47 ఏళ్ల వయసులో నటుడు సుబ్బరాజ్ పెళ్లి}! | Tollywood Actor Subbaraj Finally Gets Married, Know About His Wife Details And Wedding Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Actor Subbaraju Marriage: ఫైనల్లీ టాలీవుడ్ విలన్ పెళ్లి.. అమ్మాయి ఎవరో?

Published Wed, Nov 27 2024 7:09 AM | Last Updated on Wed, Nov 27 2024 12:06 PM

Tollywood Actor Subbaraj Marries And Wife Details ‍

టాలీవుడ్‌లో మరో సీనియర్ నటుడు పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో సినిమాల్లో విలన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు.. ఓ ఇంటివాడయ్యాడు. సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు ఏకంగా తన పెళ్లి ఫొటోని పోస్ట్ చేశాడు. బీచ్ దగ్గర పెళ్లి గెటప్‌లోని పిక్ షేర్ చేసి, ఫైనల్లీ పెళ్లయిపోయిందని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: హీరో అఖిల్‌తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?)

ఈ క్రమంలోనే సుబ్బరాజుకి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ అమ్మాయి ఎవరు? ఏంటనేది మాత్రం సుబ్బరాజు బయటపెట్టలేదు. చూస్తుంటే ఇది పెద్దల కుదిర్చిన పెళ్లిలా అనిపిస్తుంది. ఏదేమైనా 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

భీమవరంకి చెందిన సుబ్బరాజు స్వతహాగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓ రోజు కంప్యూటర్ రిపేర్ కోసం డైరెక్టర్ కృష్ణవంశీ ఇంటికి వెళ్లాడు. అలా నటుడు అయిపోయాడు. 2003లో ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బోలెడన్ని మూవీస్ చేశాడు. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు చేశాడు గానీ రీసెంట్ టైంలో మాత్రం ఫన్ రోల్స్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. 

(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement