxR1RKB— Always Bollywood (@AlwaysBollywood) December 25, 2024#BabyJohn Received Extraordinary Response From The Audience.Everyone Appreciate The Performance Of #VarunDhawan & #SalmanKhan's Cameo And Loudly Praise Him.Blockbuster Loading 🔥🔥🔥 @BeingSalmanKhan #SalmanKhan #BabyJohnReview pic.twitter.com/6h8LwgdgKx— Filmy_Duniya (@FMovie82325) December 25, 2024@Varun_dvn Is back with a BANG 🔥 #BabyJohn is the perfect blend of action, drama, romance, comedy & a killer music album! The punchlines and punches, both land so well that it will leave you speechless. The twists, the sound effects, everything make it a MUST WATCH. (1/2) pic.twitter.com/PJONKGkmO1— ekta | VD stan ✨ (@crazyvaruniac_) December 24, 2024Round 1 #BabyJohn Mass 🔥 pic.twitter.com/peivaAjeSf— sahil. (@shutupsahill) December 25, 2024Agree or die Best Title Card ever in the Bollywood cinema 🔥#VarunDhawan #BabyJohn pic.twitter.com/MeYu6kB0Oa— BUNNY (@BabyJohnDec25) December 24, 2024THIS MANNNN!!!! 🔥🤯ONE OF THE BEST ENTRY SCENE FOR SALMAN KHAN!! THE CENIMA WILL TURN INTO STADIUM !! 🥶GET READY FOR "AGENT BHAIJAAN" 🔥🌋🥵#BabyJohn #SalmanKhan #Christmas #MerryChristmas #BabyJohnreview #Sikandar #SikandarTeaser pic.twitter.com/DLmAmdMkab— it's cinema (@its_cinema__) December 24, 2024Only south Directors know how to present superstar like Salman Khan#BabyJohn #SalmanKhan pic.twitter.com/FJuFncJHtz— 𝙳𝚛 𝙼𝚞𝚓𝚓𝚞 𝙺𝚑𝚊𝚗 (@MajesticMujju) December 24, 2024#BabyJohnReview ~ ENTERTAINER!👌Rating: ⭐️⭐️⭐️½#BabyJohn offers GREAT ACTION, GOOD DIALOGUES, THRILLING BGM, and SOLID PERFORMANCEs by the lead and Supporting Actors🔥👌The first 40 minutes are just about decent, but 20 mins before the INTERVAL really HIT HARD! Thanks to… pic.twitter.com/VAAblSJ9Qb— CineHub (@Its_CineHub) December 25, 2024 -
బిగ్‌బాస్ షోలో 'బేబీ'తో కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నెంబర్ అడిగారు: వరుణ్ ధావన్
బేబీ జాన్ సినిమాతో కీర్తి సురేశ్ (Keerthy Suresh) బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. బుధవారం (డిసెంబర్ 25)న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెళ్లయిన రెండు రోజులకే పర్సనల్ లైఫ్‌ను పక్కనపెట్టేసి సినిమా ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. తాజాగా ఈ బ్యూటీ బేబీ జాన్ (Baby John Movie) హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.ఎప్పుడూ పెళ్లి టాపికే..ఈ సందర్భంగా వరుణ్ ధావన్ (Varun Dhawan) మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ పెళ్లి గురించే మాట్లాడుకునేవాళ్లం. నాకేమో పెళ్లయిపోయింది. తనేమో పెళ్లికి రెడీ అవుతోంది.. కాబట్టి ఈ హడావుడి గురించే ఎప్పుడూ కబుర్లాడుకునేవాళ్లం. వివాహమయ్యాక నేను మంచి ఇల్లాలుగా ఉంటాననేది. సినిమాలో తను ఎలాంటి భార్యగా నటించిందో చూడండి.. తనకు వైఫ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చేయాలంటారు. నిజానికి కీర్తి ఎంతోమంది మనసులను ముక్కలు చేసింది. (చదవండి: కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్)అదే బెటర్ అనిపించింది!తను ప్రేమలో ఉన్న విషయం ఏళ్ల తరబడి ఎవరికీ తెలియదు అన్నాడు. ఇంతలో కీర్తి మధ్యలో కలుగజేసుకుంటూ నాకు బాగా దగ్గరైనవాళ్లకు తెలుసు. అట్లీ, అతడి భార్య, అలాగే వరుణ్‌తో సినిమా చేస్తున్నప్పటి నుంచి తనకూ తెలుసు. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా తెలుసు. ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వకపోడమే బెటర్ అనిపించింది అని చెప్పుకొచ్చింది.చాలామంది హీరోలు తన నెంబర్ అడిగారువరుణ్ మాట్లాడుతూ.. మేము ముంబైలో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది తన ఫోన్ నెంబర్ పంపించమని మెసేజ్ చేశారు. ఎంతో మంది హీరోలు తన నెంబర్ అడిగారు. తనను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. అందుకే ఎవరికీ నెంబర్ ఇవ్వకుండా తనను కాపాడాను. చివరకు నా బేబీ.. నాకే వదినగా మారిపోయింది అని వ్యాఖ్యానించాడు.చదవండి: Pushpa 2 Movie: దమ్ముంటే పట్టుకోరా.. -
పెళ్లైనా తగ్గేదేలే అంటున్న కీర్తి సురేష్
-
కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా?
