Telugu actor
-
రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత.. సెలబ్రిటీల సంతాపం (ఫోటోలు)
-
నేచురల్ స్టార్ నాని బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వాళ్లు ఎన్నో మాటలన్నారు.. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించా: అబ్బాస్
ఒకప్పుడు హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో పుట్టిన అబ్బాస్ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా మారాడు. తొంభైవ దశకంలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ‘ప్రేమ దేశం’తో నటుడిగా పరిచయయ్యాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. కానీ 2015 తర్వాత, అతను అకస్మాత్తుగా నటనకు స్వస్తి చెప్పి, తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లాడు. ఆయన రీ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం ఇండియాలోనే ఉండనున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను షేర్ చేసుకున్నాడు ఎంతో మంది అవమానించారు 'నేను టాయిలెట్ క్లీనర్‌ను తాగమని ఆడగలేదు. బాత్రూంలో వాడండి అని చెప్పాను. టాయిలెట్ క్లీనర్ యాడ్‌లో నటించడం వల్ల నన్ను ఎంతోమంది ట్రోల్ చేశారు. నన్ను వెక్కిరిస్తూ చాలామంది కొన్ని వీడియోలు క్రియేట్ చేశారు. వాటి వల్ల నేను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. అలాగని వాళ్లు చేస్తున్న విమర్శలకు బాధపడలేదు. పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించడం కోసమే నేను ఆ ప్రకటనలో నటించా. మీ ఇంటిని క్లీన్‌గా ఉంచడం, ఉంచకపోవడం మీ ఇష్టం. (ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్) ఆ యాడ్ చేస్తున్న సమయంలో నాకు అంత బిజీ పనులు ఏమీ లేవు. అందులో పనిచేసినందుకు వాళ్లు నాకు మంచి పారితోషికం ఇచ్చారు కూడా. మా మధ్య దాదాపు ఎనిమిదేళ్లు కాంట్రాక్ట్ కుదిరింది. అలా, వచ్చిన డబ్బుతో ఆ సమయంలో కుటుంబాన్ని పోషించా. కాబట్టి అందులో తప్పేముంది. నేను వృత్తులన్నింటినీ ఒకేలా చూస్తా. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసమే కష్టపడుతుంటారు' అని ఆయన తెలిపారు. రీ ఎంట్రీ ప్లాన్ న్యూజిలాండ్‌లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్ మళ్లీ చెన్నై వచ్చాడు. ఇప్పుడు, నటన నుంచి తొమ్మిదేళ్ల విరామం తర్వాత, మళ్లీ నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో, అతను చివరిగా రామానుజన్ బయోపిక్‌లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. ఆయన ఇండియాలోనే స్థిరపడేందుకు ప్లాన్ చేసుకుంటన్నారని సమాచారం -
ఆమె వల్ల చనిపోదామనుకున్నా.. నటుడు అబ్బాస్ కామెంట్స్
Abbas Latest Interview: అబ్బాస్.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు. అదే 90ల్లో పుట్టి, ఇప్పుడు కుర్రాళ్లుగా ఉన్నవాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే 'ప్రేమదేశం' చూసి అబ్బాస్ లాంటి హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. అతడిలా ఉండటానికి ట్రై చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ ఇంటర్వ్యూలో దర్శనమిచ్చాడు. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. గర్ల్‌ఫ్రెండ్ వదిలేయడంతో 'టీనేజ్‌లో నా లైఫ్ అంతా గందరగోళంగా ఉండేది. ఎందుకంటే పదో క్లాస్ ఫెయిలయ్యాను. గర్ల్‌ఫ్రెండ్ నన్ను వదిలేసి పోయింది. జీవితం అయిపోయిందనుకున్నాను. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుందామని ఫిక్సయ్యాను. రోడ్డు మీద ఓ ట్రక్ ఎదురుగా నిలబడ్డాను. కానీ దాని వెనకాలే బైక్ పై వస్తున్న వ్యక్తిని చూసి.. పక్కకు తప్పుకొన్నాను. ఎందుకంటే నన్ను ట్రక్ గుద్దేస్తుంది. అతడు దాన్ని ఢీ కొట్టి గాయపడతాడు' (ఇదీ చదవండి: డేట్‌కి వెళ్లిన మెగా కపుల్.. ఆ ఫొటోలు వైరల్) బైకర్ వల్ల రియలైజేషన్ 'ఈ రియలైజేషన్ వల్ల నేను ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాను. నా జీవితం గురించి చెప్పాలంటే ఘోరమైన పరిస్థితుల్లోనే నా గురించి కాకుండా పక్కనోళ్ల గురించి ఆలోచించాను. అదే నేను చనిపోకుండా ఆపింది. మీరు ఎదగాలంటే పక్కనోడికి సహాయం చేయండి కానీ ప్రతిఫలం మాత్రం ఆశించకండి.' అని అబ్బాస్ చెప్పుకొచ్చాడు. రీఎంట్రీపై ఆసక్తి అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో న్యూజిలాండ్ లో కుటుంబం దగ్గరికి వెళ్లిపోయిన అబ్బాస్.. పెట్రోల్ బంక్ లో పనిచేయడం లాంటి జాబ్స్ చేశాడు. ప్రస్తుతం కార్పొరేట్ ఫీల్డ్‌లో సెటిలయ్యాడు. అయితే మూవీస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానిని ఇదే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మరి అబ్బాస్ కి ఎవరైనా దర్శకనిర్మాతలు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. (ఇదీ చదవండి: నటి ప్రగతి కొత్త జర్నీ.. ఇది అస్సలు ఎవరూ ఊహించలేదు!) -
నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు
తమిళ నటుడు పొన్నంబలం ఇండస్ట్రీలో స్టంట్ మ్యాన్‌గా, విలన్‌గా గుర్తింపు పొందాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో విలన్‌గా నటించిన ఆయన సౌత్ ఇండస్ట్రీల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు. 80,90లో ప్రతికథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన అనంతరం సినిమాలకు దూరమయ్యాడు. చదవండి: చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు ప్రస్తుతం ఆడపదడపా సినిమాలు చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన గతేడాది తీవ్ర అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరాడు. సర్జరీ అనంతరం కోలుకున్న పొన్నంబలం ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సొంతవాళ్లే తనని చంపాలని చూశారంటూ షాకింగ్ విషయం బయటపెట్టారు. ‘నేను అతిగా తాగడం వల్లే నా కిడ్నీలు పాడయ్యాయని అందరు అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నా తమ్ముడే నాకు స్లో పాయిజన్ ఇచ్చి నన్ను చంపాలని చూశాడు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: హైదరాబాద్ చేరుకున్న తారక్.. ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్ హంగామా చూశారా? ‘మా నాన్నకు నలుగురు భార్యలు. మూడో భార్య కొడుకు నా మేనేజర్‌గా పని చేసేవాడు. నా ఎదుగుదలను తట్టుకోలేక నా ఆహారంలో, డ్రింక్స్‌లో స్లో పాయిజన్ కలిపాడు. ఆ విషయాన్ని వైద్యులు గుర్తించారు. అది తెలియక నేను వాడిని చాలా నమ్మాను. నేను వాడి బాగు కోరుకుని ఉద్యోగం ఇస్తే. నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్ను చంపాలని చూశాడు. అంతేకాదు నా మీద చేతబడి కూడా చేయించాడు. ఆ విషయం నాకు ఇటీవలే తెలిసింది’ అంటూ అని చెప్పుకొచ్చాడు. -
చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు
