
గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్లు నిజమయ్యాయి. హీరోయిన్ కీర్తి సురేశ్.. తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ఆంటోని తట్టిళ్‌తో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇద్దరూ కలిసున్న ఫొటోని అయితే పోస్ట్ చేసింది గానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.
మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురైన కీర్తి సురేశ్.. బాలనటిగా చేసింది. 'నేను శైలజ' మూవీ హీరోయిన్ అయింది. తెలుగు, తమిళ, మలయాళంలో నటించింది. హిందీలోనూ ఈమె తొలి మూవీ 'బేబీ జాన్' త్వరలో రిలీజ్ కానుంది. ఇంతలోనే పెళ్లి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని కీర్తి నిజమని ధ్రువీకరించింది.
(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)

కీర్తి సురేశ్ చెప్పిన దానిబట్టి చూస్తే 15 ఏళ్ల ప్రేమ అంటే ఇంటర్మీడియట్‌లో ఒకరికి ఒకరు పరిచయం. ఆ తర్వాత ఈమె హీరోయిన్ కాగా.. ఆంటోని ఇంజినీరింగ్ చేసి ఖతార్‌లో కొన్నాళ్లు పనిచేసాడు. తిరిగి స్వదేశానికి వచ్చి కొచ్చిలో విండో సొల్యూషన్స్ కోసం యాస్పెరాస్ కంపెనీ పెట్టాడు. తర్వాత హోటల్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు.
15 ఏళ్ల ప్రేమని కొన్నాళ్ల క్రితం పెద్దలకు చెప్పారు. వాళ్ల కూడా అంగీకరించడంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 11న గోవాలోని ఓ రిసార్ట్‌లో ఈ వేడుక జరగనుంది. బహుశా హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి జరుగుతుందేమో!
(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)
Comments
Please login to add a commentAdd a comment