సెలబ్రిటీలు, అందాల తారల పెళ్లిళ్లు పెళ్లి ముచ్చట్టు హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. వారు కట్టుకున్న డిజైనర్ దుస్తులు, విలువైన ఆభరణాలు, వెడ్డింగ్ డెస్టినేషన్ ఇలా ఒకటనేమిటీ ప్రతీదీ వార్తల్లో విశేషంగా నిలుస్తుంటాయి. ప్రస్తుతం మహానటి ఫేం, నటి కీర్తి సురేష్ పెళ్లి చీర విశేషాలు వైరల్‌గా మారాయి. ఏంటా విశేషాలు తెలుసుకుందామా..!15 ఏళ్ల సుదీర్ఘ స్నేహం తర్వాత, ప్రియుడు ఆంటోనీ తటిల్‌తో ఈనెల 12న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయ్యంగార్, క్రిస్టియన్ వివాహ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కీర్తి సురేష్ పెళ్లి చీర విశేషాలు గురించి మాట్టాడుకుంటే.. పసుపు , ఆకు పచ్చ రంగుల కాబినేషన్లో ఉన్న చీరలో కొత్త పెళ్లికూతురిగా అందంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చీర డిజైనర్ ఆంటోనీ అనితా డోంగ్రే ఈ చీర విశేషాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇక కీర్తి సురేష్ రెడ్-టోన్డ్ వెడ్డింగ్ చీర ఆమె తల్లిదట దీనికి మ్యాచింగ్ బ్లౌజ్‌ను డిజైన్ చేసినట్టు అనితా వెల్లడించారు.అమ్మచీర , కొంగుపై తమిళ పద్యంతొమ్మిది గజాల, అయ్యంగార్ (మడిసర్) స్టయిల్లో తన తల్లి చీరలో కీర్తి సురేష్ స్పెషల్‌గా కనిపించింది. ఈ పెళ్లి చీర మేకింగ్ వీడియోను అనితా సోషల్‌మీడియాలో పంచుకున్నారు. కంజీవరం చీరపై తమిళ పద్యాన్ని చేతితో అందంగా పొందరుపర్చారు. అదీ స్వయంగా కీర్తి చీర అంచులు, పల్లులో స్వయంగా తన చేతితో అక్షరాలను తీర్చిదిద్దడం విశేషం.తయారీకి 405 గంటలుఇంకా ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన బంగారు జరీ డైమండ్ సూది ఉన్నాయని అనితా డోంగ్రే వెల్లడించారు.అంతేకాదు దీని తయారీకి సుమారు 405 గంటలు పట్టింది. సంప్రదాయ నేత కళను, ఫ్యాషన్ సంస్కృతిని ప్రతిబింబించేలా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు డిజైనర్లు. పెళ్లిలో ఆమె భరతనాట్య ఆభరణాలను ఎంచుకుంది. నెక్లెస్‌లు అట్టికై , హారం, మాంగ టిక్కా లేదా నెట్టి చుట్టి, ఒడ్డాణం, ఇరుచెంపలకు సూర్య , చంద్ర ఇలా సంప్రదాయ ఆభరణాలతో రాయల్ లుక్‌లో మెరిసింది. View this post on Instagram A post shared by Anita Dongre (@anitadongre)ఇక ఆంటోనీ పట్టు ధోతీ ,శాలువా తయారు చేయడానికి 150 గంటలు పట్టిందని కూడా ఆమె వివరించారు. ఇక వర్క్ విషయానికి వస్తే ‘బేబీ జాన్’తో బాలీవుడ్లో అడుగు పెడుతోంది. డిసెంబర్ 25న విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో మంగళసూత్రంతో హాజరైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌అయిన సంగతి తెలిసిందే. -
World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్ శారీ లుక్స్
-
జీవితంలో పెళ్లే చేసుకోనన్న హీరోయిన్.. కీర్తి సురేశ్ గురించి ఏమందంటే? (ఫోటోలు)
-
కీర్తి సురేశ్ పెళ్లికి ఇంతమంది హీరోహీరోయిన్లు వెళ్లారా? (ఫొటోలు)
-
Keerthy Suresh: అటు సంతోషం.. ఇటు డెడికేషన్..