80,90లలో విలన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి సౌత్‌లో మంచి గుర్తింపు పొందిన నటుడు పొన్నంబలం. తమిళ నటుడైన ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ప్రతికథానాయకుడిగా మెప్పించాడు. తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి సౌత్‌లో ఇండస్ట్రీలో విలన్‌గా రాణించాడు. చదవండి: నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు ప్రస్తుతం ఆడపదడపా చిత్రాలు చేస్తున్న ఆయన గతేడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో కనీసం వైద్యం కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీంతో పొన్నంబలం ఆర్థిక సాయం కోసం మెగాస్టార్ చిరంజీవికి మెసేజ్ చేయడంతో ఆయన స్పందించి చేయూత ఇచ్చారని తాజా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. కిడ్నీ సర్జరీ అనంతరం కోలుకున్న ఆయన ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తనకు చిరంజీవి అన్నయ్య వైద్యం చేయించారని తెలిపాడు. చదవండి: వైరస్ వచ్చి నేను తప్ప మగజాతి అంతా పోవాలి: వర్మ సంచలన వ్యాఖ్యలు ‘రెండు సంవత్సరాల క్రితం నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఎవరైనా సాయం చేస్తారాని అని వేచి చూస్తున్నాను. అప్పుడే నాకు చిరంజీవి గుర్తుకు రావడంతో.. నా ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకుని మెగాస్టార్ అన్నయ్యకు నా అనారోగ్యం గురించి మెసేజ్ చేశాను. వెంటనే ఆన్నయ్య ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మన్నారు. రాలేను అని చెప్పడంతో సరే అని చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వు అని చెప్పారు’ అని తెలిపాడు. మెగాస్టార్ చెప్పినట్లుగానే అక్కడి వెళ్లానని, ఎంట్రీ ఫీజు కూడా లేకుండా నా వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు ఆయనే భరించారు. నా వైద్యానికి మొత్తం రూ. 40 లక్షలు ఖర్చు అయ్యిందని, ఆ మెుత్తం డబ్బును చిరంజీవి ఇచ్చారు. అడగ్గానే లక్ష రూపాయలో లేదా 2 లక్షలో చిరంజీవి సాయం చేస్తారు అనుకున్నా. గానీ 40 లక్షలు ఇస్తారని అనుకోలేదు అంటూ పోన్నంబలం భావోద్వేగానికి గురైయ్యాడు. నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక @KChiruTweets గారినడిగితే 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే - నేనున్నా అని చెప్పి 5ని||లో దగ్గరలో ఉన్న అపోలో కి వెళ్ళమని అడ్మిట్ అవ్వమన్నారు - అక్కడ నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు మొత్తం 40లక్షలయ్యంది ఆయనే చూస్కున్నారు🙏 pic.twitter.com/HHdBcSiwPm — 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) March 15, 2023 -
రెండుసార్లు జైలుకెళ్లొచ్చాను: నటుడు
కొండా సినిమాతో గుర్తింపు సంపాదించాడు ప్రశాంత్ కార్తి. 2017 నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న ఆయనకు పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు కొండా చిత్రంతో వచ్చింది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'సివిల్ కాంట్రాక్టర్ నుంచి నటుడిగా మారాను. ఈ ఫీల్డ్‌లోకి రాకముందు రెండుసార్లు జైలుకెళ్లాను. వేరేవాళ్లకోసం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ క్లీన్‌చిట్‌తో బయటకు వచ్చాను. నాకు నక్సలైట్ ఆర్కే అంటే ఇష్టం. ఆయన ప్రజల కోసం పోరాడింది పుస్తకాల్లో చదివాను. నా అదృష్టం కొద్దీ ఆయన పాత్రలో నటించాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. మధ్యలో కొన్ని కారణాల వల్ల ట్రాక్ తప్పాను. చాలాకాలం తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. సినిమాల్లోకి రావడానికి చిరంజీవిగారే నాకు స్ఫూర్తి. ఈమధ్యే అనంత సినిమా తీశాను. నేనే హీరోగా చేసి నిర్మించాను. ఇండస్ట్రీలో చాలా రాజకీయాలుంటాయి. వాటిని తట్టుకుని ముందుకు వెళ్లడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్. చదవండి: పెళ్లి కోసమే సినిమాలకు దూరంగా రాశీ ఖన్నా -
అమ్మకు క్యాన్సర్.. అనాధాశ్రమంలో వదిలేశా!: నటుడు
పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సుబ్బరాయ శర్మ. మొదట నాటకరంగంలో పని చేసిన ఆయన మయూరి చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఒంటెద్దు బండి, శ్రీవారికి ప్రేమలేఖ, యమలీల, శుభలగ్నం, మాయలోడు, గంగోత్రి, మనసంతా నువ్వే, బాహుబలి: ది బిగినింగ్, రుద్రమదేవి వంటి చిత్రాలతో ఆయన మరింత పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. '1977 నుంచి టీవీలో పని చేస్తున్నాను. 1985లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ మూవీ మయూరి. దీనికి వెయ్యి లేదా పదిహేను వందల రూపాయలు పారితోషికం ఇచ్చి ఉంటారు. ఒకానొక సమయంలో అమ్మకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అప్పటివరకు నా దగ్గర ఎలా ఉంటుందని అనాధాశ్రమంలో జాయిన్ చేశా. ఎందుకంటే అప్పుడు నా భార్య అమెరికాలో ఉంది. నేను తనను చూసుకోలేనని అనాధాశ్రమంలో పెట్టాను. ఆ తర్వాత అక్కడి నుంచి అమ్మను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయ్యాక మళ్లీ అక్కడ దింపి షూటింగ్‌కు వెళ్లేవాడిని. ఆ డబ్బుతో ఆస్పత్రి బిల్లు కట్టాను. నా పరిస్థితి తెలుసుకుని గుణశేఖర్ నాకు పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు. అలా రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టినవాళ్లే కాకుండా ముందుగా డబ్బులిచ్చి సాయం చేసినవాళ్లు కూడా ఉన్నారు' అని తెలిపాడు సుబ్బరాయ శర్మ. చదవండి: భర్త చనిపోయాక మొదటిసారి అలా కనిపించిన మీనా, వీడియో -
టాలీవుడ్లో మరో విషాదం, ప్రముఖ నటుడు వల్లభనేని జనార్ధన్ మృతి
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరి నటులు కైకాల సత్యనారాయణ, నటుడు చలపతి రావు మృతి మరువకముందే మరో నటుడు కన్నుమూశారు. ప్రముఖ నటుడు, దర్శక-నిర్మాత వల్లభనేని జనార్ధన్(63) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్లో మరోసారి విషాదం నెలకొంది. ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవితో అనేక చిత్రాల్లో నటించిన జనార్ధన్, బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’, నాగార్జునతో ‘వారసుడు’, వెంకటేశ్ తో ‘సూర్య ఐపీఎస్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. సినిమాల్లోనే కాకుండా ‘అన్వేషిత’ వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించారు జనార్ధన్. ప్రముఖ దర్శక నిర్మాత విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని జనార్ధన్ వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత చిన్నతనంలోనే చనిపోయింది. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్‌గా కొనసాగుతున్నారు. అబ్బాయి అవినాశ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇక మామ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ చిత్రంతోనే వల్లభనేని జనార్ధన్ సినీరంగ ప్రవేశం చేశారు. చదవండి: విషాదంలో రకుల్.. మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ మరో కొత్త వివాదంలో రష్మిక, ఈసారి దక్షిణాదిపై సంచలన వ్యాఖ్యలు -
సాహసమే అతడి ఊపిరి
1962లో తొలి బాండ్ సినిమా ‘మిస్టర్ నో’ రిలీజ్ అయ్యింది. షేన్ కానరీ హీరో. తర్వాత నాలుగేళ్లకు అలాంటి సినిమా తీయాలని నిర్మాత డూండీకి అనిపించింది. హీరో ఎవరు? ఎన్.టి.ఆర్... ఊహూ. ఏ.ఎన్.ఆర్.. కాదు. ‘తేనె మనసులు’ సినిమా చూశాడాయన. క్లయిమాక్స్‌లో కారు చేజ్. స్కూటర్ వేగంగా నడుపుతున్న కొత్త హీరో నదురు బెదురు లేకుండా డూప్ జోలికి పోకుండా చేజ్ చేసి ఒక్క గెంతులో కారులో దూకాడు. డేరింగ్ డేషింగ్ స్టంట్. ఇతడే నా బాండ్ అనుకున్నాడు డూండీ. ‘గూఢచారి 116’ రిలీజైంది. స్కూటర్ మీద నుంచి కారు మీదకు గెంతిన ఒక్క గెంతు ఆ నటుణ్ణి సూపర్‌స్టార్‌ని చేసింది. షేన్ కానరీ గొప్పవాడు. 32 ఏళ్లకు బాండ్ అయ్యాడు. కృష్ణ మరీ గొప్పవాడు. 23 ఏళ్లకే బాండ్ అయ్యాడు. తెనాలిలో కుర్రకారు చూడాల్సిన సినిమాలంటే ఇంకేం ఉంటాయి. అయితే ఎన్.టి.ఆర్. లేకుంటే ఏ.ఎన్.ఆర్. కృష్ణ ఎన్.టి.ఆర్ ఫ్యాన్. ఏలూరులో ఫిజిక్స్ మెయిన్‌గా బిఎస్సీ చదువుతూ ఎన్.టి.ఆర్ సినిమాలు చూసి మైమరిచాడు. 60 సినిమాలు పూర్తి చేసుకున్న ఏ.ఎన్.ఆర్‌ను సి.ఆర్.రెడ్డి కాలేజీకి సన్మానానికి పిలిస్తే ఆయనకు దక్కిన రాజభోగం గమనించాడు. ‘సినిమాకు ఇంత యోగమా’ అనుకున్నాడు. చెప్పాలంటే తెనాలి గాలిలోనే ఏదో కళ ఉంది. కృష్ణ ఊరు– బుర్రిపాలెంకు అది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుక గాలి గట్టిగా తగిలింది. సినిమా గాలి. ‘ఆడబతుకు’, ‘మంగమ్మ శపథం’, ‘దేవత’ 1965లో రిలీజైన ఎన్.టి.ఆర్ సినిమాలు. ‘ఆత్మగౌరవం’, ‘ప్రేమించి చూడు’, ‘సుమంగళి’ ఏ.ఎన్.ఆర్ చిత్రాలు. ఇద్దరూ 42 ఏళ్ల వయసులో ఉన్నారు. పోటాపోటీగా కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని అప్పటికే తరం మారి, తలకట్టు మారి, తెలుగు తెర కొత్త ముఖం కోసం ఎదురు చూస్తూ ఉంది. అభిమానులు సంఘాలు పెట్టుకోవడానికి కొత్త హీరో అన్వేషణలో ఉన్నారు. తెలుగు నేలపై గాలి మారిందని చెప్పడానికి ఒకడు రావాలి. అదే సంవత్సరం 22 ఏళ్ల కృష్ణ తొలి సినిమా ‘తేనె మనసులు’ రిలీజ్ అయ్యింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్లతో ‘తేనె మనసులు’ తీసి హిట్ కొట్టాడు. ఆశ్చర్యం. దేవ్ ఆనంద్ పోలికలున్న రామ్మోహన్‌కు పేరొచ్చింది. అచ్చెరువు. ఏ పోలికలు లేని ఒరిజనల్ రూపు, ఊపు ఉన్న నటుడికే ఆ తర్వాత పట్టం దక్కింది. పట్టం దక్కినవాడు కృష్ణ. ఎన్.టి.ఆర్కు ఒక సంస్థానం ఉంది. తమ్ముడు త్రివిక్రమరావు పక్కన ఉన్నాడు. పుండరీ కాక్షయ్య ఉన్నాడు. నిర్మాతల సమృద్ధి ఉంది. అక్కినేనికి దుక్కిపాటి, విక్టరీ మధుసూదనరావు, వి.బి.రాజేంద్రప్రసాద్, ఆదుర్తి ఉన్నారు. కృష్ణకు? ఉన్నవల్లా ధైర్యం, సాహసం, పట్టుదల, పంతం. రోజూ లేవగానే మేకప్ వేసుకుని సెట్లో ఉండాలి. చెవులకు యాక్షన్, కట్ వినిపించాలి. ఊళ్లో ఏదో ఒక హాల్లో తన సినిమా ఆడుతూ ఉండాలి. అందుకు ఏం చేయాలి? నిర్మాత నుంచి సినిమా పుడుతుంది. నిర్మాతకు ఇబ్బంది రాకపోతే తనకు ఏ ఇబ్బందీ రాదు. ఆ సూత్రం తెలిశాక కృష్ణ నిర్మాతల హీరో అయ్యాడు. రేపు షూటింగ్. డబ్బు లేదు. తానే ఏర్పాటు చేసేవాడు. రిలీజయ్యాక సినిమా పోయింది. రెమ్యూనరేషన్ వదులుకున్నాడు. ఎవరో నిర్మాత గొల్లుమంటున్నాడు. పిలిచి డేట్స్ ఇచ్చాడు. కృష్ణకు కూడా ఇప్పుడు మెల్లగా ఒక సంస్థానం ఏర్పడింది. ఇద్దరు తమ్ముళ్లు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు తోడు నిలిచారు. డూండీ, వి.రామచంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్, ఆరుద్ర, త్రిపురనేని మహారథి తన పక్షం అయ్యారు. నెక్స్›్ట ఏంటి? కృష్ణ ఒకటి గమనించాడు... ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు నిర్మాతలు వస్తే హీరోలుగా నటిస్తారు. రాకపోతే తామే నిర్మాతలై హీరోలుగా నటిస్తారు. అంటే వారు హీరోలుగా నటిస్తూనే ఉంటారు. తాను కూడా నిర్మాతగా మారితే? తన హీరోయిజంను తానే నిరూపించుకుంటే? అదిగో డెక్కల చప్పుడు చేస్తూ నురగలు కక్కుతూ దౌడు తీస్తున్న గుర్రం. పైన ఎర్ర టోపి, చేత రివాల్వర్‌తో కృష్ణ. సినిమా పేరు ఏమిటా అని పల్లెటూళ్లో పాదచారి ఆగి పోస్టర్ చూశాడు. మోసగాళ్లకు మోసగాడు! ‘అమరవీడు’ సంస్థానం ఫ్రెంచ్ సేనల వశం అయ్యాక ఇద్దరు విశ్వాసపాత్రులు ఆ సంస్థానం నిధిని అడవిలో దాచారు. దాని కోసం మోసగాళ్లు వేటాడుతున్నారు. వారిని తలదన్నే మోసం చేసి నిధిని ప్రజలకు చేర్చాలి. అదీ ‘మోసగాళ్లకు మోసగాడు’ కథ. మన దేశంలో ఆలమందల్ని పిల్లనగ్రోవితో కట్టడి చేస్తారు. అమెరికాలో గుర్రాలతో కాపు కాస్తారు. ఆ కౌబాయ్‌లు మనకు లేరు. ఆ వాతావరణం మనది కాదు. సినిమా జాతకం చిటికెలో తేల్చే చక్రపాణి ‘ఈ సినిమా ఎవరికి అర్థమవుతుందయ్యా’ అని చికాకు పడ్డాడు సెట్‌కొచ్చి. కాని తీసెడివాడు కృష్ణ. మన దేశంలో తొలి కౌబాయ్ సినిమా. అదీ కలర్లో. మద్రాసులో రైలుకు మూడు ప్రత్యేక డబ్బాలు తగిలించి యూనిట్ రాజస్థాన్‌కు చేర్చి షూటింగ్ జరిపితే గుర్రాలు సకలించాయి. తుపాకులు గర్జించాయి. రక్తం చిమ్మింది. శత్రువులు మట్టి కరిచారు. నిధి ప్రజలకు చేరింది. ‘మోసగాళ్లకు మోసగాడు’ 1971లో విడుదలైతే ప్రేక్షకులు గుప్పిళ్ల కొద్దీ చిల్లర, మడతలు పడ్డ రూపాయి నోట్లు కౌంటర్లో ఇచ్చి టికెట్లను పెరుక్కొని హాల్లో సీట్లు వెతుక్కోడానికి పరిగెత్తారు. చక్రపాణి జోస్యం తొలిసారి పొల్లుపోయింది. కృష్ణ ఇప్పుడెవరనుకున్నారు? ఆంధ్రా జేమ్స్‌బాండ్ కృష్ణ. ఆంధ్రా కౌబాయ్ కృష్ణ. డేరింగ్ డాషింగ్ కృష్ణ. ఘంటసాలకు నాటుమందు పడలేదు. ప్రాణం మీదకొచ్చింది. పరిస్థితి అర్థమైన అక్కినేని రామకృష్ణను కనుగొన్నాడు. ఘంటసాల స్థానంలో రామకృష్ణను అక్కినేని ఎంకరేజ్ చేస్తే శోభన్‌బాబు, కృష్ణంరాజు కూడా అతణ్ణే ఎంచుకున్నారు. ఎన్.టి.ఆర్కు ఈ టెన్షనే లేదు. రఫీనే రంగంలో దించగలడు. కాని కృష్ణకు ఒక గొంతు కావాలి. పాటల్లో తనకో సపోర్ట్ కావాలి. ఇండస్ట్రీకి ఎవరో కొత్త గాయకుడు వచ్చి స్ట్రగుల్ అవుతున్నాడని విని పిలిపించారు. ‘మీరు వర్రీ కాకండి. ఎంత లేదన్నా నాకు సంవత్సరానికి నాలుగు సినిమాలుంటాయి. అన్నిటికీ మీరే పాడండి. నా సింగర్‌గా ఉండండి’ అని హామీ ఇచ్చాడు. ఆ కొత్త గాయకుడు ఉత్సాహంగా కృష్ణకు పాడాడు. ‘విశాల గగనంలో చందమామా... ప్రశాంత సమయములో కలువలేమా’.... విన్న ప్రేక్షకులు, రేడియో శ్రోతలు తలలు ఊపారు. తనివి తీరడం లేదని కార్డు ముక్కలు రాసి పోస్ట్‌డబ్బాలో పడేశారు. ఆ కొత్త గాయకుడు ఇంకా ఉల్లాసంగా పాడాడు. ‘తనివి తీరలేదే... నా మనసు నిండలేదే’... అలా కృష్ణ, తర్వాతి కాలంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగా తెలిసిన ఆ కొత్త గాయకుడు స్థిరపడి అనేక జూబ్లీల కాలం ప్లాటినమ్ డిస్క్‌లతో గమకాలాడారు. ఎన్.టి.ఆర్కు ‘పాతాళభైరవి’ ఉంది. అక్కినేనికి ‘దేవదాసు’ ఉంది. స్టార్లుగా కొనసాగాలంటే ప్రయత్నం, కృషి సరిపోతుంది. కాని సుదీర్ఘకాలం నిలబడాలంటే నటుడుగా ప్రూవ్ చేసుకోవాలి. మాగ్నమ్ ఓపస్ ఉండాలి. తనకు అదేమిటి అనే ఆలోచన వచ్చింది కృష్ణకు. ‘అసాధ్యుడు’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా పాటలో కనిపించినప్పటి నుంచి ఆ పాత్ర మీద మనసు ఉంది. ఆ సినిమా తీయాలన్న సంకల్పం ఉంది. కాని అందుకు గేట్ అడ్డం ఉంది. ఆ గేట్ పేరు ఎన్.