మహానటి కీర్తి సురేశ్ ఈ మధ్యే పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. డిసెంబర్ 12న అతడితో ఏడడుగులు వేసింది. తొలుత గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా తర్వాత క్రిస్టియన్ పద్ధతిలోనూ ఉంగరాలు మార్చుకుని వెడ్డింగ్ సెల్రేషన్స్ జరుపుకున్నారు. పెళ్లయి వారం కూడా కాలేదు, అప్పుడే తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. అంతేకాదు, మెడలో పసుపు తాడుతోనే ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.బేబి జాన్కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ బేబి జాన్. వరుణ్ ధావన్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. డిసెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తికి హిందీలో ఇదే తొలి సినిమా కావడం విశేషం! ఈ క్రమంలో ముంబైలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్‌కు కీర్తి హాజరైంది.సంతోషంలో కీర్తివివాహ బంధంపై ఎనలేని గౌరవంతో తాళిని అలాగే ఉంచుకుని ఈవెంట్‌కు రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు పెళ్లిలో హీరో విజయ్ ఆశీర్వదించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మా డ్రీమ్ ఐకాన్ విజయ్ సర్ మా పెళ్లికి హాజరై మమ్మల్ని ఆశీర్వదించాడు అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) చదవండి: సర్జరీ కోసం వెళ్తున్నా.. కాస్త ఆందోళనగానే ఉంది: శివరాజ్ కుమార్ -
మెడలో తాళిబొట్టు.. మోడ్రన్ డ్రెస్‌లో కీర్తి సురేష్ ట్రెండింగ్ (ఫోటోలు)
-
భాష మారింది.. కీర్తి సురేశ్ రెమ్యునరేషన్ డబుల్?
'మహానటి' కీర్తి సురేశ్ తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోయింది. పేరుకే మలయాళీ గానీ టాలీవుడ్లోనే స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసింది. రీసెంట్గా ఆంటోని తట్టిళ్ అనే బిజినెస్‌మ్యాన్ పెళ్లి చేసుకుంది. మరోవైపు ఈమె నటించిన తొలి హిందీ సినిమా 'బేబీ జాన్'.. వచ్చే వారం క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పుడు ఈ మూవీ కోసం డబుల్ రెమ్యునరేషన్ తీసుకుందనే టాక్ నడుస్తోంది.ప్రముఖ నిర్మాత సురేశ్, ఒకప్పటి హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేశ్.. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ ఏడాది రిలీజైన ప్రభాస్ 'కల్కి'లో కారుకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎంటర్టైన్ చేసింది. ఈమె నటించిన 'బేబీ జాన్' అనే హిందీ మూవీలో నటించింది. తమిళ సినిమా 'తెరి' రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త)ఒరిజినల్ సినిమాలో సమంత కనిపించిన పాత్రలో ఇప్పుడు కీర్తి సురేశ్ నటించింది. సౌత్‌లో నటిస్తే రూ.2 కోట్లు ఈమెకు ఇస్తారు. కానీ 'బేబీ జాన్'లో నటించినందుకుగానూ రూ.4 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట. బహుశా అందుకేనేమో గ్లామర్ విషయంలోనూ తగ్గేదే లే అన్నట్లు పాటల్లో కనిపించింది!ఇదే సినిమాలో నటించిన మిగతా నటీనటులు రెమ్యునరేషన్ విషయానికొస్తే హీరో వరుణ్ ధావన్‌కి రూ.15 కోట్లు పైనే ఇచ్చారట. విలన్‌గా చేసిన జాకీ ష్రాఫ్‌కి కోటిన్నర, మరో హీరోయిన్గా చేసిన వామికా గబ్బికి కోటి రూపాయలు, కీలక పాత్ర చేసిన సన్యా మల్హోత్రాకు రూ.40 లక్షల పారితోషికం ఇచ్చారట. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇతడి శిష్యుడు కలీస్ దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
క్రిస్టియన్ సంప్రదాయంలోనూ కీర్తి సురేశ్ పెళ్లి (ఫొటోలు)
-
లవ్ మ్యారేజెస్ తో... స్టార్ హీరోయిన్స్ బిజీ ?
-
2024లో ఇంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారా? (ఫొటోలు)
-
Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు చూశారా?
-
గోవాలో ఘనంగా జరిగిన కీర్తిసురేష్ వివాహం
-
హిందూ సంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్,ఆంటోనీల పెళ్లి
హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకుంది. గోవా వేదికగా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరుకుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కీర్తి మెడలో ఆంటోనీ మూడుముళ్ల వేయడంతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో కొత్త దంపతులు పంచుకున్నారు.గోవా వేదికగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందిమంది సన్నిహితులు పాల్గొన్నారు. నూతన వధూవరులను వారందరూ ఆశీర్వదించారు. దీంతో అభిమానులు కూడా వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తాటిల్‌తో తన ప్రేమ విషయాన్ని కీర్తి సురేశ్ తెలియజేసింది. సౌత్‌లో బిజీ హీరోయిన్గా ఉన్న ఆమె కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బేబీ జాన్ మూవీతో ఆమె బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే విడుదలకానుంది.కీర్తి సురేష్ పెళ్లిలో పాల్గొన్న వారందరికీ KA అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాండ్స్ ఇచ్చారట.. వాటిని ధరించిన వారికి మాత్రమే పెళ్లి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారట. ఆంటోనీతో ప్రేమ, వివాహం గురించి ఇటీవల కీర్తి ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఒక ఫొటో విడుదల చేసిన ఆమె.. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లు తెలిపింది. ఆంటోనీ కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తుంది. కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కలిసే ఉన్న కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
పెళ్లితో ఒక్కటైన కీర్తి సురేష్, ఆంటోనీ తాటిల్ (ఫోటోలు)
-
గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి వేడుక.. ఫోటో పంచుకున్న హీరోయిన్!
హీరోయిన్ కీర్తి సురేశ్ వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈనెల 12న తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తటిల్‌ను పెళ్లాడనుంది. ఇప్పటికే కీర్తి సురేశ్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గోవాలో జరగనున్న వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటోను షేర్ చేసింది. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులంతా గోవాలో ల్యాండైనట్లు తెలుస్తోంది. కాగా.. 15 ఏళ్లుగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు.రెండు సంప్రదాయాల్లో వివాహం..ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈనెల 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. కాగా.. కీర్తి సురేశ్ ప్రస్తుతం హిందీలో బేబీ జాన్ మూవీతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. -
పెళ్లికి ముందు కీర్తి అలా.. చాన్నాళ్ల తర్వాత మెగా కోడలు ఇలా!
అందాల విందు చేసేలా శ్రీముఖి స్టిల్స్అత్తారింట్లో అడుగుపెట్టిన నటుడు జయరామ్ కోడలుడిజైనర్ వేర్లో కీర్తి సురేశ్ వయ్యారాలుమెగా కోడలు లావణ్య త్రిపాఠి క్లాస్ టచ్స్లీవ్లెస్ డ్రస్సులో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ప్రీతి జింటాలండన్లో చిల్ అవుతున్న మాళవిక మోహనన్'కిస్సిక్' పాటకు స్టెప్పులేసిన అరియానా-సౌమ్య View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Jayaram (@actorjayaram_official) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Face Magazine (@facemag.in) View this post on Instagram A post shared by Pranati Rai Prakash (@pranati_rai_prakash) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Rithu Manthra (@rithumanthra_) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram) View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Sathya krishnan (@sathya_krishnan27) View this post on Instagram A post shared by Sowmya Rao (@sowmya.sharada) View this post on Instagram A post shared by Anju Kurian (Ju) (@anjutk10) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
ఫేస్ మ్యాగజీన్ కవర్ : కాబోయే పెళ్లికూతురు కీర్తి ఫ్యాషన్ లుక్స్
-
నిర్మాతగా స్టార్ డైరెక్టర్ భార్య.. ట్రైలర్ చూశారా?
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'బేబీ జాన్'. ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే బేబీ జాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వామికా గబ్బి రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించడం మరో విశేషం. -
రెండు సంప్రదాయాలను గౌరవిస్తూ కీర్తి సురేష్ పెళ్లి
సినీ తారల ప్రేమ, పెళ్లి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి సీజనే నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల నటుడు నాగచైతన్య, శోభిత వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగిన విషయం తెలిసిందే. మరుపక్క నటి సమంత బాలీవుడ్‌కు చెందిన ఓ నటుడి ప్రేమలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపోతే కురక్రారుల డ్రీమ్ గర్ల్ కీర్తి సురేష్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న హిందీ చిత్రం బేబీ జాన్‌తో ఈ అమ్మడు పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఇలా కథానాయకిగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్న సమయంలోనే కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమవడం చాలామందిని ఆసక్తికి గురిచేసింది. 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తన పాఠశాల స్నేహితుడు ఆంటోనితో ఏడడుగులు నడవడానికి కీర్తి సురేష్ సిద్ధమవుతున్నారు. కాగా తను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్ మతానికి చెందినవాడు కావడంతో నటి కీర్తి సురేష్ కూడా మతం మారడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది నిజం కాదంటూ తమ ప్రేమ, పెళ్లికి మతం సమస్య కాదని ఈ క్రేజీ జంట నిరూపించుకున్నారు. ఆ విధంగా ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరి పెళ్లి ఈనెల 12న గోవాలో జరగనుంది. అక్కడ 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. -
మీ ఆశీర్వాదాలు కావాలి.. కీర్తి సురేశ్ పెళ్లి పత్రిక ఫోటో వైరల్
మహానటి కీర్తి సురేశ్ జీవితంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్‌తో గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం జరిపిన ఆమె అతడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కీర్తితో పాటు ఆమె తండ్రి సురేశ్‌కుమార్ కూడా ధృవీకరించాడు. ఈ వేడుకకు గోవా వేదికగా మారనుందని కూడా చెప్పారు.వెడ్డింగ్ కార్డ్తాజాగా కీర్తి- ఆంటోని లగ్న పత్రిక ఇదేనంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబర్ 12న మా కూతురి పెళ్లి చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.. ఇట్లు జి.సురేశ్‌కుమార్, మేనక సురేశ్ అని అందులో రాసుంది.సినిమా..ఇకపోతే కీర్తి ఇటీవలే తన ప్రేమను అధికారికంగా ప్రకటించింది. పదిహేనేళ్ల ప్రయాణం.. ఇంకా కొనసాగుతుంది అంటూ ఆంటోనితో కలిసున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా ఈ బ్యూటీ హీరోయిన్గా నటించిన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ డిసెంబర్ 25న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) ద -
తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న కీర్తిసురేష్
-