టి.ఆర్. ఎప్పటి నుంచో ఆయన అల్లూరి సీతారామరాజు తీస్తానంటున్నాడు. తీయడం లేదు. కృష్ణ ఆగదల్చుకోలేదు. కృష్ణ నటించు ‘అల్లూరి సీతారామరాజు’. ఈ వార్త ఇండస్ట్రీ అంతా గుప్పుమంది. ఆ తర్వాత వార్తలే వార్తలు. 30 రోజుల పాటు విశాఖ ఏజెన్సీలో షూటింగ్ అట. యూనిట్ కోసం చింతపల్లిలో 5 ఎకరాల జొన్నచేను కొని సాపు చేసి కాలనీ కట్టారట. ఫీల్డులోని కేరెక్టర్ ఆర్టిస్టులంతా ఇందులో నటిస్తున్నారట. మన్యం వీరుడి కోసం కృష్ణ ఎంతకైనా ఖర్చు చేయడానికి సిద్ధ పడ్డాడట. అన్నింటికి మించి సినిమా స్కోప్‌లో తీస్తున్నారట. 1973 డిసెంబర్లో షూటింగ్ మొదలైతే కారెక్టర్ ఆర్టిస్టులంతా చింతపల్లిలో ఉండటం చేత మద్రాసులో రెండువారాలు షూటింగులు ఆగిపోయాయి. అదీ ఆ సినిమా తడాఖా. మెల్లమెల్లగా పోస్టర్లు, అల్లూరి గెటప్ బయటకు వచ్చాయి. ఖాకీ చెడ్డీ, మోచేతుల వరకూ తెల్ల చొక్కా, పైన ముతక తువ్వాలు, చేతి బెత్తంతో జనులకు కనిపించిన అల్లూరి సీతారామరాజు తెలుగు వారికి మాత్రం సినిమా వారు తమ ఊహలకు తగ్గట్టుగా తీర్చిదిద్దిన ఆహార్యం వల్ల ఇప్పుడున్న రూపానికి మారిపోయాడు. ఎన్.టి.ఆర్ ప్రోద్బలంతో అల్లూరికి ఆ సినీ రూపం ఇచ్చిన ఆర్టిస్ట్ మాధవపెద్ది గోఖలే. అన్నట్టు అతనిదీ కృష్ణ ఊరే. తెనాలి. ‘ఈ సర్వసంగ పరిత్యాగికి రాజు కావాలనే కోరికా? రూథర్‌ఫర్డ్... నేనే కాదు. మా భారతీయులు ఎవ్వరూ ఏనాడూ ఇతరులను జయించాలని రాజ్యాలను స్థాపించాలని కోరలేదు. ఎప్పుడూ ఇతరులే ఈ రత్నగర్భపై ఆశపడ్డారు. దుర్జన దండయాత్రలతో రణరక్తసిక్తమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు. రాళ్లల్లో కలిసిపోయారు. యవనులు, హూణులు, మ్లేచ్చుల చరిత్ర ఎలా అంతమైందో మీ చరిత్ర అలానే అంతమవుతుంది’... అల్లూరి సీతారామరాజు డైలాగులతో హాల్లో జనం ఉద్వేగపడుతున్నారు. కన్నీరు కారుస్తున్నారు. ఆవేశ పడుతున్నారు. పౌరుషంతో ఉప్పొంగుతున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి మావాడు. ఆ పాత్రకు జీవం పోసిన కృష్ణ మావాడు. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. కృష్ణ పేరు ముందు ఇప్పుడు ‘నట’ చేరింది. ‘నటశేఖర’ కృష్ణ. అక్కినేని, ఎన్.టి.ఆర్ నిర్మాతలుగా ఉంటూ కృష్ణతో సినిమాలు తీయలేదు. కృష్ణ తాను నిర్మాతగా అక్కినేని, ఎన్.టి.ఆర్‌లతో సినిమాలు తీశాడు. ఎన్.టి.ఆర్తో తీసిన ‘దేవుడు చేసిన మనుషులు’ పెద్ద హిట్. అక్కినేనితో ‘హేమాహేమీలు’ తీశాడు. అక్కినేని, ఎన్.టి.ఆర్‌లను ఫలానా సినిమా తీయవద్దని కృష్ణ ఎప్పుడూ అనలేదు. కాని కృష్ణ తీస్తున్న సినిమాల విషయంలో వారు ఇరువురూ అభ్యంతరం చెప్పారు. ఎన్.టి.ఆర్ కృష్ణను పిలిచి ‘అల్లూరి సీతారామరాజు’, ‘కురుక్షేత్రం’ సినిమాలు విరమించమని కోరాడు. కృష్ణ ‘దేవదాసు’ తీస్తే అక్కినేని పోటీగా తన ‘దేవదాసు’ను రీరిలీజ్ చేశాడు. కృష్ణతో నటించే సినిమాలలో తనకు ప్రాధాన్యం ఉండటం లేదని పేపర్ ప్రకటన ఇచ్చి మరీ శోభన్‌బాబు తప్పుకున్నాడు. కృష్ణ ఆగలేదు. ఆగడం కృష్ణకు తెలియదు. నూరవ చిత్రం... రెండు వందలవ చిత్రం... ఇప్పుడతడు సూపర్‌స్టార్ కృష్ణ. ‘బృహన్నల’ వేషం వేయడానికి బాడీ లాంగ్వేజ్ కోసం నృత్య శిక్షణ తీసుకున్నాడు ఎన్.టి.ఆర్. ‘దేవదాసు’ రూపం కోసం అన్నపానీయాలు మానేశాడు అక్కినేని. కృష్ణ అలాంటి నటుడు కాదు. అతడు ఎంతో అందమైన అమాయకమైన నటుడు. అప్పటికప్పుడు చేయదగింది చేసి ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తే చాలు అనుకుంటాడు. అందుకే మార్నింగ్ కాల్షీట్లో గూఢచారిగా మారి భూమి మీద స్కైలాబ్ పడకుండా కాపాడతాడు. మధ్యాహ్నం కాల్షీట్లో ఓడ కెప్టెన్‌గా సముద్రం అడుగున ఉన్న నిధిని బయటకు తీస్తాడు. ‘పాడిపంటల’ రైతు అతడే. ‘నేనొక ప్రేమపిపాసిని’ అని పాడే భగ్న ప్రేమికుడు అతడే. పాత్రను అమాయకపు నిజాయితీతో చేరవేస్తాడు కనుకనే ప్రేక్షకులు విపరీతంగా అభిమానించారు. ‘ఏకలవ్య’ సినిమాలో ‘మోగింది ఢమరుకం మేల్కొంది హిమనగం’ పాటలో శాస్త్రీయ నృత్యం చేస్తాడు కృష్ణ. అది చూసి ప్రేక్షకులు వచ్చీరాని నృత్యం చేసే సొంత పిల్లల్ని కావలించుకున్నట్టు కృష్ణను కావలించుకుంటారు. అదే కృష్ణ విజయం. నటులుగా ఉంటూ దర్శకులుగా పెద్ద హిట్స్ ఇచ్చిన రాజ్ కపూర్, ఎన్.టి.ఆర్ల వరుసలో కృష్ణ నిలుస్తాడు. ‘సింహాసనం’ అందుకు ఉదాహరణ. నటుడుగా ఉంటూనే నిర్మాతగా రెండు భాషల్లో (తెలుగు, హిందీ) కృష్ణ తీసినన్ని సినిమాలు తీసినవారు లేరు. ఎంత వయసు వచ్చినా ఇమేజ్ చెక్కు చెదరకుండా కాపాడుకోవడం కృష్ణకు సాధ్యమైంది. కారెక్టర్ ఆర్టిస్టుగా కృష్ణ కొన్ని సినిమాలు చేశాడు. కాని జనం మాత్రం ‘హీరో కృష్ణ’ అని మాత్రమే పిలిచారు. అనవసర వివాదాలు, వాచాలత్వాలు లేకుండా కృష్ణ జీవితం ఎంతో హుందాగా గడిచింది. ‘యాక్షన్’ అనగానే బెబ్బులిలా మారే ఈ నటుడు తెర వెనుక మితభాషిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. భార్య విజయ నిర్మలను ఇంటికి పరిమితం చేయాలనుకోక దర్శకురాలిగా ప్రోత్సహించి ప్రపంచంలో అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా నిలిపాడు. ఎక్కడ సంపాదించాడో అక్కడే ఖర్చు పెట్టాడు. కన్నపిల్లల్ని తిరిగి సినిమా రంగానికే అప్పజెప్పాడు. గాలివాటానికి దొర్లిపోయే మనుషులు చరిత్రలో నిలవ్వొచ్చు. కాని ఎదురుగాలిని సవాలు చేస్తూ చరిత్రను సృష్టిస్తారు కొందరు. కృష్ణది అలాంటి కోవ. చేవ. అందుకే తెలుగువారికి ఎప్పటికీ అతడు డేరింగ్ డాషింగ్ కృష్ణ. – కె. -
టాలీవుడ్లో విషాదం, నటుడు కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డీఎంకే మురళి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మురళి మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా డీఎంకే మురళి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించగా.. దుర్యోధనుడి మయసభ ఏకపాత్రాభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జర్నలిస్ట్‌గా పని చేసిన ఆయన అందాల రాక్షసితో సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. బస్‌స్టాండ్, తడాఖా, కొత్తజంట, కాయ్ రాజా కాయ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: కృష్ణ హెల్త్ కండీషన్లో ఎలాంటి మార్పు లేదు -
టాలీవుడ్ సీనియర్ హీరో కన్నుమూత
అలనాటి హీరో, ప్రముఖ సీనియర్ నటుడు విద్యాసాగర్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా 'ఈ చదువులు మాకొద్దు' సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. పలు సినిమాల్లో యాక్ట్ చేసి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జంధ్యాల తీసిన అనేక సినిమాల్లో విద్యాసాగర్ నటించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకు పక్షవాతం రావడంతో వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు. చదవండి: అభిమాని కాళ్లు మొక్కిన హృతిక్ రోషన్, వీడియో వైరల్ -
ఈ యూట్యూబర్‌కు డైరెక్టర్స్ పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తున్నారుగా!