వచ్చే నెలలో నా పెళ్లి.. అందుకే తిరుమలకి వచ్చా: కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్.. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో కుటుంబంతో కలిసి కొండపై కనిపించింది. అలానే తన పెళ్లి గురించి తొలిసారి మాట్లాడింది. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరగనుందని, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల చిన్న కూతురు కీర్తి సురేశ్. బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 'మహానటి' సినిమాతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈమె నటించిన హిందీ మూవీ 'బేబీ జాన్'.. క్రిస్మస్కి రిలీజ్ కానుంది.గత కొన్నాళ్లుగా కీర్తి సురేశ్ పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. అవి నిజమని స్వయంగా ఈమెనే క్లారిటీ ఇచ్చింది. ఆంటోని తట్టిళ్‌తో తాను 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తిరుమలలో కనిపించి స్వయంగా మీడియాతో వచ్చే నెలల గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 11-12 తేదీల్లో ఓ రిసార్ట్‌లో వివాహ వేడుక జరగనుంది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)Actress @KeerthyOfficial visited Tirumala.My wedding is in Goa next month, so I came for the darshan.#KeerthySuresh pic.twitter.com/Wbq6XORhxq— Suresh PRO (@SureshPRO_) November 29, 2024#GetsCinema UPDATE ✅#KeerthySuresh Confirmed her MARRIAGE - Next Month in GOA 🤩🤩🤩💥💥💥pic.twitter.com/H9tzU28pfs— GetsCinema (@GetsCinema) November 29, 2024 -
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్
గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్లు నిజమయ్యాయి. హీరోయిన్ కీర్తి సురేశ్.. తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ఆంటోని తట్టిళ్‌తో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇద్దరూ కలిసున్న ఫొటోని అయితే పోస్ట్ చేసింది గానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురైన కీర్తి సురేశ్.. బాలనటిగా చేసింది. 'నేను శైలజ' మూవీ హీరోయిన్ అయింది. తెలుగు, తమిళ, మలయాళంలో నటించింది. హిందీలోనూ ఈమె తొలి మూవీ 'బేబీ జాన్' త్వరలో రిలీజ్ కానుంది. ఇంతలోనే పెళ్లి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని కీర్తి నిజమని ధ్రువీకరించింది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)కీర్తి సురేశ్ చెప్పిన దానిబట్టి చూస్తే 15 ఏళ్ల ప్రేమ అంటే ఇంటర్మీడియట్లో ఒకరికి ఒకరు పరిచయం. ఆ తర్వాత ఈమె హీరోయిన్ కాగా.. ఆంటోని ఇంజినీరింగ్ చేసి ఖతార్‌లో కొన్నాళ్లు పనిచేసాడు. తిరిగి స్వదేశానికి వచ్చి కొచ్చిలో విండో సొల్యూషన్స్ కోసం యాస్పెరాస్ కంపెనీ పెట్టాడు. తర్వాత హోటల్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు.15 ఏళ్ల ప్రేమని కొన్నాళ్ల క్రితం పెద్దలకు చెప్పారు. వాళ్ల కూడా అంగీకరించడంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 11న గోవాలోని ఓ రిసార్ట్‌లో ఈ వేడుక జరగనుంది. బహుశా హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి జరుగుతుందేమో!(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. ట్రెండింగ్ లో 'బేబీ జాన్' సాంగ్ (ఫొటోలు)
-
'బేబీ జాన్' కోసం కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. పూర్తి సాంగ్ విడుదల
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి తాజాగా గ్లామరస్ సాంగ్ విడుదలైంది. కోలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమా 'తెరి'కి రీమేక్‌గా బేబీ జాన్ రానుంది. కీర్తీ సురేశ్, వామికా గబ్బి హీరోయిన్లుగా ఇందులో నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది.బేబీ జాన్ నుంచి విడుదలైన తాజా సాంగ్‌లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తను లిప్‌లాక్ సీన్లో కూడా నటించినట్లు సమాచారం. దీనంతటికి కారణం ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమేనని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
పెళ్లికి వేళాయె
హీరోయిన్ కీర్తీ సురేష్ పెళ్లి పీటలు ఎక్కే సమయం ఆసన్నమైందట. తన స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్‌ను ఆమె పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై కీర్తీ సురేష్ తండ్రి, నిర్మాత జి. సురేష్ కుమార్ ఓ మలయాళ మీడియాతో మాట్లాడుతూ– ‘‘కీర్తీకి 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోని తటిల్తోనే వివాహం జరగబోతోంది.గోవాలో ఈ పెళ్లి జరుగుతుంది’’ అని పేర్కొన్నారాయన. కాగా ఆంటోని తటిల్–కీర్తీలది డెస్టినేషన్ వెడ్డింగ్ అట. గోవాలోని ఓ రిసార్ట్‌లో డిసెంబరు 11 లేదా 12న వీరి వివాహం జరగనుందని టాక్. వివాహ వేడుకలను గోవాతో పాటు కేరళలోనూ జరిపేలా ΄్లాన్ చేశారనే వార్త కూడా వినిపిస్తోంది. ఇక ఆంటోని తటిల్ విషయానికొస్తే... ఆయన కేరళకు చెందిన వ్యాపారవేత్త. -
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్‌పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్‌నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్‌తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్‌లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్‌హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్‌ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్‌లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్‌లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
Keerthy Suresh: కీర్తి సురేశ్ మ్యారేజ్ ఫిక్స్.. వరుడు ఎవరంటే
-
రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!
హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి గురించి ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. బిజినెస్‌మ్యాన్, ఫ్యామిలీ ఫ్రెండ్.. ఇలా గతంలో చాలాసార్లు పలువురి గురించి అన్నారు. కానీ ఆ వ్యక్తుల పేరు, డీటైల్స్ లాంటివేం రాలేదు. రీసెంట్గా గత రెండు మూడు రోజుల నుంచి కూడా కీర్తి సురేశ్ పెళ్లంటూ తెగ హడావుడి మొదలైంది. తొలుత ఇది కూడా ఎప్పటిలాంటి రూమర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం నిజంగానే పెళ్లి చేసుకోబోతుందని క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)ఒకప్పటి హీరోయిన్ మేనక, నిర్మాత సురేశ్ కుమార్ ముద్దుల కూతురు అయిన కీర్తి సురేశ్.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా ఈమె చేతిలో రెండు తమిళ, ఓ హిందీ మూవీ ఉన్నాయి.పెళ్లి విషయానికొస్తే కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. కొచ్చికి చెందిన ఇతడినే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11-12 తేదీల్లో గోవాలో కీర్తి-ఆంటోని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఇవన్నీ అనధికారికంగా వినిపిస్తున్న విషయాలు. త్వరలో ఈ విషయమై కీర్తి సురేశ్ అధికారిక ప్రకటన ఇవ్వనుంది.(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది) -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్.. గోవాలో పెళ్లి? (ఫోటోలు)
-
గోవా లో కీర్తి సురేష్ పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవరంటే..
-
సౌత్ టూ నార్త్.. సరికొత్తగా కీర్తి సురేష్ (ఫొటోలు)
-
ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఇది జరగ్గా.. హీరోయిన్ రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్, దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఇలా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)శ్రావ్య వర్మకి ఫ్యాషన్ డిజైనర్‌గా టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. కీర్తి సురేశ్‌తో 'గుడ్ లక్ సఖి' అనే సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించింది. ఈమె గత కొన్నేళ్లుగా ప్రముఖ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రేమలో ఉంది. కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు తమ ఇన్ స్టా స్టోరీల్లో శ్రావ్యవర్మ, కిదాంబి శ్రీకాంత్ పెళ్లి ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేశారు. దీంతో కొత్త జంటకు పలువురు నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతోపాటు హరితేజ కూడా!) -
'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఒరిజినల్లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
మెగాస్టార్ సరసన కథనాయకి.. ఈ స్టార్ హీరోయిన్ తల్లిని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
HBD ‘మహానటి’ : చీరకే వన్నె తెచ్చే దసరా బ్యూటీ (ఫోటోలు)
-
బ్లాక్ శారీలో త్రిప్తి డిమ్రీ.. దుర్గామాత పూజలో శ్రద్ధాదాస్
దుర్గామాత పూజలో హీరోయిన్ శ్రద్దాదాస్ బ్లాక్ శారీలో యానిమల్ బ్యూటీ హోయలు.. స్టన్నింగ్ అవుట్ ఫిట్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. శారీలో కీర్తి సురేశ్ అందాలు.. బతుకమ్మ సంబురాల్లో అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
ఒంగోలులో సందడి చేసిన సినీనటి కీర్తి సురేష్ (ఫొటోలు)
-
వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో కీర్తి సురేశ్ సందడి (ఫొటోలు)
-
దుబాయ్‌లో బుట్టబొమ్మ చిల్.. బంగారంలా మెరిసిపోతున్న తంగలాన్ బ్యూటీ!
డార్లింగ్ హీరోయిన్ నభా నటేశ్ స్మైలీ లుక్స్.. దుబాయ్‌లో చిల్ అవుతోన్న పూజా హెగ్డే.. దసరా టీమ్‌తో కీర్తీ సురేశ్ ఓనం సెలబ్రేషన్స్.. బంగారువర్ణంలా మెరిసిపోతున్న తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్.. మరింత గ్లామరస్ లుక్‌లో కల్కి బ్యూటీ దిశా పటానీ.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
ఓనం-దసరా కలిస్తే.. కీర్తి సురేశ్ క్రేజీ పోస్ట్ (ఫొటోలు)
-
అట్టహాసంగా ‘సైమా 2024 అవార్డుల’ వేడుక (ఫొటోలు)
-
డైరెక్ట్‌గా ఓటీటీకి కీర్తి సురేశ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రఘుతాత. ఈ మూవీకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో టాలీవుడ్లో విడుదల కాలేదు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రఘు తాత అందుబాటులోకి రానుంది. ఈ సినిమా హక్కులను జీ5 దక్కించుకోగా.. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ట్విటర్ వేదికగా పంచుకుంది.ఆగష్టు 15న తమిళంలో విడుదలైన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలతో ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో కీర్తి సురేశ్ హిందీకి వ్యతిరేకంగా పోరాడే మహిళ పాత్ర పోషించింది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు నిర్ణయం తీసుకుందో ఈ మూవీ చూస్తేనే తెలుస్తుంది. Kayal is coming to your home for blasting entertainment!😂🔥 #RaghuThatha will be streaming from September 13th only on ZEE5 in Tamil, Telugu, and Kannada. @KeerthyOfficial @hombalefilms @vkiragandur @sumank @vjsub @yaminiyag @RSeanRoldan @rhea_kongara @editorsuresh pic.twitter.com/XY1fO7HT55— ZEE5 Telugu (@ZEE5Telugu) September 9, 2024 -
కాబోయే అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్.. పెళ్లికూతురిలా ప్రేమలు హీరోయిన్!