సతీష్ సరిపల్లి అనే పేరుకి యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళలో ఉన్న క్రేజ్ వేరు. ఏకంగా 1000కి పైగా వీడియోలలో అనేక రకాల పాత్రల్లో కనిపించారు. 'చీపా' గా బాగా ఫేమస్. ముందు కామెడీ పాత్రలతోనే మొదలుపెట్టినా ఆ తరువాత మాత్రం అన్ని రకాల పాత్రలు చేశారు. 'నాన్న ఎందుకో వెనకబడ్డాడు' అనేది సతీష్ సరిపల్లికి మంచి గుర్తింపు తెచ్చింది. అతనిలో ఉన్న నటుడిని అందరికి పరిచయం చేసింది. అలా యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయిన సతీష్ ఆ తరువాత వెండితెర వైపు అడుగులు వేశాడు. గతంలో అతను చేసిన యూట్యూబ్ వీడియోస్ రిఫరెన్స్ గా తీసుకుని చాలామంది డైరెక్టర్స్ పిలిచి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 సినిమాల్లో నటించిన సతీష్ రీసెంట్గా ఎఫ్3లో కనిపించారు. త్వరలో చిరంజీవి గాడ్ ఫాదర్, అఖిల్ అక్కినేని ఏజెంట్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు కొంచెం చెప్పాలి లాంటి పెద్ద సినిమాలతో పలకరించబోతున్నాడు. నటుడు అవ్వాలని అతను తీసుకున్న రిస్క్ ఫలించిందని, యాక్టర్‌గా టాలీవుడ్ తనని గుర్తించిందని చెబుతున్న సతీష్ సరిపల్లి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ కింది వీడియో చూసేయండి.. చదవండి: అంతా అయిపోయింది.. మనీ కోసం, ఛాన్స్ కోసం అడుక్కుంటున్నా 91 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు మీడియా మొఘల్ విడాకులు -
నాలాంటి దరిద్రపు వాళ్ల వల్లే ఇండస్ట్రీ నాశనమైపోతుందన్నారు
టాలీవుడ్లో ప్రతినాయకుడిగా మెప్పించినవారిలో నటుడు సత్య ప్రకాశ్ ఒకరు. ఈయన తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విజయనగరంలో పుట్టిన తాను ఒడిశాలో పెరిగానని, ఆ తరువాత బ్యాంకులో ఉద్యోగం చేశానని చెప్పుకొచ్చాడు. తానేదో పిచ్చిపనులు చేస్తుంటే ఓ డైరెక్టర్ రా బాబు అంటూ పిలిచి మరీ సినిమాలో వేషం ఇచ్చారని, కానీ ఆయన తనను ఆర్టిస్టును చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నారని నవ్వుతూ పేర్కొన్నాడు. తనను ఆర్టిస్టును చేసి జీవితంలో పెద్ద తప్పు చేశానని ఫీల్ అవుతున్నారని సరదాగా చెప్పుకొచ్చాడు. ఇప్పటిదాకా దాదాపు 600 సినిమాల్లో నటించానని చెప్పుకుంటూ ఉంటానన్నాడు. తనను సెట్స్‌లో అవమానించిన సంఘటనను తలుచుకుంటూ.. 'ఒక సినిమా షూటింగ్లో సుమన్‌తో ఫైట్ సీన్లో నటించాలి. ఆయన కొట్టినప్పుడు రియాక్షన్ ఇవ్వాలి. కానీ నేనివ్వలేదు. అప్పుడు అక్కడున్న కో డైరెక్టర్ నన్ను ఉద్దేశించి.. ఇలాంటి దరిద్రపువాళ్లంతా ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. అందుకే ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది' అన్నారు అని వాపోయాడు సత్య. -
దేనికీ పనికిరానన్నారు, ఆ ప్రమాదంలో తీవ్రగాయాలు: నటుడు
'సీతారాముల కల్యాణం' సినిమాతో నటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు వెంకట్. ఈ సినిమా మంచి హిట్ సాధించినప్పటికీ అతడికి గుర్తింపు వచ్చింది మాత్రం 'అన్నయ్య' మూవీతో! ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా నటించాడు వెంకట్. ఇందులో మెగాస్టార్ అతడిని జెమ్స్ అని పిలుస్తుంటాడు. దీంతో చాలామంది ఇప్పటికీ వెంకట్‌ను జెమ్స్ అనే పిలుచుకుంటారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నాడీ యాక్టర్. తాజాగా అతడు ఓ టీవీ షోకు హాజరై వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించాడు. చదువు మీద ధ్యాస లేదన్న వెంకట్ మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపాడు. ఒక డ్యాన్స్ మాస్టర్ అందరిముందు తనను అవమానించాడని, తాను దేనికీ పనికిరానని, ఎక్కడినుంచి పట్టుకొచ్చారని విసుగు ప్రదర్శించాడని వెల్లడించాడు. ఒకసారైతే ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చెంప చెల్లుమనిపించాడని చెప్పుకొచ్చాడు. ఆ ఐదుగురు సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం జరిగిందని తెలిపాడు వెంకట్. రాడ్ల మీద ఎక్కి పైకి దూకాల్సిన సీన్ ముందుకు దూకబోయి వెనక్కు పడ్డట్లు తెలిపాడు. ఆ ప్రమాదంలో పెద్ద గాయాలే అయ్యాయన్న ఆయన మూడు నెలలపాటు ఆస్పత్రి బెడ్‌కే పరిమితమైనట్లు పేర్కొన్నాడు. ఈ యాక్సిడెంట్ వల్ల చాలా సినిమాలు మిస్ అయ్యాయని చెప్తూ బాధపడ్డాడు. -
ఆ రోజు ఎప్పటిలాగే వాకింగ్‌కు వెళ్లొచ్చాడు, కానీ సడన్‌గా..
జంధ్యాల గుర్తించిన హాస్య గుళిక వేలు... శ్రీవారికి ప్రేమలేఖలో ప్రేమగీతానికి కథానాయకుడిలా నటించారు.. నాలుగు స్తంభాలాటలో వీరభద్రరావుతో కలిసి సుత్తి జంటలో భాగమయ్యారు.. కలికాలం చిత్రంలో కంటనీరు పెట్టించారు. ఒక కంట హాస్యం, ఒక కంట కరుణ కురిపించారు. కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు సుత్తి వేలుగా మారిపోయారు.. ఆయనలోని ప్రత్యేకత, ఆయనతో పెనవేసుకున్న బంధం గురించి సుత్తి వేలు కుమార్తె సత్యవాణి మాటలలో... భోగిరెడ్డిపల్లిలో శేషసత్యనారాయణ శర్మ, భాస్కరమ్మ దంపతులకు నాన్న మూడో సంతానంగా పుట్టారు. నాన్నకి అక్క, అన్న, చెల్లి ఉన్నారు. తాతగారు స్కూల్ టీచర్. క్రమశిక్షణకు మారు పేరు. నాన్న నాటకాలు వేస్తున్నందుకు కేకలేస్తుంటే, బామ్మ వెనకేసుకొచ్చేదట. తాతగారు దానధర్మాలతో ఆస్తంతా పోగొట్టుకున్నారట. అందువల్ల నాన్న జీవన పోరాటం చేస్తూ, డిగ్రీ పూర్తిచేశారు. లక్ష్మీరాజ్యంతో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. నాన్నగారికి మేం నలుగురం పిల్లలం. భువనేశ్వరి, శ్రీదేవి, అన్నయ్య జగన్నాథ ఫణికుమార్, నేను. రెండో అక్క పుట్టిన తరవాత ‘ముద్ద మందారం’తో సినీ రంగ ప్రవేశం చేశారు. నాలుగు స్తంభాలాట నుంచి బిజీ అయిపోయారు. మేం నిద్ర లేచేసరికి షూటింగ్ స్పాట్లో ఉండేవారు. అందువల్ల మా విషయాలన్నీ అమ్మే చూసుకుంది. వంట చేసేవారు నాన్న షూటింగ్‌కి వెళ్లేటప్పుడు అమ్మ క్యారేజీ ఇచ్చేది. అది కనీసం పది మందికి సరిపోయేది. నాన్న శాకాహారి. పరిమితంగా తినేవారు. నాన్న కోసం పొడులు, రోటి పచ్చళ్లు అమ్మే స్వయంగా చేసేది. పెరుగంటే నాన్నకు చాలా ఇష్టం. పెళ్లయిన కొత్తల్లో విశాఖపట్టణంలో పని చేసేటప్పుడు నాన్నే వంటంతా చేసి పెట్టి వెళ్లిపోయేవారట. అప్పటికి అమ్మకి వంట రాదట. అంతేకాదు మా చిన్నప్పుడు ముద్ద పప్పులో పచ్చడి నంచి మాకు ముద్దలు పెట్టేవారు. నాన్న చేతిలో ఏం మహత్యం ఉందో కానీ, ఆ ముద్ద చాలా కమ్మగా అనిపించేది. మొదటి ముద్ద తాతగారికి పెట్టేవారు. నాన్నే గెలిచేవారు పొద్దున్నే పూజ చేసుకునేవారు. సినిమాలలో ఎంత హాస్యంగా కనిపిస్తారో, ఇంట్లో అంత మౌనంగా ఉండేవారు. మాకు జలుబు చేస్తే, అమ్మకి తిట్లు పడేవి. అమ్మతో చెస్ ఆడేవారు. ఎక్కువసార్లు నాన్నే గెలిచేవారు. మాకు ఇంటర్నేషనల్ క్యారమ్ మీద ఎలా ఆడాలో కిటుకులు చెప్పేవారు. మాకు... కలర్ పెన్సిల్స్, కార్లు, వాకింగ్ డాల్, బార్బీ సెట్, సోఫా సెట్, కాఫీ సెట్ తెచ్చారు. డిస్నీ క్యారెక్టర్సన్నీ తెచ్చారు. ఒకసారి బంగారం ఉంగరాలు తీసుకువచ్చారు. నాన్న బట్టలు అమ్మ సెలక్ట్ చేసేది. అవి వేసుకున్నప్పుడు, అందరూ బాగున్నాయంటే, ‘మా ఆవిడ సెలక్షన్’ అనేవారు. ఇంటి దగ్గర తెల్ల పంచెను లుంగీగా కట్టుకునేవారు. టీ షర్ట్స్, షార్ట్స్ వేసుకునేవారు. నాన్న మిడిల్‌క్లాస్ ఫాదర్‌లా నార్మల్‌గా ఉండేవారు. ఇంట్లో తనకు కావలసిన వస్తువు కనిపించకపోతే మాత్రం, ‘ఆయ్’ అనేవారే కానీ, ఎన్నడూ కొట్టలేదు, తిట్టలేదు. నాన్న ఏది చేసినా మా మంచికే అనుకునేవాళ్లం. నేను ఇంజనిరీంగ్ చదవాలనుకుంటే చదివించారు. తనకు నచ్చినది చదవమని ఎన్నడూ బలవంత పెట్టలేదు. ఏడ్చేశాం... ఉష్.. గప్‌చుప్ చిత్రంలో, ‘నేను షుగర్ తినటం కోసమే ఇటువంటి పెళ్లిచూపులు ఏర్పాటు చేశాను’ అంటున్న డైలాగ్‌కి నా కళ్లు వర్షిస్తాయి. ‘కలికాలం’లో నాన్న పాత్ర తలచుకుంటేనే ఏడుపు ఆగదు. ‘ప్రతిఘటన’ సినిమా ఇప్పటికీ చూడలేకపోతాను. ఆ చిత్రానికి నాన్న నంది అవార్డు అందుకున్నారు. అప్పుడప్పుడు ప్రివ్యూలకు తీసుకువెళ్లేవారు. అక్కడ నుంచి వచ్చాక, ‘సినిమా ఎలా ఉంది’ అని అడిగేవారు. ‘కష్టాలు పడే పాత్రలు చెయ్యొద్దు నాన్నా, కామెడీ సినిమాలే చెయ్యి’ అనేవాళ్లం. నాన్న నటనను బాలు మెచ్చుకునేవారట. ‘ప్రేమ ఎంత మధురం’ సినిమాలో నాన్న నటించిన సైంటిస్ట్ సన్నివేశాలను అన్నయ్య ఇమిటేట్ చేస్తుంటే, నాన్న సరదా పడేవారు. మమ్మల్ని, ‘మీరు వేలు గారి పిల్లలు కదా’ అని ఎవరైనా అడిగితే, నాన్నకి సుత్తి వేలు అనే పేరు ఉండటం వల్లే కదా ఇంత గుర్తింపు వచ్చిందని గర్వంగా అనిపించేది. ఒక సీరియల్లో నటిస్తున్న సమయంలో నాన్నకు తెలియకుండానే ముక్కుపొడుం పీల్చే అలవాటు వచ్చేసింది. నాన్న నేర్పించారు.. అమ్మ తీర్థయాత్రలకి వెళ్లినప్పుడు నాన్నే స్వయంగా వంట నేర్పించారు. నాన్న డైరెక్షన్లో ఉప్మా తయారుచేశాను. నా పెళ్లయ్యి అప్పగింతల సమయంలో కళ్లనీళ్లు పెట్టుకున్న నాన్న, ఆ తరవాత మా ఇంటికి వచ్చినప్పుడు దగ్గరుండి నాతో వంట చేయించారు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఒకసారి నన్ను చూడటానికి చెన్నై వచ్చారు. నాన్నకు వాకింగ్, వ్యాయామం అలవాటు. ఆ రోజు కూడా అలాగే వెళ్లి వచ్చారు. ఏమైందో తెలీదు. మూడు గంటల సమయంలో, నాన్న తల ఒక వైపు వాలిపోయినట్లు గమనించి, ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికి పల్స్ అందట్లేదన్నారు. జోకులు వేస్తూ, మంచి గైడెన్స్ ఇస్తూ, ఎన్నో మంచి విషయాలు చెప్పే నాన్న ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాం. ‘మన దగ్గరకు వచ్చి అడిగినవారికి సహాయం చేయాలి’ అని నాన్న చెప్పిన మాటను అనునిత్యం స్మరించుకుంటాం. ఆ తండ్రి కడుపున పుట్టినందుకు ఎప్పుడూ గర్వపడతాం. - సంభాషణ: వైజయంతి పురాణపండ చదవండి: ఈ ఫొటోలో హన్సిక డ్రెస్, కమ్మల ధర ఎంతో తెలుసా? -
ప్రముఖ విలన్ భార్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ విలన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు టార్జన్ అలియాస్ లక్ష్మీనారాయణ గుప్తా సతీమణి ఉమారాణి(52) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. ఆమె మరణం పట్ల సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు. కాగా టార్జన్ లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య ఉమారాణికి సంతానం లేకపోవడంతో అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. చదవండి: యాంకర్‌గా ఎంట్రీ.. హీరోయిన్గా సెటిల్.. ఆ తారలు ఎవరంటే.. -
ఎంతోమంది ఆప్తుల్ని ఇచ్చారు...
మా నాన్నగారండీ.. ఆయనకి ఇద్దరు భార్యలండీ.. నేను మొదటి భార్య కొడుకునండీ ... అంటూ శంకరాభరణంలో అల్లురామలింగయ్య దగ్గరకు న్యాయం కోసం వచ్చారు.. శ్రీవారికి ప్రేమలేఖలో మరచెంబు పాత్రలో చతుర్ముఖ పారాయణం ఆడారు... చిన్న చిన్న పాత్రలే వేసినా, తెలుగువారి హృదయాల మీద హాస్య పన్నీరు జల్లారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అంటున్నారు వాడ్రేవు విశ్వనాథమ్ ఉరఫ్ థమ్ కుమార్తె శ్రీకాంతి. నాన్న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పుట్టారు. తాతగారు వాడ్రేవు చలమయ్య, బామ్మ లక్ష్మీకాంతమ్మ. వారికి నాన్న ఎనిమిదో సంతానం. ఇద్దరు అక్కలు, ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్లు. ‘తాతగారి పేరు, మార్కెట్‌కి ఎదురుగా ఉన్న వాడ్రేవు బిల్డింగ్, పిఠాపురం’ అని అడ్రస్ రాస్తే చాలు పోస్టు వెళ్లిపోతుంది. తాతగారు డ్రాయింగ్ మాస్టారుగా పనిచేసేవారు. మా పెద్దనాన్నగారే ఇంటి పెద్దగా అందరి బాగోగులు చూసుకున్నారు. నాన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశారు. ఆదిరాజు ఆనంద్‌మోహన్ మా అమ్మకి బాబాయ్. ఆయన ‘పెళ్లి కాని పెళ్లి’ అనే సినిమా తీశారు. అందులో నాన్న చిన్న వేషం వేశారు. అలా మా బాబాయ్ ద్వారా అమ్మకి నాన్నతో పెళ్లి సంబంధం కుదిరి, వివాహం జరిగింది. నాన్నగారికి ఆడవాళ్లంటే చాలా గౌరవం. అమ్మని ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. నేను పుట్టినప్పుడు ‘మా అమ్మే మళ్లీ పుట్టింది’ అని ఎంతో సంతోషంగా అందరికీ స్వీట్స్ పంచారుట. మా అన్నయ్య కొంచెం అమాయకంగా ఉంటాడని వాడిని ఎప్పుడూ కోప్పడేవారు కాదు. నాటకాలలో పరిచయం... నాన్నకి నాటకాలంటే ప్రాణం. నాటకాల ద్వారానే సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గార్లతో పరిచయం ఏర్పడింది. సాక్షి రంగారావు గారిని నాన్న ‘మా రంగడు’ అనేవారు. పొట్టిప్రసాద్ గారు తనకు గురువుతో సమానమని చెప్పేవారు. సాక్షి రంగారావు గారిని పెద్దనాన్న అని, పొట్టి ప్రసాద్ గారిని మావయ్య అని పిలిచేవాళ్లం. రాళ్లపల్లి గారు మాకు దేవుడు ఇచ్చిన మావయ్యే. అన్న, అక్క అంటే మాకు వాళ్ల పిల్లలే. రాళ్లపల్లి మావయ్య వాళ్ల అమ్మాయి బయటికి వెళితే నన్ను తనతో తీసుకుని వెళ్లేది. సీతారామశాస్త్రి గారు, దివాకర్‌బాబు గారు.. అందరం చెన్నైలోని సాలిగ్రామంలోనే దగ్గరదగ్గరగా ఉండేవాళ్లం. ఇప్పటికీ అందరితో టచ్‌లో ఉన్నాం. మా నాన్న మాకు ఇచ్చి వెళ్లిన బెస్ట్ గిఫ్ట్ ఈ కుటుంబాలే. చదివితే చాకొలేట్లు... నాన్న షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా మా చదువు విషయంలో ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు. సెలవుల్లో కూడా చదువుకోవాలనేవారు. ఆయన సూట్‌కేస్‌లో థ్రెప్టిన్ బిస్కెట్ల డబ్బా, క్యాడ్బరీ చాకొలేట్ బాక్స్ ఉండేవి. రోజూ నాన్న బయటకు నుంచి ఇంటికి రాగానే మేం ఆయన వెనకాల నిలబడేవాళ్లం. మేము చదువుకున్నామని చెప్పాక ఇద్దరికీ రెండు బిస్కెట్లు, రెండు చాకొలేట్లు ఇచ్చేవారు. చదవకపోతే నో ట్రీట్. రెండో క్లాసు చదువుతున్నప్పుడు... ఒకరోజున ఇంటి దగ్గర టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. అందులో చిన్న సీన్లో నేను, అన్నయ్య ఇద్దరం నటించాం. టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు అన్నయ్య సీన్ వచ్చింది, నా సీన్ ఎడిట్ అయిపోయింది. నేను ఏడ్చాను. అప్పుడు నాన్న, ‘ఆడపిల్ల ఏడవకూడదు. నేను రాకపోతేనేం... అన్నయ్య టీవీలో కనిపించాడు కదా... అని నువ్వు సంతోషంగా ఉండాలి తల్లీ’ అని బుజ్జగించారు. చాలా సైలెంట్‌గా ఉండేవారు... సినిమాలలో హాస్య పాత్రలు వేసేవారు కానీ, ఇంటి దగ్గర చాలా సైలెంట్. ఎక్కువ మాట్లాడేవారు కాదు. నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండేవాళ్లం. ఆయన బయటకు వెళ్లగానే కిటికీలోంచి తొంగి చూసేవాళ్లం. నాన్న గేట్ దాటాక, మేం గేటు దాకా వచ్చి, బస్‌స్టాప్‌లో ఉన్నారా, వెళ్లిపోయారా అని చూసి, ఆయన వెళ్లిపోయారని నిర్ధారించుకుని వెంటనే ఆడుకోవటానికి పారిపోయేవాళ్లం. ఒకసారి టీనగర్లో మా తాతగారి ఇంటికి వెళ్లాం. అక్కడ ఉండిపోతానని పేచీ పెట్టటంతో నన్ను అక్కడ ఉంచి వెళ్లిపోయారు నాన్న. అమ్మ సాయంత్రం వరకు ఉండి, ఆ తరవాత ఇంటికి వెళ్లిపోయింది. అమ్మ వెళ్లిన కాసేపటికే బెంగ వచ్చి ఏడుపు మొదలుపెట్టాను. అప్పటికి నాన్న ఏదో పని మీద ఇంకా టీ నగర్లోనే ఉన్నారు. తాతగారు నాన్నకి ఫోన్ చేసి, విషయం చెప్పటంతో, నాన్న వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. నాన్న దగ్గర అంత చేరిక నాకు. నేను పదో తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినప్పుడు వాచ్ ఇచ్చారు. నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమో ఇన్ యాక్టింగ్ చేశారని నేను కూడా నా ఎంబిఏ అక్కడ నుంచే చేశాను. ఏయన్నార్‌కి కోపం వచ్చింది... మా చిన్నప్పటి కంటె, మేం కొంచెం పెద్దవాళ్లం అయ్యాకే నాన్నతో గడిపే అవకాశం వచ్చింది. అప్పటికి సినిమా షూటింగ్స్ తగ్గి, సీరియల్స్‌లో మాత్రం వేస్తుండేవారు. ఎక్కువసేపు ఇంట్లో ఉండటం వల్ల, మాతో క్యారమ్బోర్డు అడేవారు. అప్పుడప్పుడు ఏవైనా సినిమా కబుర్లు చెప్పేవారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారితో... రాళ్లపల్లి ఏ క్లాస్ ఆర్టిస్ట్, నేను బి క్లాస్ ఆర్టిస్ట్, మీరు సి క్లాస్ ఆర్టిస్ట్ అన్నారట. అక్కినేని గారికి కొంచెం కోపం వచ్చిందట. అప్పుడు నాన్న.. అపార్థం చేసుకోకండి. రాళ్లపల్లిగారు ఆటోలో తిరుగుతున్నారు కాబట్టి ఆయన ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, నేను బస్సుల్లో తిరుగుతున్నాను కాబట్టి బి గ్రేడ్ ఆర్టిస్ట్, మీరు కారులో తిరుగుతున్నారు కాబట్టి సి గ్రేడ్ ఆర్టిస్ట్ అన్నారట. ఏయన్నార్‌గారు ఫక్కుమని నవ్వారుట. ఎన్టీఆర్ సహాయం చేశారు... ఎన్టీఆర్‌లో ఉన్న ఒక గొప్ప గుణం గురించి చెప్పారు నాన్న. ఆయనకి చిన్న చిన్న కళాకారులు కూడా గుర్తు ఉంటారట. ఏదైనా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటే, దానికి ఏ ఆర్టిస్టు కరెక్ట్ అని ఆలోచించి, ఆ ఆర్టిస్టు ఎక్కడున్నా కబురు పంపేవారట. వారు కష్టాల్లో ఉంటే కూడా ఎన్టీఆర్ గుర్తుపెట్టుకుంటారనటానికి పొట్టి ప్రసాద్‌గారికి చేసిన సహాయమే పెద్ద నిదర్శనం. పొట్టిప్రసాద్ మావయ్యకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, హీరో బాలకృష్ణ గారితో ఒక బుట్ట నిండా పళ్లు పంపారు రామారావు గారు. బాలకృష్ణ గారిని దగ్గరుండి ఆసుపత్రికికి నేనే తీసుకువెళ్లాను. అప్పుడు నాలుగో క్లాసు చదువుతున్నాను. బాలకృష్ణ గారు ఎంతో ఆప్యాయంగా పలకరించి వెళ్లారు. ఎన్టీఆర్ గురించి నాన్న చెప్పిన మాటలు అప్పుడు నాకు బాగా గుర్తు వచ్చాయి. ఇద్దరికీ ఒకటే పేరు పెట్టారు నాన్న పూర్తి పేరు వాడ్రేవు కాశీవిశ్వనాథం. తన పేరులోని ఆఖరి అక్షరాలు తీసుకుని థమ్ అని పేరు పెట్టుకున్నారు. పేరు కూడా కామెడీగా ఉండాలని ఆయన ఆలోచన. తమిళంలో అలనాటి హాస్య నటుడు నగేశ్ అంటే ఇష్టం. అందుకే ఆయనలాగే సన్నగా ఉండేవారేమో అనుకుంటాం. అమ్మ పేరు లలిత. బి.ఎస్.సి. బిఈడీ చదివి, సైన్స్ టీచర్‌గా పనిచేసి, పెళ్లయ్యాక మానేసింది. ఇంటి బాధ్యతలు పూర్తిగా అమ్మే చూసుకుంది. వాళ్లకి మేం ఇద్దరం పిల్లలం. అమ్మమ్మ పేరు, బామ్మ పేరు ఇద్దరి పేరు ఒకటే.. లక్ష్మీ కాంతమ్మ. అందుకని నాకు శ్రీకాంతి అని, అన్నయ్యకు శ్రీకాంత్ అని పేర్లు పెట్టారు. ఇద్దరికీ ఒక్క చిన్న అక్షరం తేడా అంతే. కళ్లనీళ్లు పెట్టుకున్నారు.. నాన్నగారు ఏడవటం నా జీవితంలో నేను చూడటం అదే మొదటిసారి. పొట్టిప్రసాద్ మావయ్య ఆరోగ్యం బాగా దెబ్బ తినటంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను చూసి వచ్చిన నాన్నకు ఏడుపు ఆగలేదు. ఆ రోజు నాన్న మంచినీళ్లు కూడా తాగకుండా కూర్చుండిపోయారు. నేనే నాన్నని బుజ్జగించి, అన్నం తినిపించాను. ఆ మావయ్య కన్ను మూసిన రోజున నాన్నను ఓదార్చటం కష్టమైపోయింది. ఆయన మరణం తరవాత చాలా మార్పులు జరిగాయి. ఆప్తులందరూ హైదరాబాద్ తరలి వచ్చేశారు. నాన్న హైదరాబాద్ మారాలా వద్దా అని తర్జనభర్జన పడి, చివరకు మారటానికే నిశ్చయించుకుని, ఏవో వ్యక్తిగత పనుల మీద పిఠాపురం వెళ్లారు. అక్కడ ఉండగానే నాన్నకు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి కాలం చేశారు. మాకు దిక్కుతోచని పరిస్థితి. అప్పటికింకా నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మమ్మల్ని చెన్నై నుంచి సాక్షి శివ (సాక్షి రంగారావు కుమారుడు) అన్నయ్యే పిఠాపురం తీసుకువెళ్లాడు. ఆ తరవాత మేం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాం. సాక్షి రంగారావు పెద్దనాన్న సినీ ప్రముఖుల నుంచి కొంత డబ్బు సేకరించి అమ్మకు ఇచ్చారు. కె.విశ్వనాథ్ గారు పది వేలు ఇచ్చారు. సీతారామశాస్త్రి అంకుల్ ‘అమ్మాయిని నాకు ఇచ్చేయండి, పెంచుకుంటాను’ అన్నారు. ఆ రోజు నేను వెక్కివెక్కి ఏడుస్తుంటే, సీతారామశాస్త్రి అంకుల్ నన్ను ఓదారుస్తూ, ‘అమ్మాయీ! నాకూ మా నాన్నగారు లేరు, నేను ఆయనను ఎన్నటికీ చూడలేను. కాని నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ నాన్నను టీవీలో ఏదో ఒక సినిమాలో చూడగలవు కదా’ అన్నారు. ఆస్తులు పాస్తుల కన్నా అనుబంధాలు గొప్పవని నాకు అర్థమైంది. నాన్న చాలా మంది ఆప్తుల్ని మాకు ఇచ్చినందుకు మనసులోనే ఆయనకు నమస్కరిస్తాను. సంభాషణ: వైజయంతి పురాణపండ -
హీరోయిన్ దక్ష నగార్కర్ క్యూట్ ఫోటోలు
-
తన అనారోగ్యంపై కృష్ణంరాజు క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తాను కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడ్డానని, ఇప్పుడు పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని రెబల్‌స్టార్ కృష్ణంరాజు తెలిపారు. బుధవారం పెళ్లిరోజు సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి బంజారాహిల్స్‌లోని శ్రీవిజయగణపతి స్వామి దేవాలయంలో శతచండీ మహాయాగంలో పాల్గొన్నారు. మహాలక్ష్మిదేవికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కృష్ణంరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ జలుబు, దగ్గు, జ్వరం సాధారణంగా అందరికీ వస్తుంటాయని, అందులో భాగంగా తనకు కూడా ఫీవర్ వచ్చిందని, దీనిపై మీడియా తప్పుడు వార్తలు రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు రాసే ముందు ఓసారి తనను సంప్రదించి ఉంటే బాగుండేదన్నారు. గత నాలుగు రోజుల నుంచి చాలా మంది అభిమానులు ఫోన్ చేసి తన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని చెప్పారు. తాను బావున్నానని అందరికీ చెప్పానన్నారు. తనను ఆశీర్వదించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని కృష్ణంరాజు అన్నారు. -
‘వైజాగ్’ ప్రసాద్ ఇకలేరు
ప్రముఖ నటుడు ‘వైజాగ్’ ప్రసాద్(75) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. తెల్లవారుజామున బాత్రూంకు వెళ్లిన ఆయన అక్కడే పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రసాద్ స్వస్థలం విశాఖపట్నంలోని గోపాలపురం. ఆయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. కళా రంగంలో ‘వైజాగ్’ ప్రసాద్‌గా స్థిరపడ్డారు. 1963లో నాటక రంగంలోకి ప్రవేశించిన ఆయన ‘అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాల ధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక, వేట కుక్కలు, కాలకూటం, ఋత్విక్, గరీబీ హఠావో’ లాంటి నాటికలతో ప్రేక్షకులను అలరించారు. సుమారు 700 నాటికల్లో నటించిన ఆయన 1983లో ‘బాబాయ్ అబ్బాయ్’ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. ‘నువ్వు నేను, భద్ర, జై చిరంజీవా, గౌరి, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లా, శివరామ రాజు’ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ప్రసాద్‌కి కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్ ఉన్నారు. విషయం తెలుసుకున్న వారు అమెరికా నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కి బయలుదేరారు. ‘వైజాగ్’ ప్రసాద్ మృతికి ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ డా. నరేష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళ్లి హీరో అయ్యాడు!