కాబోయే అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్ పెళ్లికూతురిలా ముస్తాబైన ప్రేమలు హీరోయిన్ బ్లూ శారీలో కీర్తి సురేశ్ హోయలు.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
హన్మకొండలో సందడి చేసిన సినీనటి కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
ప్రభాస్ కల్కిలో ఆఫర్.. రిజెక్ట్ చేశా: కీర్తి సురేశ్
దసరా బ్యూటీ కీర్తి సురేశ్ ప్రస్తుతం రఘుతాత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ భామ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ నటిచిన కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసింగే. తాజా ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో నాగ్ అశ్విన్ తనకు ఓ రోల్ ఆఫర్ చేశారని తెలిపింది. కానీ దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించింది.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'కల్కి 2898 ఏడీ చిత్రంలో ఓ రోల్ కోసం డైరెక్టర్ నన్ను సంప్రదించారు. కానీ ఆ పాత్ర నేను చేయలేనని చెప్పా. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనుందని మెసేజ్ చేశా. ఆ తర్వాత ఆయన కాల్ చేసి బుజ్జి రోల్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగారు. నాకు మొదట అర్థం కాలేదు. షూట్లో నేను కూడా భాగం కావాల్సిన అవసరం లేదా? అని అడిగా. లేదు కేవలం వాయిస్ ఓవర్ ఇస్తే చాలు అన్నారు. దీంతో నేను వెంటనే ఓకే చెప్పా. వాయిస్ ఓవర్ విషయంలో నాగ్ అశ్విన్ నాకెంతో సాయం చేశారు' అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా కల్కి పార్ట్ -2 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అయితే తనకు కల్కిలో ఆఫర్ చేసిన పాత్ర ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. కీర్తి ప్రధానపాత్రలో సుమన్‌కుమార్ తెరకెక్కించిన రఘు తాత ఆగస్టు 15న విడుదల కానుంది. I was offered some other role in #Kalki2898AD which I said no & opted for #Bujji voice. My best dubbing till date, lot of fun and waiting for #Kalki2898AD Part 2👌#Bujji voice is getting such fame that Bhardwaj wanted to end episode with that voice👌🤩.@keerthyofficial #Prabhas pic.twitter.com/iIOUhIu8zB— Pakistan Prabhas Fanclub (@Pak_PrabhasFC) August 11, 2024 -
'ఐ యామ్ నాట్ సింగిల్'.. దసరా భామ ఆసక్తికర కామెంట్స్!
దసరా హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం రఘుతాత మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుమన్‌కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ తొలిసారి కోలీవుడ్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.ఇదిలా ఉండగా కీర్తి సురేశ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీరు సింగిల్‌గా ఉంటున్నారు కదా? అని ఆమెను ప్రశ్నించారు. దీంతో తన రిలేషన్షిప్ గురించి దసరా భామ నోరువిప్పారు. దీనికి బదులిస్తూ.. 'నేనేప్పుడు సింగిల్ అని చెప్పలేదుగా' అమటూ సమాధానమిచ్చింది.కాగా.. గతంలో ఆమె పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ చేసిన కామెంట్స్ నెట్టంటి తెగ వైరలవుతున్నాయి. అయితే తాను సింగిల్ కాదని చెప్పడంపై.. ఇప్పటికే రిలేషన్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పరోక్షంగా హింట్ ఇచ్చిందని చెబుతున్నారు. మరోవైపు కీర్తి సురేశ్ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. బేబీ జాన్ సినిమాతో వరుణ్ ధావన్ సరసన నటించనున్నారు. -
అజిత్‌తో కలిసి కచ్చితంగా నటిస్తా!
అవకాశాలు వచ్చినా, విజయాలు అంత సులభంగా రావు. అందుకు కృషి, శ్రమ అవసరం, అదృష్టం చాలా ముఖ్యం. అలా సినీ కుంటుంబం నుంచి వచ్చిన నటి కీర్తీసురేశ్. తల్లి నటి, తండ్రి నిర్మాత కావడంతో ఈమెకు అవకాశాలు సులభంగానే వచ్చి ఉండవచ్చు. అయితే స్టార్ నటిగా రాణించడానికి ఆమె ప్రతిభనే ముఖ్య కారణం. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న కీర్తీసురేశ్ తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తొలి రోజుల్లో వచ్చిన అవకాశాలను సది్వనియోగం చేసుకున్నా, ఇప్పుడు కథలు నచ్చితేనే నటించడానికి సమ్మతిస్తున్నారు. తెలుగు చిత్రం మహానటిలో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈమెకు ఆ తరువాత పలు ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా తాజాగా కీర్తీసురేశ్ నటించిన చిత్రం రఘుతాత. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్త హోంబలే నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే చాలా ఆసక్తి నెలకొంది. కారణం ఇదిబలవంతపు హిందీ భాషను వ్యతిరేకించే కథాంశంతో తెరకెక్కడమే. చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్న కీర్తీసురేశ్ ఒక భేటీలో నటుడు అజిత్‌తో కలిసి నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈమె తమిళంలో నటుడు విజయ్, విశాల్, ధనుష్ శివకార్తికేయన్, చివరికి రజనీకాంత్‌కు చెల్లెలిగా కూడా నటించారు. కానీ అజిత్‌తో కలిసి నటించలేదు. ఇదే విషయాన్ని ఆమె పేర్కొంటూ ఈ మధ్య హైదరాబాద్‌లో షూటింగ్లో పాల్గొన్నప్పుడు అజిత్ కూడా అక్కడ జరుగుతున్న చిత్ర షూటింగ్లో పాల్గొన్నారని, ఆ సమయంలో తాను ఆయన్ని కలిసి పరిచయం చేసుకున్నానని చెప్పారు. అప్పుడు తన తల్లి, శాలిని కలిసి చాలా చిత్రాల్లో నటించారని ఆయనతో చెప్పానన్నారు. తాను కూడా కచ్చితంగా అజిత్‌తో కలిసి నటిస్తాననే నమ్మకాన్ని నటి కీర్తీసురేశ్ వ్యక్తం చేశారు. -
కోమాలోకి వెళ్లినప్పుడు చివరిసారి చూశా.. చిన్న వయసులో..
హీరోయిన్ కీర్తి సురేశ్ స్నేహితురాలిని కోల్పోయిన దుఃఖంలో ఉంది. తన చిన్ననాటి స్నేహితురాలు మనీష మరణించి వారాలు గడుస్తున్నా ఆ విషాదం నుంచి బయటపడలేకపోతోంది. తాజాగా ఆమెను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. 'గడిచిన రోజులు ఎంతో కష్టతరమైనవి. నా చిన్ననాటి ఫ్రెండ్ మమ్మల్ని ఇంత త్వరగా వదిలేసి వెళ్లిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. 21 ఏళ్ల వయసులోనే తనకు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి సోకింది. మూడో సర్జరీ..దాదాపు ఎనిమిదేళ్లపాటు పోరాడింది. తనలా ధైర్యంగా పోరాడేవారిని నేను చూడనేలేదు. గతేడాది నవంబర్‌లో మూడోసారి సర్జరీ చేయించుకుంది. ఆ తర్వాత ఈ నొప్పి భరించలేకపోతున్నానంటూ నా ముందు ఏడ్చేసింది. అదే తనతో నాకున్న చివరి జ్ఞాపకం. తనముందు నా ఎమోషన్స్‌ను ఆపుకునే ప్రయత్నం చేశాను. కానీ నా వల్ల కాలేదు. బయటకు వచ్చి ఏడ్చేశాను. కోమాలోకి వెళ్లినప్పుడు చివరిసారిహాస్పిటల్ కారిడార్‌లో కళ్లజోడు, మాస్క్‌ల వెనక ఉన్న కన్నీళ్లను ఎవరికీ కనిపించకుండా తుడిచేసుకున్నాను. తను కోమాలోకి వెళ్లినప్పుడు చివరిసారి చూశాను. ఆమె ఇంకా సొంతంగా జీవితాన్ని ప్రారంభించలేదు, ప్రపంచాన్ని చూడనేలేదు, నెరవేర్చుకునే కలలు ఎన్నో ఇంకా అలాగే మిగిలున్నాయి.. ఇంత చిన్న వయసులోనే తనకు ఎందుకిలా జరిగింది? దీనికి నా దగ్గర సమాధానమే లేదు. వ్యాది తీవ్రం కావడంతో ఆమె చనిపోయింది. కానీ చివరి శ్వాస వరకు పోరాడింది.వదిలి వెళ్లిపోయావ్..సరిగ్గా నెల రోజుల క్రితం నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు. అప్పటినుంచి నీ గురించి ఆలోచించని రోజంటూ లేదు. ఈ రోజు నీ పుట్టినరోజు.. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను మచ్చుత' అని రాసుకొచ్చింది. తన స్నేహితురాలితో దిగిన ఫోటోలను ఈ పోస్టుకు జత చేసింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) చదవండి: ఆ సినిమాలు డేంజర్, అలాంటివాటి జోలికి వెళ్లడం అవసరమా?: ఆర్జీవీ -
ఆ హీరో అంటే చాలా ఇష్టం, తనతో నటించాలనుంది: కీర్తి సురేశ్ (ఫొటోలు)