70 ఎంఎం సెల్యులాయిడ్‌పై మనల్ని మనం చూసుకుంటే ఎంత బావుంటుందోనని కలలు కనే యూత్ మన చుట్టూ లక్షల మంది ఉన్నారు. దానిని నిజం చేసుకోవడానికి కష్టపడుతున్న వారు కూడా వేలల్లో ఉన్నారు. సినీ వారసులు రాజ్యమేలుతున్న సమయంలో అవకాశాల కోసం ఏళ్లతరబడి ఫిల్మ్ నగర్ చుట్టూ తిరుతున్నారు. కానీ ఈ కుర్రాడు కాస్త డిఫరెంట్. షార్ట్ ఫిల్మ్‌లతో టాలెంట్ చూపించి అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరి, ఆడిషన్స్‌లో చాన్స్‌ల కోసం వచ్చిన వారికి ఇలా నటించాలి...అలా నటించాలి... అని చూపిస్తూ దర్శకుడి కంట్లో పడ్డాడు. హీరోగా మారాడు. సినిమా పేరు ‘ఉయ్యాల జంపాల’. హీరోకు కావలసిన లక్షణాలు ఏమీ లేని బక్క పలచని కుర్రాడు ఎనర్జీతో ‘సినిమా చూపిస్త మామా’ అని ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. అతనే వైజాగ్ కుర్రాడు రాజ్ తరుణ్. ఆ చిత్రం సక్సెస్ మీట్ సందర్భంగా వైజాగ్ వచ్చిన సందర్భంగా సాక్షితో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే... - పెదగంట్యాడ అనుకోకుండా చాన్స్... ఉయ్యాల జంపాల సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చెయ్యడానికి వెళ్లాను. రెండు వందల మందిని ఆడిషన్స్‌లో చూసినా ఎవరికీ నచ్చలేదు. ఆఖరికి డైరక్టర్ సీన్ పేపర్ నాకిచ్చి చెయ్యమని అడిగారు. నేను అలవాటు ఉండడం వల్ల సింపుల్‌గా చేసి చూపించా. వాళ్లకది నచ్చింది..నాకు చాన్సొచ్చింది. నేను వైజాగ్ లోకల్... నేను పుట్టింది పెరిగింది అంతా వైజాగ్‌లోనే, మా అమ్మ నాన్న ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నారు. మేం సింహాచలం దగ్గర ప్రహ్లాదపురంలో ఉంటాం. మా నాన్న బ్యాంక్ ఎంప్లాయి, అమ్మ హౌస్ వైఫ్. సినిమా అంటే పిచ్చి... నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం. సొంతంగా సినిమా తియ్యాలని చిన్న చిన్న స్ట్క్రిప్ట్లు రాసుకుంటూ ఉండేవాడిని. 8వ తరగతితో ఉన్నప్పుడు మా యింట్లో ఉన్న చిన్న హ్యాండీ క్యామ్‌తో నేనే నటించి వీడియో చేశాను. ఎడిటింగ్ మ్యూజిక్ అన్నీ చేసి మా అన్నకు, నాన్నకు చూపించాను. వాళ్లకది బాగా నచ్చింది. డీవీడీ పెట్టుకునే చిన్న హ్యాండీ క్యామ్ కొనిచ్చారు. తర్వాత రెండు మూడు షార్ట్ ఫిల్మ్‌లు తీశాను. కాలేజ్‌లో సుభాష్(ఎమ్ఆర్ ప్రొడక్షన్ పేరుతో స్టూడెంట్స్‌తో షార్ట్ ఫిల్మ్‌లు చేశాడు) పరిచయం అయ్యాడు. తర్వాత వంద షార్ట్ ఫిల్మ్‌ల వరకూ చేశాం. అంత ఈజీకాదు... చిన్న క్యామ్, ఖాళీ రూమ్, ఫ్రెండ్స్ ఉంటే షార్ట్ ఫిల్మ్ అయిపోతుంది. కానీ స్క్రిప్ట్ నుండి ప్రొడక్షన్ వరకూ వందల మందిని మేనేజ్ చేసి సినిమా తియ్యాలంటే అంత ఈజీ కాదు. షార్ట్ ఫిల్మ్‌లకు ఒక్క లాజిక్ ఉంటే కంప్లీట్ అవుతుంది. పెద్ద సినిమా సీన్ బై సీన్ లాజిక్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా రెండున్నర గంటలు ప్రేక్షకుడిని భ్రమలో ఉంచాలి. లేదంటే ఎంత కష్టపడి సినిమా తీసినా చెత్త సినిమా అని ఒక్క మాటలో కొట్టి పారేస్తారు. ఊహించలేదు... ‘సినిమా చూపిస్త మావ’ సక్సెస్ మీట్ కోసం గాజువాక వచ్చాను. అప్పుడు అంత మంది జనం ఉంటారని ఊహించలేదు. కనీసం నేను నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. ఒకడు చెయ్యి, ఇంకొకరు కాలు, మరొకరు జుట్టు పట్టుకుని లాగుతుంటే ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా దీని కోసమే కదా ఇంత కష్టపడింది అని ఆనందంగా ఫీలయ్యా. ఒక విజయం సాధించగానే గర్వం తలకెక్కకూడదు. అది అదృష్టం మాత్రమే. నేను చేసింది చాలా తక్కువ అని బలంగా నమ్ముతాను. అందుకే అందరినీ గౌరవించి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. టిక్కెట్ల కోసం గొడవ చేసే వాడిని ‘ఒక్కడు’ సినిమా చూశాకే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. గోపాలపట్నం సుకన్య థియేటర్లో ఎక్కువ సినిమాలు చూసేవాడిని. ఎప్పుడూ టికెట్ల కోసం హాల్లో ఒక వ్యక్తితో వాదన చేస్తూ ఉండేవాడిని. అతను ఇక్కడి నుంచి పొమ్మని అరిచేవాడు. ఇప్పుడు సక్సెస్ టూర్లో ఆ థియేటర్‌కు వెళ్లి ఎప్పుడూ పొమ్మనేవారు, ఇప్పుడేంటి కొత్తగా రండి, రండీ అని గౌరవిస్తున్నారు.. అని చమత్కారంగా అడిగాను ఆరోజులు మళ్లీ వస్తాయా చెప్పండి... తర్వాతి సినిమా... డైరక్టర్ సుకుమార్ ప్రొడక్షన్లో 21ఎఫ్ అనే షూట్ జరుగుతోంది. కెమెరామెన్ రత్నవేలు, మ్యూజిక్ డెరైక్టర్ దేవీశ్రీ ప్రసాద్, సుకుమార్ గారు వీళ్లంతా నా ఫేవరెట్ టీమ్. ఎప్పటికైనా వీళ్లతో పని చెయ్యాలని కలలు కనేవాడిని. ఇంత తొందరగా ఈ అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. -
అన్ని యాసలూ ఆమెకు సునాయాసమే!
కళ అనేది ప్రాంతాలకు, భాషలకు అతీతమైంది. అందుకు శకుంతలే ఓ నిదర్శనం. శకుంతల పుట్టింది మహారాష్ట్రలో. కానీ.. ఎదిగింది, ఒదిగింది, ఒరిగింది తెలుగు నేలపైనే. అందుకే... తెలుగు కళారంగానికి దొరికిన ఓ మణిహారంగా ఆమెను అభివర్ణించడం తప్పేం కాదు. తెలుగు రంగస్థలంపై నటనకు ఓనమాలు దిద్దుకున్న శకుంతల... తర్వాత కాలంలో తెలుగు తెరపై మూడున్నర దశాబ్దాల నట ప్రస్థానాన్ని సాగించారు. తెలంగాణ సాయుధ పోరాటంపై బి.నరసింగరావు నిర్మించిన ‘మాభూమి(1979)’ చిత్రంతో తొలిసారి తెలుగుతెరపై మెరిశారు శకుంతల. తర్వాత తెలంగాణ నేపథ్యంలోనే రూపొందిన రంగులకల(1983), కొమరంభీమ్(1984) చిత్రాల్లో నటించి ‘తెలంగాణ’ను ఇంటిపేరుగా మార్చుకున్నారు. కానీ.. ఒక్క తెలంగాణ యాస మాత్రమే కాదు, తెలుగు భాషలోని యాసలన్నింటినీ అలవోకగా పలికించగలిగిన దిట్ట శకుంతల. ‘ఒక్కడు’ (2003)లో రాయలసీమ యాసలో మాట్లాడిన ఆమే... కొన్ని చిత్రాల్లో శ్రీకాకుళం యాసతో కూడా భళా అనిపించారు. గోదావరి యాసలోని కమ్మదనాన్ని కూడా తన గళంతో వినిపించారు. అన్ని యాసలూ ఆమెకు సునాయాసమే. శకుంతల ఆహార్యాన్నీ, వాచకాభినయాన్నీ గమనించిన ఎవరూ ఆమె మహారాష్ట్ర మహిళ అంటే నమ్మరు. కెరీర్ తొలినాళ్లలో శకుంతల చేసినవన్నీ చిన్నా చితకా పాత్రలే. వాటిల్లో జంధ్యాల ‘అహనా పెళ్లంట’(1987) ఒకటి. అందులో కూడా శకుంతల పాత్ర నిడివి రెండు నిమిషాలకు మించి ఉండదు. కానీ... ఇప్పటికీ ఆ పాత్ర జనాలకు గుర్తుండి పోయిందంటే... ఆమె నట సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆవేశపూరితమైన పాత్రలతోనే కాదు, హాస్యంతో కూడా మెప్పించగలనని ఆ సినిమాతో నిరూపించారామె. వెండితెరపై శకుంతలకు తొలి బ్రేక్ కృష్ణవంశీ ‘గులాబి’(1995). ఇక తేజ ‘నువ్వు-నేను’(2001) చిత్రమైతే ఆమెను ఏకంగా స్టార్‌ని చేసేసింది. ఆ సినిమాలో శకుంతల అనితరసాధ్యమైన విలనిజం ప్రదర్శించారు. ఒక్కడు, వీడే, గంగోత్రి, ఎవడిగోల వాడిది, లక్ష్మి, దేశముదురు, బెండు అప్పారావు ఆర్.ఎం.పి... తదితర హిట్ చిత్రాల్లో నటించి తెలుగుతెరపై తనదైన సంతకాన్ని లిఖించారు శకుంతల. ‘మచ్చకాళై’ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారామె. దాదాపు 80 చిత్రాల్లో నటించిన శకుంతల చివరి సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెద’(2014). ఈవీవీ ‘ఎవడిగోల వాడిదే’ చిత్రీకరణ సమయంలోనే శకుంతలకు తొలిసారి గుండెపోటు వచ్చింది. ‘ఒక వేళ నేను చనిపోతే... మేకప్‌లో చనిపోయిన అదృష్టం కలిగేది’ అని పలు సందర్భాల్లో చెప్పుకున్నారామె. నటనపై శకుంతలకున్న మమకారానికి ఇదొక గొప్ప నిదర్శనం. హాస్య, భయానక, బీభత్స, రౌద్ర, విషాద రసాల్లోని దేన్నయినా అవలీలగా పలికించగల మంచి నటి శకుంతల దూరమవ్వడం తెలుగుతెరకు నిజంగా తీరని లోటు.